34.4 C
Hyderabad
Friday, March 14, 2025
Home Blog Page 2

సరికొత్త టయోటా హైలెక్స్ బ్లాక్ ఎడిషన్ ఇదే: దీని గురించి తెలుసా?

0

Toyota Hilux Black Edition Launched in India: ఇండియన్ మార్కెట్లో టయోటా కంపెనీ యొక్క ‘హైలెక్స్ పికప్ ట్రక్’కు (Toyota Hilux Pickup Truck) మంచి డిమాండ్ ఉంది. ఇది రోజువారీ వినియోగానికి లేదా సాధారణ ప్రయాణానికి మాత్రమే కాకుండా, వాణిజ్య పరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇది సాధారణ రోడ్ల మీద ప్రయాణిస్తుంది. కఠినమైన భూభాగాల్లో కూడా ముందుకు సాగుతుంది. అంటే ‘ఆఫ్-రోడర్’గా కూడా ఉపయోగపడుతుంది. ఈ కారణంగానే చాలామంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ.. ఇప్పుడు కొత్త బ్లాక్ ఎడిషన్ లాంచ్ చేసింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ధర, బుకింగ్స్ & డెలివరీలు

కొత్త టయోటా హైలెక్స్ బ్లాక్ ఎడిషన్ ధర రూ. 37.90 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది డీజిల్ ఏటీ 4×4 రూపంలో.. ఒకే వేరియంట్లో లభిస్తుంది. కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతాయి.

డిజైన్

టయోటా హైలెక్స్ బ్లాక్ ఎడిషన్ మోడల్.. 2025 జనవరి ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కనిపించింది. ఇప్పుడు అధికారికంగా మార్కెట్లో లాంచ్ అయింది. చూడటానికి ఇది సాధారణ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. కాస్మొటిక్ అప్డేట్స్ చాలానే ఉన్నాయి. కాబట్టి ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే హుందాగా కనిపిస్తుంది.

2025 టయోటా హైలెక్స్ బ్లాక్ ఎడిషన్ పేరుకు తగ్గట్టుగానే.. గ్రిల్, వింగ్ మిర్రర్స్, డోర్ హ్యాండిల్స్ వంటివన్నీ బ్లాక్ ఫినిషింగ్ పొందుతాయి. 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కూడా నలుపు రంగులో ఉండటం చూడవచ్చు. బ్లాక్ అవుట్ వీల్ ఆర్చ్ క్లాడింగ్, ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ వంటివి ఇందులో గమనించవచ్చు. అంతే కాకుండా సాధారణ యాక్ససరీలుగా.. దాదాపు అన్నీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇంటీరియర్‌లో చెప్పుకోదగ్గ అప్డేట్స్ లేదు.

ఫీచర్స్

2025 హైలెక్స్ బ్లాక్ ఎడిషన్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో కూడా పెద్దగా మార్పులు లేవు. కాబట్టి ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడా అదే 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ పొందుతుంది. డ్యూయెల్ జోన్ ఏసీ, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏఈడీ హెడ్‌లైట్స్, 8 వే పవర్డ్ డ్రైవర్ సీటు, క్రూయిక్ కంట్రోల్, రియర్ కెమెరా మరియు మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

కలర్ ఆప్షన్స్

టయోటా హైలెక్స్ బ్లాక్ ఎడిషన్.. ఎమోషనల్ రెడ్, వైట్ పెర్ల్ క్రిస్టల్ షైన్, సిల్వర్ మెటాలిక్, సూపర్ వైట్ మరియు గ్రే మెటాలిక్ అనే ఇది రంగులలో లభిస్తుంది. ఇవన్నీ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఐదు రంగులలో లభిస్తుండటం వల్ల.. కొనుగోలుదారులు తమకు నచ్చిన కలర్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.

ఇంజిన్ వివరాలు

కొత్త టయోటా హైలెక్స్ బ్లాక్ ఎడిషన్ డీజిల్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలో మాత్రమే లభిస్తుంది. కాబట్టి ఇందులో 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్ 204 హార్స్ పవర్, 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. పవర్ నాలుగు చక్రాలకు డెలివరీ అవుతుంది.. కాబట్టి ఇది మంచి పనితీరును అందిస్తుంది. మెరుగైన ఆఫ్-రోడ్ సామర్థ్యం కోసం ఎలక్ట్రానిక్ డిఫరెన్షియక్ లాక్ మరియు ఆటోమాటిక్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్ వంటివి పొందుతుంది.

Also Read: కామెట్ ఈవీ స్పెషల్ ఎడిషన్.. మునుపటి కంటే మరింత కొత్తగా: రేటెంతో తెలుసా?

హైలెక్స్ చాలా అద్భుతమైన డిజైన్ పొందుతుంది. అయితే ఇప్పుడు లాంచ్ అయిన హైలెక్స్ బ్లాక్ ఎడిషన్ మరింత ఆకర్షణీయంగా ఉంది. అయితే ఇప్పటికే మార్కెట్లో ఉన్న మహీంద్రా స్కార్పియో ఎన్, టాటా హారియర్, సఫారీ మరియు ఎంజీ కామెట్ స్పెషల్ బ్లాక్ ఎడిషన్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

ఈ రాశి వారు ఏపని చేపట్టిన విజయమే!

0

Daily Horoscope in Telugu 2025 March 10th Monday: సోమవారం (2025 మార్చి 10). శ్రీక్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరఋతువు, శుక్ల పక్షం, పాల్గుణమాసం. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9:00 వరకు. యమగండం ఉదయం 10:30 నుంచి 12:00 వరకు. అమృత గడియలు రాత్రి 11:58 నుంచి 1:34 వరకు.

మేషం

చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు, దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచింది. సన్నిహితులతో మాటపట్టింపులు, ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఉద్యోగులకు స్దాన చలనం ఉంది. అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దైవ చింతన శుభం కలిగిస్తుంది.

