పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్.. సర్‌ప్రైజ్ అప్‌డేట్ రెడీ!

ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమా ప్రస్తుతం.. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సివస్తోంది వీరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన Gabbar Singh భారీ విజయం సాధించింది కూడా. మళ్లీ అదే కాంబినేషన్ రిపీట్ కావదంతి.. అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లోనే దాదాపు చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ […]

ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమా ప్రస్తుతం.. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సివస్తోంది వీరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన Gabbar Singh భారీ విజయం సాధించింది కూడా. మళ్లీ అదే కాంబినేషన్ రిపీట్ కావదంతి.. అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.

హైదరాబాద్‌లోనే దాదాపు చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా పవన్ కళ్యాణ్ డబ్బింగ్ పనులు ప్రారంభించడం, సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత పెంచింది. దీనికి సంబంధించిన ఒక ఫోటోను కూడా యూనిట్ విడుదల చేసింది. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ డబ్బింగ్ స్టూడియోలో కనిపించడం అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

బాక్సాఫీస్ పోటీపై ఆసక్తి!

2026 మార్చి 19న రిలీజ్ కానున్న Ustaad Bhagat Singhకు బాక్సాఫీస్ వద్ద పెద్ద సవాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అదే రోజు బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన Dhurandhar: The Revenge కూడా రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలు ఒకే రోజున థియేటర్లలోకి రావడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రియులలో ఆసక్తి పెరిగింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్‌కు ఉన్న భారీ ఫ్యాన్ బేస్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా భావిస్తున్నారు. అయితే బాలీవుడ్ మార్కెట్‌లో కూడా ఈ పోటీ ఎలా ప్రభావం చూపుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.

డబ్బింగ్ షురూ!

చిత్ర యూనిట్ విడుదల చేసిన లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో డబ్బింగ్ పనులు ప్రారంభించారు. సినిమా విడుదలకు ముందు జరిగే కీలక దశల్లో.. డబ్బింగ్ ఒకటి కావడంతో, ఈ ప్రక్రియ ప్రారంభం కావడం అనేది.. సినిమా పూర్తికి దగ్గరలో ఉందనే సంకేతంగా భావిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ న్యూస్ వైరల్‌ అవుతోంది. ముఖ్యంగా Ustaad Bhagat Singh గురించి కొత్త అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ఈ ఫోటోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

సర్‌ప్రైజ్ అప్‌డేట్ రానుందా?

ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర బృందం మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా వెల్లడించింది. అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఒక సర్‌ప్రైజ్ అప్‌డేట్ ఈరోజే వచ్చే అవకాశముందని పేర్కొంది. అయితే అది టీజర్ లేదా ట్రైలర్ అనేది ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ సమాచారం బయటకు రావడంతో సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.

నటీనటులు & టెక్నికల్ టీమ్

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో.. సరసన శ్రీలీల & రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ కాంబినేషన్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సంగీతం విషయంలో సంగీత దర్శకులు దేవి శ్రీ ప్రసాద్ & ఎస్. థమన్ కలిసి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయింది. రిలీజ్ చేయడమే ఇప్పుడు ఆలస్యం.

సినిమా రిలీజ్‌పై అంచనాలు

పవన్ కళ్యాణ్ నటిస్తున్న Ustaad Bhagat Singh సినిమా విడుదలపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు డబ్బింగ్ పనులు ప్రారంభమవడంతో పాటు సర్‌ప్రైజ్ అప్‌డేట్ రావచ్చన్న సమాచారం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది. టీజర్ లేదా ట్రైలర్ విడుదల అయితే సినిమా ప్రమోషన్లు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. మార్చి 19న రిలీజ్ అయ్యే ఈ సినిమా ఎలాంటి స్పందన పొందుతుందో చూడాలి.

Also Read: టాలీవుడ్‌లో సంచలనం.. వెంకటేష్‌తో కీర్తి సురేష్ జోడీ?

Uma Siri
Uma Sirihttps://marthatelugu.com/
ఉమశ్రీ - నేను MarthaTelugu వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు ఆటోమొబైల్, లైఫ్ స్టైల్ విభాగాల్లో అత్యంత ప్రావీణ్యం కలిగి ఉంది. ఈ విభాగాల్లో యూజర్లకు అవసరమైన అన్ని వార్తలను సమగ్రంగా అందిస్తాను. నాకు జర్నలిజం రంగంలో 8 సంవత్సరాల అనుభవం ఉంది.

Related Articles

Latest Articles