Home Blog Page 133

బిగ్‌బాస్‌ రెండోవారం ఎలిమినేషన్ ట్విస్ట్.. బ్యాగ్ సర్దేసిన మరో కామన్‌మెన్!

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే.. బిగ్‌బాస్ సీజన్ 9 రియాలిటీ షో మొదలై రెండువారాలు గడుస్తోంది. మొదటివారంలోనే కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ బయటకు వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. అయితే ఇప్పటికి బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయే జాబితాలో ఇద్దరిపేర్లు వినిపిస్తున్నాయి.

భారీగా తగ్గిన టీఆర్పీ రేటింగ్!

కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ వెర్షన్‌లో సాగుతున్న గేమ్.. అనుకున్నంత ఆకట్టుకునే విధంగా లేదని ప్రేక్షకులు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది టీఆర్పీ రేటింగ్ కూడా బాగా తగ్గిపోయింది. ఈ రేటింగ్ అంతకు ముందు జరిగిన అన్ని సీజన్స్ కంటే చాలా తక్కువ కావడం గమనార్హం. బిగ్‌బాస్ రియాలిటీ షోకు.. ఒకప్పుడు ఉన్నంత ఆదరణ ఇప్పుడు లేదు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో జరుగుతున్నవన్నీ గమనించి.. హోస్ట్ నాగార్జున వారాంతంలో గట్టిగానే క్లాస్ తీసుకుంటున్నారు.

ముందుకు దూసుకెళ్తున్న సుమన్ శెట్టి

బిగ్‌బాస్ సీజన్ 9 రెండో వారంలో మొత్తం 7మంది హౌస్‌మేట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు. సుమన్ శెట్టి, ఫ్లోరా షైనీ, హరిత హరీష్, డీమాన్ పవన్, భరణి, మర్యాద మనీష్ నామినేట్ అయినప్పటికీ.. ఓటింగ్ విషయంలో మాత్రం సుమన్ శెట్టి, భరణి ముందు వరుసలో ఉన్నారు. అమాయకత్వం, నిజాయితీ వంటివి సుమన్ శెట్టిని కాపాడుతున్నాయి. దీంతో ఇతడు ఓటింగ్ విషయంలో దూసుకెళ్తున్నాడు. మిగిలినవారికి కూడా కొంత పాజిటీవ్ ఓటింగ్ వచ్చింది.

మర్యాద మనీష్ అవుట్?

ఇక రెండోవారం ఎలిమినేషన్ విషయానికి వస్తే మాత్రం.. మర్యాద మనీష్, ప్రియా ఇద్దరు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికి సోషల్ మీడియా ద్వారా వెల్లడైన సమాచారం ప్రకారం.. ఈ ఇద్దరిలో మర్యాద మనీష్ రెండోవారం హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానప్పటికీ.. సోషల్ మీడియా టాక్ మాత్రం ఇదే. ఇదే జరిగితే ప్రియా సేఫ్ జోన్‌లోకి వెళ్లినట్లే అని తెలుస్తోంది.

మనీష్ ఎలిమినేటి అవ్వడానికి కారణాలు

నిజానికి కామన్ మెన్ కేటగిరిలో బిగ్‌బాస్ హౌస్‌లోకి మర్యాద మనీష్ శ్రీజ, ప్రియలకు అనుకూలంగా ఉండటం, ఇమ్మాన్యుయేల్ విషయంలో అతని వ్యతిరేఖ వైఖరి అనే తెలుస్తుంది. ఇది ఆడియన్స్‌కు నచ్చలేదు. దీంతో అతన్ని హౌస్ నుంచి బయటకు పంపించేయాలని ఫిక్స్ అయ్యారు. ఆడియన్స్ ఒకసారి అనుకుంటే.. అది జరగకుండా ఉంటుందా?, అదే మర్యాద మనీష్ కొంప ముంచిందని సమాచారం.

మర్యాద మనీష్ రెమ్యునరేషన్ ఎంతంటే?

ఇప్పటి వరకు సోషల్ మీడియా ద్వారా వెల్లడైన సమాచారం ప్రకారం.. మర్యాద మనీష్‌కు వారానికి రూ. 70వేలు ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇదే నిజమైతే ఇతడు రెండు వారాలకు రూ. 1.40 లక్షలు సంపాదించినట్లు అర్థమవుతుంది. అయితే ఏ రెమ్యునరేషన్ వివరాలు కేవలం అంచనా మాత్రమే. దీనికి సంబంధించిన విషయాలు అధికారికంగా వెల్లడికాలేదు. కాబట్టి రెమ్యునరేషన్ అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. దీని గురించి ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవాలంటే?.. మనీష్ స్పందించాల్సిందే!

అరుంధతిగా శ్రీలీల?: జేజమ్మగా మెప్పిస్తుందా!

0

అనుష్క నటించిన అరుంధతి సినిమా ఎంత పెద్ద హిట్ సాధించిందో అందరికి తెలుసు. ఇప్పటికి కూడా సినిమా ఇండస్ట్రీలో ఈ మూవీ ఒక సంచలనమే. నటి అనుష్కకు గొప్ప పేరు తీసుకొచ్చిన సినిమాల జాబితాలో ఇది చెప్పుకోదగ్గది. ఇలాంటి సినిమాను.. ఇప్పుడు రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇంతకీ ఈ సినిమాను ఏ భాషలో రీమేక్ చేయనున్నారు?, ఎవరు రీమేక్ చేయనున్నారు?, నటి ఎవరు అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

హిందీలో రీమేక్!

