Home Blog Page 134

అవన్నీ పుకార్లే.. ఆ ఇల్లు నా సొంతం కాదు: మంచు లక్ష్మి

0

ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రపంచాన్ని ఏలుతున్నట్లు కనిపిస్తోంది. ప్రతి రోజు ఏదో ఒక విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతోంది. తాజాగా మంచు మోహన్ బాబు ముద్దుల కూతురు అప్పుల్లో ఉన్నట్లు.. హైదరాబాద్ ఇంటిని అమ్మకానికి ఉంచినట్లు వార్తలు తెరమీదికి వచ్చాయి. దీనిపై మంచు లక్ష్మి ప్రసన్న స్పందించింది.

అవన్నీ పుకార్లే..

సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన మంచు లక్ష్మి ప్రసన్న.. నేను అప్పుల్లో ఉన్నానని, హైదరాబాద్ ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు వస్తున్న మాటలు పూర్తిగా అవాస్తవం. అవన్నీ పుకార్లు మాత్రమే. నాకు హైదరాబాద్‌లో ఇల్లే లేదు. గతంలో నేను ఉన్న ఆ ఇల్లు మా నాన్నకు చెందినది. దానిపై నాకు ఎలాంటి హక్కు లేదు. ఫిలింనగర్‌లో రెండేళ్ల క్రితం ఉన్నమాట నిజమే. ఆ ఇల్లు గురించి మా నాన్నకు అడిగితే చెబుతాడు. నేను ఉండటానికి మాత్రమే నాన్న నాకు ఇచ్చారు. కానీ నా ఇష్ట ప్రకారమే ముంబైకి వెళ్ళాను.

నాన్నను డబ్బు అడగలేదు

ప్రస్తుతం ముంబైలోనే ఉంటున్నాను. అక్కడ ఉన్న ఇంటికి అద్దె కట్టడానికి ఇబ్బంది వచ్చినప్పుడు కూడా.. నేను ఎప్పుడూ మా నాన్నను డబ్బు సహాయం చేయమని అడగలేదు. ఇంకెవరినీ కూడా అడగను. సినిమాలు, ఇతర షోల ద్వారా వచ్చిన డబ్బుతోనే నేను ముందుకు వెళ్తున్నాను. నాకు ఎవరిమీద ఆధారపడాల్సిన అవసరం లేదని మంచు లక్ష్మి ప్రసన్న క్లారిటీ ఇచ్చారు.

సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు

నిజానికి మంచు లక్ష్మి ప్రసన్న.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో పుట్టినప్పటికీ, స్వయంగా కష్టపడే తత్వం ఉన్న మహిళ. తాను చదువుకునే రోజుల్లో కూడా పార్ట్‌టైమ్ జాబ్ చేసిన విషయం బహుశా చాలామందికి తెలిసిందే. తండ్రిని అడిగితే ఎంతైనా ఇవ్వగలడు, కానీ తానే స్వయంగా ఎదగాలనే పట్టుదల ఉన్న మనిషి మన మంచు లక్ష్మి ప్రసన్న. వారసత్వాన్ని చూపించి ఎదిగే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో.. కూడా కేవలం తన టాలెంట్ మీద నమ్మకంతో, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మంచి వ్యక్తిత్వం.. అంతకు మించిన ధైర్యం ఉన్న లక్ష్మి ప్రసన్న ఎంతోమందికి ఆదర్శప్రాయం.

మంచు లక్ష్మి ప్రసన్న గురించి

1977 అక్టోబర్ 8న మంచు మోహన్ బాబు, విద్యాదేవి దంపతుల ఏకైక కుమార్తె. ఈమె చెన్నైలో జన్మించారు. ఈమె కేవలం హీరోయిన్ మాత్రమే కాదు. నిర్మాత, టీవీ ప్రెజెంటర్ (యాంకర్) కూడా. లక్ష్మి అమెరికన్ టెలివిజన్‌లో కూడా పనిచేశారు. ఒక్క తెలుగులో మాత్రమే కాకుండా.. ఇంగ్లీష్, హిందీ, తమిళం, మలయాళం సినిమాల్లో నటించిన ఈమె మల్టీ ట్యాలెంటెడ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఓ కొడతారా ఉలిక్కి పడతారా అనే సినిమాతో బాగా ఫేమస్ అయిపోయింది. కాగా ప్రస్తుతం ఈమె దక్ష సినిమా నటించింది.

దక్ష సినిమా గురించి

తండ్రి, కూతురు (మంచు మోహన్ బాబు, లక్ష్మి ప్రసన్న) కలిసి నటించిన మొదటి సినిమా దక్ష. ఈ సినిమా 19వ తేదీ (సెప్టెంబర్ 19) రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో మంచు మోహన్ బాబు కీలక పాత్ర పోషించినట్లు.. లక్ష్మి ప్రసన్న ఇప్పటికే చెప్పేసింది. సముద్రఖని మొదలైనవారు కూడా ఇందులో నటించారు. వంశీకృష్ణ మల్లా.. ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ఆదాయపన్ను శాఖ అధికారిక ప్రకటన: ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగింపు

0

ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేసుకోవడానికి 2025 జులై 30 నుంచి సెప్టెంబర్ 15 వరకు గడువు పెంచిన విషయం అందరికీ తెలిసింది. కాగా ఇప్పుడు ఈ గడువు కాస్త ఈ రోజు వరకు (సెప్టెంబర్ 16) పొడిగిస్తూ ఆదాయ పన్ను శాఖ అధికారికంగా స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఐటీఆర్ ఫైల్ చేయనివారు ఈ రోజు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే జరిమానాతో ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఒక్కరోజు..

ఐటీఆర్ ఫైల్ చేయడానికి.. ఆదాయ పన్ను శాఖ పోర్టల్‌లో కొన్ని సమస్యలు ఉన్నట్లు, ఫిర్యాదులు తలెత్తడంతో ఆదాయపన్ను శాఖ గడువును ఒకరోజు పెంచుతున్నట్లు తన ఎక్స్ ఖాతాలో స్పష్టం చేసింది. యుటిలిటీలలో మార్పులను ప్రారభించడానికి ఈ-ఫైలింగ్ పోర్టల్ మంగళవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 2:30 గంటల వరకు మెయింటెనెన్స్ మోడ్‌లో ఉంటుందని క్లారిటీ ఇచ్చింది.

7.3 కోట్లమంది

సోమవారం వరకు 7.3 కోట్ల కంటే ఎక్కువ ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు అయినట్లు ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. గత ఏడాది ఈ సంఖ్య 7.28 కోట్లు. దీన్నిబట్టి చూస్తే.. మునుపటి సంవత్సరం కంటే కూడా ఈసారి ఐటీఆర్ ఫైల్ చేసుకున్నవారు సంఖ్య గణనీయంగా పెరిగింది. సకాలంలో పన్ను చెల్లింపుదారులు, నిపుణులు ఐటీఆర్ ఫైల్ చేసుకున్నందుకు కృతఙ్ఞతలు తెలుపుతున్నట్లు ఆదాయపన్ను శాఖ వెల్లడించింది.

ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను యాక్సెస్ చేయండిలా

ఆదాయ పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను యాక్సెస్ చేయడంలో ఇబ్బంది ఉందా?, కొన్నిసార్లు.. మీరు ఉపయోగిస్తున్న సిస్టం బ్రౌజర్ సెట్టింగ్స్ కారణంగా.. ట్యాక్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్ యాక్సెస్ చేయడంలో కొంత సమస్య ఏర్పడే అవకాశం ఉంది. అలాంటి సమయంలో మీ సిస్టంలోని అనవసర ఫైల్స్ డిలీట్ చేయడం, కుకీస్ క్లియర్ చేయడం, ఇతర బ్రౌజర్స్ ఉపయోగించడం లేదా బ్రౌజర్ అప్డేట్ చేయడం వంటివి చేయడంతో సమస్య తీరుతుందని కూడా ఆదాయపన్ను శాఖ తన ఎక్స్ ఖాతాలో స్పష్టం చేసింది.

జరిమానాతో ఐటీఆర్ ఫైలింగ్ చేయడానికి లాస్ట్ డేట్

ఐటీఆర్ దాఖలు చేయడానికి.. ఆదాయపన్ను శాఖ ఇచ్చిన గడువు దాటితే జరిమానా చెల్లించి ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు గడువు లోపలే ఐటీఆర్ ఫైల్ చేసుకోవడం మంచిది. ఆలస్య రుసుముతో ఐటీఆర్ ఫైల్ చేయడానికి 2025 డిసెంబర్ 31 చివరి రోజు అని తెలుస్తోంది. ఐటీఆర్ ఫైల్ చేసేవారి నికర ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే వారి రూ. 5000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. నికర విలువ రూ. 5 లక్షల కంటే తక్కువ ఉంటే.. అలాంటి వారు రూ. 1000 వరకు జరిమానా చెలించాల్సి ఉంటుంది. అయితే మీ ఆదాయం పన్ను పరిథిలోకి రాని సందర్భంలో ఎలాంటి ఫైన్ లేదా జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు.

ఆలస్యమైతే ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు

ఐటీఆర్ ఫైలింగ్ చేయడంలో ఆలస్యమైతే.. ప్రాసెస్ కూడా ఆలస్యమవుతుంది. అలాంటి సమయంలో రీఫండ్స్ కూడా ఆలస్యమవుతాయి. అంతే కాకుండా కొన్నిసార్లు మీ ఆలస్యమే మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. ఆదాయపన్ను శాఖ నుంచి కొన్ని సార్లు నోటీసులు అందే అవకాశం ఉంటుంది. సంబంధిత శాఖ మీ లావాదేవాలను మరింత క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. ఆలస్యానికి కారణాలను వెల్లడించాల్సిందిగా నోటీసులు వస్తాయి. ఇలాంటివన్నీ వద్దు అనుకుంటే.. ఐటీఆర్ ఫైలింగ్ అనేది గడువులోపల పూర్తవ్వాలి.

ఇడ్లి అంటే ఇష్టం.. తినడానికి డబ్బు ఉండేది కాదు!: ధనుష్ ఎమోషనల్

0

హీరో ధనుష్ తమిళంలో మాత్రమే కాకుండా.. తెలుగులో కూడా మంచి ఆదరణ పొందిన హీరో. విభిన్న పాత్రలలో నటించిన ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈయన ఇప్పుడు ‘ఇడ్లీ కడై‘ చిత్రంలో నటిస్తున్నారు. ఇది అక్టోబర్ 1న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో తెరకెక్కనుంది. అంతంకంటే ముందు సెప్టెంబర్ 14న (ఆదివారం) చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ధనుష్ ఇడ్లీకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

ఇడ్లీ అంటే ఇష్టం

ఆడియో లాంచ్ సందర్భంగా హీరో ధనుష్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం. కానీ ఇడ్లి తినడానికి డబ్బులు ఉండేవి కాదు. ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి.. పువ్వులు కోయడానికి వెళ్ళేవాడిని. రెండు గంటలు పనిచేస్తే.. రెండు రూపాయలు ఇచ్చేవారు. పని ముగించుకుని రోడ్డు పక్కనే ఉన్న చేతిపంపు దగ్గర స్నానం చేసుకునేవాడిని. తరువాత ఇడ్లి కొట్టుకు వెళ్లి, రెండు రూపాయాలు ఇస్తే నాలుగు లేదా ఐదు ఇడ్లీలు పెట్టేవారు. మనం కష్టపడి సంపాదించిన దాంతో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ టేస్ట్ ఏ ఫైవ్ స్టార్ హోటళ్లలో కూడా లభించదని అన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా ధనుష్

చెన్నైలో జరిగిన ఆడియో లాంచ్ కార్యక్రమానికి ధనుష్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ వేడుకలో ధనుష్ తెల్లని షర్ట్, పంచె కట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సినిమాకు సంబంధించిన కథకు తన బాల్యమే ప్రేరణ అని ధనుష్ పేర్కొన్నాడు. ఇలాంటి కథను ప్రేక్షకులకు చేరువయ్యేలా చేయడానికే ఈ సినిమా తెరకెక్కించినట్లు ధనుష్ వెల్లడించాడు.

ధనుష్ వ్యాఖ్యలపై విమర్శలు

నటుడు ధనుష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇడ్లి తినడానికి కూడా డబ్బులు లెవా అని కొందరు కామెంట్ చేస్తే?, ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం అని ఇంకొందరు అంటున్నారు. ఇలాంటి కథలు చెబితే.. ఫ్యాన్స్ కలిరిపోతారనే ఉద్దేశ్యంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని మరికొందరు అంటున్నారు.

ఇడ్లి కడై చిత్రం గురించి

కుబేర సినిమా తరువాత నటుడు ధనుష్ నటిస్తున్న సినిమా ఈ ‘ఇడ్లి కడై‘. ఇది తమిళంలో మాత్రమే కాకుండా.. పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో హీరోగా ధనుష్ నటిస్తుండగా.. షాలినీ పాండే, నిత్యా మీనన్, సత్యరాజ్, అరుణ్ విజయ్, రాజ్ కిరణ్ మొదలైనవారు కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. జివి ప్రకాష్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమా కోసం రూ. 100 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

నటుడు ధనుష్ గురించి

నిజానికి ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు. ప్రొడ్యూసర్, గీత రచయిత, ప్లేబ్యాక్ సింగర్ కూడా. ఇప్పటికి 50 కంటే ఎక్కువ సినిమాల్లో నటించిన ధనుష్ నాలుగు జాతీయ చలన చిత్ర అవార్డులను, 14 సైమా అవార్డులను, 8 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం తమిళ సినిమా పరిశ్రమలో ఎక్కువ పారితోషికం తీసుకునే నటుల జాబితాలో ఒకరుగా ఉన్నారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్.. 2025 మీటియోర్ 350 లాంచ్: ధర ఎంతో తెలుసా?

ప్రముఖ వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్.. జే-సిరీస్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన తన మొట్టమొదటి బైక్ ‘మీటియోర్ 350‘ను ఎట్టకేలకు ఆధునిక హంగులతో.. దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఆకర్షణీయంగా ఉండటం గమనించవచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ 2020లో తన మీటియోర్ 350 బైకును లాంచ్ చేసింది. ఇది అప్పట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగిన థండర్‌బర్డ్‌కు వారసత్వంగా దేశీయ విఫణిలో లాంచ్ అయింది. కంపెనీ ఈ బైకును లాంచ్ చేసిన తరువాత.. ఆధునిక ప్యాకేజీతో, కొత్త పెయింట్ స్కీమ్‌లతో, అదనపు ఫీచర్స్ కూడా జోడించడానికి సిద్ధమైంది. అందులో నుంచి పుట్టుకొచ్చినదే.. ఈ 2025 మీటియోర్ 350.

వేరియంట్స్ & ధరలు

సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 బైక్ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధరలు రూ. 1.96 లక్షల నుంచి రూ. 2.15 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. నిజానికి దీని ధరలు రూ. 2.08 లక్షల నుంచి రూ. 2.32 లక్షల మధ్య ఉండేది. కానీ జీఎస్టీ సవరణల కారణంగా ధరలు తగ్గాయి.

➜ఫైర్‌బాల్ (ఫైర్‌బాల్ ఆరంజ్ & ఫైర్‌బాల్ గ్రే): రూ. 1,95,762
➜స్టెల్లార్ (స్టెల్లార్ మ్యాట్ & స్టెల్లార్ మెరైన్ బ్లూ): రూ. 2,03,419
➜అరోరా (అరోరా రెట్రో గ్రీన్ & అరోరా రెడ్) : 2,06,290
➜సూపర్నోవా (సూపర్నోవా బ్లాక్): రూ. 2,15,883

డిజైన్ & ఫీచర్స్

2025 రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 బైకులో చెప్పుకోదగ్గ అప్డేట్ ఏమిటంటే.. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ ఇండికేటర్స్. అయితే ఫైర్‌బాల్, స్టెల్లార్ వేరియంట్లలో ఇవి హాలోజన్ యూనిట్లుగా ఉన్నాయి. స్లిప్పర్ క్లచ్ లభిస్తుంది. ఈ అప్‌గ్రేడ్ మొదట.. క్లాసిక్ 350లో, ఆ తరువాత హంటర్ 350లో జరిగింది. ఇప్పుడు మీటియోర్ 350లో కనిపించింది. యూఎస్‌బీ టైప్-సీ ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇందులో చూడవచ్చు. కాగా సూపర్నోవా, అరోరా వేరియంట్లలో అడ్జస్టబుల్ లివర్స్ కూడా ఉన్నాయి.

ఇంజిన్ వివరాలు

సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 బైకులోని ఇంజిన్ ఎటువంటి అప్డేట్స్ పొందలేదని తెలుస్తోంది. కాబట్టి ఇందులో 349 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 20.2 హార్స్ పవర్, 27 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. అయితే ఛాసిస్, సస్పెన్షన్, బ్రేకింగ్ వంటి వాటిలో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. కాబట్టి పనితీరుపరంగా ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకున్న డిమాండ్

దేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అయితే జీఎస్టీ ప్రతిపాదనలకు ముందు ధరలు పెరుగుతాయని వార్తలు వినిపించాయి. కానీ 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైకుల ధరలు మాత్రమే పెరుగుతాయని జీఎస్టీ ప్రతిపాదనలు స్పష్టం చేశాయి. దీంతో ఇప్పుడు లాంచ్ అయిన కొత్త మీటియోర్ 350 ధరలు మాత్రమే కాకుండా.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న క్లాసిక్ 350, హంటర్ 350 బైకుల ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. దీంతో కంపెనీ అమ్మకాలు.. పండుగల సమయంలో మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందని, ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా కంపెనీ భావిస్తోంది.

ఈ కారణాల వల్ల.. తను నన్ను వదిలేసింది: మెగా హీరో బ్రేకప్ స్టోరీ

0

ప్రేమించడం ఆనందం, ప్రేమించబడటం అదృష్టం అంటారు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఎదో ఒక వయసులో, ఎదో ఒక సందర్భంలో ప్రేమలో పడతారు. ఇందులో సామాన్యులు, సెలబ్రిటీలు అని తేడా ఉండదు. అయితే ప్రతి ప్రేమ.. పెళ్లి వరకు చేరుతుందని మాత్రం చెప్పడం అసాధ్యం. ఎందుకంటే.. పెళ్లిళ్ల వరకు చేరిన ప్రేమలు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. ఇటీవల ఓ సదస్సులో సాయిధరమ్ తేజ్ తన బ్రేకప్ స్టోరీ చెప్పారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

2014లో మొదటి సినిమా..

పిల్లా నువ్వు లేని జీవితం అనే సినిమాతో 2014లో తెలుగు సినిమా రంగంలో అడుగు పెట్టిన సాయిధరమ్ తేజ్.. ఆ తరువాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, విన్నర్, జవాన్, చిత్రలహరి, విరూపాక్ష మొదలైన సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

బ్రేకప్ స్టోరీ..

గత కొన్ని రోజులుగా సాయిధరమ్ తేజ్ ఎక్కడ కనిపించినా.. ఎక్కువ మంది అడిగే ప్రశ్న పెళ్లి ఎప్పుడు అనే. ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో కూడా తనకు ఇదే ప్రశ్న ఎదురైంది. పెళ్లి ఎప్పుడు అన్న విషయం తాను తప్పకుండా చెబుతా అని పేర్కొన్నారు. అంతే కాకుండా తన జీవితంలో కూడా ఒక బ్రేకప్ స్టోరీ ఉందని చెప్పాడు. ఇది చాలా విషాదకరమైన బ్రేకప్ స్టోరీ అని అన్నారు.

నేను నా కాలేజీ గర్ల్‌ఫ్రెండ్‌ని ప్రేమించాను. కానీ సినిమా హిట్టయింది, తరువాత పెళ్లి చేసుకోవడానికి సిద్దమయ్యారు, ఆ అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది, ఈ అమ్మాయితో నిశ్చితార్థం జరిగిందని పుకార్లు రావడంతో.. ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది. దీంతో బ్రేకప్ అయిపోయింది. నా పెళ్లి విషయం మీద అందరూ కొంత సంయమనం వహించాల్సి ఉంది. తప్పకుండా త్వరలోనే శుభవార్త చెబుతా అని సాయిధరమ్ తేజ్ చెప్పుకొచ్చారు.

అయినవాళ్లతో సమయం గడపాలి..

టెక్నాలజీ ఎంత పెరిగినా.. తల్లిదండ్రులు తమ జీవితంలో పిల్లలకు ప్రత్యేకమైన స్థానం, సమయం ఇవ్వాలి. ఇప్పటికి కూడా నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మ. నేను అమ్మతో చాలా సరదాగా ఉంటాను. నా సెకండ్ క్లాస్ లవ్ స్టోరీ కూడా అమ్మతో చెప్పను. అంత ఫ్రెండ్లీగా అమ్మతో ఉంటాను. అమ్మే నా ప్రపంచం. అమ్మతో మాత్రమే కాకుండా.. మామయ్యలు, స్నేహితులతో కూడా సమయం గడుపుతాను. కాబట్టి తప్పకుండా మన జీవితంలో అందరికీ స్థానం ఇవ్వాలి. టెక్నాలజీ మాయలో పది అందరినీ దూరం చేసుకోకూడదని సాయిధరమ్ తేజ్ చెప్పారు. అంతే కాకుండా ఈ సందర్భంగా.. తన పేరును తల్లిపేరు వచ్చేలా ”సాయిదుర్గ తేజ్”గా మార్చుకున్నాడు.

2023 విడుదలైన విరూపాక్ష సినిమా తరువాత కూడా ఓ సందర్భంలో సాయిధరమ్ తేజ్ తన బ్రేకప్ స్టోరీ పంచుకున్నాడు. గతంలో కూడా ఒక అమ్మయితే బ్రేకప్ అయిందని చెప్పాడు. అప్పటి నుంచి అమ్మాయిలంటేనే భయమేస్తుందని చెప్పాడు. మొత్తం మీద సాయిధరమ్ తేజ్ జీవితంలో చాలానే బ్రేకప్ స్టోరీలు ఉన్నాయని అందరికి తెలిసింది. ఇక ఈ మెగా హీరో పెళ్లి ఎప్పుడు అనే విషయం తెలుసుకోవడానికి అభిమానులు వేచి చూస్తున్నారు.

డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్: దేశంలో ఎక్కడా లేని విధానం!

భారతదేశంలో రోడ్డుపై వాహనం నడపాలంటే తప్పకుండా.. డ్రైవింగ్ లైసెన్స్ కావాలని అందరికీ తెలుసు. ఈ డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి కొన్ని పరీక్షలు ఉంటాయన్న సంగతి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ పరీక్షలను మరింత కఠినం చేసిన మొదటి రాష్ట్రంగా కేరళ రికార్డ్ క్రియేట్ చేసింది. 2025 అక్టోబర్ 1 నుంచి ఈ కఠిన పరీక్షలు అమలులోకి వచ్చేలా కొన్ని సంస్కరణలు చేస్తున్నట్లు సమాచారం.

పెరిగిన ప్రశ్నలు

దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి కేరళ ప్రభుత్వం దోహదపడుతోంది. ఇందులో భాగంగానే.. ఆచరణాత్మక డ్రైవింగ్ టెస్ట్ మరింత కఠినతరం చేస్తోంది. లెర్నర్స్ లైసెన్స్ టెస్టులో ప్రశ్నలు 20 నుంచి 30కి పెరిగాయి. ఇందులో 60 శాతం ఉత్తీర్ణత లేదా స్కోర్ సాధించాలి. సమాధానం ఇచ్చే సమయంలో కూడా మార్పులు చేసినట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కే.బీ. గణేష్ కుమార్ పేర్కొన్నారు. మొత్తం మీద డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి 83 శాతం అర్హత సాధించాలని పేర్కొన్నారు.

నెగటివ్ మార్కులు

డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి నిర్వహించే టెస్టులో నెగటివ్ మార్కులు కూడా ఉన్నాయి. సమాధానం తెలియని ప్రశ్నలకు వదిలిపెట్టే అవకాశం కూడా కల్పిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 పాయింట్లు తీసేస్తారు. బహుశా ఇలాంటి విధానం దేశంలోనే ఎక్కడా లేదు. టెస్టుకు సిద్దమవ్వడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్ కూడా ప్రారంభించింది. ఇందులో సిలబస్, ప్రాక్టీస్ సెట్, మాక్ టెస్ట్ వంటివి ఉన్నాయి.

పబ్లిక్ రోడ్డుపై టెస్టింగ్

ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్ కూడా ప్రత్యేకంగా రూపొందించారు. ఇందులో పాల్గొనే అభ్యర్థులు యాంగ్యులర్, సమాంతర పార్కింగ్, గ్రేడియంట్ డ్రైవింగ్, జిగ్-జాగ్ విన్యాసాలను చూపించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా వాస్తవ ప్రపంచ పరిస్థితులను అనుకరించే విధంగా నిర్మించబడి ఉంటాయి. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. పబ్లిక్ రోడ్ టెస్టింగ్. అభ్యర్థులు క్లోజ్డ్ ట్రాక్‌లలో కాకుండా.. నిజమైన ట్రాఫిక్‌లో వాహనం నడపాల్సి ఉంటుంది.

టెక్నాలజీ సాయం

కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ కొత్త విధానం.. ఎక్కువగా టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. టెస్టింగ్ వాహనాలకు డాష్‌బోర్డ్ కెమెరాలు, జీపీఎస్ ట్రాకర్స్ మొదలైనవి ఉంటాయి. ఇవి ఎప్పటికప్పుడు అభ్యర్థుల పనితీరును రికార్డ్ చేస్తాయి. ఈ రికార్డ్ మొత్తం దాదాపు మూడు నెలలు ఉంటుంది. ఏదైనా వివాదాలు తలెత్తితే.. దానికి ఇవే పరిష్కారం చూపిస్తాయి. అంతే కాకుండా 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసైనా కార్లను టెస్ట్ కోసం ఉపయోగించడం నిషేధం.

రోజుకు కొంతమందే!

కఠినమైన విధానాలు డ్రైవింగ్ లైసెన్స్ కోసం వేచి ఉండే సమయాన్ని పెంచింది. మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ ప్రతిరోజూ నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే డ్రైవింగ్ టెస్టుకు అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. దీంతో చాలా మంది అప్లై చేసుకున్న వారు కూడా వారి తేదీ వచ్చే వరకు వేసి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రాసెసింగ్ నెమ్మదిగా ఉన్నప్పటికీ.. పరీక్షలు మాత్రం విజయవంతంగా నిర్వహిస్తోంది. దీంతో డ్రైవింగ్ లైసెన్స్ టెస్టులో పాస్ అయ్యేవారి సంఖ్య తగ్గిపోతోంది. దీనిపై ప్రస్తుతం కొంత వ్యతిరేకత కూడా మొదలైంది.

ప్రపంచంలోనే ఖరీదైన కారు.. కేవలం నాలుగు యూనిట్లే!

ఇప్పటివరకు చాలామంది రూ. 10 లక్షల కంటే తక్కువ విలువైన కార్లను గురించి విని ఉంటారు. పది కోట్ల రూపాయల కారు గురించి కూడా వినే ఉంటారు. ఎప్పుడైనా సుమారు రూ. 250 కోట్ల కారు గురించి విన్నారా?, ఇది వినగానే ఇంత ఖరీదైన కారు కూడా ఒకటి ఉంటుందా.. అనే అనుమానం కొందరికి వచ్చి ఉంటుంది. కాబట్టి ఈ కారు గురించి ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్న కారు.. రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ”లా రోజ్ నోయిర్ డ్రాప్ టెయిల్”. దీని ధర అక్షరాలా రూ. 249.48 కోట్లు అని తెలుస్తోంది. సంస్థ దీనిని నాలుగు యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. ఈ కారు ఇప్పటి వరకు అమ్మకానికి ఉన్న ఇతర రోల్స్ రాయిస్ కార్ల కంటే కూడా చాలా భిన్నంగా ఉంది. కేవలం రెండు సీట్లు మాత్రమే కలిగి ఉన్న ఈ కారును కంపెనీ నాలుగేళ్లు కష్టపడి రూపొందించింది.

డిజైన్

రోల్స్ రాయిస్ డ్రాప్ టెయిల్ కారు కన్వర్టిబుల్ కారు. దీనిని ఉక్కు, అల్యూమినియం, కార్బన్ ఫైబర్ వంటి వాటితో నిర్మించారు. 5.3 మీటర్ల పొడవు, 2.0 మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ కారు.. బ్రాండ్ యొక్క స్పెక్టర్ ఎలక్ట్రిక్ కంటే చిన్నది. డిజైన్ మాత్రం అద్భుతంగా ఉంది. లైటింగ్ సెటప్ అంతకు మించి ఉందనే చెప్పాలి. రూఫ్ ప్యానెల్ కార్బన్ ఫైబర్‌తో నిర్మితమై ఉంది. దీనిని ఆపరేట్ చేయడం కూడా చాలా సులభం. ముందు భాగం ఆకట్టుకునేలా ఉంది. గ్రిల్ బార్లు సాదరంగా నిటారుగా ఉన్నాయి.

ఫీచర్స్

ఇంటీరియర్ విషయానికి వస్తే.. విలాసవంతమైన క్యాబిన్ లభిస్తుంది. ఇన్ఫోటైన్‌మెంట్ కంట్రోల్ డయల్, పవర్డ్ సెంటర్ కన్సోల్ వంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. విశాలంగా ఉండే చెక్క ప్యానెల్ సీట్లను కలుపుతుంది. దీనిని మాజీ రోల్స్ రాయిస్ అప్రెంటిస్ తొమ్మిది నెలలు కస్టపడి నిర్మించినట్లు సమాచారం. ట్రూ లవ్ రెడ్ పెయింట్ ఇందులో గమనించవచ్చు. ఈ రంగు కారు మొత్తం విస్తరించి ఉన్నప్పటికీ.. అక్కడక్కడ బ్లాక్ కలర్ చూడవచ్చు. మొత్తం మీద ఇది ఇప్పుడు మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని కార్ల కంటే కూడా భిన్నంగా, ప్రత్యేకంగా ఉందని స్పష్టంగా తెలుస్తోంది.

పవర్‌ట్రెయిన్

రోల్స్ రాయిస్ లా రోజ్ నోయిర్ డ్రాప్ టెయిల్ ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 6.75 లీటర్ వీ12 ట్విన్ టర్బోఛార్జ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 601 హార్స్ పవర్, 840 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 5.0 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుందని, టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ అని కంపెనీ వెల్లడించింది.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారుగా రికార్డ్ క్రియేట్ చేసిన ‘రోల్స్ రాయిస్ లా రోజ్ నోయిర్ డ్రాప్ టెయిల్’ను ఎవరు కొనుగోలు చేశారనే విషయాన్ని కంపెనీ ఇప్పటివరకు గోప్యంగానే ఉంచింది. అయితే ఈ కారును సొంతం చేసుకోవాలంటే మాత్రం భారీగా వెచ్చించాల్సిందే అని స్పష్టంగా అర్థమవుతోంది. ధర ఎక్కువైనా.. ఇది మాత్రం ఒక్క చూపుతోనే వాహన ప్రేమికులను ఆకట్టుకుంటోందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఒక్క నెలలో లక్షల మందిని ఆకట్టుకున్న బ్రాండ్.. అమ్మకాల్లో ‘హీరో’

భారతదేశంలో వాహనాల అమ్మకాలు కొన్ని సందర్భాల్లో మాత్రమే కొంత డీలా పడతాయి. పండుగ సీజన్ వచ్చిందంటే సేల్స్ తారాజువ్వలా పైకి లేస్తాయి. దసరా, దీపావళి ముందు ఉన్నాయి. ఈ సమయంలో వెహికల్స్ సేల్స్ ఊపందుకునే అవకాశం ఉంది. కాగా 2025 ఆగస్టు నెలలో టూ వీలర్ సేల్స్ ఎలా ఉన్నాయి. ఏ కంపెనీ జాబితాలో అగ్రస్థానంలో ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

హీరో మోటోకార్ప్

2025 ఆగస్టు నెలలో హీరో మోటోకార్ప్ 5,19,139 యూనిట్ల అమ్మకాలను పొందింది. దీంతో ఇది జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూనే.. కంపెనీ మంచి అమ్మకాలను పొందగలిగింది. ఈ సేల్స్ 2025 జులై(4,12,397 యూనిట్లు)తో పోలిస్తే 25.90 శాతం ఎక్కువ కావడం గమనించదగ్గ విషయం. 2024 ఆగస్టు నెలలో కంపెనీ 4,92,263 యూనిట్లను విక్రయించగలిగింది. అమ్మకాలు పెరగడానికి హీరో గ్లామర్ వంటి బైకులు ఎక్కువగా దోహదపడినట్లు తెలుస్తోంది. కాగా కంపెనీ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ నెలలో మరికొన్ని కొత్త బైకులను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది.

హోండా మోటార్‌సైకిల్

గత నెలలో (2025 ఆగస్టు) హోండా మోటార్‌సైకిల కంపెనీ అమ్మకాలు 4,81,021 యూనిట్లు. ఈ అమ్మకాలు 2025 జులై(4,66,331 యూనిట్లు)తో పోలిస్తే 3.15 శాతం ఎక్కువ. గత ఏడాది ఇదే నెలలో (2024 ఆగస్టు) కంపెనీ సేల్స్ ఏకంగా 4,91,678 యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే ఈ ఏడాది ఆగస్టులో అమ్మకాలు 2.17 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. కంపెనీ అమ్మకాలు పెరగడానికి షైన్ 100 డీఎక్స్, కొత్త సీబీ125 హార్నెట్ వంటివి దోహదపడ్డాయని తెలుస్తోంది.

టీవీఎస్ మోటార్

జాబితాలో మూడో స్థానంలో టీవీఎస్ మోటార్ స్థానం ఆక్రమించుకుంది. ఈ కంపెనీ 2025 ఆగస్టులో 3,68,862 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. 2025 జులైలో ఈ సేల్స్ 3,08,720 యూనిట్లు. అంటే జులై కంటే ఆగస్టులో విక్రయాలు 19.48 శాతం పెరిగాయి. 2024 ఆగస్టు (2,89,073 యూనిట్లు) అమ్మకాలతో పోలిస్తే.. ఈ ఏడాది ఆగస్టులో అమ్మకాలు 27.60 శాతం పెరిగాయని స్పష్టమవుతోంది.

టీవీఎస్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సేల్స్ విషయానికి వస్తే.. ఐక్యూబ్ దేశంలో గత ఐదు నెలలుగా అమ్మకాల్లో అగ్రగామిగా ఉంది. గత నెలలో దీని అమ్మకాలు 24,000 యూనిట్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. ఇటీవల కంపెనీ ఆర్బిటర్ పేరుతో సరసమైన టూ వీలర్ లాంచ్ చేసింది. ఇది కూడా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.

బజాజ్ ఆటో

దేశీయ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందిన బజాజ్ ఆటో 2025 ఆగస్టులో 1,84,109 యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది. బజాజ్ జులై 2025 అమ్మకాలు 1,39,279 యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే కంపెనీ అమ్మకాలు జులై కంటే ఆగస్టులో 32.19 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. 2024 ఆగస్టులో కంపెనీ అమ్మకాలు 2,08,621 యూనిట్లతో పోలిస్తే.. 2025 ఆగస్టు అమ్మకాలు 11.75 శాతం తక్కువ. కంపెనీ మొత్తం విక్రయాలలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఉంది. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో మంచి అమ్మకాలు పొందుతున్న స్కూటర్ల జాబితాలో ఒకటిగా ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్

అమ్మకాల్లో అగ్రగాములుగా ఉన్న టూ వీలర్ బ్రాండ్స్ జాబితాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒకటి. ఈ కంపెనీ 2025 ఆగస్టు నెలలో 1,02,876 యూనిట్ల అమ్మకాలను కైవసం చేసుకుంది. 2025 జులైలో ఈ సేల్స్ 76254 యూనిట్లు. అంటే కంపెనీ సేల్స్ ఒక్కసారిగా 34.91 శాతం పెరిగాయి. 2024 ఆగస్టు నెలలో దీని విక్రయాలు 65624 యూనిట్లు మాత్రమే. ఈ లెక్కన గత ఆగస్టులో సేల్స్ 56.77 శాతం పెరిగినట్లు అవగతం అవుతోంది.

ఆ పాన్‌ ఇండియా హీరోతో నటించాలనుంది: మిరాయ్‌ హీరోయిన్‌

0

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో.. తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ‘మిరాయ్‘ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న రితికా నాయక్.. అవకాశమొస్తే తాను పాన్ ఇండియా స్టార్ పక్కన నటించాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టింది. దీంతో అభిమానులు కూడా అప్పుడే వారి కాంబినేషన్‌ను ఊహించేసుకుంటున్నారు. ఇంతకీ తాను (రితికా నాయక్) నటించాలనుకుంటున్న ఆ స్టార్ హీరో ఎవరనేది ఇక్కడ తెలుసుకుందాం.

పాన్ ఇండియా హీరోతో..

తేజ సజ్జ, రితికా నాయక్ నటించిన.. మిరాయ్ సినిమా మంచి హిట్ సాధించేసింది. ఇప్పటి వరకు రితికా నాయక్ అంటే తెలియనివారు కూడా ఆమె గురించి తెలుసుకోవడానికి గూగుల్‌లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు. అందం, అభినయంతో తదైనా రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు తాను ‘అల్లు అర్జున్‘తో సినిమా చేయాలని ఉందని చెప్పేసింది. తాను అల్లు అర్జున్ ఫ్యాన్ అని.. తనతో నటించే అవకాశం వస్తే వదులుకోను అని.. అది చిన్న పాత్ర అయినా సరే అని మనసులో మాట చెప్పింది.

బన్నీతో నటించాలనే తన మనసులో మాట చెప్పడంతో.. అటు అల్లు అర్జున్ అభిమానులు, రితికా నాయక్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అంతే కాకుండా వారి కాంబినేషన్‌ను కూడా ఊహించేసుకుంటున్నారు. అయితే వీరిద్దరి సినిమా వస్తుందా?, రాదా?.. వస్తే ఎప్పుడు వస్తుంది? అనే విషయాలు మాత్రం భవిష్యత్తులో తెలుస్తాయి.

రితికా నాయక్ గురించి

నిజానికి ఢిల్లీకి చెందిన రితికా నాయక్.. విశ్వక్‌సేన్‌తో కలిసి అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమాలో నటించింది. ఆ తరువాత హాయ్ నాన్న అనే సినిమాలో కనిపించింది. ఇప్పుడు మిరాయ్ సినిమాలో పాపులర్ అయిపోయింది. మూడో సినిమాకే గొప్ప ఫేమ్ తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఢిల్లీ ఒడియా కుటుంబానికి చెందినట్లు తెలుస్తోంది. అక్కడే తన విద్యాభ్యాసం పూర్తి చేసింది. 2022లో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టింది. తాను నటించిన మొదటి సినిమాకే సైమా అవార్డు సొంతం చేసుకుంది.

మిరాయ్ సినిమా & రెమ్యునరేషన్ వివరాలు

తేజ సజ్జాకు బ్లాక్ బస్టర్ అందించిన మిరాయ్ సినిమాలో.. రితికా నాయక్ మాత్రమే కాకుండా.. మంచు మనోజ్, శ్రియ, జగపతిబాబు మొదలైనవారు కూడా నటించారు. ఈ సినిమా కోసం చిత్ర బృందం రూ. 50 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. కాగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే వివిధ భాషల్లో రూ. 12 కోట్లు వసూలు చేసిందని టాక్. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఈ రోజు వీకెండ్, రేపు ఆదివారం కావడంతో మరింత మంచి కలెక్షన్స్ వస్తాయని చెబుతున్నారు.

ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. తేజ సజ్జ హనుమాన్ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నట్లు సమాచారం. హనుమాన్ సినిమాకు తేజ రూ. 2 కోట్లు తీసుకున్నట్లు టాక్. దీన్నిబట్టి చూస్తే.. తేజ సజ్జ మిరాయ్ సినిమాకు కూడా రూ. 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మంచు మనోజ్, శ్రియ కూడా ఒక్కొక్కరు రూ. 2 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. రితికా నాయక్ మాత్రం రూ. 50 లక్షలు తీసుకుందని చెబుతున్నారు.

జుపిటర్ 110 స్పెషల్ ఎడిషన్.. చాలా స్పెషల్!: రేటెంతో తెలుసా?

భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన ‘టీవీఎస్ జుపిటర్ 110’ ఇప్పుడు స్పెషల్ ఎడిషన్ రూపంలో లాంచ్ అయింది. దీని ధర రూ. 93,031 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). దీంతో ఇది దాని లైనప్‌లో అత్యంత ఖరీదైన స్కూటర్‌గా నిలిచింది. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందింది. ఈ సరికొత్త స్కూటర్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

అత్యధిక ధర వద్ద లాంచ్ అయిన కొత్త టీవీఎస్ జుపిటర్ 110.. స్కూటర్ మొత్తం నలుపు రంగులో ఉంది. అయితే క్రోమ్ ఎగ్జాస్ట్ హీట్ షీల్డ్ మాత్రం వేరే రంగులో ఉండటం చూడవచ్చు. బ్యాడ్జ్ అనేది బ్రాంజ్ కలర్ పొంది ఉండటం చూడవచ్చు. ప్రస్తుతం అమ్మకానికి ఉన్న దాదాపు అన్ని జుపీటర్ స్కూటర్లు కూడా ఇదే కలర్ బ్యాడ్జ్ కలిగి ఉన్నాయి. మొత్తం నలుపు రంగులో.. బ్యాడ్జ్ మాత్రం వేరే రంగులో ఉండటం వల్ల ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది.

ఇంజిన్ వివరాలు

టీవీఎస్ జుపిటర్ 110 స్పెషల్ ఎడిషన్.. ప్రస్తుతం దాని విభాగంలో అత్యంత ఖరీదైన మోడల్. హోండా యాక్టివా స్మార్ట్ వేరియంట్ (రూ. 95,567) తరువాత ఇదే (జుపిటర్ 110 స్పెషల్ ఎడిషన్) ఖరీదైనదని తెలుస్తోంది. ఈ కొత్త వేరియంట్ ఆల్ బ్లాక్ ట్రీట్‌మెంట్ మినహా ఎలాంటి యాంత్రికమైన మార్పులను పొందలేదు. ఇది జుపిటర్ 110 డిస్క్ ఎస్ఎక్స్‌సీకి సమానంగా ఉంటుంది. కాగా ఇది ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ డిస్‌ప్లే కూడా పొందుతుంది.

జుపిటర్ 110 స్పెషల్ ఎడిషన్ 113.3 సీసీ సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ కలిగి.. 6500 ఆర్‌పీఎమ్ వద్ద 5.9 పవర్, 5000 ఆర్‌పీఎమ్ వద్ద 9.8 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి పనితీరు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుందని తెలుస్తోంది. ఇది సీవీటీ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

కొత్త టీవీఎస్ జుపిటర్ 110 స్పెషల్ ఎడిషన్.. టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక భాగంలో ట్విన్ ట్యూబ్ ఎమల్షన్ షాక్ అబ్జార్బర్ 3 స్టెప్ అడ్జస్టబుల్ పొందుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఈ స్కూటర్ ముందు భాగంలో 220 మిమీ డిస్క్, వెనుక భారంతో 130 మిమీ డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. రెండు వైపులా 90/90-12 ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి. సుమారు 106 కేజీల (కర్బ్ వెయిట్) బరువున్న జుపిటర్ స్పెషల్ ఎడిషన్ సీటు 756 మిమీ పొడవు ఉంటుంది. ఇది రైడర్, పిలియన్ ఇద్దరికీ చాలా అనుకూలంగా ఉంటుంది.

ఫీచర్స్

జుపిటర్ 110 స్పెషల్ ఎడిషన్.. స్మార్ట్‌కనెక్ట్ కనెక్టివిటీ వాయిస్ అసిస్ట్, డిస్టెన్స్ టు ఎంప్టీ, ఫైండ్ మై వెహికల్, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, కాల్ అండ్ ఎస్ఎమ్ఎస్ అలర్ట్‌లతో పాటు న్యావిగేషన్ వంటి ఫీచర్స్ పొందుతుంది. పరిమాణం విషయానికి వస్తే.. ఈ స్కూటర్ పొడవు 1848 మిమీ, వెడల్పు 665 మిమీ, ఎత్తు 1158 మిమీ, వీల్‌బేస్ 1275 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 163 మిమీ వరకు ఉంటుంది. కాబట్టి ఇది అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇది రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.