జగపతి బాబును.. రమ్యకృష్ణ ఏమని పిలిచేదో తెలుసా?

హీరో జగపతి బాబు అంటే.. ఒకప్పుడు అందరు మెచ్చుకునే ఒక అందమైన కథనాయకుడు. ఇప్పటికీ కూడా అదే అందం, అభినయంతో సినిమాలలో ప్రత్యేక పాత్రల్లో తెలుగు ప్రేక్షకులనే కాకుండా.. దేశం అంతటా ఎంతోమందిని అలరిస్తున్నాడు. ఆయన ఆనాటి సినిమాలు మంచి సెంటిమెంట్ అండ్ ఎమోషనల్‌గా ఉండటంతో.. కుటుంబ సమేతంగా మూవీ వీక్షించేవారు.. అంతగా ఇష్టపడేవారు.

ఇద్దరి మధ్య స్నేహం..

జగపతిబాబు ఎంతోమంది ప్రతిభ కలిగిన హీరోయిన్లతో కూడా కలిసి నటించాడు. ఈ ప్రయాణంలో వారి మధ్య స్నేహపూర్వకమైన సంబంధాలు ఏర్పడటం అనేది సహజం. ఆ చనువుతో ఒకరిని ఒకరు ఎన్ని పేర్లతో అయినా ఆట పట్టిస్తుంటారు. సరదా సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. వారిలో రమ్యకృష్ణ కూడా ఒకరు. వీరిద్దరూ కూడా వ్యక్తిగతంగా చాలా సన్నిహితులు & మంచి స్నేహితులు. ఇటీవల జరిగిన జయమ్ము నిర్ఛయమ్ము రా అనే టీవీ షోలో వీరిద్దరి సాన్నిహిత్యానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకి వచ్చాయి.

అలా.. శుభలగ్నం

జగపతిబాబు కెరియర్ ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలో ఒక కొత్త సినిమాలో.. ప్రొడ్యూసర్ అశ్వని దత్, డైరెక్టర్ కృష్ణారెడ్డి.. జగపతిబాబుకు ఆఫర్ ఇస్తే, తనకి డేట్స్ ఖాళీ లేవు అని వదులుకునేద్దాం అనుకున్నారట. కానీ అదే సమయంలో రమ్యకృష్ణ వచ్చి.. ఏంటి నీకు పిచ్చి పట్టిందా.. నీకు డేట్స్ నేను అడ్జెస్ట్ చేస్తాను. నువ్వు ఈ సినిమా ఒప్పుకో అని బలవంతం చేసారట. అప్పుడు ఇంక తప్పక ఒప్పుకోవాల్సి వచ్చి ఒప్పేసుకున్నారట జగపతిబాబు. ఆ సినిమా పేరే శుభలగ్నం. అది తన జీవితాన్నే టర్నింగ్ చేసిన మూవీ అయింది. ఈ విషయాన్ని జగపతి బాబు స్వయంగా చెప్పుకున్నారు.

కోపం వస్తే..

అంతే కాకుండా.. జగపతి ఏదైనా అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టినా, తింగరి పనులు చేసినా.. రమ్యకృష్ణ తిట్టేస్తుందట. నాకు ఒక క్రేజీ ఫ్రెండ్ అంటే అది జగపతినే అని రమ్యకృష్ణ తెలిపింది. మాములుగా అయితే ఎవరైనా ఒకరినొకరు పేర్లతో పిలుచుకుంటారు. అసలు పేరుతో కాకపోయినా కనీసం ముద్దు పేరుతో అయినా పిలుచుకుంటారు. కానీ ఇక్కడ ఆశ్చర్యంగా రమ్యకృష్ణ జగపతిబాబును ఏ పేరుతో కూడా పిలవదట. నిజంగా క్రేజీ కదా. ఎప్పుడైనా కోపం వస్తే ఒరేయ్, అరేయ్ అని పిలుస్తారట.. లేదా ప్రేమగా బంగారం అని పిలుస్తుంది అని తెలిసింది. అది మంచి లేదా చాలా దగ్గర స్నేహం కలిగిన మనిషిని మాత్రమే అలా పిలువగలుగుతాము అని అభిప్రాయపడ్డారు.

పెళ్ళికి ముందు..

ఈ సందర్బంగా రమ్యకృష్ణ తన ప్రేమ గురించి చెప్పుకొచ్చింది. కృష్ణ వంశీతో తన జీవితం చాలా బాగుందని, వాళ్ల ఒక్కగానొక్క కొడుకుతో కుటుంబంలో సంతోషంగా ఉన్నామని చెప్పుకొచ్చింది. పెళ్ళికి ముందు చిన్న చిన్న గొడవలు వచ్చాయి గానీ పెళ్లి అయిన తరువాత ఎటువంటి గొడవలు లేవని అంతా హ్యాపీగా సాగిపోతున్నదని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి చూస్తే జగపతిబాబుకి, రమ్యకృష్ణకి ఎంత మంచి స్నేహపూర్వకమైన అనుబంధం ఉందో అర్థమవుతుంది. ఇలాంటి స్నేహం అందరికి ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా.