Home Blog Page 130

నారా లోకేష్‌కు తిలక్ వర్మ స్పెషల్ గిఫ్ట్: ఎదురు చూస్తున్నా.. అన్న ఐటీ మినిష్టర్!

భారత్ – పాకిస్తాన్ ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో.. చివరి వరకు పోరాడి జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి తిలక్ వర్మ. పాకిస్తాన్ బౌలింగ్ దాటికి ఇండియా టీమ్ టాప్ ఆటగాళ్లంతా.. క్రికెట్ అభిమానుల కళ్ళలో నిరాశలు నింపి, ఒక్కొక్కరుగా మైదానం నుంచి నిష్క్రమిస్తున్న వేళ పాకిస్తాన్ బౌలర్లు నన్నేమీ చెయ్యలేరు అన్నట్టు ఫోర్లు, సిక్సులతో వీర బాదుడు బాదాడు. సంజు శ్యాంసన్, శివమ్ దుబేతో కలిసి మంచి పార్టనర్షిప్ స్కోర్ చేస్తూ 53 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సులతో 69 స్కోర్ చేశాడు. అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్య కుమార్ యాదవ్ ఇలా వరుసగా అందరూ విఫలమైన అతి క్లిష్టమైన సమయంలో మ్యాచ్‌ను ఆపద్దబాంధవుడిలా ఆదుకున్నాడు. మొత్తంగా భారత్‌కు విజయాన్ని అందించాడు.

తిలక్ వర్మ స్పెషల్ గిఫ్ట్

ఈ గెలుపు సంబరాల అనంతరం తిలక్ వర్మ భారత్ – పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్‌లో.. తాను వాడినటువంటి హెడ్ క్యాప్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు.. రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ & ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్‌కు బహుమతిగా ఇచ్చారు.

ఆ క్యాప్‌పైన తిలక్ వర్మ ఈ క్రింది విధంగా రాసుకొచ్చాడు. “ప్రియమైన లోకేష్ అన్నా.. చాలా ప్రేమతో.. ఈ క్యాప్ మీ కోసమే” అని తన మసులోని భావాలను, తనలోని విజయానందాన్ని మంత్రి లోకేష్ మీద ఉన్న అభిమానాన్ని ఆ క్యాప్‌పై రాశాడు. తను రాస్తున్న ఆ దృశ్యాన్ని మొబైల్ ఫోన్‌లో వీడియో రూపంలో చిత్రీకరించారు, ఆ సమయంలో తను రాసేటప్పుడు చెప్పలేనంత హ్యాపీగా కనిపించాడు. వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి నారా లోకేష్ పట్ల తన ప్రేమను ఈ రకంగా అందరితో పంచుకున్నాడు. ఆ గిఫ్ట్‌ను తిలక్ వరకు స్వయంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు అందిఇవ్వనున్నారు.

ఐటీ మినిష్టర్ నారా లోకేష్ స్పందన ఇలా..

తిలక్ వర్మ పోస్ట్ చేసిన ఆ వీడియోకి మంత్రి నారా లోకేష్ కూడా.. అంతే సోదర భావంతో ప్రతిస్పందించారు. నా జీవితంలో నాకు ఇది చాలా ప్రత్యేకమైన, గొప్పదైన రోజుగా మారిపోయిందని, నువ్వు ఇండియాకి తిరిగి వచ్చినప్పుడు ఆ బహుమతిని నీ చేతుల మీదుగా నేను తీసుకుంటాను అని ఆయన ట్వీట్ చేశారు. అంతే కాకుండా నువ్వు ఆ గిఫ్ట్‌ను నేరుగా నాకు ఇచ్చేటప్పుడు దాన్ని నేను తీసుకోవడానికి, ఎంతో ఉత్సహంతో ఎదురుచూస్తూ ఉంటానని చెప్పుకొచ్చారు. నారా లోకేష్ ట్వీట్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మన తెలుగు వాడైన తిలక్ వర్మ భారత్‌ను గెలుపు బాట పట్టించినందుకు తెలుగు వాళ్లంతా కూడా గర్వంగా భావిస్తున్నారు. ఇంకా తన జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు సృష్టించాలని, మరిన్ని విజయాలను తన క్రికెట్ కెరియర్‌లో సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా నారా లోకేష్, తిలక్ వర్మల ట్వీట్స్.. వారి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని, సోదరభావాన్ని, సత్సంబందాన్ని తెలియజేస్తున్నాయి.

సుడిగాలి సుధీర్ కొత్త సినిమా: హైలెస్సో గురించి ఆసక్తికర విషయాలు

0

బుల్లితెర నుంచి వెండితెర వరకు ఎదిగిన సుడిగాలి సుధీర్ గురించి అందరికీ తెలుసు. జబర్దస్త్ షోల ద్వారా పాపులర్ అయిన యితడు ప్రస్తుతం ఇంకా టీవీ షోలలో కూడా కనిపిస్తున్నారు. తనదైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే సాఫ్ట్‌వేర్ సుధీర్ పేరుతో తీసిన సినిమాలో హీరోగా తెరకెక్కారు. ఇప్పుడు తాజాగా సుధీర్ ఐదవ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన పోస్టర్, టీజర్ వంటి వాటిని అధికారికంగా రిలీజ్ చేశారు.

సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమా పేరు హైలెస్సో. ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా.. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. కుమార్ కోట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. శివచెర్రీ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమాలో నటుడు శివాజీ, అక్షర గౌడ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. గంగాలమ్మా తల్లి.. సల్లగ సూడే తల్లి అనే ఓ చిన్న లిరిక్స్‌తో టీజర్ లాంచ్ చేశారు.

సుధీర్ పాన్ ఇండియా సినిమా?

హైలెస్సో టీజర్ ఒక రకంగా.. పుష్ప సినిమాను తలిపించినట్లు ఉందని చాలామంది చెబుతున్నారు. అంటే సుడిగాలి సుధీర్ కూడా పాన్ ఇండియా లెవెల్ సినిమా తీస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమా అనగానే.. సుధీర్ అభిమానులు సంబరపడుతున్నారు. అయితే కొందరు మాత్రం పాన్ ఇండియా సినిమా అంటే.. కొన్ని విమర్శలు కురిపిస్తున్నారు. ముందు సుధీర్ హీరోగా నిలదొక్కుకున్న తరువాత పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తే బాగుంటుందని చెబుతున్నారు. ఏదైతే ఏం.. కష్టపడి స్వయంకృషితో పైకొచ్చిన వారిలో సుధీర్ కూడా ఒకరు కాబట్టి.. అతడు మంచు సక్సెస్ సాధించాలని అందరూ అనుకుంటున్నారు.

సుధీర్ ఐదవ సినిమా..

ఎస్ఎస్5 హ్యాష్‌ట్యాగ్‌తో రిలీజ్ అయిన హైలెస్సో సినిమా.. సుడిగాలి సుధీర్ నటిస్తున్న ఐదవ సినిమా. ఇప్పటికే సాఫ్ట్‌వేర్ సుధీర్, గాలోడు, 3 మంకీస్, గోట్ సినిమాల్లో కనిపించిన సుధీర్ ఇప్పుడు హైలెస్సో సినిమాలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన చాలా విషయాలు తెలియాల్సి ఉంది. బహుశా ఈ సినిమా వచ్చే ఏడాదిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

సుడిగాలి సుధీర్ గురించి

1987 మే 19న కృష్ణ జిల్లాలోని విజయవాడలో జన్మించిన సుడిగాలి సుధీర్.. మ్యాజిక్ షోలు చేసుకుంటూ.. చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు. జబర్దస్త్ షో కారణంగా మంచి ఆదరణ పొందాడు. ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శీను, సన్నీతో కలిసి చేసిన స్కిట్స్ బాగా పాపులర్ అయ్యాయి. దీంతో ఇతనికి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ రెడీ అయింది. ఇప్పటికి కూడా సుడిగాలి సుధీర్ అంటే అభిమానించేవారు చాలామందే ఉన్నారు.

జబర్దస్త్ షోలు మాత్రమే కాకుండా.. ఢీ జోడి, పోవే పోరా, శ్రీదేవి డ్రామా కంపెనీ, సూపర్ సింగర్ జూనియర్స్ షోలకు యాంకర్‌గా కూడా సుధీర్ పనిచేశారు. ఇతడు హీరోగా సినిమాలు తీయడానికి ముందు చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. కాగా ఇప్పుడు తెరకెక్కనున్న హైలెస్సో సినిమా ఎలా ఉండబోతుంది?, ఇండస్ట్రీ హిట్ సాధిస్తుందా?, సుధీర్‌కి మంచి సక్సెస్ ఇస్తుందా? అనే చాలా విషయాలు తెలియాల్సి ఉంది.

లగ్జరీ కారు కొన్న ఫేమస్ సింగర్.. డీలర్‌షిప్‌లోనే పాట పాడేశారు

సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు ఖరీదైన కార్లను కొనుగోలు చేసి.. వినియోగిస్తారనే విషయం అందరికి తెలుసు. ఇందులో భాగంగానే ప్రముఖ మలయాళీ సింగర్ ఎంజీ శ్రీకుమార్.. మెర్సిడెస్ బెంజ్ కారు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కారు వివరాలు

సింగర్ ఎంజీ శ్రీకుమార్.. కొనుగోలు చేసిన కారు మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ సెడాన్. ఈయన తెలుపురంగు కారును కొనుగోలు చేసిన తరువాత.. డీలర్షిప్ సిబ్బందిలోని ఒక మహిళతో కలిసి స్వయంగా ఒక పాటపాడి అలరించారు. కారును కొనుగోలు చేయడానికి ఆయన, తన భార్యతో కలిసి వచ్చారు. కారును డెలివరీ తీసుకున్న తరువాత శ్రీకుమార్.. ఆయన భార్య అనంత పద్మనాభస్వామి ఆలయంలో పూజలు చేసినట్లు సమాచారం. ఈ ఫోటోలను వారు ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశారు. ఇందులో కారుకు పూజ చేసి పువ్వులు వేసి ఉండటం కూడా కనిపిస్తుంది.

మెర్సిడెస్ బెన్ ఈ-క్లాస్ గురించి

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెర్సిడెస్ బెంజ్.. 2024లో ఈ-క్లాస్ కారును లాంచ్ చేసింది. ఈ సెడాన్ అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందింది. దీని ప్రారంభ ధర రూ. 78.5 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఈ200, ఈ220డీ, ఈ450 అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ కారు.. ఈక్యూ మాదిరిగా ఉండే స్టైలింగ్ పొందుతుంది. కాబట్టి ఇది కొత్త ఫ్రంట్ ఫాసియా, బ్రాండ్ లోగో, ప్లస్ టైప్ డోర్ హ్యాండిల్స్, 18 ఇంచెస్ వీల్స్, ఎల్ఈడీ లైటింగ్, కొత్త బంపర్లు పొందుతుంది. ఇవన్నీ కారును అద్భుతమైన లుక్ అందిస్తాయి.

బెంజ్ ఈ-క్లాస్ కారు ఇంటీరియర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఇందులో మూడు స్క్రీన్స్ ఉంటాయి. అవి 14.4 ఇంచెస్ సెంట్రల్ స్క్రీన్, 12.3 ఇంచెస్ ప్యాసింజర్ స్క్రీన్, 12.3 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్. ఇవి కాకుండా 4డీ సరౌండ్ సౌండ్ సిస్టం, లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఈ కారులో ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఈ200 వేరియంట్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఈ220డీ వేరియంట్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ద్వారా శక్తిని ఇస్తుంది. ఈ450 మోడల్ 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఈ మూడు వేరియంట్లు అత్యుత్తమ పనితీరును అందిస్తాయి.

ఎంజీ శ్రీకుమార్ గురించి

కేవలం మలయాళంలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో పాటలు పాడిన ఎంజీ శ్రీకుమార్.. పాడిన పాటలు చాలానే ఉన్నాయి. 1960 జూన్ 2న కేరళలోని కోజికోడ్ నగరంలో జన్మించిన ఈయన 1980లో పాటలు పాడటం మొదలు పెట్టారని సమాచారం. అప్పటి నుంచి పలు భాషల్లో వందలాది పాటలు పాడుతూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈయన ఒక ఆటోమొబైల్ ఔత్సాహికుడు కూడా. ఈ కారణంగానే అప్పుడప్పుడు తనకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తుంటారు.

తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డ్స్: పూర్తి వివరాలు

0

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఊరూ, వాడల్లో బతుకమ్మలు నిలిపి సంబరాలు చేసుకుంటారు. ఈ సారి బతుకమ్మ సంబరాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. దీనికోసం సరూర్ నగర్ మున్సిపల్ స్టేడియంలో జీహెచ్ఎంసీ, రాష్ట్ర పర్యాటక శాఖ కలిసి తగిన ఏర్పాట్లు చేశారు. అంతే కాకుండా సుమారు 63 అడుగుల బతుకమ్మను ఏర్పాటు చేశారు.

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్

తెలంగాణాలో ఏర్పాటైన 63 అడుగుల బతుకమ్మ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు అధికారికంగా వెల్లడించారు. అంతే కాకుండా ఈ భారీ బతుకమ్మ చుట్టూ 1354 మంది మహిళలు ఒకేసారి ఆడిపాడారు. దీనికిగానూ మరో గిన్నిస్ రికార్డ్ లభించింది. మొత్తం మీద తెలంగాణ ప్రభత్వం శ్రీకారం చుట్టిన ఈ భారీ బతుకమ్మ కార్యక్రమాన్ని రెండు గిన్నిస్ బుక్ ఆర్ రికార్డులు వచ్చాయి. ఇది బతుకమ్మకు, తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం అనే చెప్పాలి.

ప్రత్యేక ఏర్పాట్లు & సౌకర్యాలు

ప్రభుత్వం నిర్వహించిన ఈ భారీ బతుకమ్మ కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లు, ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు సౌకర్యాలను కల్పించారు. ఉచిత తాగునీరు, భోజన సదుపాయాలతో పాటు.. మహిళల సౌకర్యార్థం మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో సంబరాలు జరుపుకోవడానికి కావలసిన లైటింగ్ సదుపాయం, వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సమస్య రాకుండా ఉండటానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది.

ఒకప్పుడు బతుకమ్మ సంబరాలు.. పల్లెల్లో మాత్రమే నిర్వహించేవారు. కానీ ప్రస్తుతం ఈ ఆచార, సంప్రదాయాలను నగరవాసులు కూడా గౌరవిస్తున్నారు, ఆచరిస్తున్నారు. ఈ కారణంగానే నగరంలోని దాదాపు అన్ని సందుల్లోనూ బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తరువాత.. ఈ పండుగకు మరింత ఆదరణ పెరిగింది. కాబట్టి ప్రభుత్వాలు మారినా.. ఈ పండుగను ఆడంబరంగా నిర్వహిస్తున్నారు.

తెలంగాణలో ఆడపడుచులు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగలలో ఒకటి బతుకమ్మ. ఒకప్పటి నుంచి.. ఇప్పటి వరకు బతుకమ్మ ఆడే పద్దతిలో కావచ్చు, పాడే పాటల్లో కావచ్చు ఎంతో వ్యాత్యాసం కనిపిస్తున్నప్పటికీ.. ఆనవాయితీని మాత్రం అలాగే కొనసాగిస్తున్నానందుకు ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారీ బతుకమ్మ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ఇతర శాఖల క్యాబినెట్ మంత్రులు, కమిషనర్లు, ఐఏఎస్ & ఐపిఎస్ అధికారులు మొదలైనవారు పాల్గొన్నారు.

గల్లీ నుంచి గ్లోబల్ వరకు..

బతుకమ్మ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్న సందర్భంగా.. మంత్రి సీతక్క మాట్లాడుతూ, బతుకమ్మ ప్రముఖ్యతను ఈ రోజు ప్రపంచానికి చాటి చెప్పాము. గల్లీ నుంచి గ్లోబల్ వరకు మహిళలు ఏ రంగంలో అయినా రాణిస్తారు అని చెప్పడానికి ఇది నిదర్శనం అని అన్నారు. బతుకమ్మ గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకోవడానికి కృషి చేసిన అందరికి కృతజ్ఞతలు చెబుతూనే.. ఆడబిడ్డల జీవితాలు వెలుగులతో నిండాలని ఆకాంక్షించారు. మొత్తం మీద తెలంగాణలో జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రపంచ రికార్డ్ సాధించడం గొప్ప విషయం, దీనికి సహకరించిన ప్రభుత్వం ప్రసంశనీయం.

పుట్టలో చేయిపెడితే కుట్టడానికి నేనేమైనా చీమనా?: దుమ్ములేపుతున్న రాజా సాబ్ ట్రైలర్

0

డార్లింగ్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మూవీ ట్రైలర్‌ను ‘ది బిగ్గెస్ట్ హారర్ ఫాంటసీ ఎవర్ ఇన్ ఇండియన్ సినిమా’ అనే పేరుతో.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా రిలీజ్ చేసింది. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ కొత్త సినిమా ట్రైలర్ అభినుల్లో కొత్త ఉత్సాహాన్ని.. సినీ పరిశ్రమలో భారీ అంచనాలను పెంచేసింది.

రాజా సాబ్ రిలీజ్ డేట్

ప్రభాస్ రాజా సాబ్.. ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విడుదలైన కొన్ని గంటల వ్యవధిలోనే.. మిలియన్ వ్యూస్ పొందిన ఈ సినిమా 2026 జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ హీరో కాగా.. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్ పాత్రల్లో నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రత్యేక పాత్రలో కనిపించరు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు.

ఆదిపురుష్ సినిమా తరువాత.. ప్రభాస్ కన్నప్ప సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఇప్పుడు రాజా సాబ్ సినిమాలో నటించారు. ఇప్పుడు విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అభిమానుల అంచనాలను సైతం దాటేసింది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు ఒక లెక్క.. ఈ సినిమా ఓ లెక్క అనే రేంజిలో ఈ సినిమా ఉందని అభిమానులు తెగ సంతోషపడుతున్నారు.

ది రాజా సాబ్ సినిమాలో.. మళ్ళీ పాత ప్రభాస్ కనిపించారు. మిర్చి సినిమా తరువాత.. అలాంటి బాడీ లాంగ్వేజ్ గానీ డైలాగ్ డెలివరీ గానీ మళ్ళీ కనిపించలేదని చాలామంది కొంత నిరాశపడ్డారు. ఆ తరువాత వచ్చిన బాహుబలి సినిమాతో ప్రభాస్ దాదాపు మారిపోయారని అనిపించింది. కానీ ఇన్నేళ్లకు మళ్ళీ ప్రభాస్ రొమాంటిక్ లుక్‌లో కనిపించారు.

యాక్షన్, రొమాంటిక్ సినిమాల్లో కనిపించిన ప్రభాస్ ఎప్పుడూ హారర్ సినిమాల్లో కనిపించలేదు. ఇప్పుడు మొదటిసారి ప్రభాస్ హారర్ సినిమాలో కూడా కనిపించేసారు. డైరెక్టర్ మారుతి మార్క్ ఇప్పుడు విడుదలైన ట్రైలర్‌లో కనిపించింది. తనకి ఎప్పుడూ అలవాటైన కామెడీ, రొమాన్స్ తెరకెక్కించడంలో మారుతికి ఓ ప్రత్యేకమైన శైలి ఉంది. కాబట్టి రాజా సాబ్ సినిమాలో ఏది వదిలిపెట్టకుండా.. అటు కామెడీ, ఇటు రొమాన్స్ మాత్రమే కాకుండా హారర్ కూడా అందిస్తూ.. ఊర మాస్ ఫైట్ కూడా అభిమానుల కోసం అందించినట్లు ఇట్టే అర్థమైపోతుంది.

ప్రత్యేక పాత్రలో సంజయ్ దత్

రాజా సాబ్ సినిమాలో ఒక్కో పైట్ అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తోంది. రొమాన్స్, కామెడీలో ప్రభాస్ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హారర్ సీన్స్ కూడా ప్రేక్షకులను భయపెట్టే విధంగా ఉన్నాయి. ప్రత్యేక పాత్రలో నటించిన సంజయ్ దత్ కూడా తనదైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఒదిగిపోయారు.

డైరెక్టర్ మారుతి స్టైల్ ప్రభాస్.. ఈ రాజా సాబ్ సినిమాలో కనిపించారు. స్టోరీ పరంగా ఏదో బలంగా చెప్పదలచుకున్నట్లు ట్రైలట్ చెప్పకనే చెప్పేస్తోంది. ప్రభాస్ నటన గురించి చెప్పడానికి మాటల్లేవ్ అనే చెప్పాలి. ”ఇందిరా మీ బాధ.. పుట్టలో చేయి పెడితే కుట్టడానికి నేనేమైన చీమనా?, రాక్షసుణ్ణి” అనే డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతోంది. ఇక ఈ సినిమా చూడాలంటే 2026 జనవరి 9 వరకు వేచి చూడాల్సిందే!.

అభిషేక్ శర్మకు గిఫ్ట్‌గా హవల్ హెచ్9: ఈ కారు గురించి తెలుసా?

0

2025 ఆసియా కప్‌లో.. తన అద్భుతమైన ప్రదర్శనతో అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నారు. మ్యాచ్‌లో గొప్ప ప్రదర్శన కనపరిచినందుకు గాను.. ఇతనికి హవల్ హెచ్9 కారు గిఫ్ట్‌గా లభించింది. ఈ కారు చూడటానికి చాలా అద్భుతంగా ఉండటంతో.. ఆటోమొబైల్ ఔత్సాహికులు దీని గురించి తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో ఆ వివరాలను తెలుసుకుందాం.

హవల్ హెచ్9 ధర

అభిషేక్ శర్మ గిఫ్ట్‌గా పొందిన.. హవల్ హెచ్9 ధర సౌదీ అరేబియా వెబ్‌సైట్ ప్రకారం 142199.8 సౌదీ రియాల్స్. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 33 లక్షల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. ఈ కారు భారతదేశంలో చాలా తక్కువమంది దగ్గర మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.

హవల్ అనేది చైనీస్ ఆటోమొబైల్ కంపెనీ గ్రేట్ వాల్ మోటార్ (జీడబ్ల్యుఎమ్) యాజమాన్యంలోని ఒక ఆటోమోటివ్ బ్రాండ్. ఈ కంపెనీ ప్రపంచంలోని చాలా దేశాల్లో కార్లను లాంచ్ చేసి.. అధిక ఆదరణ పొందుతోంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ధర కూడా కొంత ఎక్కువే కావడం గమనార్హం.

డిజైన్ & ఫీచర్స్

చూడగానే ఆకట్టుకునే డిజైన్ కలిగిన.. హవల్ హెచ్9 కారు కఠినమైన రూపం పొందుతుంది. లైటింగ్ సెటప్ కూడా అద్భుతంగా ఉంది. ఫ్రంట్ ప్రొఫైల్, సైడ్ ప్రొఫైల్, రియర్ ప్రొఫైల్ అన్నీ కూడా దృఢంగా ఉండటం గమనించవచ్చు. ఈ కారు పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రిక్ సైడ్‌స్టెప్‌లు పొందుతుంది. ఇది 256/55 ఆర్18 టైర్స్ పొందుతుంది.

ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. హవల్ హెచ్9 కారులో 14.6 ఇంచెస్ పెద్ద టచ్‌స్క్రీన్, 10 స్పీకర్స్ సౌండ్ సిస్టం, వైర్‌లెస్ ఛార్జర్, డ్రైవర్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన లెదర్ మెమరీ సీట్లు, సీట్ వెంటిలేషన్, రిఫ్రెషింగ్ డ్రైవింగ్ అనుభవం కోసం మసాజ్ ఫీచర్ కూడా ఉన్నాయి.

4950 మిమీ పొడవు, 1976 మిమీ వెడల్పు ఉన్న ఈ హవల్ హెచ్9 కారు ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ట్రాఫిక్ జామ్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా, మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్ వంటివి ఉన్నాయి. యావన్నీ రైడర్లకు మంచి సేఫ్టీ అందిస్తాయి.

ఇంజిన్ వివరాలు

హవల్ హెచ్9 కారు 2.0 లీటర్ టర్బోఛార్జ్డ్ 4 సిలిండర్ గ్యాసోలిన్ ఇంజిన్ పొందుతుంది. ఇది 380 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌కు జతచేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఇది నగర ప్రయాణాలకు మాత్రమే కాకుండా ఆఫ్ రోడింగ్ కెపాసిటీ కూడా పొందుతుంది. కాబట్టి ఇది ఆఫ్ రోడింగ్ ప్రియులకు చాలా అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. కఠినమైన రోడ్లపై కూడా ఇది సజావుగా ముందుకు సాగుతుంది.

పాకిస్తాన్ & ఇండియా మ్యాచ్

సెప్టెంబర్ 28న పాకిస్తాన్, ఇండియా మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగింది. టాస్ గెలిచి ఇండియా టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ఆడిన పాకిస్తాన్ మొదట్లో మంచి స్కోర్ సాధించినప్పటికీ.. చివరికి 146 స్కోర్ దగ్గర నిలిచిపోయింది. రంగంలోకి దిగిన ఇండియా టీమ్ 150/5 స్కోర్ చేసి టైటిల్ గెలుచుకుంది.

తెలంగాణ స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది: పోలింగ్ ఎప్పుడంటే?

0

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను.. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. సుమారు 1.67 కోట్ల కంటే ఎక్కువ ఉన్న ఓటర్లు.. కఠినమైన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మార్గదర్శకాల ప్రకారం.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయితీలకు ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ గురించి ఈ కథనంలో చూసేద్దాం..

ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు

తెలంగాణ స్టేట్ ఎన్నికల కమీషన్ (ఎస్ఈసీ).. మొత్తం జిల్లాలలోని 5749 ఎంపీటీసీ స్థానాలకు, 565 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ చేస్తుంది. స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సర్వత్రా సిద్ధమవుతోంది. రాష్ట్రంలో 81.65 లక్షల పురుషులు, 85.36 లక్షల మంది మహిళలు, 504 మంది ఇతరులు.. ఇలా మొత్తం కలిపి 1.67 కోట్ల మంది తెలంగాణాలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాడానికి అర్హులు.

ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను ఖరారు చేయడానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కీలక విభాగాల అధిపతులతో.. సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు చేశారు. షెడ్యూల్ ప్రకారం.. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. అధికారులు ఎస్ఈసీ (స్టేట్ ఎలక్షన్ కమిషన్)కి వెల్లడించారు.

ఎన్నికల షెడ్యూల్ వివరాలు

  • తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం.. ఎన్నికల కమిషన్ అక్టోబర్ 9, 13వ తేదీల్లో నోటికికేషన్ జారీ చేయనుంది.
  • గ్రామ పంచాయితీ ఎన్నికలకు అక్టోబర్ 17, 21, 25 తేదీల్లో నోటిఫికేషన్ విడుదలవుతుంది.
  • 2025 అక్టోబర్ 23న.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ జరుగుతుంది.
  • 2025 అక్టోబర్ 27న.. రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహిస్తారు.
  • 2025 అక్టోబర్ 31 & 2025 నవంబర్ 4, 5 తేదీల్లో గ్రామ పంచాయితీ ఎన్నికలు జరుగుతాయి. ఈ రోజే గ్రామ పంచాయితీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి.
  • 2025 నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కౌంటింగ్/ఫలితాలు
  • ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు.. మొదటి దశ నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ 2025 అక్టోబర్ 11.
  • ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండో దశ నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ 2025 అక్టోబర్ 15.

హైకోర్టు ఆదేశాలతో, రాష్ట్ర ప్రభుత్వం సమ్మతితో.. ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి ఎన్నికల కమిషన్ 45 రోజుల గడువు కోరింది. ఈ సమయంలో ఎన్నికలు పూర్తి చేయనుంది. అంతే కాకుండా.. మండలాలు, జిల్లా ప్రజా పరిషత్, గ్రామ పంచాయితీల రిజర్వేషన్లపై సమగ్ర మార్గదర్శకాలను ఎన్నికల కమిషన్ జారీ చేసింది.

31 జిల్లాలు.. 15302 పోలింగ్ కేంద్రాలు

తెలంగాణ స్థానిక ఎన్నికల కోసం.. ఎలక్షన్ కమిషన్ 31 జిల్లాలలో మొత్తం 15302 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో మొత్తం 12733 గ్రామ పంచాయితీలలో 1,12,288 వార్డులు ఉన్నాయి. కాగా 5749 ఎంపీటీసీ స్థానాలకు, 656 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లు, అభ్యర్థులు మోడల్ ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, న్యాయంగా ఓటు హక్కును వినియోగించాలని ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేసింది. అయితే ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది.. అనే విషయం తెలుసుకోవడానికి ఫలితాలు వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

అచ్చంపేట జనగర్జన సభలో కేటీఆర్: బీఆర్ఎస్ నెక్స్ట్ ప్లాన్ అదేనా..

0

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలోని అచ్చంపేటలో.. అచ్చంపేట జనగర్జన సభ పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

పార్టీ వీడిన గువ్వల బాలరాజు

బీఆర్ఎస్ పార్టీకి చెందిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరిన తరువాత బీఆర్ఎస్ పార్టీ ఈ జనగర్జన సభను నిర్వహించారు. నిజానికి గువ్వల బాలరాజు తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన నాయకుడు. దీంతో ఆయన శ్రమను, అంకితభావాన్ని గుర్తించిన కేసీఆర్ 2014లో పార్టీ టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి వరుసగా రెండు సార్లు అచ్చంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీ కృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు.

ఓటమిపాలైన తరువాత మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లోనూ అంత చురుకుగా పాల్గొన్న దాఖలాలు కనిపించలేదు. తరువాత గత నెల ఆగస్టు 02న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అంతే కాకుండా ఆగస్టు 10న బీజేపీలోకి చేరిపోయారు. దీంతో అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీకి నాయకుడు కరువయ్యారు.

బీఆర్ఎస్ గూటిని వదిలి..

మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా అచ్చంపేట నియోజకవర్గ ప్రజల్లో తిరిగిన వ్యక్తి. ఎన్నో ఏళ్లుగా అక్కడ రాజకీయ సత్సంబంధాలు కలిగిన రాజకీయ దురంధరుడు. అదే విధంగా ఆ ప్రాంతం మెలుకువలు ఎత్తుగడలు తెలిసిన నాయకుడు. నేటికీ అచ్చంపేట ప్రజలలో అత్యంత ఆదరణ పొందుతున్న ప్రజాప్రతినిధి. అలాంటి వ్యక్తి బీఆర్ఎస్ గూటిని వదిలిపెట్టడం పార్టీ శ్రేణుల్లో కొంత నిరాశ కలిగింది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి.. మిగిలిన నాయకులను, కార్యకర్తలను కాపాడుకోవాల్సిన, నిలుపుకోవాల్సిన అవసరం చాలా ఉంది.

త్వరలో స్థానిక ఎన్నికలు

ఇకపోతే.. త్వరలోనే తెలంగాణ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవడం బీఆర్ఎస్ ముందు ఉన్న ఒక సవాలు. ఏ మాత్రం ఆలస్యం చేసిన కూడా ఉన్న క్యాడర్ చల్లాచెదురయ్యే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే పార్టీ.. తమ కార్యకర్తల్లో ఉత్సహం నింపడానికి, ఆత్మవిశ్వాశాన్ని పెంచడానికి ‘అచ్చంపేట జన గర్జన’ పేరుతో అత్యవసర సమావేశం ఏర్పాటు చెయాల్సి వచ్చింది.

జన గర్జన సభలో కేటీఆర్

అచ్చంపేట జనగర్జన సభలో.. కేటీఆర్ తనదైన మాటలతో పార్టీ అభిమానులను ఊర్రుతలుగించారు. ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకురాగలిగారు. ప్రతిపక్ష పార్టీల తీరుపైన.. ఆ నాయకుల చేష్టలపైన రాజకీయ పరమైనా విమర్శలు గుప్పించారు. వచ్చే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను, కార్యకర్తలను కేటీఆర్ కోరారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ విజయం సాదిస్తుందని, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, ప్రజల కష్టాలను పార్టీ తప్పకుండా తీరుస్తుందని కేటీఆర్ బహిరంగ సభలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

24 గంటల్లో 1000 మంది కొన్నారు!.. ఇండియాలో ఇటాలియన్ స్కూటర్

భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు లాంచ్ అవుతూనే ఉన్నాయి. అందులోనూ ఇప్పుడు పండుగ సీజన్. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇటాలియన్ బ్రాండ్ అయిన మోటోహౌస్ కంపెనీ.. ఇండియన్ మార్కెట్లో సరికొత్త వీఎల్ఎఫ్ మాబ్‌స్టర్ 125 లాంచ్ చేసింది. ఇప్పటికే బ్రిక్స్‌టన్ శ్రేణి బైకులను లాంచ్ చేసిన ఈ కంపెనీ.. ఇప్పుడు 125 సీసీ స్కూటర్ లాంచ్ చేసింది. దీని ధర, బుకింగ్స్, డెలివరీ డీటైల్స్, ఇంజిన్ వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర & బుకింగ్స్

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త వీఎల్ఎఫ్ మాబ్‌స్టర్ 125 స్కూటర్ ధర రూ. 1.30 లక్షలు (ఎక్స్ షోరూమ్). ప్రారంభ ధర కేవలం మొదటి 2500 కస్టమర్లకు మాత్రమే అని తెలుస్తోంది. కాగా కంపెనీ ఈ స్కూటర్ కోసం రూ. 999లతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 24 గంటల్లో.. ఈ స్కూటర్ 1000 బుకింగ్స్ స్వీకరించగలిగింది. డెలివరీలు నవంబర్ 2025లో ప్రారంభమవుతాయని సమాచారం.

డిజైన్

కొత్త వీఎల్ఎఫ్ మాబ్‌స్టర్ 125 స్కూటర్.. మాబ్‌స్టర్ 135 మ్యాక్సీ స్కూటర్ నుంచి ప్రేరణ పొందింది. కాబట్టి ఇది మంచి డిజైన్ పొందింది. ఈ స్కూటర్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్, అగ్రెసివ్ బాడీ ప్యానెల్స్, స్ప్లిట్ స్టైల్ ఫుట్‌రెస్ట్‌లు, స్టెప్డ్ సీటు వంటివి కలిగి ఉండటం చూడవచ్చు. అంతే కాకుండా ఈ స్కూటర్ ట్యూబ్‌లెస్ టైర్లతో.. 12 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. సేఫ్టీ కోసం ఇందులో సీబీఎస్‌తో కూడిన ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఈ స్కూటర్ సీటు ఎత్తు 797 మిమీ కాగా.. గ్రౌండ్ క్లియరెన్స్ 155 మిమీ.

నాలుగు రంగులలో (రెడ్, బూడిద రంగు, వైట్, ఫ్లోరోసెంట్ ఎల్లో) లభించే ఈ స్కూటర్ కొనుగోలుపై.. కొనుగోలుదారు 4 సంవత్సరాలు లేదా 40000 కిమీ వారంటీతో పాటు, ఒక సంవత్సరం రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ను పొందుతాడు. ప్రస్తుతం ఈ కంపెనీకిని ఢిల్లీ, పూణే, బెంగళూరు, గోవా వంటి మొత్తం దేశవ్యాప్తంగా 12 డీలర్‌షిప్‌లు ఉన్నాయి. కాగా సంస్థ మరో 10 అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతోంది.

ఫీచర్స్

వీఎల్ఎఫ్ మాబ్‌స్టర్ 125 స్కూటర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో టీఎఫ్‌టీ స్క్రీన్ ఉంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ న్యావిగేషన్, కాల్ అండ్ ఎస్ఎమ్ఎస్ అలర్ట్స్, రైడింగ్ గణాంకాలను చూపిస్తుంది. యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, హాఫ్ ఫేస్ హెల్మెట్‌కు సరిపోయేంత అండర్ సీట్ స్టోరేజ్ వంటివి ఇందులో ఉన్నాయి. కీలెస్ ఇగ్నియస్, ఆటో స్టార్ట్ / స్టాప్ వంటి ఫీచర్స్ కూడా ఈ స్కూటర్ పొందుతుంది.

ఇంజిన్ వివరాలు

వీఎల్ఎఫ్ 125 స్కూటర్ 125 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 8250 ఆర్పీఎం వద్ద 12.1 బీహెచ్‌పీ పవర్, 6500 ఆర్పీఎం వద్ద 11.7 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ టెలిస్కోపిక్ ఫోర్కులు, మోనోషాక్ సస్పెన్షన్ వంటివి పొందుతుంది. ఈ స్కూటర్ బరువు 122 కేజీలు కాగా.. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 8 లీటర్లు. ఈ స్కూటర్ ఇండియన్ మార్కెట్లో అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది.

మహిళల మనసుదోచే టూవీలర్స్.. ధరలు & వివరాలు

ఆధునిక మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా దూసుకెళ్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు, కార్లు డ్రైవ్ చేస్తున్నారు, బైక్స్ రైడ్ చేస్తున్నారు. అయితే మోటార్‌సైకిల్ అనగానే పురుషలకే అన్నట్టు చాలామంది అనుకుంటారు. కానీ మహిళలు కూడా రైడ్ చేయడానికి అనువైన టూ వీలర్స్ ఉన్నాయన్న సంగతి బహుశా మరిచారేమో. ఈ కథనంలో మహిళలు రైడ్ చేయడానికి అనుకూలమైన ఐదు స్కూటీల గురించి తెలుసుకుందాం.

హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్

మహిళలు రైడింగ్ చేయడానికి అనుకూలమైన స్కూటర్ల జాబితాలో హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్ ఒకటి. రూ. 74,361 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే ఈ స్కూటర్ ఎల్ఎక్స్, వీఎక్స్, జెడ్ఎక్స్ ప్లస్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. సుమారు 106 కేజీల బరువున్న ఈ స్కూటర్ రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 110 సీసీ ఇంజిన్ 8 బీహెచ్‌పీ పవర్, 8.70 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 50 కిమీ/లీ కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తుంది.

టీవీఎస్ జుపీటర్ 110

మహిళలకు అనువైన స్కూటర్ల జాబితాలో మరో టూ వీలర్ టీవీఎస్ కంపెనీకి చెందిన జుపీటర్ 110. దీని ధర రూ. 72400 (ఎక్స్ షోరూమ్). ఇందులోని 113.3 సీసీ ఇంజిన్ 7.9 బీహెచ్‌పీ పవర్, 9.8 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 105 కేజీల బరువున్న ఈ స్కూటర్ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. మంచి డిజైన్ కలిగి.. లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల దీనిని కొనుగోలు చేయడానికి ఎక్కువమంది ఇష్టపడతారు. రోజువారీ వినియోగానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110

స్కూటీ జెస్ట్ 100 కూడా టీవీఎస్ కంపెనీకి చెందిన టూ వీలర్. దీని ధర రూ. 73854 (ఎక్స్ షోరూమ్). మంచి రైడింగ్ అనుభూతిని అందించే ఈ స్కూటర్ 109.7 సీసీ ఇంజిన్ ద్వారా 7.7 బీహెచ్‌పీ, 8.8 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. సుమారు 103 కేజీల బరువున్న ఈ స్కూటర్.. రెండు వేరియంట్లలో, మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. డిజైన్, ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రైడర్ వినియోగానికి కావలసిన అన్ని ఫీచర్స్ ఇందులో ఉంటాయి.

హోండా డియో

ఇండియన్ మార్కెట్లో ఎక్కువ మందికి ఇష్టమైన బైకులలో.. హోండా డియో ఒకటి. రూ. 91000 ఎక్స్ షోరూమ్ ధర వద్ద లభించే స్కూటర్ స్టైలిష్ డిజైన్ పొందుతుంది. రెండు వేరియంట్లలో లభించే ఈ స్కూటర్.. 109.51 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 7.84 బీహెచ్‌పీ పవర్, 9.03 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ మహిళలకు మాత్రమే కాకూండా.. యువ రైడర్లకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. రైడింగ్ చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

సుజుకి యాక్సెస్ 125

స్టైలిష్ డిజైన్.. అప్డేటెడ్ ఫీచర్స్ కలిగిం సుజుకి యాక్సెస్ 125 కూడా మహిళలు ఉపయోగించడానికి అనుకూలమైన స్కూటర్ల జాబితాలో ఒకటి. 124 సీసీ ఇంజిన్ ద్వారా 8.31 బీహెచ్‌పీ పవర్, 10.2 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 106 కేజీల బరువున్న ఈ స్కూటర్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 71557 (ఎక్స్ షోరూమ్). రోజువారీ వినియోగానికి, నగర ప్రయాణానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.