వృషభం

ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. నూతన వస్తువుల కొనుగోలు ఉంది. ఆర్ధిక వృద్ధి మంచిగానే ఉంటుంది. ఉద్యోగులకు ప్రశంసలు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం ఉంది.

మిథునం

ఆర్థిక పరిస్థితి కొంత ఆశాజనకంగానే ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు, ఉద్యోగాలలో పదోన్నతులు ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. చిన్న నాటి స్నేహితులను కలుసుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించే ముందు.. పెద్దల సలహా తీసుకోవడం మంచిది.

కర్కాటకం

ఏ పని చేసిన కొంత నిరాశే మిగులుతుంది. సన్నిహితులతో వివాదాలు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృధా ఖర్చులు ఉన్నాయి. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే. నూతన ఋణ ప్రయత్నాలు కూడా అసాధ్యమే. శ్రమకు తగిన ఫలితం లేదు. దైవ దర్శనం శుభం కలిగిస్తుంది.

సింహం

ఇంటా బయట సమస్యలు. అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారాలు మందగిస్తాయి. ఆర్ధిక సమస్యలు పెరుగుతాయి. ఉద్యోగులపై ఒత్తిడి, పనిభారం పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు కూడా వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవ దర్శనం మనోబలాన్ని ఇస్తుంది.

కన్య

సమాజంలో పలుకుబడి బాగా పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు శుభయోగం, ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం. ఆకస్మిక ధనలాభం ఉంది. దైవ చింతన పెరుగుతుంది.

తుల

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి. స్థిరాస్తికి సంబంధించిన ఒప్పందాలు వాయిదా పడే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

వృశ్చికం

విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం ఉంది. కొత్త పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ఉంది. ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవడం అవసరం. ఆర్ధిక విషయాలు సంతృప్తిని ఇస్తాయి. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

ధనుస్సు

నిరుద్యోగులకు శుభయోగం, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన పనులలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు వద్దు. అకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. బంధువర్గంలో మాటపట్టింపులు ఉన్నాయి. దైవ దర్శనం శుభం కలిగిస్తాయి.

మకరం

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సన్నితులతో సమయం గడుపుతారు. ముఖ్యమైన వ్యక్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఆర్ధిక పరమైన లావాదేవీలలో జాగ్రత్త వహించాలి. అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

కుంభం

ఏ పని తలపెట్టినా విజయం చేకూరుతుంది. ఉద్యోగులలో నూతనోత్సాహం. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబలో సంతోషం, దేవాలయాల దర్శనం చేస్తారు.

మీనం

వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపడుతుంది. సన్నిహితులతో స్వల్ప వివాదాలు. వృధా ఖర్చులు, వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. శ్రమకు తగ్గ ఫలితం కొంత ఆలస్యం అవుతుంది. దైవారాధన మనశ్శాంతిని ఇస్తుంది.

గమనించండి: రాశిఫలాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. గ్రహాల స్థితిగతులు, నక్షత్రాల పరిస్థితులు మొదలైన వాటిని బేరీజు వేసుకుని రాశిఫలాలు నిర్ణయిస్తారు. అయితే గ్రహాల తీరులో మార్పులు జరిగితే.. ఫలితాలు కూడా తలకిందులయ్యే అవకాశం ఉంది. మంచి జరిగే స్థానంలో చెడు, చెడు జరిగే స్థానంలో మంచి జరగవచ్చు. కాబట్టి రాశిఫలాలలో చెప్పిందే జరుగుతుందని అపోహ వద్దు.

సమ్మర్‌లో పెసలు.. ఆరోగ్యానికి ఎంతో స్పెషల్: ఎలా తినాలంటే?

0

Health Benefits of Mung Bean in Summer: అసలే ఎండాకాలం.. ఈ సమయంలో ఫాస్ట్ ఫుడ్స్ లేదా స్పైసీ ఫుడ్స్ వంటివి తినడం వల్ల, శరీరం వేడి చేస్తుంది. వేడి తగ్గాలంటే దానికోసం టాబ్లెట్స్ వేసుకోవడం వంటివి చేస్తుంటారు. మాత్రమే తక్షణ ఉపశమనం అనిపించినా.. ఆ తరువాత కడుపులో మంట లేదా ఇతర సమస్యలను కలిగిస్తాయి. అయితే మనం రోజూ చూసే.. వంటింట్లో దొరికే పెసలు (Mung Bean లేదా Green Gram) ఎండాకాలంలో వేడిని తగ్గించడానికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఇంతకీ వీటిని ఎలా తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? అనే ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ చూసేద్దాం.

ఎలా తినాలి?

ఉదయం.. ఇడ్లీ, దోస వంటివి తీసుకోవడం కంటే, పెసలును హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ మాదిరిగా తినడం మంచిది. ఉడకబెట్టి తినొచ్చు. మొలకెత్తించిన గింజలు తినడం చాలా ఉత్తమం. ఇందులో ఉడకబెట్టిన పెసలులో ఉండే పోషకాల కంటే.. మొలకెత్తిన పెసలులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మొలకెత్తిన గింజల్లో శరీరానికి కావలసిన ప్రోటీన్, ఫైబర్ వంటివి అధిక మోతాదులో ఉంటాయి.

పచ్చి మొలకలు తినలేనివారు, ఉడకబెట్టిన గింజలు తినడమే ఉత్తమం. ఇది ఫుడ్ పాయిజన్ సమస్యను తగ్గిస్తుంది. మనం రోజూ డైట్‌లో వీటిని తీసుకోవడం మంచిది. పెసరపప్పు చారు, టమోటా పెసరపప్పు, అరటికాయ పెసరపప్పు, పెసరపప్పు కర్రీ, పెసరపప్పు పులగం మొదలైన వంటలుగా చేసుకుని తినొచ్చు.

ఉపయోగాలు

హైబీపీ తగ్గించుకోవచ్చు: హైబీపీ ఉన్నవారికి పెసలు గొప్ప ఔషధం అనే చెప్పాలి. ప్రతి రోజూ ఏదో ఒకరకంగా.. మనం తీసుకునే భోజనంలో పెసలును తీసుకోవడం ఉత్తమం. ఇలా ప్రతి రోజూ పెసలును తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారడమే కాకుండా, యవ్వనంగా కూడా కనిపిస్తారు. ఇందులో ఉండే కాపర్ చర్మం మీద ఏర్పడే ముడతలను తగ్గిస్తుంది. అంతే కాకూండా యాంటీఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ నుంచి స్కిన్ డ్యామేజీని తగ్గిస్తాయి. బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. శరీరంలో పేరుకున్న కొవ్వును తగ్గిస్తుంది. లావుగా ఉండేవారు సన్నబడటానికి పెసలు చాలా బాగా ఉపయోగపడతాయి.

షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి: బీపీని మాత్రమే కాకుండా.. ఇన్సులిన్ (షుగన్) స్థాయిని కూడా తగ్గించుకోవడానికి పెసలు ఉపయోగపడతాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ మరియు ఫ్యాట్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. దీంతో శరీరం బరువు సులభంగా తగ్గుతుంది. షుగర్ ఉన్నవాళ్లు ఎప్పుడూ పెసలును తినడం మంచిది. పెసలును రోజూ తీసుకోవడం వల్ల అత్యుత్తమ ఫలితాలు లభిస్తాయని నిపుణులు కూడా నిర్దారిస్తున్నారు.

సరైన రక్తప్రసరణ కోసం: పెసలులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను సక్రమంగా ఉంచుతుంది. అంతే కాకుండా.. ఐరన్ అనేది శరీరంలోని అవయవాలకు కావలసినంత ఆక్సిజన్ అందించడానికి ఉపయోగపడుతుంది. దీంతో శరీరం ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ పెసలును తినడం మంచిది.

కండరాల పెరుగుదలకు: చాలామందికి కండలు పెంచుకోవడం ఫ్యాషన్. కాబట్టి వీరిలో చాలామంది మాంసాహారం తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అయితే పెసలు కూడా కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. జిమ్ చేసేవారు మాత్రమే కాకుండా, మజిల్స్ మరియు మజిల్ పవర్ వంటివి పెంచుకోవాలనుకునేవారు పెసలును రోజూ తీసుకోవచ్చు. పెసలులో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి.

Also Read: ఎండాకాలంలో అందమైన ముఖం కోసం.. అద్భుతమైన టిప్స్: మొటిమలు సైతం మాయం!

సరైన జీర్ణవ్యవస్థకు: ఇంతకు ముందు చెప్పుకున్నట్లు పెసలులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను కూడా దూరం చేస్తుంది. సరైన జీర్ణ వ్యవస్థ కావాలనుకునేవారు పెసలు తీసుకోవాలి. మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలను కూడా పెసలు దూరం చేస్తాయి. పెసలు బ్రెయిన్ పనితీరును కూడా పెంచుతాయి.

గమనించండి: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణులు, కొన్ని అధ్యయనాల ఆధారంగా ఈ సమాచారం అందించడం జరిగింది. అయితే పెసలు లేదా ఇతర ఆహార పదార్థాలు అందరికి సెట్ అవ్వొచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు.. మంచి డైటీషియన్‌ను సంప్రదించి పెసలును తీసుకోవడం మంచిది.

ఈ రాశివారికి శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది: దైవ చింతన పెరుగుతుంది

0

Daily Horoscope in Telugu 2025 March 9th Sunday: ఆదివారం (09/03/2025). శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, శుక్ల పక్షం, పాల్గుణ మాసం. రాహుకాలం మధ్యాహ్నం 12.17 నుంచి 1.55 వరకు, యమగండం మధ్యాహ్నం 12.00 నుంచి 1:00 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2.25 నుంచి 3.59 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4.25 నుంచి 5:13 వరకు, బ్రహ్మ ముహూర్తం సాయంత్రం 4:47 నుంచి 5:36 వరకు.

మేషం

ఈ రాశివారికి చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలు ఏర్పడతాయి. సోదరులతో మాటపట్టింపులు, వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఉద్యోగంలో ఊహించని మార్పులు, కొత్త కార్యక్రమాలను ప్రారంభించే సమయంలో జాగ్రత్త అవసరం, తెలివిగా వ్యవహరించాలి. దైవ చింతన పెరుగుతుంది.

వృషభం

సన్నిహితులతో విభేదాలు, నూతన వాహన కొనుగోలు ఉంది.ఉద్యోగులకు శుభపరిణామాలు, నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. దైవనామ స్మరణ మరింత శుభాలను కలిగిస్తుంది.

మిథునం

ఈ రాశివారికి శుభయోగం మొదలైంది. అవసరానికి కావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్ధిక పరిస్థితి అనుకూలం. సన్నిహితుల నుంచి తెలుసుకునే ఒక సమాచారం.. మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం. విందు వినోదాల్లో పాల్గొంటారు.

కర్కాటకం

ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. శ్రమ అధికమవుతుంది. వ్యాపారాల్లో లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అనవసర ఖర్చులు అధికం. బంధువులతో చిన్న మాటపట్టింపులు, ఆరోగ్య సమస్యల పట్ల కొంత జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయ పారాయణం శుభాలను కలుగజేస్తుంది.

సింహం

వృధా ఖర్చులు, వృధా ప్రయాస. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభించదు. సమస్యలు ఎక్కువవుతాయి. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను ఎదుటుకోవాల్సి ఉంటుంది. ఆర్ధిక ఇబ్బందులు. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచింది.

