డైరెక్టర్ కరుణ కుమార్ స్పీచ్: కన్నీళ్లు పెట్టుకున్న తిరువీర్

తిరువీర్ హీరోగా నటించిన ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన పలు విశేషాలను డైరెక్టర్స్ వెల్లడించడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన పలాస, శ్రేదేవి సోడా సెంటర్, మెట్రో కథలు, మట్కాలాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ కరుణ కుమార్ మాట్లాడారు. తిరువీర్, కరుణ కుమార్ మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆయన (కరుణ కుమార్) ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసి.. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

దావత్ నాటకం ద్వారా..

కరుణ కుమార్ మాట్లాడుతూ.. నేను సినిమాల్లోకి రాకముందు నుంచే నాకు తిరువీర్ దావత్ అనే నాటకం ద్వారా తెలుసునని, అందులో అతడు చేసింది చిన్న పాత్ర అయినా చాలా నచ్చింది అని చెప్పుకొచ్చాడు. అప్పుడే నేను తిరువీర్‌ను దృష్టిలో పెట్టుకుని పలాసలో  ప్రత్యేకంగా ఒక పాత్రని రాసుకున్నా అని అన్నాడు. తను (తిరువీర్) మొదట నమ్మలేదు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇప్పటి వరకు నాకు ఎవరు ఇవ్వలేదు. అందరూ ఇస్తాము అని పన్నెండు సంవత్సరాల నుంచి చెబుతూనే ఉన్నారు అన్నాడు. తరువాత మేము పిలిచి అడ్వాన్స్ ఇచ్చాము. తిరు నాకు చాలా స్పెషల్ ఎందుకంటే.. పలాస ఎన్నో కష్టనస్టటాలతో తీసాము. ఇప్పుడు అవన్నీ కామెడీగా అనిపించొచ్చు.

తల్లి చనిపోయిన విషయం దాచి.. షూటింగ్ పూర్తి చేసాడు

మేము అందరూ తీవ్ర నిరాశలో కూరుకుపోయినప్పుడు ఆ పరిస్థితులు అన్నీ తిరు అర్థం చేసుకున్నాడు. పలాసలో చిన్న షావుకారు, రంగారావు ఎలక్షన్ టికెట్ అడిగే సీన్ అప్పుడు ఆ ఇల్లు దొరకడమే కష్టం. ఆ పరిస్థితుల్లో ఒక ముఖ్యమైన సీక్వెన్స్ తీసాము. అది షూట్ చేసిన తరువాత తిరు వాళ్ల అమ్మ చనిపోయిందని తెలిసింది. అయినా సరే ఎక్కడ కూడా ఆ బాధ కనిపించకుండా అద్భుతంగా చేసి పర్మిషన్ తీసుకొని హైదరాబాద్ వెళ్లి కార్యక్రమాలు చూసుకొని తిరిగి కేవలం మూడు రోజుల్లో షూటింగ్ వచ్చాడు. అందుకే తిరు పట్ల నాకు ఎప్పుడు కూడా చాలా కృతజ్ఞత ఉంటుంది, అని డైరెక్టర్ కరుణ కుమార్ తన సానుభూతిని, అభిమానాన్ని, కృతజ్ఞతని చాటుకున్నాడు. ఇందుకు తిరువీర్ తన కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని బాధపడ్డాడు.

మట్కా లాంటి సినిమా మళ్లీ చేయను

ఈ సందర్బంగా ప్రేక్షకులు పూర్తిగా మారిపోయారని.. మట్కా (వరుణ్ తేజ్ మూవీ) సినిమాతో.. నాకు తెలిసోచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇలాంటి సినిమా ఇకపై ఎప్పుడూ చేయను. రాబోయే రోజుల్లో కూడా రూటెడ్, నేటివ్ సినిమాలే తీస్తానని పలాస డైరెక్టర్ తన ఆలోచనని పంచుకున్నాడు. నిజానికి ఈ ఈవెంట్ ఉందని తిరు.. డైరెక్టర్‌ను ఇన్వైట్ చేసినప్పుడు, వేరే షూటింగ్ ఉండటం కారణంగా రాలేకపోతున్న అని చెప్పి మళ్ళీ ఒకరోజు షూట్ క్యాన్సిల్ అయ్యేసరికి వచ్చేసాను అని చెప్పాడు. అలాగే అతిధుల ఫోటోలన్నీ ప్రింట్ అయిపోయాయి మీ ఫోటో వెయ్యలేదు అని చెప్పిన కూడా ఏమి పర్వాలేదు అని కార్యక్రమానికి వచ్చాడట కరుణకుమార్. దీని వల్ల తిరు పట్ల తనుకున్న ప్రేమని మరొక్కసారి తెలియజేసాడని అర్థమవుతుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని కరుణ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మరి సినిమా చూడాలంటే నవంబర్ 07 వరకు వేచి ఉండాల్సిందే అన్నమాట.