Home Blog Page 135

ఆగస్టులో ఎక్కువమంది కొన్న కారు ఇదే!.. దీని గురించి తెలుసా?

2025 ఆగస్టు నెల పూర్తి కావడంతో.. వాహన తయారీ సంస్థలు తమ అమ్మకాల డేటాను విడుదల చేశాయి. ఈ నివేదికలో గత నెలలో అత్యధిక అమ్మకాలు పొందిన కారుగా ”మారుతి సుజుకి ఎర్టిగా” తన ఆధిపత్యం చెలాయించింది. దీంతో హ్యుందాయ్ క్రెటా, మారుతి డిజైర్ వంటి కార్లు సైతం అమ్మకాల్లో వెనుకబడ్డాయి.

తాజా నివేదికల ప్రకారం.. మారుతి సుజుకి ఇండియా 2025 ఆగస్టులో 18,445 యూనిట్ల ఎర్టిగా కార్లను విక్రయించింది. దీంతో ఎర్టిగా నెలవారీ అమ్మకాల్లో అగ్రస్థానములో నిలిచింది. కాగా డిజైర్ 16,509 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలువగా.. మూడో స్థానంలో హ్యుందాయ్ క్రెటా 15,924 యూనిట్ల అమ్మకాలను సొంతం చేసుకుంది. ఆ తరువాత టాప్ 10 జాబితాలో వరుసగా వ్యాగన్ ఆర్, టాటా నెక్సాన్, బ్రెజ్జా, బాలెనొ, ఫ్రాంక్స్, స్విఫ్ట్, ఈకో వంటి కార్లు ఉన్నాయి.

మారుతి ఎర్టిగా గురించి

ఎర్టిగా 1.5 లీటర్ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 103 బీహెచ్‌పీ పవర్, 137 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇది ప్రస్తుతం సీఎన్‌జీ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇది 88 బీహెచ్‌పీ పవర్, 121 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ మాత్రమే పొందింది. ఎర్టిగా సీఎన్‌జీ వేరియంట్.. 26 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. దీంతో ఇది ప్రస్తుతం దేశంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఎంపీవీగా నిలిచింది.

మారుతి ఎర్టిగా (ధర రూ. 9.11 లక్షలు, ఎక్స్ షోరూమ్).. హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్, 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటివి పొందుతుంది. ఇది 7 ఇంచెస్ స్మార్ట్‌ప్లే ప్రో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, రెండో వరుసలో రూఫ్ మౌంటెడ్ ఏసీ, కలర్ టీఎఫ్టీ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే మొదలైన ఫీచర్స్ ఇందులో చూడవచ్చు.

సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే మారుతి ఎర్టిగాలో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటివి ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న చాలా కార్లు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతాయి. ఎర్టిగా మాత్రం రెండు ఎయిర్‌బ్యాగ్‌లతోనే సరిపెట్టుకుంటోంది.

ఆగస్టులో ఎక్కువ అమ్మకాలు పొందిన టాప్ 10 కార్లు

➤మారుతి ఎర్టిగా: 18,445 యూనిట్లు
➤మారుతి డిజైర్: 16,509 యూనిట్లు
➤హ్యుందాయ్ క్రెటా: 15,924 యూనిట్లు
➤మారుతి వ్యాగన్ ఆర్: 14,552 యూనిట్లు
➤టాటా నెక్సాన్: 14,004 యూనిట్లు
➤మారుతి బ్రెజ్జా: 13,620 యూనిట్లు
➤మారుతి బాలెనొ: 12,549 యూనిట్లు
➤మారుతి ఫ్రాంక్స్: 12,422 యూనిట్లు
➤మారుతి స్విఫ్ట్: 12,385 యూనిట్లు
➤మారుతి ఈకో: 10,785 యూనిట్లు

స్పీడుమీదున్న ఆటోమొబైల్ రంగం

భారతదేశ ఆటోమొబైల్ రంగం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. లెక్కకు మించిన కంపెనీలు దేశీయ విఫణిలో కొత్త కార్లను లాంచ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో జర్మనీ, జపాన్, అమెరికా, చైనా, స్వీడన్, ఫ్రెంచ్, వియాత్నం మొదలైన దేశాలకు చెందిన బ్రాండ్స్ ఉన్నాయి. దేశ ఆర్ధిక రంగం అభివృద్ధి చెందడానికి కూడా ఆటోమొబైల్ రంగంలో చాలా దోహదపడుతోంది. అంతే కాకుండా వాహన ప్రేమికులు కూడా ఎప్పటికప్పుడు కొత్త కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ కారణంగానే దేశంలో కార్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది.

బిగ్‏బాస్ 9: 15 మంది కంటెస్టెంట్స్.. ఒక్కక్కరికి ఎంత రెమ్యునరేషన్ అంటే?

బిగ్‏బాస్ సీజన్ 9 మొదలైపోయింది. ఈ సీజన్ ప్రారంభమయ్యేదాకా.. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరనే కుతూహలం చాలామందిలో ఉండేది. ఇప్పుడు ఆ జాబితా తెలిసిపోయింది. కాగా ఇప్పుడు వారి రెమ్యునరేషన్ ఎంత?, రోజుకు ఎంత తీసుకుంటారు.. సెలబ్రిటీలకు ఎంత?, సామాన్యులకు ఎంత అనే వివరాల కోసం నెట్టింలో తెగ సెర్చ్ చేసేస్తున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో..

