Home Blog Page 136

అల్లు అర్జున్ ఫ్యామిలీకి నోటీస్.. కూల్చేయాలంటున్న జీహెచ్ఎంసీ అధికారులు

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు, కట్టడాలకు అడ్డుకట్ట వేయడానికి ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్’ (జీహెచ్ఎంసీ) నడుం బిగించింది. అక్రమ నిర్మాణాలకు పాల్పడినవారు.. ఎంతటివారైనా వారిని వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ కుటుంబానికి షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఎందుకు నోటీసులు జారీ చేశారు? అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

జూబ్లీహిల్స్ (హైదరాబాద్) రోడ్ నెంబర్ 45లో అల్లు బిజినెస్ పార్క్ భవనం ఉంది. అయితే ఈ భవనంపై అక్రమంగా పెంట్ హౌస్ నిర్మించారని.. జీహెచ్ఎంసీ సర్కిల్-18 అధికారులు సోమవారం షో-కాజ్ నోటీసు జారీ చేసారు. అంతే కాకుండా.. దానిని ఎందుకు కూల్చకూడదో చెప్పాలన్నారు.

అనుమతులను అధిగమించిన నిర్మాణం

రెండు సంవత్సరాల క్రితం.. అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అల్లు బిజినెస్ పార్క్ భవనం నిర్మించారు. ఈ భవనంలో గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ వంటి వాటికి సంబంధించిన వ్యాపారాలు, ఇతర కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఇప్పటి వరకు రెండు సెల్లార్లు మరియు ఒక గ్రౌండ్ ఫ్లోర్ + నాలుగు అంతస్థులకు సుమారు 1226 చదరపు గజాల స్థలంలో నిర్మాణానికి మాత్రమే అనుమతి లభించింది. అయితే ఇటీవల నాలుగో అంతస్తుపైన ఇంకో నిర్మాణం చెప్పారు.

నాలుగో అంతస్తుపై నిర్మించిన ఈ అక్రమ నిర్మాణం గురించి విచారణ జరపడానికి సర్కిల్ 18 డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య విచారణకు ఆదేశించారు. ఈ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయకుడదో వివరించాలని షో-కాజ్ నోటీసు జారీ చేశారు. అయితే ఈ నోటీసుపై అల్లు ఫ్యామిలీ ఇంకా స్పందించలేదు.

అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు అల్లువారి కుటుంబంపై పడింది. అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారు ఎంత పెద్దవారైనా.. ఒకే న్యాయం అంటూ, గతంలో అక్కినేని నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూల్చివేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెస్ట్ మానిటరింగ్ అండ్ ప్రొటక్షన్) పేరుతో ఒక బృందం ఏర్పాటు చేసి.. అక్రమ నిర్మాణాలను తొలగిస్తూ వచ్చింది.

హైడ్రా అక్రమ నిర్మాణాలను దాదాపు అంతమొందిస్తూ వచ్చింది. ఇందులో కొందరు ప్రజలు ఆవాసం లేకుండా.. నిలువ నీడ లేకుండా పోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. డబ్బున్న వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. డబ్బులేని వాళ్ళు బాధపడుతూ ఊరుకున్నారు. అయితే ఇప్పుడు అక్రమ కట్టడాల తొలగింపులో కొన్ని మార్పులు చేస్తూ.. కారకులను ముందుగా విచారించడం వంటివి చేస్తున్నారు. దీంతో నిర్మాణాల తొలగింపులు ముందుంత లేదు.

ఇప్పటివరకు.. హైడ్రా ఏర్పాటు అయిన తరువాత సుమారు 300 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు సమాచారం. తద్వారా 120.22 ఎకరాల భూమిని పొందింది. అక్రమ నిర్మాణాల కారణంగా అకాల వర్షాల సమయంలో ఇబ్బందులకు గురవుతారని, నీటి ముంపులో చుక్కుకునే ప్రమాదం ఉందని.. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఈ కఠినమైన చర్యలకు పూనుకోవలసి వచ్చింది. ఈ చర్య ప్రభుత్వంపై కొంత వ్యతిరేకతను కూడా కలిగించింది.

ఇప్పటివరకు.. మీరెప్పుడూ చూడని స్కోడా కారు: దీని గురించి తెలుసా?

ప్రపంచ ఆటోమొబైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త టెక్నాలజీలతో సరికొత్త కార్లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు లాంచ్ అవుతున్న కార్లు.. గతంలో విక్రయించబడిన కార్ల కంటే కూడా చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ కలిగి.. కస్టమర్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో.. చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా ఓ సరికొత్త కారు (విజన్ O ఎలక్ట్రిక్ కాన్సెప్ట్)ను ఆవిష్కరించింది. ఇది ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని స్కోడా కార్ల కంటే భిన్నంగా ఉంది.

మొదటి ఎలక్ట్రిక్ కాన్సెప్ట్

స్కోడా తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారును 2025 మ్యూనిచ్ మోటార్ షోలో ఆవిష్కరించింది. ఇది మోడ్రన్ సాలిడ్ డిజైన్ పొందుతుంది. భవిష్యత్తులో రాబోయే కార్లు ఇలాగే ఉంటాయేమో అని ఈ కారును చూడగానే ఓ ఆలోచన వచ్చేస్తుంది. ఈ కారు అప్డేటెడ్ ఆటోమేటెడ్ టెక్నాలజీని పొందుతుంది. చూడటానికి పూర్తిగా భిన్నంగా ఉన్న ఈ కారు.. బ్రాండ్ యొక్క మొట్టమొదటి కాన్సెప్ట్ మోడల్. ఇది 1.2 మీటర్లు వెడల్పుతో హారిజన్ డిస్‌ప్లే పొందుతుంది.

ఎక్కువ స్టోరేజ్ స్పేస్

న్యాచురల్ హెచ్ఎమ్ఐ ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మితమైన ఈ కారు.. బయో అడాప్టివ్ లైటింగ్ పొందుతుంది. అంతే కాకుండా కస్టమర్ సెంట్రిక్ ఇంటీరియర్ కూడా పొందుతుంది. ఈ కారు ఏకంగా 650 కంటే ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ కలిగి.. ఓ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్, ఇంటిగ్రేటెడ్ ఫ్రిజ్, వైర్‌లెస్ ఛార్జింగ్ పాడ్ వంటివి కూడా పొందుతుంది.

విజన్ O ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారును స్కోడా.. ఇప్పటికే ఐరోపా మార్కెట్లో అమ్ముడవుతున్న ఆక్టావియా, సూపర్బ్ కార్లకు వారసత్వంగా తీసుకొస్తోంది. ఈ కారు యొక్క ఇంటీరియర్ అక్రోమాటిక్ కలర్ స్కీమ్ పొందుతుంది. కారులోని సీటు కవర్లు 100 శాతం రీసైకిల్ చేసిన ఫాబ్రిక్‌లతోనే తయారయ్యాయి. ఇంటీరియర్ మెటీరియల్స్ కూడా రీసైక్లింగ్ చేయవచ్చు.

అటానమస్ డ్రైవింగ్

స్కోడా లాంచ్ చేయనున్న విజన్ O ఎలక్ట్రిక్ కాన్సెప్ట్.. అటానమస్ డ్రైవింగ్ కెపాసిటీ పొందుతుంది. కాబట్టి డ్రైవింగ్ వంటివి సొంతంగానే నిర్వహించుకోగలుగుతుంది. అయితే భారీ వర్షం, తక్కువ దృశ్యమానత ఉన్నప్పుడు డ్రైవర్ హ్యాండిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అటానమస్ మోడ్‌లో ఉన్నప్పుడు కారులో ‘ట్రాంక్విల్ మోడ్‘ ఆన్ అవుతుంది. అప్పుడు లోపల ఉండే సీతాలను అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల కొంత ఎక్కువ స్పేస్ లభిస్తుంది.

కొత్త విజన్ O ఎలక్ట్రిక్ కారులో కొత్తగా లారా అనే వర్చువల్ అసిస్టెంట్ కూడా ఉంది. అంతే కాకుండా ఇందులోని ఏఐ బేస్డ్ డిజిటల్ అసిస్టెంట్ వాహనాల విధులను నిర్వహించడమే కాకుండా.. ఇంటరాక్టివ్‌గా కూడా ఉంటుంది. ఇది రూట్ సూచనల వంటి సమాచారంతో పాటు.. విందులు ప్లాన్ చేసుకోవడం మొదలైనవి రోజువారీ పనులకు సహాయపడుతుంది. విజన్ O మొబైల్ అప్లికేషన్ కూడా అందుబాటులో ఉంటుంది.

స్కోడా విజన్ O అనేది ఒక కాన్సెప్ట్. కాబట్టి కంపెనీ దీనికి సంబంధించిన టెక్నికల్ వివరాలను వెల్లడించలేదు. డిజైన్, ఫీచర్స్, రేంజ్ వంటి వివరాలతో పాటు ధరలు కూడా భవిష్యత్తులో వెళ్ళడావుతాయి. అయితే దీనిని భారతదేశంలో లాంచ్ చేస్తారా?, లేదా? అనేది తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. బహుశా ఈ కారు మార్కెట్లో లాంచ్ కావడానికి మరో పదేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం.

పుష్ప 3 టైటిల్ ఇదే.. క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్: ఆనందంలో ఫ్యాన్స్

0

అల్లు అర్జున్.. ఈ పేరు వినగానే చాలామందికి పుష్ప సినిమానే గుర్తొస్తుంది. ఇప్పటికే సంచలన విజయాలు కైవసం చేసుకుని.. భారీ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాలు ప్రతిష్టాత్మక అవార్డులను సైతం సొంతం చేసుకున్నాయి. పుష్ప, పుష్ప 2 సినిమాలు విజయవంతం కావడంతో.. పుష్ప 3 కూడా రానున్నట్లు డైరెక్టర్ సుకుమార్ వెల్లడించారు.

పుష్ఫ 3 వస్తుంది

నిజానికి పుష్ప సినిమా చూసిన తరువాత.. పుష్ప 2 సినిమా కోసం అభిమానులు ఎంతగానో వేచి చూసారు. ఇప్పుడు పుష్ప 3 కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి దర్శకుడు శుభవార్త చెప్పారు. రాబోయే పుష్ఫ సినిమాకు ”పుష్ప 3: ది రాంపేజ్” అని పేరు పెట్టారు. అయితే ఈ సినిమా ఎప్పుడు వస్తుందనే విషయాన్ని మాత్రం ఎవరూ చెప్పలేదు.

సైమా అవార్డ్ 2025

దుబాయ్‌లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025 (సైమా) కార్యక్రమంలో.. పుష్ప టీమ్ ఏకంగా ఐదు అవార్డులను గెలుచుకుంది. ఈ సమయంలో పుష్ప 3 సినిమా వస్తుందా?.. అనే ప్రశ్నకు తప్పకుండా వస్తుందని క్లారిటీ ఇచ్చారు. సైమా వేదికపై అల్లు అర్జున్ (బెస్ట్ యాక్టర్), రష్మిక మందన్న (ఉత్తమ నటి), సుకుమార్ (బెస్ట్ డైరెక్టర్), దేవిశ్రీ ప్రసాద్ (బెస్ట్ మ్యూజిక్ కంపోజర్), శంకర్ బాబు కందుకూరి (బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ – మేల్) అవార్డులను అందుకున్నారు. ఒకే సినిమా ఇన్ని అవార్డులు అందుకోవడం గొప్ప విషయం.

సైమా అవార్డు తరువాత అల్లు అర్జున్ రియాక్షన్

నిరంతరం ప్రేమ, గుర్తింపు ఇస్తున్న సైమాకు ధన్యవాదాలు. వరుసగా మూడు సైమా అవార్డులు గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా విజేతలకు, నామినీలందరికి అభినందనలు. దీన్ని (అవార్డు గెలుచుకోవడం) సాధ్యం చేసినందుకు.. ఈ క్రెడిట్ మొత్తం నా డైరెక్టర్ ‘సుకుమార్’కు చెందుతుంది. నా తోటి కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాత, చిత్ర బృందానికి ధన్యవాదాలు. ఈ అవార్డును నా అభిమానులకు అంకితం చేస్తున్నాను. వారి ప్రేమకు నేను ఎప్పుడు బద్ధుడను అని అల్లు అర్జున్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

పుష్ప 3 ఆలస్యం కావొచ్చు

పుష్ప సినిమా తరువాత పుష్ప 2 సినిమా ప్లాన్ ప్రకారం చిత్రీకరించారు. పుష్ప 3పై ముందుగా ఎలాంటి అంచనాలు లేవని తెలుస్తోంది. పుష్ప 2 భారీ విజయం సాధించిన తరువాత పుష్ప 3 కోసం ప్లాన్ చేసి ఉండొచ్చని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం నటుడు అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ఇద్దరూ కూడా వేరువేరు ప్రాజెక్టులలో ఉన్నారు.

అల్లు అర్జున్.. అట్లీతో కలిసి ఏఏ22ఎక్స్ఏ6 (AA22xA6) అనే సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్.. రామ్ చరణ్‌తో కలిసి ఆర్‌సీ17 (RC17) కోసం పనిచేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత పుష్ప 3 షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. దీనికి బహుశా ఓ రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తానికి పుష్ప 3 షూటింగ్, రిలీజ్ వంటి విషయాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడలేదు. కాగా పుష్ప 3 సినిమా రిలీజ్ అయితే మాత్రం.. పుష్ప 2 రికార్డులను సైతం అవలీలగా దాటేసే అవకాశం ఉందని కొందరు అనుకుంటున్నారు.

మల్లెపూల వల్ల.. నటికి రూ.1.14 లక్షల జరిమానా!

0

ప్రస్తుతం సోషల్ మీడియాలో మల్లె పూలు ట్రెండ్ అవుతున్నాయి. కారణం ఏమిటంటే.. మలయాళీ భామ ‘నవ్య నాయర్‘ మూర మల్లెపూలు తీసుకెళ్ళినందుకు ఆస్ట్రేలియా అధికారులు ఏకంగా 1980 ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ. 1.14 లక్షలు) జరిమానా విధించారు. దీంతో భారతదేశంలోని చాలామంది మహిళలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మల్లె పూలకు ఎందుకు ఇంత జరిమానా విధించారు?, ఇంకా నిషేధిత వస్తువులు ఏమైనా ఉన్నాయా? అనే చాలా వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

రూ.1.14 లక్షల జరిమానా..

విక్టోరియాలోని మలయాళీ అసోసియేషన్ నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి.. నవ్య నాయర్ ఆస్ట్రేలియా వెళ్లారు. మెల్‌బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగినప్పుడు ఈమె మల్లెపూలు బ్యాగులు పెట్టుకుంది. ఇది గమనించిన అక్కడ సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి అధికారులు మల్లె పూలు తీసుకెళ్ళినందుకు గానూ.. నటికి రూ. 1.14 లక్షలు జరిమానా విధించారు. జరిమానా 28 రోజుల్లో చెల్లించాలని, దీనిని అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చేసేదేమీ లేక నటి ఊరుకుంది.

మల్లె పూలు తీసుకెళ్లకూడదని నటి నవ్య నాయర్‌కు తెలియదు. ఈ కారణంగానే ఈమె భారీ జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఈ సంఘటన జరిగిన తరువాత.. 15 సెంటీమీటర్ల మల్లె పూలు రూ. 1.14 లక్షలు అని నవ్య నాయర్ కామెంట్ చేశారు. పలువు నెటిజన్లు ఈ సంఘటనకు ఖంగుతినడమే కాదు.. ఇలాంటి రూల్స్ కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోతున్నారు.

మెల్‌బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిషేధిత వస్తువులు

మెల్‌బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేవలం మల్లెపూలు మాత్రమే కాకుండా, కొన్ని విత్తనాలు, మొక్కలు, పండ్లు, పాల ఉత్పత్తులు, స్వీట్స్, టీ, ఇంటి భోజనం, పెంపుడు జంతువులు, ఈకలు మొదలైనవి నిషేధం. కొన్ని అంటువ్యాధులు ఇలాంటి వాటి నుంచే వ్యాప్తి చెందుతాయని భావించి.. అక్కడి అధికారులు వీటిని నిషేధించడం జరిగింది. నిషేధిత వస్తువులతో పట్టుబడితే.. అది ఎంతటివారైనా జరిమానా చెల్లించక తప్పదు. కానీ మాపుల్ చెట్ల నుంచి తయారు చేసిన షుగర్ సిరప్ మాత్రం ఇక్కడ నిషిద్ధం కాదు.

నవ్య నాయర్ గురించి

బహుశా తెలుగు వారికి నవ్య నాయర్ పేరు కొత్త అయినప్పటికీ.. ఈమె మలయాళీ, కన్నడ సినిమాల ద్వారా బాగా ఫేమస్ అయింది. కేరళ రాష్ట్ర ఉత్తమ నటిగా రెండుసార్లు చలన చిత్ర అవార్డులు గెలుచుకున్న నవ్య నాయర్.. 2001లో సీబీ మలైల్ దర్శకత్వం వహించిన ఇష్టా సినిమాతోనే సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత మజతుల్లిక్కిలుక్కం, కుంజికూనన్, కల్యాణరామన్, వెళ్లితీర, అమ్మకిలిక్కూడు, గ్రామోఫోన్, పట్టణతిల్ సందరన్ దృశ్య 2, ఒరుతీ, జానకి జానే అనే సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోగలిగింది.

నవ్య నాయర్ అసలు పేరు ధన్య వీణ. ఈమె 1985 అక్టోబర్ 14న కేరళలోని అలప్పుజలోని హరిపాడ్ సమీపంలోని ముత్తుకులం అనే గ్రామంలో జన్మించారు. చిన్న వయసులోనే శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందింది. 2010లో సంతోష్ మీనన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి సాయి కృష్ణ అనే కుమారుడు ఉన్నాడు. ధన్య పేరును సీబీ మలైల్ నవ్యగా మార్చేశారు. ఆ పేరుతోనే సినిమాల్లో ఈమె పాపులర్ అయింది.

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని టూ వీలర్స్: ధర కూడా చాలా తక్కువ..

ఇది వరకు మనం రూ.2 లక్షల కంటే తక్కువ ధరలో లభించే బైకుల గురించి తెలుసుకున్నాం. రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉండే కార్లను గురించి కూడా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు తక్కువ ధరలో లభించే.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని టూ వీలర్స్ గురించి తెలుసుకుందాం.

భారతదేశంలో పబ్లిక్ రోడ్డుపై ప్రయాణించాలంటే.. తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి తప్పకుండా కొన్ని అర్హతలు ఉండాలి. ఈ అర్హతల కారణంగా కొంతమంది డ్రైవింగ్ లైసెన్స్ పొందలేరు. అలాంటి వారికి ఇక్కడ చెప్పే ద్విచక్ర వాహనాలు తప్పకుండా సూట్ అవుతాయి.

యులు విన్

ప్రస్తుతం బెంగళూరు వంటి నగరాల్లో ఈ యులు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. రూ.59,999 ధర వద్ద లభించే ఈ స్కూటర్.. యులు యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉండే ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 24.9 కిమీ మాత్రమే. తక్కువ వేగం కారణంగానే దీనిని డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఇది ఓకే ఫుల్ ఛార్జితో 68 కిమీ రేంజ్ అందిస్తుంది. కాబట్టి నగర ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. ఇది రిమూవబుల్ బ్యాటరీ కలిగి ఉండటం చేత ఛార్జింగ్ అయిపోయిన తరువాత మార్చుకోవచ్చు.

జెమోపాయ్ మిసో

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని టూ వీలర్ల జాబితాలో ‘జెమోపాయ్ మిసో’ ఒకటి. భారతదేశానికి ప్రధాన నగరాల్లో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది. దీనిని కంపెనీ అధీకృత డీలర్షిప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.44,000 (ఎక్స్ షోరూం, ఢిల్లీ). గంటకు 25 కిమీ వేగంతో ప్రయాణించే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ ఛార్జితో 60 కిమీ నుంచి 75 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ వేగం కూడా తక్కువ కావడం చేత దీనిని కూడా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు.

జెలియో లిటిల్ గ్రేసీ

రూ.49,500 వద్ద అందుబాటులో ఉండే.. జెలియో ఈ మొబిలిటీ ”లిటిల్ గ్రేసీ” డ్రైవింగ్ లైసెన్స్ అవసరం మరో ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఎందుకుని వేరియంట్ను బట్టి ధర కొంత వ్యత్యాసం ఉంటుంది. దీని టాప్ స్పీడ్ 25 కిమీ/గం. ఒక ఫుల్ ఛార్జితో 70 కిమీ నుంచి 75 కిమీ రేంజ్ అందించే ఈ స్కూటర్ ఏకంగా 150 కేజీల బరువును మోయగలదు. డిజైన్ కొత్తగా ఉంది, ఫీచర్స్ రైడర్లకు అనుకూలంగా ఉన్నాయి.

హీరో ఎడ్డీ

మన జాబితాలో చెప్పుకోదగ్గ మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. హీరో ఎడ్డీ. ఓకే ఫుల్ ఛార్జితో 85 కిమీ రేంజ్ అందించే ఈ స్కూటర్ 30 యాంపియర్ బ్యాటరీ కలిగి.. 25 కిమీ/గం వేగంతో ప్రయాణిస్తుంది. దీని ధర రూ.72,000 (ఎక్స్ షోరూమ్). దీనిని రైడ్ చేయడానికి కూడా ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. సింపుల్ డిజైన్ కలిగిన ఈ బైక్.. అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది.

ఒకినావా ఆర్30 & ఒకినావా లైట్

ఒకేసారి ఛార్జ్ చేస్తే 60 కిమీ దూరం ప్రయాణించే ఒకినావా ఆర్30 కూడా డ్రైవింగ్ అవసరం లేని స్కూటర్లలో ఒకటి. రూ.61,998 (ఎక్స్ షోరూం) ధర వద్ద అందుబాటులో ఉండే ఈ స్కూటర్ 1.25 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ పొందుతుంది. గంటకు 25 కిమీ/గం వరకు వేగవంతం అయ్యే ఈ స్కూటర్.. రోజువారీ ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

ఒకినావా కంపెనీకి చెందిన మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ”లైట్”. దీని ఎక్స్ షోరూం ధర రూ.74,999. ఇందులో 1.25 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక ఛార్జితో 60 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 25 కిమీ/గం. దీని కోసం కూడా ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. డిజైన్, ఫీచర్స్ అద్భుతంగా ఉంటాయి.

చాలా బాధ భరించాను!.. సమంతను పొగడ్తలతో ముంచెత్తిన తేజ సజ్జ

0

ఇప్పుడు టాలీవుడ్ సినిమా ప్రపంచంలోనే ‘మిరాయ్‘ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. సెప్టెంబర్ 12 రిలీజ్ కానున్న ఈ సినిమాను ప్రమోట్ చేయడంలో హీరో ‘తేజ సజ్జ‘ బిజీ అయిపోయారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలలో పాల్గొంటూ.. సినిమా గురించి, తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘనటనల గురించి చెబుతున్నాడు. ఇందులో భాగంగానే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంత గురించి మాట్లాడారు.

హనుమాన్ సినిమాతో స్టార్‌డమ్

ఎన్నో సినిమాల్లో బాల నటుడిగా కనిపించి.. ప్రేక్షకులను మెప్పించినప్పటికీ, గత ఏడాది తెరమీదకు వచ్చిన హనుమాన్ సినిమా తేజ సజ్జకు గొప్ప సక్సెస్ ఇచ్చింది. ఈ సినిమా తరువాత బాగా ఫేమస్ అయిన తేజ ఇప్పుడు మిరాయ్ సినిమాలో కనిపిస్తున్నారు. నిజానికి హనుమాన్ సినిమాకంటే ముందు.. ఓ బేబీ, జాంబీ రెడ్డి, ఇష్క్ – నాట్ ఏ లవ్ స్టోరీ, అద్భుతం సినిమాల్లో కనిపించినప్పటికీ.. చెప్పుకోదగ్గ ఫేమ్ దక్కలేదు. హనుమాన్ సినిమాతో ఇతని స్టార్‌డమ్ మారిపోయింది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నటి సమంత గురించి మాట్లాడుతూ.. ఆమెను ప్రశంసించారు. కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. చాలా సినిమాలు చెబుతారు, కానీ బడ్జెట్ సమస్యల వల్ల.. లేదా ఇతర కారణాల వల్ల చివరి నిమిషాల్లో క్యాన్సిల్ అవుతాయి. కొన్ని సినిమాలలో నన్ను ఫైనల్ చేసినప్పటికీ.. వేరేవాళ్లను తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. నన్ను సినిమాలకు ఫైనల్ చేసినప్పుడు.. సినిమా రిలీజ్, వీధుల్లో పోస్టర్లు, నా యాక్టింగ్ అన్నీ ఊహించుకుంటాను. కానీ చివరికి.. సినిమాకు వేరేవాళ్లను ఎంపిక చేసుకున్నాం అని నాకు కాల్ వస్తుంది. అప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను. ఇలా చాలా సార్లు జరిగింది.

చాలా నిరాశకు గురయ్యాను

సుమారు ఏడు లేదా ఎనిమిది సార్లు ఇలాగే జరిగింది. చాలా నిరాశకు గురయ్యాను. ”ఎలా జరగాలని ఉంటే.. ఆలా జరగని” అని గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఒక అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. ఇలా ఉన్నప్పుడు ఒకరోజు ఓ బేబీ అనే కొరియన్ రీమేక్ కోసం నాకు కాల్ వచ్చింది. అందులో క్యారెక్టర్ రోల్ ఒప్పుకున్నాను.

ఓ బేబీ సినిమాలో క్యారెక్టర్ రోల్ ఒప్పుకున్నాను. ఆ సినిమాలో సమంత ఉన్నారని నాకు తెలియదు. నిజంగా సమంత చాలా దయగల వ్యక్తి. దాదాపు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో.. నన్ను ముందుకు నెట్టారు. నేను అందరి దృష్టిని ఆకట్టుకునేలా చేశారు. ఆమె సినిమా అయినప్పటికీ.. నాకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేశారు. అందుకే ఆమె అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం.. అంతే కాకుండా సమంత నాకు మంచి ఫ్రెండ్ కూడా అని తేజ సజ్జ పేర్కొన్నారు.

మిరాయ్ గురించి..

ఇక మిరాయ్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో రితికా నాయక్, శ్రియ, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ అంచనాలను భారీగా పెంచేసింది. మంచు మనోజ్ ప్రతి నాయకుడుగా కొత్తగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రావడానికి సిద్ధమైపోయింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా.. చాలామందిని ఆకట్టుకుంటుందని, తేజ సజ్జ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ యాడ్ అవుతుందని భావిస్తున్నాము.

జీఎస్టీ ఎఫెక్ట్: భారీగా తగ్గిన ధరలు వెల్లడించిన హ్యుందాయ్, టయోటా

కేంద్ర ఆర్ధిక మంత్రి ‘నిర్మలా సీతారామన్‘ జీఎస్టీలో కొత్త స్లాబులను ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త జీఎస్టీ సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి రానుంది. దీంతో భారతదేశంలో చాలా కంపెనీల కార్ల ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఈ విషయాన్ని హ్యుందాయ్, టయోటా వెల్లడించాయి.

జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకు అందిస్తామని కంపెనీలు వెల్లడిస్తున్నాయి. 2025 సెప్టెంబర్ 22 తరువాత కొత్త ధరలు కస్టమర్లకు చాలా ప్రయోజనం చేకూరుస్తాయని చెబుతున్నారు. సెప్టెంబర్ 3న నిర్మలా సీతారామన్ అధ్యక్షత జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తరువాత ప్రజలకు ఈ ప్రయోజనాలు లభించాయి.

చారిత్రాత్మక సంస్కరణ

ఈ చారిత్రాత్మక సంస్కరణ చేసిన భారత ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నామని.. టయోటా సేల్స్ అండ్ సర్వీస్ యూజ్డ్ కార్ బిజినెస్ అండ్ ప్రాఫిట్ ఎన్‌హాన్స్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ వరీందర్ వాధ్వా పేర్కొన్నారు. కేంద్రం ప్రకటించిన జీఎస్టీ 2.0 కార్ల ధరలను తగ్గించడంతో.. ప్రజలకు చేరువవుతాయని, ఆటోమొబైల్ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. పండుగ సీజన్‌కు ముందు.. ధర తగ్గింపు అమ్మకాలను వేగవంతం చేస్తుందని ఆయన అన్నారు.

వికసిత భారత్ లక్ష్య సాధన..

జీఎస్టీ తగ్గించడానికి భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమోఘం, దీనిని మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని.. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఎండీ అన్సూ కిమ్ పేర్కొన్నారు. ఇది ఆటోమోటివ్ పరిశ్రమకు ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా.. వాహనాల అమ్మకాలను గణనీయంగా పెంచుతాయని అన్నారు. ఇది వికసిత భారత్ లక్ష్య సాధనకు కూడా తోడ్పడుతుందని పేర్కొన్నారు. కొత్త ధరలను ఇప్పుడు అధికారికంగా ప్రకటించాము. ఇవి 2025 సెప్టెంబర్ 22 నుంచి అమలులో ఉంటాయని ఆయన అన్నారు.

టయోటా కార్ల ధరలపై తగ్గింపు
➤టయోటా గ్లాంజా: రూ. 85,300
➤టయోటా టైసర్: రూ. 1,11,100
➤టయోటా రూమియన్: రూ. 48,700
➤టయోటా హైరైడర్: రూ. 65,000
➤టయోటా ఇన్నోవా క్రిస్టా: రూ. 1,80,600
➤టయోటా ఇన్నోవా హైక్రాస్: రూ. 1,15,800
➤టయోటా ఫార్చ్యూనర్: రూ. 3,49,000
➤టయోటా లెజెండర్: రూ. 3,34,000
➤టయోటా హైలక్స్: రూ. 2,52,700
➤టయోటా క్యామ్రీ: రూ. 1,01,800
➤టయోటా వెల్‌ఫైర్: రూ. 2,78,000

హ్యుందాయ్ కార్ల ధరలపై తగ్గింపు
➤హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: రూ. 73,808
➤హ్యుందాయ్ ఆరా: రూ. 78,465
➤హ్యుందాయ్ఎక్స్‌టర్: రూ. 89,209
➤హ్యుందాయ్ ఐ20: రూ. 98,053
➤హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్: రూ. 1,08,116
➤హ్యుందాయ్ వెన్యూ: రూ. 1,23,659
➤హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్: రూ. 1,19,390
➤హ్యుందాయ్ వెర్నా: రూ. 60,640
➤హ్యుందాయ్ క్రెటా: రూ. 72,145
➤హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్: రూ. 71,762
➤హ్యుందాయ్ ఆల్కజార్: రూ. 75,379
➤హ్యుందాయ్ టక్సన్: రూ. 2,40,303

టయోటా, హ్యుందాయ్ కంపెనీలు మాత్రమే కాకుండా.. స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ కంపెనీల కార్ల ధరలు కూడా తగ్గుతాయి. కార్లను ధరలు మాత్రమే కాకుండా.. బైక్స్ ధరలు కూడా తగ్గుతాయి. తగ్గినా ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వస్తాయి. ఈ ఏడాది దసరా, దీపావళికి కొత్త వెహికల్స్ కొనుగోలు చేయాలనుకునే వారు కొంత మొత్తంలో డబ్బు ఆదా అవుతుంది, పండుగ సీజన్ సమయంలో కంపెనీల ఆఫర్స్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది.

గమనిక: హ్యుందాయ్, టయోటా కంపెనీలు రెండూ కూడా తమ కార్ల ధరలను తగ్గించాయి. ఈ ధరలకు సంబంధించిన ఖచ్చితమైన విషయాలను తెలుసుకోవడానికి కస్టమర్లు.. బ్రాండ్ యొక్క అధీకృత డీలర్‌షిప్‌లలో తెలుసుకోవడం మంచిది. బహుశా ధరలలో స్వల్ప వ్యత్యాసం ఉండే అవకాశం ఉండొచ్చు.

ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్‌పై డైరెక్టర్ హింట్: బాలయ్యతో పోటీ తప్పదా?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్‘ కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పాపులర్ హీరోయిన్స్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో విడుదలైన సినిమా ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. కాబట్టి వీరి కాంబినేషన్‌లో విడుదలకు సిద్దమవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అంతే కాకుండా నటి శ్రీలీల, రాశీఖన్నా ఇద్దరూ ఈ సినిమాలో నటిస్తుండటం మరో ప్లస్ పాయింట్ అయినట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులను చిత్ర బృందం వేగవంతం చేస్తోంది.

పరోక్షంగా డైరెక్టర్ క్లారిటీ..

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా.. 2025 డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ చిత్ర బృందం మాత్రం దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయడమే తన లక్ష్యం అంటూ.. డైరెక్టర్ హరీష్ శంకర్.. ఓ సందర్భంలో పేర్కొన్నారు. అయితే సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలనే విషయాన్ని నిర్మాతలే చూసుకుంటారని అన్నారు. కాగా ఈ సినిమా.. బహుశా డిసెంబర్‌లోనే రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోందని ఆయన పరోక్షంగా హింట్ ఇచ్చేసారు.

హరీష్ శంకర్ మాటలను బట్టి చూస్తుంటే.. డిసెంబర్‌లోనే ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఈ డేట్ మిస్ అయితే రిలీజ్ ఎప్పుడనే దానిపై చిత్ర బృందమే ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా ఈ సినిమా కోసం రూ. 150 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. కలెక్షన్స్ ఎలా ఉంటాయన్నది.. రిలీజ్ తరువాత తెలుస్తుంది.

ఇక పొతే పవన్ కళ్యాణ్ ‘ఓజీ‘ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. అంతే మరికొన్ని రోజుల్లోనే చిత్ర బృందం సినిమాను రిలీజ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఓజీ సినిమా రిలీజ్ కానున్నట్లు వస్తున్న పుకార్ల కారణంగా.. నటసింహం బాలయ్య నటించిన ‘అఖండ 2‘ రిలీజ్ వాయిదా పడింది. మేకర్స్ ఈ సినిమాను డిసెంబర్ నెలలోనే రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్, బాలయ్య మధ్య పోటీ తప్పదా?

ఉస్తాద్ భగత్ సింగ్ డిసెంబర్ నెలలోనే రిలీజ్ అవుతున్నట్లు వస్తున్న పుకార్ల కారణంగా.. బాలకృష్ణ అఖండ 2.. అప్పుడు కూడా వాయిదా పడుతుందా?, అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇదే నిజమయితే బాలయ్య బాబు, కళ్యాణ్ బాబు సినిమాల మధ్య పోటీ తప్పదేమో అనిపిస్తోంది. ఈ రెండు సినిమాలు పోటీపడుతున్న సమయంలో ప్రభాస్ సినిమా ‘రాజాసాబ్’ రిలీజ్ జనవరి 9కి చేరింది. నిజానికి ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉంది. మొత్తం మీద మంచి కలెక్షన్స్ రాబట్టుకోవడానికి.. సినిమాలు పోటీని అంతగా ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

పండుగ స్పెషల్: ఇండియాలోని బెస్ట్ కార్లు.. రూ.10 లక్షల కంటే తక్కువే

ఇండియన్ మార్కెట్లో లెక్కకు మించిన కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే చాలామంది సరసమైన కార్లను కొనుగోలు చేయడానికే.. ఎక్కువ ఆసక్తి చూపుతారు. కానీ ఏ కారు ఎంచుకోవాలనే విషయంలో కొంత గాబరా పడే అవకాశం ఉంటుంది. అలాంటి ఇబ్బందులకు.. సరైన పరిష్కారం కోసం ఈ కథనం. ఇక్కడ రూ. 10 లక్షల కంటే తక్కువ ధరలో లభించే బెస్ట్ కార్లను గురించి తెలుసుకుందాం.

హ్యుందాయ్ ఎక్స్‌టర్

భారతదేశంలో ప్రస్తుతం అమ్మకానికి ఉన్న అత్యంత సరసమైన కార్ల జాబితాలో హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఎక్స్‌టర్ ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 6 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది మొత్తం 40 వేరియంట్లలో అమ్మకానికి ఉంది. ఇందులో కేవలం నాలుగు వేరియంట్ల ధరలు మాత్రమే రూ. 10 లక్షల కంటే తక్కువ ఉన్నాయి. ఎక్స్‌టర్ కారు.. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి.. 83 హార్స్ పవర్ అందిస్తుంది. ఇది మాన్యువల్, ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను పొందుతుంది.

నిస్సాన్ మాగ్నైట్

దేశీయ మార్కెట్లో నిస్సాన్ కంపెనీకి చెందిన అధిక ప్రజాదరణ పొందిన మోడల్ ఈ మాగ్నైట్. దీని ధర రూ. 6.14 లక్షల (ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభమవుతుంది. మొత్తం 28 వేరియంట్లలో లభించే ఈ కారు.. మంచి డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. మొత్తం 28 వేరియంట్లలో 21 వేరియంట్ల ధరలు రూ. 10 లక్షల కంటే తక్కువ. ఈ కారు 1.0 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. తద్వారా మంచి పనితీరును అందిస్తుంది.

రెనాల్ట్ కిగర్

రూ. 6.30 లక్షల ఎక్స్ – షోరూమ్ వద్ద లభించే ఈ రెనాల్ట్ కిగర్.. మార్కెట్లో ఎక్కువ అమ్ముడవుతున్న కార్ల జాబితాలో ఒకటి. ప్రస్తుతం ఇది ఫేస్‌లిఫ్ట్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఐదు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అందుబాటులో ఉండే ఈ కారు ఆకట్టుకునే డిజైన్ పొందుతుంది. ఇది 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది. తక్కువ ధరలో మంచి ఫీచర్స్ కలిగిన కార్ల జాబితాలో ఇది ఒకటి కావడం గమనార్హం.

టాటా పంచ్

భారతదేశంలోని అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటైన టాటా పంచ్.. ప్రారంభ ధర రూ. 6.20 లక్షలు (ఎక్స్ షోరూమ్). మల్టిపుల్ వేరియంట్లలో లభించే ఈ కారు యొక్క మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ కలిగిన 10 వేరియంట్స్ ధరలు రూ. 10 లక్షల కంటే తక్కువే. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ప్రస్తుతం ఈ కారు ఎలక్ట్రిక్, సీఎన్జీ రూపంలో కూడా అమ్మకానికి ఉంది. అయితే వీటి ధరలు స్టాండర్డ్ మోడల్ ధరల కంటే కొంత ఎక్కువే.

మారుతి ఫ్రాంక్స్

దేశీయ విఫణిలో రూ. 10 లక్షల కంటే తక్కువ ధరలో లభించే కార్ల జాబితాలో.. మారుతి ఫ్రాంక్స్ (రూ. 7.59 లక్షలు – ఎక్స్ షోరూమ్) కూడా ఒకటి. ఇది టయోటా సైరన్ రీబ్యాడ్జ్ మోడల్ అని తెలుస్తోంది. భిన్నమైన వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ కారు టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది సీఎన్జీ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇంజిన్, గేర్‌బాక్స్ ఎంపికలు దాదాపు సైరన్ కారుకు సమానంగా ఉంటుందని తెలుస్తోంది.

భారత్‌లో ఒకేసారి రెండు కార్లు లాంచ్ చేసిన విన్‌ఫాస్ట్: ధర, బుకింగ్స్ & వివరాలు

ఇప్పటికే.. భారతీయ మార్కెట్లో జర్మన్, జపాన్, చైనా బ్రాండ్ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వియాత్నం బ్రాండ్ కార్లు కూడా మార్కెట్లో అడుగుపెట్టేశాయి. వియత్నామీస్ కంపెనీ విన్‌ఫాస్ట్.. ఒకేసారి రెండు ఎలక్ట్రిక్ కార్లను (వీఎఫ్6, వీఎఫ్7) లాంచ్ చేస్తూ, ధరలను ప్రకటించింది. ఈ సరికొత్త కార్ల ధరలు, బుకింగ్స్, డెలివరీ వంటి మరిన్ని వివరాలను ఈ కథనంలో చూసేద్దాం.

విన్‌ఫాస్ట్ వీఎఫ్6 ఎలక్ట్రిక్ కారు

వేరియంట్స్, ధరలు: విన్‌ఫాస్ట్ కంపెనీ తన వీఎఫ్6 కారును మూడు వేరియంట్లలో లాంచ్ చేసింది. అవి ఎర్త్, విండ్, విండ్ ఇన్ఫినిటీ. వీటి ధరలు వరుసగా రూ. 16.49 లక్షలు, రూ. 17.79 లక్షలు, రూ. 18.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). కాగా కంపెనీ ఇప్పటికే ఈ కారు కోసం రూ. 21000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు బహుశా దసరా, దీపావళి సమయంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము.

➤వీఎఫ్6 ఎర్త్: రూ.16.49 లక్షలు
➤వీఎఫ్6 విండ్: రూ. 17.79 లక్షలు
➤విండ్ ఇన్ఫినిటీ: రూ. 18.29 లక్షలు

డిజైన్& ఫీచర్స్: సరికొత్త డిజైన్ కలిగిన ఈ వీఎఫ్6 ఎలక్ట్రిక్ కారు.. ముందు, వెనుక భాగంలో పూర్తి వెడల్పు అంతటా విస్తరించి ఉండే.. ఎల్ఈడీ లైట్స్, డీఆర్ఎల్, బ్రాండ్ లోగో వంటివి కనిపిస్తాయి. వాలుగా ఉండే రూఫ్‌లైన్, 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఇక్కడ గమనించవచ్చు. పరిమాణం పరంగా కూడా ఇది ఉత్తమంగా ఉంటుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ కొత్త వీఎఫ్6 కారు పనోరమిక్ గ్లాస్ రూఫ్, 8వే పవర్ డ్రైవర్ సీటు, క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్స్, 8 స్పీకర్ సౌండ్ సిస్టం, వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటితో పాటు.. ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 ఏడీఏఎస్, ఆటో పార్క్ అసిస్ట్, ఆటోమాటిక్ హెడ్‌లైట్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360 డిగ్రీ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది.

రేంజ్: వీఎఫ్6 ఎలక్ట్రిక్ కారు 59.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఎర్త్ వేరియంట్ 468 కిమీ రేంజ్, విండ్ వేరియంట్ 463 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారు 8.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇవి డీసీ ఫాస్ట్ ఛార్జర్‌లకు మాత్రమే కాకుండా.. 3.3 కేడబ్ల్యు, 7.2 కేడబ్ల్యు ఛార్జర్‌లకు సపోర్ట్ చేస్తుంది.

విన్‌ఫాస్ట్ వీఎఫ్7 ఎలక్ట్రిక్ కారు

వేరియంట్స్, ధరలు: కంపెనీ వీఎఫ్7 కారును ఐదు వేరియంట్లలో లాంచ్ చేసింది. అవి ఎర్త్, విండ్, విండ్ ఇన్ఫినిటీ, స్కై, స్కై ఇన్ఫినిటీ. సంస్థ ఈ కార్ల కోసం కూడా రూ. 21000తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

➤ఎర్త్ ఫ్రంట్ వీల్ డ్రైవ్: రూ. 20.89 లక్షలు
➤విండ్ ఫ్రంట్ వీల్ డ్రైవ్: రూ. 23.49 లక్షలు
➤విండ్ ఇన్ఫినిటీ ఫ్రంట్ వీల్ డ్రైవ్: రూ. 23.99 లక్షలు
➤స్కై ఆల్ వీల్ డ్రైవ్: రూ. 24.99 లక్షలు
➤స్కై ఇన్ఫినిటీ ఆల్ వీల్ డ్రైవ్: రూ. 25.49 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్).

డిజైన్, ఫీచర్స్: కొత్త విన్‌ఫాస్ట్ వీఎఫ్7 ఎలక్ట్రిక్ కారు.. సిగ్నేచర్ ‘వీ పేస్’ ఎల్ఈడీ డీఆర్ఎల్ కలిగి.. దానికి కింది భాగంలో ఎల్ఈడీ హెడ్‌లైట్స్ పొందుతుంది. ఎయిర్ డ్యామ్‌లు బ్రష్డ్ మెటల్ ట్రిమ్స్ కలిగి ఉంటాయి. ఇది ప్రత్యేకమైన ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ పొందటం వల్ల ప్రీమియం రూపాన్ని పొందుతుంది. 19 ఇంచెస్ వీల్స్ కలిగి.. వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ లైట్ పొందుతుంది.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. వీఎఫ్7 కారు 12.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పెద్ద ఫిక్స్‌డ్ గ్లాస్ రూఫ్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు వంటి అధునాతన ఇంటీరియర్ ఫీచర్స్ మాత్రమే కాకుండా.. ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

రేంజ్: ఎంట్రీ లెవల్ మోడల్ 59.6 కిలోవాట్ బ్యాటరీ (431 కిమీ/ఛార్జ్) పొందుతుంది. మిగిలిన అన్ని వేరియంట్స్ ఏసీ, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 70.8 కిలోవాట్ బ్యాటరీ (450 కిమీ/ఛార్జ్) పొందుతాయి. పర్ఫామెన్స్ ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది.