31.2 C
Hyderabad
Monday, March 17, 2025
Home Blog Page 27

లగ్జరీ కారు కొన్న స్టార్‌ హీరో బాడీగార్డ్‌.. ధర తెలిస్తే అవాక్కవుతారు!

0

Salman Khan Bodyguard Shera Buys Range Rover Sport: ఎప్పుడైనా ఖరీదైన కార్లను సెలబ్రిటీలు లేదా క్రికెటర్లు, ఇతర పారిశ్రామిక ప్రముఖులు కొనుగోలు చేస్తారని గతంలో చాలా కథనాల ద్వారా తెలుసుకున్నాం. అయితే ఇటీవల ఓ బాడీగార్డ్ ఏకంగా రూ. 1.7 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కొనుగోలు చేశారు. ఇంతకీ ఆ బాడీగార్డ్ ఎవరు? అతడు కొన్న కారు ఏది అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.. రండి.

సల్మాన్ ఖాన్ బాడీగార్డ్

అందరూ ముద్దుగా సల్లూభాయ్ అని పిలుచుకునే కండల వీరుడు సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ ఎక్కడికెళితే అక్కడ ఇతడు కూడా ప్రత్యక్షమవుతాడు. ఆయనే ‘షేరా’. ఇతని అసలు పేరు గుర్మీత్ సింగ్ జాలీ. ఈయన ఇప్పుడు రూ. 1.7 కోట్ల (ఆన్‌రోడ్ – ముంబై) ఖరీదైన రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశారు.

షేరా కొత్త ‘రేంజ్ రోవర్ స్పోర్ట్’ (Range Rover Sport) కారును కొనుగోలు చేసిన తరువాత, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫోటోలను షేర్ చేస్తూ.. దేవుని ఆశీర్వాదంతో కొత్త సభ్యునికి (కారుకు) ఇంట్లోకి స్వాగతం పలుకుతున్నాము అంటూ పేర్కొన్నారు. ఇది చూసి అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున అభినందనలు చెబుతున్నారు.

బాడీగార్డ్ ఇంత ఖరీదైన కారు కొనడం సాధ్యమేనా?

ఇటీవల కాలంలో బాడీగార్డ్ జీతాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. రాజకీయం నాయకులు, సినీ ప్రముఖులు.. తమ అంగరక్షకులు (బాడీగార్డ్స్) లక్షల జీతాలు ఇస్తున్నారు. బాడీగార్డులలో ఎక్కువ జీతం తీసుకునేవారిలో సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ ఒకరు. అంతే కాకుండా షేరా టైగర్ సెక్యూరిటీ పేరుతో.. ఓ సెక్యూరిటీ ఏజన్సీ నడుపుతున్నాడు. దీనివల్ల కూడా ఆయనకు ఎక్కువ డబ్బు వస్తుంది. ప్రముఖులు ముంబై నగరాన్ని సందర్శించినప్పుడు ఎక్కువగా టైగర్ సెక్యూరిటీని నియమించుకుంటారు.

షేరా కేవలం బాడీగార్డ్, సెక్యూరిటీ ఏజన్సీ స్థాపకుడు మాత్రమే కాదు. ఇతడు 2019లో ముంబైలోని శివసేన పార్టీలో చేరారు. ఈ విధంగా ఈయన అన్నిరకాలుగా, వివిధ మార్గాల్లో డబ్బు సంపాదిస్తున్నారు. మొత్తం మీద బాడీగార్డులు జాబితాలో అత్యంత సంపన్నుడు షేరా అని తెలుస్తోంది.

రేంజ్ రోవర్ స్పోర్ట్

భారతదేశంలో ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల గ్యారేజిలో స్థానం సంపాదించుకున్న బ్రాండ్లలో చెప్పుకోదగ్గది రేంజ్ రోవర్. ఇప్పడూ సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ ‘షేరా’ గ్యారేజిలో కూడా స్థానం సంపాదించేసింది. ఈ కారు కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) మార్గం ద్వారా దిగుమతి అవుతుంది. అయితే కంపెనీ తన కార్లను దేశీయ విఫణిలోనే అసెంబుల్ చేసింది. దీంతో ఈ కారు ధరలు తగ్గుముఖం పట్టాయి. కాబట్టి ఈ కారు రేటు ఇండియన్ మార్కెట్లో రూ. 1.4 కోట్లు (ఎక్స్ షోరూమ్). దిగుమతి చేసుకుంటే దీని ధర చాలా ఎక్కువ ఉంటుంది.

నిజానికి కంపెనీ స్థానికంగా అసెంబుల్ చేసిన ఈ కారు యొక్క డెలివరీలను 2024 ఆగష్టు 16న ప్రారంభించింది. ఇందులో మొదటి బ్యాచ్ కొనుగోలుదారుల జాబితాలో షేరా కూడా ఒకరుగా ఉన్నారు. ల్యాండ్ రోవర్ గత ఏడాది మరియు ఈ సంవత్సరం 404 యూనిట్ల రేంజ్ రోవర్ స్పోర్ట్ కార్లను విక్రయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్ల ధరలు ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టడంతో సేల్స్ పెరిగే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.

ఫీచర్స్

ఇండియన్ మార్కెట్లో అసెంబుల్ చేయబడిన రేంజ్ రోవర్ స్పోర్ట్ అనేది డైనమిక్ ఎస్ఈ వేరియంట్ రూపంలో లభిస్తుంది. ఇందులో అత్యాధునిక ఫీచర్స్ ఉన్నాయి. అవి హీటింగ్ అండ్ వెంటిలేషన్ పవర్ ఫ్రంట్ సీట్లు, పవర్ ఆఖ్డ్జస్టబుల్ రిక్లైన్ ఫంక్షన్‌తో కూడిన వెంటిలేటెడ్ రియర్ సీటు, 11.4 ఇంచెస్ రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ సీటు, 3డీ సరౌండ్‌తో కూడిన మెరిడియన్ సౌండ్ సిస్టం మరియు 360 డిగ్రీ కెమెరా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మొదలైనవి.

Don’t Miss: నాగార్జున వాడే కార్లు చూస్తే మతి పోవాల్సిందే!.. ఒక్కొక్కటి ఎన్ని కోట్లో తెలుసా?

రెండు ఇంజిన్ ఆప్షన్స్

భారతదేశంలో అసెంబుల్ చేయబడి రేంజ్ రోవర్ స్పోర్ట్ కారు రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఒకటి 3 లీటర్ వీ6 టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్. ఇది 346 Bhp పవర్ మరియు 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. రెండో ఇంజిన్ 3 లీటర్ వీ6 టర్బోచార్జ్డ్ పెట్రోల్. ఇది 394 Bhp పవర్ మరియు 500 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇవి రెండూ 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి.

Prabhas Car Collection: పాన్‌ ఇండియా స్టార్‌ ఇక్కడ.. కార్ల జాబితా పెద్దదే!

0

Salaar Hero Prabhas Car Collection: 2002లో ఈశ్వర్ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టిన ప్రభాస్.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగి ప్రపంచ వ్యాప్తంగా లెక్కకు మించిన అభిమానుల మనసు దోచాడు. ఇటీవల కల్కి సినిమాతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నాడు. సినిమాలలో నటించడం మాత్రమే కాకుండా ప్రభాస్‌కు ఖరీదైన కార్లను ఉపయోగించడం అంటే కూడా మహా ఇష్టం. ఈ కారణంగానే ఈయన గ్యారేజిలో ఖరీదైన అన్యదేశ్య కార్లు ఉన్నాయి.

దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం (రూ. 100) తీసుకునే ప్రభాస్.. ఇటాలియన్, జర్మన్, బ్రిటన్, అమెరికా వంటి ఖరీదైన అన్యదేశ్య కార్లను తన గ్యారేజిలో కలిగి ఉన్నారు.

