Home Blog Page 139

ఇది డల్‌గా ఉండే మూమెంట్ కాదు.. చిన్న పిల్లలా చిందులేసిన సమంత

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీల జాబితాలో నటి ‘సమంత‘ కూడా ఒకరు. ఆరోగ్యానికి సంబంధించిన లేదా ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు తాజాగా తాను పికిల్‌బాల్ అడుగుతున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఒక ఇండోర్ స్టేడియంలో సమంత పికిల్‌బాల్ గేమ్ అడుగుతూ.. చాలా ఉత్సాహంగా ఉంది. ఈ ఆటలో గెలుపొందిన తరువాత చిన్న పిల్లలా గెంతుతూ వెళ్తుంది. నటి సమంత చాలా సంతోషంగా ఉండటం ఆ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో షేర్ చేస్తూ.. ”పికిల్‌బాల్ ఆడుతున్నప్పుడు డల్‌గా ఉండకండి” అని సమంత వెల్లడించింది. ప్రస్తుతం ఆ వీడియో చాలామంది నెటిజన్లను ఆకట్టుకుంది. సమంత ఆనందంగా ఉండటం చూసి.. అభిమానులు కూడా సంబరపడిపోతున్నారు. చివర్లో డ్యాన్స్ మాత్రం చాలా క్యూట్ మేడం అని ఒకరు కామెంట్ చేస్తే.. మై సూపర్ ఛాంపియన్ సమంత అని ఇంకొకరు అన్నారు.

పికిల్‌బాల్ గేమ్ గురించి

చాలామందికి పికిల్‌బాల్ గేమ్ గురించి తెలుసుండకపోవచ్చు. ఇది సమంత ఫేవరెట్ గేమ్ కూడా. దీనికి ఇండియాలో పెద్దగా ఆదరణ లేదు. కానీ అమెరికాలో పికిల్‌బాల్ ఆడేవాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది.

పికిల్‌బాల్ గేమ్ విషయానికి వస్తే.. ఇది టేబుల్ టెన్నిస్, బ్యాట్మింటన్ మాదిరిగానే ఉంటుంది. తూట్లు పడిన ఒక బాల్‌ను చిన్న బ్యాట్‌తో కొడతారు. ఈ ఆటను ఇండోర్ లేదా అవుట్‌డోర్‌లలో ఎక్కడైనా ఆడుకోవచ్చు. సింగిల్స్‌లో ఇద్దరు, డబుల్స్‌లో నలుగురు ఆడతారు. ఈ గేమ్​కు ప్రపంచంలోని చాలా దేశాల్లో పెద్ద టోర్నీలు జరుగుతున్నాయి.

ఆటకు పికిల్‌బాల్ అనే వచ్చింది

నిజానికి పికిల్‌బాల్ అనే పేరు ఎందుకు వచ్చిందో చెప్పడానికి కొన్ని వాదనలు వినిపిస్తుంటాయి. అమెరికాకు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ తన కుటుంబంతో కలిసి ఈ గేమ్ ఆడారట, ఈ ఆట గురించి ఆయన భార్య జోన్, ఒక సందర్భంలో మాట్లాడుతూ.. రోయింగ్‌లో పికిల్‌బాల్ ఎలా ఉంటుందో.. ఆట కూడా ఆలా ఉంటుందని అన్నారు. ఈ కారణంగానే ఆటకు పికిల్‌బాల్ అని పేరొచ్చిందని చెబుతారు.

ప్రిట్చర్డ్ అనే వ్యక్తికి పికిల్స్ అనే పేరు కలిగిన పెంపుడు శునకం ఉండేది. తన యజమాని ఆట ఆడుకుంటున్నప్పుడు, బాల్ అందిస్తూ ఉండేది. ఈ శునకం పేరునే.. ఆ తరువాత పికిల్‌బాల్ ఆటకు పెట్టినట్లు కొందరు చెబుతారు. అయితే ఈ ఆటకు ఈ పేరు ఎలా వచ్చిందనే విషయం మీద మాత్రం ఎలాంటి ఖచ్చితమైన క్లారిటీ లేదు.

సమంత ఫిట్‌నెస్ గురించి

ప్రముఖ నటి సమంత గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే పాపులర్ సెలబ్రిటీలలో ఒకరైన ఈమె ఎప్పుడూ ఆరోగ్యం మీద శ్రద్ద తీసుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగానే ప్రతి రోజూ వ్యాయాయం వంటివి.. క్రమం తప్పకుండా చేస్తుంటారు. సరైన డైట్ పాటిస్తూ.. ఎప్పుడూ ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకునే సమంత.. అప్పుడప్పుడు తనకు ఇష్టమైన పికిల్‌బాల్ గేమ్ కూడా ఆడుతుంటారు. నిజానికి పికిల్‌బాల్ గేమ్ ఒకటి ఉందని.. సమంత వల్లనే చాలామందికి తెలిసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

వచ్చే నెల(సెప్టెంబర్‌)లో లాంచ్ అయ్యే కొత్త బైకులు: ఇదిగో లిస్ట్!

2025 ఆగస్టు నెల దాదాపు ముగిసింది. ఈ నెలలో టీవీఎస్ ఆర్బిటర్, రైడర్ స్పెషల్ ఎడిషన్, హీరో గ్లామర్ ఎక్స్, కవాసకి కేఎల్ఎక్స్230, కొత్త యెజ్డీ రోడ్‌స్టర్, కేటీఎమ్ 160 డ్యూక్ మొదలైన బైకులు దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. కాగా వచ్చే నెలలో (2025 సెప్టెంబర్) కూడా కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తులను భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధమయ్యాయి. ఇంతకీ లాంచ్ కావడానికి సిద్దమవుతున్న బైకులు ఏవి?, వాటి ధరలు ఎలా ఉండనున్నాయి?, అనే వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

టీవీఎస్ ఎన్‌టార్క్ 150

ప్రస్తుతం భారతదేశంలో 125 సీసీ టీవీఎస్ ఎన్‌టార్క్ మంచి అమ్మకాలను పొందుతోంది. అయితే కంపెనీ ఇప్పుడు దీనిని 150 సీసీ విభాగంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. ఇది స్టాండర్డ్ ఎన్‌టార్క్ కంటే కూడా శక్తివంతమైందని తెలుస్తోంది. టీవీఎస్ ఇప్పటికే ఈ స్కూటరుకు సంబంధించిన టీజర్ కూడా లాంచ్ చేసింది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 150 స్కూటర్.. క్వాడ్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, బ్రాండ్ సిగ్నేచర్‌తో కూడిన టీ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్ వంటివి పొందుతుంది. ఇవన్నీ ఈ స్కూటరుకు దూకుడుగా కనిపించే చేస్తుంది. ఇందులో 150 సీసీ ఇంజిన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు.

సుజుకి ఈ-యాక్సెస్

అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ విభాగంలో తమ వాహనాలను లాంచ్ చేస్తుంటే.. సుజుకి కూడా తన యాక్సెస్ స్కూటరును ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. దీనికి సంస్థ ఈ నెలలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇందులో 3.07 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 95 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 5.5 బీహెచ్‌పీ పవర్, 15 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

వీఎల్ఎఫ్ మాబ్‌స్టర్

మోటొహాస్ కంపెనీ సెప్టెంబర్ 25న ఇండియన్ మార్కెట్లో వీఎల్ఎఫ్ మాబ్‌స్టర్ స్కూటర్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ స్కూటర్ మొదటిసారి దేశీయ విఫణిలోకి అడుగుపెట్టనుంది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ స్కూటర్ గురించి చాలా వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అయితే విదేశీ మార్కెట్లో అమ్ముడవుతున్న ఈ స్కూటర్ 11.9 బీహెచ్‌పీ పవర్, 11.7 న్యూటన్ మీటర్ టార్క్ అందించే 125 సీసీ ఇంజిన్, 17.7 బీహెచ్‌పీ పవర్ 15.7 ఎన్ఎమ్ టార్క్ అందించే 180 సీసీ ఇంజిన్ పొందుతుంది. కాగా దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే స్కూటర్ ఏ ఇంజిన్ పొందుతుందనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు.

440 సీసీ హార్లే డేవిడ్సన్

అమెరికన్ వాహన తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్ కూడా మార్కెట్లో.. 440 సీసీ విభాగంలో బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. దీనిని కంపెనీ హీరో మోటోకార్ప్ భాగస్వామ్యంతో నిర్మించనుంది. ఇది 27 బీహెచ్‌పీ పవర్, 36 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 440 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందనున్నట్లు సమాచారం. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభించనుంది. ఈ బైక్ ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాలు వెల్లడి కాలేదు. కానీ ఈ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

భారీ వర్షాలు: ఆ జిల్లాలో స్కూళ్లకు సెలవు.. పరీక్షలు రద్దు!

భాగ్యనగరాన్ని (హైదరాబాద్) భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రోడ్లు స్తంభించిపోయాయి, ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం అయ్యాయి. రాష్ట్రంలో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం.. మెదక్ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది.

స్కూళ్లకు సెలవు.. పరీక్షలు రద్దు

శుక్రవారం కూడా వర్షాలు పడుతున్న కారణంగా.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ, డీఈఓ ఉత్తర్వులు జారీ చేసారు. సెలవు కారణంగా.. కాకతీయ యూనివర్సిటీలో జరగాల్సిన అన్ని డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని యూనివర్సిటీ అధికారులు అధికారికంగా వెల్లడించారు. వాయిదా పడిన పరీక్షలు.. మళ్ళీ ఎప్పుడు నిర్వహించనున్నారు అనే విషయాన్ని త్వరలోనే చెబుతారు. కాగా మిగిలిన పరీక్షలన్నీ కూడా యధావిధిగా జరుగుతాయి.

కాకతీయ యూనివర్సిటీ పరీక్షలు మాత్రమే కాకుండా.. హైదరాబాద్ జేఎన్‌టీయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి. ఈ రోజు, రేపు (శుక్ర, శనివారం) జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. వాయిదా పడిన పరీక్షల తేదీలను సంబంధిత అధికారులు త్యరలోనే వెల్లడిస్తారు. వర్షాల ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు.. ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకూడదని వర్సిటీ యాజమాన్యం పరీక్షలను వాయిదా వేసింది.

రానున్న 24 గంటల్లో వర్షాలు!

రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో వర్షం సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అవసరమైతే తప్పా.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండటం మంచిది. వర్షం కారణంగా, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైతే.. ప్రయాణం కష్టమవుతుంది. కాబట్టి ప్రజలు వర్షం సమయంలో బయటకు రాకుండా ఉండాలని ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేస్తోంది.

వర్షాలు ఇలాగే కొనసాగితే.. రేపు కూడా సెలవు మంజూరు చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. ఈ రోజు, రేపు, ఎల్లుండి (శుక్ర, శని, ఆదివారం) బడికి సెలవు. ఆ తరువాత సోమవారం పాఠశాల యధావిధిగా పనిచేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ అధికారికంగా వెల్లడించల్సి ఉంది.

ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్!

గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో వర్షం ఎక్కువైపోయింది. వర్షంలో ఆఫీసులకు వెళ్లాలన్నా, తిరిగి ఇళ్లకు రావాలన్నా.. ఉద్యోగులకు కష్టమవుతోంది. అయితే ఈ వర్షాలు ఇలాగె కొనసాగితే.. పలు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ సదుపాయాన్ని కల్పించే అవకాశం ఉంది. నగరం నడిబొడ్డున వర్షపు నీరు ఎక్కువ కావడం వల్ల.. వాహనాలు కూడా అందులోనే కొట్టుకుపోతున్నాయి. ఇది వాహనదారులకు తీరని నష్టం కలిగిస్తోంది.

పొంగుతున్న చెరువులు

నగరంలో వర్షపాతం ఎక్కువవడంతో.. చెరువులన్నీ నిండుకుండలా మారిపోయాయి. మూసి నదీ నిండిపోయింది. నాగార్జున సాగర్ డ్యామ్ కూడా నీటితో కళకళలాడుతోంది. వర్షం నగర వాసులకు కొంత ఇబ్బందిని కలిగించినప్పటికీ.. రైతన్నకు మేలే చేస్తుంది. పంటలకు కావాల్సిన నీరు అందుబాటులో ఉంటుంది. నీటి కొరత లేకుండా పంటలు పండించుకోవచ్చు. తద్వారా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. కాగా ప్రస్తుతం అన్నదాత యూరియా కొరతను ఎదుర్కొంటున్నాడు. దీనిని ప్రభుత్వం వీలైనంత త్వరగా పరిష్కరించాలి.

వాయిదా పడిన ప్రభాస్ ‘రాజా సాబ్’: కొత్త రిలీజ్ డేట్ ఇదే!

ప్రభాస్.. నిజానికి ఇదొక పేరు కాదు. పాన్ ఇండియా సెన్సేషన్, అభినులకు బ్రాండ్. ఈశ్వర్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుని.. నేడు ఎక్కువ మంది అభిమానులను కలిగి ఉన్న హీరోలలో ప్రభాస్ ఒకరు. కాబట్టి చాలా మంది ప్రభాస్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం ఈయన ‘ది రాజా సాబ్‘ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇక్కడ చూసేద్దాం.

రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

రాజా సాబ్ సినిమా డిసెంబర్ 2025లో విడుదల కావాల్సి ఉంది. అయితే వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడం మరియు పోస్ట్ ప్రొడక్షన్ కారణాల వల్ల.. ప్రభాస్ సినిమా రిలీజ్ తేదీ కొంత ముందుకు సాగింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులను పూర్తి చేయడానికి చిత్ర బృందం పనిచేస్తోంది. బహుశా ఇది 2026 సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

ది రాజా సాబ్ ఆలస్యానికి కారణం

ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం ది రాజా సాబ్ ఆలస్యానికి.. సినీ కార్మికుల సమ్మె కూడా ఒక కారణం అని తెలుస్తోంది. ప్రస్తుతం యూనియన్ల సమ్మె ఆగిపోయింది. దీంతో సినిమా పరిశ్రమలో ఆగిపోయిన కొన్ని పనులు త్వరితగతిన పూర్తవుతున్నాయి. ప్రస్తుతం కొన్ని కీలకమైన సన్నివేశాలు మాత్రమే పూర్తిచేయాల్సి ఉందని రాజా సాబ్ చిత్ర బృందం వెల్లడించింది.

నటుడు ప్రభాస్ కూడా వరుస సినిమాలలో నటిస్తున్న కారణంగా.. అయన షెడ్యూల్ కూడా చాలా బిజీ అయిపోయింది. కాబట్టి రాజా సాబ్ చిత్ర బృందం కూడా వీలైనంత త్వరగానే సినిమాను పూర్తి చేయడానికి సిద్ధమైంది. మొత్తం మీద చిత్ర బృందం.. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో సంక్రాంతికి చాలా సినిమాలే రిలీజ్ అవుతాయి. కొంతమంది దర్శకులు లేదా నిర్మాతలు సైతం సినిమాలను రిలీజ్ చేయడానికి సంక్రాతి సరైందని భావిస్తారు. ఈ కారణంగానే ప్రభాస్ రాజా సాబ్ సంక్రాంతికి పోస్ట్‌ఫోన్ అయినట్లు తెలుస్తోంది. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు‘ సినిమా కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

రాజా సాబ్ సినిమా గురించి

ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్.. చాలా డిఫరెంట్ మూవీ అని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇలాంటి సినిమాలో ప్రభాస్ నటించలేదు. ప్రభాస్ అంతకు ముందు ఎప్పుడూ చూడని ప్రాంతంలో అడుగుపెడుతున్నట్లు ఈ సినిమాలో కనిపిస్తోంది. ఈ సినిమా హారర్, ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. పాతకాలపు చరిత్ర కూడా ఇందులో మిళితమైందని తెలుస్తోంది.

వరుస సినిమాలతో ప్రభాస్

నటుడు ప్రభాస్ కేవలం ది రాజా సాబ్ సినిమాలో మాత్రమే కాకుండా.. ఫౌజీ, స్పిరిట్ వంటి సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్.. రాజా సాబ్ పూర్తయిన తరువాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాగా చిత్ర పరిశ్రమ రాజా సాబ్ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకుంది. ఈ సినిమా కోసం చిత్ర బృందం రూ. 200 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టినట్లు సమాచారం.

టీవీఎస్ కొత్త స్కూటర్ లాంచ్: ధర రూ.లక్ష కంటే తక్కువే

ఎంతోమంది వాహన ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సరికొత్త మరియు సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఆర్బిటర్‘ను టీవీఎస్ మోటార్ లాంచ్ చేసింది. కంపెనీ ఈ స్కూటర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఈ లేటెస్ట్ స్కూటర్ ధర, రేంజ్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

ధర

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఆర్బిటర్ ధర రూ. 99,900 (ఎక్స్ షోరూం, బెంగళూరు). ఇది మొత్తం ఆరు పెయింట్ స్కీమ్‌లలో లభిస్తుంది. అవి నియాన్ సన్‌బర్స్ట్, స్ట్రాటోస్ బ్లూ, లూనార్ గ్రే, స్టెల్లార్ సిల్వర్, కాస్మిక్ టైటానియం మరియు మార్టిన్ కాపర్ కలర్స్. ఇది మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండటం వల్ల.. వినియోగదారుడు తనకు నచ్చిన కలర్ స్కూటర్ కొనుగోలు చేయవచ్చు.

డిజైన్ అండ్ ఫీచర్స్

చూడటానికి కొత్తగా కనిపించే కొత్త టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్.. తక్కువ ఫ్లోయింగ్ లైన్లతో మినిమలిస్ట్ అండ్ బాక్సీ డిజైన్ పొందుతుంది. ఇందులో ఒక పెద్ద సైడ్ ప్యానెల్ ముందు అఫ్రాన్ వద్ద ప్రారంభమై వెనుకవైపుకు చిన్నదిగా విస్తరిస్తుంది. ముందు భాగంలో హ్యాండిల్‌బార్.. మౌంటెడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంటుంది. ఇది ఆప్రాన్ అంతటా రోబోక్యాప్ మాదిరిగా ఉండే ఎల్ఈడీ లైట్ స్ట్రిప్‌తో అనుసంధానించబడి ఉంటుంది. ఇలాంటి డిజైన్ టీవీఎస్ జూపిటర్‌లో కనిపిస్తుంది.

టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజిని పొందుతుంది. ఇందులో సులభంగా రెండు హెల్మెట్‌లను ఉంచుకోవచ్చు. ఈ స్కూటర్ 290 మిమీ ప్లాట్ ఫ్లోర్‌బోర్డ్ కూడా పొందుతుంది. కాబట్టి రైడర్లకు ఇది రైడింగ్ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

బ్యాటరీ అండ్ రేంజ్ వివరాలు

సరికొత్త టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్.. 3.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 158 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. అయితే రియల్ వరల్డ్ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి బహుశా ఇది 120 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. దీని స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 68 కిమీ కావడం గమనార్హం. ఈ స్కూటర్ రోజువారీ ప్రయాణానికి లేదా నగర ప్రయాణానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ముందు భాగంలో 14 ఇంచెస్ వీల్, వెనుక 12 ఇంచెస్ వీల్ పొందుతుంది. కాబట్టి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. టెక్ విషయానికి వస్తే.. ఈ లేటెస్ట్ స్కూటర్ యాప్ ద్వారా కనెక్ట్ చేయబడిన టెక్నాలజీని పొందుతుంది. దీనిద్వారా టర్న్ బై టర్న్ న్యావిగేషన్, ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్స్, యాంటీ థెఫ్ట్, క్రాష్ అండ్ జియో ఫెన్సింగ్ నోటిఫికేషన్ వంటివి తెలుసుకోవచ్చు. ఈ స్కూటర్ ఎకో మరియు పవర్ మోడ్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్, పార్కింగ్ అసిస్ట్ మరియు క్రూయిజ్ కంట్రోల్ కూడా పొందుతుంది. మొత్తం మీద కొంత తక్కువ ధరలో.. అత్యాధునిక ఫీచర్లతో టీవీఎస్ చెప్పినట్లే రూ. లక్ష కంటే తక్కువ ధరలోనే లాంచ్ చేసింది. ఇది ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న ‘ఏథర్ రిజ్టా‘కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

ఈపీఎఫ్ఓ 3.0: సరికొత్త విధానం.. అతిపెద్ద ప్రయోజనాలు

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) 2025లో ”ఈపీఎఫ్ఓ 3.0”ను ప్రారంభించడానికి సర్వత్రా సిద్ధమవుతోంది. యాక్సెసిబిలిటీని.. పారదర్శకతను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుని ఈపీఎఫ్ఓ ఈ కొత్త విధానం ప్రారంభించనుంది. ఈ కొత్త సిస్టం ఏకంగా 8 కోట్ల కంటే ఎక్కువ ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఈపీఎఫ్ఓ 3.0 అనేది సేవలను వేగవంతం చేస్తుంది. ఇది యోజార్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ కొత్త విధానం కోసం ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఈ ప్లాట్‌ఫామ్ నిర్వహణ కోసం షార్ట్‌లిస్ట్ చేస్తోంది. జూన్ 2025లో ఈపీఎఫ్ఓ 3.0ను లాంచ్ చేయాలని అనుకున్నప్పటికీ.. టెక్నికల్ సమస్యల కారణంగా ఇది కాస్త ఆలస్యమైంది. కాగా ఈ విధానం ఇంకెప్పుడు లాంచ్ అవుతుందనే వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

ఈపీఎఫ్ఓ 3.0 వల్ల ఉపయోగాలు

ఏటీఎమ్ నుంచి నేరుగా పీఎఫ్ తీసుకోవడం

నిజానికి ఈపీఎఫ్ఓ అమౌంట్ తీసుకోవాలంటే.. అప్లై చేయాల్సి వచ్చేది. కానీ ఇకపై పీఎఫ్ అమౌంట్ తీసుకోవాలంటే.. నేరుగా ఏటీఎమ్ నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే దీనికోసం యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నెంబర్)ను యాక్టివేట్ చేసుకోవడం మాత్రమే కాకుండా.. ఆధార్ నెంబరును బ్యాంక్ ఖాతాకు లింక్ చేసుకోవాల్సి ఉంటుందని మర్చిపోకూడదు. ఈ కొత్త ఫీచర్ ఉద్యోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా

భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు ఎక్కువైపోయాయి. ఈ రోజు ఒక్క రూపాయి వస్తువు తీసుకున్నా కూడా యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్న సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం డిజిటల్ చెల్లింపులకు అనుగుణంగా ఈపీఎఫ్ఓ 3.0 ను తీసుకొస్తున్నారు. అత్యవసర సమయాల్లో ఉద్యోగులకు ఇది కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఆన్‌లైన్ క్లెయిమ్‌లు & సులభమైన కరెక్షన్స్

గతంలో ఈపీఎఫ్ఓలో ఏదైనా సవరణలు లేదా క్లెయిమ్ అప్డేట్ చేయాలంటే.. ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఈపీఎఫ్ఓ 3.0 అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఖాతాదారులు ఈపీఎఫ్ఓ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఓటీపీ ద్రువీకరణతో.. ఆన్‌లైన్‌లోనే కరెక్షన్స్ చేసుకోవచ్చు. అంతే కాకుండా క్లెయిమ్ స్థితిని కూడా ట్రాక్ చేయవచ్చు. ఇది ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుంది. ఆలస్యాన్ని తగ్గిస్తుంది.

మెరుగైన డిజిటల్ అనుభవం

ఈపీఎఫ్ఓ 3.0 అనే కొత్త ప్లాట్‌ఫామ్.. ఎప్పుడైనా, ఎక్కడైనా ఖాతాదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. క్లెయిమ్‌లు, ఖాతా వివరాలను ట్రాక్ చేయడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. డిజిటల్ విధానం ద్వారా అన్నీ పారదర్శకంగా ఉంటాయి. ఉద్యోగుల సమయం కూడా ఈ విధానంలో చాలా ఆదా అవుతుంది.

ప్రస్తుతం దేశంలో 73.7 మిలియన్ల మంది ఈపీఎఫ్ఓ ఖాతాదారులు ఉన్నారు. వీరందరిని దృష్టిలో ఉంచుకుని.. కేంద్రం ఈపీఎఫ్ఓ విత్‌డ్రా విధానాన్ని సులభతరం చేయాలని భావించింది. ఇందులో భాగంగానే.. ఈపీఎఫ్ఓ 3.0 తీసుకురావడానికి సన్నద్ధమైంది. ఇది తప్పకుండా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విత్‌డ్రా ప్రక్రియ చాలా ఈజీ అవుతుంది. అయితే ఈపీఎఫ్ఓ 3.0 లో కొన్ని నియమాలను అనుసరించాల్సి ఉంటుంది. ఖాతాదారులు ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి.

పండగపూట స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసిన టీవీఎస్: ఈ బైక్ గురించి తెలుసా?

ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ దేశీయ మార్కెట్లో.. సరికొత్త రైడర్ వేరియంట్ ‘సూపర్ స్క్వాడ్ ఎడిషన్‘ను లాంచ్ చేసింది. ఈ కొత్త వేరియంట్ ఇప్పటికి మార్కెట్లో ఉన్న రైడర్ బైక్ కంటే కొంత భిన్నంగా ఉంటుంది. ఈ లేటెస్ట్ వేరియంట్ ధర, ఇతర వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

ధర

సరికొత్త టీవీఎస్ రైడర్ సూపర్ స్క్వాడ్ ఎడిషన్ ధర రూ. 99,465 (ఎక్స్ షోరూమ్ ). ఈ బైక్ డెడ్‌పూల్ అండ్ వుల్వరైన్ యొక్క లేత నీలం మరియు బ్లాక్ థీమ్ నుంచి ప్రేరణ పొందిన బ్లాక్ అండ్ రెడ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. యువ రైడర్లను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ లేటెస్ట్ బైకును లాంచ్ చేసింది. ఇది తప్పకుండా లేటెస్ట్ జనరేషన్ యువతను ఆకట్టుకుంటుందని కంపెనీ చెబుతోంది.

ఇంజిన్

కొత్త టీవీఎస్ రైడర్ కొత్త ఎడిషన్. 124.8 సీసీ ఇంజిన్ 7500 ఆర్‌పీఎమ్ వద్ద 11.2 బీహెచ్‌పీ పవర్ మరియు 6000 ఆర్‌పీఎమ్ వద్ద 11.75 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది స్టాండర్డ్ రైడర్ బైక్ కంటే 10 శాతం ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కాబట్టి ఇది మంచి పనితీరును అందిస్తుంది. రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

ఫీచర్స్

లేటెస్ట్ రైడర్ సూపర్ స్క్వాడ్ ఎడిషన్ టీవీఎస్ ఐగో అసిస్ట్ సిస్టం మరియు గ్లైడ్ త్రూ ట్రాఫిక్ టెక్నాలజీ పొందుతుంది. కాగా కంపెనీ ఇప్పుడు కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేయడంతో రైడర్ బైక్ ఇప్పుడు మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తుంది. ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక మోనోషాక్ వంటివి ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఈ బైక్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్స్, వెనుక డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. 17 ఇంచెస్ వీల్స్ మీద ఈ బైక్ నడుస్తుంది.

ఆధునిక కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్న ఈ కొత్త టీవీఎస్ రైడర్ సూపర్ స్క్వాడ్ ఎడిషన్.. ఇండియన్ మార్కెట్లో హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్, హోండా ఎస్పీ125, బజాజ్ పల్సర్ ఎన్125 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి రైడర్ కొత్త ఎడిషన్ అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

స్పెషల్ ఎడిషన్స్ వల్ల ఉపయోగాలు

నిజానికి ఏదైనా స్పెషల్ ఎడిషన్ అంటే.. కొంత స్పెషల్ ఉంటుంది. అంటే కాస్మొటిక్ అప్డేట్స్, ఇంజిన్ పర్ఫామెన్స్ వంటివి. కాస్మొటిక్ అప్డేట్లలో చెప్పుకోదగ్గవి కలర్ ఆప్షన్స్. యువత ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు స్పెషల్ ఎడిషన్ పేరుతో కొత్త వెహికల్స్ లాంచ్ చేస్తాయి. ఇవి కంపెనీలు ఎక్కువమంది కస్టమర్లను తమవైపు ఆకట్టుకోవడంలో భాగమనే చెప్పాలి. ఇప్పటికే చాలా కంపెనీ తమ పాపులర్ బ్రాండ్లను.. స్పెషల్ ఎడిషన్స్ పేరుతో లాంచ్ చేసి మంచి అమ్మకాలను పొందాయి. ఇప్పుడు టీవీఎస్ లాంచ్ చేసిన రైడర్ సూపర్ స్క్వాడ్ ఎడిషన్ కూడా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము.

ఆ హీరో సినిమాలో కుంభమేళా మోనాలిసా: షూటింగ్ ఎప్పుడంటే?

0

గత ఏడాది జరిగిన మహా కుంభమేళాలో ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిపోయారు. ఇందులో మోనాలిసా భోంస్లే లేదా కుంభమేళా మోనాలిసా ఒకరు. పూసలు అమ్ముకోవడానికి కుంభమేళా వచ్చిన మోనాలీసాను సోషల్ మీడియా ఎంత ఫేమస్ చేసిందంటే.. ఇప్పుడు ఏకంగా సినిమాలోకి అడుగుపెట్టేసింది. ప్రస్తుతం ఆమె కనిపించనున్న సినిమాకు పూజా కార్యక్రమంలో కనిపించింది.

మోనాలిసా మొదటి సినిమా

కుంభమేళా మోనాలిసా.. ఇప్పుడు మలయాళ సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆమె మొదటి సినిమా ‘నాగమ్మ‘ తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం కొచ్చిలో జరిగింది. ఈ కార్యక్రమానికి మోనాలిసా కూడా హాజరైంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నాగమ్మ సినిమా గురించి

మొదటిసారి నాగమ్మ సినిమాతో సినిమా ప్రపంచంలోకి మోనాలిసా అడుగు పెట్టనుంది. ఈ సినిమాకు పీ. బిను వర్గీస్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా నటుడు కైలాష్ ఈ సినిమాలో నటించనున్నట్లు సమాచారం. మోనాలిసా కూడా ఓ ప్రముఖ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. షూటింగ్ సెప్టెంబర్ చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

నాగమ్మ సినిమా పూజ కార్యక్రమానికి ప్రముఖ చిత్ర నిర్మాత సీబీ మలైల్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మోనాలిసా.. గులాబీ రంగు లెహంగాలో చూడచక్కగా కనిపించింది. సహజమైన అందంతో ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకున్న మోనాలిసా తెరపైన ఎలా ఆకట్టుకోబోతుందో తెలుసుకోవడానికి ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఎవరీ మోనాలిసా?, సినిమా అవకాశాలు ఎలా వచ్చాయి?

నిజానికి మోనాలిసా పెద్ద సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి లేదా బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చిన యువతి కాదు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈమె పొట్ట కూటికోసం పూసలమ్ముకోవడానికి కుంభమేళాకు వెళ్లిన ఈమెను.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఫోటోలు తీసి రీల్స్ చేయడం చేశారు. దీంతో ఒక్క రోజులోనే ఈ అమ్మడు సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. నీలికళ్ళ మోనాలిసా.. ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది. దీంతో ఆమె పూజల వ్యాపారం కూడా ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఫోటోలు, రీల్స్ కొంతమంది డైరెక్టర్స్ దృష్టిని ఆకట్టుకున్నాయి. దీంతో ఆమెకు సినిమా పరిశ్రమ నుంచి ఆఫర్స్ వచ్చాయి. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా దర్శకత్వం వహించిన ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ చిత్రంలో మోనాలిసాకు ఓ క్యారెక్టర్ ఇచ్చారు. ఇప్పుడు నాగమ్మ సినిమాతో మాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. కాగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం తెలియాల్సి ఉంది.

వ్యక్తులపై సోషల్ మీడియా ప్రభావం

ఎవరో కూడా ప్రపంచానికి తెలియనివారికి సైతం సోషల్ మీడియా సెలబ్రిటీలను చేస్తుంది. సెలబ్రిటీలను కూడా ఒక్కరోజులో సోషల్ మీడియా అధోపాతాళానికి చేరుస్తుంది. అలాంటి సోషల్ మీడియా ఈ రోజు ప్రపంచాన్ని ఏలుతోంది. సెలబ్రిటీలైనా.. పారిశ్రామికవేత్తలైనా.. రాజకీయనాయకులైనా ఈ సోషల్ మీడియా అంటే కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అలాంటి సోషల్ మీడియా మోనాలీసాను సెలబ్రిటీని చేసింది.

సంజయ్ దత్ కొత్త కారు చూశారా?.. ధర తెలిస్తే అవాక్కవ్వడం పక్కా!

భారతదేశంలోని మోస్ట్ పాపులర్ హీరోలలో ఒకరైన ‘సంజయ్ దత్‘ గణేష్ చతుర్థి సందర్భంగా.. ఓ ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ సంజయ్ దత్ కొన్న కారు ఏది?, దాని ధర ఎంత? అనే ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

సంజయ్ దత్ కొత్త కారు

నటుడు సంజయ్ దత్ కొనుగోలు చేసిన కొత్త కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి మేబ్యాచ్ జీఎల్ఎస్ 600 4 మ్యాటిక్. దీని ధర రూ. 3.39 కోట్లు (ఎక్స్ షోరూం). ఇది భారతీయ మార్కెట్లో ప్రస్తుతం అమ్మకానికి ఉన్న అత్యంత ఖరీదైన కార్లలో ఒకటిగా ఉంది. ఈ కారు అత్యాధునిక డిజైన్, సరికొత్త ఫీచర్స్ పొందుతుంది.

సంజయ్ దత్ కొనుగోలు చేసిన మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 600 4 మ్యాటిక్ కారు డ్యూయెల్ టోన్ కలర్ పెయింట్ స్కీమ్ పొందింది. ఇది అబ్సిడియన్ బ్లాక్ & రూబెల్లైట్ కలయికలో చాలా అద్భుతంగా ఉంది. ఈ స్పెషల్ పెయింట్ స్కీమ్ ధర రూ. 18.64 లక్షలు. దీన్నిబట్టి చూస్తే ఎంచుకునే రంగును బట్టి కారు ధర ఉంటుందని స్పష్టమవుతోంది.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 600 4 మ్యాటిక్ గురించి

కొత్త బెంజ్ జీఎల్ఎస్ 600 4 మ్యాటిక్ కారు వాహన వినియోగదారులకు కావలసిన అన్ని ఫీచర్స్ పొందుతుంది. ఇందులో రిక్లైనింగ్ రియర్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 27 స్పీకర్ సౌండ్ సిస్టం, 64 కలర్ యాంబియంట్ లైటింగ్ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 600 4 మ్యాటిక్.. 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో జతచేయబడిన 4.0 లీటర్ వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది 557 హార్స్ పవర్, 730 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాగా హైబ్రిడ్ ఇంజిన్ 250 ఎన్ఎమ్ టార్క్, 22 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ పొందుతుంది. ఇది కేవలం 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ రావరకు వేగవంతం అవుతుంది.

బెంజ్ జీఎల్ఎస్ 600 4 మ్యాటిక్ కలిగిన సెలబ్రిటీలు

ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 600 4 మ్యాటిక్ కారును కలిగిన సెలబ్రిటీల జాబితాలో.. రణవీర్ సింగ్, దీపికా పదుకొనె, కృతి సనన్, అర్జున్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా, శిల్పా శెట్టి, షాహిద్ కపూర్, రామ్ చరణ్, టాప్సీ పన్ను మొదలైనవారు ఉన్నారు.

సంజయ్ దత్ కార్ కలెక్షన్

నటుడు సంజయ్ దత్ ఇప్పటికే ల్యాండ్ రోవర్ డిఫెండర్, ఫెరారీ 599 జీటీబీ, రేంజ్ రోవర్ వోగ్, బీఎండబ్ల్యూ 7 సిరీస్, రోల్స్ రాయిస్ ఘోస్ట్ వంటి కార్లను కలిగి ఉన్నారు. ఇప్పుడు తాజాగా మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 600 4 మ్యాటిక్ కారు ఈయన గ్యారేజిలో చేరింది.

సాధారణంగా సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే సంజయ్ దత్ ఖరీదైన బెంజ్ కారును కొనుగోలు చేశారు. ఈ కారు అత్యధునిక ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల.. ఎక్కువమంది సెలబ్రిటీలు ఈ కారును ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.

భారతదేశంలో పాస్‌పోర్ట్‌లు ఇన్ని రకాలున్నాయా?: తెలిస్తే మైండ్ బ్లోయింగ్ అంతే!

పాస్‌పోర్ట్.. ఈ పదం దాదాపు అందరికీ సుపరిచయమే. విదేశాలకు వెళ్లాలనుకునే వాళ్లకు ఇదొక గుర్తింపు. కాబట్టి విదేశీయానం చేయాలనుకునే ప్రతి ఒక్కరూ పాస్‌పోర్ట్ తీసుకోవాలి. ఒక్కో దేశం ఒక్కోరకమైన పాస్‌పోర్ట్ జరీ చేస్తుంది. అయితే మన దేశం (ఇండియా) నాలుగు రంగులలో పాస్‌పోర్ట్ జారీ చేస్తుందని బహుశా.. కొంతమందికి తెలుసుండదు. ఈ కథనంలో వివిధ రంగులలో జారీ చేసే పాస్‌పోర్ట్‌ల గురించి తెలుసుకుందాం.

ముదురు నీలం రంగు పాస్‌పోర్ట్

అందరికీ తెలిసిన.. చాలామంది చూసిన పాస్‌పోర్ట్ ఇది. దీనిని సాధారణ పాస్‌పోర్ట్ అని కూడా అంటారు. మనదేశం నుంచి వ్యక్తిగత పనుల కోసం వెళ్లేవారికి, వ్యాపారం, విద్య లేదా విహారయాత్రలకు వెళ్లేవారికి ఈ పాస్‌పోర్ట్‌ను జారీ చేస్తారు. ఇది భారత జాతీయతకు రుజువుగా పనిచేస్తుంది. ప్రపంచంలోని చాలా దేశాలు దీనిని ఆమోదించాయి. కాబట్టి ఎక్కువమందికి భారత ప్రభుత్వం ఈ రకమైన పాస్‌పోర్ట్ జారీ చేస్తుంది.

మెరూన్ పాస్‌పోర్ట్ లేదా డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్

నిజానికి ఈ రంగు పాస్‌పోర్ట్ గురించి చాలామందికి తెలిసి ఉండదు. ఎందుకంటే భారత ప్రభుత్వం ఇలాంటి పాస్‌పోర్ట్‌లను.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నతస్థాయి దౌత్య పదవులలో ఉన్నవారికి మాత్రమే జారీ చేస్తుంది. ఏ మెరూన్ కలర్ పాస్‌పోర్ట్‌తో కొన్ని ప్రత్యేకమైన అధికారులు కూడా లభిస్తాయి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా.. ఈ పాస్‌పోర్ట్ కలిగిన వారికి పటిష్టమైన భద్రత లభిస్తుంది.

వైట్ పాస్‌పోర్ట్ లేదా అధికారిక పాస్‌పోర్ట్

ఈ రంగు పాస్‌పోర్ట్‌లను కూడా ఎక్కువమంది చూసి ఉండరు. అయితే ఈ పాస్‌పోర్ట్‌లను అధికారిక విధుల కోసం.. విదేశాలకు వెళ్లే వ్యక్తుల కోసం లేదా ప్రభుత్వ అధికారుల కోసం భారత ప్రభుత్వం అందిస్తుంది. ఇందులో అధికారిక వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లే అధికారులు ఉన్నారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ రకమైన పాస్‌పోర్ట్‌లను అధికారిక ప్రయోజనాల కోసం మాత్రమే. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు.

ఆరంజ్ పాస్‌పోర్ట్ లేదా ఈసీఆర్ పాస్‌పోర్ట్

నారింజ రంగు పాస్‌పోర్ట్‌లను.. విదేశాల్లో పనిచేసే వ్యక్తుల కోసం ప్రత్యేకంగా జారీ చేస్తారు. విద్యార్హత తక్కువగా ఉండే వారు ఇలాంటి పాస్‌పోర్ట్‌లను పొందుతారు. ఈ పాస్‌పోర్ట్‌లతో విదేశాల్లో పనిచేయాలనుకునే వారు.. అదనపు పౌరసత్వ తనిఖీలను చేయించుకోవాల్సి ఉంటుంది.

ఇప్పుడు తెలిసిందా.. భారతదేశం ఎన్ని రంగులలో పాస్‌పోర్ట్‌లను జారీ చేస్తుందో. ముదురు నీలం, నారింజ, మెరూన్, తెలుగు రంగు పాస్‌పోర్ట్‌లలో.. ఒక్కోదానికి ఒక్కో అధికారులు ఉంటాయి. అంతే కాకుండా ఇవన్నీ వ్యక్తుల పాత్రలను, ప్రయాణ వర్గాన్ని సూచిస్తాయి. అయితే సాధారణ పౌరుల నుంచి ప్రభుత్వ అధికారులు, దౌత్యవేత్తల వరకు పాస్‌పోర్ట్‌ల రంగు ప్రయాణ ఉద్దేశ్యాన్ని చెబుతుంది.

పాస్‌పోర్ట్ పొందాలనుకునే వారు, పాస్‌పోర్ట్ ఎలా పొందాలి?, కావాల్సిన డాక్యుమెట్స్ ఏమిటి?, ఎవరిని సంప్రదించాలి?, ఎలా పొందాలి?, వంటి ఇతరత్రా వివరాల గురించి అవగాహన పెంచుకోవాలి. లేకుంటే థర్డ్ పార్టీలను సంప్రదించి మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఇలా మోసపోయినవాళ్ల సంఖ్య చాలానే ఉంది. కాబట్టి ప్రతి భారతీయుడు తప్పకుండా పాస్‌పోర్ట్ గురించి తెలుసుకోవాలి.