Home Blog Page 128

అనుకోకుండా తీసుకున్న నిర్ణయం.. ‘నువ్వు నా సొంతమా’ సాంగ్ గురించి చెప్పిన రష్మిక

0

ఇప్పుడు సోషల్ మీడియాలో రష్మిక మందన్న పేరు తెగ ట్రెండ్ అవుతోంది. దీనికి కారణం రహస్యంగా విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం చేసుకోవడమే అని తెలుస్తోంది. అయితే ఈ జంట (విజయ్ దేవరకొండ & రష్మిక మందున్న) తమ ఎంగేజ్‌మెంట్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే సోషల్ మీడియా ఖాతాలో మాత్రం రష్మిక థామా (Thamma) సినిమా ప్రమోషన్ చేయడంలో బిజీ అయిపోయింది. విజయ్ దేవరకొండ పుట్టపర్తి వెళ్లినట్లు సమాచారం.

సాంగ్ అక్కడే ఎందుకంటే?

థామా సినిమా ప్రమోషన్‌లో భాగంగా రష్మిక మందన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేశారు. నువ్వు నా సొంతమా సాంగ్ రిలీజ్ అయిన సందర్భంగా.. ఈ సాంగ్ ఎందుకు ఆ లొకేషన్‌లో చేయాల్సి వచ్చిందనే విషయాన్ని రష్మిక వెల్లడించారు. మేము 10-12 రోజుల పాటు ఒక అద్భుతమైన, అందమైన ప్రదేశంలో షూటింగ్ చేశాము. అంత అద్భుతమైన ప్రదేశంలో సాంగ్ ఎందుకు తీయకూడదు అని దర్శక, నిర్మాతలకు ఒక ఆలోచన వచ్చింది. ఆ లొకేషన్ నాకు కూడా నచ్చింది. దీంతో మేము 3-4 రోజులు రిహార్సిల్స్ చేసి పాటను షూట్ చేసాము.

నిజానికి మేము అనుకోకుండా తీసుకున్న నిర్ణయంతో.. ఆ లొకేషన్‌లో సాంగ్ షూట్ చేశాము. అది అద్భుతంగా వచ్చింది. పాట పూర్తయ్యాక, అందరూ ఎంతగానో ఆశ్చర్యపోయారు. ప్లాన్ చేసి టీసింగ్ షూటింగ్ కంటే కూడా ఈ సాంగ్ చాలా బాగా వచ్చింది. ఈ పాటలో భాగస్వాములైన అందరికీ కృతజ్ఞతలు అంటూ రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. అంతే కాకుండా ఈ పాటకు సంబంధించిన కొన్ని స్టిల్స్ కూడా షేర్ చేశారు.

గ్లామర్‌తో కట్టిపడేసిన రష్మిక

ఇక నువ్వు నా సొంతమా అనే పాట విషయానికి వస్తే.. రష్మిక మందన్న తన గ్లామర్‌తో నెటిజన్లను ఆకట్టుకుంది. రష్మిక చెప్పినట్లు లోకేష్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆయుష్మాన్ ఖురానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా అక్టోబర్ 21న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆదిత్య సర్పోత్దార్ థామా సినిమాకు దర్శకత్వం వహించారు. అమర్ కౌశిక్, దినేష్ విజన్.. నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా కోసం రూ. 60 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.

రష్మిక మందన్న థామా సినిమా రిలీజ్ తరువాత.. ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నవంబర్ 7న రిలీజ్ అవుతుందని సమాచారం. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఇది కూడా మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. మొత్తం మీద రష్మిక మందన్న వరుస సినిమాలతో చాలా బిజీ అయిపోయిందని స్పష్టంగా అర్థమవుతోంది.

ఎంగేజ్‌మెంట్ గురించి చెప్పకపోవడానికి కారణం

నిజానికి ఎవరి జీవితంలో అయిన పెళ్లి అనేది చాలా ముఖ్యమైన సెలబ్రేషన్. అంతకు ముంది జరిగే నిశ్చితార్థం.. సగం పెళ్లి అయిపోయినట్టు చెప్పే ఒక తంతు. అలాంటి శుభవార్తను రష్మిక మందన్న గానీ.. విజయ్ దేవరకొండ గానీ ఎందుకు చెప్పుకోవడం లేదో.. అనేది చాలామంది మనసులో పుట్టిన ప్రశ్న. ఏ విషయాన్ని దాచుకున్న ఏం పర్లేదు. కానీ నిశ్చితార్థం, పెళ్లి వంటి విషయాలను తమ అభిమానులకు కూడా తెలియజేయకపోవడం.. ఆశ్చర్యంగా ఉంది. అయితే తమ ఎంగేజ్‌మెంట్ విషయం బయటకు చెప్పకుండా ఉండటానికి ఏమైనా బలమైన కారణం కూడా ఉండొచ్చని ఇంకొందరి వాదన. ఏది ఏమైనా.. ఏ విషయమైనా ఏదో ఒకరోజు బయటకు రావాల్సిందే.

విజయ్ దేవరకొండతో ఎంగేజ్‌మెంట్‌: రష్మిక మందన్న కార్లు చూశారా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. చలో సినిమాతో మొదలుపెట్టి పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న రష్మిక గురించి దాదాపు అందరికీ తెలుసు. అయితే ఈమె ఎలాంటి కార్లను ఉపయోగిస్తుంది?, వాటి ధరలు ఎలా ఉన్నాయి?, అనే విషయాలు చాలామందికి తెలుసుండకపోవచ్చు. ఆ విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

నటి రష్మిక మందన్న ఉపయోగించే కార్ల జాబితాలో ఆడి కంపెనీకి చెందిన క్యూ3, రేంజ్ రోవర్ స్పోర్ట్, మెర్సిడెస్ బెంజ్ సీ-క్లాస్, టయోటా ఇన్నోవా క్రిష్టా, హ్యుందాయ్ క్రెటా కార్లు ఉన్నాయి. ఈ కార్ల ధరలు.. ఇతర విషయాల విషయానికి వస్తే..

ఆడి క్యూ3

రష్మిక మందన్న మొదటి కారు ఈ ఆడి క్యూ3 అని తెలుస్తోంది. దీనిని రష్మిక 2018లో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ కారు ధర రూ. 55 లక్షలు. మొదటి కారు కావడంతో.. దీనిని రష్మిక ఎక్కువగా ఉపయోగించేవారని తెలుస్తోంది. నిజానికి ఆడి కంపెనీకి చెందిన ఈ కారును గతంలో చాలామంది సెలబ్రిటీలు కొనుగోలు చేసి.. ఇష్టంగా ఉపయోగిస్తున్నారు. ఇది మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి.. వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుందని. ఈ కారణంగానే దీనిని ఎక్కువమంది ఇష్టపడుతున్నట్లు సమాచారం.

రేంజ్ రోవర్ స్పోర్ట్

రష్మిక మందన్న ఉపయోగించే కార్లలో మరో బ్రాండ్ కారు.. రేంజ్ రోవర్ స్పోర్ట్. సుమారు రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన ఈ కారు.. నలుపు రంగులో ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇది 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 300 పీఎస్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి అత్యుత్తమ పనితీరును అందిస్తుందని సమాచారం. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల గ్యారేజిలో ఈ కారు ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ సీ-క్లాస్

రష్మిక మందన్న ఉపయోగించే కార్ల జాబితాలో మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన సీ-క్లాస్ కూడా ఉంది. దీని ధర రూ. 66 లక్షల కంటే ఎక్కువ అని సమాచారం. ఇది అత్యాధునిక డిజైన్, వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. తెలుపు రంగులో ఉన్న మెర్సిడెస్ బెంజ్ సీ-క్లాస్ కారును రష్మిక కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కారు ఇండియన్ మార్కెట్లో 2022లో లాంచ్ అయింది. ఇది మొత్తం మూడు ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది.

టయోటా ఇన్నోవా క్రిష్టా

భారతదేశంలో ఎక్కువ మంది కొనుగోలు చేసి, ఉపయోగిస్తున్న కార్ల జాబితాలో టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా క్రిష్టా కూడా ఒకటి. ఈ కారు రష్మిక మందన్న గ్యారేజిలో కూడా ఉన్నట్లు సమాచారం. ఇండియన్ మార్కెట్లో దీని ధర రూ. 18 లక్షలు అని తెలుస్తోంది. రోజువారీ ప్రయాణానికి, ఎక్కువమంది ప్రయాణించడానికి ఈ కారు అనుకూలంగా ఉండటం వల్ల.. ఎక్కువ మంది దీనిని ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.

హ్యుందాయ్ క్రెటా

ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా కారు కూడా రష్మిక మందన్న గ్యారేజిలో ఉంది. రూ. 10.72 లక్షల ఖరీదైన ఈ కారు.. భారతదేశంలో 12 లక్షల అమ్మకాలను పొందింది. దీన్నిబట్టి చూస్తే.. ఈ కారుకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ కారును సాధారణ ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నప్పటికీ.. సెలబ్రిటీలు కూడా ఈ కారును ఇష్టపడుతున్నారు.

అలనాటి తారలు.. అందరూ ఒక్కచోట: ప్రత్యేక ఆకర్షణలో హీరోయిన్స్!

జరిగిపోయిన.. ఒకప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. ఇది సాధారణ ప్రజలకైనా.. సెలబ్రిటీలకైనా ఒకటే. దీని కోసమే 80’s స్టార్స్ రీయూనియన్ పేరుతో ఓ కార్యక్రమం ప్రారంభించారు. సినిమా నటులు అందరు సరదాగా ఒక చోట కలుసుకుని ఆనందంగా గడపడం మరియు వారి మధ్య ఉన్న స్నేహపూర్వకమైన అనుబంధాన్ని మరింత బలపరుచుకోడానికి చేసే కార్యక్రమం ఇది. ఇందులో ఆనాటి సినిమాల మధుర జ్ఞాపకాలను, అనుభవాలను తిరిగి గుర్తుకు తెచ్చుకోవడం లాంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇలాంటివి మనం స్కూల్‌లో.. కాలేజీలలో ఇతర అనేక డిపార్ట్‌మెంట్లలో సర్వసాధారణంగా ఏర్పాటు చేసుకునేవే.

2010లో మొదలైన రీయూనియన్

1980 నుంచి 1989 మధ్య కాలంలో సినిమాల్లో నటీనటులుగా ప్రవేశించిన వారందరూ కలసి ఏర్పాటు చేసుకునేదే ఈ రీయూనియన్ ప్రోగ్రాం. ఈ కార్యక్రమాన్ని 2010 సంవత్సరం నుంచి ప్రతి ఏటా జరుపుకుంటూ వస్తున్నారు. దీనిని ఖుష్బు సుందర్, సుహాసిని మణిరత్నం, లిజీ ప్రియదర్శిన్, పూర్ణిమ భాగ్యరాజ్ మొదట్లో ప్రారంభించారు. సాధారణంగా ఒక్కోసారి ఒక్కొక్కరు ఈ ప్రోగ్రాంను నిర్వహిస్తూ వస్తున్నారు. ఫస్ట్ టైం చెన్నైలో లిస్సీ ప్రియదర్శన్ తమ ఇంటిలో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇది ఆనవాయితీగా వస్తూనే ఉంది.