లంబోర్ఘిని అవెంటడోర్ (Lamborghini Aventador)

ప్రపంచ మార్కెట్లో ఖరీదైన ఇటాలియన్ కారుగా ప్రసిద్ధి చెందిన ‘లంబోర్ఘిని అవెంటడోర్ ఎస్ రోడ్‌స్టర్‌’ ప్రభాస్ గ్యారేజిలో ఉంది. రూ. 6 కోట్ల విలువైన ఈ కారు చూడగానే ఆకర్శించబడే నారింజ రంగులో ఉంది.అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగిన ఈ కారు 7 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇందులో 6.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వీ12 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 770 పీఎస్ పవర్ మరియు 720 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ (Land Rover Range Rover)

భారతదేశంలో ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేసే ‘ల్యాండ్ రోవర్’ కంపెనీకి చెందిన ‘రేంజ్ రోవర్’ కూడా ప్రభాస్ గ్యారేజిలో ఉంది. ఈ కారు ధర సుమారు రూ. 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. శాంటోరిని బ్లాక్ కలర్ కలిగిన ఈ కారు 4.4 లీటర్ వీ8 ఇంజిన్ కలిగి 340 పీఎస్ పవర్ మరియు 740 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ (Rolls Royce Phantom)

ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన, అత్యంత లగ్జరీ ఫీచర్స్ కలిగిన ‘రోల్స్ రాయిస్ ఫాంటమ్’ ప్రభాస్ గ్యారేజిలో ఉంది. సుమారు రూ. 8 కోట్ల ఖరీదైన ఈ మోడల్ ప్రభాస్ గ్యారేజిలోని అత్యంత ఖరీదైన కారు కావడం గమనార్హం. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడిన ఈ కారు 6.75 లీటర్ వీ12 ఇంజిన్ కలిగి 460 పీఎస్ పవర్ మరియు 720 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

జాగ్వార్ ఎక్స్‌జె (Jaguar XJ)

హీరోగా నిలదొక్కుకున్న తరువాత ప్రభాస్ కొనుగోలు చేసిన మొదటి ఖరీదైన కారు జాగ్వార్ కంపెనీకి చెందిన ‘ఎక్స్‌జె’. దాదాపు రూ. 1 కోటి ఖరీదైన ఈ కారు సిల్వర్ క‌ల‌ర్‌లో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది బహుశా బ్రాండ్ యొక్క నాల్గవ జనరేషన్ అని తెలుస్తోంది. ఇందులో 3.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వీ6 డీజిల్ ఇంజిన్ కలిగి 275 పీఎస్ పవర్ మరియు 600 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉత్తమ పనితీరుని అందిస్తుంది.

బీఎండబ్ల్యూ ఎక్స్5 (BMW X5)

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ అయిన బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఎక్స్5 కూడా ప్రభాస్ గ్యారేజిలో కనిపిస్తుంది. రూ. 90 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన ఈ కారు మంచి డిజైన్, అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. కంపెనీకి చెందిన ఈ కారు సెకండ్ జనరేషన్ అని తెలుస్తోంది. ఇందులో 3.0 లీటర్ స్ట్రెయిట్ సిక్స్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 255 పీఎస్ పవర్ మరియు 560 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి అద్భుతమైన పనితీరుని అందిస్తుంది.

Don’t Miss: బ్యాడ్మింటన్‌ నుంచి స్టార్‌ హీరోయిన్‌.. వందల కోట్ల ఆస్తి, లగ్జరీ కార్లు.. రాయల్‌ లైఫ్‌!

ఖరీదైన కార్లను ఇష్టపడే సెలబ్రిటీలు

అత్యంత ఖరీదైన కార్లను ఉపయోగించడం అంటే సెలబ్రిటీలకు చాలా ఇష్టం. ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, అక్కినేని నాగ చైతన్య, జూనియర్ ఎన్ఠీఆర్ వంటి హీరోలు మాత్రమే కాకుండా సమంత, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, మమతా మోహన్ దాస్, తమన్నా భాటియా మొదలైన హీరోయిన్స్ కూడా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే సినీ రంగంలో కార్లను సంఖ్య చాలా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.

భారత్‌లో లాంచ్ అయిన రూ.38.40 లక్షల బైక్ ఇదే!.. వివరాలు చూడండి

0

2024 Ducati Multistrada V4 RS launched in India: ప్రముఖ బైక్ తయారీ సంస్థ ‘డుకాటీ’ (Ducati) ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో ‘మల్టీస్ట్రాడా వీ4 ఆర్ఎస్’ (Multistrada V4 RS) బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ గత ఏడాది గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. కాగా ఇప్పుడు భారతీయ గడ్డపై అడుగుపెట్టింది.

ధర

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త డుకాటీ మల్టీస్ట్రాడా వీ4 ఆర్ఎస్ బైక్ ధర రూ. 38.40 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ ధర దాని స్టాండర్డ్ మల్టీస్ట్రాడా బైక్ కంటే రూ. 17 లక్షలు, వీ4 పైక్స్ పీక్ కంటే కూడా రూ. 7 లక్షలు ఎక్కువ. అయితే ధరకు తగిన విధంగానే డిజైన్ మరియు ఫీచర్స్ ఉన్నాయి.

ఇంజిన్ వివరాలు

డుకాటీ మల్టీస్ట్రాడా వీ4 ఆర్ఎస్ బైక్ 1103 సీసీ డెస్మోసెడిసి స్ట్రాడేల్ వీ4 ఇంజిన్ పొందుతుంది. ఇది 12250 rpm వద్ద 178 బ్రేక్ హార్స్ పవర్ (Bhp), 9500 rpm వద్ద 118 న్యూటన్ మీటర్ (Nm) టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డుకాటీ కంపెనీ తన మల్టీస్ట్రాడా బైకులో డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజిన్ అమర్చడం ఇదే మొదటిసారి. ఈ ఇంజిన్ పానిగేల్ వీ4 మరియు స్ట్రీట్‌ఫైటర్ వీ4 బైకుల నుంచి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇది కొంత రీట్యూన్ చేయబడినట్లు తెలుస్తోంది. కాబట్టి ఇది మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.

చూడటానికి భారీగా కనిపించే ఈ బైక్ యొక్క బరువును తగ్గించడానికి కంపెనీ ఇందులో చాలావరకు కార్బన్ ఫైబర్ ఉపయోగించింది. టైటానియం సబ్‌ఫ్రేమ్ కూడా తక్కువ బరువు ఉంది. కాబట్టి ఈ బైక్ బరువు 225 కేజీల (ట్యాంకులో పెట్రోల్ ఫిల్ చేయక ముందు) వరకు ఉంటుంది. కొత్త డుకాటీ మల్టీస్ట్రాడా వీ4 ఆర్ఎస్ బైక్ యొక్క పిలియన్ గ్రబ్ హ్యాండిల్ మరియు టెయిల్ సెక్షన్ కొంత మార్పుకు లోనైంది. ఈ కారణంగానే ఈ బైక్ బరువు దాని మునుపటి బైకులకంటే 2 కేజీలు తక్కువ బరువును కలిగి ఉంటుంది.

సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ సెటప్

కొత్త డుకాటీ బైక్.. టైటానియం నైట్రైడ్ కోటింగ్‌తో 48 మిమీ ఓహ్లిన్స్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపు ఓహ్లీన్ టీటీఎక్స్36 మోనోశాక్ వంటివి ఉన్నాయి. ఈ రెండూ ఫుల్లీ అడ్జస్టబుల్.

బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఈ బైక్ యొక్క ముందు భాగంలో ట్విన్ 330 మిమీ సెమీ ప్లోటింగ్ డిస్క్‌లతో రేడియల్ మౌంటెడ్ బ్రెంబో స్టైల్మా మోనోబ్లాక్ కాలిపర్ ఉంది. వెనుకవైపు 265 మిమీ బ్రెంబో టూ-పిస్టన్ ప్లోటింగ్ కాలిపర్ బ్రేక్స్ ఉన్నాయి.

డుకాటీ మల్టీస్ట్రాడా వీ4 ఆర్ఎస్ బైక్ ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, వీలీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, స్విచబుల్ ఏబీఎస్ మరియు ఫుల్, హై, మీడియం మరియు లో అనే నాలుగు పవర్ మోడ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇందులో రేస్, స్పోర్ట్, టూరింగ్ మరియు అర్బన్ అనే నాలుగు మోడ్స్ ఉంటాయి. ఇవన్నీ అత్యుత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

డెలివరీలు మరియు ప్రత్యర్థులు

భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త డుకాటీ మల్టీస్ట్రాడా వీ4 ఆర్ఎస్ డెలీవరీలు వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ బైకులను డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉన్నట్లు సమాచారం. ఈ బైక్ అడ్వెంచర్ టూరింగ్ విభాగంలో ‘బీఎండబ్ల్యూ ఎమ్ 1000 ఎక్స్ఆర్’కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

Don’t Miss: నాగార్జున వాడే కార్లు చూస్తే మతి పోవాల్సిందే!.. ఒక్కొక్కటి ఎన్ని కోట్లో తెలుసా?

ఖరీదైన బైకులకు మార్కెట్లో డిమాండ్ ఉందా?

నిజానికి చాలామంది రోజువారీ వినియోగానికి తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ అందించే బైకులను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. కానీ కొందరు మాత్రం (రైడింగ్ చేయడానికి ఇష్టపడేవారు) ఇలాంటి ఖరీదైన మరియు అడ్వెంచర్ బైకులు కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. ఈ బైక్ ధర కూడా చాలా ఎక్కువ కాబట్టి కొంతమంది మాత్రమే (సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు) కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ఇలాంటి బైకులకు డిమాండ్ తక్కువనే తెలుస్తుంది.

నాగార్జున వాడే కార్లు చూస్తే మతి పోవాల్సిందే!.. ఒక్కొక్కటి ఎన్ని కోట్లో తెలుసా?

0

Nagarjuna Akkineni Expensive Car Collection: తెలుగు సినీ పరిశ్రమలోని అగ్రగణ్యులు జాబితాలో ఒకరైన ‘అక్కినేని నాగార్జున’ (Akkineni Nagarjuna) గురించి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా అందరికి తెలుసు. అటు రొమాంటిక్ చిత్రాల్లో, యాక్షన్ చిత్రాల్లో ఎంతోమంది యువకుల మనసుదోచిన టాలీవుడ్ మన్మధుడు అన్నమయ్య, శ్రీరామదాసు, ఓం నమోవెంకటేశాయ వంటి భక్తి చిత్రాల్లో నటించి పెద్దవారు, ముసలివాళ్ల మనసును కూడా దోచేశాడు. టాలీవుడ్ కింగ్ అని పిలువబడే మన సోగ్గాడు ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఈ రోజు అక్కినేని నాగార్జున పుట్టిన రోజు. ఈ సందర్భంగా నాగ్ ఉపయోగించే కార్లు ఏవి? వాటి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడా తెలుసుకుందాం..

చాలామంది సెలబిట్రీల మాదిరిగానే అక్కినేని నాగార్జునకు ఖరీదైన కార్లను ఉపయోగించడం అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఈయన గ్యారేజిలో బీఎండబ్ల్యూ, ఆడి, టయోటా, నిస్సాన్, రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ వంటి బ్రాండ్ కార్లను కలిగి ఉన్నారు.

బీఎండబ్ల్యూ 7 సిరీస్ (BMW 7 Series)

కింగ్ నాగార్జున ఉపయోగించే కార్లలో బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 7 సిరీస్ (750Li xDrive M Sport) కూడా ఒకటి. దీని ధర రూ. 1.82 కోట్ల నుంచి రూ. 1.85 కోట్ల (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉంటుంది. ఈ కారును నాగ్ తన 57వ పుట్టిన రోజు సందర్భంగా కొనుగోలు చేశారు. ఇది బ్లూ కలర్ ఆప్షన్లో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది.

బీఎండబ్ల్యూ 7 సిరీస్ 4.4 లీటర్ టర్బో ఛార్జ్డ్ వీ8 పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. రియర్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు మంచి డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. పనితీరు పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ కారులో ఏసీ వెంట్స్, సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మొదలైనవి ఉన్నాయి.

ఆడి ఏ7 (Audi A7)

నాగార్జున బీఎండబ్ల్యూ కారు కొనడానికి ముందే ఆడి ఏ7 కారును కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ కారు ప్రారంభ ధర రూ. 90.50 లక్షలు. ఇది 2967 సీసీ ఇంజిన్ కలిగి 241.4 బ్రేక్ హార్స్ పవర్ (BHP) మరియు 500 న్యూటన్ మీటర్ (NM) టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ ఎస్ ట్రానిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. కాబట్టి ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.

బీఎండబ్ల్యూ ఎం6 (BMW M6)

అక్కినేని నాగార్జున గ్యారేజిలోని మరో బీఎండబ్ల్యూ కారు ఎం6. ఈ కారు ప్రారంభ ధర దేశీయ విఫణిలో రూ. 1.76 కోట్ల నుంచి రూ. 1.85 కోట్ల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. కానీ నాగరాజును కారు ఏ ఇంజిన్ కలిగి ఉందనేది తెలియడం లేదు. అయితే ఇందులోని 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 258 పీఎస్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

డీజిల్ ఇంజిన్ (2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్) 190 పీఎస్ పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇక డిజైన్ మరియు ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పనితీరు కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది.

టయోటా వెల్‌ఫైర్ (Toyota Vellfire)

చాలామంది రాజకీయ నాయకులకు, పారిశ్రామిక వేత్తలకు ఇష్టమైన కార్లలో టయోటా యొక్క వెల్‌ఫైర్ కూడా ఒకటి. ఈ కారు కూడా నాగార్జున గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 1.22 కోట్ల నుంచి రూ. 1.32 కోట్ల (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉంది. ఈ కారు విశాలమైన క్యాబిన్ కలిగి ఉంటుంది. ఈ కారణంగానే చాలామంది ఈ కారును కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.

టయోటా వెల్‌ఫైర్ కారు 2.5 లీటర్ పెట్రోల్ – హైబ్రిడ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 180 పీఎస్ పవర్, 235 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ సీవీటీ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ పొందుతుంది. మొత్తం మీద ఇది వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

నిస్సాన్ జీటీ-ఆర్ (Nissan GT-R)

అత్యంత వేగవంతమైన కార్లలో ఒకటిగా చెప్పబడే నిస్సాన్ కంపెనీకి చెందిన జీటీ-ఆర్ కూడా నాగార్జున ఉపయోగించే కార్లలో ఒకటి. ఈ కారు కొనుగోలు చేయడానికి నాగ్ సుమారు రూ. 2 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. నిస్సాన్ జీటీ-ఆర్ 3798 సీసీ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కలిగిన ఈ కారు 4 సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంది. కాబట్టి ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు.

రేంజ్ రోవర్ వోగ్ (Range Rover Vogue)

చాలామంది గ్యారేజిలో కనిపించే కార్ బ్రాండ్ రేంజ్ రోవర్. ఈ కంపెనీకి చెందిన కార్ల ధరలు ఎక్కువైనా సెలబ్రిటీలు మాత్రం ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. నాగార్జున దాదాపు రూ. 2 కోట్ల ఖరీదైన రేంజ్ రోవర్ వోగ్ కలిగి ఉన్నారు. విలాసవంతమైన ఈ లగ్జరీ కారు 3.0 లీటర్ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 4000 rpm వద్ద 296 Bhp పవర్ ,మరియు 1500 rpm వద్ద 650 Nm టార్క్ అందిస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్450 (Mercedes Benz S450)

బెంజ్ కంపెనీకి చెందిన ఎస్450 మోడల్ అక్కినేని నాగార్జున గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 2.2 కోట్లు వరకు ఉంటుంది. చూడగానే ఆకర్షించబడే డిజైన్, వాహన వినియోగదారులకు అవసరమైన లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు 2999 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 5500 నుంచి 6100 rpm వద్ద 362.07 Bhp పవర్ మరియు 1600 నుంచి 4500 rpm వద్ద 500 Nm టార్క్ విడుదల చేస్తుంది. ఇంజిన్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ పొందుతుంది.

Don’t Miss: సమంత ఎలాంటి కార్లు ఉపయోగిస్తుందో తెలుసా?.. ఒక్కక్కటి ఇంత రేటా..

పైన చెప్పిన కార్లు మాత్రమే కాకుండా.. నాగార్జున గత కొన్ని రోజులకు ముందు సౌత్ కొరియా బ్రాండ్ అయిన కియా మోటార్స్ (Kia Motors) యొక్క ఎలక్ట్రిక్ కారు ఈవీ6 కూడా కొనుగోలు చేశారు. ఈ కారు ప్రారంభ ధర రూ. 60.95 లక్షలు. ఆధునిక డిజైన్ కలిగిన ఈ కారు, భారతదేశంలో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్ల జాబిట్లో ఒకటిగా ఉంది. ఇందులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి.

ఇలా చేస్తే కొత్త కారు కొనుగోలుపై రూ.25000 డిస్కౌంట్!.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన

0

Scrap Your Vehicle and Get Rs.25000 Discount On New Car: ఏ వస్తువుకైనా ఓ నిర్దిష్ట వయసు ఉంటుంది. అంటే దాన్ని కొన్ని సంవత్సరాలు మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఆ తరువాత అది పనికిరాని వస్తువే!. ఒకవేళా ఉపయోగిస్తే దానివల్ల సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయం దేనికి వర్తించినా? వర్తించకపోయినా? వాహనాల విషయంలో మాత్రం వర్తిస్తుంది. ఎందుకంటే ఒక వాహనాన్ని 10 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు ఉపయోగించుకోవచ్చని కంపెనీలు సైతం చెబుతున్నాయి. ఆ తరువాత వాహనాల్లో సమస్యలు ఎదురవుతాయి. అవి ఇంజిన్లో సమస్యలు కావొచ్చు.. లేదా ఇతర సమస్యలు కావచ్చు. ఇలాంటి సమయంలో వాటిని రిపేర్ చేసుకోవడానికే లెక్కకు మించిన డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. అంతే కాకుండా వీటివల్ల కాలుష్యం కూడా పెరుగుతుందని మోటార్ వెహికల్ చట్టం చెబుతోంది.

దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర రవాణా శాఖ గత కొంతకాలంగా.. నిర్దిష్ట వయసుదాటిని వాహనాలను స్క్రాపేజ్ చేయాలని చెబుతూనే ఉంది. కొంతమంది ఇప్పటికి కూడా చాలా వయసైపోయిన వాహనాలను ఉపయోగిస్తున్నారు. ప్రజలు తమ పాతవాహనాలను స్క్రాపేజికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఓ మంచి ఆలోచన చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..

కొత్త కారు కొనుగోలుపై రూ.25,000 తగ్గింపు!

భారత ప్రభుత్వం పాత కార్ల సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే.. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి ‘నితిన్ గడ్కరీ’ (Nitin Gadkari) దేశంలోని పలు కార్ల తయారీ సంస్థల సీఈఓలు మరియు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం తరువాత ఆటోమేకర్లు వాహనాల ఎక్స్-షోరూమ్ ధారాలపైన రూ. 20000 నుంచి రూ. 25000 తగ్గింపు అందిస్తామని ప్రకటించారు. అయితే దీనికి కస్టమర్ చేయాల్సిన పని ఏమిటంటే? చెల్లుబాటు అయ్యే స్క్రాపేజ్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది.

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్‌తో జరిగిన సమావేశానికి సంబంధించిన ఓ చిన్న వీడియో క్లిప్ ‘గడ్కరీ’ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ఇందులో గడ్కరీ కార్ల తయారీ సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమవ్వడం చూడవచ్చు. వీడియో షేర్ చేస్తూ.. నా సిఫార్సుకు ప్రతిస్పందనగా, పాత వెహికల్ స్క్రాప్‌ తరువాత.. కొత్త వాహనాల కొనుగోలు చేసేవారికి వాహన తయారీదారులు తగ్గింపులు అందిస్తామని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. ఇది సురక్షితమైన వాహనాల సంఖ్యను గణనీయంగా పెంచుతుందని ఆయన అన్నారు.

సమావేశానికి హాజరైన కంపెనీలు

నితిన్ గడ్కరీ సమావేశానికి హాజరనైనా సంస్థల జాబితాలో మారుతీ సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్ మోటార్స్, కియా మోటార్స్, టయోటా కిర్లోస్కర్, హోండా కార్స్, నిస్సాన్ ఇండియన్, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్, రెనాల్ట్ మరియు జేఎస్డబ్ల్యు మొదలైన కంపెనీలు ఉన్నాయి. ఈ సమావేశంలో ప్రధానంగా పాతవాహనాలను స్వచ్ఛందంగా రద్దు చేయడానికి కావలసిన వ్యూహాల గురించి చర్చించుకున్నారు.

సమావేశం సారాంశం

నితిన్ గడ్కరీ సమావేశంలో.. పాత మరియు కాలుష్యం కలిగించే వాహనాలను దశలవారీగా తొలగించి, వాటి స్థానంలో కొత్త వాహనాలను తీసుకురావాలని చర్చించారు. దీనికోసం ఇప్పటికే దేశంలో ఇప్పటికే అనేక రిజిస్టర్డ్ స్క్రాపేజ్ సెంటర్‌లను ఏర్పాటు చేసింది. అవసరమైతే మరిన్ని సెంటర్‌లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని గడ్కరీ తెలిపారు.

డిస్కౌంట్ వివరాలు

పాతవాహనాలను స్క్రాప్ చేసిన తరువాత కంపెనీలు డిస్కౌంట్స్ అందిస్తాయి. దీనికి కంపెనీలు కూడా సుముఖత వ్యక్తం చేశాయి. కియా మోటార్స్, టయోటా, హోండా, నిస్సాన్ ఇండియా, జేఎస్డబ్ల్యు, స్కోడా ఫోక్స్‌వ్యాగన్, రెనాల్ట్ కంపెనీలు కొత్త కారు కొనుగోలుపైన ఎక్స్ షోరూమ్ ధరలో 1.5 శాతం లేదా రూ.20,000 తగ్గింపు అందించడానికి ఒప్పుకున్నాయి.

మెర్సిడెస్ బెంజ్ కంపెనీ రూ. 25,000 తగ్గింపు ప్రకటించింది. అదే సమయంలో వాణిజ్య కార్గో వాహనాల స్క్రాప్ తరువాత.. టాటా మోటార్స్, వోల్వో, అశోక్ లేలాండ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఫోర్స్ మోటార్స్, ఇసుజు వంటి కంపెనీకు 1.5 శాతం నుంచి 3 శాతం వరకు డిస్కౌంట్ అందించడానికి సుముఖత చూపాయి.

స్క్రాపింగ్ యొక్క అదనపు ప్రయోజనాలు

వాహనదారుడు తన పాత వాహనాలను స్క్రాప్ చేస్తే కొత్త కారు కొనుగోలుపైన డిస్కౌంట్ మాత్రమే కాకుండా.. స్క్రాప్ విలువకు తగ్గ అమౌంట్ కూడా పొందుతారు. అంటే తమ పాతవాహనాన్ని స్క్రాపేజికి పంపితే అక్కడ కొంత డబ్బు రావడమే కాకుండా.. స్క్రాపేజ్ సర్టిఫికెట్ ద్వారా కొత్త కారు కొనే సమయంలో డిస్కౌంట్ కూడా పొందుతాడు.

పాత కారును ఉంచుకోవడం లేదా వినియోగించడం మంచిదేనా?

ప్రభుత్వం ప్రకారం, కారు వయసును బట్టి పాత కార్లను రద్దు చేస్తున్నాయి. ఇది వంద శాతం సరైనదే అని చెప్పలేము. ఎందుకంటే వాహనం సరైన స్థితిలో ఉండి, ఇంజిన్ కూడా సరిగ్గా పనిచేస్తున్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవచ్చు.

ఇంజిన్ బాగా పనిచేస్తున్నప్పుడు.. దాని వల్ల పెద్ద స్థాయిలో కాలుష్యం జరగదు. కాబట్టి ఇది ప్రజల ఆర్థిక వ్యవస్థకు అనుకూలంగా ఉంటుంది. ఎలా అంటే?.. పాత కారును వద్దనుకుని, కొత్త కారు కొనాలంటే లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది అందరికి సాధ్యంకాకపోవచ్చు. అలాంటి వ్యక్తులకు పాత కారు వినియోగం ఆర్థికంగా నిలబడటానికి ఉపయోగపడుతుంది.