అరుంధతి సినిమా అనగానే ముందుగా గుర్తొచ్చేది.. అనుష్క. అంతగా నటించి ప్రేక్షకులను మెప్పించగలిగింది. అరుంధతి సినిమా రిలీజ్ సమయంలో.. ఈ సినిమాను రీమెక్ చేయడానికి ఎవరూ సాహసించలేదు. అయితే.. ఇప్పుడు (పదహారేళ్ళ తరువాత) ఈ సినిమాను హిందీలో రీమెక్ చేయాలని నిర్ణయించుకున్నారు. రీమేక్స్ చేయడంలో నిష్ణాతుడైన మోహన్ రాజా అరుంధతిని రీమేక్ చేయనున్నారు.

అరుంధతిగా శ్రీలీల?

మోహన్ రాజా రీమేక్ చేయనున్న అరుంధతి సినిమా కోసం ఎవరిని తీసుకుంటున్నారు?, ఈ క్యారెక్టర్ ఎవరు చేయనున్నరు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే ప్రస్తుతం వరుస సినిమాల్లో బిజీగా ఉన్న శ్రీలీల పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇది ఎంత వరకు నిజమనేది స్పష్టంగా తెలియదు. అంతే కాకుండా అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. బహుశా అరుంధతి పాత్రను పండించాలంటే మాత్రం చాలా కష్టమనే చెప్పాలి.

రిలీజ్ ఎప్పుడంటే?

నిజానికి మోహన్ రాజా సినిమా రీమేక్ చేస్తున్నారంటే.. అది తప్పకుండా సూపర్ హిట్ సాధిస్తుందని నమ్మకం. కాబట్టి అలాంటి వ్యక్తి అరుంధతి సినిమా రీమేక్ చేస్తున్నారు అంటే.. చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయనున్నారు. ఎప్పుడు రిలీజ్ చేయనున్నారు అనే విషయాలు మాత్రం ఖచ్చితంగా తెలియదు. బహుశా వచ్చే ఏడాది సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడాల్సి ఉంది.

అరుంధతి సినిమా గురించి

నటి అనుష్క అంటేనే ముందుగా.. చాలామందికి గుర్తొచ్చే సినిమా అరుంధతి. సుమారు 50 కంటే ఎక్కువ సినిమాల్లో నటించినప్పటికీ.. మంచి గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం అరుంధతి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో గొప్ప విజయం సాధించిన ఈ సినిమా.. భారీ వసూళ్లను రాబట్టడమే కాకుండా, సుమారు ఏడు విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులను అందుకుంది.

ఈ సినిమాలో అనుష్క, సోనూసూద్, సాయాజీ షిండే, మనోరమ, కైకాల సత్యనారాయణ, దివ్య నగేష్ మొదలైనవారు నటించారు. 2009లోనే ఈ సినిమాకు సుమారు రూ. 13.5 కోట్లు ఖర్చు పెడితే.. రూ. 40 కోట్ల కంటే ఎక్కువ వసూళ్లు చేసినట్లు సమాచారం. అంతటి హిట్ సాధించిన ఈ సినిమాను రీమేక్ చేస్తే.. ఎలా ఉంటుంది? ఎంత కలెక్షన్స్ రాబట్టుకోగలుగుతుంది? అనేది తెలియాల్సి ఉంది. అంతే కాకుండా.. ఈ రీమేక్ అరుంధతి సినిమా కోసం శ్రీలీలనే తీసుకుంటారా?, లేక హీరోయిన్ ఎంపికలో ఏమైనా మార్పులు ఉంటాయా అనేది కూడా ప్రస్తుతానికి సమాధానం లభించని ప్రశ్నగానే మిగిలిపోయింది.

గెలిచినోళ్లకు రూ.3 లక్షలు: కాన్సెప్ట్ చూసి.. ప్రైజ్ మనీ పట్టండి!

భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం.. సర్వమత సమ్మేళనం. కాబట్టి దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతే.. ఆ ప్రాంతం చరిత్ర, సంస్కృతిని తెలియజేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ విషయానికి వస్తే.. ఇక్క బతుకమ్మ పండుగకు ఓ విశేషమైన ఆదరణ ఉంది. ఈ బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 21న జరగనుంది. అంతకంటే ముందు తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ‘బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2025‘ పేరుతో షార్ట్ ఫిల్మ్, పాటలు పోటీ నిర్వహించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నేపథ్యం & చివరి తేదీ

తెలంగాణ పండుగలు, ప్రజాపాలన, చరిత్ర, సంస్కృతీ నేపధ్యాన్ని వివరించేలా కంటెంట్ ఉండాలని.. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు పేర్కొన్నారు. ఈ పోటీలో సృజన శీలులు 40 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఎవరైనా పాల్గొనవచ్చు. ఇందులో పాల్గొనడానికి లేదా ఎంట్రీలను పంపించడానికి చివరి తేదీ 2025 సెప్టెంబర్ 30 అని వెల్లడించారు.

వీడియో & పాట నిడివి

రాష్ట్రంలోని యువకుల సృజనాత్మకతను వెలికితీయడమే ధ్యేయంగా.. ఈ బతుకున్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలంజ్ పేరిట పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేవారు.. తెలంగాణ సీఎం రేవంత్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి.. లేదా తెలంగాణ చరిత్ర, పండుగలకు సంబంధించిన నేపథ్యంలో షార్ట్ ఫిల్మ్స్ లేదా పాటలు రూపొందించాల్సి ఉంటుంది. అయితే కంటెస్టెంట్స్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. షార్ట్ ఫిల్మ్ నిడివి 3 నిముషాలు.. పాట నిడివి ఐదు నిమిషాలు మాత్రమే ఉండేలా చూసుకోవాలి.

