Home Blog Page 129

అప్పు చేసి నిర్మాతలకు రూ.4.75 కోట్లు ఇచ్చిన సిద్దు: ఎందుకో తెలుసా?

డీజే టిల్లు సినిమాతో ఫేమస్ అయిన హీరో సిద్దు జొన్నలగడ్డ. ఈ సినిమాకంటే ముందు ఇతడు నటించిన సినిమాల విషయానికి వస్తే.. గుంటూరు టాకీస్, జోష్, కృష్ణ అండ్ హిస్ లీలా, మా వింత గాధ వినుమా, భీమిలి కబడ్డీ జట్టు, ఆరెంజ్, కల్కి లాంటి అనేక చిత్రాలు ఉన్నాయి. వీటన్నింటిలో కొద్దిగా మెయిన్ హీరోగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఏదైనా ఉంది అంటే.. అది మాత్రం గుంటూరు టాకీస్ అనే చెప్పుకోవాలి. ఇందులో నరేశ్‌కి, సిద్దుకి మధ్యలో నడిచే క్రైమ్ కామెడీ డ్రామా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. మాస్ ఇమేజ్‌తో సినీ ప్రేక్షకులకు సిద్దు చాలా దగ్గరయ్యాడు. ఆ తరువాత సినిమాలు చేస్తున్న కూడా అంత బజ్‌ను తీసుకురాలేకపోయాయి అనే చెప్పాలి. అటువంటి పరిస్థితిలో వచ్చిందే డీజే టిల్లు.

టిల్లు ఇచ్చిన ఉత్సహం అసాధారణం

మా వింత గాధ వినుమా.. తరువాత సిద్దునే విమల్ కృష్ణతో కలిసి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అన్నీ సిద్ధం చేసుకొని సితారా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై.. సూర్య దేవర నాగవంశీ నిర్మించిన చిత్రం డీజే టిల్లు. సిద్దు జొన్నలగడ్డకి ఈ సినిమా.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సుస్థిరమైన నటుడుగా నిలబెట్టింది. కనీవిననీ రీతిలో అఖండ విజయాన్ని అందజేసింది. అదే ఊపులో డానికి సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్ తీశారు. అది కూడా అంతే రెస్పాన్స్ తీసుకొచ్చింది. ఇప్పటికీ ఎక్కడ చూసిన టిల్లు పాటలు, ఆ డైలాగ్స్ అందరిని ఎంటర్‌టైన్‌ చేస్తూనే ఉంటాయి. పూర్తిస్థాయి హీరోని చేసిన చిత్రం టిల్లు అనే చెప్పాలి.

జాక్ సినిమాతో నష్టాలు

డీజే టిల్లు సీక్వెల్ తరువాత భారీ అంచనాలతో వచ్చిన సినిమా జాక్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తరువాత బొమ్మరిల్లు భాస్కర్ తీసిన చిత్రం జాక్. ప్రకాష్ రాజ్, వైష్ణవి చైతన్య, నరేష్ ,బ్రహ్మజీ, సుబ్బరాజు, రవి ప్రకాష్, రాహుల్ దేవ్, శబీర్ కలరక్కల్ వంటి మంచి పాపులర్ నటులు అందరూ కూడా ఇందులో నటించారు. ఈ మూవీని శ్రీవేంకటేశ్వర సినీ చిత్రాలు బ్యానర్‌పై శ్రీకాంత్, మణికాంత్ నిర్మించారు. అందరూ తెలిసిన మంచి మంచి నటులు, అనుభవమున్న దర్శకుడు, ఆల్రెడీ అందరికి పరిచయం ఉన్న హీరో, హీరోయిన్ అందరూ కూడా ఈ చిత్రంలో భాగం అయ్యారు. అయినప్పటికీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తాను నిరూపించుకోలేక పోయింది.

అక్టోబర్ 17న తెలుసు కదా

సిద్దు జొన్నలగడ్డ కెరీర్‌లో అతి పెద్ద పరాభవాన్ని చవిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. దీనితో జాక్ సినిమా నిర్మాతలు నష్టాల్లో కూరుకుపోయారు. ఆ సమయంలో హీరోగా చేసిన సిద్దు నిర్మాతల ఇబ్బందిని చూడలేక తన దగ్గర డబ్బులు లేకపోయినా బయట నుంచి వడ్డీలకు అప్పు తెచ్చి నిర్మాతలకు రూ. 4.75 కోట్లు ఇచ్చారు. దీంతో ఇండస్ట్రీలో అప్పట్లో.. ఇదొక చర్చనీయాంశం అయింది. సిద్దు వయసులో చిన్నవాడు అయినప్పటికీ తాను ఈ చేసిన మంచి పనికి గొప్ప ప్రసంశలు పొందాడు. ఎదుటి వ్యక్తుల బాధను అర్థం చేసుకోవడంలో ఉన్నతంగా ఆలోచించాడని కొనియాడారు. కాగా ఈ నెల అక్టోబర్ 17న దీపావళి రోజున సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా అనే కొత్త సినిమాతో.. మళ్ళీ ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి బయలుదేరి వస్తున్నాడు.

విక్రమ్ కుమారునికి బ్రేక్ ఇచ్చే సినిమా!.. భారీ అంచనాల మధ్య దీపావళికి..

చియాన్ విక్రమ్ కుమారుడు హీరోగా ధృవ్ విక్రమ్.. హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా బైసన్ (కాలమాదన్). వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు మారీ సెల్వరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. నీలం స్టూడియోస్ మరియు అప్లాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై.. దర్శక నిర్మాత పా. రంజిత్, సమీర్ నాయర్, దీపక్ సెగల్, అదితి ఆనంద్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నివాస్ కే ప్రసన్న ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. పశుపతి.. హీరో తండ్రిగా ప్రధాన పాత్రలో కనిపించునున్నారు.

ధృవ్ విక్రమ్ ఆశలన్నీ బైసన్ పైనే..

ఇప్పటి వరకు ధృవ్ విక్రమ్ రెండు సినిమాల్లో మాత్రమే నటించాడు. అందులోను మొదటి చిత్రమే తెలుగులో వచ్చిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూవీని రీమేక్ చేశారు. వరమా అనే పేరుతో తీసిన ఫస్ట్ వెర్షన్‌లో అంత బలం లేకపోయేసరికి మళ్ళీ రీషూట్ చేసి ఆదిత్య వర్మ అనే పేరుతో విడుదల చేశారు. ఇందులో దృవ్ నటన, స్క్రీన్ ప్రెజన్స్ బాగున్నప్పటికి క్రిటిక్స్ నుంచి మిక్సడ్ పోసిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ వ్యాపార పరంగా చూసుకుంటే యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

ఇక రెండో సినిమా తండ్రి చియాన్ విక్రమ్‌తో కలిసి నటించిన మహాన్. అది ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో రిలీజ్ అవ్వడంతో మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో రిలీజ్ కాకపోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర నష్టపోయిందా, ఫలితాలు రాబట్టిందా అనడానికి వీలులేకుండా పోయింది. కానీ ప్రేక్షకుల్లో.. యువత ఎక్కువుగా అట్రాక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు. ఇప్పుడు మూడవ చిత్రం బైసన్.. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 17న అతి పెద్ద అంచనాలతో ప్రేకక్షకుల ముందుకు రాబోతున్నది. ఇప్పటికే విడుదలైన నాలుగు పాటలు అద్భుతంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో మిలయన్స్ వ్యూస్‌తో అత్యంత ఆదరణ పొందాయి. ధృవ్ విక్రమ్ మంచి మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. కంటెంట్ బాగుంటే ఇదే అతనికి బ్రేక్ ఇచ్చే సినిమా అవుతుంది అని ఊహగానాలు వినిపిస్తున్నాయి.

మారీ మార్క్ మళ్ళీ రిపీట్!

మారీ తీసిన సినిమాలు ఇప్పటి వరకు ఫెయిల్ అయిన దాఖలాలే లేవు. నాలుగు చిత్రాలు పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్, మామన్నన్, వాలై అఖండ విజయాన్ని సృష్టించ్చాయి. కులము, సమాజము, రాజకీయం, అధికారము వీటన్నింతో ఆయన పాత్రలు పోరాటం చేస్తుంటాయి. ధృవ్ లుక్ మిగిలిన రెండు చిత్రాల కంటే భిన్నంగా ఉంది. రఫ్, మాస్ స్టైల్‌లో ఉన్న ధృవ్‌ను చూస్తుంటే తన జీవితంలో ఇదే టర్నింగ్ సినిమా అవుతుందని సినీ క్రిటిక్స్ వర్గాలు చెబుతున్నాయి. మారీ సెల్వరాజ్ కెరీర్‌లో భారీ విజయం పొందనునున్నట్లు అర్థమవుతోంది. మారీ మార్క్ మళ్ళీ రిపీట్ అవ్వాలని కోరుకుందాం.

కథ విషయానికి వస్తే.. పల్లెటూరు వ్యవసాయ కుటుంబం మరియు కబడ్డీ ఆడే క్రీడాకారుని నేపథ్యంలో ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇంతవరకు ఆడిన సినిమాలు.. తండ్రి చియాన్ విక్రమ్ ఇమేజ్ చట్రంలోనే చూస్తున్నారు. బైసన్ ధృవ్‌కు ఒక సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేస్తుందని అందరూ భావిస్తున్నారు. అందుకు తగినట్టే విడుదలైన పాటలు.. అన్నీ నిరూపిస్తున్నాయి. ఈ నెల అక్టోబర్ 17న దీపావళి సంధర్బంగా మారీ, ధృవ్ అభిమానులకు కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారు. ఇందుకోసం ఫ్యాన్స్ కూడా అదే ఉత్సహంతో ఎదురుచూస్తున్నారు.

రెండు వారాల్లో 25000 బుకింగ్స్: పండుగలో ఈ కారుకు ఫుల్ డిమాండ్!

మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లో గొప్ప ఆదరణ పొందుతూ.. ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త విక్టోరిస్ అద్భుతమైన అమ్మకాలను పొందగలిగింది. దీంతో వెయిటింగ్ పీరియడ్ అమాంతం పెరిగిపోయింది.

25000 కంటే ఎక్కువ బుకింగ్స్

సెప్టెంబర్ 15న మారుతి సుజుకి తన విక్టోరిస్ కారును లాంచ్ చేసింది. అయితే మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారు కేవలం రెండు వారాల వ్యవధిలోనే 25000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొంది.. అమ్మకాల్లో ఓ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కంపెనీ ఈ విషయాన్ని తాజాగా విడుదల చేసింది. దీంతో ఈ కారు కోసం వెయిటింగ్ పీరియడ్ ఎంపిక చేసిన వేరియంట్‌లకు సుమారు 10 వారాలు ఉన్నట్లు తెలిసింది. అయితే ఏ వేరియంట్ కోసం ఎన్ని వారాలు వెయిట్ చేయాలనే విషయాన్ని సంస్థ అధికారికంగా వెల్లడించలేదు.

ఈ ఏడాది నవరాత్రి సీజన్ మారుతి సుజుకి కంపెనీకి బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఈ సమయంలో విక్టోరిస్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. కంపెనీ 2025 జనవరి నుంచి ఆగస్టు వరకు సుమారు 1.50 లక్షల కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు వెల్లడించింది. కాగా ఇప్పటికి (9 నెలల కాలంలో) దాదాపు 1.65 లక్షల వాహనాలను విక్రయించినట్లు తెలిపింది. అంతే కాకుండా సంస్థ దసరా నాటికి 2 లక్షల కార్లను విక్రయించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. బహుశా ఈ లక్ష్యాన్ని చేరుకొని ఉంటుందనే భావిస్తున్నాము.

మారుతి సుజుకి విక్టోరిస్

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త మారుతి సుజుకి విక్టోరిస్ కారు యాంత్రికంగా గ్రాండ్ విటారా మాదిరిగా ఉంది. అయితే కంపెనీ ఈ కారును నెక్సా అవుట్‌లెట్‌ల ద్వారా కాకుండా.. అరీనా అమ్మకాల నెట్‌వర్క్ ద్వారా విక్రయించనుంది. కాగా విక్టోరిస్ భారతీయ విఫణిలో ఇప్పటికే అమ్మకానికి ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

మారుతి విక్టోరిస్ కారు ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ (ఓ), జెడ్ఎక్స్ఐ ప్లస్ (ఓ) అనే ఆరు వేరియంట్లలో.. మూడు ఇంజిన్ (పెట్రోల్, సీఎన్‌జీ, స్ట్రాంగ్ హైబ్రిడ్) ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. ఈ కారులోని 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్.. 101.6 బీహెచ్‌పీ పవర్, 139 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కాన్వర్టర్ ఆటోమాటిక్ ఎంపికలను పొందుతాయి. సీఎన్‌జీ వేరియంట్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ మాత్రమే పొందుతుంది.

స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఆన్‌బోర్డ్ బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ మోటారుతో జతచేస్తుంది. పెట్రోల్ మిల్ సుమారు 91.7 బీహెచ్‌పీ పవర్, 122 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఎలక్ట్రిక్ మోటారు 79 బీహెచ్‌పీ పవర్, 141 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. తద్వారా మంచి పనితీరును అందిస్తుంది.

మారుతి విక్టోరిస్ సేఫ్టీ రేటింగ్

మంచి డిజైన్, ఫీచర్స్ కలిగిన మారుతి విక్టోరిస్ అత్యుత్తమ పనితీరును అందించడం మాత్రమే కాకుండా.. అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. దీంతో ఇది సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగులు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ వంటి ఫీచర్లతో లెవల్ 2 ఏడీఏఎస్ సిస్టం వంటి వాటితో.. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ కూడా ఉన్నాయి.

ఎయిమ్స్ పాట్నాలో ఉద్యోగాలు: కేవలం ఇంటర్వ్యూ మాత్రమే!

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పాట్నా (ఎయిమ్స్ పాట్నా) ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ప్రాజెక్ట్ రీసెర్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హతలు ఏమిటి?, లాస్ట్ డేట్ ఎప్పుడు అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

పోస్టులు & క్వాలిఫికేషన్

ఎయిమ్స్ పాట్నా నోటిఫికేషన్ ప్రకారం రెండు పోస్టులకు మాత్రమే వేకెన్సీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ కాగా.. మరొకటి ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ జాబ్. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునేవారు సంబంధిత విభాగంలో డిప్లొమా, ఎమ్ఎల్టీ, డీఎమ్ఎల్టీ, బీఏఎమ్ఎస్ వంటి వాటిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అంతే కాకుండా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరెటరీ టెక్నాలజీ లేదా ఆయుర్వేద శాస్త్రంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.

నిర్ణీత వయసు & జీతం వివరాలు

ఎయిమ్స్ పాట్నా రిలీజ్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థుల నిర్ణీత వయసు 28 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం విషయానికి వస్తే ప్రాజెక్ట్ రీసర్చ్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ. 67000, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ. 18000 జీతం ఉంటుందని సమాచారం.

ఎంపిక విధానం & అప్లై చేసే విధానం

ఎయిమ్స్ పాట్నా ఉద్యోగాలకు ఎంపిక విధానం కేవలం ఇంటర్వ్యూ మాత్రమే. అంటే ఇంటర్యూ ద్వారా మాత్రమే ఉద్యోగానికి కావలసిన అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. కాగా అప్లై చేసుకోవాలంటే ఈమెయిల్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ రేపే (2025 అక్టోబర్ 04). అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఎప్పుడు అనేది ఆ తరువాత తెలుస్తుంది.

కేవలం రెండు ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ అని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తికి కావలసింది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే అన్న విషయం మర్చిపోకూడదు. కాబట్టి మీలో ట్యాలెంట్ ఉంటే తప్పకుండా ఒక ఉద్యోగం మీ సొంతం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అర్హతలు కలిగిన వాళ్లు ఒకసారి ఈ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే మంచిది. ఉద్యోగం పొందిన తరువాత కూడా మీ అనుభవాన్ని అభిరుచి బట్టి మరింత ఉన్నతమైన స్థానానికి వెళ్ళవచ్చు.

ఉద్యోగాల కోసం ఎలా సన్నద్ధమవ్వాలి

నిజానికి చదువు పూర్తైనవారి ఏకైక లక్ష్యం ఉద్యోగ సంపాదనే. అసలు చదువుకోవడానికి ఉద్యోగం పొందటానికి అని అందరికి దృఢ సంకల్పం. కాబట్టి ఉద్యోగాల కోసం వేచిచూసే అభ్యర్థుల సంఖ్య లక్షల్లో ఉంటోంది. వచ్చే నోటిఫికేషన్ మాత్రం వేలలో కూడా ఉండటం లేదు. ఇలాంటి సమయంలో ఉద్యోగం తెచ్చుకోవడానికి గట్టిగా ప్రిపేర్ అవ్వడమే కాదు. కొన్ని స్కిల్స్ కూడా పెంపొందించుకోవడం చాలా అవసరం. ఇలాంటి స్కిల్స్ కోసం నిపుణులు సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న అభ్యర్థి.. యుద్దానికి సిద్దమైన ఒక సైనికునిలాగా ఎప్పుడూ సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ పోటీ ప్రపంచంలో మేల్కోక పోతే.. వెనుకపడిపోయే అవకాశం ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉందుకుని సన్నద్ధం కావాలి.

కుమారుడి పేరు వెల్లడించిన వరుణ్ తేజ్: పవన్ పేరులాగే అబ్బాయికి..

కొణిదెల నాగబాబు వారసుడు.. వరుణ్ తేజ్ & లావణ్య త్రిపాఠి దంపతులకు సెప్టెంబర్ 10న కుమారుడు పుట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ బాబుకు విజయదశమి సందర్భంగా బారసాల చేసి, నామకరణం కూడా చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.

లావణ్య & వరుణ్ తేజ్ కుమారుడి పేరు

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల కుమారుడి పేరును వాయువ్ తేజ్ కొణిదెలగా నామకరణం చేసారు. హనుమాన్ ఆశీర్వాదంతో పుట్టాడని, అందుకే ఆ ఆంజనేయుని పేరు వచ్చేలా.. తమ కుమారుడి పేరు పెట్టుకున్నట్లు సమాచారం. వాయువ్ అనే హనుమంతుని పేర్లలో ఒకటి. ఇక తేజ్ అనేది వరుణ్ తేజ్ పేరులో ఉన్నదే. ఇక చివరి ఇంటిపేరు చేర్చి.. వాయువ్ తేజ్ కొణిదెలగా పేరుపెట్టుకున్నారు. పేరు పెట్టిన సందర్భంగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ తమ కొడుకు దగ్గర ఉన్న ఫోటోలు షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వాయువ్ తేజ్ కొణిదెలను నెటిజన్లు ఆశీర్వదిస్తున్నారు.

హనుమంతుని పేర్లు ఎందుకంటే?

నిజానికి కొనేదెలా కుటుంబంలో చాలామంది పేర్లు హనుమంతుని పేరుతో ముడిపడి ఉన్నాయి. చిరంజీవి (చిరకాలం జీవించి ఉండేవాడు – హనుమంతుడు), పవన్ కళ్యాణ్ (పవన్ అంటే వాయుదేవుడు – వాయుదేవుని కుమారుడు ఆంజనేయుడు), రామ్ చరణ్ (రాముని చరణాల దగ్గర ఉండేవాడు – అంజనీ సుతుడు), ఇప్పుడు వరుణ్ తేజ్ కుమారుడు వాయువ్ తేజ్ (వాయువ్ అనే కూడా ఆంజనేయ స్వామితో ముడిపడి ఉంది).

చిరంజీవి తండ్రి స్వయంగా ఆంజనేయ స్వామి భక్తుడని చాలా సందర్భాల్లో మెగాస్టార్ చెప్పుకొచ్చారు. ఈ కారణంగానే తమ్ముడికి పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టినట్లు చెప్పారు. తాను కూడా ఆంజనేయస్వామి భక్తుడు కావడం చేత.. రామ్ చరణ్ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఇప్పుడు దీనినే వారసత్వంగా తీసుకుని వరుణ్ తేజ్ కూడా తన బిడ్డకు వాయువ్ అని పేరు పెట్టినట్లు అర్థమవుతోంది.

వరుణ్ తేజ్ & లావణ్య త్రిపాఠిల గురించి

నిజానికి వీరిరువురు నటీ నటులు. వరుణ్ తేజ్ ముకుంద, కంచె, లోఫర్, మిస్టర్, ఫిదా, తొలి ప్రేమ మొదలైన సినిమాల్లో హీరోగా నటించాడు. లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే.. అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినిమా అరంగేట్రం చేసిన ఈమె.. ఆ తరువాత దూసుకెళ్తా, భలేభలే మగాడివోయ్, శ్రీరస్తు శుభమస్తు, సోగ్గాడే చిన్నినాయన, రాధ, ఉన్నది ఒకటే జిందగీ మొదలైన సినిమాల్లో నటించింది.

మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయమే.. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ మధ్య ప్రేమగా మారింది. ఆ తరువాత వీరు ఇరువురి ఇళ్లలో ఒప్పించి.. పెద్దల సమక్షంలో 2013లో ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత హైదరాబాద్ వచ్చిన తరువాత కూడా రిసెప్షన్ పెట్టుకున్నారు. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కాగా ఇప్పుడు ఈ జంటకు కొడుకు పుట్టాడు. ఈ జంట ప్రస్తుతం అన్యోన్యంగా తమ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

10వ తరగతి అర్హతతో జాబ్: రూ.60,080 వరకు జీతం!

చదువు పూర్తయ్యి ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యే అందరూ ఎదురుచూసేది.. ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని. అలాంటి వాటికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదవతరగతి, ఐటీఐ పూర్తి చేసినవారికి ఏకంగా 1743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.

టీజీఎస్ఆర్టీసీ (తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్) విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. రాష్ట్రంలోని వివిధ జోన్లలలో మొత్తం 1743 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో 1000 డ్రైవర్ పోస్టులు కాగా.. మిగిలినవి 743 శ్రామిక్ పోస్టులు. నిర్దేశించిన అర్హత కలిగిన ఉద్యోగులు ఈ నెల 8 నుంచి (2025 అక్టోబర్ 8) ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 2025 అక్టోబర్ 28.

వయో పరిమితి & వేతన వివరాలు

డ్రైవర్ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకునే వారి వయసు 22 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి. అదే విధంగా శ్రామిక్ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకునే వారి వయసు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు వయోపరిమితి ఐదేళ్లు సడలింపు ఉంటుంది. ఈఎస్ఎం అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

వేతనం విషయానికి వస్తే.. డ్రైవర్ ఉద్యోగానికి ఎంపికైనవారికి వేతనం రూ. 20,960 నుంచి రూ. 60,080 వరకు ఉంటుంది. కాగా శ్రామిక్ ఉద్యోగానికి ఎంపికైన వారికి జీతం రూ. 16,500 నుంచి రూ. 45,030 వరకు ఉంటుంది. అయితే ఉద్యోగంలో చేరిన తరువాత అనుభవం, సీనియారిటీని బట్టి పెరుగుతుంది.

అప్లై విధానం & అప్లికేషన్ ఫీజు

అక్టోబర్ 8 నుంచి టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డ్రైవర్ ఉద్యోగాలకు అప్లై చేసికోవడానికి అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 300 కాగా.. ఇతరులకు రూ. 600. అదే విధంగా శ్రామిక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 200 చెల్లించాలి, ఇతరులు రూ. 400 చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం ఇలా..

టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తరువాత ఎంపిక విధానం ఎలా ఉండబోతోందంటే?.. డ్రైవింగ్ టెస్ట్ మాత్రమే కాకుండా.. మెడికల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ వంటివి కూడా ఉండనున్నాయి. అయితే ఎలాంటి రాత పరీక్ష ఉండదని తెలుస్తోంది. కాబట్టి ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునేవారు కొంత గట్టిగా ప్రయత్నిస్తే తప్పకుండా సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంది. అయితే డ్రైవింగ్‌కు సంబంధించిన లైసెన్స్, ఇందులో కొంత అనుభవం కూడా అవసరమని తెలుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించడానికి ఎప్పటికప్పుడు కావలసిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇటీవల పోలీస్ నియమాలు చేపట్టింది. ఇది మాత్రమే కాకుండా వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ వంటి వాటిలో కూడా ఉద్యోగాలను కల్పించింది. ఇప్పుడు టీజీఎస్ఆర్టీసీలో కూడా ఉద్యోగాలను కల్పించడానికి సిద్ధమైంది. రాబోయే రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్స్ జారీ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్దమవుతున్నవారు.. మరింత గట్టిగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంది. లేకుంటే పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం చాలా కష్టమైపోతుంది.

ఆత్మగౌరవం, తెగింపే ఆయన సినిమాలు: ఇప్పుడు విక్రమ్ తనయునితో..

డైరెక్టర్ మారి సెల్వరాజ్ ఆత్మగౌరవ చిత్రాలకు పెటింది పేరు. అతని సినిమాలు అన్ని కూడా మనుషుల యొక్క నిజ జీవితాలకు చాలా దగ్గరగా ఉంటాయి. అంతేకాకుండా సమాజంలో నిత్యం జరిగే అన్యాయాలు, అవమానాలు, అణచివేతలే తన సినిమాలకు కేంద్ర బిందువుగా మారుతాయి. ఆయన తీసే చిత్రాల్లోని సన్నివేశాలు నిరాశావాదంలో కూరుకుపోయిన వారిలో జీవితం పట్ల ఆశావాదాన్ని రేకెత్తిస్తాయి. మారి సెల్వరాజ్‌కు చెందిన.. ఏ మూవీ చూసినగానీ ధీనత్వంలో ఉన్న బాధితులకు తెగింపుని, ధైర్యాన్ని నింపి, వారి వారి సమస్యలపై పోరాడే తత్వాన్ని నేర్పి వాళ్ల గుండెల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. తన నిత్య జీవిత సంఘటనల ఆధారంగా రాసే చిన్న చిన్న డైలాగ్స్ మనకు ప్రేరణ కలిగిస్తాయి. ప్రతి పాత్రలో మనల్ని మనం చూసుకున్నట్టే ఉంటుంది. మనకు ఎంతో ప్రేరణ కలిగించి, మనలో స్ఫూర్తిని నింపే సృజనాత్మక దర్శక, రచయిత గురించి మరి కొన్ని వివరాలు తెలుసుకుందాం..

మారి సెల్వరాజ్ సినిమా జీవిత ప్రస్థానం..

సెల్వరాజ్ మొదట నటుడు అవ్వాలి అని తమిళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కానీ తరువాత తాను డైరెక్టర్ రామ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. సహాయ దర్శకుడిగా కాట్రాదు తమిళ్, తంగ మీనకల్, తారామణి వంటి సినిమాలకు పని చేశాడు. 2018లో వచ్చిన పరియేరుమ్ పెరుమాళ్ సినిమాతో పూర్తిస్థాయి దర్శకుడిగా మారాడు.

తర్వాతి కాలంలో చిత్రీకరించిన ధనుష్ కర్ణన్ . ఉదయనిధి స్టాలిన్ నటించిన మామన్నన్. వాలై ఇందులో అందరిని కొత్త నటీనటులతో తీశారు. పై అన్నీ చిత్రాలు కూడా విజయవంతమై ప్రేక్షకాదరణ పొందాయి. ప్రస్తుతం చియాన్ విక్రమ్ కుమారుడు దృవ్ విక్రమ్‌తో చేస్తున్న సినిమా బైసన్ ఈ దీపావళి కి విడుదలకు సిద్ధంగా ఉంది. డైరెక్టర్‌గానే.. కాకుండా పాటల రచయితగా, స్క్రీన్ రైటర్‌గా, సీరియల్ రైటింగ్, పుస్తక రచయితగా కూడా గుర్తింపు పొందాడు.

మారి సినిమాల్లో ఏముంది?

పరియేరుమ్ పెరుమాళ్: ఇందులో సమాజంలోని కులవ్యవస్థ అందులోని వివక్ష పట్ల ఒక చదువుకున్న యువకుడు చేసే ఎదిరించి చేసే పోరాటం కనబడుతుంది. ఆ సినిమాతో ఎన్నో అవార్డులు, ప్రశంసలతో పాటు కీర్తిప్రతిష్టలు పొందాడు.

కర్ణన్: సినిమాలో ఒక సాధారణ పల్లెటూరి పిల్లగాడు తన చుట్టూ జరిగే సమస్యలు అన్యాయాల మీద ప్రతిఘటించే విధానం మనల్ని ఆకట్టుకుంటుంది. కథానాయకుడు బాహ్య ప్రపంచానికి, అంతర్గత ప్రపంచానికి మధ్య పడే సంఘర్షణ మనల్ని గుండెల్ని పిండేలా చేస్తుంది. చట్టం, వ్యవస్థ నిన్ను కాపాడలేనప్పుడు నువ్వే నీ వాళ్ళని రక్షించుకోవాలనే వీరత్వాన్ని నేర్పిస్తుంది.

మామన్నన్ (తెలుగులో నాయకుడు): ఈ చిత్రంలో రాజకీయంలోని అధికార అహంకారం, సొసైటీలో ఉన్న వ్యత్యాసం & బానిస మనస్తత్వం పట్ల తిరగబడి పోరాడే వ్యక్తి జీవితం అందరిని ఆలోచింపజేస్తుంది. మనం నిత్యం చుట్టుపక్కల జరిగే అంశాలే వాటిని బలంగా మన చెంపపై కొట్టినట్టు ఉంటుంది. మీ బానిసత్వాన్ని పోగొట్టుకుని మహారాజుల్లా జీవించమని ఈ మూవీ బోధిస్తుంది.

వాలై: దినసరి అరటి కూలీల జీవితాలు, బాధలు మధ్యలో ఒక తెలివైన స్కూల్ విద్యార్థి భవిష్యత్తు వీటన్నిటి మధ్య అనుకోని ఒక సంఘటన ఎలా బతుకులను మార్చివేసింది అనేది అద్భుతంగా చూపించారు. తన జీవిత వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకేక్కించిన అంశాలు ప్రేక్షకులకు కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాయి.

బైసన్: ఈ నెల 17 న దీపావళి రోజున విడుదలకు సిద్దమైంది. కబడ్డీ ఆటగాడి చుట్టూ కథాంశం అల్లుకోబడి ఉన్నట్టుగా అర్థమవుతోంది.

వ్యక్తిగత జీవితం గురించి క్లుప్తంగా..

ఈయన పూర్తి పేరు మారి సెల్వమ్ సెల్వరాజ్. తమిళనాడు లోని తిరునల్వేళిలో 1984 మార్చి 7న జన్మించారు. దివ్య అనే ఆమెతో 2016లో వివాహం అయింది, వీరికి నవ్వి (కుమార్తె ), యువ్వాన్ (కుమారుడు) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మారి అతి సాధారణ దిగువ మధ్యతరగతి నుంచి వచ్చినవాడు. ప్రస్తుతం తన వృత్తి దర్శకుడు, రచయిత, స్క్రీన్ రైటర్, పాటల రచయితగా కొనసాగుతున్నాడు

ఈ నెలలో (2025 అక్టోబర్) లాంచ్ అయ్యే కార్లు: ఆక్టావియా ఆర్ఎస్ నుంచి ఎయిర్‌క్రాస్ ఎక్స్ వరకు

2025 మొదలైన 8 నెలలు పూర్తయ్యాయి. ఈ సమయంలో లెక్కకు మించిన కార్లు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. కాగా ఈ నెలలో (2025 అక్టోబర్) కూడా కొన్ని కార్లు దేశీయ విఫణిలో లాంచ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. ఇంతకీ ఏ కార్లు లాంచ్ కానున్నాయి?, ఎప్పుడు లాంచ్ కానున్నాయి?, వాటి వివరాలు ఏమిటి? అనే విషయాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

2025 స్కోడా ఆక్టావియా ఆర్ఎస్

స్కోడా కంపెనీ అక్టోబర్ 17న తన 2025 ఆక్టావియా ఆర్ఎస్ కారును లాంచ్ చేయనుంది. కంపెనీ ఈ కారు కోసం అక్టోబర్ 6 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనుంది. కాగా ఏ కారు భారతదేశంలో లిమిటెడ్ ఎడిషన్ రూపంలో కేవలం 100 యూనిట్లకు మాత్రమే పరిమితం. డెలివరీలు డిసెంబర్ 6 నుంచి ప్రారంభమవుతాయి. ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానున్న ఆక్టావియా ఆర్ఎస్ 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ద్వారా 265 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ ద్వారా జతచేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ కారు 6.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 250 కిమీ/గం కావడం గమనార్హం.