Don’t Miss: వాహనదారులకు అలెర్ట్.. ఆ ఒక్క సర్టిఫికెట్ లేకుంటే రూ.10 వేలు ఫైన్!

అయితే పాత కార్లు దాదాపు జీర్ణస్థితిలో ఉంటాయి. అలాంటి కార్లు పర్యావరణంలో కాలుష్య తీవ్రతను గణనీయంగా పెంచుతుంది. అంతే కాకుండా కారులోని పరికరాలు పాడైపోయి ఉండటం వల్ల అనుకోని సందర్భాల్లో ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పాత వాహనాలను రద్దు చేస్తోంది.

బీవైడీ కారు కొన్న ఫస్ట్ ఇండియన్ సింగర్ ‘జస్లీన్’: ఫోటోలు చూశారా?

0

Singer Jasleen Royal Buys BYD Atto3 Electric Car: సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు తమకు నచ్చిన కార్లను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తూనే ఉంటారు. ఇందులో భాగంగానే ప్రముఖ సింగర్ ‘జస్లీన్ రాయల్’ (Jasleen Royal) చైనా బ్రాండ్ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.

జస్లీన్ రాయల్ కొత్త కారు

సింగర్ జస్లీన్ కొనుగోలు చేసిన కొత్త కారు బీవైడీ కంపెనీకి చెందిన ‘ఆట్టో3 ఈవీ’ (Atto3 EV) అని తెలుస్తోంది. దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందిన ఈ కారు చాలామంది కొనుగోలు చేసినప్పటికీ.. సెలబ్రిటీలు కొనుగోలు చేయలేదు. కాబట్టి బీవైడీ ఆట్టో3 ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేసిన మొదటి సెలబ్రిటీగా జస్లీన్ రాయల్ రికార్డ్ క్రియేట్ చేసింది.

జస్లీన్ కారు కొనుగోలు చేయడానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. బీవైడీ ఆట్టో3 అనేది నా ప్రయాణానికి సంగీతం, ఇది నన్ను నడిపిస్తుంది అని వెల్లడించింది. అంతే కాకుండా బీవైడీ కుటుంబంలో భాగమైనందుకు మరియు బీవైడీ ఆట్టో3 కారుకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది.

బీవైడీ ఆట్టో3 (BYD Atto3)

భారతదేశంలో విక్రయించబడుతున్న బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్స్) కంపెనీ యొక్క ఆట్టో3 ప్రారంభం నుంచి మంచి అమ్మకాలను పొందుతోంది. ప్రస్తుతం కంపెనీ ఇండియన్ మార్కెట్లో మూడు కార్లను విక్రయిస్తోంది. అవి ఈవీ6, ఆట్టో3 మరియు సీల్. ఈ మూడు కార్లు కొత్త డిజైన్ కలిగి ఉండటమే కాకుండా, ఆధునిక ఫీచర్స్ పొందుతాయి.

జస్లీన్ రాయల్ కొనుగోలు చేసిన బీవైడీ ఆట్టో3 ఎలక్ట్రిక్ కారు నలుపు రంగులో ఉంది. ఇది చాలా ప్రీమియం డిజైన్ కలిగి ఉంది. ఈ కారులో 12.8 ఇంచెస్ రొటేటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ADAS) వంటి వాటితో పాటు.. లెథెరెట్ అపోల్స్ట్రే మరియు ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

బీవైడీ ఆట్టో3 ఎలక్ట్రిక్ కారు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ ఏడాది కంపెనీ బేస్ వేరియంట్ (డైనమిక్) లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 24.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు 49.92 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ మరియు 60.48 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇవి రెండూ వరుసగా 468 కిమీ రేంజ్ మరియు 521 కిమీ రేంజ్ అందిస్తాయి.

ఛార్జింగ్ విషయానికి వస్తే.. బీవైడీ ఆట్టో3 ఎలక్ట్రిక్ కారు 80 kW ఛార్జర్ ద్వారా 50 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకుంటుంది. సాధారణ ఛార్జర్ ద్వారా ఈ కారు 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి పట్టే సమయం 9.5 గంటల నుంచి 10 గంటలు అని తెలుస్తోంది. మొత్తం మీద బీవైడీ ఆట్టో3 కారు మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉత్తమ సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుందని మరియు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుందని చాలామంది ఈ కారును ఇష్టపడి కొనుగోలు చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

ఎవరీ జస్లీన్ రాయల్?

నిజానికి జస్లీన్ రాయల్ పూర్తి పేరు జస్లీన్ కౌర్ రాయల్. ఈమె ఒక ఇండియన్ సింగర్ మరియు పాటల రచయిత్రి కూడా. జస్లీన్ పంజాబ్, హిందీ, బెంగాలీ, గుజరాతీ మరియు ఇంగ్లీష్ భాషల్లో పాటలు పాడింది. కాబట్టి బహుశా జస్లీన్ పేరు తెలుగు ప్రజలకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఈమె పాపులర్ సింగర్. ఈమె ఉత్తమ సంగీత దర్శకురాలిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకున్న మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది.

Don’t Miss: ఆరు నెలల్లో 1.26 లక్షల మంది కొనేశారు!.. టాటా కారంటే ఆ మాత్రం ఉంటది

సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జస్లీన్ రాయల్ ఎట్టకేలకు ఓ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసింది. కొత్త కారు కొనుగోలు చేసిన ఈమెకు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. సెలబ్రిటీలు ఖరీదైన కార్లను కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలామంది ప్రముఖులు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేశారు. ఈ జాబితాలోకి జస్లీన్ కూడా ఇప్పుడు చేరింది.

ఆరు నెలల్లో 1.26 లక్షల మంది కొనేశారు!.. టాటా కారంటే ఆ మాత్రం ఉంటది

0

Tata Punch is Best Selling Car in India From January to July 2024: భారతదేశంలో ఎక్కువమందికి నమ్మికైన కార్ బ్రాండ్ ‘టాటా మోటార్స్’ (Tata Motors). ఎందుకంటే ఈ కంపెనీ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా తన బ్రాండ్ కార్లలో అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ కూడా అందిస్తుంది. టాటా కార్ల వినియోగదారులు పెద్ద పెద్ద ప్రమాదాల్లో కూడా ప్రాణాలతో బయటపడిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. దీంతో బ్రాండ్ మీద ప్రజలకు నమ్మకం విపరీతంగా పెరిగింది.

టాటా మోటార్స్ యొక్క సురక్షితమైన కార్లలో ఒకటి ‘పంచ్’ (Punch). ఈ మైక్రో ఎస్‍యూవీ క్రాష్ టెస్టులో ఏకంగా 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది. దీంతో ఈ కారు ప్రారంభం నుంచి గొప్ప అమ్మకాలను పొందుతూ ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది.

మొదటి ఆరు నెలల్లో 1.26 లక్షల యూనిట్స్

టాటా మోటార్స్ యొక్క పంచ్ ఎస్‍యూవీ 2024 జనవరి నుంచి జులై వరకు.. అంటే మొత్తం ఆరు నెలల కాలంలో 1.26 లక్షల అమ్మకాలను పొందగలిగింది. దీంతో అమ్మకాల పరంగా అత్యధికంగా అమ్ముడైన కారుగా టాటా పంచ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ ఏడాది ప్రారంభం నుంచి టాటా పంచ్ సేల్స్ పరిశీలిస్తే.. 2024 జనవరిలో 17978 యూనిట్లు, ఫిబ్రవరిలో 18,438 యూనిట్లు, మార్చిలో 17,547 యూనిట్లు, ఏప్రిల్ నెలలో 19,158 యూనిట్లు, మే నెలలో 18949 యూనిట్లు, జూన్ మాసంలో 18,238 యూనిట్లు మరియు జులైలో 16,121 యూనిట్లుగా తెలుస్తోంది.

టాటా పంచ్ తరువాత ఎక్కువ అమ్మకాలు పొందిన కారుగా మారుతి వ్యాగన్ ఆర్.. ఆ తరువాత హ్యుందాయ్ క్రెటా, మారుతి బ్రెజ్జా నిలిచాయి. టాటా పంచ్ ఎక్కువ అమ్మకాలు పొందటానికి ప్రధాన కారణం ఇది పెట్రోల్, ఎలక్ట్రిక్ మరియు సీఎన్‌జీ రూపంలో అందుబాటులో ఉండటమే అని తెలుస్తోంది. అన్ని విభాగాల్లోనూ అందుబాటులో ఉండటం, అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉండటంతో ఈ కారు గొప్ప అమ్మకాలను పొందగలిగింది.

మూడు విభాగాల్లో పంచ్

టాటా పంచ్ ప్రారంభంలో కేవలం పెట్రోల్ కారుగా మాత్రమే భారతీయ మార్కెట్లో అడుగుపెట్టింది. ఇది అతి తక్కువ కాలంలోనే గొప్ప అమ్మకాలను పొందగలిగింది. అయితే కస్టమర్లు ఈ కారు ఎలక్ట్రిక్ మరియు సీఎన్‌జీ రూపంలో ఉంటే బాగుంటుందని యోచించారు. దీనిని గమనించిన టాటా మోటార్స్ వెంటనే ఈ కారును ఎలక్ట్రిక్, సీఎన్‌జీ విభాగాల్లో కూడా లాంచ్ చేసింది. ఇవి కూడా చాలామంది కస్టమర్లను ఆకర్శించడంలో విజయం సాధించాయి.

చూడటానికి కొంత చిన్నగా ఉన్నప్పటికీ.. టాటా పంచ్ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందింది. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క అభిరుచికి తగిన విధంగా ఉండటం వల్ల చాలామంది ఎగబడి మరీ కొనుగోలు చేశారు. ఇప్పటికి కూడా ఈ కారుకు దేశీయ విఫణిలో డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు అంటే అది ఏ మాత్రం అతిశయోక్తి కాదు.

రూ. 6.13 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు మల్టిపుల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయిత్ చూడటానికి అన్ని వేరియంట్లు ఒకే మాదిరిగా ఉన్నప్పటికీ.. ఫీచర్ల విషయంలో మాత్రం కొంత తేడాని గమనించవచ్చు. ఈ కారు సింగిల్ మరియు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

టాటా పంచ్ కారులో తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం సేఫ్టీ ఫీచర్స్. ఎందుకంటే ఇది అత్యంత సురక్షితమైన కారుగా పరిగణించబడింది. ఇందులో మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటివన్నీ ఉన్నాయి. ఈ కారణంగానే ఈ కారు గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టులో ఫైవ్ స్టార్ రేటింగ్ పొందింది.

Don’t Miss: వాహనదారులకు అలెర్ట్.. ఆ ఒక్క సర్టిఫికెట్ లేకుంటే రూ.10 వేలు ఫైన్!

దేశీయ మార్కెట్లో టాటా పంచ్ ఈవీ ధరలు రూ. 10.99 లక్షల నుంచి రూ. 15.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారు 25 కిలోవాట్ మరియు 35 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. ఇవి రెండూ వరుసగా 315 కిమీ మరియు 421 కిమీ రేంజ్ అందిస్తాయి. ఈ కారు ఎకో, సిటీ మరియు స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ పొందుతుంది. ఈ కారు 7.2 kW ఏసీ హోమ్ వాల్ బాక్స్ ఛార్జర్ ద్వారా 5 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోగలదు. డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 56 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకుంటుంది.

వాహనదారులకు అలెర్ట్.. ఆ ఒక్క సర్టిఫికెట్ లేకుంటే రూ.10 వేలు ఫైన్!

0

Rs.10000 Fine For No PUC Certificate: దేశంలో వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో వాతావరణంలో కాలుష్య తీవ్రత కూడా ఎక్కువవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నియమాలను అతిక్రమించిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే బీహార్ రాష్ట్రం ఓ కొత్త రూల్ ప్రవేశపెట్టింది, అతిక్రమిస్తే రూ. 10000 జరిమానా అంటూ ప్రకటించింది. దీంతో వాహనదారులు గుండెల్లో గుబులు పుట్టింది.

రూ.10,000 జరిమాన

బీహార్ రాష్ట్ర ప్రభుత్వం పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్ లేకుంటే.. రూ. 10వేలు జరిమానా అంటూ వెల్లడించింది. కాలుష్య నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాబట్టి వాహనదారులు తప్పకుండా పీయూసీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. లేకుంటే ఖచ్చితంగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ జరిమానా కూడా మీరు టోల్ ప్లాజాల గుండా వెళ్ళేటప్పుడు విధించబడుతుంది.

టోల్ ప్లాజాల గుండా వెళ్ళేటప్పుడు ఎలా విధిస్తారు?

వాహనాలకు జరిమానా విధించడం అంటే? సాధారణంగా ట్రాఫిక్ సింగ్నెల్స్ వద్ద ట్రాఫిక్ పోలీసులు విధిస్తారు. అయితే బీహార్ రాష్ట్రం మాత్రం పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా వాహనదారుడు పట్టుబడితే.. టోల్ గేట్ వద్ద జరిమానా విధించనున్నట్లు సమాచారం. దీనికి ప్రత్యేకంగా ‘ఈ-డిటెక్షన్ సిస్టం’ రూపొందించారు. ఈ సిస్టం ఇప్పుడు బీహార్ రాష్ట్రంలోని 32 టోల్ ప్లాజాలలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఫాస్ట్‌ట్యాగ్ టెక్నాలజీతో అనుసంధానించబడుతుంది.

టోల్ బూత్ గుండా వేళ్ళ వాహనం పూర్తిగా తనిఖీ చేయబడుతుంది. వాహనం టోల్ గేట్ దాటిన తరువాత ఈ-డిటెక్షన్ సిస్టం వాహనానికి సంబంధించిన సమాచారాన్ని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (NIC) వాహన పోర్టల్‌తో క్రాస్ చెక్ చేస్తుంది. దీంతో వాహనానికి చెల్లుబాటు అయ్యే పీయూసీ సర్టిఫికెట్ ఉందా? లేదా? అనే విషయాన్ని మాత్రమే కాకుండా.. ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ మరియు పర్మిట్ వంటి వాటిని చెక్ చేస్తుంది.

సరైన డాక్యుమెంట్స్ లేదని నిర్దారించిన తరువాత అక్కడికక్కడే ఆటోమాటిక్ ఈ-చలాన్ రూపొందిస్తుంది. దానిని వెంటనే వాహనదారుని యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు పంపుతుంది. పీయూసీ సర్టిఫికెట్ లేకుంటే అలాంటివారికి రూ. 10000 జరిమానా విధించబడుతుంది. ఈ జరిమానా సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్ కింద విధిస్తారు. ఇది కొత్త, పాత వాహనాలకు వర్తిస్తుంది.

వాహనానికి పొల్యూషన్ సర్టిఫికెట్ చాలా అవసరం. కానీ కొందరు దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలంటి వారిని సరైనదారిలో పెట్టడానికే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు తప్పకుండా ప్రతి ఒక్క వాహనదారుడు పీయూసీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అంతే కాకుండా ఇప్పుడు ఈ-డిటెక్షన్ సిస్టం ఫిట్‌నెస్ సర్టిఫికెట్ (FC) కూడా తనిఖీ చేస్తుంది. ఇది లేకుంటే కూడా జరిమానా చెల్లించాల్సిందే.

ఇతర జరిమానాలు

మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం.. ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే రూ. 2000 జరిమానా మరియు మూడు నెలలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా వెహికల్ డ్రైవ్ చేస్తే.. రూ. 2000 నుంచి రూ. 5000 వరకు (మొదటి నేరానికి) జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

ఒకసారి జరిమానా విధించిన వారు మళ్ళీ అవసరమైన డాక్యుమెంట్స్ లేకుండా పట్టుబడితే.. రూ. 5000 నుంచి రూ. 10000 వరకు జరిమానా విధించబడుతుంది. జైలు శిక్ష కూడా పడుతుంది. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ గడువు ముగిసిన ప్రతి రోజుకు రూ. 50 జరిమానా విధించబడుతుందని తెలుస్తోంది.

రెండు రోజుల్లో 5000 కంటే ఎక్కువ చలాన్స్

బీహార్ ప్రభుత్వం కొత్త రూల్స్ ప్రవేశపెట్టే క్రమంలో భాగంగానే రెండు రోజులు ట్రయల్ రన్స్ చేపట్టి 5000 కంటే ఎక్కువ చలాన్లను జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా వాహనదారులు అప్రమత్తమయ్యారు. దీంతో రాబోయే రోజుల్లో సరైన డాక్యుమెంట్స్ లేకుండా తిరిగే వాహనాల సంఖ్య బాగా తగ్గుతుందని అర్థమవుతోంది.

Don’t Miss: మాయం కానున్న టోల్ ప్లాజాలు!.. అంతా GNSS సిస్టం: ఇదెలా పనిచేస్తుందో తెలుసా?

ఈ-డిటెక్షన్ సిస్టం విస్తరణ

రాష్ట్రంలోని వాహనదారులు తప్పనిసరిగా అన్ని సరైన డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి అనే లక్ష్యంతో బీహార్ గవర్నమెంట్ ఈ కొత్త సిస్టం తీసుకురావడం జరిగింది. టోల్ ప్లాజాల వద్ద ఈ సిస్టం సక్సెస్ కావడంతో రాష్ట్రం మొత్తం ఈ సిస్టం అమలుచేయడానికి సన్నద్ధమైంది. దీంతో పాట్నా, ముజఫర్‌పూర్, భాగల్‌పూర్ వంటి ప్రాంతాల్లో కూడా ఈ కొత్త సిస్టం అమలు చేయడానికి ముందడుగు వేస్తోంది. ప్రస్తుతం ఈ నగరాల్లో హెల్మెట్ ధరించకపోవడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్ లేదా ఓవర్ స్పీడ్ వంటి వాటికి ట్రాఫిక్ చలాన్ విధించబడుతోంది. అయితే ఈ-డిటెక్షన్ సిస్టం అమలులోకి వచ్చిన తరువాత పీయూసీ, ఇన్సూరెన్స్ లేదా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని వాహనాలకు కూడా భారీ జరిమానా విధించనుంది.

కొత్త కొత్తగా వచ్చేస్తున్నవి.. లాంచ్‍కు సిద్దమవుతున్న కార్లు ఇవే!

0

Upcoming Cars in India By Diwali: పండుగ సీజన్ వచ్చేస్తోంది.. కొత్త వాహనాలను లాంచ్ చేయడానికి కంపెనీలు కూడా సర్వత్రా సిద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ మాత్రమే కాకుండా.. హ్యుందాయ్ మోటార్స్, కియా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్ మరియు ఆడి కంపెనీలు ఉన్నాయి. వచ్చే దీపావళి లోపల భారతీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కార్లు ఏవి? వాటి వివరాలు ఇక్కడ పరిశీలిద్దాం..

టాటా నెక్సాన్ సీఎన్‌జీ (Tata Nexon CNG)

వాహన విభాగంలో అగ్రగామిగా.. ఫ్యూయెల్, ఎలక్ట్రిక్ రంగంలో కూడా నేను సైతం అంటూ దూసుకెళ్తున్న టాటా నెక్సాన్ త్వరలో సీఎన్‌జీ రూపంలో కూడా లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే పలుమార్లు కనిపించిన ఈ కారు దీపావళి లోపల మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. చూడటానికి దాని మునుపటి మోడల్స్ డిజైన్ కలిగిన ఈ కారు డ్యూయెల్ సిలిండర్ సీఎన్‌జీ కిట్ పొందుతుంది. ఇది ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ మాత్రమే పొందుతుంది. దీని ధర పెట్రోల్ మోడల్ కంటే కూడా కొంత ఎక్కువగా ఉండొచ్చని సమాచారం. అయితే ఇది పెట్రోల్ మోడల్ కంటే కూడా ఎక్కువ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

టాటా కర్వ్ (Tata Curvv)

ఇటీవల ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అయిన టాటా కర్వ్.. పెట్రోల్ మరియు డీజిల్ కార్లను కూడా విడుదల చేయనుంది. కంపెనీ ఇప్పటికే ఈ కార్లను ఆవిష్కరించినప్పటికీ.. ధరలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే సంస్థ టాటా కర్వ్ పెట్రోల్ మరియు డీజిల్ కార్ల ధరలను సెప్టెంబర్ 2న ప్రకటించే అవకాసం ఉంది. ఈ కొత్త కారు ధరలు రూ.10 లక్షల నుంచి రూ. 22 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

టాటా కర్వ్ మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందనున్నట్లు సమాచారం. ఇందులో రెండు 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్స్, ఒకటి 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్. ఇవన్నీ 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ గేర్ ఆప్షన్స్ పొందుతాయి. కాగా కంపెనీ ఈ కారును CNG రూపంలో కూడా లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ (Hyundai Alcazar Facelift)

ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో అత్యుత్తమ అమ్మకాలతో ముందుకు సాగుతున్న హ్యుందాయ్ అల్కాజార్ త్వరలో ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఈ కారు ధరలను సెప్టెంబర్ 5న ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఫేస్‌లిఫ్ట్ కోడం సంస్థ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది.

హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ క్రెటాలోని కొన్ని డిజైన్ ఎలిమెంట్స్ పొందనున్నట్లు సమాచారం. ఈ కారు హెచ్ షేప్ డీఆర్ఎల్స్, హెచ్ షేప్ టెయిల్ లైట్స్ మరియు లైట్ బార్.. 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కూడా పొందుతుంది. ఇందులో ఆధునిక ఏడీఏఎస్ టెక్నాలజీ కూడా ఉండనున్నట్లు సమాచారం. ఈ కారు 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందే అవకాశం ఉంది.

ఎంజీ విండ్సర్ (MG Windsor)

దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన ఎంజీ మోటార్స్ త్వరలో విండ్సర్ పేరుతో ఓ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసే అవకాశం ఉంది. కంపెనీ ఈ కారును సెప్టెంబర్ 11న ఆవిష్కరించనున్నట్లు సమాచారం. సుమారు 4.3 మీటర్స్ పొడవున్న ఈ కారు పెద్ద గ్లాస్‌హౌస్ పొందనుంది. ఇప్పటికి టెస్టింగ్ దశలో పలుమార్లు కనిపించిన ఈ కారు లేటెస్ట్ డిజైన్ పొందుతుందని తెలుస్తోంది.

ఎంజీ విండ్సర్ కారు ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ కలిగిన మినిమలిస్ట్ డ్యాష్‌బోర్డ్ పొందుతుందని తెలుస్తోంది. ఈ మోడల్ 37.9 కిలోవాట్ మరియు 50.6 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. ఇవి వరుసగా 360 కిమీ మరియు 460 కిమీ మైలేజ్ అందిస్తాయి. దీని ప్రారంభ ధర రూ. 20 లక్షల వరకు ఉండొచ్చు. ఇది టాటా నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంది.

కియా కార్నివాల్ (Kia Carnival)

2023 ఇండియా ఆటో ఎక్స్‌పోలో కనిపించిన నాల్గవ తరం కియా కార్నివాల్ గత ఏడాది చివర్లో ప్రపంచ మార్కెట్లో ప్రవేశించింది. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా పెద్దదిగా ఉంది. చూడటానికి ఆకర్షణీయంగా ఉండే ఈ కారు అద్భుతమైన ఇంటీరియర్ కూడా పొందుతుంది. ఈ కారు 7 సీటర్, 9 సీటర్ మరియు 11 సీటర్ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. అయితే భారతదేశంలో ఈ మూడు కాన్ఫిగరేషన్స్ అందుబాటులోకి వస్తాయా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 50 లక్షలు ఉంటుందని సమాచారం.

ఆడి క్యూ6 ఈ-ట్రాన్ (Audi Q6 E-Tron)

ఎలక్ట్రిక్ విభాగంలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్న ఆడి.. త్వరలోనే క్యూ6 ఈ-ట్రాన్ పేరుతో మరో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. సుమారు 4.7 మీటర్ల పొడవున్న ఈ కారు ధర రూ. 85 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రీమియం ప్లాట్‌ఫామ్ ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించబడి ఉంటుంది. రాబోయే దీపావళి నాటికి మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉందని సమాచారం.

మెర్సిడెస్ ఈ-క్లాస్ (Mercedes E-Class)

దీపావళి లోపల మార్కెట్లో అడుగుపెట్టే కార్ల జాబితాలో మెర్సిడెస్ బెంజ్ యొక్క ఈ క్లాస్ కూడా ఉంది. ఇది ఆరవ తరం లాంగ్ వీల్‌బేస్ ఈ-క్లాస్. దీని ధర రూ. 85 లక్షల వరకు ఉండొచ్చు. కంపెనీ ఈ కారును చకన్ ప్లాంట్‌లో తయారు చేసే అవకాశం ఉంది. బుకింగ్స్ వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కారు పెట్రోల్ మరియు డీజిన్ ఇంజిన్ ఆప్షన్స్ పొందే అవకాశం ఉంది.

కియా ఈవీ9 (Kia EV9)

కొత్త కార్లకు ఆదరణ భారీగా పెరుగుతున్న తరుణంలో కియా ఇండియా గొప్ప సన్నాహాలే సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే అప్డేటెడ్ కియా కార్నివాల్ మాత్రమే కాకుండా ఈవీ9 పేరుతో కూడా కారును లాంచ్ చేయనుంది. ఈ కారు మార్కెట్లో లాంచ్ అయిన తరువాత బీఎండబ్ల్యూ ఐఎక్స్, మెర్సిడెస్ ఈక్యూఈ మరియు ఆడి క్యూ8 ఈ-ట్రాన్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. అత్యద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు.. ఆధునిక కాలంలో వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుందని తెలుస్తోంది.

Don’t Miss: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఎలక్ట్రిక్ కారు ఇదే!.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?

మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్ (Mercedes Maybach EQS)

బెంజ్ కంపెనీ మేబ్యాచ్ ఈక్యూఎస్ పేరుతో కూడా ఓ కారును లాంచ్ చేయడానికి సిద్ధమైంది. దీనిని సెప్టెంబర్ 5న లాంచ్ చేసే అవకాశం ఉంది. డ్యూయెల్ మోటార్ సెటప్ కలిగిన ఈ కారు 108.4 కిలోవాట్ బ్యాటరీ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది సింగిల్ చార్జితో 600 కిమీ రేంజ్ అందిస్తుంది. అంతే కాకుండా 210 కిమీ గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ కారు 4.4 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 4 కోట్లు వరకు ఉండొచ్చని అంచనా.

చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఎలక్ట్రిక్ కారు ఇదే!.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?

0

Xiaomi SU7 Showcased in India: ఆటోమొబైల్ రంగంలో భారత్ దూసుకెళ్తోంది. ఈ తరుణంలో చాలా కంపెనీలు తమ వాహనాలను ఎలక్ట్రిక్ విభాగంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ చైనా మొబైల్ తయారీ కంపెనీ ‘షియోమీ’ (Xiaomi) కూడా చేరనుంది. ఇప్పటికే కంపెనీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించినప్పటికీ.. ఈ ఏడాది ప్రారంభంలో విక్రయానికి వచ్చింది. అయితే ఇండియన్ మార్కెట్లో ఈ కారు అమ్మకానికి రానున్నట్లు తెలుస్తోంది.

2021 మార్చిలో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అడుగుపెట్టిన చైనీస్ స్మార్ట్‌ఫోన్ షియోమీ.. భారతీయ తీరాలకు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త ‘షియోమీ ఎస్‌యూ7’ (Xiaomi SU7) ఎలక్ట్రిక్ డిజైన్, ఫీచర్స్, రేంజ్ మరియు ఇతరత్రా వివరాలను వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..

డిజైన్

దేశీయ విఫణిలో అడుగుపెట్టనున్న కొత్త షియోమీ ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ కారు చాలా అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఈ కారు డిజైన్ చేయడానికి కంపెనీ ప్రత్యేకించి బీఎండబ్ల్యూ డిజైనర్ ”లి టియాన్యువాన్”ను నియమించుకున్నారు. అంతే కాకుండా బీఎండబ్ల్యూ కనెక్షన్ మాజీ బీఎండబ్ల్యూ డిజైన్ హెడ్ ”క్రిస్ బ్యాంగిల్”ను కూడా నియమించుకుంది.

షియోమీ ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ సెడాన్ చూడగానే పోర్స్చే టేకాన్ మరియు టెస్లా మోడల్ ఎస్ మాదిరిగా అనిపిస్తుంది. కానీ తీక్షణంగా చూస్తే అది షియోమీ ఎస్‌యూ7 అని అర్థమవుతుంది. హెడ్‌లైట్ డిజైన్ మెక్‌లారెన్ 720ఎస్ మాదిరిగా ఉంటుంది. రియర్ గ్లాస్, అడ్జస్టబుల్ రియర్ స్పాయిలర్ అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇది 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరియు ఫ్రేమ్‌లెస్ డోర్స్ పొందుతుంది.

కలర్ ఆప్షన్స్

షియోమీ ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ కారు మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి మీటోర్ బ్లూ, రేడియంట్ పర్పుల్, బసాల్ట్ గ్రే, లావా ఆరెంజ్, పెర్ల్ వైట్ మరియు డైమండ్ బ్లాక్ కలర్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారు తన నచ్చిన కలర్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.

ఫీచర్స్

కొత్త షియోమీ ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ కారు యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని స్టీరింగ్ వీల్ హీటింగ్ ఫంక్షన్ పొందుతుంది. కారు స్విచ్ ఆన్ చేసినప్పుడు 7.1 ఇంచెస్ ప్లిప్ ఆఫ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ చాలా కొత్తగా ఉండటం వల్ల ఎంతగానో ఆకర్షిస్తుంది. ఫ్రంట్ సీట్లు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మరియు వెంటిలేటెడ్ అండ్ హీటింగ్ ఫంక్షన్ పొందుతుంది.

షియోమీ ఎస్‌యూ7 16.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ పొందుతుంది. ప్రస్తుతం ఇందులోని సమాచారం మొత్తం చైనా భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. అంటే ఇది ఇంకా భారతదేశంలోకి అడుగుపెట్టలేదు కాబట్టి కేవలం చైనా మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల చైనా భాష మాత్రమే చూపిస్తుంది. ఇండియాలో లాంచ్ అయిన తరువాత ఇంగ్లీష్ భాషలో సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈ కారులో ఏడీఏఎస్ (ADAS) టెక్నాలజీ ఉంటుందని సమాచారం. ఇది వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. ఇందులో మల్టిపుల్ కెమెరాలు సెటప్ కూడా ఉంటుంది.

బ్యాటరీ మరియు రేంజ్

షియోమీ ఎలక్ట్రిక్ కారులో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం బ్యాటరీ మరియు రేంజ్. ఈ కారు మల్టిపుల్ మోటార్ కాన్ఫిగరేషన్‌లతో లభిస్తుంది. ఇండియాలో లాంచ్ అయ్యే కారు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగి రెండు ఎలక్ట్రిక్ మోటార్లను పొందనున్నట్లు సమాచారం. కాబట్టి మొత్తం పవర్ 673 హార్స్ పవర్ మరియు 838 న్యూటన్ మీటర్ టార్క్ అని తెలుస్తోంది. ఈ కారు కేవలం 2.78 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులో 101 కిలోవాట్ నికెల్ మాంగనీస్ కోబాల్ట్ (NMC) బ్యాటరీ ఉండనుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 800 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.

Don’t Miss: మాయం కానున్న టోల్ ప్లాజాలు!.. అంతా GNSS సిస్టం: ఇదెలా పనిచేస్తుందో తెలుసా?

ఇండియా లాంచ్ మరియు అంచనా ధర

భారతదేశంలో షియోమీ ఎలక్ట్రిక్ కారు ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయం మీద అధికారిక సమాచారం వెల్లడికాలేదు. అయితే ఈ కారు ధర చైనా మార్కెట్లో 215900 యువాన్స్ నుంచి 299900 యువాన్స్ మధ్య ఉంది. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 25.4 లక్షల నుంచి రూ. 35.3 లక్షలు. దీన్ని బట్టి చూస్తే దేశీయ విఫణిలో లాంచ్ అయితే బహుశా ఇదే ధరకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.