తాజాగా చెన్నైలో..

ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం జరుపుకునే ఈ ఈవెంట్ నిన్న అక్టోబర్ 4వ తేదీన చెన్నైలో రీయూనియన్ ప్రోగ్రాంను నిర్వహించుకోవడం జరిగింది. క్లాస్ ఆఫ్ 80’s పేరుతో యాక్టర్ అండ్ డైరెక్టర్ అయిన శ్రీప్రియా & రాజకుమార్ సేతుపతి హోస్ట్ చేశారు. సుహాసిని మణిరత్నం, కుశ్బు సుందర్, లిస్సీ లక్ష్మి, పూర్ణిమ భాగ్యరాజ్ దీనిని ఆర్గనైజ్ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ పాల్గొన్నారు. ఇందుకు వీరు ఇద్దరు కలిసి చార్టర్ ఫ్లైట్‌లో చెన్నైకి వెళ్లారు. చిరు, వెంకీ కలిసి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి. వీరు మాత్రమే కాకుండా.. భాను చందర్, విక్రమ్ ప్రభూ, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, నరేష్, సురేష్ కృష్ణ, రెహ్మాన్, జయరామ్ లాంటి హీరోస్ అందరూ ఇందులో పాల్గొన్నారు.

రీయూనియన్ కార్యక్రమంలో హీరోయిన్స్

హీరోయిన్స్ విషయానికి వస్తే.. రమ్యకృష్ణ, రేవతి, సుమలత, శోభన, రాధిక శరత్ కుమార్, సుహాసిని మణిరత్నం, లిస్సీ, నదీయా, మేనక, పార్వతి జయరాం, ఖుష్భు, పూర్ణిమ భాగ్యరాజ్, అంబికా, శరణ్య పోవన్నన్, జయమాల, మధూ మొదలైనవారు ఈ రీ-యూనియన్ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

2024 సంవత్సరంలో వచ్చిన వరదల కారణంగా అప్పుడు రీయూనియన్ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు. అయితే నిన్న జరిగినటువంటి ఈవెంట్ ఫోటోలని మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పరమైన కలయిక సినిమా ఇండస్ట్రీలో అయినా.. సమాజంలో అయినా మంచి పరిణామానికి సూచికగా చెప్పొచ్చు. మానవ సంబంధాలు చాలాకాలం పాటు బలంగా నిలబడటానికి ఇలాంటివి దోహదపడుతాయి. ఇలాంటి కార్యక్రమాలను సెలబ్రిటీలు మాత్రమే కాకుండా.. సాధారణ ప్రజలు కూడా అప్పుడప్పుడు నిరవహించుకుంటే బంధాలు బలపడతాయి.

20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన.. అప్పుడే కాంతారా కథ పుట్టింది: రిషబ్ శెట్టి

కాంతారా సినిమా విజయం తరువాత.. దాని సీక్వెల్ కాంతారా చాప్టర్-1 తెరకెక్కిన విషయం తెలిసిందే. ఒక ప్రాంతానికి చెందిన కథను తీసుకుని మలచిన ఈ సినిమా.. అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొంది, భారీ విజయం సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా తీయడానికి కారణం ఏంటని.. అందరూ అనుకుంటున్న వేళ.. హీరో రిషబ్ శెట్టి ఆ వివరాలను వెల్లడించారు.

20 ఏళ్లకు ముందు జరిగిన ఓ సంఘటన

రెండు దశాబ్దాల క్రితం (20 ఏళ్లకు ముందు) ఒక గ్రామంలో జరిగిన ఒక యదార్థ ఘటనే.. కాంతారా కథకు మూలమని, డైరెక్టర్ & యాక్టర్ రిషబ్ శెట్టి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సినిమాలో అందరూ క్లైమాక్స్ సన్నివేశాలను గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ ఏదో ఒక శక్తి నా చేత ఆ సన్నివేశాలను రాయించిందని నేను బలంగా నమ్ముతున్నానని ఆయన అన్నారు. కాంతారా సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నప్పుడే.. ప్రేక్షకులు తప్పకుండా దీనిని ఆదరిస్తారనే నమ్మకం కుదిరింది. ప్రాంతంతో తేడా లేకుండా.. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయినదని ఆయన అన్నారు. సినిమా చూస్తున్నంత సేపు.. ప్రేక్షకులు సైతం ఆ సన్నివేశాలకు మంత్రముగ్దులయ్యారంటే.. తప్పకుండా రిషబ్ చెప్పింది నిజమే అని చాలామంది భావిస్తున్నారు.

ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ

20 సంవత్సరాలకు ముందు.. ఒక గ్రామంలో వ్యవసాయ భూమి కోసం అటవీశాఖ అధికారికి, రైతుకు మధ్య ఒక చిన్న ఘర్షణ జరిగింది. ఆ సంఘటను నేను ఒక ఘర్షణగా చూడలేదు. ప్రకృతిని కాపాడే వారిమధ్య జరిగిన ఘర్షణగా చూసాను. అదే కాంతారా కథ రాయడానికి కారణమైందని నటుడు రిషబ్ శెట్టి క్లారిటీ ఇచ్చారు. మన సంస్కృతి మొత్తం వ్యవసాయం చుట్టూ ఎలా తిరుగుతోందో అనే ఆలోచన నుంచే కథ పుట్టుకొచ్చిందని అన్నారు.

అప్పుడే ప్రేక్షకులు ఆదరిస్తారు

కాంతారా సినిమా చూసిన తరువాత.. థియేటర్ బయట కూడా ప్రేక్షకులు సినిమా గురించే చర్చించుకుంటున్నారు ఆంటే.. అది ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రాంతం గురించి, ఒక సంస్కృతి గురించి సినిమా తీసేటప్పుడు.. సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలా ఉండాలి. అప్పుడే దానిని అందరూ ఆదరిస్తారు.

నిజానికి కాంతారా సినిమా కంటెంట్ ఒక ప్రాంతానికి చెందినది. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకునే తపనే కాంతారా సినిమాగా రిషబ్ శెట్టి తెరకెక్కించారు. సినిమాలోని సన్నివేశాలు చాలామందిని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. ఒక కథ ఎప్పుడైతే ప్రజల జీవన విధానాలకు దగ్గరగా ఉంటుందో.. అప్పుడే అది ప్రజల్లోకి వెళ్తుంది. వారిని ఆకట్టుకుంటుంది.

కాంతారా సినిమాలో పంజుర్లి, గుళిగ దేవుళ్ల గురించి కన్నడ ప్రాంతంలోని వారికి మాత్రమే తెలుసు. అయితే ఇప్పుడు ఈ దేవుళ్ల గురించి యావత్ భారతదేశానికి తెలిసింది. ఈ ఘనత తప్పకుండా రిషబ్ శెట్టిదే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే రిషబ్ శెట్టి మాత్రం ఆ దేవుళ్ల శక్తితోనే ఇది ఇది సాధ్యమైందని నిస్సందేహంగా చెప్పుకున్నారు. కాగా ఇప్పటికి బ్లాక్ బస్టర్ సాధించిన కాంతారా, కాంతారా చాప్టర్-1 సినిమాల తరువాత చాప్టర్-3 కూడా రాబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

విజయ్ దేవరకొండ & రష్మికల ఎంగేజ్‌మెంట్‌: ఈ జంట ఆస్తులు ఎంతో తెలుసా?

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు రూమర్లకు చెక్ పెట్టేశారు. అందరూ ఊహించినట్లుగానే నిశ్చితార్థం చేసుకుని పెళ్ళికి సిద్ధమైపోయారు. సినిమా అత్యధిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న ఈ జంట 2026 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సినిమా రంగంలో భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న వీరి ఆస్తులు ఎంత ఉన్నాయి?, వీరు లగ్జరీ కార్లు ఏవి? అనే విషయాలను తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.

విజయ్ దేవరకొండ

నటుడు విజయ్ దేవర కొండ.. అటు సినిమాలోనూ, ఇటు కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తూ డబ్బు బాగా సంపాదిస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాకు రూ. 5 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న విజయ్ దేవరకొండ.. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన కింగ్‌డమ్ సినిమాకు రూ. 30 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు అంచనా. అయితే విజయ్ దేవరకొండ ఒక్కో సినిమాకు రూ. 12 కోట్ల నుంచి రూ. 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్. ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. అయితే కొన్ని నివేదికలు ప్రకారం ఈయన మొత్తం సంపద రూ. 50 కోట్ల నుంచి రూ. 60 కోట్ల మధ్యలో ఉంటుందని అంచనా.

విజయ్ దేవరకొండ హైదరాబాద్ నగరంలో సుమారు 15 కోట్ల విలువైన భవనంలో నివసిస్తున్నారు. అంతే కాకుండా ఫోర్డ్ మస్టాంగ్ (రూ.75 లక్షలు), మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ (రూ.60 లక్షల కంటే ఎక్కువ), వోల్వో ఎక్స్‌సీ 60 (రూ.90 లక్షల కంటే ఎక్కువ), రేంజ్ రోవర్ (రూ.60 లక్షల కంటే ఎక్కువ), బీఎండబ్ల్యూ 5 సిరీస్ (రూ. 63 లక్షల కంటే ఎక్కువ) వంటి ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు.

రష్మిక మందన్న

చలో సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. మొదటి సినిమాకు లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న ఈ అమ్మడు.. పుష్ప 2 సినిమాకు ఏకంగా రూ. 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది. కాగా చావా సినిమాకు రూ. 4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈమె కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా.. కొన్ని ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తోంది. దీని ద్వారా కూడా భారీ మొత్తంలో ఆర్జిస్తోంది. మొత్తం మీద రష్మిక మొత్తం ఆస్తి రూ. 60 కోట్ల కంటే ఎక్కువ అని అంచనా.

ఇక రష్మిక మందన్న ఉపయోగించే కార్ల విషయానికి వస్తే.. ఈమె మెర్సిడెస్ బెంజ్ సీ-క్లాస్, రేంజ్ రోవర్ స్పోర్ట్, హ్యుందాయ్ క్రెటా, మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ మొదలైన కార్లను ఉపయోగిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈమె ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతోందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

విజయ్ దేవరకొండ & రష్మిక ఆస్తులు కలిస్తే

నటుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నకు పెళ్లి జరిగితే.. వీరి ఇరువురి ఆస్తి రూ. 110 కోట్ల కంటే ఎక్కువ అవుతుంది. కాగా ఇద్దరూ సెలబ్రిటీలే.. కాబట్టి సినిమాలు చేస్తూ మరింత సంపాదించే అవకాశం ఉంది. అయితే పెళ్లి తరువాత రష్మిక మందన్న సినిమాలు చేస్తుందా?, లేదా? అనేది తెలియాల్సిన విషయం. దీనికి సమాధానం కావాలంటే రష్మిక మందన్న చెప్పాల్సిందే.

తమిళనాడులో అతిపెద్ద స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ కాంపిటీషన్.. ముఖ్య అతిధిగా కేటీఆర్

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తురులో అక్టోబర్ 11న.. 10వ ‘ఎఫ్ఎమ్ఏఈ’ నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ కాంపిటీషన్ 2025 జరగనుంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ముఖ్య అతిధిగా పాల్గొని ఆయన చేతుల మీదగా ఈ స్పోర్ట్స్ కాంపిటీషన్ ప్రారంభించనున్నారు.

1300 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు

ఈ ఈవెంట్‌ను ఫ్రాటర్నిటీ ఆఫ్ మెకానికల్ అండ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్ (ఎఫ్ఎమ్ఏఈ) అనే సంస్థ నిర్వహిస్తోంది. ఇందుకుగానూ కోయంబత్తురులోని కుమరగురు ఇన్‌స్టిట్యూషన్స్ వేదికగా నిలవనుంది. ఈ పోటీలో దాదాపుగా 101 విద్యాసంస్థలకు చెందిన 1300 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. వీరంతా కలిసి 70కి పైగా చిన్న చిన్న టీమ్స్‌గా పోటీ చేయనున్నారు. ఇక్కడ విద్యార్థులు అందరూ వారి సొంత మేధస్సుతో, తెలివితేటలతో తయారు చేసిన వెహికల్స్ (మినీ రేసింగ్ వాహనాల) ప్రదర్శించనున్నారు.

విజేతల ఎంపిక ఇలా..

విద్యార్థులు వారు తయారు చేసిన వాహనాలను ట్రాక్‌లో నడిపి వారి ప్రతిభను పరీక్షించుకోనున్నారు. ఈ వెహికల్స్ అన్ని పెట్రోల్, డీజిల్ లేదా కరెంటుతో నడిచేవి కూడా ఐయుండచ్చు. ఒక్కో వాహనం ఎంత స్పీడ్ వెళ్తోంది, తయారు చేసిన డిజైన్ అండ్ మోడల్ ఏ విధంగా ఉంది, వెహికల్ పికప్, సేఫ్టీ వాటి ఇన్నోవేషన్ అంటే బ్యాటరీ, సెన్సార్లు,ఇంజన్ ఇవన్నీ కొత్త టెక్నాలజీ తో చేశారా లేదా ఇంకా కంట్రోలింగ్, బ్రేక్ సిస్టమ్, మానిటరింగ్ ఫిచర్లు ఏ పద్ధతిలో చేశారో వంటివాటిని బట్టి ఈ పోటీలో విజేతలను ఎంపిక చేస్తారు. జడ్జిమెంట్ ఇవ్వడానికి అత్యంత ప్రతిభ కలిగిన ఇరవై ఐదు మంది నిపుణులు ఇందులో పాల్గొననున్నారు. వీరందరూ దేశంలోని అతి పెద్ద ఆటోమొబైల్ కంపెనీలకి చెందిన ప్రతినిధులు. వీరే పోటీలో పాల్గొనే విన్నింగ్ పర్సన్‌ని నిర్ణయిస్తారు.

విద్యార్థులు భవిష్యత్తుకు ఓ దారి

ఈ స్పోర్ట్స్ కాంపిటీషన్ అనేది.. భవిష్యత్తులో ఆటోమొబైల్ రంగంలో ఇంజనీర్స్ అవ్వాలనుకునే విద్యార్థులకు మంచి అవకాశాలను కల్పించడానికి దారిచూపుతుందని చెప్పవచ్చు. అంతే కాకుండా వారిలో ఉన్న కొత్త కొత్త ఆలోచనలను, ప్రాక్టికల్ నాలెడ్జ్, టీమ్ వర్క్, సాంకేతిక నిపుణ్యాన్ని ప్రోత్సహించడానికి భవిష్యత్తులో మరింత అభివృద్ధి పరచడానికి ఈ పోటీ ఉపయోగపడుతుంది అనేది ఎఫ్ఎమ్ఏఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం.

కేటీఆర్ రాకతో మరింత ప్రాముఖ్యత

స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ కాంపిటీషన్ అనేది మన ఇండియాలో మాత్రమే కాదు.. ఆసియాలోనే అతి పెద్ద పోటీ అనే చెప్పుకోవాలి. ఇటువంటి పోటీకి తెలంగాణ రాష్ట్ర రాజకీయ నేత కేటీ రామారావు రావడం అనేది మరింత ప్రచారం పొందటమే కాకుండా.. ప్రాముఖ్యతను సంతరించుకుంది. కేటీఆర్ ఎప్పుడు కూడా విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీలో మరింత అభివృద్ధి చెందాలని ప్రోత్సహం అందిస్తూ ఉంటారు కాబట్టి.. ఈ కార్యక్రమం ఒక ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పవచ్చు. అయితే ఏ విభాగంలో ఎవరు విజేత.. ఎవరి సామర్థ్యం ఎంత అని తెలుసుకోవడానికి ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని, విద్యార్థుల భవిష్యత్తుకి మంచి మార్గం చూపాలని ఆశిద్దాం.

ఆస్ట్రేలియా టూర్‌కు టీమిండియా రెడీ: జట్టులో శ్రేయస్ అయ్యర్.. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్

ఈ నెల అక్టోబర్ 19వ తేదీన ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డే సిరీస్ మ్యాచ్‌కు మరియు అక్టోబర్ 29న ప్రారంభం కానున్న ఐదు టీ20 సిరీస్ మ్యాచ్‌లకు భారత క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీసీఐ) చీఫ్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ టీమ్ సభ్యులు.. రెండు టీమ్స్ ప్రకటించారు. వన్డే కెప్టెన్ పగ్గాలను శుభ్‌మన్ గిల్‌కు అప్పగించింది. చాలాకాలం తరువాత టీమ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు చోటు కల్పించి అతడికి వైస్ కెప్టెన్ బాధ్యతలు ఇచ్చారు. ఇప్పటి వరకు వన్డే కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ కేవలం బ్యాట్స్‌మన్‌గా మాత్రమే జట్టులో కొనసాగనున్నాడు. కాగా శుభ్‌మన్ గిల్ టెస్ట్ కెప్టెన్‌సీతో పాటు ఇప్పటి నుంచి వన్డే సారథిగా కొత్త బాధ్యతలు స్వీకరించబోతున్నాడు.

కొందరికి దక్కని చోటు

ఇక జట్టు విషయానికి వస్తే సంజూ సాంసన్, మహమ్మద్ షమీ, జడేజాలకు వన్డే మ్యాచ్‌లో చోటు దక్కలేదు. ఇది వారి అభిమానులకు కొంత నిరాశను కలిగించే వార్త. బౌలింగ్ విభాగంలో బుమ్రాకి బదులు ప్రసిద్ కృష్ణకి అవకాశం ఇచ్చారు. ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్య స్థానంలో మన తెలుగువాడు నితీష్ కుమార్ రెడ్డిని తీసుకున్నారు. ఈ మార్పులతో బిసీసీఐ వన్డే జట్టుకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 19, 23, 25 తేదీల్లో పెర్త్, సిడ్నీ అడిలేడ్ నగరాల్లో ఈ మ్యాచ్‌లు ఆడనున్నారు

వన్డే టీమ్

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, దృవ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్.

టీ20 సిరీర్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగనున్నాడు. ఇందులో పెద్దగా మార్పులు ఏమి లేనట్టుగానే కనిపిస్తోంది. కేవలం కొన్ని గాయాల కారణంగా హార్దిక్ పాండ్య స్థానంలో నితీష్ వచ్చాడు. అదనంగా వాషింగ్టన్ సుందర్ వచ్చి చేరాడు. ఆసియా కప్ గెలిచిన ఆనందంతో ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్న తేడాలతో అదే జట్టుతో ఇండియా ఆస్ట్రేలియతో బరిలో దిగనుంది. 2025 అక్టోబర్ 29, 31.. నవంబర్ 2, 6, 8 తేదిలలో వరుసగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

టీ20 టీమ్

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ ), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్ ), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దుబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ సాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్.

ఇప్పటి వరకు దాదాపు అన్ని మ్యాచ్‌లలోనూ అత్యుత్తమ ప్రతిభ చూపిన టీమిండియా.. ఆస్ట్రేలియాలో జరగనున్న మ్యాచ్‌లో కూడా మంచి పర్ఫామెన్స్ చూపిస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇక త్వరలో జరగనున్న మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. ఈ సారి గెలుపు ఎవరిదో తెలుసుకోవడానికి ఇంకొన్ని రోజులు నిరీక్షించక తప్పదు. అయితే ఇందులో కూడా టీమిండియా గెలుపొందాలని ఆశిద్దాం.

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!: లాస్ట్ ఎగ్జామ్ ఎప్పుడంటే?

సీబీఎస్ఈ ఇటీవలే 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పుడు తాజగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (బీఐఈఏపీ) ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

పరీక్షల షెడ్యూల్ & సమయం

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి నోటిఫికేషన్ ప్రకారం.. పరీక్షలు 2026 ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమై 2026 మార్చి 24 వరకు జరుగుతాయి. అంటే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫిబ్రవరి 23న ప్రారంభమవుతుంది. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మొదలవుతాయి. అన్నీ పరీక్షలు ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు (మూడు గంటలు) జరుగుతాయి.

ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష పేపర్ 1తో (తెలుగు, హిందీ, సంస్కృతం మొదలైన లాంగ్వేజెస్) మొదలవుతుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష లాంగ్వేజ్ పేపర్ IIతో ప్రారంభమవుతుంది. ఆ తరువాత ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎకానమీ, హిస్టరీ, కామర్స్, సివిక్స్ పరీక్షలు జరుగుతాయి. చివరి పరీక్ష 2026 మార్చి 24న జరుగుతుందని తెలుస్తోంది.

2025లో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన మొత్తం విద్యార్థులు సంఖ్య 10,17,102. అయితే ఈసారి 2026లో ఇంతకంటే ఎక్కువమంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు.. పరీక్షలు నిర్వహించడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేసింది. దీన్ని బట్టి చూస్తే ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఇంకో మూడు నెలల సమయం మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

ఏపీ ఇంటర్మీడియార్ ప్రాక్టికల్ పరీక్షల విషయానికి వస్తే.. జనరల్ కోర్సులకు ప్రాక్టికల్స్ 2026 ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు (మొత్తం పది రోజులు) రెండు సెషన్లలో జరుగుతాయి. ప్రాక్టికల్ పరీక్ష ఫస్ట్ సెషన్ ఉదయం 9:00 గంటల నుంచి 12:00 గంటల మధ్య జరుగుతుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల మధ్య జరుగుతుంది. ఆదివారాల్లో కూడా ఈ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని సమాచారం.

ఒకేషనల్ కోర్సు ప్రాక్టికల్ పరీక్షలు 2026 జనవరి 27 నుంచి 2026 ఫిబ్రవరి 10 వరకు జరుగుతాయి. ఇక్కడ తెలుసుకోవలసిన మరో విషయం ఏమిటంటే.. ప్రస్తుతం విడుదలైన ఇంటెర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ తాత్కాలికమైనది మాత్రమే అని బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి డాక్టర్ నారాయణ్ భరత్ గుప్తా వెల్లడించారు. 2026లో ప్రభుత్వ సెలవులు.. హొలీ, ఉగాది, రంజాన్ పండుగలను బట్టి ఈ తేదీలలో మార్పులు జరిగే అవకాశం ఉంది. పరీక్షల షెడ్యూల్‌లో ఏవైనా మార్పులు జరిగితే అధికారికంగా వెల్లడిస్తారు.

పరీక్షలు ఎప్పుడు జరిగినా.. రాయడానికి విద్యార్థులు సిద్ధం కావలి. ఇక కేవలం కొన్ని రోజుల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయి. కాబట్టి ఇప్పటికైనా ఒక టైమ్ టేబుల్ సిద్ధం చేసుకుని చదివితే.. పరీక్షల్లో పాస్ అవ్వడం సమస్యే కాదు. ఏదైనా సబ్జెక్టులో డౌట్స్ ఉంటే.. లెక్చరర్స్ ద్వారా నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతే కాకుండా అవసరమైన విషయాలను తెలుసుకోవడానికి మీ సీనియర్లను కూడా సంప్రదించి తెలుసుకోవచ్చు. మొత్తం మీద ఇంటర్మీడియట్ పరీక్షలు ఉత్తీర్ణత కావడానికి ప్రయత్నించండి. సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయవద్దు.

నిరాడంబరంగా నిశ్చితార్థం!.. విజయ్ & రష్మికల పెళ్లి ఎప్పుడంటే?

0

కొన్నాళ్లుగా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న ఎక్కడ కనిపించినా.. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, డేటింగ్‌లో ఉన్నారని కొన్ని పుకార్లు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. ఈ పుకార్లకు చెక్ పెట్టి.. వీరిరువురు నిశ్చితార్థం చేసుకున్నట్లు తాజాగా కొన్ని వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఈ వార్త నిజమేనా? ఒట్టి గాసిప్ మాత్రమేనా?.. దీనిపై విజయ్, రష్మిక ఏమైనా స్పందించారా? అనే విషయాలను ఈ కథనంలో చూసేద్దాం.

విజయ్ & రష్మికల ఎంగేజ్‌మెంట్!

నటి రష్మిక మందన్న, నటుడు విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమాలో జంటగా నటించారు. ఆ తరువాత డియర్ కామ్రేడ్ చిత్రంలో కనువిందు చేశారు. అయితే ఆ తరువాత కాలంలో వీరిద్దరిపై కొన్ని పుకార్లు రావడం మొదలయ్యాయి. దీనికి తోడు.. ఈ జంట అప్పుడప్పుడు విమానాశ్రయాల్లో కూడా కనిపించారు. దీంతో ఆ పుకార్లకు మరింత బలం వచ్చింది. అంతే కాకుండా గతంలో కూడా ఈ జంట ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అవన్నీ నిజం కాదని తెలిసిపోయింది. ఇప్పుడు తాజాగా ఇదే న్యూస్ మళ్ళీ తెరమీదకు వచ్చింది.

పెళ్లి ఎప్పుడంటే?

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ.. కొంతమంది సన్నిహితులతో హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ నివాసం నిశ్చితార్థం చేసుకున్నారని సమాచారం. వీరి పెళ్లి 2026 ఫిబ్రవరిలో ఉంటుందని కూడా చెబుతున్నారు. అయితే దీనిపై విజయ్ దేవరకొండ గానీ, రష్మిక గానీ ఎవరూ అధికారికంగా స్పందించలేదు. కాబట్టి నిశ్చితార్థం నిజమా?, కాదా అనే విషయం తెలుసుకోవాలంటే.. వీరిలో ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంటుంది. అప్పటివరకు ఇది ఎంతవరకు నిజం అనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించలేము.

చాలాకాలంలో విజయ్, రష్మికలపై వస్తున్న పుకార్లపై.. అప్పుడప్పుడు రష్మిక స్పందించింది. కొన్ని ఇంటర్వ్యూలలో విజయ్ దేవరకొండ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా కొన్ని పండుగలకు రష్మిక.. విజయ్ ఇంట్లో కనిపించింది. విజయ్ దేవరకొండ కూడా వీరి బంధం గురించి ఎప్పుడూ బయటపెట్టలేదు. కానీ పుకార్లు మాత్రం అలా.. అలా పెరుగుతూనే ఉన్నాయి. కాగా ఇప్పుడు ఈ జంట నిశ్చితార్థం చేసుకున్న మాట నిజమే అని కొందరు సన్నిహితులు చెబుతున్నారు. కానీ నిశ్చితార్థం జరిగిందనే చెప్పే ఫోటోలు లేదా వీడియోస్ బయటకు రాలేదు. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ద్రువీకరించలేకపోతున్నాము.

రష్మిక మందన్న గురించి

1995 ఏప్రిల్ 5న జన్మించిన రష్మిక మందన్న 2014లో కిరిక్ పార్టీ అనే చిత్రంతో.. సినిమా రంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత కన్నడలో పునీత్ రాజ్ కుమార్ సరసన అంజనీ పుత్ర సినిమాలో కనిపించింది. తెలుగులో ఈమె మొదటి సినిమా చలో. ఆ తరువాత గీత్ గోవిందం, సరిలేరు నీకెవ్వరూ, భీష్మ, పుష్ప సినిమాల్లో కనిపించి బాగా పాపులర్ అయింది. తన నటనకుగానూ ఈమె.. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సైతం సొంతం చేసుకుంది.

విజయ్ దేవరకొండ గురించి

1989 మే 9న జన్మించిన విజయ్ దేవరకొండ.. నువ్విలా సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టినప్పటికీ.. అర్జున్ రెడ్డి సినిమాతో తెరపైకి వచ్చాడు. ఆ తరువాత రష్మికతో నటించిన గీత గోవిందం ఇతనికి మంచి హైప్ అందించింది. ఆ తరువాత వచ్చిన సినిమాలు చెప్పుకోదగ్గ స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాయి. ఈయన కూడా పలు అవార్డులను అందుకున్నారు.

2025 మహీంద్రా థార్ లాంచ్: రూ.9.99 లక్షల ధరతో..

భారతదేశంలో అతి తక్కువ కాలంలో అధిక ప్రజాదరణ పొందిన.. అత్యధిక అమ్మకాలు పొందిన మహీంద్రా థార్ ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ అయింది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఇతర థార్ మోడల్స్ కంటే కూడా అనేక అప్డేట్స్ పొందింది. ఇంతకీ దీని ధర, ఇతర వివరాలు ఇక్కడ వివరంగా చూసేద్దాం..

వేరియంట్స్ & ధరలు

మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్ ఐదు వేరియంట్లలో లభిస్తుంది. ధరలు రూ. 9.99 లక్షల నుంచి రూ. 16.99 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. 2025 థార్ బేస్ మోడల్ ధర.. మునుపటి స్టాండర్డ్ మోడల్ (రూ. 10.32 లక్షలు) ధర కంటే రూ. 32000 తక్కువ, అయితే టాప్ మోడల్ ధర దాని.. అవుట్‌గోయింగ్ థార్ టాప్ మోడల్ (రూ.16.61 లక్షలు) కంటే రూ. 38000 తక్కువ.

డిజైన్ అప్డేట్స్

2025 మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్ కొత్త కలర్ (టాంగో రెడ్, బాటిల్‌షిప్ గ్రే) ఆప్షన్స్ పొందుతుంది. డ్యూయెల్ టోన్ ఫ్రంట్ బంపర్ కలిగిన ఈ కారు.. హెడ్‌లైట్స్, టెయిల్ లైట్స్ వంటి వాటితో పాటు 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇవి చూడటానికి కొంత స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అనిపిస్తుంది.

ఫీచర్స్

మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్డ్ ఇంటీరియర్ కూడా అప్డేట్స్ పొందింది. కొత్త బ్లాక్ డాష్‌బోర్డ్ థీమ్, కొత్త స్టీరింగ్ వీల్, రియర్ ఏసీ వెంట్స్, డోర్ మౌంటెడ్ పవర్ విండో స్విచ్‌లు, ముందు ప్రయాణికుల కోసం స్టోరేజ్‌తో కూడిన సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌లు, ఏ-పిల్లర్‌పై గ్రాబ్ హ్యాండిల్, స్టీరింగ్ దగ్గర ఫ్యూయెల్ లిడ్ ఓపెనర్ బటన్ మొదలైనవి ఉన్నాయి. అవుట్‌గోయింగ్ మోడల్‌తో పోలిస్తే.. థార్ ఫేస్‌లిఫ్ట్‌లో సేఫ్టీ కిట్‌లో రియర్ వైపర్, వాషర్, రియర్ కెమెరా వంటివి ఉన్నాయి. ఇవి కాకుండా కొత్త 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ కూడా ఉంది.

ఇంజిన్ డీటెయిల్స్

2025 మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్.. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ (152 హార్స్ పవర్), 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ (119 హార్స్ పవర్), 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ (132 హార్స్ పవర్) ఎంపికలతో అందుబాటులో ఉంది. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మోడల్ ఫోర్ వీల్ డ్రైవ్ ఎంపికతో అందుబాటులో ఉంటుంది. పనితీరు పరంగా ఇది స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది.

ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం మహీంద్రా థార్.. 3 డోర్స్ వెర్షన్, 5 డోర్స్ వెర్షన్ (థార్ రాక్స్) రూపంలో అందుబాటులో ఉంది. ఇప్పుడు 3 డోర్స్ మోడల్ ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ అయింది. అంతే కాకుండా కంపెనీ దీనిని ఎలక్ట్రిక్ రూపంలో కూడా లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది.

ఒక కారును ఇన్ని విధాలుగా మార్కెట్లో లాంచ్ చేయడానికి ప్రధాన కారణం దీనికున్న డిమాండ్, కొనుగోలుదారులకు థార్ మీద ఉన్న ఆసక్తి అని తెలుస్తోంది. దేశీయ విఫణిలో మహీంద్రా థార్ ఇప్పటికే సుమారు 3 లక్షల సేల్స్ దాటినట్లు సమాచారం. కాగా ఇప్పుడు లాంచ్ అయినా 2025 థార్ కూడా కంపెనీ అమ్మకాలను పెంచడంలో సహాయపడుతుంది. కాగా థార్ ఎలక్ట్రిక్ వెర్షన్ 2026లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంది.