Home Blog Page 132

ఏటీఎం నుంచి పీఎఫ్ విత్‌డ్రాకు ముహూర్తం ఫిక్స్: స్పెషల్ కార్డు కూడా!

0

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తన చందాదారుల కోసం ఎప్పటికప్పుడు సులభమైన మార్గాలను ప్రవేశపెడుతూనే ఉంది. ఇందులో భాగంగానే.. ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవడానికి కూడా వెసులుబాటు కల్పించడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించినప్పటికీ.. ఎప్పటి నుంచి అమలులోకి రానుందని విషయం తాజాగా వెల్లడైంది.

2026 జనవరి నుంచే..

ఈపీఎఫ్ఓ డబ్బును ఏటీఎం ద్వారా 2026 జనవరి నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చని సమాచారం. అయితే ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) అక్టోబర్ రెండో వారంలో జరగనున్న బోర్డ్ సమావేశంలో.. ఏటీఎం విత్‌డ్రా సౌకర్యానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అయితే ఏటీఎం నుంచి ఎంత మొత్తంలో తీసుకోవచ్చు అనే విషయానికి త్వరలోనే వెల్లడిస్తారు.

ఏటీఎం నుంచి ఈపీఎఫ్ఓ విత్‌డ్రా కల్పించడానికి కారణం

ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓ మొత్తం కార్పస్ రూ. 28 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఉంది. సభ్యుల సంఖ్య ఏకంగా 78 మిలియన్స్. 2014లో కార్పస్ మొత్తం రూ. 7.4 లక్షల కోట్లు కాగా.. సభ్యుల సంఖ్య 33 మిలియన్లుగా ఉంది. దీన్నిబట్టి చూస్తే సభ్యుల సంఖ్య, కార్పస్ మొత్తం ఎంత మొత్తంలో పెరుగుతోందో స్పష్టమవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏటీఎం నుంచి ఈపీఎఫ్ఓ విత్‌డ్రా సదుపాయం కల్పించడానికి పూనుకున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈపీఎఫ్ఓ సబ్యులకు సంబంధించిన కార్పస్‌ను యాక్సెస్ చేసే వెసులుబాటును కల్పిస్తే.. చందాదారులు సులభంగా డబ్బును విత్‌డ్రా చేసుకోగలుతారు. దీనిని అందుబాటులోకి తీసుకురావడానికి.. కార్మిక మంత్రిత్వ శాఖ బ్యాంకులతోపాటు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)తో కూడా మాట్లాడినట్లు సమాచారం. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఈపీఎఫ్ఓ సభ్యులు ఏటీఎం కార్డు వంటి ఓ ప్రత్యేకమైన కార్డును కూడా పొందే అవకాశం ఉంది. అయితే ఈ కార్డులను ఎప్పుడు, ఎలా ఇవ్వనున్నారనే విషయం తెలియాల్సి ఉంది.

ఆలస్యానికి చెక్!

ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ప్రారంభంలో ఈపీఎఫ్ఓ చందాదారులకు నిధుల లభ్యతను మరింత సులభతరం చేయడానికి ఆటోమాటిక్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ మొత్తాన్ని రూ. లక్ష నుంచి రూ. ఐదు లక్షలకు పెంచింది. ఈ విధానంలో ఆటోమేటెడ్ సిస్టం క్లెయిమ్ అర్హతను ధ్రువీకరించడానికి డిజిటల్ తనిఖీలు, అల్గారిథమ్ వంటి వాటిని ఉపయోగించడం జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ ఈకేవైసి వివరాలపై ఆధారపడి ఉంటుంది. కాగా ఇప్పుడు త్వరలో అందుబాటులోకి రానున్న ఏటీఎం నుంచి విత్‌డ్రా విధానం.. పేపర్ వర్క్ లేకుండా.. డబ్బు తీసుకోవడంలో ఎలాంటి ఆలస్యం లేకుండా చేస్తుంది. ఇది చందాదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

గత కొన్ని సంవత్సరాలుగా డిజిటలైజేషన్‌లో ఈపీఎఫ్ఓ గణనీయమైన పురోగతిని సాధించినప్పటికీ.. ఏటీఎం విత్‌డ్రా విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంది. ఇందులో ఎటువంటి మోసాలకు తావులేకుండా చేయడానికి బ్యాంకులు లేదా ఇతర చెల్లింపు నెట్‌వర్క్‌లతో సమన్వయం అవసరం. ఇప్పటికే ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో చాలా మార్పులు వచ్చాయి. ఉద్యోగి వివరాలను, బ్యాంక్ అకౌంట్ వంటి వాటిని మార్చుకోవడం ఇప్పుడు చాలా సులభం అయిపోయింది.

తమిళనాడు అత్యున్నత పురస్కారానికి ఎంపికైన సాయి పల్లవి: జాబితా రిలీజ్!

అత్యున్నత పౌరపురస్కారాలలో ఒకటిగా పరిగణించే కలైమామణి అవార్డులను తమిళనాడు ప్రభుత్వం.. 2021, 2022, 2023 సంవత్సరాలకు గాను అధికారికంగా ప్రకటించింది. ఈ అవార్డును ఎవరెవరు పొందనున్నారు?, ఎంతమంది పొందనున్నారు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.

కలైమామణి అవార్డుకు ఎంపికైన సాయి పల్లవి

సాయి పల్లవి, ఎస్‌జే సూర్య, విక్రమ్ విక్రమ్ ప్రభు, జయ వీసీ గగనాథన్, కే మణికందన్, ఎం జార్జ్ మొదలైనవారు.. కలైమామణి అవార్డులను పొందనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం (2025 సెప్టెంబర్ 24) వెల్లడించింది. దీనికి సంబంధించి వివిధ వర్గాలలో ఎవరెవరు ఈ అవార్డు తీసుకోకున్నారో కూడా జాబితా వెల్లడించింది.

జాబితాలో ఇతర ప్రముఖులు

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ఉన్నవారు.. వివిధ కళలు, వివిధ నేపధ్యాల కిందకు వచ్చే అనేకమంది కళాకారులు ఉన్నారు. వీరంతా.. తమిళనాడు సాంస్కృతిక వారసత్వానికి చేసిన కృషికి ఈ అవార్డు లభించింది.

కలైమామణి అవార్డులకు ఎంపికైన జాబితాలో యాక్టర్స్ మాత్రమే కాకుండా.. వివిధ సాంకేతిక నిపుణులు, చిత్ర కార్మికులు సైతం ఉన్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందన్, చిత్ర నిర్మాత ఎస్ లింగుస్వామి, స్టంట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయన్, నేపథ్య గాయని శ్వేతా మోహన్, కొరియోగ్రాఫర్ శాండీ మొదలైనవారు ఉన్నారు.

విజేతలుగా ప్రకటించిన 90మంది కళాకారులలో.. సాహిత్యంలో భారతియార్ అవార్డుకు రచయిత ఎన్. మురుగేశ పాండియన్, ఎంఎస్ సుబ్బలక్ష్మి అవార్డుకు ప్రముఖ గాయకుడు కేజే యేసుదాసు, బాలసరస్వతి అవార్డుకు పద్మశ్రీ ముత్తుకన్నమ్మల్ ఎంపికయ్యారు. ఈ అవార్డులను తమిళనాడు ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కల్చర్ డైరెక్టరేట్ విభాగం అయిన.. ఇయాల్ ఇసై నాటక మండ్రం అందజేస్తుంది. ఈ అవార్డులను అక్టోబర్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ప్రధానం చేయనున్నారు.

వివిధ విభాగాల్లో 2021 సంవత్సరం విజేతలు

➤నటి: సాయి పల్లవి
➤నటుడు: ఎస్‌జే సూర్య
➤డైరెక్టర్: లింగుసామి
➤యాక్షన్ కొరియోగ్రాఫర్: స్టంట్ సుబ్బరాయన్

2020 సంవత్సర విజేతలు

➤నటి: జయ గుహనాథన్
➤నటుడు: విక్రమ్ ప్రభు
➤గీత రచయిత: వివేక్
➤ప్రో కన్సల్టెంట్: డైమండ్ బాబు
➤ఫోటోగ్రాఫర్: టీ లక్ష్మీకాంతన్

2023 సంవత్సర విజేతలు

➤అనిరుధ్ రవిచందన్: సంగీత స్వరకర్త
➤శ్వేతా మోహన్: గాయకుడు
➤కే మణికందన్: నటుడు
➤జార్జ్ మరియన్: నటుడు

కలైమామణి అవార్డు గురించి

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 1954లో కలైమామణి అవార్డులను ప్రారంభించింది. కళారంగాల్లో విశేష కృషి చేసినవారికి ఈ అవార్డులను ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకుంది. 2020 వరకు ఈ అవార్డులను అందించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు తాజాగా 2021, 2022, 2023 సంవత్సరాలకు గాను వచ్చే నెలలో అవార్డులను ప్రధానం చేయడానికి సంకల్పించింది. సినిమా రంగానికి మాత్రమే కాకుండా.. సంగీతం, సాహిత్యం, నాట్యం, నాటకాలు, ఇతర కళలకు ఈ అవార్డులను అందిస్తారు. ఈ అవార్డును ప్రధానం చేసే సమయంలో అవార్డు గ్రహీతలకు మెమోరాండం, మెడల్ మాత్రమే కాకుండా కొంత నగదు బహుమతి కూడా ఉండే అవకాశం ఉంటుంది. బహుశా ఇందులో ఏమైనా మార్పులు చేసారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. కాగా ఇప్పుడు తాజాగా ఈ అవార్డుకు ఎంపికైన వారికి అక్టోబర్ 2025లో అవార్డును ప్రధానం చేయనున్నారు.

ఓజీ సినిమాకు ఊహించని దెబ్బ: షోలు రద్దు.. టికెట్ డబ్బు రీఫండ్!

0

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం ఓజీ. ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్, మ్యూజిక్ అన్నీ కూడా సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. అభిమానులకు కొత్తదనాన్ని ఇవ్వడంలో భాగంగా ఈ సినిమా కోసం పవర్ స్టార్ ప్రత్యేకంగా జపనీస్ బాష నేర్చుకొని మరీ డైలాగ్ చెప్పారు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు గానీ మ్యూజిక్ గానీ ఒక రేంజ్‌లో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తమన్ మ్యూజిక్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తోంది. ట్రైలర్ కూడా ఇప్పటికే భారీ అంచనాలను కలిగిస్తోంది. ఈ సారి పెద్ద పెద్ద రికార్డుడులను కూడా బద్దలు కొట్టే అవకాశం ఉన్నట్టుగా అభిమానులు ఊహించుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత విడుదలైన మొదటి సినిమా హరి హర వీరమల్లు భారీ అంచనాలతో విడుదలై.. అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించింది. డిప్యూటీ సీఎం అవ్వడానికి ముందు చేసిన బ్రో సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోయింది. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యంత నమ్మకం పెట్టుకున్న సినిమా ఓజీ. ఈ సినిమా తరువాత పీఎస్పీకే 29, ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది.

ఫ్రీ-రిలీజ్ వేడుకల్లో పవన్ జోష్

ఓజీ సినిమా ఈ నెల సెప్టెంబర్ 25న ప్రపంచం వ్యాప్తంగా విడుదలకు సిద్ధమయింది. ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో మునుపెన్నడు కనిపించని విధంగా పవన్ కళ్యాణ్ అత్యంత జోష్‌తో కనిపించడమే కాకుండా.. సినిమాలోని ఒరిజినల్ గెటప్‌లోనే కనిపించారు. భారీ వర్షం పడుతున్నప్పటికి కూడా అభిమానుల్లో ఏ మాత్రం ఉత్సాహం తగ్గకుండా ఉండేదుకు.. ”ఈ వర్షం మనల్ని ఆపుతుందా, ఈ వర్షం మనల్ని ఆపుతుందా” అని గట్టి గట్టిగా డైలాగ్ చెబుతా అభిమానుల్లో మరింత ఉత్సహన్ని రేకెత్తించాడు.

ఓవర్సీస్‌లో ఓజీ షోలు రద్దు!

ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతున్న ఓజీకి అనుకోని చిక్కోచ్చి పడింది. ఓవర్సీస్‌లో.. అంటే నార్త్ అమెరికాలో ఓజీ చిత్రాన్ని నిలిపివేస్తున్నట్లు యార్క్ సినిమాస్ సంస్థ ప్రకటించింది. మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా కూడా ఒకటి. అందుకే ఎప్పుడు కూడా తెలుగు సినిమాలు అక్కడ రిలీజ్ చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో థియేటర్స్ దగ్గర అభిమానులు ఇబ్బందులు కలిగిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే.. ఓజీ సినిమా రిలీజ్ చేయలేమని యార్క్ సినిమాస్ అధికారికంగా ప్రకటించింది. అంతే కాకుండా.. ఫ్రీ బుకింగ్స్ చేసుకున్నవారికి అమౌంట్ రిఫండ్ చేస్తామని కూడా స్పష్టం చేసింది. ఈ ప్రకటన పవన్ కళ్యాణ్ అభిమానులకు కొంత నిరాశ కలిగించింది. అయితే ఓజీ నిర్మాతకు, హీరోకు ఓ పెద్ద షాక్ అనే చెప్పాలి.

ఓజీ చిత్రంలోని నటులు

పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై.. డీవీవీ దానయ్య నిర్మించారు. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఇందులో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినిమా నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించారు. ప్రియాంక అరుల్ మోహనన్ హీరోయిన్‌గా చేశారు. ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, అజయ్ గోష్, శ్యామ్, అభిమన్యూ సింగ్, శుభలేక సుధాకర్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు ప్రధాన పాత్రలు చేసారు.

లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ చేసిన ఏప్రిలియా: ధర ఎంతో తెలుసా?

ప్రముఖ వాహన తయారీ సంస్థ ఏప్రిలియా ఎప్పటికప్పుడు ఇండియన్ మార్కెట్లో సరికొత్త బైక్స్ లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా ఓ లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ చేసింది. దీని పేరు ఏప్రిలియా ఎస్ఆర్-జీపీ రెప్లికా 175. ఇది వరల్డ్ ఛాంపియన్ జార్జ్ మార్టిన్ & మార్కో బెజ్జెచ్చి నడిపిన 2025 ఆర్ఎస్-జీపీ మోటోజీపీ నుంచి ప్రేరణ పొందింది.

ధర & బుకింగ్స్

ఏప్రిలియా లాంచ్ చేసిన కొత్త ఎస్ఆర్-జీపీ రెప్లికా 175 స్కూటర్ ధర రూ. 1,22,521 (ఎక్స్ షోరూమ్). దీనిని కంపెనీ డీలర్ నెట్‌వర్క్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. టెస్ట్ రైడ్ చేయడానికి కూడా బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇది మంచి పనితీరును అందిస్తుందని సమాచారం. ఇప్పటికే ఈ స్కూటర్ దేశవ్యాప్తంగా ఉన్న ఏప్రిలియా అధీకృత డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.

డిజైన్

కొత్త ఎస్ఆర్-జీపీ రెప్లికా 175.. చూడటానికి 2025 ఆర్ఎస్-జీపీ బైక్‌ల మాదిరిగానే రెడ్, పర్పుల్ గ్రాఫిక్‌లతో నలుపు రంగులో ఉంది. బ్రాండ్ లోగో సైడ్ ప్యానెల్ నుంచి సెంట్రల్ టన్నెల్ ద్వారా.. ఫుట్‌బోర్డ్ వరకు ఉంది. గ్రాబ్ రైల్ మ్యాట్ బ్లాక్‌లో ఉండటం చూడవచ్చు. రిమ్స్ నలుపురంగులో ఉన్నాయి. కాగా ఫ్రంట్ వీల్ ఛానెల్‌పై కాంట్రాస్టింగ్ రెడ్ యాక్సెంట్స్ చూడవచ్చు. అంతే కాకుండా ఆ స్కూటర్ ఏప్రిలియా రేసింగ్ స్పాన్సర్స్ లోగోలతో పాటు.. జార్జ్ మార్టిన్ & మార్కో బెజ్జెచి రేస్ నంబర్స్ కూడా కలిగి ఉంది. మొత్తం మీద దీని కాస్మొటిక్ డిజైన్ చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది.

ఇంజిన్

ఏప్రిలియా ఎస్ఆర్-జీపీ రెప్లికా 175 స్కూటర్ 175 హెచ్‌పీ-ఈ ఇంజిన్ (175 సీసీ ఇంజిన్) పొందుతుంది. ఇది ఈ20 ఇంధనానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంజిన్ 13.08 బీహెచ్‌పీ, 14.14 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 175 సీసీ విభాగంలో అత్యధికం అని తెలుస్తోంది. పనితీరు పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుందని సమాచారం.

ఈ కొత్త స్కూటర్ ఏప్రిలియా యాక్టివ్ రైడింగ్ పొజిషన్.. మంచి నియంత్రణ కోసం వెడల్పు హ్యాండిల్ బార్, హై-గ్రిప్ టైర్స్, 14 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇవన్నీ మంచి రైడింగ్ అనుభూతిని అందించడానికి దోహదపడుతుంది.

ఫీచర్స్

ఏప్రిలియా లాంచ్ చేసిన కొత్త లిమిటెడ్ ఎడిషన్ 5.5 ఇంచెస్ కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే పొందుతుంది. ఈ స్క్రీన్ బ్లూటూత్ కనెక్టివిటీకి కూడా సపోర్ట్ చేస్తుంది. ఎల్ఈడీ లైటింగ్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ వంటివి కూడా లభిస్తాయి. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, రియర్ మోనోషాక్ కలిగిన ఈ స్కూటర్.. 220 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రియర్ డ్రమ్ బ్రేక్స్ పొందుతుంది. అదనపు భద్రత కోసం సింగిల్ ఛానల్ ఏబీఎస్ కూడా లభిస్తుంది.

ఇండియన్ మార్కెట్లో ఏప్రిలియా బైకులు

దేశీయ మార్కెట్లో ఏప్రిలియా స్కూటర్లను మాత్రమే కాకుండా.. ఖరీదైన బైకులను కూడా లాంచ్ చేసింది. ఈ జాబితాలో ఏప్రిలియా ఆర్ఎస్ 457, ఏప్రిలియా టునో 457, ఏప్రిలియా ఆర్‌ఎస్‌వీ4 1100 ఫ్యాక్టరీ, ఏప్రిలియా ఆర్ఎస్ 660, ఏప్రిలియా టునో 660, ఏప్రిలియా టువరెగ్ 660 ఉన్నాయి. స్కూటర్ల జాబితాలో.. ఏప్రిలియా ఎస్ఆర్ 175, ఎస్ఆర్ 160, ఎస్ఆర్ 125, ఎస్ఎక్స్ఆర్ 160, స్మార్ట్ 125, ఎస్ఎక్స్ఆర్ 125 మొదలైనవి ఉన్నాయి.

సరికొత్త ఆల్ట్రావయొలెట్ బైక్: సూపర్ టెక్నాలజీ & అంతకు మించిన ఫీచర్స్

బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ కంపెనీ ఆల్ట్రావయొలెట్ ఆటోమోటివ్.. దేశీయ విఫణిలో సరికొత్త బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ పేరు ‘ఎక్స్-47 క్రాస్ఓవర్‘. దీని ప్రారంభ ధర రూ. 2.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఇంటిగ్రేటెడ్ రాడార్. కెమెరా సేఫ్టీ సిస్టం వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.

బుకింగ్స్ & డెలివరీ

ఆల్ట్రావయొలెట్ లాంచ్ చేసిన ఎక్స్-47 క్రాస్ఓవర్ బైక్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. రూ. 999 చెల్లించి అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. భారతదేశంలో డెలివరీలు అక్టోబర్ 2025లో ప్రారంభమవుతాయి. గ్లోబల్ మార్కెట్లో డెలివరీలు 2026లో జరిగే అవకాశం ఉంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. ప్రారంభ ధర అనేది మొదటి 1000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తరువాత ధర పెరిగే అవకాశం ఉంటుంది. ఎంత పెరుగుతుంది అనే విషయం అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

డిజైన్ అండ్ ఫీచర్స్

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన సరికొత్త ఆల్ట్రావయొలెట్ ఎక్స్-47 క్రాస్ఓవర్ బైక్.. ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న బ్రాండ్ యొక్క అన్ని బైకులకంటే భిన్నంగా ఉంది. కాబట్టి చూడగానే ఇది కొత్తదిగా అనిపిస్తుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఎక్స్-47 క్రాస్ఓవర్ బైక్ 5 ఇంచెస్ టీఎఫ్‌టీ కన్సోల్ పొందుతుంది. వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, టైప్ సీ పోర్ట్స్, గ్రాబ్ హ్యాండిల్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, డైనమిక్ రీజెనరేటివ్ బ్రేకింగ్, క్రాష్ అలర్ట్స్, టోయింగ్ నోటిఫికేషన్స్, మూవ్‌మెంట్ డిటెక్షన్, రిమోట్ లాక్‌డౌన్ అందించే ఆల్ట్రావయొలెట్ యొక్క యాజమాన్య వైలెట్ ఏఐ కనెక్ట్ చేయబడిన సూట్ వంటివి ఉన్నాయి.

గ్లైడ్, కంబాట్, బాలిస్టిక్ వంటి మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. ఈ బైక్ రేడియల్ ఆల్ టెర్రైన్ టైర్స్ పొందుతుంది. అంతే కాకుండా 200 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు కమాండింగ్ రైడింగ్ పొజిషన్ కోసం ఫైటర్ జెట్ ప్రేరేపిత ఎర్గోనామిక్స్ వంటివి కూడా బైకులో ఉన్నాయి.

బ్యాటరీ వివరాలు

ఆల్ట్రావయొలెట్ ఎక్స్-47 క్రాస్ఓవర్ బైక్.. 10.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది 40.2 బీహెచ్‌పీ పవర్, 610 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ 2.7 సెకన్లలో 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 145 కిమీ కావడం గమనార్హం. ఈ బైక్ ఒక ఫుల్ ఛార్జితో 323 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.

ఇతర వివరాలు

కొత్త ఎక్స్-47 క్రాస్ఓవర్ బైక్ 41 మిమీ యూఎస్డీ ఫోర్క్స్, మోనోషాక్ పొందుతుంది. ఈ రెండూ కూడా ఫ్రీలోడ్ అడ్జస్టబుల్. బ్రేకింగ్ సిస్టం విషయానికి వస్తే.. ముందు భాగంలో ఫోర్ పిస్టన్ కాలిపర్‌తో 320 మిమీ ఫ్రంట్ డిస్క్, 230 మిమీ రియర్ డిస్క్ ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, మూడు ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ కూడా ఉన్నాయి.

టెక్నాలజీ

ఇప్పటివరకు కార్లలో మాత్రమే ఏడీఏఎస్ ఫీచర్ ఉండేవి. కానీ మొదటిసారి ఆల్ట్రావయొలెట్.. తన ఎక్స్-47 క్రాస్ఓవర్ బైకులో అందించింది. కాబట్టి ఈ బైకులో బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్ చేంజ్ అసిస్ట్, ఓవర్‌టేక్ అలర్ట్స్ మొదలైనవన్నీ ఉన్నాయి. ఈ బైకులో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. కాబట్టి ఇది అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది.

14 ఏళ్ల తరువాత ఓజీ సినిమాకు.. అదే సర్టిఫికేట్: కారణాలు ఇవే!

0

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఓజీ (దె కాల్ హిమ్ ఓజీ). ఈ సినిమాకు సంబంచించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇటీవలే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. జోరువానలో కూడా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా ఓజీ సినిమా గురించి చాలా విషయాలనే వెల్లడించారు. కాగా ఇప్పుడు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చింది.

14 ఏళ్ల తరువాత..

పవన్ కళ్యాణ్ నటించిన.. ఓజీ సినిమా ఈ నెల 25న రిలీజ్ కానుంది. అంతకంటే ముందు ఈ మూవీ సెన్సార్ పార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘ఏ’ ఇచ్చింది. ఈ విషయాన్ని చిత్ర బృందం కూడా అధికారికంగా వెల్లడించింది. పంజా సినిమా తరువాత.. ఓజీ సినిమా ఏ సర్టిఫికేట్ పొందింది. దీన్ని బట్టి చూస్తే 14 సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్ సినిమా ఏ సర్టిఫికేట్ పొందినట్లు అర్థమవుతోంది.

సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్

ఓజీ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ వస్తుందని నిర్మాణ సంస్థ ఊహించినప్పటికీ.. సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమాలో హింసకు సంబంధించిన సన్నివేశాలు ఉండటం వల్ల సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు వెల్లడించింది. (18 సంవత్సరాలు పైబడిన వారు చూడదగిన చిత్రాలకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇస్తుంది).

ఓజీ సినిమాలోని నటీనటులు

సుజీత్ దర్శకత్వం వహించిన ఓజీ సినిమా.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కాకుండా.. ప్రియాంక మోహన్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. కాగా ఇమ్రాన్ హస్మి విలన్ పాత్ర పోషించారు. నవీన్ నూలి ఎడిటర్ కాగా.. సినిమాటోగ్రఫీ రవి కే చంద్రన్ , మనోజ్ పరమహంస నిర్వహించారు.

ఓజీ సినిమా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడానికి చిత్ర బృందం కావలసిన సన్నాహాలను సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రత్యేక ప్రీమియర్ షోలు నిర్వహించడం, టికెట్స్ రేట్లు పెంచడం వంటివి చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబందించిన జీవో కూడా పాస్ చేసింది.

పవన్ కళ్యాణ్ ఓజీ

నటుడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా తరువాత తెరకెక్కనున్న సినిమా ఈ ఓజీ. యాక్షన్ సినిమాగా రిలీజ్ కానున్న ఈ మూవీ అభిమానులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. అయితే ఎలాంటి కలెక్షన్ రాబడుతుందో అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమా కోసం నిర్మాతలు రూ. 250 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఓజీ సినిమా మంచి హిట్ సాధిస్తే.. చాన్నాళ్ల తరువాత పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్ యాడ్ అవుతుంది.

ఇకపోతే ఓజీ సినిమా తరువాత.. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కనిపించనున్నారు. ఈ మూవీ 2026లో రిలీజ్ అవుతుందని సమాచారం. ఇందులో పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశీఖన్నా మొదలైనవారు నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా.. నవీన్ ఎర్నేని నిర్మాతగా వ్యవహరించారు.

తండ్రికి కారు గిఫ్ట్ ఇచ్చిన తిలక్ వర్మ: రేటెంతో తెలుసా?

ఒకప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు గిఫ్ట్స్ ఇవ్వడం సర్వసాధారణం. అయితే ఇప్పుడు పిల్లలు కూడా తమ తల్లిదండ్రులకు గిఫ్ట్స్ ఇచ్చి సంతోషపెడుతున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ క్రికెటర్ తిలక్ వర్మ.. తన తండ్రికి మహీంద్రా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కారును గిఫ్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇండియా క్రికెట్ టీమ్, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడే క్రికెటర్ తిలక్ వర్మ ఇటీవల.. తన తండ్రికి మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ కారును గిఫ్ట్ ఇచ్చారు. ఈ కారును డెలివరీ తీసుకోవడానికి ఇతడు.. తన తల్లి, తండ్రి, అన్నయ్యతో కలిసి వచ్చాడు. వీరు స్టెల్త్ బ్లాక్ క్లాసీ షేడ్ కలర్ కారును కొనుగోలు చేశారు. అంతే కాకుండా ఇది 79 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఎంచుకున్నట్లు సమాచారం.

మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ

దేశీయ వాహన తయారీ సంస్థ అయిన మహీంద్రా అండ్ మహీంద్రా ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ కారు ఈ ”ఎక్స్ఈవీ 9ఈ”. దీని ధర రూ. 21.90 లక్షల నుంచి రూ. 31.25 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ కారు 59 కిలోవాట్, 79 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అప్షన్లలో లభిస్తుంది.

మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ కారు ఒక సింగిల్ ఛార్జితో 542 కిమీ (59 కిలోవాట్ బ్యాటరీ), 565 కిమీ (79 కిలోవాట్ బ్యాటరీ) రేంజ్ అందిస్తుంది. ఈ రేంజ్ అనేది వాస్తవ ప్రపంచ పరిస్థితుల మధ్య మారే అవకాశం ఉంటుంది. 59 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వేరియంట్ 228 బీహెచ్‌పీ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కాగా 79 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వేరియంట్ 282 బీహెచ్‌పీ పవర్, 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ మూడు పెద్ద 12.30 ఇంచెస్ స్క్రీన్‌లను పొందుతుంది. దీనిని మహీంద్రా సినిమాస్కోప్ కాక్‌పిట్ అని పిలుస్తుంది. అంతే కాకుండా వెనుక సీటులో ఉండే ప్రయాణికుల కోసం రెండు స్క్రీన్స్ ఉన్నాయి. ఈ కారులో ఏడు ఎయిర్‌బ్యాగులు, లెవెల్ 3 ఏడీఏఎస్, 360 డిగ్రీ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ కలిగిన సెలబ్రిటీలు

నిజానికి మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ.. కొనుగోలు చేసిన సెలబ్రిటీ తిలక్ వర్మ కాదు. ఇప్పటికే ఏఆర్ రెహమాన్ కూడా ఈ కారును కొనుగోలు చేశారు. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, నటి కుబ్రా సైట్, బాలీవుడ్ నటుడు జావేద్ జాఫేరి, టెలివిజన్ నటి ఆకాంక్ష సింగ్, బిలినీయర్ & పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ మొదలైనవారు కూడా ఈ మహీంద్రా ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతూ ఉంది. ప్రస్తుతం సాధారణ పౌరులు మాత్రమే కాకుండా.. సెలబ్రిటీలు కూడా ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో దాదాపు చాలా కంపెనీలు దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. మౌలిక సదుపాయాలను కూడా అందుబాటులోకి తెస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రస్తుత పరిస్థితులు చెప్పకనే చెప్పేస్తున్నాయి.

బాలీవుడ్‌లో బంపరాఫర్.. క్రిష్ 4లో రష్మిక మందన్న?

0

చలో సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన రష్మిక మందన్న.. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాల్లో అగ్ర హీరోల సరసన నటించడం మాత్రమే కాకుండా.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు తాజాగా హృతిక్ రోషన్ సరసన నటించడానికి సిద్దమైనట్లు సమాచారం.

క్రిష్ 4లో నేషనల్ క్రష్?

క్రిష్ 4 సినిమా విడుదలకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. అయితే ఇప్పటి వరకు ఈ క్రిష్ సిరీస్ సినిమాల్లో ప్రియాంక చోప్రా నటించింది. అయితే క్రిష్ 4 సినిమాలో హీరోయిన్ ఛాన్స్ రష్మిక మందన్న కొట్టేసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. ప్రియాంక చోప్రా స్థానానికే ఎసరుపెట్టినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన సమాచారం అధికారికంగా వెలువడలేదు. ప్రస్తుతానికి ఇది రూమర్ మాత్రమే.

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ రంగంలో స్థిరపడిపోవడం వల్ల, క్రిష్ 4 సినిమాకు ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సి వచ్చింది. దీంతో చిత్ర బృందం కన్ను నేషనల్ క్రష్ రష్మిక మందన్న మీద పడింది. అయితే ఈమెను ఇంకా ఫైనల్ చేయలేదని తెలుస్తోంది. క్రిష్ సినిమాలో ఛాన్స్ వచ్చిందంటే.. రష్మిక సినీ రంగంలో ఓ పెద్ద అడుగు ముందుకు వేసినట్లే అవుతుంది. ఇప్పటికే ఈమె కాక్టెయిల్ 2, థామ హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది. ది గర్ల్ ఫ్రెండ్ లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా రష్మిక కీలక రోల్ ప్లే చేసింది.

2027లో రిలీజ్?

ఇప్పటి వరకు యానిమల్, పుష్ప సినిమాల్లో నటించి మంచి పేరుతెచ్చుకున్న రష్మిక మందన్న.. హృతిక్ రోషన్ సరసన నటించలేదు. అయితే క్రిష్ 4 లో ఛాన్స్ వస్తే మాత్రం.. ఈ జంట తెరమీద మొదటిసారి కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ 2026 మధ్యలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బహుశా 2027లో రిలీజ్ అవుతుందని సమాచారం.

హృతిక్ రోషన్.. క్రిష్ 4 సినిమాలో హీరో మాత్రమే కాకుండా, దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఈ సినిమా కోసం రూ. 500 కోట్ల నుంచి రూ. 700 కోట్ల బడ్జెట్ కేటాయించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇతర నటులను ఎంపిక చేసుకోవడానికి కూడా చిత్ర బృందం త్వరపడుతోంది.

క్రిష్ సినిమా గురించి?

సినిమా రంగంలో సంచలన విజయం సాధించిన హృతిక్ రోషన్ క్రిష్ 2006లో ప్రారంభమైంది. 2013లో క్రిష్ 3 రిలీజ్ అయ్యాయి. ఇక క్రిష్ 4 సినిమా 2017లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన ఈ సినిమా.. భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. క్రిష్ 4 కూడా మంచి విజయం సాదిస్తుందని ఆశిస్తున్నాము.

రష్మిక మందన్న

2018లో చలో సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న.. ప్రస్తుతం ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో ఒకరుగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకు రూ. 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇకపోతే ఈమె క్రిష్ 4 సినిమాలో నటిస్తే.. ఈ పారితోషికం డబుల్ అయినా.. ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.

అమెరికా ఫీజు పెంచితే.. ఉన్నాయ్‌గా ఈ కంట్రీస్!

0

అమెరికా హెచ్-1బీ వీసాలపై లక్ష డాలర్లు లేదా సుమారు రూ. 88 లక్షల కొత్త ఫీజును నిర్ణయించింది. దీంతో ఈ వీసా ద్వారా యూఎస్ఏలో పనిచేయాకునేవారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది అమెరికా వెళ్లేవారి సంఖ్యను తప్పకుండా తగ్గించే అవకాశం ఉంది. నిజానికి డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ కూడా ఇదే. తమ దేశంలో నిరుద్యోగాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు టైలుస్తోంది. అమెరికా వద్దనుకుంటే.. ప్రపంచంలో చాలా దేశాలు ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి.

యునైటెడ్ కింగ్‌డమ్

అమెరికాకు ప్రత్యామ్నాయ దేశంగా ‘యునైటెడ్ కింగ్‌డమ్’ను భావిస్తారు. ఈ దేశం నిపుణులకు, నైపుణ్యం కలిగిన కార్మికులకు వీసా అందిస్తుంది. దీంతో ఐదేళ్లు హ్యాపీగా ఈ దేశంలో ఉండవచ్చు, గడువును పొడిగించుకుంటే.. అంతకంటే ఎక్కువ రోజులే ఇక్కడ ఉండవచ్చు. అయితే ఈ దేశంలో ఉండేవారు స్పాన్సర్‌షిప్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఇది యూకేలో మీ ఉద్యోగ పాత్రను తెలియజేస్తుంది. కాగా నర్సులు, డాక్టర్లు లేదా సామజిక సంరక్షకులు హెల్త్ అండ్ కేర్ వర్కర్ వీసా కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో స్టూడెంట్ వీసా కలిగిన అభ్యర్థులు.. గ్రాడ్యుయేట్ రూట్ వీసా కోసం అప్లై చేసుకోవాలి. ఇది అదనంగా రెండేళ్లు ఆ దేశంలో ఉండటానికి అనుమతిస్తుంది. వర్కర్ వీసాతో ఐదేళ్లు ఇక్కడే ఉన్న తరువాత.. శాశ్వత నివాసం కోసం అప్లై చేసుకోవచ్చు.

ఆస్ట్రేలియా

విదేశీ పౌరుల కోసం ఆస్ట్రేలియా కూడా తాత్కాలిక వర్క్ వీసా.. లేదా పర్మినెంట్ వర్క్ వీసా అందిస్తుంది. అయితే కొన్ని షరతులకు లోబడి ఉంటుంది. పర్మినెంట్ వర్క్ వీసా కలిగిన అభ్యర్థులు.. ఆస్ట్రేలియాలో ఎక్కడైనా నివసించవచ్చు, పనిచేసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా వివిధ రంగాల వారిని దృష్టిలో ఉంచుకుని వివిధ రకాల వీసాలను ఆస్ట్రేలియా అందిస్తుంది. పర్మినెంట్ వర్క్ వీసాను.. శాశ్వత నివాస వీసాలుగా కూడా మార్చుకోవచ్చు.

కెనడా

ఈ దేశంలో పనిచేయాలనుకునే.. భారతీయులు నిర్దిష్ట వర్క్ పర్మిట్ లేదా ఓపెన్ వర్క్ పర్మిట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ వర్క్ పర్మిట్ ఎనేది కెనడాలో ఏ సంస్థలో పనిచేయడానికైనా అనుమతిస్తుంది. అయితే కొన్ని షరతులను పాటించాల్సి ఉంటుంది. అయితే నిర్దిష్ట వీసాలో ఎక్కడ, ఎంతకాలం పనిచేస్తావు అని వెల్లడించాల్సి ఉంటుంది.

జర్మనీ

ఈ దేశంలో జాబ్ ఆఫర్ పొందిన తరువాత.. జర్మనీ వర్క్ వీసా కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీసాతో ఉద్యోగులు చాలాకాలం పాటు అక్కడే పనిచేయడానికి అనుమతి లభిస్తుంది. ఆ తరువాత పర్మినెంట్ వీసా కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ వీసా కోసం అప్లై చేయాలంటే మాత్రం.. అక్కడ జాబ్ పొందినట్లు చూపించే డాక్యుమెంట్.. ఇతర కొన్ని అర్హత ప్రమాణాలను చూపించాల్సి ఉంటుంది.

