Homeలైఫ్ స్టైల్ఈ రోజు జాతకం: 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది? పూర్తి వివరాలు

ఈ రోజు జాతకం: 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది? పూర్తి వివరాలు

-

శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు కొనసాగుతోంది. ఫాల్గుణ మాసంలోని బహుళ నవమి తిథి తెల్లవారుజామున 4.26 వరకు ఉండి తరువాత దశమి ప్రారంభమవుతుంది. మూల నక్షత్రం రాత్రి 11.03 వరకు కొనసాగి అనంతరం పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది.

వర్జ్యం రాత్రి 9.17 నుంచి 11.03 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10.09 నుంచి 10.57 వరకు, మధ్యాహ్నం 2.56 నుంచి 3.44 వరకు ఉంటుంది. అమృత ఘడియలు మధ్యాహ్నం 3.54 నుంచి సాయంత్రం 5.50 వరకు. సూర్యోదయం ఉదయం 6.15 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6.05 గంటలకు జరుగుతుంది. రాహుకాలం మధ్యాహ్నం 1.30 నుండి 3.00 వరకు ఉండగా, యమగండం ఉదయం 6.00 నుండి 7.30 వరకు ఉంటుంది.

➤మేషరాశి

ఈ రోజు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే వ్యాపారం, ఉద్యోగాల్లో కొంత మందగింపు కనిపించవచ్చు. కష్టపడి చేసిన పనులకు ఫలితం ఆలస్యంగా రావచ్చు. పనుల్లో చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు పెరగవచ్చు. విద్యార్థులు చదువులో కొంత ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది.

➤వృషభ రాశి

ప్రయాణాలు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. బాధ్యతలు పెరగడం వల్ల కొంత ఒత్తిడి అనిపించవచ్చు. ఆదాయం ఆశించినంతగా లేకపోవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అవసరం. ఇంట్లోనూ బయటా కొన్ని చికాకులు ఉండే అవకాశం ఉంది. వ్యాపారం, ఉద్యోగాల్లో సాధారణ పరిస్థితి కొనసాగుతుంది.

➤మిథున రాశి

వ్యాపారం, ఉద్యోగాల్లో ఉత్సాహంగా పనులు సాగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. పుణ్యక్షేత్రాలను సందర్శించే యోగం కూడా ఉంది.

➤కర్కాటక రాశి

వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారం, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు వినే అవకాశం ఉంది.

➤సింహ రాశి

వ్యాపారం, ఉద్యోగాల్లో మార్పులు చోటుచేసుకోవచ్చు. బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రయత్నాలు మందగించవచ్చు. కొన్ని కార్యక్రమాల్లో అవరోధాలు ఎదురవుతాయి. ఆలయ దర్శనాలు చేసే అవకాశం ఉంటుంది.

➤కన్య రాశి

పనులు కొంచెం నెమ్మదిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు. దైవచింతన పెరుగుతుంది. భూమి సంబంధిత వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారం, ఉద్యోగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవచ్చు. విద్యార్థులు ఎక్కువ శ్రమ చేయాల్సి ఉంటుంది.

➤తుల రాశి

విద్యార్థులు తమ ప్రతిభను చాటుకునే అవకాశం ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. పాత స్నేహితులను కలుసుకుంటారు. కొత్త కాంట్రాక్టులు వచ్చే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారం, ఉద్యోగాల్లో లక్ష్యాలను సాధించే అవకాశం ఉంది.

➤వృశ్చిక రాశి

ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడే సూచనలు ఉన్నాయి. భూమి సంబంధిత వివాదాలు తలెత్తవచ్చు. వ్యాపారం, ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలు రావకపోవచ్చు. మానసిక ఆందోళన పెరిగే అవకాశం ఉంది. కొన్ని ఒప్పందాలను రద్దు చేసుకోవాల్సి రావచ్చు.

➤ధనుస్సు రాశి

అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పనుల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారం, ఉద్యోగాల్లో ముందడుగు పడుతుంది.

➤మకర రాశి

కుటుంబంలో చిన్నపాటి చికాకులు ఎదురవచ్చు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారం, ఉద్యోగాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. దైవ దర్శనాలు చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సోదరులతో విభేదాలు రావచ్చు.

➤కుంభ రాశి

చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. సమాజంలో గుర్తింపు పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. వ్యాపారం, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.

➤మీన రాశి

చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. ఆకస్మికంగా ధనలాభం కలగవచ్చు. వ్యాపారం, ఉద్యోగాల్లో ఆశాజనక పరిస్థితులు ఉంటాయి. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి లాభం ఉంటుంది. వాహనం కొనుగోలు చేసే యోగం కనిపిస్తోంది.

Also Read: ప్రతిరోజూ ఉదయం కొబ్బరినీళ్లు తాగితే.. 30 రోజుల్లో జరిగే మార్పులు ఇవే!

Uma Siri
Uma Sirihttps://marthatelugu.com/
ఉమశ్రీ - నేను MarthaTelugu వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు ఆటోమొబైల్, లైఫ్ స్టైల్ విభాగాల్లో అత్యంత ప్రావీణ్యం కలిగి ఉంది. ఈ విభాగాల్లో యూజర్లకు అవసరమైన అన్ని వార్తలను సమగ్రంగా అందిస్తాను. నాకు జర్నలిజం రంగంలో 8 సంవత్సరాల అనుభవం ఉంది.

Related articles

[td_block_social_counter custom_title="Stay Connected" block_template_id="td_block_template_4" header_color="#ea2e2e" f_header_font_family="522" f_header_font_transform="uppercase" f_header_font_style="italic" f_header_font_size="eyJsYW5kc2NhcGUiOiIxNSIsInBvcnRyYWl0IjoiMTQifQ==" facebook="tagDiv" twitter="tagdivofficial" youtube="tagdiv" instagram="tagdiv" style="style10 td-social-boxed td-social-colored" tdc_css="eyJwaG9uZSI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzIiLCJkaXNwbGF5IjoiIn0sInBob25lX21heF93aWR0aCI6NzY3fQ=="]
spot_img

Latest posts