తెలుగు బిగ్‏బాస్ సీజన్ 9లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇందులో 6 మంది కామన్ కేటగిరి (సామాన్య ప్రజలు) ఉన్నారు. మిగిలిన 9 మంది సెలబ్రిటీలు. సాధారణ ప్రజలను అగ్నిపరీక్ష అనే కార్యక్రమం ద్వారా ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి వీరికి కూడా మంచి రెమ్యునరేషన్ అందిస్తున్నారు. సెలబ్రిటీలకు ఎలాగో వారికి తగ్గ రెమ్యునరేషన్ దక్కుతుందనే విషయం అందరికి తెలిసిందే.

రెమ్యునరేషన్ వివరాలు (వారానికి)

➤భరణి: రూ. 3,50,000
➤ఫ్లోరా సైని: రూ. 3,00,000
➤సుమన్ శెట్టి: రూ. 2,50,000
➤సంజన గల్రాని: రూ. 2,75,000
➤రైతు చౌదరి: రూ. 2,75,000
➤తనూజ: రూ. 2,50,000
➤ఇమ్మాన్యుయేల్: రూ. 2,50,000
➤రాము రాథోడ్: రూ. 2,00,000
➤శ్రష్టి వర్మ: రూ. 2,00,000
➤డీమాన్ పవన్: రూ. 70,000
➤మిలటరీ కళ్యాణ్: రూ. 70,000
➤మర్యాద మనీష్: రూ. 70,000
➤హరీష్: రూ. 70,000
➤ప్రియా ఈపూరు: రూ. 70,000
➤దమ్ము శ్రీజ: రూ. 70,000

ప్రస్తుతానికి వెల్లడైన రెమ్యునరేషన్ వివరాలను బట్టి చూస్తే భరణికి ఎక్కువ రెమ్యునరేషన్ ఉందని స్పష్టమవుతోంది. ఆ తరువాత ఫ్లోరా సైని, సుమన్ శెట్టి, రీతూ చౌదరి మొదలైనవారు ఉన్నారు. వీరి రెమ్యునరేషన్ వారానికి లక్షల్లో ఉన్నాయి. కానీ నార్మల్ కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ మాత్రం వేలల్లోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా వీరందరికీ కూడా ఒకే విధమైన రెమ్యునరేషన్ అని కూడా తెలుస్తోంది.

నిజానికి ఇప్పటికి వెల్లడైన కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ అనేది కేవలం ఒక అంచనా మాత్రమే. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం బిగ్‏బాస్ బృందంగానీ, కంటెస్టెంట్స్ గానీ ఎవరూ పంచుకోలేదు. అయితే కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందని సమాచారం. అప్పుడు ఎవరికి ఎంత అనే విషయంపై ఒక క్లారిటీ వచ్చేస్తుంది.

బిగ్‏బాస్ హౌస్ విశేషాలు

ఇప్పటికే బిగ్‏బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇక ఎలిమినేషన్స్ గురించి కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరా అని.. చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయం కూడా త్వరలోనే తెలుస్తుంది. కాగా మొదటివారం బిగ్‏బాస్ సీజన్ 9 ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదని తెలుస్తోంది. సాధారణంగా అన్ని సీజన్లలోనూ మొదటి వారం ఇలాగే ఉంటుందని, ఆ తరువాత అసలైన ఆట మొదలవుతుందని నెటిజన్లు చెబుతున్నారు. మొత్తానికి ఈ సారి గెలిచేది ఎవరు?, బిగ్‏బాస్ 9 టైటిల్ విన్నర్ ఎవరనేది ఇప్పటికి ఊహకు అందటం లేదు. టైటిల్ గెలిచేది.. కామన్ మెన్ కేటగిరిలోనివారా?, సెలబ్రిటీల అనేది ముందు ముందు తెలుస్తుంది. ప్రస్తుతానికి సెలబ్రిటీలు, కమాన్ మెన్స్ అందరూ కూడా తమదైన రీతిలో.. తమను తాము నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి గెలుపెవరిది అనేది తెలుసుకోవడానికి ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఐఫోన్ 17 కొనే డబ్బుతో.. ఇలాంటి ఓ బైక్ కొనేయొచ్చు

యాపిల్ కంపెనీ ఇటీవలే ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇవి ఐఫోన్ 17, ఎయిర్, ప్రో, ప్రో మ్యాక్స్ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు రూ. 82,900 నుంచి ప్రారంభమై రూ. 2,29,900 వరకు ఉన్నాయి. ఈ మొబైల్ కొనుగోలు చాలామంది ఆసక్తిగానే ఉండొచ్చు. కానీ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కొనడానికి పెట్టే డబ్బుతో.. ఏకంగా ఓ మంచి బైక్ కొనుగోలు చేయొచ్చు. ఇంతకీ ఎలాంటి బైక్స్ కొనుగోలు చేయవచ్చో ఇక్కడ చూసేద్దాం.. పదండి.

యాపిల్ ఐఫోన్ 17 ధరలు – మోడల్స్ వారీగా

➢ఐఫోన్ 17 (256 జీబీ): రూ. 82,900
➢ఐఫోన్ 17 (512 జీబీ): రూ. 1,02,900
➢ఐఫోన్ 17 ఎయిర్ (256 జీబీ): రూ. 1,19,900
➢ఐఫోన్ 17 ఎయిర్ (512 జీబీ): రూ. 1,39,900
➢ఐఫోన్ 17 ఎయిర్ (1 టీబీ): రూ. 1,59,900
➢ఐఫోన్ 17 ప్రో (256 జీబీ): రూ. 1,34,900
➢ఐఫోన్ 17 ప్రో (512 జీబీ): రూ. 1,54,900
➢ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (256 జీబీ): రూ. 1,49,900
➢ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (512 జీబీ): రూ. 1,69,900
➢ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (1 టీబీ): రూ. 1,89,900
➢ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (2 టీబీ): రూ. 2,29,900

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350

ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేస్తున్న బైకుల జాబితాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి చెందిన క్లాసిక్ 350 ఒకటి. ఇది 349 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ద్వారా 20.2 బీహెచ్‌పీ పవర్.. 27 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ బైక్ ధరలు రూ. 1.97 లక్షల నుంచి రూ. 2.35 లక్షలు (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి.

కవాసకి కేఎల్ఎక్స్ 230

జాబితాలో కవాసకి కంపెనీకి చెందిన కేఎల్ఎక్స్ 230 కూడా ఉంది. దీని ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులో 233 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8000 ఆర్‌పీఎమ్ వద్ద 18.1 హార్స్ పవర్, 6400 ఆర్పీఎమ్ వద్ద 18.3 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సింపుల్ డిజైన్ కలిగిన ఈ బైక్ అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. మంచి పనితీరును అందిస్తుంది. ఆఫ్ రోడింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

యమహా ఆర్15 వీ4

ఎక్కువమంది యువ రైడర్లకు ఇష్టమైన బైకుల జాబితాలో యమహా ఆర్15 వీ4 ఒకటి. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 1.74 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులోని 155 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ 10000 ఆర్పీఎమ్ వద్ద 18 హార్స్ పవర్, 7500 ఆర్పీఎమ్ వద్ద 14.2 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది బెస్ట్ పర్ఫామెన్స్ అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది ఈ బైకును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్

పల్సర్ ఎన్ఎస్400జెడ్.. బజాజ్ కంపెనీకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన బైక్. రూ. 1.92 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ బైక్.. 373 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది ఆకట్టుకునే డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి.. ఉత్తమ పనితీరును అందిస్తుంది. మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందిన బైకుల జాబితాలో ఇది ఒకటి కావడం గమనార్హం.

సుజుకి వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్

మన జాబితాలో చెప్పుకోదగ్గ మరో బైక్.. సుజుకి వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 2.16 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులో 249 సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ 26 హార్స్ పవర్, 22.2 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. పనితీరు పరంగా ఉత్తమంగా ఉండే ఈ బైక్.. మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది.

అమ్మను చూడగానే నాన్న స్టెప్పులు తడబడ్డాయి: చిరంజీవి కూతురు

0

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన సినిమా ‘కిష్కింధపురి‘. ఈ సినిమా రేపు (సెప్టెంబర్ 12) థియేటర్లలో రిలీజ్ కానుంది. అంతకంటే ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు అనిల్ రావిపూడి, బుచ్చిబాబు, చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల కూడా హాజరయ్యారు.

నాన్నకు అమ్మంటే భయమా?

కిష్కింధపురి సినిమా గురించి మాట్లాడుతూ.. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ అద్భుతంగా నటించారు. ఇప్పటికి రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఎంతగానో ఆకట్టుకుందని సుష్మితా వెల్లడించారు. ఈ సందర్భంగా యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మీకు ఏదంటే భయం అన్న ప్రశ్నను.. మనం భయపెట్టడమే గానీ భయపడటం ఉండదని అన్నారు. నాన్నగారికి అమ్మను చూస్తే భయమా? అని సుమ అడిగారు.

సుమ అడిగిన ప్రశ్నకు.. ఈ రోజు జరిగిన సంఘటన ఒకటుందని సుష్మిత చెప్పారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా షూటింగ్ సందర్భంగా ఒక సాంగ్ షూట్ చేసాము. ఈ సమయంలో అమ్మ సెట్లోకి అడుగు పెట్టింది. అమ్మను చూడగానే.. అప్పటి వరకు డ్యాన్స్ బాగా వేస్తున్న నాన్న స్టెప్ తడబడింది. డ్యాన్స్ బాగా చేయలేకపోయారు అని నవ్వుతూ చెప్పింది. ఎంత మెగాస్టార్ అయిన భార్యకు భయపడాల్సిందే అని సుమ నవ్వుతూ చెప్పేసింది. అంతే కాకుండా.. కిష్కిందపురి సినిమా మంచి హిట్ సాధించాలని కోరుకున్నట్లు సుష్మిత కొణిదెల వెల్లడించారు.

కిష్కింధపురి సినిమా గురించి

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరం ప్రధాన పాత్రలలో కనిపించే కిష్కింధపురి సినిమా హర్రర్ థ్రిల్లర్. కౌశిక్ పెగాళ్ళపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, హైపర్ ఆది, మకరంద్ దేశ్ పాండే తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా కోసం చిత్ర రూ. 25 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక కలెక్షన్ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కాగా ఈ సినిమాపై చిత్ర బృందం భారీ అంచనాలు పెట్టుకుంది. బెల్లంకొండ శ్రీనివాస్ చివరగా భైరవం సినిమాలో కనిపించారు. ఇప్పుడు కిష్కింధపురి సినిమాలో కనిపించబోతున్నారు.

సుష్మిత కొణిదెల

1982 మార్చి 3న జమించిన మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల.. కాస్ట్యూమ్ డిజైనర్. అంతే కాకుండా ఈమె నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆచార్య, వాల్తేరు వీరయ్య, ఖైదీ నెంబర్ 150, రంగస్థలం, సైరా నరసింహారెడ్డి వంటి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన సుష్మిత సేనాపతి అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.

బెల్లంకొండ శ్రీనివాస్ గురించి

1993 జనవరి 3న జన్మించిన బెల్లంకొండ శ్రీనివాస్.. 2014లో అల్లుడు శీను సినిమాతో చిత్ర సీమలో అడుగుపెట్టాడు. మొదటి సినిమా మంచి హిట్ సాధించిన తరువాత స్పీడున్నోడు, జయ జానకీ నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు, అల్లుడు అదుర్స్ వంటి సినిమాల్లో నటించారు. ఇక కిష్కింధపురి రేపు (శుక్రవారం) రిలీజ్ అవుతుంది. కాగా ఈయన ప్రస్తుతం టైసన్ నాయుడు, హైందవ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనే వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు.

నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు ప్రజలు: సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

నేపాల్‌లో జరుగుతున్న అల్లర్ల కారణంగా.. అక్కడి ప్రభుత్వం అతలాకుతలమైంది. ఈ అల్లర్ల కారణంగానే ఆ దేశంలో పరిస్థితులు తారుమారయ్యాయి. ఇక్కడ నేపాలీ ప్రజలు మాత్రమే కాకుండా.. కొంతమంది తెలుగు ప్రజలు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ సుమారు 200 మంది తెలుగు వారు చిక్కుకుపోయారని సమాచారం. వీరిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంది.

సమీప దేశమైన నేపాల్‌లో చిక్కుకున్న 200 మంది తెలుగు ప్రజలను కాపాడే బాధ్యతను తీసుకున్న కూటమి ప్రభుత్వం.. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను మంత్రి నారా లోకేష్‌కు అప్పగించారు. ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ సమావేశంలో ప్రసంగించిన చంద్రబాబు నాయుడు.. తెలుగు ప్రజలు కష్ట సమయంలో ఉన్నప్పుడు స్పందించడం రాష్ట్ర ప్రభుత్వం విధి అని అన్నారు.

నారా లోకేష్‌కు బాధ్యతలు

నేపాల్‌లో నిరసనలు జరుగుతున్న సమయంలో.. అక్కడే ఇరుక్కున్న తెలుగు కాపాడాలి. రియల్ టైమ్ గవర్నెన్స్‌లో పరిస్థితిని పర్యవేక్షించాలని.. మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్‌ను ఆదేశించాను. ఈ క్లిష్ట సమయంలో మన ప్రజలకు స్పందించడం, వారికి తోడుగా నిలబడటం మన విధి అని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

తెలుగు ప్రజలకు సహాయం చేయడానికి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీలోని ఆంధ్ర భవన్‌లో అత్యవసర విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇది పౌరులకుఇ కలిగిన అశాంతిని ఎదుర్కొంటుంది. ఆంధ్రప్రదేశ్ భవన్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు.. కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడును, ఆంధ్ర భవన్ అధికారులను అన్ని విధాలా సహాయ సహకారాలను అందించాలని కోరినట్లు పేర్కొన్నారు.

భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు

ఇకపోతే.. నేపాల్‌లోని ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం పూర్తి సహకారాన్ని అందించనున్నట్లు హామీ ఇచ్చింది. ఖాట్మండులోని బఫాల్‌లో సుమారు 30 మంది తెలుగు ప్రజలకు ఆహరం, వసతి, వైద్య సహాయం అందిస్తున్నట్లు శ్రీకాంత్ తెలియజేసారు. దీనికోసం ఆంధ్ర భవన్‌లో అత్యవసర నోడల్ అధికారిగా ఒకరిని నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా.. అక్కడి పరిస్థితిని పర్యవేక్షించడానికి, తెలుగు ప్రజలను రక్షించడానికి టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వశాఖ మరియు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

ఖాట్మండులోని ఒక హోటల్‌లో బస చేస్తున్న కొన్ని తెలుగు కుటుంబాలను.. నేపాల్ ఆందోళనకారులు బెదిరించారని సమాచారం. ఈ కారణంగానే అధికారుల పర్యవేక్షణలో ఉన్న గెస్ట్ హౌస్‌కు వీరందరిని తరలించారు. ఇక్కడ చిక్కున్న ప్రజలను వీలైనంత తొందరగా.. భారతదేశానికి తీసుకురావడానికి ఇక్కడ ప్రభుత్వం కావలసిన అన్ని ఏర్పాట్లను చేస్తోంది.

నేపాల్ అల్లర్లకు ప్రధాన కారణం

సోషల్ మీడియా నిషేధం, అవినీతి & శాశ్వత రాజకీయ వారసత్వాలు, నిరుద్యోగం & ఆర్ధిక అవకాశాల తగ్గుదల, పాలనా వ్యవస్థమీద నమ్మకం లేకపోవడం, యువతకు సంబంధించిన చాలా విషయాలను నిర్లక్ష్యం చేయడం మొదలైన కారణాల వల్ల.. అక్కడి ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా అల్లర్లు చేయడం మొదలు పెట్టారు. ఇదే తీవ్ర స్థాయికి చేరి.. చాలా నష్టం కలిగించింది. ఈ అల్లర్లను తగ్గించడానికి అక్కడ ప్రభుత్వంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.

మిత్రమా భయమేల.. డుగ్ డుగ్ బండి ధరలు తగ్గాయ్ కదా!

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ 2.0 ప్రకటించిన తరువాత.. భారతదేశంలో దాదాపు అన్ని వాహన తయారీ సంస్థలు తమ వాహనాల ధరలను తగ్గించాయి. ప్రారంభంలో బైక్ తయారీ దిగ్గజం రాయల్ ఎన్‌ఫీల్డ్ ధరలు తగ్గే అవకాశం లేదని కొన్ని వదంతులు వెల్లడయ్యాయి. కానీ ఇప్పుడు కంపెనీ తగ్గిన ధరలను ప్రకటించింది. ఇది డుగ్ డుగ్ బండి ప్రియులకు కొంత ఉపశమనం కలిగించింది.

రూ. 22,000 వరకు తగ్గిన ధరలు

జీఎస్టీ సంస్కరణల తరువాత తగ్గిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ధరలు 2025 సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి. నిజానికి 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైకుల ధరలు కూడా సవరించనున్నట్లు సంస్థ వెల్లడించింది. అయితే ప్రస్తుతానికి 350 సీసీ బైకుల ధరలు తగ్గాయి. ఇందులో క్లాసిక్ 350, హంటర్ 350, బుల్లెట్ 350, మీటియోర్ 350 మోడల్స్ ఉన్నాయి. ఎంపిక చేసిన మోడల్స్ మీద గరిష్టంగా రూ. 22,000 తగ్గుతుంది. కాగా భవిష్యత్తులో హిమాలయన్ 450, గెరిల్లా 450, 650 సీసీ విభాగంలోని బైకుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే ఎంత ధర తగ్గుతుందనే విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.

తగ్గిన ధరలను గురించి వ్యాఖ్యానిస్తూ.. ఐషర్ మోటార్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓ బీ గోవిందరాజన్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేటెస్ట్ జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయి. మొదటిసారి బైక్ కొనుగోలుచేసే వారికి కొంత తగ్గింపు కూడా లభిస్తుంది. జీఎస్టీ ప్రయోజనాలను మా వినియోగదారులకు అందజేస్తున్నామని ప్రకటించడం మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

28 శాతం నుంచి 18 శాతానికి

2025 సెప్టెంబర్ 22 నుంచి 350 సీసీ సామర్థ్యం కలిగిన మోటారు సైకిళ్లపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గుతుంది. దీనివల్ల బైక్ ధరలు ఓ మోస్తరుగా తగ్గుతాయి. కాగా 350 సీసీ కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న బైక్ ధరలు పెరుగుతాయని సమాచారం. ఎంత పెరుగుతాయి?, కొంచెమైనా తగ్గే అవకాశం ఉందా?, తగ్గితే ఏ కోణంలో తగ్గుతుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది.

నిజానికి భారతదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు ఓ ప్రత్యేకమైన ఆదరణ ఉంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కంపెనీ బైకులు ఒకప్పటి నుంచి వయసుతో బేధం లేకుండా.. యువకులను, పెద్దవారిని సైతం ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం 350 సీసీ, 450 సీసీ, 650 సీసీ విభాగంలో కూడా కంపెనీ బైకులను లాంచ్ చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అలంటి ఈ కంపెనీ బైకులు పేరుతాయనే విషయం.. కొత్తగా రాయల్ ఎన్‌ఫీల్డ్ కొనాలనుకున్న వారిలో ఒకింత భయాన్ని, నిరాశను కలిగింది. కానీ ఇప్పుడు కంపెనీ తగ్గిన ధరలను ప్రకటించి వారికి కొంత ఉపశమనం కలిగించింది.

జాబితాలో ఇతర కంపెనీలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ మాత్రమే కాకుండా.. ఇతర టూ వీలర్ తయారీ సంస్థలు కూడా ధరలను తగ్గిస్తూ అధికారిక ప్రకటనలు చేశాయి. ఇందులో బజాజ్ ఆటో ఎంపిక చేసిన బైకుల ధరలను రూ. 20,000 వరకు తగ్గించగా.. టీవీఎస్ మోటార్ కంపెనీ గరిష్టంగా రూ. 21,718 వరకు తగ్గింపులు ప్రకటించింది. బైక్ తయారీ దారులు మాత్రమే కాకుండా.. కార్ల తయారీదారులైన హ్యుందాయ్, టయోటా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, మినీ కంపెనీలు కూడా తగ్గిన ధరలను ఈ మధ్యకాలంలో ప్రకటించాయి. తగ్గిన ధరల కారణంగా.. వస్తున్న పండుగల (దసరా, దీపావళి) సమయంలో వాహన అమ్మకాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని పలువురు భావిస్తున్నారు.

దూసుకెళ్తున్న గోల్డ్ రేటు.. బంగారం కానున్న వెండి!

0

గతంలో ఎన్నడూ లేనంత పెరుగుతున్న బంగారం ధరలు.. పసిడి ప్రియులను ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేస్తోంది. గత వారం రోజులు భారీగా పెరుగుతున్న ధరలు ఈ రోజుకు పెరుగుదల దిశగానే అడుగులు వేసింది. బుధవారం (సెప్టెంబర్ 10) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 210.90 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ. 1,10,510 వద్దకు చేరింది. ఇది దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల్లో కూడా కదలికలు జరిగేలా చేసింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నగరాల్లో గోల్డ్ రేటు ఎలా ఉంది?, ఏ నగరం అధికం అనే చాలా విషయాలను వివరంగా చూసేద్దాం..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు

హైదరాబాద్, విజయవాడ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి.. రూ. 1,01,300 వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం ధర రూ. 210.90 పెరిగి.. రూ. 1,10,510 వద్దకు చేరింది. నిన్నటి ధరలో పోలిస్తే.. ఈ రోజు ధరలు కొంత ఎక్కువే. అంతే కాకుండా ఇది ఇప్పటి వరకు గరిష్టం. ఇదే ధరలు బెంగళూరులో కూడా కొనసాగుతాయి.

దేశ రాజధానిలో గోల్డ్ రేటు

ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా ఏ మాత్రం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. నిన్నటితో (సెప్టెంబర్ 09) పోలిస్తే.. ఈ రోజు (సెప్టెంబర్ 10) ధరలు కొంత స్వల్పంగానే పెరిగాయి. దేశ రాజధానిలో 24 క్యారెట్స్ బంగారం 10 గ్రాముల ధర రూ. 1,10,660 (రూ. 220 పెరిగింది) కాగా.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 101450 (రూ. 200 పెరిగింది).

చెన్నైలో పసిడి ధరలు

విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలలో బంగారం ధరలు పెరిగినప్పటికీ.. చెన్నైలో మాత్రం ధరలు పెరగలేదు. కాబట్టి నిన్నటి ధరలే ర్ రోజూ కొనసాగుతున్నాయి. నేడు ఇక్కడ 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,10,730 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రామ్స్ ధర రూ. 1,01,500 వద్దనే ఉంది.

బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు

ఈ ఏడాది ప్రారంభంలో రూ. 8వేలు కంటే కూడా తక్కువ ఉన్న ధర.. ఇప్పుడు రూ. లక్ష మార్క్ దాటేయడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇందులో అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు, రూపాయి విలువ తగ్గడం వంటివి ప్రధానంగా చెప్పుకోదగ్గవి. అమెరికా సుంకాల కారణంగా స్టాక్ మార్కెట్ డీలా పడింది. దీంతో చాలామంది పెట్టుబడిదారులు.. సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకున్నారు. దీంతో చాలామంది బంగారంపై ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. దీని పసిడికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇది ధరలను అమాంతం పెరిగేలా చేసింది.

వెండి ధరలు పైపైకి

బంగారం ధరలు పెరుగుతున్న సమయంలో.. వెండి రేటు కూడా అమాంతం పెరిగిపోయింది. వెండి కూడా భవిష్యత్తులో బంగారం అంత రేటుకు చేరుతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడే కేజీ వెండి రేటు రూ. 1.40 లక్షల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే మరో రెండేళ్లలో సిల్వర్ రేటు.. రెండు లక్షల రూపాయలకు చేరుకుంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి పెట్టుబడిదారులు వెండిపై పెట్టే పెట్టుబడి కూడా సురక్షితమే అని భావిస్తున్నారు.

వారసుడొచ్చాడు.. కొడుకు ఫోటో షేర్ చేసిన వరుణ్ తేజ్

0

నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ తండ్రయ్యాడు. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని రెయిన్‌బో హాస్పిటల్‌లో.. లావణ్య త్రిపాఠి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి.. మన శంకర వరప్రసాద్ గారు సినిమా సెట్ నుంచే నేరుగా ఆసుపత్రికి వెళ్లి, ఈ మెగా దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వరుణ్ తేజ్ తన కొడుకు ఫోటోను షేర్ చేస్తూ లిటిల్ మ్యాన్ అంటూ క్యాప్సన్ ఇచ్చారు. అటు వరుణ్ ఫ్యాన్స్, ఇటు లావణ్య ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.

2023లో పెళ్లి

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. 2023 నవంబర్ 1న ఇటలీలోని టస్కానీలోని బొర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహనానికి మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితులు, స్నేహితులు పాల్గొన్నారు. ఆ తరువాత 2023 నవంబర్ 5న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా.. ఇతర సెలబ్రిటీలు, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు.

నిజానికి లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. 2017లో మిస్టర్ సినిమాలో ఇద్దరు కలిసి నటించారు. అప్పుడు ఏర్పడిన పరిచయం స్నేహంతో మొదలై.. ప్రేమగా మారి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత లావణ్య త్రిపాఠి దాదాపు సినిమాలకు దూరమైంది. కాగా ఈ ఏడాది మే నెలలో తాము తల్లిదండ్రులు అవుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇప్పుడు ఈ జంట మగబిడ్డకు జన్మనిచ్చింది. వారసుని రాకతో మెగా ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. నాగబాబు తాతయ్య ప్రమోషన్ తీసుకున్నారు.

లావణ్య త్రిపాఠి

1991 డిసెంబర్ 15న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జన్మించిన లావణ్య త్రిపాఠి.. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో పెరిగింది. తండ్రి హైకోర్టులో న్యాయవాది, కాగా అమ్మ ఉపాధ్యాయినిగా పనిచేశారు. లావణ్యకు ఒక చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. ఈమె (లావణ్య త్రిపాఠి) డెహ్రాడూన్‌లోని మార్షల్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసిన తరువాత.. ముంబై వెళ్లి, అక్కడ రిషి దయారాం నేషనల్ కాలేజీలో ఆర్థికశాస్త్రం పూర్తి చేసింది. 2006లో చదువుకునే రోజుల్లోనే మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ గెలుచుకుంది. ఆ సమయంలోనే భరతనాట్యం కూడా నేర్చుకుంది. అందాల రాక్షసి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఈమె తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల చిత్రాల్లో కూడా నటించింది. పెళ్లి తరువాత లావణ్య సినిమాలకు దూరంగా ఉంది.

వరుణ్ తేజ్

మెగా వారసుడు.. నాగబాబు తనయుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్.. ఆ తరువాత తనదైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బాలనటుడిగా సినిమాల్లో కనిపించినప్పటికీ.. ముకుంద సినిమాతోనే హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తరువాత కంచె, లోఫర్, మిస్టర్, ఫిదా వంటి సినిమాల్లో నటించారు. వరుణ్ తేజ్ చివరి సినిమా మట్కా. కాగా ఈయన ప్రస్తుతం ‘వీటీ15’ కోసం పనిచేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం ప్రస్తుతానికి వెల్లడికాలేదు. బహుశా దీనిని త్వరలోనే విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం.

ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ చేసిన యాపిల్: ధరలు, బుకింగ్స్ & పూర్తి వివరాలు

0

ప్రతి ఏటా యాపిల్ కంపెనీ కొత్త ఐఫోన్ సిరీస్ లాంచ్ చేయడం.. అదే సమయంలో ఇతర ఉత్పతులను కూడా పరిచయం చేయడం జరుగుతున్న విషయమే. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన ‘అవే డ్రాపింగ్‘ కార్యక్రమంలో సరికొత్త ‘ఐఫోన్ 17‘ లాంచ్ చేసింది. ఈ కొత్త ఐఫోన్ సిరీస్ ధరలు ఎలా ఉన్నాయి?, ఫీచర్స్ ఏంటి?, ఎప్పటి నుంచి అమ్మకానికి వస్తాయి? అనే చాలా వివరాలను ఈ కథనంలో చూసేద్దాం.

వేరియంట్స్ & ధరలు

యాపిల్ మొత్తం నాలుగు వేరియంట్లలో ఐఫోన్ 17 లాంచ్ చేసింది. అవి ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రోమాక్స్. ఇవి కాస్మిక్ ఆరంజ్, డీప్ బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. కంపెనీ వీటి కోసం బుకింగ్స్ సెప్టెంబర్ 12 నుంచి స్వీకరించడం మొదలు పెడుతుంది. సేల్స్ ఇదే నెల 19 నుంచి ప్రారంభమవుతాయి.

➤ఐఫోన్ 17: రూ. 82,900
➤ఐఫోన్ 17 ఎయిర్: రూ. 1,19,900
➤ఐఫోన్ 17 ప్రో: రూ. 1,34,900
➤ఐఫోన్ 17 ప్రోమ్యాక్స్: రూ. 1,49,900

ఐఫోన్ 17

మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్ 17 బేస్ మోడల్ ధర రూ. 82,900. బ్లాక్, లావెండర్, సగే, వైట్, మిస్ట్ బ్లూ అనే ఐదు రంగులలో లభించే ఈ ఫోన్ 6.3 ఇంచెస్ సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, ఇరువైపులా సిరామిక్ షీల్డ్ కలిగి.. స్క్రీన్‌కు మూడు రెట్లు మెరుగైన నిరోధకతను అందిస్తుంది. 3000 నిట్స్ బ్రైట్‌నెస్, 40 మెగాపిక్సెల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ టెలి ఫోటో లెన్స్ మొదలైనవి పొందుతుంది. ప్రారంభ స్టోరేజ్ కెపాసిటీ 256 జీబీ. ఇది ఫాస్ట్ వైర్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఐఫోన్ 17 ఎయిర్

యాపిల్ లాంచ్ చేసిన మరో ఐఫోన్ 17 సిరీస్ వేరియంట్.. ఎయిర్. దీని ధర రూ. 1,19,900. ఫాస్ట్ వైర్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే ఈ ఫోన్ చాలా పల్చగా ఉంటుంది. దీని మందం 5.6 మిమీ మాత్రమే. 6.5 ఇంచెస్ డిస్‌ప్లే కలిగిన ఈ వేరియంట్.. బ్లాక్, వైర్, గోల్డ్ అండ్ బ్లూ అనే నాలుగు రంగుల్లో లభ్యమవుతుంది. ఇరువైపులా సిరామిక్ షీల్డ్ కలిగి సుమారు 80 శాతం రీసైక్ల్డ్ టైటానియంతో ఈ ఫోన్ తయారైంది. ఇది 12 మెగాపిక్సెల్ టెలీఫోటో లెన్స్, 18 మెగాపిక్సెప్ సెంటర్ స్టేజ్ కెమెరా వంటివి పొందుతుంది. కాబట్టి మంచి ఫోటో షూట్ అనుభూతిని పొందవచ్చు.

ఐఫోన్ 17 ప్రో & ప్రో మ్యాక్స్

యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ టాప్ మోడల్స్ అయిన వీటి ధరలు వరుసగా.. రూ. 1,34,900 & రూ. 1,49,900. థర్మల్ మేనేజ్మెంట్ సిస్టం కలిగిన ఈ ఫోన్స్.. సాధారణ మోడల్స్ మాదిరిగా వేడెక్కవు. ఈ రెండూ కూడా సిరామిక్ షీల్డ్ పొందుతాయి. వెనుక వైపు మూడు కెమెరాలతో వచ్చే ఈ ఫోన్స్.. మొదటిసారి 48 మెగాపిక్సెల్ పొందాయి. 17 ప్రో 6.3 ఇంచెస్ డిస్‌ప్లే పొందింది. 17 ప్రో మ్యాక్స్ 6.9 ఇంచెస్ డిస్‌ప్లే పొందింది.

వాచ్ సిరీస్ 11

కంపెనీ అవే డ్రాపింగ్ ఈవెంట్‌లో ఐఫోన్ 17 సిరీస్‌తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 11, ఎయిర్‌పాడ్స్ ప్రో3 కూడా లాంచ్ చేసింది. 100 శాతం రీసైకిల్డ్ అల్యూమినియంతో రూపొందించబడిన ఈ స్మార్ట్‌వాచ్‌లు లెక్కకు మించిన ఫీచర్స్ పొందుతాయి. ఈసీజీ, హైబీపీ అలర్ట్, స్లీపింగ్ స్కోర్ వంటివి ఇందులో ఉన్నాయి. ఈ వాచ్ ప్రారంభ ధర రూ. 46,900.

ఎయిర్‌పాడ్స్ ప్రో3

ఇక చివరగా యాపిల్ లాంచ్ చేసిన సరికొత్త ఎయిర్‌పాడ్స్ ప్రో3 విషయానికి వస్తే.. వీటి ప్రారంభ ధర రూ. 25,900. ఇవి రీడిజైన్డ్ లిక్విడ్ గ్లాస్ యూఐతో రూపిందించబడ్డాయి. చూడటానికి చాలా స్టైలిష్ డిజైన్ కలిగిన ఈ ఎయిర్‌పాడ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. త్వరలోనే వీటి బుకింగ్స్, సేల్స్ కూడా ప్రారంభం కానున్నాయి.

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా?.. ఇవి బెస్ట్ ఆప్షన్!

ప్రపంచ వ్యాప్తంగా అనేక కారణాల వల్ల.. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు కొంత మందగించాయి. అయితే భారతదేశంలో మాత్రం ఇందుకు భిన్నం. ఎందుకంటే ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉపయోగించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం మన దేశంలో.. ద్విచక్ర వాహన మార్కెట్లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ వాటా 6 శాతంగా ఉంది. దీనికి కారణం కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్స్ లాంచ్ కావచ్చు, ఎక్కువమంది ఎలక్ట్రిక్ వాహనాలను ఇష్టపడటం కావచ్చు. ఏదైతేనేం.. దేశంలో ఈవీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ కథనంలో ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల దినోత్సవం సందర్భంగా.. ఐదు సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం.

ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్స్ (జనరేషన్ 3)

భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే వివిధ ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఆగస్టులో ”ఎస్1 ప్రో స్పోర్ట్స్ జెన్ 3” లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.50 లక్షలు ( షోరూమ్). అయితే దీనిని రూ. 999లతో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2026 జనవరిలో ప్రారంభమవుతాయి. ఈ స్కూటర్ 5.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా.. 320 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 15 నిమిషాల్లో 20 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

ఆల్ట్రావయొలెట్ టెస్సెరాక్ట్

బెంగళూరుకు చెందిన అల్ట్రావయొలెట్ కంపెనీ ఆధునిక వాహనాలను లాంచ్ చేస్తూ యువతను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇందులో భాగంగానే కంపెనీ టెస్సెరాక్ట్ పేరుతో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.45 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీనిని కూడా రూ. 999లతో బుక్ చేసుకోవచ్చు. 14 ఇంచెస్ వీల్స్ కలిగిన ఈ స్కూటర్.. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ పొందుతుంది. డిజైన్ కూడా ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది. ఇందులో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ టీఎఫ్టీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఇండీగ్రేటెడ్ డాష్‌క్యామ్, మొబైల్ కోసం వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి.

హీరో విడా వీఎక్స్2

ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్.. ఈ ఏడాది జులైలో వీఎక్స్2 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఇది వీఎక్స్2 గో, వీఎక్స్2 ప్లస్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 99,490, రూ. 1.10 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇవి 92 కిమీ రేంజ్ అందించే.. 2.2 కిలోవాట్ సింగిల్ రిమూవబుల్ బ్యాటరీ పొందుతుంది. ఈ స్కూటర్ కేవలం 4.2 సెకన్లలో 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 70 కిమీ కావడం విశేషం. ఎకో మరియు రైడ్ అనే రెండు రైడింగ్ మోడ్స్ కలిగిన ఈ స్కూటర్ 4.3 ఇంచెస్ ఎల్‌సీడీ డిజిటల్ డిస్‌ప్లే పొందుతుంది. ఇది స్కూటర్ గురించి చాలా సమాచారం అందిస్తుంది.

కైనెటిక్ డీఎక్స్

1980.. 90 సంవత్సరాలలో అత్యధిక ప్రజాదరణ పొందిన స్కూటర్ నుంచి ‘కైనెటిక్ డీఎక్స్‘ ప్రేరణ పొందింది. ఇది ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలోనే అతిపెద్ద ఆవిష్కరణ. ఈ స్కూటర్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ. 1,11,499 (ఎక్స్ షోరూమ్). డీఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్లోర్‌బోర్డ్ కింద 2.6 కిలోవాట్ లిథియం ఐరన్ పాస్ఫేట్ ఉంటుంది. ఇది 4.8 కేడబ్ల్యు మోటారును పొందుతుంది. సింగిల్ ఛార్జితో 116 కిమీ రేంజ్ అందించే ఈ స్కూటర్ మూడు రైడింగ్ మోడ్స్ (రేంజ్, పవర్, టర్బో) పొందుతుంది.

టీవీఎస్ ఆర్బిటర్

ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ.. టీవీఎస్ ఇటీవల ఆర్బిటర్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 99,999 (ఎక్స్ షోరూమ్). ఈ స్కూటర్ 3.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 158 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ ఫంక్షన్, రివర్స్ పార్కింగ్ అసిస్ట్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీకి సపోర్ట్ ఇచ్చే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.