ఢిల్లీలో లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు శుక్రవారం ఓటింగ్‌లో వీగిపోయింది. మొత్తం 528 మంది సభ్యులు పాల్గొన్న ఈ ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు నమోదయ్యాయి. అయితే అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ సాధించలేకపోవడంతో బిల్లు ఆమోదం పొందలేదు.
నేపథ్యం.. పరిణామాలు ఏమిటంటే?
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లు ప్రకారం 2029 నుంచి మహిళలకు లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రతిపాదించారు. అయితే ఈ బిల్లును డీలిమిటేషన్ ప్రక్రియతో అనుసంధానం చేయడం వివాదాస్పదంగా మారింది.
లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో ఎన్డీఏ కూటమి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ సాధించలేకపోయింది. దీంతో స్పీకర్ ఓం బిర్లా బిల్లు వీగిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ పరిణామం దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారి తీసింది.
ప్రతిపక్షాల వ్యతిరేఖత!
మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా కాలంగా చర్చలో ఉన్న కీలక సంస్కరణగా భావించబడుతోంది. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచడం, సమాన అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఈ బిల్లు తీసుకొచ్చారు. అయితే దీనిని డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం వల్ల ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
ఈ బిల్లు వీగిపోవడం వల్ల మహిళా ప్రాతినిధ్యం పెంపుపై మరోసారి అనిశ్చితి నెలకొంది. ఇది కేవలం ఒక చట్టం కాకుండా, దేశ రాజకీయ వ్యవస్థలో సమానత్వానికి సంబంధించిన అంశంగా పరిగణించబడుతోంది.
లోక్‌సభలో ఓటింగ్ వివరాలు
శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో మొత్తం 528 మంది సభ్యులు పాల్గొన్నారు. ఇందులో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. అయితే రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన రెండు మూడొంతుల మెజారిటీ (2/3rd majority) సాధించలేకపోవడంతో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది.
ఇతర బిల్లుల ఉపసంహరణ
ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక ప్రకటన చేశారు. డీలిమిటేషన్ బిల్లు-2026 మరియు కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2026లను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
నేతల ప్రతిస్పందనలు ఇలా
రాహుల్ గాంధీ వ్యాఖ్యలు: ఈ బిల్లును రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమకు వ్యతిరేకత లేదని, కానీ దాన్ని డీలిమిటేషన్‌తో అనుసంధానం చేయడాన్ని వ్యతిరేకించామని స్పష్టం చేశారు. 2023లో వచ్చిన మహిళా బిల్లును అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు.
- ప్రియాంకా గాంధీ స్పందన: ప్రస్తుత విధానంలో బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించామని పేర్కొన్నారు.
- తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యలు: “దిల్లీని ఓడించాం” అంటూ ఈ ఫలితాన్ని తమ విజయంగా అభివర్ణించారు.
- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు: దేశ చరిత్రలో ఈ రోజు సువర్ణదినంగా నిలుస్తుందని అన్నారు. దేశ రాజకీయ నిర్మాణాన్ని మార్చే కుట్రను అడ్డుకున్నామని పేర్కొన్నారు.
దేశ రాజకీయాల్లో కీలక మలుపు!
మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. ఈ బిల్లు భవిష్యత్తులో మళ్లీ కొత్త రూపంలో వస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. కేంద్రం మరియు ప్రతిపక్షాల మధ్య ఈ అంశంపై ఇంకా చర్చలు కొనసాగే అవకాశం ఉంది. మహిళల రాజకీయ ప్రాతినిధ్యం పెంపు అంశం ఇంకా పరిష్కారం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది.
Also read:Lok Sabha Delimitation Controversy: డీలిమిటేషన్ వివాదం.. దక్షిణాది రాష్ట్రాల ఆందోళన!

గిరిబాబు – నేను MarthaTelugu వెబ్సైట్లో డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. నాకు రైటర్‌గా మూడేళ్ల అనుభవం ఉంది. నాకు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు రాయడంలో ప్రావీణ్యం ఉంది. వార్తలు మాత్రమే కాకుండా పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుణ్ణి.