కన్య

ఈ రాశివారికి అన్నింటా శుభయోగం. నూతన కార్యక్రమాలు చేపడతారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభం ఉంది. దైవ దర్శనం శుభం కలిగిస్తుంది.

తుల

ఉద్యోగులకు శుభయోగం. అయితే కొంత జాగ్రత్త, నేర్పు అవసరం. దూర ప్రయాణాలు అంతగా కలిసి రావు. చేపట్టిన పనుల్లో శ్రమ అధికమవుతుంది. ఆశించిన ఫలితాలు కనిపించవు. అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన అవసరం. నూతన కార్యక్రమాలకు సంబంధించిన ఒప్పందాలు చేసుకుంటారు.

వృశ్చికం

శుభవార్తలు వింటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ప్రముఖుల పరిచయం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన లాభాలు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు శుభయోగం. పోటీ పరీక్షలలో విజయం లభిస్తుంది.

ధనుస్సు

ముఖ్యమైన పనులలో జాప్యం. ఒత్తిడి పెరుగుతుంది. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతారు. బంధుమిత్రులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాల్లో కొన్ని సమస్యలు. ఆలోచించకుండా నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. దైవ చింతన పెరుగుతుంది.

మకరం

ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆస్తి వివాదాలకు సంబంధించిన పరిష్కారాలు ఓ కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సంయమనం అవసరం. తొందరపాటు వద్దు.

కుంభం

నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. సన్నిహితులతో సరదాగా గడుపుతారు. ఋణబాధలు తొలగిపోతాయి. అవసరానికి డబ్బు చెక్కురుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. దూరప్రయాణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. దైవ దర్శనం మనశ్శాంతిని ఇస్తుంది.

Also Read: తల్లికి కారు గిఫ్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ – వీడియో చూశారా?

మీనం

ఉద్యోగస్తులకు ప్రతికూల వాతావరణం. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. బంధువులతో మాటపట్టింపులు. శ్రమ కొంత అధికమవుతుంది. ఓపిక అవసరం. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

గమనించండి: రాశిఫలాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పేర్కొన్న అంశాలలో.. అన్నీ జరుగుతాయని గానీ లేదా జరగవని గానీ ఖచ్చితంగా చెప్పలేము. 12 గ్రహాల స్థానచలనం ఊహించని మార్పులను కలిగించవచ్చు. కాబట్టి ఎప్పుడో, ఎదో జరుగుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

వరుస బ్లాక్‌బస్టర్స్‌.. కొత్త కారు కొనేసిన రష్మిక: ధర ఎంతో తెలుసా?

0

Rashmika Mandanna Buys Mercedes Benz S450: ఛలో సినిమాతో.. తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టిన ‘రష్మిక మందన్న’ (Rashmika Mandanna) ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి ఎదిగిపోయింది. దీంతో ఈ అమ్మడు రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసింది. పుష్ప 2 సినిమా కోసం ఈమె ఏకంగా రూ. 10 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు తాజాగా.. ఓ ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈమె కొనుగోలు చేసిన కారు ఏది?, దాని ధర ఎంత?, అనే ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఓ వైపు తెలుగు, మరోవైపు హిందీ భాషలలో నటిస్తూ.. బిజీ అయిపోయిన రష్మిక మందన్న మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ఎస్ 450 (Mercedes Benz S450) కొనుగోలు చేసింది. ఇది విలాసవంతమైన ఫీచర్స్ కలిగి.. విశాలంగా ఉండటం వల్ల ప్రయాణంలో కూడా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు. బహుశా దీనికోసమే రష్మిక ఈ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కొత్త కారుతో రష్మిక ముంబై విమానాశ్రయంలో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బెంజ్ ఎస్-క్లాస్ సెడాన్ నుంచి రష్మిక మందన్న బయటకు రావడం వీడియోలో కనిపిస్తుంది. బయటకు వచ్చిన తరువాత అభిమానులు, ఫొటోగ్రాఫర్లకు హాయ్ చెబుతూ ముందుకు వెళ్ళింది. ప్రస్తుతం చాలా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మిక ఇప్పటికే ఖరీదైన కార్లను కలిగి ఉంది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్450 (Mercedes Benz S450)

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ యొక్క ‘ఎస్450’ విషయానికి వస్తే.. ఇది ఇండియన్ మార్కెట్లో ఎంతోమంది సెలబ్రిటీలకు ఇష్టమైన మోడల్. ఈ మోడల్ కేవలం పెట్రోల్ ఇంజిన్ రూపంలో మాత్రమే లభిస్తుంది. డీజిల్ ఇంజిన్ కావాలనుకునే వారికి ఎస్ 350డీ రూపంలో లభిస్తుంది. అయితే ఈ రెండు వేరియంట్లు.. 4మ్యాటిక్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతాయి.

మెర్సిడెస్ బెంజ్ ఎస్450 కారు ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ప్లస్ సిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, పనోరమిక్ సన్‌రూఫ్, కీలెస్ గో, లైట్ వెయిట్ అల్లాయ్ వీల్స్ మరియు స్ప్లిట్ ఎల్ఈడీ టెయిల్ లాంప్ వంటివి పొందుతుంది.

ఈ కారు లెదర్ అపోల్స్ట్రే, పెద్ద ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, వెనుక సీటు ప్రయాణికుల కోసం ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్స్, మసాజ్ అండ్ వెంటిలేషన్ ఫంక్షన్‌తో అన్నీ సీట్లు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ పొందుతుంది. యాంబియంట్ లైటింగ్ వంటి ప్రీమియం ఫీచర్స్ కూడా ఈ కారులో ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి లగ్జరీ అనుభూతిని అందిస్తాయి.

ఇంజిన్ విషయానికి వస్తే.. మెర్సిడెస్ బెంజ్ ఎస్450 కారులో 3.0 లీటర్ 6 సిలిండర్ టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 360 Bhp పవర్ మరియు 500 Nm టార్క్ అందిస్తాయి. ఇంజిన్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ పొందుతుంది. పవర్ అనేది 4మ్యాటిక్ టెక్నాలజీని ఉపయోగించి.. నాలుగు చక్రాలకు అందుతుంది.

Also Read: అభిమాని కోసం బంగారం ఇచ్చేసిన హీరోయిన్ – వీడియో

కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్450 ధర రూ. 1.9 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఆన్ రోడ్ ధరలు రూ. 2.25 కోట్లు వరకు ఉంటుంది. ధర ఎక్కువ కాబట్టి దీనిని సాధారణ ప్రజలు కొనుగోలు చేసే అవకాశం లేదు. అయితే ఈ కారును రష్మిక మందన్న మాత్రమే కాకుండా.. సల్మాన్ ఖాన్ తండ్రి.. సలీం ఖాన్, నిమ్రత్ కౌర్, షాహిద్ కపూర్, విద్యా బాలన్, కంగనా రనౌత్ వంటి ప్రముఖులు కూడా కొనుగోలు చేశారు.

ఈ రాశివారికి.. శ్రమకు తగ్గ ఫలితం శూన్యం: కానీ..

0

Daily Horoscope in Telugu 2025 March 8th Saturday: మార్చి 08, 2025 శనివారం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, శుక్ల పక్షం, పాల్గుణ మాసం. రాహుకాలం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు. వర్జ్యం ఉదయం 11:27 నుంచి 1:00 వరకు. అమృత గడియలు సాయంత్రం 4:53 నుంచి 6:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:00 నుంచి 7:36 వరకు.

మేషం

చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. బంధువు మిత్రులతో సంతోషకరమైన వాతావరణం, అవసరానికి డబ్బు అందుతుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగులు శుభపరిణామాలను ఎదుర్కొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన సంబంధిత వ్యాపారాలు చాలా బాగుంటాయి. ఇంటా బయట అనుకూలం.

వృషభం

దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. పెద్దల సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడుపుతారు. సంఘంలో గౌరవ మ్నార్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం.

మిథునం

అనుకున్న పనులు మందకొడిగా సాగుతాయి. కీలక వ్యవహారాలు సైతం ముందుకు సాగవు. ఆర్ధిక ఇబ్బందులు, దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. సంతానం యొక్క విద్యా, ఉద్యోగ విషయాల్లో కొంత శ్రద్ద వహించాలి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

కర్కాటకం

శ్రమ తప్పా.. ఫలితం శూన్యం. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా కూడా కొంత కష్టమే. బంధువులతో మాటపట్టింపులు, నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. తొందరపాటు నిర్ణయాలు ప్రమాదాన్ని తెస్తాయి. జాగ్రత్తగా అడుగులు వేయడం మంచిది.

సింహం

సన్నిహితులతో సమావేశాలు, కుటుంబంలో సంతోష వాతావరణం. ఆదాయం అవసరానికి తగినట్లుగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించడానికి అనుకూలమైన వాతావరణం. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు.

కన్య

ఈ రాశివారికి ఈ రోజు అంత అనుకూలంగాణా లేదు. చేపట్టిన పనులు అనుకున్నంత వేగంగా ముందుకు సాగవు. బంధు మిత్రులతో వాగ్వాదాలు. ధన నష్టం. వ్యాపారాలు కూడా మందకొడిగానే సాగుతాయి. ఉద్యోగులకు.. అధికారులతో సమస్యలు. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి.

తుల

నూతన కార్యక్రమాలకు శ్రీకారం, ఇంటా బయట అనుకూల వాతావరణం. శుభకార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలకు పెట్టుబడులు సమకూరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి విక్రయాలలో లాభాలను గడిస్తారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం.

వృశ్చికం

తొందరపాటు నిర్ణయాలు ప్రమాదం కలిగిస్తాయి. ముఖ పరిచయం లేనివారితో జాగ్రత్తగా ఉండాలి. వృధా ఖర్చులు ఎక్కువవుతాయి. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు. వృత్తి వ్యాపారాలు సజావుగా ముందుకు సాగవు. దైవారాధాన మేలు చేస్తుంది.

ధనుస్సు

నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వివాదాలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై ద్రుష్టి కేంద్రీకరిస్తారు. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.

మకరం

సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం. ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. విద్యార్థులకు శుభయోగం.

కుంభం

చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ.. నెమ్మదిగా ముందుకు సాగుతాయి. ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుకోని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. బంధువులతో సరదాగా గడుపుతారు. ఎట్టిపరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు.

మీనం

ఉద్యోగులకు స్థాన చలనం ఉంది. వ్యాపారంలో గందరగోళ పరిస్థితి. వాహన ప్రయాణంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. బంధువులతో మాటపట్టింపు ఉన్నవి. ఆవేశం పనికిరాదు. అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దైవారాధన శుభం చేకూరుస్తుంది.

Also Read: తల్లికి కారు గిఫ్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ – వీడియో చూశారా?

గమనించండి: రాశిఫలాలు అనేది కేవలం అవగాహనా కోసం మాత్రమే. కొందరు నమ్ముతారు, మరికొందరు నమ్మరు. అయితే గ్రహాల స్థితిగతుల దృష్ట్యా ఫలితాలు వస్తాయన్నది వాస్తవం. అయితే అన్నీ జరుగుతాయా? జరగవా? అనేది దైవేచ్ఛ.

అభిమాని కోసం బంగారం ఇచ్చేసిన హీరోయిన్ – వీడియో

0

Raveena Tandon Earring Gift: ఏవైనా ఫ్యాన్స్ అడిగితే ఆటోగ్రాఫ్ ఇస్తారు, లేదా ఒక సెల్ఫీ ఇస్తారు. కొందరు అది ఇవ్వడానికి కూడా విసుక్కుంటారు. అయితే ప్రముఖ నటి రవీనా టండన్ (Raveena Tandon) మాత్రం ఇందుకు భిన్నమనే చెప్పాలి. ఎందుకంటే అభిమాని కోసం ఏకంగా తన చెవికున్న బంగారు కమ్మను గిఫ్ట్ ఇచ్చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిజానికి నటి రవీనా టండన్.. బుధవారం సాయంత్రం ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించారు. ఆ సమయంలో ఈమెతో పాటు తన కుమార్తె ‘రాషా తడానీ’ (Rasha Tadani) ఉంది. తల్లి, కూతురు ఎయిర్‌పోర్టులో కనిపించేసరికి.. అభిమానులు, ఫోటో గ్రాఫర్లు వారిని వెంబడిస్తూ.. ఫోటోలు, వీడియోలు తీశారు. ఆ సమయంలో ఒక అభిమాను మీ చెవి దుద్దులు బాగున్నాయని అన్నాడు. ఆ తరువాత రవీనా టండన్.. ఒక చెవి దుద్దు తీసి అతని చేతిలో పెట్టి వెళ్లిపోయింది.

తల్లి చేసిన పనికి.. కూతురు ఆశ్చర్యంతో చూస్తుండిపోయింది. మీ చీర బాగుంది, మీ బ్యాగ్ బాగుంది అని పూజిస్తే.. థాంక్స్ చెప్పి ఊరుకునే ఈ రోజుల్లో అభిమాని కోసం, పెట్టుకున్న చెవి దుద్దును ఇవ్వడం అనేది గొప్ప విషయం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ అభిమాని కూడా ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఆ తరువాత తేరుకుని తెగ సంతోషపడిపోయాడు.

ఇదే మొదటిసారి కాదు

నటి రవీనా టండన్ బంగారం గిఫ్ట్ ఇవ్వడం ఓడే మొదటిసారి కాదు. గతంలో కూడా ఈమె ఒక పెళ్ళికి హాజరైంది. ఆ పెళ్ళిలో, పెళ్లి కుమార్తెకు.. తన చేతిలో ఉన్న గాజులను తీసి ఇచ్చేసింది. ఆ గాజుల మీద రవీనా టండన్ మరియు ఆమె భర్త అనిల్ పేరు రాసుంది. అవేమీ పట్టించుకోకుండా.. చేతికున్న గాజులను తీసి ఇచ్చేసి, తన మంచి మనసు చాటుకుంది. ఉన్నవాటిని ఇతరులకు ఇచ్చేంత గొప్ప మనసు చాలా తక్కువమందికే ఉంటుంది. అలాంటి కోవకు చెందిన వారిలో రవీనా టండన్ మొదటి వ్యక్తి అనే చెప్పాలి.

సాధారణంగా మహిళలు, తమకు ఇష్టమైన వస్తువులను సొంత వారికి ఇవ్వడానికి ఆలోచించే.. ఈ రోజుల్లో, తాను వేసుకున్న గాజులు, చెవి దుద్దు వంటివి ఇవ్వడం అనేది గొప్ప విషయం. ఇది ప్రశంసనీయం కూడా. బహుశా ఇలాంటి ఘటనలు గతంలో కూడా ఎక్కడా కానరాలేదు. మొత్తానికి.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు మరియు అభిమానులు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: తల్లికి కారు గిఫ్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ – వీడియో చూశారా?

రవీనా టండన్

ప్రముఖ నటి రవీనా టండన్.. బాలీవుడ్ చిత్ర సీమలో అగ్రతారలలో ఒకరు. అయినప్పటికీ ఈమె తెలుగులో బాలకృష్ణ సరసన బంగారు బుల్లోడు, మోహన్ బాబు నటించిన పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో నటించింది. సినిమా రంగంలో అనేక చిత్రాలలో నటించి ఎంతోమంది అభిమానులను కలిగి ఉన్న ఈమె.. అనేక జాతీయ చలన చిత్ర అవార్డ్స్, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వంటివి సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా.. భారతదేశ అత్యున్నత పురస్కారాలతో ఒకటైన పద్మశ్రీ కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం ”వెల్‌కమ్ టు ద జంగిల్” అనే సినిమాలో నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

తల్లికి కారు గిఫ్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ – వీడియో చూశారా?

0

Bigg Boss Fame Chahat Pandey Car Gifts To Mom: ప్రతి ఒక్కరూ.. తమ తల్లిదండ్రులకు కార్లను గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటారు. కానీ అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. ఈ జాబితాలోకి తాజాగా బిగ్‌బాస్ 18 ఫేమ్.. టెలివిజన్ నటి ‘చాహత్ పాండే’ చేరింది. చాహత్ తన తల్లికి ఖరీదైన కియా కారును గిఫ్ట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. చాహత్ పాండేకు డీలర్షిప్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఆ తరువాత కేక్ కట్ చేయడం, తన తల్లికి కారును గిఫ్ట్ ఇవ్వడం వంటివి కూడా చూడవచ్చు. ఇది చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పాండేను పొగడ్తలతో ముంచేస్తున్నారు.

కియా కారెన్స్ (Kia Carens)

భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన కియా కార్లలో ‘కారెన్స్’ ఒకటి. ఇది 7 సీటర్ ఎంపీవీ. ఈ కారు ధరలు రూ. 12.24 లక్షల నుంచి రూ. 23.75 లక్షల మధ్య ఉన్నాయి. ఇది మొత్తం 33 వేరియంట్లలో లభిస్తుంది. కాగా చాహత్ పాండే.. తన తల్లి కోసం ఏ వేరియంట్ ఎంచుకుంది? ఇంజిన్ ఆప్షన్ ఏంటి? అనే వివరాలు వెల్లడించలేదు.

కియా కారెన్స్ కారులో 115 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే.. 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 160 హార్స్ పవర్ అందించే 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 116 హార్స్ పవర్ ఉత్పత్తి చేసే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ వంటివి ఉన్నాయి. ఇంజిన్స్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ఎంపికలలో లభిస్తాయి.

కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్

ఇప్పటికే గొప్ప అమ్మకాలు పొందిన.. కియా కారెన్స్, రాబోయే రోజుల్లో ఫేస్‌లిఫ్ట్ మరియు ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ అప్డేటెడ్ కార్లు.. సరికొత్త డిజైన్, ఫీచర్స్ కలిగి ఉండనున్నాయి. ఇందులో లెవెల్ 2 ఏడీఏఎస్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు మొదలైనవి కొత్త ఫీచర్స్.

Also Read: అల్ట్రావయొలెట్ కొత్త టూ వీలర్స్ ఇవే: పూర్తి వివరాలు ఇక్కడ చూడండి

ఎలక్ట్రిక్ కారెన్స్ విషయానికి వస్తే.. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు అందుబాటులో లేదు. కానీ ఇది 42 కిలోవాట్ మరియు 51.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో రానున్నట్లు సమాచారం. ఇది కూడా స్టాండర్డ్ మోడల్స్ మాదిరిగా ప్రీమియం ఫీచర్స్ పొందుతుంది. డిజైన్ మాత్రం కొంత మారుతుంది.

2025లో దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కియా కారెన్స్.. ఇప్పటి వరకు దాదాపు 2,00,000 యూనిట్ల అమ్మకాలను సాధించింది. దీన్నిబట్టి చూస్తే ఇండియన్ మార్కెట్లో ఈ కారుకు ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాగా ఈ కారు ఫేస్‌లిఫ్ట్ మరియు ఎలక్ట్రిక్ రూపంలో మార్కెట్లో అడుగుపెడితే.. తప్పకుండా ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుంది. మంచి అమ్మకాలను కూడా పొందుతుందని భావిస్తున్నాము. అయితే కారెన్స్ ఫేస్‌లిఫ్ట్, కారెన్స్ ఎలక్ట్రిక్ కారు ఎప్పుడు లాంచ్ అవుతాయి? వాటి ధరలు ఎలా ఉండబోతున్నాయి? బుకింగ్స్ వంటి చాలా విషయాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి.

ఈ రాశివారికి ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది: అన్నింటా శుభయోగం

0

Daily Horoscope in Telugu 2025 March 7th Friday: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, పాల్గుణమాసం, శిశిర ఋతువు, శుక్రవారం (2025 మార్చి 7). రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12:00 వరకు, యమగండం సాయంత్రం 3:24 గంటల నుంచి 4:52 వరకు. సూర్యోదయం 6:19, సూర్యాస్తమయం 6:03.

మేషం

ఈ రాశివారికి మంచి కాలం నడుస్తోంది. అలోచించి చేసేపనులు మంచి ఫలితాలు లభిస్తాయి. వివాదాలకు కొంత దూరంగా ఉండాలి. బంధుమిత్రులతో గొడవలు జరిగే అవకాశం. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

వృషభం

ఇంటబయట అనుకూల వాతావరణం, ఉద్యోగులు శుభవార్తలు వింటారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కొత్తగా ప్రారంభించిన వ్యాపారాల్లో లాభాలను గడిస్తారు. సన్నిహితులతో సమయం గడుపుతారు. కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసి వస్తాయి. నిరుద్యోగుల అసలు ఫలిస్తాయి.

మిథునం

ముఖ్యమైన వ్యవహారాలు నత్త నడకన సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఋణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కీలక వ్యవహారాల యందు.. ఆచి తూచి అడుగులు వేయాలి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఆధ్యాత్మిక చింతన మాయాబలాన్ని ఇస్తుంది. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త అవసరం.

కర్కాటకం

సన్నిహితులతో ఆనందంగా కాలం గడుపుతారు. గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ముఖ్యమైన విషయాల్లో కొంత నేర్పు అవసరం. అలోచించి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను అందిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

సింహం

నూతన వాహన కొనుగోలు, ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలను అధిగమిస్తారు. అనవసర గొడవలకు దూరంగా ఉండాలి. దాయాదులతో ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. సన్నిహితులతో సఖ్యతతో మెలగండి.

కన్య

దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ఖర్చులకు కావలసినంత ఆదాయం ఉండదు. దీర్ఘకాలిక రుణాలను తీర్చడానికి.. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. వివాదాలు కొంత దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పదు. పనికి తగ్గ ప్రతి ఫలం శూన్యం.

తుల

శుభయోగం నడుస్తోంది. కొన్ని కీలక వ్యవహారాల్లో.. కుటుంబ సభ్యుల సలహాలు మంచి ఫలితాలను అందిస్తాయి. ఇంట బయట మీ మాటలకు విలువ పెరుగుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు అనుకూలమైన కాలం. స్థిరాస్తికి సంబంధించిన క్రయ విక్రయాలు లాభదాయకంగా ఉంటాయి. దైవ చింతన మనోబలాన్ని ఇస్తుంది.

వృశ్చికం

ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సజావుగా ముందుకు సాగవు. ఉద్యోగులకు శ్రమ తప్పా.. ఫలితం శూన్యం. అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఆర్ధిక పరిస్థిని నిరాశను కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.

ధనుస్సు

వృత్తి, వ్యాపారాల్లో లాభాలు. ఆర్ధిక పరిస్థితి మునుపటి కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు పదోన్నట్లు. కీలక విషయాల్లో.. అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించిన సమస్యలు తీరిపోతాయి.

మకరం

కొత్తగా ప్రారంభించే పనులలో మంచి వృద్ధి. సంఘంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఆకాశమిక ధన ప్రాప్తి కలుగుతుంది. బంధు మిత్రులతో సమయాన్ని గడుపుతారు. ఉద్యోగుల పనికి ప్రశంసలు లభిస్తాయి. కొన్ని విషయాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు లభిస్తాయి.

కుంభం

నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసిరావు. వ్యాపారంలో నిరుత్సాహం. ప్రయాణాలలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సన్నిహితులతో వాదోపవాదాలు. మీ ఆలోచనలే ఈ రోజు మీకు సమస్యను తెచ్చిపెడతాయి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఆర్ధిక పరిస్థితి మందకొడిగానే ఉంటుంది.

మీనం

కీలక విషయాల్లో.. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆర్ధిక పరమైన విషయాల్లో, ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు ముందుకు సాగవు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగులకు పనిభారం. సన్నిహితులతో మాటపట్టింపులు. దైవదర్శనం శుభం కలిగిస్తుంది.

గమనించండి: రాశిఫలాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. పైన చెప్పినవన్నీ నిజ జీవితంలో జరగవచ్చు, జాగరకపోవచ్చు. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏమి జరగాలో పరబ్రహ్మ నిర్ణయిస్తాడు. కాబట్టి దైవదర్శనం లేదా దైవ నామ స్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

అల్ట్రావయొలెట్ కొత్త టూ వీలర్స్ ఇవే: పూర్తి వివరాలు ఇక్కడ చూడండి

0

Ultraviolette New Two Wheelers Launched in India: ఇప్పటికే అద్భుతమైన ఎలక్ట్రిక్ బైక్స్ లాంచ్ చేసిన బెంగళూరుకు చెందిన వాహన తయారీ సంస్థ ‘అల్ట్రావయొలెట్’ (Ultraviolette) కంపెనీ.. ఎట్టకేలకు ఇప్పుడు మరో రెండు టూ వీలర్స్ లాంచ్ చేసింది. ఇందులో ఒకటి ఎలక్ట్రిక్ స్కూటర్ కాగా.. మరొకటి డర్ట్ బైక్ మాదిరిగా ఉండే బైక్. ఈ రెండు బైకుల గురించి మరింత సమాచారం వివరంగా తెలుసుకుందాం.

అల్ట్రావయొలెట్ టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Ultraviolette Tesseract Electric Scooter)

ఇది కంపెనీ లాంచ్ చేసిన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్. ఇప్పటి వరకు కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయలేదు. తాజాగా టెస్సెరాక్ట్ పేరుతో ఓ స్కూటర్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.45 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). అయితే మొదటి 10000 స్కూటర్లను రూ. 1.20 లక్షలకే అందించనున్నట్లు సమాచారం. ఆ తరువాత యధావిధిగా ధర ఉంటుంది. కాబట్టి ముందుగా కొనుగోలు చేసినవారికి రూ. 25000 తగ్గింపు లభిస్తుంది. అయితే డెలివరీలు మాత్రం 2026 మొదటి త్రైమాసికంలో ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది.

చూడటానికి కొత్తగా ఉన్న అల్ట్రావయొలెట్ టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ TFT డిస్‌ప్లే, ఇంటిగ్రేటెడ్ డాష్‌క్యామ్, వైర్‌లెస్ ఛార్జింగ్, 14 ఇంచెస్ వీల్స్, డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి వాటితో పాటు 34 లీటర్ల కెపాసిటీ కలిగిన అండర్ సీట్ కెపాసిటీ కలిగిన బూట్ ఉంటుంది. ఇది డెసర్ట్ సాండ్, స్టీల్త్ బ్లాక్ మరియు సోనిక్ పింక్ అనే మూడు రంగులలో లభిస్తుంది.

కంపెనీ.. తన కొత్త టెస్సెరాక్ట్ బ్యాటరీ కెపాసిటీని వెల్లడించనప్పటికీ, ఇది ఒక సింగిల్ ఛార్జితో 261 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇది కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 125 కిమీ/గం అని తెలుస్తోంది. 100 రూపాయల ఛార్జితో.. ఈ స్కూటర్ 500 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం.

అల్ట్రావయొలెట్ షాక్‌వేవ్ ఎలక్ట్రిక్ బైక్ (Ultraviolette Shockwave Electric Bike)

కంపెనీ లాంచ్ చేసిన మరో టూ వీలర్ పేరు ‘షాక్‌వేవ్’. చూడటానికి చాలా సింపుల్ డిజైన్ కలిగిన ఈ బైక్ రూ. 1.75 లక్షలు (ఎక్స్ షోరూమ్. ఇండియా). అయితే మొదటి 1,000 మంది కస్టమర్లు రూ. 1.50 లక్షలకే ఈ బైక్ కొనుగోలు చేయవచ్చు. సంస్థ ఈ బైక్ డెలివరీలను కూడా 2026 మొదటి త్రైమాసికంలోనే డెలివరీ చేయనున్నట్లు సమాచారం.

Also Read: పొలిటికల్ లీడర్స్ ఫేవరెట్ కారు.. ఇప్పుడు సరికొత్త హంగులతో! – దీని రేటెంతో తెలుసా?

ఈ బైక్ ఎల్లో/బ్లాక్, వైట్/రెడ్ అనే రెండు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కేవలం 120 కేజీల బరువున్న ఈ బైక్ 14.7 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది గంటకు 0 నుంచి 120 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది 2.9 సెకన్లలో 0 నుంచి 60 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. ఈ బైక్ యొక్క బ్యాటరీ వివరాలను కంపెనీ వెల్లడించలేదు. కానీ ఇది ఒక పుల్ ఛార్జితో 165 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇది ఇప్పటి మార్కెట్లో ఉన్న ఇతర అన్ని బైకుల కంటే చాలా భిన్నంగా ఉంటుంది.