మినీ కంట్రీమ్యాన్ జేసీడబ్ల్యు అల్4

దేశీయ మార్కెట్లో లాంచ్ కానున్న కార్ల జాబితాలో మినీ కంట్రీమ్యాన్ జేసీడబ్ల్యు ఆల్4 ఒకటి. ఇది అక్టోబర్ 14న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కంపెనీ దీని కోసం ఇప్పటికే ఆన్‌లైను & ఆఫ్‌లైన్ బుకింగ్స్ స్వీకరించడం సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభించింది. ఈ కారు 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ద్వారా 300 హార్స్ పవర్ లాంచ్ చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ పొందవచ్చు. ఈ కారు కేవలం 5.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని ధర రూ. 50 లక్షల (ఎక్స్ షోరూమ్) కంటే ఎక్కువ ఉంటుందని అంచనా.

మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్

థార్ ఫేస్‌లిఫ్ట్ రూపంలో ఈ నెలలో (అక్టోబర్ 2025) లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడలేదు. ఇప్పటికే అధిక ప్రజాదరణ పొందుతున్న థార్ ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ అయితే.. తప్పకుండా మంచి ఆదరణ పొందుతుందని భావిస్తున్నారు. అందులోనే పండుగల సమయంలో లాంచ్ అయితే అమ్మకాలు పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ కారు సీ టైప్ డీఆర్ఎల్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్, 3 స్పోక్ స్టీరింగ్ వీల్, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం మొదలైనవి పొందుతుందని సమాచారం. కాగా ఇది 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ టర్బో డీజిల్, 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుందని సమాచారం.

సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ఎక్స్

ప్రెంచ్ వాహన తయారీ సంస్థ కూడా ఈ నెలలో తన ఎయిర్‌క్రాస్ ఎక్స్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. అయితే కంపెనీ ఈ కారును ఎప్పుడు లాంచ్ చేస్తుందనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ నెల చివరి నాటికి లాంచ్ అవుతుందని సమాచారం. కాగా దీనికోసం బుకింగ్స్ సెప్టెంబర్ 16 నుంచి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఎయిర్‌క్రాస్ ఎక్స్ అనేది స్టాండర్డ్ మోడల్ కంటే కొంత అప్డేట్స్ పొందినట్లు సమాచారం. అయితే ఇందులో ఎలాంటి మెకానికల్ అప్డేట్స్ ఉండవని తెలుస్తోంది. కాబట్టి అదే 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 110 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ పొందుతుంది. ఈ కారు ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.

పెళ్లి చేసుకున్న అవికా గోర్: ఈమె భర్త ఇంత ట్యాలెంటెడ్‎డా!

0

చిన్నారి పెళ్లికూతురు అనగానే అవికా గోర్ గుర్తొస్తుంది. అంతలా పాపులర్ అయిన ఈ అమ్మడు తాజాగా పెళ్లి చేసుకుంది. 2020 నుంచి ప్రేమించిన తన ప్రియుడు మిలింద్ చాంద్వానీతో ఏడడుగులు నడించింది. దీంతో అవికా గోర్ అభిమానులు మిలింద్ చాంద్వానీ ఎవరనే విషయం తెలుసుకోవడానికి నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు.

ఎవరీ మిలింద్ చాంద్వానీ?

మిలింద్ చాంద్వానీ.. ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్ధి. ఈయన బెంగళూరులోని దయానంద సాగర్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. కాగా ప్రస్తుతం కుకు ఎఫ్ఎమ్లో ప్రొడక్షన్ విభాగంలో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇతను గతంలో బైజూస్, ఓలా ఎలక్ట్రిక్ సంస్థల్లో కూడా పనిచేసినట్లు సమాచారం. అంతే కాకుండా ఈయన రియాలిటీ షో రోడీస్ రియల్ హీరోస్‌లో కూడా పాల్గొన్నాడు.

చదువు పూర్తయిన తరువాత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా తన కెరియర్ ప్రారంభించిన మిలింద్.. క్యాంప్ డైరీస్ అనే ఎన్‌జీవో ఫౌండర్ కూడా. దీంతో ఇతడు సామజిక అభివృద్ధి కార్యక్రమాలపై కూడా దృష్టి సారిస్తూ.. వెనుకబడిన భారతీయ పిల్లలకు సాధికారతను కల్పిస్తున్నాడు. సోషల్ మీడియాలో కూడా బాగా ఫేమస్ అయిన మిలింద్ సోషల్ మీడియా ఫేమ్ కూడా. ఈయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా లక్ష కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే.. అవికా గోర్ భర్త ఇంత ట్యాలెంటెడ్‎డా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

అవికా గోర్ లవ్‌స్టోరీ

2019లో ఒక కార్యక్రమంలో కలుసుకున్న మిలింద్.. అవికా గోర్ 2020లో డేటింగ్ ప్రారంభించారు. ఆ తరువాత ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. కాగా 2025 సెప్టెంబర్ 30 పెళ్లి చేసుకున్నారు. పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా వీరిరువురూ తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. అభిమానులు ఈ జంటకు పెద్ద ఎత్తున శుభాకంక్షాలు చెబుతున్నారు.

అవికా గోర్ గురించి

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా పాపులర్ అయిన.. అవికా గోర్ ఉయ్యాలా జంపాల సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఆ తరువాత లక్ష్మి రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, తను నేను, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజుగారి గది 3, నెట్, బ్రో, ఉమాపతి వంటి సినిమాల్లో నటించింది. ఈమె తెలుగులో మాత్రమే కాకుండా.. కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటించింది. కాగా ఈమె మూడు ఇండియన్ అకాడమీ అవార్డులను, ఒక సైమా అవార్డును అందుకుంది.

1997 జూన్ 30న ముంబైలోని ఒక గుజరాతీ కుటుంబంలో జన్మించిన అవికా గోర్.. ముంబైలోని ములుండ్ శివారులోని షారన్ ఇంగ్లీష్ హైస్కూల్‌లో చదివింది. కాగా 2007లో హిందీ సీరియల్స్ ద్వారా టెలివిజన్ రంగానికి పరిచయమై.. ఆ తరువాత వరుస సినిమాల్లో నటిస్తూ.. తనదైన రీతిలో అభిమానులను సంపాదించుకుంది. ఇటీవల చిన్నారి పెళ్లి కూతురు నిజంగానే పెళ్లి కూతురై.. మిలింద్ చాంద్వానీని పెళ్లి చేసుకుని.. సోషల్ మీడియా ఖాతాల్లో ఫోటోలు షేర్ చేసింది. దీంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతూ.. ఆశీర్వదిస్తున్నారు.

నయనికతో.. అల్లు శిరీష్ నిశ్చితార్థం: డేట్ ఫిక్స్

0

అల్లు రామలింగయ్య మనువడు, అల్లు అరవింద్ కుమారుడైన.. అల్లు శిరీష్ త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నాడు. ఈ విషయాన్ని శిరీష్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

శిరీష్ ఇన్‌స్టా పోస్ట్

పారిస్‌లోని ఐఫెల్ టవర్ దూరంగా కనిపించే విధంగా చేతులు పట్టుకున్న ఫోటో షేర్ చేస్తూ.. అక్టోబర్ 31నయనికను పెళ్లి చేసుకోబోతున్నట్లు అల్లు శిరీష్ పేర్కొన్నారు. ఈ రోజు మా తాత అల్లు రామలింగాయ్య జయంతి సందర్భంగా ఈ విషయం చెప్పడానికి చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. ఇటీవలే మా నుంచి దూరమైనా మా అమ్మమ్మ.. ఎప్పుడూ నా పెళ్లి చూడాలని ఆశపడుతూ ఉండేది. ప్రస్తుతం ఆమె మాతో లేకపోయినా.. మేము కలిసి ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు (పెళ్లి చేసుకున్నప్పుడు).. పైనుంచి తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదిస్తుందని శిరీష్ ఒక నోట్ షేర్ చేశారు.

అల్లు శిరీష్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. త్వరలో అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నాడని, అల్లువారి ఇంట పెళ్లిబాజాలు మోగుతాయని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అయితే ప్రస్తుతం నిశ్చితార్థం తేదీని మాత్రమే వారు విడుదల చేశారు. పెళ్లి ఎప్పుడు?, ఎక్కడ? అనే విషయాలను అధికారికంగా వెల్లడించలేదు. నిశ్చితార్థం తరువాత ఈ విషయాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

ఎవరీ నయనిక?

అల్లు శిరీష్ పెళ్లిచేసుకోబోయే అమ్మాయి నయనిక ఎవరనే విషయం తెలుసుకోవడానికి.. నెటిజన్లు తెగ సంబరపడిపోతున్నారు. గూగుల్లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు. పొలిటీషియన్ కూతురా?, లేక పారిశ్రామికవేత్త కూతురా? లేక.. చిన్ననాటి స్నేహితురాలా? అని పలురకాలుగా సెర్చ్ చేస్తున్నారు. కానీ శిరీష్ పెళ్లిచేసుకోబోయే అమ్మాయి నయనిక ఎవరనే విషయం మాత్రమే కాకుండా ఫోటో కూడా రిలీజ్ చేయలేదు. నిశ్చితార్థం రోజున ఎవరీ నయనిక? అనే ప్రశ్నకు తప్పకుండా సమాధానం దొరికే అవకాశం లభిస్తుంది.

అల్లు శిరీష్ గురించి

శిరీష్ విషయానికి వస్తే.. సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ అల్లు శిరీష్ చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్స్ సాధించలేదు. హీరోగా సినిమాల్లో నటించినప్పటికీ.. అల్లు అర్జున్ అంత క్రేజ్ సంపాదించుకోలేక పోయారు. 2013లో గౌరవం సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన అల్లు శిరీష్.. ఆ తరువాత కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బడ్డీ వంటి సినిమాల్లో నటించారు.

2024లో రిలీజ్ అయిన బడ్డీ సినిమా తరువాత అల్లు శిరీష్.. ప్రస్తుతం ఏ సినిమాలో నటించలేదని తెలుస్తోంది. అయితే సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా.. ఐఐఎఫ్ఏ ఉత్సవ్, ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్, సైమా అవార్డ్స్ వంటి కార్యక్రమాలకు హోస్ట్‌గా కూడా వ్యవహరించారు. 1987 మే 30న జన్మించిన అల్లు శిరీష్.. 38 ఏళ్ల వయసులో పెళ్లి పీటలేక్కబోతున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న అల్లు శిరీష్ &  నయనిక జంటను ఎప్పుడెప్పుడు చూస్తామా? అని శిరీష్ అభిమానులు, సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎంత ఎదురు చూసినా ఈ నెల 31 వరకు వేచి చూడాల్సిందే.