Home Blog Page 138

హెల్మెట్ లేకుంటే.. పెట్రోల్ లేదు: కొత్త రూల్ వచ్చేసింది

0

భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ”నో హెల్మెట్.. నో ఫ్యూయెల్” పేరుతో ఓ కొత్త డ్రైవ్ ప్రారంభించింది. ఇకపై హెల్మెట్ లేకపోతే.. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోయకూడదని.. పెట్రోల్ బంకు యజమాన్యాలను ఆదేశించింది. ఈ డ్రైవ్ ఎన్ని రోజులు ఉంటుంది?, ఇది ప్రారంభించడానికి కారణం ఏమిటి?, అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

నో హెల్మెట్.. నో ఫ్యూయెల్ డ్రైవ్

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నెల రోజులు (2025 సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు) పాటు.. ఈ నో హెల్మెట్.. నో ఫ్యూయెల్ డ్రైవ్ నిర్వహించనుంది. రోడ్డు భద్రతను మెరుగు పరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మోటార్‌సైకిల్ వినియోగదారులకు.. హెల్మెట్స్ అవసరం, భద్రత వంటి వాటిని గురించి ఈ డ్రైవ్ ద్వారా అవగాహన పెంచడం జరుగుతుంది. ఈ ప్రచారం కింద.. హెల్మెట్ ఉన్నవారికి మాత్రమే పెట్రోల్ అందిస్తారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ మేరకు ఈ ప్రకటన చేశారు. రైడర్లలో సరైన రైడింగ్ క్రమశిక్షణ, భద్రతపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం అని అన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడం కూడా ప్రధాన ఉద్దేశ్యం అని ఆయన స్పష్టం చేశారు.

నో హెల్మెట్.. నో ఫ్యూయెల్ గురించి.. యూపీ డిప్యూటీ సీఎం & హెల్త్ మినిష్టర్ బ్రజేష్ పాఠక్ మాట్లాడుతూ, రైడర్లు వేగాన్ని నియంత్రించాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. మీ భద్రత కోసం మాత్రమే కాకుండా.. మీ కుటుంబాల భద్రత కోసమే మా ఆందోళన. మీరు రోడ్డుపై సురక్షితంగా ప్రయాణించేలా చేయడమే రాష్ట్ర ప్రభుత్వం నిబద్దత అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయాధికార్యులు, ఇతర అధికారుల మద్దతు కూడా ఉంది.

రహదారుల మంత్రిత్వ శాఖ నివేదిక

కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లో 2023లో 44,534 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని తెలుస్తోంది. ఇది 2022తో పోలిస్తే (41,746 ప్రమాదాలు) కొంత ఎక్కువే అని స్పష్టమవుతోంది. కాబట్టి రానున్న రోజుల్లో ఈ సంఖ్యను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త ప్రచారం ”నో హెల్మెట్.. నో ఫ్యూయెల్” ప్రారంభించింది. వాహన వినియోదాగారులు తప్పకుండా.. హెల్మెట్ వినియోగాన్ని గురించి.. దాన్ని వల్ల కలిగి ఉపయోగాల గురించి తెలుసుకోవాలి.

హెల్మెట్ ఎందుకంటే?

కొంతమంది బైకు మీద ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించరు. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. స్టైల్ కోసం లేదా.. జుట్టులో చెమట పడుతుందని.. ఇలా చాలానే ఉన్నాయి. కానీ హెల్మెట్ ప్రమాదంలో ప్రాణాలు కాపాడుతుంది. ఈ విషయాన్ని మాత్రం వాహన వినియోదాగారులు పెడచెవిన పెడుతున్నారు. హెల్మెట్ అనేది ప్రయాణం సమయంలో మీ తలకు కొంత భద్రతను ఇస్తుంది. కాబట్టి రోడ్డుపై ప్రయాణించేటప్పుడు తప్పకుండా హెల్మెట్ వేసుకోవడం మర్చిపోకూడదు. మీరు మాత్రమే కాకుండా.. దీని గురించి మీ తోటివారికి కూడా అవగాహన కల్పించాలి. అప్పుడే ప్రభుత్వాల లక్ష్యాలు నెరవేరుతాయి. ప్రభుత్వ లక్ష్యాలు ఎలా ఉన్నాయా.. ప్రమాదాల భారీ నుంచి తప్పించుకోగలుగుతారు.

హ్యుందాయ్ క్రెటా కింగ్ ఎడిషన్స్ వచ్చేశాయ్: ధరలు ఎలా ఉన్నాయంటే?

భారతదేశంలో స్పెషల్ ఎడిషన్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ కంపెనీ క్రెటా కింగ్ మరియు క్రెటా కింగ్ లిమిటెడ్ ఎడిషన్ పేరుతో రెండు కార్లను లాంచ్ చేసింది. క్రెటా కారు ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కొత్త కార్లను కంపెనీ లాంచ్ చేసింది.

ధరలు ఇలా

కొత్త హ్యుందాయ్ క్రెటా కింగ్ ఎడిషన్ ధరలు రూ. 17.89 లక్షల నుంచి రూ. 19.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). కింగ్ లిమిటెడ్ ఎడిషన్ ధర రూ. 19.64 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

క్రెటా కింగ్ ఎడిషన్

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త హ్యుందాయ్ క్రెటా కింగ్ ఎడిషన్ 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, పవర్ డ్రైవర్ సీటు కోసం మెమరీ ఫంక్షన్, ఫ్రంట్ ప్యాసింజర్ సీటు కోసం 8వే పవర్డ్ అడ్జస్ట్‌మెంట్, డ్యూయెల్ జోన్ ఏసీ, స్లయిడింగ్ ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్, కింగ్ ఎంబ్లెమ్ వంటివి పొందుతుంది. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ కారు 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది.

హ్యుందాయ్ క్రెటా కింగ్ కారు నైట్ ఎడిషన్ ట్రీట్‌మెంట్‌ను పొందుతుంది. కాబట్టి ఇది బ్లాక్ అవుట్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్ వంటివి కలిగి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది పెట్రోల్ సీవీటీ, డీజిల్ ఆటోమాటిక్ అనే పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ పొందుతుంది.

క్రెటా కింగ్ లిమిటెడ్ ఎడిషన్

హ్యుందాయ్ క్రెటా కింగ్ లిమిటెడ్ ఎడిషన్.. అనేది కూడా స్పెషన్ ట్రిమ్ వేరియంట్. ఇది సీట్‌బెల్ట్ కవర్, హెడ్‌రెస్ట్ కుషన్స్, కొత్త కార్పెట్ మ్యాప్స్, కీ కవర్ వంటి వాటితో పాటు అడిషినల్ డోర్ క్లాడింగ్ వంటివి పొందుతుంది. ఈ స్పెషల్ ఎడిషన్ 1.5 లీటర్ పెట్రోల్ సీవీటీ, 1.5 లీటర్ డీజిల్ ఆటోమాటిక్ అనే ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, బ్లాక్ మ్యాట్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

భారతదేశంలో ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేస్తున్న కార్ల జాబితాలో.. హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా ఒకటి. దీనిని ఇప్పటి వరకు 12 లక్షల మంది కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఇది స్పెషన్ ఎడిషన్స్ రూపంలో లాంచ్ కావదంతో మరింత మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. అయితే ఇది ఎలాంటి అమ్మకాలు పొందుతుందనే విషయం తెలుసుకోవడానికి ఇంకొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది.

ఇండియన్ మార్కెట్లోని స్పెషల్ ఎడిషన్స్

నిజానికి భారతదేశంలో స్పెషల్ ఎడిషన్స్.. లెక్కకు మించి ఉన్నాయి. ఇందులో హ్యుందాయ్ కంపెనీ కూడా ఒకటి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా, రెనాల్ట్, టయోటా కంపెనీలు కూడా దేశీయ విఫణిలో స్పెషల్ ఎడిషన్ కార్లను లాంచ్ చేశాయి. లగ్జరీ విభాగంలో కూడా స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ అయ్యాయి. కొత్తదనం కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకుని.. వాహన తయారీ సంస్థలు ఈ స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ చేస్తున్నాయన్నమాట.

త‌ల్లి సినిమా రీమేక్ చేస్తున్న జాన్వీ క‌పూర్: ఆశలన్నీ దానిపైనే..

అతిలోక సుందరి శ్రీదేవి గురించి సినీ ప్రపంచానికి పరిచయమే అవసరం లేదు. నాలుగేళ్ల వయసులోనే.. సినిమాలోకి అడుగుపెట్టిన ఈమె.. 13ఏళ్ల నాటికే హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. సుమారు 300 సినిమాలలో నటించిన శ్రీదేవి.. ఎంతమంది అభిమానుల మనసు దోచుకుందో.. ఎన్ని అవార్డులను సొంతం చేసుకుందో చెప్పడం కొంత అసాధ్యమే. అయితే తల్లికి వచ్చిన ఫేమ్.. తనయ (కుమార్తె) ‘జాన్వీ కపూర్‘ కు రావడం లేదు.

జాన్వీ కపూర్ 21 సంవత్సరాలకు హీరోయిన్‌గా సినిమాల్లో కనిపించిది. అప్పటి నుంచి పెద్ద బ్లాక్ బస్టర్స్ అందుకోలేదు. తెలుగు జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన దేవర కూడా అంతంత మాత్రమే అనిపించింది. అయితే ఇటీవల పరమ సుందరి సినిమాలో.. సుందరి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు తన తల్లి నటించిన సినిమానే రీమేక్ చేయనున్నట్లు.. అందులో జాన్వీ కపూర్ కనిపించనున్నట్లు సమాచారం.

చాల్‌బాజ్ సినిమా రీమేక్

నటి శ్రీదేవి నటించిన ‘చాల్‌బాజ్‘ సినిమా గొప్ప హిట్ అందుకుంది. ఆ సినిమానే ఓ ప్రముఖ నిర్మాత రీమేక్ చేయడానికి సిద్ధమైనట్టు సమాచారం. జాన్వీకి చాల్‌బాజ్ కేవలం సినిమా మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ. తన తల్లి నటించిన సినిమాలో జాన్వీ నటించే అవకాశం రావడం గొప్ప విషయం అని కొందరు చెబుతున్నారు. ఈ సినిమాను జాగ్రత్తగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా కొన్ని చర్చలు జరుగుతున్నప్పటికీ.. సెప్టెంబర్ చివరి నాటికి ఓ నిర్ణయం ఫైనల్ అవుతుంది.

ప్రస్తుతం జాన్వీ కపూర్.. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలో కనిపించనుంది. ఇప్పటి వరకు పెద్ద సక్సెస్ చూడని జాన్వికి ఈ సినిమా అయినా హిట్ ఇస్తుందా?, లేదా అనేది.. సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. పెద్ది సినిమా 2026 మార్చి 27న రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. రిలీజ్ తేదీలో ఏదైనా మార్పులు ఉన్నాయా?, లేదా.. అనేది కూడా రానున్న రోజుల్లో తెలుస్తుంది.

జాన్వీ కపూర్ గురించి

శ్రీదేవి.. బోనీ కపూర్ ముద్దుల కూతురు జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న జన్మించారు. ఈమె ముంబైలోని ఏకోల్ మోండియేల్ వరల్డ్ స్కూల్‌లో చదువుకుంది. జాన్వీ సినిమాల్లోకి అడుగుపెట్టడానికి ముందు.. కాలిఫోర్నియాలోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి యాక్టింగ్ కోర్సు నేర్చుకుంది. ఈ కోర్సు పూర్తయిన తరువాత 2018లో శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం ‘ధడక్‘లో మొదటిసారి కనిపించింది. ఆ తరువాత అనేక చిత్రాల్లో నటించిన ఈమె.. మొదటిసారి దేవర చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కనిపించింది. ఇప్పుడు పెద్ది సినిమాలో నటిస్తోంది.

జాన్వీ కపూర్ పొందిన అవార్డులు

సినిమాల్లో తల్లి మాదిరిగానే ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న జాన్వీ కపూర్.. అనేక అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఇందులో.. లోక్‌మత్ స్టైలిష్ అవార్డు, జీ సినీ అవార్డు, పింక్‌విల్లా స్టైల్ ఐకాన్స్ అవార్డు, పింక్‌విల్లా స్క్రీన్ అండ్ స్టైల్ ఐకాన్స్ అవార్డు మొదలైనవి ఉన్నాయి. ఇవి కాకుండా.. ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డు, బాలీవుడ్ హంగామా స్టైల్ అవార్డు మొదలైనవికి నామినేట్ అయింది.

పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం వరకు.. పవన్ కల్యాణ్‌కు ‘పవర్’ బిరుదు ఎవరిచ్చారో తెలుసా?

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటే అభినుల చేయి మేడమీదకు వెళ్తుంది. యువకుల మనసు ఉప్పొంగిపోతుంది. ఇప్పుడు కేవలం ఇదొక పేరు కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ ప్రభంజనం. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొణిదెల పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ అయ్యాడు.. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ ప్రస్థానం గురించి.. ఆయన పుట్టినరోజు సందర్భంగా వివరంగా తెలుసుకుందాం.

ప్రారంభ జీవితం

1971 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో కొణిదెల వెంకటరావు, అంజనాదేవి దంపతులకు పవన్ కళ్యాణ్ జన్మించారు. ఈయన నెల్లూరు, మద్రాస్ మొదలైన ప్రాంతాల్లో చదువుకున్నారు. 1997లో మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనల తరువాత.. ఇషిన్ ర్యూ కరాటే అసోషియేషన్.. ఇతనికి పవర్ అనే బిరుదును ఇచ్చింది. ఈయన కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు.

సినిమా జీవితం

1996లో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా తరువాత వచ్చిన.. గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి వంటి సినిమాలో గొప్ప విజయాలను సాధించాయి. ఆ తరువాత వచ్చిన జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి.

వరుస అపజయాల తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జల్సా.. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. మళ్ళీ ప్లాప్స్ పర్వం మొదలైందా అన్నట్లు.. పులి, తీన్ మార్, పంజా వంటివి బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని పొందాయి. గబ్బర్ సింగ్ సినిమా మంచి హిట్ సాధించింది. అత్తారింటికి దారేది సినిమా.. ఏకంగా మగధీర కలెక్షన్స్ క్రాస్ చేసినట్టు సమాచారం.

విక్టరీ వెంకటేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి నటించిన.. గోపాల గోపాల సినిమా విజయం సాధించింది. సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి సినిమాలు ప్రతికూల విజయాలను అందుకున్నాయి. వకీల్ సాబ్ అంతంత మాత్రమే అనిపించినా.. భీమ్లా నాయక్ పరవాలేదనిపించింది. ఇటీవల విడుదలైన హరిహర వీరమల్లు అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆశలన్నీ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల మీదనే పెట్టుకున్నారు.

రాజకీయ ప్రస్థానం

ప్రజలకు సేవ చేయాలనే గుణం బహుశా.. పవన్ కల్యాణ్‌కు పుట్టుకతోనే వచ్చిందా అనిపిస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో అగ్రగామిగా ఉన్న ఈయన.. అన్నీ వదిలి సాధారణ జీవితం హదుపుతున్నారు. ప్రజలకు సేవ చేయాలనే పార్టీ పెట్టారు, పట్టుదలతో ప్రజలకు చేరువై.. జనసేన పార్టీని నిలబెట్టారు. డిప్యూటీ సీఎం పదవిని చేపట్టారు.

సినిమాల్లో ఉండేటప్పుడు జీవితం సాఫీగా సాగిపోయింది. కానీ ప్రజలకు సేవ చేయాలని ఎప్పుడైతే పార్టీ పెట్టారో.. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నో విమర్శలకు, అవమానాలకు గురయ్యారు. అవన్నీ తట్టుకుని.. ప్రత్యర్థులకు అడ్డుగా నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ ధీరత్వాన్ని చూసి.. జన సైనికులు, వీర మహిళలు సైతం ఆయనకు అండగా నిలిచారు. ఈ రోజుకి కూడా పవన్ కల్యాణ్‌ను అభినించేవారి సంఖ్య ఎక్కువగా ఉందంటే కారణం, ఆయన మంచితనం.. ఉదార స్వభావమే అని తెలుస్తోంది.

భార్య కోసం ఒకటి.. తన కోసం ఇంకొకటి: రూ.12.25 కోట్ల కారు కొన్నాడు

0

ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లను విక్రయించే.. రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కార్లను ఎవరు మాత్రం కొనాలని అనుకోరు. అయితే ధర ఎక్కువ కావడంతో చాలామంది.. ఈ కార్లను కొనుగోలు చేయడానికి సిద్దపడరు. అయితే కేవలం 33 ఏళ్ల వయసులోనే.. ఏకంగా రూ. 12 కోట్ల ఖరీదైన కారును కొనుగోలు చేసిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఇంతకీ అయన ఎవరు? అయన కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ మోడల్ ఏది?, అనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ చూసేద్దాం.

రూ.12.25 కోట్ల కారు

బీసీసీ గ్రూప్ ఇంటర్నేషనల్ కంపెనీ సీఈఓ అమ్జద్ సితార.. ”రోల్స్ రాయిస్ కల్లినన్ సిరీస్ II బ్లాక్ బ్యాడ్జ్” కొనుగోలు చేసిన అతి చిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ కారు ధర రూ. 12.25 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఈ కారును వీరు దుబాయ్‌లో డెలివరీ తీసుకున్నారు. ఈ కారుని డెలివరీ తీసుకున్న వీడియో.. ఫోటోలను అమ్జద్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు.

అమ్జద్ సితార.. రోల్స్ రాయిస్ కల్లినన్ కారును డెలివరీ తీసుకోవడానికి తన భార్య, కూతురితో కలిసి.. మెర్సిడెస్ బెంజ్ జీ వ్యాగన్, వీ క్లాస్, రోల్స్ రాయిస్ కార్ల కాన్వాయ్‌లో వెళ్లారు. కారును డెలివరీ తీసుకోవడానికి ముందు.. డాక్యుమెంట్ వర్క్స్ అన్నీ పూర్తి చేసి, కారును డెలివరీ తీసుకున్నారు. ఆ తరువాత ఆ కారులోనే కూర్చుని వెళ్ళిపోతారు.

పూర్తి నలుపు రంగులో ఉన్న రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్.. ఆరంజ్ కలర్ ఇంటీరియర్ పొందుతుంది. కంపెనీ కస్టమర్ల అభిరుచికి తగిన విధంగా కస్టమైజ్ కూడా చేసి ఇస్తుంది. అయితే దీనికోసం మరింత డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. బహుశా అమ్జద్ కూడా కస్టమైజ్ చేయించుకున్నాడేమో అనిపిస్తుంది. ఈ కారణంగానే దీని ధర రూ. 12 కోట్ల కంటే ఎక్కువైందని తెలుస్తోంది. సాధారణ రోల్స్ రాయిస్ కార్లతో పోలిస్తే.. బ్లాక్ బ్యాడ్జ్ ధర సుమారు రూ. 2.5 కోట్లు ఎక్కువ.

రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్.. రెగ్యులర్ కల్లినన్ కంటే శక్తివంతమైనది. ఇందులో 6.75 లీటర్స్ ట్విన్ టర్బోఛార్జ్డ్ వీ12 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 600 పీఎస్ పవర్, 900 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్, టార్క్ అనేవి.. రెగ్యులర్ వెర్షన్ కంటే కొంత ఎక్కువే. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ పొందుతుంది.

భార్య కోసం మరో రోల్స్ రాయిస్

కొత్త రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ అనేది అమ్జద్ సితార మొదటి రోల్స్ రాయిస్ కారు కాదు. ఎందుకంటే ఈయన బ్లాక్ బ్యాడ్ కారును డెలివరీ చేసుకోవడానికి కూడా.. ఓ రోల్స్ రాయిస్ వ్రైత్ కారులో వచ్చాడు. దీనిని ఇతడు తన భార్య (మార్జానా అమ్జద్) పుట్టినరోజు సందర్భంగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈమె అమ్జద కంపెనీలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. కాగా వీరికి ఒక పాప కూడా ఉంది.

అమ్జద్ సితార కార్లు

బిజినెస్ మ్యాన్ అమ్జద్ సితారా.. వద్ద రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్, రోల్స్ రాయిస్ వ్రైత్ కార్లు మాత్రమే కాకుండా, రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ జీ క్లాస్, మేబ్యాచ్, బీఎండబ్ల్యూ 7 సిరీస్, డాడ్జ్ చార్టర్ వంటి కార్లు ఉన్నాయి. సుజుకి హయబుసా బైక్ కూడా వీరి వద్ద ఉన్నట్లు సమాచారం.

నారా లోకేష్‌కు అరుదైన గౌరవం: నరేంద్ర మోదీ తరువాత..

ఆంధ్రప్రదేశ్.. కూటమి సర్కార్ సారథ్యంలో అభివృద్ధి మార్గం వైపు నడుస్తోంది. ఒకవైపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమదైన రీతిలో పరిపాలన చేస్తుంటే.. ఐటీ మినిస్టర్ ‘నారా లోకేష్’ కూడా కేంద్రమంత్రులను కలుసుకోవడం.. ప్రజల క్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కావాల్సిన ఏర్పాట్లు చేయాలనీ, కావలసిన నిధులను విడుదల చేసి.. రాష్ట్రాభివృద్ధిలో మాకు తోడుగా ఉండాలని చెబుతున్నారు. ప్రజాపాలనలో పాలు పంచుకుంటున్న నారా లోకేష్‌ను తాజాగా ఓ అరుదైన గౌరవం దక్కింది.

ఆస్ట్రేలియా నుంచి ఆహ్వానం

విద్యారంగంలో కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టి.. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ ప్రారంభించిన హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ (హెచ్ఆర్డీ) అండ్ ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) మంత్రి నారా లోకేష్.. ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ‘స్పెషల్ విజిట్ ప్రోగ్రామ్’ (SVP)లో పాల్గొనడానికి ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని ఆస్ట్రేలియన్ హైకమీషన్ ఫిలిప్ గ్రీన్.. మంత్రికి ఆహ్వాన లేఖను అధికారికంగా పంపించారు.

ఆంధ్రప్రదేశ్.. మానవ వనరులు, టెక్నాలజీ & ఆర్థిక రంగాలలో అభివృద్ధి సాధిస్తోందని.. దీనిని ఆస్ట్రేలియా ప్రభుత్వం అభినందిస్తూ.. అక్కడి జరగబోయే ఓ కార్యక్రమానికి లోకేష్ హాజరు కావాలని కోరింది. ఆస్ట్రేలియాలో జరిగే ఈ కార్యక్రమానికి గత 20 సంవత్సరాలుగా.. అనేకమంది భారతదేశంలోని రాజకీయ నాయకులు హాజరయ్యారు. 2001లో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఆస్ట్రేలియాలో జరగనున్న ఈ కార్యక్రమానికి.. ప్రపంచంలోని చాలామంది రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలు, విద్యా నిపుణులు హాజరవుతారు. కాబట్టి నారా లోకేష్ వీరందరిని కలుసుకోవడానికి సాధ్యమవుతుంది. ఈ పర్యటన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు.. ఇతర మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన చర్చలు కూడా సులభతరం అవుతాయని తెలుస్తోంది.

ఇప్పటికే లోకేష్ పాల్గొన్న విదేశీ కార్యక్రమాలు

నిజానికి నారా లోకేష్ ఇప్పటికే చాలా విదేశీ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. 2018లో చైనాలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోని ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ కార్యక్రమంలో భారత ప్రతినిధిగా ఆహ్వానం పొందారు. 2024 అక్టోబర్ 25 నుంచి.. సుమారు ఒక వారం రోజులు అమెరికాలో పర్యటించి.. మైక్రోసాఫ్ట్, టెస్లా, అమెజాన్, యాపిల్, గూగుల్ మొదలైన కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. 2025 జనవరిలో డావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సంస్థల సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియాలో జరగబోయే కార్యక్రమానికి హాజరవుతారు.

నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం ఇలా..

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ (ఎంబీఏ) పూర్తి చేసిన నారా లోకేష్.. 2009 తరువాత తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నారు. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వ్యూహాలను రూపొందించి.. యువతను ఆకట్టుకున్న ఈయన 2013లో పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయ కర్తగా బాధ్యతలు స్వీకరించారు. 2017లో ఎంఎల్సీగా నియమితులయ్యారు. అదే ఏడాదిలో ఏపీ ఐటీ మంత్రిగా కేకల బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో ఓటమిపాలైనప్పటికీ.. 2024 ఎన్నికల్లో అదే నియోజకవర్గంలో గెలుపొందారు. ప్రస్తుతం మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించి.. రాష్ట్రాభివృద్ధికి తనదైన రీతిలో కృషి చేస్తూనే ముందుకు సాగుతున్నారు.

2025లో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్ – ఇదిగో జాబితా..

సౌత్ ఇండియా సినీ పరిశ్రమ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఏడాదికి వందలాది సినిమాలను రిలీజ్ చేస్తూ.. కొత్త హీరోలను, హీరోయిన్లను పరిచయం చేస్తోంది. అయితే చాలామంది మదిలో మెదిలే ఓ ప్రశ్న.. 2025లో దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎక్కువ పారితోషికం తీసుకున్న నటి ఎవరు?, తరువాత జాబితాలో ఎవరున్నారు అనే. ఆ ప్రశ్నకు సమాధానమే ఈ కథనం..

మొదటి స్థానంలో..

సౌత్ ఇండియా సినిమా ప్రపంచంలో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్స్ జాబితాలో ‘సాయి పల్లవి‘ అగ్రస్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది. నాగ చైతన్యతో నటించిన తండేల్ సినిమాకు ఈమె రూ. 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. నిజానికి సాయి పల్లవి ఒక్కో సినిమాకు రూ. 3కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు చెబుతారు. అయితే ఇది ఎంతవరకు నిజమనేది ఖచ్చితంగా చెప్పలేము. కాగా రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న.. నితేశ్ కుమార్ రామాయణ త్రయం (మూడు సినిమాలు) కోసం ఒక్కో సినిమాకు రూ. 6 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

రెండో స్థానంలో..

ఇక రెండో స్థానంలో నేషనల్ క్రష్, పుష్ప నటి రష్మిక మందన్న ఉన్నారు. ఈమె పుష్ప 2 సినిమాకు పారితోషికంగా రూ. 10 కోట్లు తీసుకున్నట్లు టాక్. చావా సినిమాకు రూ. 4కోట్లు, సల్మాన్ ఖాన్ సికిందర్ సినిమాకు రూ. 12 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈమె ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్లు చెబుతారు.

మూడో స్థానంలో..

మన జాబితాలో మూడో స్థానంలో.. నయనతార ఉన్నట్లు సమాచారం. భారతదేశంలో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్లలో.. నయనతార కూడా ఉన్నారు. 2018లో ఫోర్బ్స్ ఇండియా ‘సెలబ్రిటీ 100’ జాబితాలో ఈమె కూడా చోటు దక్కించుకుంది. నయనతార ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల నుంచి రూ. 12 కోట్లు పారితోషికంగా తీసుకుంటుందని సమాచారం.

నాలుగో స్థానంలో..

దక్షిణాది హీరోయిన్లలో చెప్పుకోదగ్గ వ్యక్తి త్రిష. తరగని అందంతో.. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ అమ్మడు తెలుగు, తమిళం సినిమాల్లో నటిస్తుంది. ఈమె కూడా ఎక్కువ పారితోషికం తీసుకునే కథానాయకిల జాబితాలో ఒకరుగా ఉన్నారు. త్రిష ఒక్కో సినిమాకు.. రూ. 10 కోట్ల నుంచి రూ. 12 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా విశ్వంభర సినిమా కోసం ఈమె రూ. 12 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్.

ఐదో స్థానంలో..

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ పేరును సొంతం చేసుకున్న స్వీటీ (అనుష్క శెట్టి).. కూడా ఎక్కువ పారితోషికం తీసుకునే వారిలో ఐదో స్థానంలో ఉంది. అనుష్క శెట్టి ఒక్కో సినిమాకు.. రూ. 5 కోట్ల నుంచి రూ. 7 కోట్లు పారితోషికం తీసుకుంటుందని చెబుతారు.

ఆరో స్థానంలో..

ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ల జాబితాలో మిల్కి బ్యూటీ తమన్నా కూడా ఉన్నారు. కేవలం సినిమాల్లో నటించడమే కాకుండా.. స్పెషల్ సాంగ్‌లలో కూడా కనిపించే ఈమె ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్లు పారితోషికంగా తీసుకుంటుంది. ఈమె సంతోషం ఫిల్మ్ అవార్డులు, రెండు సైమా అవార్డులు, కలైమామణి అవార్డు వంటి అనేక అవార్డులను సొంతం చేసుకుంది.

మొదటి సినిమాకే సైమా అవార్డు: మిరాయ్ నటి ‘రితికా నాయక్’ గురించి తెలుసా?

హను మాన్ సినిమా భారీ విజయం సాధించిన తరువాత.. ‘తేజ సజ్జ‘ మిరాయ్ సినిమాలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినీ ప్రపంచంలో అంచనాలను అమాంతం పెంచేసింది. చాలామంది ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ‘రితికా నాయక్‘ గురించి తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపుతున్నారు. ఇంతకీ ఈమె ఎవరు?, ఈమె బ్యాగ్రౌండ్ ఏమిటి? వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో చూసేద్దాం..

ఎవరీ రితికా నాయక్

దేశ రాజధాని ఢిల్లీలో పుట్టిన ‘రితికా నాయక్’.. ఒరియా కుటుంబానికి చెందిన యువతి. ‘శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాలేజ్ ఫర్ ఉమెన్స్’ చదువుకున్న ఈమె 2019లో ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ పేస్ సీజన్ 12లో గెలిజిన తరువాత మోడలింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం రితికా మిరాయ్ సినిమాలో నటిస్తున్నప్పటికీ.. ఇదే ఆమె మొదటి సినిమా కాదు. ఎందుకంటే 2022లో విడుదలైన అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమాకే సైమా అవార్డును కూడా సొంతం చేసుకుంది.

అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా తరువాత హాయ్ నాన్న సినిమాలో కూడా కనిపించింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మిరాయ్ సినిమాలో కనిపిస్తోంది. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో క్రేజీ డిమాండ్ పెంచుకున్న ఈమె.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా.. సినిమాకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ.. అభిమానులకు దగ్గరవుతోంది.

మిరాయ్ సినిమా గురించి

ఇప్పటికే విడుదలైన మిరాయ్ సినిమా ట్రైలర్ చాలామందిని ఆకట్టుకుంది. ఈ సినిమాలో తేజ సజ్జ కథానాయకుడుగా కనిపిస్తున్నాడు. మంచి మనోజు ప్రతినాయకుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. నటి శ్రియ, జగపతిబాబు మొదలైన సీనియర్ నటులు కూడా ఈ సినిమాలో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో రితికా నాయక్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

పురాతన కాలానికి సంబంధించిన గ్రంధాలను, ఆయుధాన్ని సాధించే నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వేరే లెవెల్‌లో ఉండబోతోందని ట్రైలర్ చెప్పేస్తోంది. మంచు పర్వతాల్లో ప్రయాణం.. పెద్ద పక్షిని ఎదుర్కోవడం.. మంచు మనోజ్‌తో ఫైట్స్ వనీటివన్నీ చాలా అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా గొప్ప హిట్ సాధిస్తుందని సినీ ప్రముఖులు, విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే జరిగితే యువ నటుడు తేజ సజ్జ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ యాడ్ అయినట్లే. ఈ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ అవుతుంది.

మిరాయ్ సినిమా కోసం రూ. 60 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ సినిమా కోసం రూ. 40 కోట్ల బడ్జెట్ అనుకున్నప్పటికీ.. అది రూ. 60కోట్లకు చేరిందని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడలేదు. అంతే కాకుండా ఈ చిత్రంలో నటించిన నటీ నటులకు ఎంత ఎమ్యూనరేషన్ ఇచ్చారనే విషయాలు కూడా గోప్యంగా ఉంచారు. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ చేస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ కంపెనీ దీనిని నిర్మిస్తోంది. మొత్తం మీద తేజ సజ్జ రెండో సినిమా తెరమీదకు వచ్చేస్తోంది. సినిమా విడుదలైన తరువాత ఎలాంటి విజయం సాధిస్తుందో తెలుసుకోవడానికి కొంతకాలం వేచి చూడాల్సిందే..

ఏడేళ్ల తరువాత చైనాలో అడుగుపెట్టిన మోదీ.. జపాన్ పర్యటన హైలెట్స్ ఇవే!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 50 శాతం సుంకాలను ప్రకటించిన సంగతి అందరికి తెలుసు. మిత్ర దేశంగా ఉన్న యూఎస్ఏ.. ప్రస్తుతం ఇండియాపై ప్రతీకార సుంకాలను విధించి చోద్యం చూస్తోంది. ఈ తరుణంలో భారత్ ఏ మాత్రం తలదించకుండా.. అమెరికాకు గట్టి సమాధానం ఇస్తోంది. జపాన్, చైనా దేశాలతో సత్సంబంధాలను కలుపుకోవడానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కదిలి వెళ్లారు.

మోదీ జపాన్ పర్యటన

అమెరికా ప్రతీకార సుంకాలను ప్రవేశపెట్టిన తరువాత.. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2025 ఆగస్టు 29, 30వ తేదీలలో జపాన్ పర్యటన చేశారు. రెండు రోజుల ఈ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ సమయంలో మోదీ.. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాకు ప్రత్యేకమైన రాతితో తయారు చేసిన బౌల్ గిఫ్ట్ ఇచ్చారు. చిన్న బౌల్ మాత్రమే కాకుండా నాలుగు చిన్న బౌల్స్.. జపాన్ సంప్రదాయంతో తినడానికి ఉపయోగించే రెండు చిన్న స్టిక్స్ ఉన్నాయి. ఈ స్టిక్స్ చివర వెండి కవచం ఉంది.

జపాన్ ప్రధాని భార్య ‘యోషికో ఇషిబా‘కు కాశ్మిరీ శాలువను బహూకరించారు. నాణ్యమైన ఉన్నితో తయారు చేసిన ఈ శాలువాను ఒకప్పుడు కాశ్మీరీ రాజులూ చాలా ఇష్టంగా ఉపయోగించేవారు. దీనిని కాశ్మిరీలు ప్రత్యేకంగా రూపొందించారు. తెల్లని అంచు కలిగిన ఈ శాలువా గులాబీ.. ఎరుపు రంగులతో చాలా సుందరంగా ఉంది.

నరేంద్ర మోదీ 2014లో ప్రధానమంత్రి పదవిని స్వీకరించిన తరువాత.. జపాన్ సందర్శించడం ఇది ఎనిమిదోసారి కావడం గమనార్హం. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలనే ఉద్దేశ్యంతోనే మోదీ.. ప్రపంచంలోని చాలా దేశాలను చుట్టి వస్తుంటారు. ఈ సారి పర్యటన మాత్రం.. చాలా ప్రత్యేకం అని నిపుణులు చెబుతున్నారు.

చైనా పర్యటనలో మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ పర్యటనను ముగించుకుని.. చైనా పర్యటనలో ఉన్నారు. ఆగస్టు 30న తియాంజిన్‌కు చేరుకున్న మోదీ.. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న అక్కడ జరిగే శిఖరాగ్ర సమావేశాలకు హాజరుకానున్నారు. సుమారు ఏడేళ్ల తరువాత మోదీ చైనాలో కాలుపెట్టారు. చైనా పర్యటన.. భారత ఆర్ధిక వృద్ధికి దోహదపడుతుందని పలువురు ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు.

ఊహకందని రీతిలో జీడీపీ వృద్ధి

2026 ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ జీడీపీ ఊహకందని రీతిలో ఏకంగా 7.8 శాతానికి ఎగబాకింది. ఇది దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం. భారత ఆర్ధిక వ్యవస్థ నిర్జీవమైపోయింది అని.. మన దేశాన్ని కించపరిచిన ‘డొనాల్డ్ ట్రంప్’కు ఇది సరైన సమాధానం అని నిపుణులు చెబుతున్నారు.

2047 వికసిత భారత్ లక్ష్యంగా మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే అనేక ఆర్ధిక సంస్కరణలు చేస్తున్నారు. పరిశ్రమలకు కూడా చేయూతనిస్తున్నారు. ఇటీవల వెల్లడైన జీడీపీ.. అంతకుముందు జీడీపీ కంటే చాలా ఎక్కువ అని తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే.. అనుకున్న సమయానికి వికసిత భారత్ తప్పకుండా సాధ్యమవుతుంది. దేశ ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి వ్యవసాయ పరిశ్రమ, ఆటోమొబైల్ పరిశ్రమలు చాలా దోహదపడ్డాయని తెలుస్తోంది.

ఈయనే లేకుంటే.. గణేష్ ఉత్సవాలు ఉండేవా?: ఆ ఒక్క ఆలోచనే నేడిలా..

ప్రస్తుతం భారతదేశంలో గణేష్ చతుర్థి వేడుకలు.. అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏ వీధిలో చూసినా.. ఏ వాడాలో చూసిన చిన్న, పెద్ద వినాయక విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. ప్రజలందరూ కలసి.. కులమత బేధాలు లేకుండా, ఈ పండుగను గొప్పగా జరుపుకుంటున్నారు. అయితే ఒకప్పుడు ఇళ్లలోనే జరుపుకునే గణేష్ పూజలు.. వీధుల్లోకి ఎలా వచ్చాయి?, ఇది బ్రిటీష్ వారిలో ఎందుకు భయం పుట్టించిందనే ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

తిలక్ ఆలోచన & నిమజ్జనం వేడుకలు

భారత స్వాతంత్య్ర సమరం సమయంలో ప్రజలందరినీ ఏకం చేయాలని బాల గంగాధర్ తిలక్ ఆలోచిస్తూ ఉండేవారు. అప్పట్లో మహారాష్ట్రలోని పీష్వాలు.. వినాయకునికి ఇళ్లలోనే పూజలు చేసేవారు. ఈ వేడుకలను బయట ఎందుకు చేయకూడదు అని అలోచించి, గణేష్ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఇలా ఇళ్లలో జరిగే పండుగ వీధిలోకి వచ్చింది.

గణేష్ ఉత్సవాల సమయంలో భారతీయులంతా ఏకమై.. రోడ్ల మీదకు వచ్చి పండుగ చేసుకున్నారు. పది రోజుల తరువాత వినాయక నిమజ్జనం వంటివి కూడా తిలక్ మొదలుపెట్టింది కావడం గమనార్హం. అప్పుడు మొదలైన సంబరాలు.. కాలక్రమంలో మరింత ఊపందుకున్నాయి.

బ్రిటీష్ వారిలో పుట్టిన భయం

బాల గంగాధర్ తిలక్.. గణేష్ ఉత్సవాలను ప్రారంభించినప్పుడు చాలా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో కొంతమంది స్వాతంత్య్ర సమరయోధులు మద్దతు లభించడంతో.. తిలక్ ముందుకు సాగిపోయారు. గణేష్ ఉత్సవాల పేరుతో.. ప్రజలంతా ఒక్క చోటుకు చేరారు. ఇది బ్రిటీష్ వారిలో ఒకింత భయం పుట్టించింది. ఇదే ఆ తరువాత ఉద్యమానికి పురుడు పోసింది.

గణేష్ ఉత్సవాల సమయంలో ప్రజలంతా గుమిగూడి.. బ్రిటీష్ వారికి వ్యతిరేఖంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ప్రజలందరినీ ఏకంగా చేయడానికి మాత్రమే కాకుండా.. భారత స్వాతంత్య్ర సమరానికి ఒక బీజం పడేలా చేసింది. తిలక్ కంటే ముందు.. శివాజీ మహారాజ్ కూడా గణేష్ ఉత్సవాలు చేసినట్లు చరిత్ర చెబుతోంది.

ప్రస్తుతం గణేష్ ఉత్సవాలు

ఇప్పుడు కూడా భారతదేశంలో గణేష్ ఉత్సవాలు చాలా గొప్పగా నిర్వహిస్తారు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా.. ప్రధానంగా యువకులు ఇందులో భాగస్వాములై ఉత్సవాలను నిర్విఘ్నంగా జరుపుకుంటారు. చిత్ర, విచిత్రమైన వినాయక ప్రతిమలకు ప్రతి రోజూ పూజలు చేసి ఆనందపడిపోతుంటారు. ఇక నిమజ్జనం వేడుకలైతే అంబరాన్ని అంటుతాయనే చెప్పాలి.

ముంబై, హైదరాబాద్ నగరాల్లో వినాయక చవితి ఉత్సవాలు మరింత ప్రత్యేకంగా ఉంటాయి. ఈసారి (2025) హైదరాబాద్‌లోని ఖైతారాబాద్ వినాయకుడు విశ్వశాంతి మహాగణపతి పేరుతో 69 అడుగుల మూర్తి కొలువై ఉన్నాడు. ఈ గణేష్ విగ్రహాన్ని సెప్టెంబర్ 6న నిమజ్జనం చేయనున్నట్లు ఉత్సవ కమిటీ వెల్లడించింది. ఈ గణనాధుణ్ని దర్శించుకోవడానికి ప్రతి వేలాదిమంది భక్తులు తరలి వస్తూ ఉంటారు.

నేడు గణేష్ ఉత్సవాలు అంటే భక్తి మాత్రమే కాదు, యూనిటీ కూడా. ఏ పండుగ ఎలా ఉన్నా.. వినాయక చవితి మాత్రం అందరిని కలుపుతుంది. ఇది అందరిలో ఐక్యతను పెంచే పండుగ అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. మొత్తం మీద గణేష్ ఉత్సవాలు అలా వచ్చాయన్న మాట..