ఐర్లాండ్

విదేశీ నిపుణులు, పెయిడ్ ఇంటర్న్‌లు, ఫిషింగ్ ఫ్లీట్‌లోని సిబ్బంది మొదలైనవారికి ఐర్లాండ్ వర్క్ వీసా అందిస్తుంది. నైపుణ్యం కలిగిన కార్మికులు.. ఏదైనా వృత్తిలో అర్హత సాధించినట్లయితే క్రిటికల్ స్కిల్స్ ఎంప్లాయ్‌మెంట్ పర్మిట్ కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే లోకమ్ డాక్టర్, మిడ్‌వైఫరీ నర్స్, పెయిడ్ ఇంటర్న్‌లు, ఫిషింగ్ ఫ్లీట్‌లోని సిబ్బంది.. ఎటిపికల్ పర్మిషన్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఐర్లాండ్ దేశంలో శాశ్వత నివాసం కోడం కూడా ఉపయోగపడుతుంది.

యూకే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, కెనడా దేశాలు.. విదేశీయులకు వర్క్ వీసాలను అందించడమే కాకుండా, మంచి పని పరిస్థితులను, కావలసిన మౌలిక సదుపాయాలను, జీవన శైలిని అందిస్తాయి. అయితే ఈ దేశాల వర్క్ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు.. అధికారిక వెబ్‌సైట్‌లోని అర్హతలను పరిశీలించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నిర్దిష్ట ప్రమాణాలు లేకపోతే.. వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందనే విషయం మర్చిపోకూడదు.

ఐదేళ్లు పోగు చేసి.. తనకు నచ్చిన కారునే భర్తకు గిఫ్ట్‌‌గా ఇచ్చిన భార్య

ప్రియమైనవారికి గిఫ్ట్ ఇవ్వడంలో లభించే ఆనందమే వేరు. ఈ కారణంగానే చాలామంది భర్తలు వారి భార్యలకు, భార్యలు తమ భర్తలకు అప్పుడప్పుడు సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి ఘటనే ఇటీవల ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో ఒక మహిళ తన భర్తకోసం ఐదేళ్లు కష్టపడి పోగుచేసిన డబ్బుతో కారు కొనిచ్చింది.

సొంతంగా కారు కొనాలని

”చిన్నప్పటి నుంచి.. ఇప్పటి వరకు నేను కోరుకున్న ప్రతిదీ చాలా సులభంగానే వచ్చింది. కానీ కారును మాత్రం సొంతంగా కొనాలనుకున్నాను. కారు కావాలని అమ్మానాన్నలను అడిగితే.. ఎప్పుడో కొనిచ్చే వారు. కానీ అలా వద్దనుకున్నాను. దీనికోసం డబ్బు పోగుచేయాలని, ఒక లక్ష రూపాయలతో సెకండ్ హ్యాండ్ కారు కొనాలని అనుకున్నాను. లక్ష రూపాయలు కూడబెట్టిన తరువాత.. రూ. రెండు లక్షలు, రూ. మూడు లక్షలు పోగు చేయాలనుకున్నాను.

డబ్బు కూడబెట్టే క్రమంలో సెకండ్ హ్యాండ్ కారును ఎందుకు కొనాలి?, కొత్తదే కొనేస్తే బాగుంటుందని నిర్ణయించుకున్నాను. దీనికోసం ఐదేళ్లు చిన్న చిన్న వస్తువులను, ఇష్టాలను త్యాగం చేసాను. మొత్తానికి రూ. 7 లక్షలు పోగుచేసాను. నేను సన్‌రూఫ్ ఉన్న కారును కొనాలి అనుకున్నాను. ఇంకా కొంత డబ్బు యాడ్.. కియా సిరోస్ కారును కొనేశాను. ఈ కారు కేవలం నా కల మాత్రమే కాదు. ఇది ఒక భావోద్వేగం. అయితే.. నా భర్త మొదటి నుంచి నా కలల కంటే ఎక్కువ ప్రేమను ఇచ్చారు. కాబట్టి నేను కొన్న కారును ప్రేమ లేఖగా.. మా మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా గిఫ్ట్ ఇస్తున్నా” అంటూ తన ఇన్‌స్టా ఖాతాలో పేర్కొంది.

కియా సిరోస్ డెలివరీ

ఐదేళ్లు పోగు చేసిన డబ్బుతో.. మహిళ కియా సిరోస్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ కూడా షేర్ చేసింది. ఇందులో డాక్యుమెంట్ వర్క్ పూర్తి చేయడం, కారు డెలివరీ తీసుకోవడం, కేక్ కట్ చేయడం వంటివి కనిపిస్తాయి. కష్టపడి పోగుచేసిన డబ్బుతో.. తన భర్తకు గిఫ్ట్ ఇవ్వడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

కియా సిరోస్ గురించి

దేశీయ మార్కెట్లోని సరసమైన కార్ల జాబితాలో.. కియా కంపెనీకి చెందిన సిరోస్ ఒకటి. దీని ధర రూ. 9.50 లక్షల నుంచి రూ. 17.80 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. సింపుల్ డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు.. మంచి మైలేజ్ కూడా అందిస్తుంది.

పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, 30 ఇంచెస్ ట్రినిటీ డిస్‌ప్లే, స్టార్ట్/స్టాప్ బటన్, వివిధ ఫంక్షన్స్ కోడం కావలసిన కంట్రోల్స్ కలిగిం టూ స్పోక్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వైర్‌లెస్ ఛార్జర్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీటు వంటి ఫీచర్స్ సిరోస్ కారులో ఉంటాయి. అంతే కాకుండా.. 360 డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ఏడీఏఎస్, ఏబీఎస్ విత్ ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం కూడా ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.