వీడియోలు 4కే రిజల్యూషన్ కలిగి ఉండాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. షార్ట్ ఫిల్మ్ లేదా పాటలు తప్పకుండా థీమ్ అనుసరించాల్సిందే. అంతే కాకుండా మీరు చేసిన వీడియో లేదా పాట ఇప్పటివరకు ప్రదర్శించి ఉండకూడదు లేదా రిలీజ్ చేసే ఉండకూడదు. ప్రత్యేకంగా బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ కోసమే చిత్రరేకరించి ఉండాలి.

ప్రైజ్ మనీ వివరాలు ఇలా..

బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ పోటీల్లో గెలుపొందినవారికి ప్రైజ్ మనీ అందిస్తారు. మొదటి బహుమతికి రూ. 3 లక్షలు, రెండో బహుమతికి రూ. 2 లక్షలు, మూడో బహుమతిగా రూ. 1 లక్ష ప్రైజ్ మనీ అందించడం జరుగుతుంది. కన్సోలేషన్ బహుమతిగా ఐదుగురికి రూ. 20వేలు ఇవ్వడం జరుగుతుంది. అంతే కాకుండా విజేతలందరికి కూడా ప్రశంసాపత్రంతో పాటు.. జ్ఞాపికను కూడా ప్రధానం చేస్తారు. నిర్దేశిత గడువు లోపల వచ్చిన ఎంట్రీలను నిపుణులతో కూడిన జ్యూరీ వీక్షించి.. కేటగిరీలుగా ఎంపిక చేస్తారు.

యూట్యూబ్ లేదా ఇతర సోషల్ మీడియాలలో వీడియోలు చేస్తున్నవారు మరింత గుర్తింపు తెచ్చుకోవడానికి లేదా తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇదొక మంచి అవకాశం. ఈ పోటీలో గెలుపొంచినవారికి భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి లేదా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా కొన్ని అవకాశాలు లభించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఓ మంచి కాన్సెప్ట్ తీసుకుని.. విజయం పొందాలని ఆశిస్తున్నాము.

మార్కెట్లో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ధర రూ.89999 మాత్రమే!

 

దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న సమయంలో.. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్ ఆంపియర్.. మాగ్నస్ గ్రాండ్ పేరుతో ఓ సరికొత్త స్కూటర్ లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ధర, ఫీచర్స్, రేంజ్ వంటి వివరాలు క్షుణ్ణంగా ఇక్కడ తెలుసుకుందాం.

ధర

భారతదేశంలో లాంచ్ అయిన కొత్త ఆంపియర్ మాగ్నస్ గ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర రూ. 89,999 (ఎక్స్ షోరూమ్). దీని ధర ఇప్పటికే అమ్మకానికి ఉన్న బ్రాండ్ ఇతర స్కూటర్ల కంటే కూడా రూ. 5000 ఎక్కువ కావడం గమనార్హం. అయితే ధరకు తగిన టెక్నాలజీ ఇందులో గమనించవచ్చు.

డిజైన్ & ఫీచర్స్

మాగ్నస్ గ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి.. ఇప్పటికే ఆంపియర్ ఫ్యామిలిలో ఇతర స్కూటర్స్ మాదిరిగా అనిపించినప్పటికీ కొన్ని కొత్త అప్డేట్స్ గమనించవచ్చు. కాగా ఇది రెండు కొత్త కలర్ ఆప్షన్స్ (మాచా గ్రీన్, ఓషన్ బ్లూ) పొందుతుంది. పైగా ప్రయాణికుల అదనపు సౌకర్యం కోసం ఇందులో గ్రాబ్ రైల్ ఉండటం చూడవచ్చు. 22 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కలిగి ఉన్న ఈ స్కూటర్ గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది. ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ ఇండికేటర్స్ ఇందులో గమనించవచ్చు. మొత్తం మీద డిజైన్ చూడచక్కగా ఉందని స్పష్టమవుతోంది.

లేటెస్ట్ బ్రేకింగ్ టెక్నాలజీ, విశాలమైన సీటు, అధిక పేలోడ్ కెపాసిటీ వంటివి మాగ్నస్ గ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పొందుతుంది. సీటు కొత్త బ్రౌన్ కలర్ క్విల్టెడ్ కవర్ పొందుతుంది. ఇందులో కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉండటం చూడవచ్చు. ఎకో, సిటీ అనే రెండు రైడింగ్ మోడ్స్ కలిగి ఉన్న ఈ స్కూటర్ యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా పొందుతుంది. మిగిలిన ఫీచర్స్ అన్నీ కూడా ఇతర మాగ్నస్ స్కూటర్లలో ఉన్న విధంగానే ఉంటాయి.

బ్యాటరీ & రేంజ్

ఎలక్ట్రిక్ వెహికల్ అనగానే ముందుగా చెప్పుకోవాల్సింది బ్యాటరీ, రేంజ్. ఆంపియర్ మాగ్నస్ గ్రాండ్ 2.3 కిలోవాట్ లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్ బ్యాటరీ పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 85 కిమీ నుంచి 90 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. దీని టాప్ స్పీడ్ గంటకు 65 కిమీ కావడం గమనార్హం. కంపెనీ ఈ బ్యాటరీపై 5 సంవత్సరాలు లేదా 75000 కిమీ వారంటీ అందిస్తుంది.

మాగ్నస్ గ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌లతో 12 ఇంచెస్ స్టీల్ వీల్స్ పొందుతుంది. అంతే కాకుండా.. ఇది మెరుగైన రైడింగ్ అందించడానికి డ్యూయెల్ రియర్ షాక్ అబ్జార్బర్‌లతో పాటు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ పొందుతుంది. మొత్తం మీద ఇది ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుందని మాత్రం స్పష్టమవుతోంది.

మార్కెట్లోని ఇతర ఆంపియర్ స్కూటర్స్

దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఆంపియర్ స్కూటర్లు కూడా ఉన్నాయి. కంపెనీ ప్రస్తుతం భారతీయ విఫణిలో ఆంపియర్ రియో 80 (రూ. 59,900 ఎక్స్-షోరూమ్), ఆంపియర్ నెక్సస్ (రూ. 1.15 లక్షల నుంచి రూ. 1.30 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్), ఆంపియర్ రియో ఎల్ఐ ప్లస్ (రూ. 59,900 ఎక్స్ షోరూమ్) వంటి స్కూటర్లు విక్రయిస్తోంది. ఇప్పుడు మాగ్నస్ గ్రాండ్ పేరుతో ఇంకో స్కూటర్ జాబితాలోకి చేరింది.

అప్పుడు స్పిరిట్‌, ఇప్పుడు కల్కి.. ఆ కండీషనే దీపిక కొంపముంచింది!

0

సినిమా రంగం అనేది పాము నిచ్చెన ఆట లాంటిది. జాగ్రత్తగా నడుచుకుంటే సక్సెస్ వరిస్తుంది, లేకుంటే.. లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే పరిస్థితి ఇలా అయిందేమో అనిపిస్తుంది. దీనికి కారణాలేమిటో.. ఈ కథనంలో తెలుసుకుందాం.

కల్కి 2 సినిమాకు దీపికా పదుకొనే దూరం

దీపికా పదుకొనే.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాల్లో నటించి ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా ఇప్పుడు కల్కి 2 సినిమాలో కనిపించకుండా పోయింది. కల్కి 2898 ఏడీ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. అలాంటి సినిమా సీక్వెల్ కల్కి 2లో ఇప్పుడు దీపికా పదుకొనే లేకపోవడం కొంత విచారకరమే అయినప్పటికీ.. ఈమెను తప్పనిసరి పరిస్థితుల్లో చిత్ర బృందమే వదులుకుంది. దీనికి సంబంధించిన వైజయంతి మూవీస్ అధికారికంగా ట్వీట్ చేసింది.

నటి దీపికా పదుకొనే కల్కి 2898 ఏడీ సీక్వెల్‌లో ఉండదు. అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించి, ఆలోచించిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నాము. కల్కి 2898 ఏడీ సినిమా చేయడానికి మాతో సుదీర్ఘ ప్రయాణం చేసినప్పటికీ.. భాగస్వామ్యం కుదరలేదు. కల్కి వంటి సినిమాకు నిబద్దత చాలా అవసరం. కాగా దీపికా పదుకొనే భవిష్యత్తులో మరెన్నో సినిమాలు చేయాలనీ ఆశిస్తున్నట్లు వైజయంతీ మూవీస్ తన ఎక్స్ ఖాతాలో స్పష్టం చేసింది.

అసలు కారణాలు!

దీపికా పదుకొనేను తీసుకోకపోవడానికి అసలు కారణం రెమ్యునరేషన్ కాదు. ఎందుకంటే కల్కి 2898 ఏడీ భారీ విజయం సాధించి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. కాబట్టి కల్కి పార్ట్ 2లో నటించడానికి దీపికా పదుకొనే ఎంత అడిగినా చిత్ర బృందం ఇవ్వడానికి తప్పకుండా సిద్ధంగా ఉంటుంది. ఇది ప్రధాన కారణం కాదని తెలుస్తోంది.

కల్కి 2 సినిమాలో తాను రోజుకి ఎనిమిది గంటలే పనిచేస్తానని చెప్పినట్లు సమాచారం. నిజానికి కల్కి వంటి సినిమా తీయడానికి చాలా రోజులు సమయం పడుతుంది. సమయాన్ని చూసుకుంటే జరిగేపని కాదు. కాబట్టి కల్కి 2 సినిమాకు దీపికా దూరమవ్వడానికి ప్రధాన కారణం ఇదే అని తెలుస్తోంది. కొన్ని ఇబ్బందికరమైన సీన్స్ చేయనని కూడా దీపికా పాడుకొనే కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈమె పెట్టిన కండిషన్స్ ఆమెను సినిమాలో లేకుండా చేశాయని స్పష్టమవుతోంది.

ఇలాంటి కండిషన్స్ కారణంగానే స్పిరిట్ సినిమాలో కూడా సందీప్ రెడ్డి వంగా.. దీపికా పదుకొనేను తీసుకోలేదని తెలుస్తోంది. కాగా ఇప్పుడు కల్కి సీక్వెల్ చేజారిపోయింది. లెక్కలేనన్ని బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి.. ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించిన దీపికా పదుకొనే ప్రస్తుతం గొప్ప సినిమాల్లో నటించే అవకాశాన్ని చేజేతులా దూరం చేసుకుంటింది. ఇది ఇలాగే కొనసాగితే.. ముందు ముందు భారీ ప్రాజెక్టులలో దీపికా పదుకొనే నటించే అవకాశం బహుశా కోల్పోయే అవకాశం ఉందనిపిస్తోంది. ఎందుకంటే భారీ ప్రాజెక్ట్ సినిమాల కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తుంటారు. అలాంటప్పుడు లేనిపోని కండిషన్స్ పెట్టడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. వీటిని దృష్టిలో ఉంచుకునే.. వారికి అనువైనవారిని ఎంచుకుంటారు.

‘టీవీఎస్ ఎక్స్ఎల్100’లో పెద్ద అప్డేట్: ఇప్పుడు ధర ఎంతంటే?

‘మన ఊరి బండి’గా పేరుపొందిన టీవీఎస్ ఎక్స్ఎల్100 హెచ్‌డీ ఇప్పుడు సరికొత్త అప్డేట్ పొందింది. భారతదేశంలో ఎక్కువమంది గ్రామీణ ప్రజలకు ఇష్టమైన ఈ మోపెడ్.. రోజువారీ ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ధర కూడా ఇతర టూవీలర్లతో పోలిస్తే కొంత తక్కువే కావడం గమనార్హం.

లేటేస్ట్ అప్డేట్ & ధరలు

టీవీఎస్ ఎక్స్ఎల్100 హెచ్‌డీ ఇప్పుడు.. అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇదే ఇందులోని కొత్త అప్డేట్. దీని ధర రూ. 65,047 (ఎక్స్ షోరూమ్). ట్యూబ్‌లెస్ టైర్లతో.. 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందిన ఎక్స్ఎల్100 హెచ్‌డీ మెరుగైన మన్నికను అందించడం మాత్రమే కాకుండా.. భద్రతను కూడా అందిస్తుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఉండటం వల్ల దృశ్యమానత కూడా అద్భుతంగా ఉంటుంది. కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడం భాగంగా.. ఇది లేటెస్ట్ గ్రాఫిక్స్, రీ డిజైన్డ్ టెయిల్‌లైట్స్ బ్లాక్ మఫ్లర్ పొందుతాయి. కాబట్టి ఇది చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది.

డిజైన్

కొత్త టీవీఎస్ ఎక్స్ఎల్100 హెచ్‌డీ మోపెడ్.. 2 పీస్ సీటును కలిగి.. పెద్ద ఫ్లోర్‌బోర్డ్ స్పేస్, అదనపు సౌలభ్యం కోసం మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ వంటివి కూడా పొందుతుంది. సీటు రైడర్, పిలియన్ ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా డంపింగ్‌తో కూడిన ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, వేరియబుల్ రేటెడ్ స్ప్రింగ్‌లతో కూడిన స్వింగ్ ఆర్మ్ రియర్ సస్పెన్షన్ వంటివి కఠినమైన భూభాగాల్లో కూడా మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

టెక్నాలజీ విషయానికి వస్తే.. కొత్త ఎక్స్ఎల్100 హెచ్‌డీ అల్లాయ్.. ఎకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజక్షన్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇది సాధారణ మోపెడ్ కంటే కూడా 15 శాతం ఎక్కువ మైలేజ్ అందిస్తుంది. ఇంజిన్ ఆటోమేటిక్‌గా స్విచ్ ఆఫ్ చేసే టిల్ట్ సెన్సార్ పొందుతుంది.

ఇంజిన్ వివరాలు

టీవీఎస్ ఎక్స్ఎల్100 హెచ్‌డీ మోపెడ్ 99.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ ఇంజెక్టెడ్ ఇంజిన్ ద్వారా 6000 ఆర్‌పీఎమ్ వద్ద 4.3 బీహెచ్‌పీ పవర్.. 3500 ఆర్‌పీఎమ్ వద్ద 6.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ మోపెడ్ టాప్ స్పీడ్ గంటకు 58 కిమీ. ఇంజిన్ సెంట్రిఫ్యూగల్ వెట్ క్లచ్, చైన్ డ్రైవ్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి.. మంచి పనితీరును అందిస్తుంది. 89 కేజీల బరువున్న ఈ మోపెడ్ 150 కేజీల బరువును మోసే కెపాసిటీ కలిగి ఉంటుంది.

కలర్ ఆప్షన్స్ & వేరియంట్స్

కొత్త టీవీఎస్ ఎక్స్ఎల్100 హెచ్‌డీ మొత్తం మూడు రంగుల్లో లభిస్తుంది. అవి రెడ్, బ్లూ, గ్రే కలర్స్. ఎక్స్ఎల్100 హెచ్‌డీ మల్టిపుల్ వేరియంట్లలో లభిస్తుంది. ప్రారంభ ధర రూ. 47,754 కాగా.. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 65,047 (ఎక్స్ షోరూమ్)

➤హెవీ డ్యూటీ: రూ. 47,754
➤హెవీ డ్యూటీ ఐ-టచ్‌స్టార్ట్: రూ. 60,405
➤హెవీ డ్యూటీ ఐ- టచ్‌స్టార్ట్ విన్ ఎడిషన్: రూ. 63,347
➤కంఫర్ట్ ఐ-టచ్‌స్టార్ట్: రూ. 63,705
➤ఎక్స్ఎల్100 హెచ్‌డీ: రూ. 65047 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

ఇండియన్ మార్కెట్లో టీవీఎస్ కంపెనీకి చెందిన మోపెడ్ టూవీలర్లకు డిమాండ్ ఎక్కువగానే ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్స్ లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఎక్స్ఎల్100 హెచ్‌డీ లాంచ్ చేయడం జరిగింది. ఇది ప్-అండగా సమయంలో మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము.

ఒక్క సినిమాకు రూ.530 కోట్ల రెమ్యునరేషన్!.. ఈ హీరోయిన్ గురించి తెలుసా?

0

సినిమా రంగంలో రెమ్యునరేషన్స్ గురించి మాట్లాడుకుంటే.. ఎక్కువగా హీరోలకే ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కొన్ని సందర్భాల్లో హీరోయిన్లకు కూడా కొంత ఎక్కువ రెమ్యునరేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది సందర్భాన్ని బట్టి ఉంటుంది. అయితే ఓ హీరోయిన్ మాత్రం.. ఏకంగా రూ. 530 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడానికి సిద్ధమైపోయింది. ఇంతకీ ఆమె ఎవరు?, ఏ సినిమాకు ఇంత పారితోషికం ఇస్తున్నారనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.

2026 ప్రారంభంలో షూటింగ్!

పాపులర్ హాలీవుడ్ హీరోయిన్ ‘సిడ్నీ స్వీని‘ బాలీవుడ్ మేకర్స్ ఏకంగా భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అఫర్ చేసినట్లు తెలుస్తోంది. ది వైట్ లోటస్, యుఫోరియా వంటి సినిమాలతో ఫేమస్ అయిన స్వీని త్వరలోనే బాలీవుడ్ సినిమాలో కనిపించనుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. ఇదే నిజమైతే సినిమా షూటింగ్ 2026 ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంటుందని సమాచారం.

సిడ్నీ స్వీని రూ.530 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే మాట నిజమే అయితే.. ఇప్పటి సినిమా రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్‌గా సరికొత్త రికార్డ్ కైవసం చేసుకోనుంది. ఒక్క హీరోయిన్ రెమ్యునరేషన్.. ఇంత మొత్తంలో ఉంటే.. సినిమా కోసం ఇంకెంత ఖర్చుపెడతారు?, బడ్జెట్ ఎంత ఉంటుందని పలువురు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

యువ అమెరికన్ స్టార్‌గా!

నటి సిడ్నీ స్వీని.. భారీ మొత్తం రెమ్యునరేషన్ పొందనున్న ఈ ప్రాజెక్ట్‌లో ఒక యువ అమెరికన్ స్టార్‌గా.. ఇండియన్ సెలబ్రిటీతో ప్రేమలో పడే పాత్రలో కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ 2026 ప్రారంభంలో న్యూయార్క్, పారిస్, లండన్, దుబాయ్ వంటి ప్రదేశాల్లో జరగనుంది. నిజానికి ఈ ఆఫర్ రావడంతో.. మొదట్లో సిడ్నీ స్వీని కూడా కొంత ఆశ్చర్యానికి లోనైనట్లు సమాచారం.

ఇకపోతే.. సిడ్నీ స్వీని ప్రస్తుతం క్రిస్టీలో కనిపించనుంది. ఈమె స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ కవర్‌పై కనిపించిన మొదటి మహిళా బాక్సర్ అయిన యూఎస్ ప్రో ఫైటర్ క్రిస్టీ మార్టిన్ పాత్రను పోషించింది. బెన్ ఫోస్టర్, మెరిట్ వెవర్ కలిసి నటించిన ఈ సినిమా 2025 నవంబర్ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఎవరీ సిడ్నీ స్వీని?

సిడ్నీ స్వీని గురించి తెలుగు ప్రేక్షకులకు బహుశా తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈమె అమెరికన్ నటి. 1997 సెప్టెంబర్ 12న జన్మించిన ఈమె 2009లో హీరోస్ సిరీస్ ఎపిసోడ్‌లో ఒక చిన్న పాత్రతో టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది. అయితే 2010లో సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆమె నటిగా మాత్రమే కాకుండా.. అర్మానీ బ్యూటీ, లనీజ్ వంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పనిచేసింది. ఇవి కాకుండా మియు మియు, శామ్‌సంగ్, ఫోర్డ్, బాస్కిన్ రాబిన్స్, కాటన్ ఆన్, గెస్ వంటి వాటితో ప్రత్యేక భాగస్వామ్యం కుదుర్చుకుంది. సోషల్ మీడియాలో కూడా లెక్కకు మించిన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

స్వీని ఒక ఆటోమొబైల్ ఔత్సాహికురాలు కూడా.. ఈమె 1969 ఫోర్డ్ బ్రోంకో, 1965 ఫోర్ట్ మస్టాంగ్ వంటి వాటితో పాటు.. తాత ఇచ్చిన 1956 ఫోర్డ్ ఎఫ్100 వంటి కార్లను కలిగి ఉంది. ఈమె ఫోర్డ్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్న కారణంగా.. కస్టమైజ్డ్ 2024 మస్టాంగ్ కూడా సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకోబోతున్న నటిగా రికార్డ్ క్రియేట్ చేయనుంది.

మిరాయ్ బ్లాక్ బ్లస్టర్.. తేజ సజ్జకు కారు గిఫ్ట్!

యువ నటుడు తేజ సజ్జ నటించిన మిరాయ్ బ్లాక్ బ్లాస్టర్ సాధించి.. కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. ఈ సినిమా కేవలం 5 రోజుల్లో రూ. 100 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా గొప్ప సక్సెస్ సాధించిన సందర్భంగా.. మంగళవారం విజవాడలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హీరో, హీరోయిన్స్ మాత్రమే కాకుండా.. డైరెక్టర్ ఇతర చిత్ర బృందం, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

కోరుకున్న కారు గిఫ్ట్

మిరాయ్ సక్సెస్ మీట్ కార్యక్రమంలో నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. సినిమా గొప్ప విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ సినిమా ఇంత గొప్ప హిట్ సాధించడానికి చిత్ర బృందం చాలా కష్టపడిందని అన్నారు. అంతే కాకుండా సినిమా సక్సెస్ సాధించిన సందర్భంగా.. హీరో తేజ సజ్జకు, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి.. వాళ్లు ఏ కారు కోరుకుంటే, ఆ కారును గిఫ్ట్ ఇస్తానని పేర్కొన్నారు.

రూ. 100 కోట్ల మార్క్..

హనుమాన్ సినిమా తరువాత తేజ సజ్జ నటించిన ఈ మిరాయ్.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నటుడు మంచు మనోజ్ ఈ సినిమాకు అదనపు ఎనర్జీ అందించగా.. సీనియర్ నటి శ్రియ తన నటనతో ఆకట్టుకుంది. ఇక రితిక్ నాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం మీద తేజ సజ్జ ఖాతాలో మరో బ్లాక్ బ్లస్టర్ చేరిపోయింది. ఇప్పటికే రూ. 100 కోట్ల మార్కును చేరుకున్న ఈ సినిమా.. ఇంకా వసూళ్లు చేస్తుందని భావిస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం రూ. 60 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం.

మిరాయ్ సినిమా గురించి

అశోకుడి కాలం నాటికి చెందిన కథగా ఇందులో చెప్పడం జరిగింది. కొన్ని అద్భుతమైన గ్రంధాలలో అతీతమైన శక్తులు ఉన్నాయని, వాటిని పొందితే మనిషి దేవుడవుతాడు. మహాబీర్ (మంచు మనోజ్) వీటిని దక్కించుకోవాలని ప్రయత్నం చేసి ఎనిమిది గ్రంధాలను సొంతం చేసుకుంటాడు. అయితే చివరి గ్రంధం పొందాలనుకుంటాడు. వేద ప్రజాపతి (తేజ సజ్జ) ఆ గ్రంధాన్ని కాపాడే దశలో మిరాయ్ సాధిస్తాడు. విభా (రితిక నాయక్) సాయంతో గతాన్ని తెలుసుకుని.. మహాబీర్ తొమ్మిదో గ్రంధం ద్వారా శక్తులను సొంతం చేసుకోకుండా అవుతాడు. జగపతి బాబు, శ్రియ కూడా తమదైన నటనతో అద్భుతం సృష్టించారు. మొత్తం మీద ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది.

మిరాయ్ నటీనటుల రెమ్యునరేషన్

కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన మిరాయ్ సినిమా కోసం రూ. 60 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో నటించిన హీరో తేజ సజ్జ.. హనుమాన్ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈయన హనుమాన్ సినిమాకు రూ. 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అంటే ఇతడు మిరాయ్ సినిమాకు రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మంచు మనోజ్, శ్రియ కూడా ఒక్కొక్కరు రూ. 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోగా.. జగపతి బాబు రూ. 1.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే రితికా నాయక్ రెమ్యునరేషన్ రూ. 50 లక్షలు అని తెలుస్తోంది.

నరేంద్ర మోదీ జీవితంపై మరో సినిమా.. పోస్టర్ రిలీజ్: టైటిల్ ఏంటో తెలుసా?

0

భారతప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం (సెప్టెంబర్ 17) సందర్భంగా.. దేశంలోని పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖులు, సినీతారలు మాత్రమే కాకుండా, ఇతర దేశాల అధ్యక్షులు సైతం శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే డైరెక్టర్ సీహెచ్ క్రాంతి కుమార్ మాత్రం ‘మా వందే‘ మోదీ బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్ట్ కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మోదీ బయోపిక్ మా వందే

నరేంద్ర మోదీ బయోపిక్ మా వందే సినిమా కోసం దక్షిణాది టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నట్లు సమాచారం. మలయాళీ హీరో ఉన్ని ముకుందన్ నరేంద్ర మోదీ క్యారెక్టర్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే కాకుండా.. దేశంలోని ఇతర ప్రముఖ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పుడు విడుదలైన పోస్టర్ స్పష్టం చేస్తోంది. ఈ సినిమాకు వీర్ రెడ్డి ప్రొడ్యూసర్. కేజీఎఫ్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేసిన రవి బస్రూత్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.కాగా దర్శకధీరుడు రాజమౌళి సినిమాలకు పనిచేసిన సెంథిల్ కుమార్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ చేయనున్నారు.

తల్లి సంకల్పం గొప్పది

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ అయింది. ఇందులో ఉన్ని ముకుందన్ ఇన్ మా వందే అని ఉండటం మాత్రమే కాకుండా.. ఎన్ని పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పది అనే వాక్యం ఉండటం, దాని కింద నరేంద్ర మోదీ అని ఉండటం చూడవచ్చు. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం మాత్రం ఇంకా వెల్లడించలేదు. అయితే ఇప్పటికే 2019లోనే ‘పీఎం నరేంద్ర మోదీ’ పేరుతో ఒక బయోపిక్ రిలీజ్ అయింది. ఇప్పుడు రెండో సినిమా రిలీజ్ కావడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

నరేంద్ర మోదీ గురించి

రాజకీయ అంశాలు ఎలా ఉన్నా.. భారతదేశ అభివృద్ధికి పాటుపడుతున్న మహామనిషి ‘నరేంద్ర మోదీ’ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతోంది.

1950 సెప్టెంబర్ 17న దామోదర్‌దాస్ ముల్చంద్ మోదీ, హీరాబెన్ మోదీ దంపతులకు జన్మించిన ఆరుగురు పిల్లల్లో నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ.. మూడో వ్యక్తి. వీరిది గుజరాతీ కుటుంబం. ఈయన చిన్నప్పుడు టీ స్టాల్‌లో కూడా పనిచేసినట్లు తెలుస్తోంది. 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్ర మోదీ.. ఆ తరువాత 2014 నుంచి భారతదేశ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. దీంతో భారతదేశానికి ఎక్కువ సంవత్సరాలు ప్రధానిగా ఉన్న ఘనత కూడా ఈయన సొంతం చేసుకున్నారు.

నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత.. ఇప్పటివరకు 78 దేశాలు సందర్శించారు. దేశం ప్రతిభను చాటిచెబుతూనే.. ఇతర దేశాలతో సత్సంబంధాలను ఏర్పరచుకున్న ఘనత కూడా నరేంద్ర మోదీ సొంతం కావడం గమనార్హం. ఈ మధ్యకాలంలో అమెరికా భారీ సుంకాలను విధించిన తరువాత చైనాలో కూడా పర్యటించి.. అమెరికా ఆంక్షలను కట్టుదిట్టం చేశారు. ఇప్పుడు మళ్లీ అమెరికా.. మనదేశంతో సత్సంబందాలను ఏర్పరచుకోవడానికి సన్నద్ధమవుతోంది.

ఈవీ పాలసీ 2.0 వస్తోందా?.. సబ్సిడీల విడుదలకు సిద్దమైన ఢిల్లీ ప్రభుత్వం!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలను ప్రకటించిన విషయం తెలిసిందే. కొన్నాళ్ల తరువాత ఈ సబ్సిడీలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పటికే చెల్లించాల్సిన సబ్సిడీ బకాయిలు పేరుకుపోయాయి. వీటిని చెల్లించడానికి ఢిల్లీ ప్రభుత్వం సన్నద్ధమైంది.

ఢిల్లీ హైకోర్టు ఆదేశం

పెండింగ్‌లో ఉన్న (సుమారు రూ. 140 కోట్లు) ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీ బకాయిలను చెల్లించడం త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. గత రెండేళ్లుగా పేరుకుపోయిన అన్ని బకాయిలను పరిష్కరించడానికి.. వాటికి సంబంధించిన దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలిస్తోందని రవాణా మంత్రి పంకజ్ సింగ్ తెలిపారు. పెండింగ్ బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక పోర్టల్ కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వినియోగదారులకు.. హామీ ఇచ్చిన విధంగా సబ్సిడీలను చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు అక్కడి ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీలైనంత తొందరగా చెల్లింపులు చేయాలనీ, ఆలస్యం చేయడానికి విధానపరమైన అడ్డంకులను చూపించకూడదని ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, న్యాయమూర్తి తుషార్ రావు గేదెలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

పెండింగ్ సబ్సిడీల చెల్లింపుకు కసరత్తు

ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని సంబంధిత అధికారులు వెల్లడించారు. అంతే కాకుండా అర్హత కలిగిన లబ్దిదారులను గుర్తించే పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది. సబ్సిడీలు ఆలస్యం కావడానికి.. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ఒక కారణమని అధికారులు తెలిపారు. ఆయన లేకపోవడంతో కేబినెట్ సమావేశం జరగలేదు, దీంతో ఈవీ పాలసీల చెల్లింపు ఆగిపోయింది. అర్హులకు తొందరగా సబ్సిడీలను అందిస్తామని సంబంధిత శాఖ చెప్పింది.

అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం.. 2020 ఆగస్టులో ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ ప్రారంభించింది. అప్పటి నుంచి 2.19 లక్షల కంటే ఎక్కువ వాహనాలు పన్ను మినహాయింపులను పొందాయి. ఇందులో 1.09 లక్షల టూ వీలర్స్, 83724 త్రీ వీలర్స్ ఉన్నాయి. 2023 వరకు ప్రభుత్వం రూ. 1.77 కోట్ల ప్రోత్సహకాలను పంపిణీ చేసింది. కాగా ఇప్పుడున్న ప్రభుత్వం.. ఇదివరకు పెండింగ్ ఉన్న సబ్సిడీలను చెల్లించనుంది.

ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2.0 రానుందా?

కొత్త పాలసీ ముసాయిదా.. ప్రజా సంప్రదింపులకు లోనవుతోంది. దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం.. ప్రస్తుత ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని 2026 మార్చి 31 వరకు పొడిగించింది. నిజానికి ఈ పాలసీ గడువు 2023 ఆగస్టులోనే ముగిసింది. అప్పటి నుంచి అనేకమార్లు పొడిగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరోమారు పొడిగించడమే కాకుండా.. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2.0 రూపకల్పనకు.. మంత్రి ఆశిష్ సూద్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి కారణం

ఢిల్లీ వంటి అభివృద్ధి చెందిన నగరాల్లో వాహనాల సంఖ్య రోజురోజుకి ఎక్కువవుతోంది. దీంతో కాలుష్యం తీవ్రత కూడా పెరిగిపోతోంది. కాలుష్యాన్ని తగ్గించడానికి ఉన్న మార్గం.. ఫ్యూయెల్ వాహనాలకు ప్రత్యామ్నాయాలను ఉపయోగించడమే. కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని.. తద్వారా భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని ప్రభుత్వం భావించింది. ఈ కారణంగానే ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం మొదలుపెట్టింది.