Home Blog Page 67

2026లో లాంచ్ అయ్యే 7 సీటర్ కార్లు: వివరాలు

వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో.. కొత్త కొత్త వాహనాలు లాంచ్ అవుతూనే ఉన్నాయి. 2025లో భారతదేశంలో అనేక కార్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది కూడా లెక్కకు మించిన వాహనాలు లాంచ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఈ కథనంలో ఇండియాలో అడుగుపెట్టడానికి సిద్దమవుతున్న బెస్ట్ 7 సీటర్ కార్లను గురించి తెలుసుకుందాం.

ఫోక్స్‌వ్యాగన్ టేరాన్ ఆర్-లైన్

ఇండియన్ మార్కెట్లో లాంచ్ కావడానికి సిద్దమవుతున్న పాపులర్ 7 సీటర్ కార్ల జాబితాలో ఫోక్స్‌వ్యాగన్ కంపెనీకి చెందిన టేరాన్ ఆర్-లైన్ ఒకటి. మూడు వరుసల సీటింగ్ ఆప్షన్ కలిగిన ఈ కారు.. ఆర్ లైన్ బ్యాడ్జ్ పొందుతుంది. ఇది మన దేశానికి దిగుమతి అవుతుంది. కాబట్టి దీని ధర కొంత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుందని.. ఇది 204 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుందని సమాచారం. ఇంజిన్ 7 స్పీడ్ డీసీటీ ద్వారా ఆల్ వీల్ డ్రైవ్ సెటప్ పొందుతుంది.

ఎంజీ మెజెస్టర్

2025లో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఎంజీ మోటార్ కంపెనీ తన మెజెస్టర్ కారును మొదటిసారి ప్రదర్శించింది. ఇప్పుడు సంస్థ దీనిని ఫిబ్రవరి 12న దేశీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త కారు గ్లోస్టర్ స్థానంలో అమ్మకానికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇది 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా.. 210 హార్స్ పవర్, 478 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.

నిస్సాన్ టెక్టన్

గ్రావైట్ కారుతో పాటు.. నిస్సాన్ కంపెనీ టెక్టన్ కారును కూడా ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయనుంది. దీనిని సంస్థ సీఎంఎఫ్-బీ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపుదిద్దుకోనుంది. ఈ ఏడాది చివరి నాటికి దేశీయ విఫణిలో ఈ కారు లాంచ్ అవుతుందని సమాచారం. మార్కెట్లో తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. ప్రత్యర్థులకు కూడా గట్టి పోటీ ఇవ్వడానికి సంస్థ ఈ ప్రయత్నం చేస్తోంది.

మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్

2022లో మహీంద్రా కంపెనీ తన స్కార్పియో ఎన్ కారును లాంచ్ చేసింది. అప్పటి నుంచి మంచి అమ్మకాలు పొందుతున్న ఈ కారు.. త్వరలో ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ కావడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే సంస్థ దీనిని అనేక సార్లు టెస్టింగ్ చేసింది. ఇది దాదాపు స్టాండర్డ్ స్కార్పియో ఎన్ మాదిరిగానే ఉన్నట్లు తెలుస్తోంది. కానీ కొన్ని అప్డేటెడ్ మార్పులు ఉండటం కనిపిస్తుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్థాయి.

రెనాల్ట్ బోరియల్

డస్టర్ కారును మార్కెట్లో లాంచ్ చేసిన తరువాత.. రెనాల్ట్ కంపెనీ తన 7 సీట్ల వెర్షన్‌ను బోరియల్ పేరుతో భారతదేశంలో విడుదల చేయనుంది. ఈ కారు డస్టర్ మాదిరిగానే.. అదే ప్లాట్‌ఫామ్‌పై తయారవుతుంది. పవర్‌ట్రెయిన్‌లో కూడా ఎటువంటి మార్పులు లేవని సమాచారం. అయితే అప్డేటెడ్ ఫీచర్లలో భాగంగా ఏడీఏఎస్, 360 డిగ్రీ కెమెరా వంటివి ఉండనున్నాయని తెలుస్తోంది. ధరలు మాత్రం తెలియాల్సి ఉంది.

పూరీ జగన్నాథ్ కొత్త సినిమా.. పవర్‌ఫుల్ లుక్‌లో సేతుపతి!

0

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో బిగ్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్. తనకంటూ ఒక ప్రత్యేక అభిమాన సందోహాన్ని ఏర్పరచుకున్నాడు. అతి తక్కువ సమయంలో కథ రాసుకోవడం, అంతే తక్కువ టైంలో సినిమా తీసి రిలీజ్ చేయడం అతనికి ఉన్న నైపుణ్యం. పూరీ సినిమాలో రాసే రాతలకే కాదు, సమాజంలో జరిగే అనేక విషయాల పట్ల ఆయన సోషల్ మీడియాలో పంచుకునే తనదైన విశ్లేషనాత్మక మాటలకు కూడా విపరీతమైన ప్రేక్షక ఘనం ఉంది. కానీ గత కొంతకాలంగా ఆయన సినిమాలు అంతగా అలరించడంలేదు, డబ్బుల పరంగా కూడా పెద్ద ప్రభావం చూపించలేదు. అందుకే ఇప్పుడు తనను తాను పరీక్షించుకోవడానికి ఒక కొత్త సినిమాతో మన ముందుకొస్తున్నాడు.

సినిమా పేరు ఏమిటంటే?

గత సంవత్సరంలో షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా భాగం పూర్తి చేసుకుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్నట్టు సమాచారం. కొత్త సినిమా పేరును ప్రకటించడంలో కొంతకాలం సస్పెన్స్ కొనసాగించి చివరికి ఈ రోజు (2026 జనవరి 16) 2026న విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా న్యూ మూవీ పేరు స్లమ్ డాగ్గా నిర్ధారించడం జరిగింది. దానికి 33 టెంపుల్స్ రోడ్ అనే ఉప శీర్షిక అయితే పెట్టారు. ఇంతకు ముందు బెగ్గర్ అనే పేరు పెడతారనే వార్త ఎక్కువగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. నేటితో ఆ పూకార్లకు చెల్లుచీటీ పాడారు.

పేరుతో పాటు.. పోస్టర్ కూడా!

సినిమా పేరుతో పాటుగా ఒకేసారి పోస్టర్ కూడా విడుదల చేశారు. అందులో విజయ్ సేతుపతి కనిపిస్తున్నాడు. ఆయన జన్మదినం రోజున మరియు పండుగ పూట అభిమానులందరికి ఒక మంచి వార్తను అయితే అందించారు. దీంతో సేతుపతి ఫ్యాన్స్ ముఖాల్లో ఉత్సాహం నెలకొంది. మూవీ పేరుకు తగినట్టే పోస్టర్‌ను కూడా బాగా డిజైన్ చేశారు. ఒక బిచ్చగాడి దుస్తుల్లో.. రక్తం పూసిన కత్తిని చేతిలో పట్టుకుని, నల్ల కళ్లద్దాలు వేసుకొని నిలబడ్డాడు. అతని చుట్టూ పూర్తి డబ్బులు నిండిన కొన్ని పెట్టెలు కనిపిస్తున్నాయి. ఆ విధంగా మొత్తం మాస్ బ్యాక్‌గ్రౌండ్‌లో విజయ్ సేతుపతిని చూపించారు. దీన్ని బట్టి పూరి – సేతుపతి కాంబినేషన్‌లో చిత్రం విజయం సాధించేవిధంగానే కనిపిస్తోంది.

పవర్‌ఫుల్ బెగ్గర్‌గా విజయ్ సేతుపతి!

సినిమా లీడ్ రోల్‌లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తుంటే, మిగిలిన పాత్రల్లో సంయుక్త మీనన్, టబు, బ్రహ్మానందం, దునియా విజయ్, వీటీవీ గణేష్ కనిపించనున్నారు. ఛార్మి సమర్పణలో పూరి కనెక్ట్స్ మరియు జేబీ మోషన్ పిక్చర్స్ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలకు సంగీతం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు మ్యూజిక్ చేస్తున్నాడు. ఒక స్లమ్ ఏరియాలో ఒక పవర్‌ఫుల్ బెగ్గర్‌గా విజయ్ సేతుపతి కనిపిస్తాడు అని తెలుస్తోంది.

రిలీజ్ ఎప్పుడంటే?

ఈ చిత్రాన్ని ఇండియా (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో) మొత్తం విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. సినిమా చిత్రీకరణ దశలోనే ఉండటం కారణంగా రిలీజ్ డేట్ అయితే ఇంకా ప్రకటించలేదు. పూరి – ఛార్మీలు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలం అవుతుందో చూడాలి.

ఇదేం ట్విస్ట్ మామా.. వేణు ‘ఎల్లమ్మ’ సినిమాలో హీరోగా దేవి శ్రీ ప్రసాద్!

0

బలగం సినిమా డైరెక్టర్ వేణు ఎలదండి దర్శకత్వం చేయబోతున్న రెండో చిత్రం పేరు ఎల్లమ్మ. ఇందులో తెలుగు ఇండస్ట్రీకి చెందిన చాలా పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ (డిఎస్పీ) కథానాయకుడిగా మొదటిసారి తెర ముందు నటించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు మరియు శిరీష్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన మూవీ గ్లింప్స్ ఈ రోజు (జనవరి 15) సంక్రాతి పండుగ సందర్భంగా విడుదల చేశారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

రెండు విధాలా న్యాయం చేయగలడా?

దేవి శ్రీ ప్రసాద్  ఒక మ్యూజిక్ డైరెక్టర్, సింగర్‌గా మాత్రమే మనందరికీ తెలుసు. కానీ ఇప్పటి నుంచి ఒక యాక్టర్‌గా కూడా మనం చూడబోతున్నాము. ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటో రెండో సినిమాల్లో పాటల్లో లేదా ఒక చిన్న సన్నివేశంలో అలా కనిపించి ఇలా వెళ్లిపోవడం తప్పితే.. ఎప్పుడు కూడా పూర్తి స్థాయి నటుడుగా చేసింది లేదు. సంగీత దర్శకుడిగా తను ఎలాంటి అద్భుతాలు చేయగలడు అనేది దేశమంతటికీ తెలుసు. మరి ఇప్పుడు ఈ చిత్రంతో నటన పరంగా ఏ మేరకు మెప్పించగలుగుతాడు?, అనేది చూడాల్సి ఉంది. ఈ ఎల్లమ్మ చిత్రానికి హీరోగా చేస్తూ మరియు సంగీతం కూడా దేవి శ్రీనే అందిస్తుండటం.. ఒకింత సాహసోపేత నిర్ణయంగా చెప్పొచ్చు. రెండింటికి ఏ విధంగా న్యాయం చేస్తాడో ఏమో.. అనేది సినిమా రిలీజ్ తరువాత తెలుస్తుంది.

మొదటి సినిమాతోనే సత్తా చూపిన వేణు

అది కూడా బలగం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న వేణు దర్శకత్వంలో చేస్తున్నారు. బలగం సినిమా 2023 సంవత్సరంలో విడుదల అయింది. ఆ తరువాత చాలా విరామం తీసుకొని ఇన్నాళ్లకు 2026 ఏడాదికి గ్లింప్స్ రూపంలో అప్డేట్ అయితే ఇచ్చాడు. ఈ చిత్రం కోసం ఎంతో మంది హీరోలను అనుకున్నారు. వారందరికీ కథ వినిపించడం కూడా జరిగింది. చివరి దశ వరకు వచ్చి మళ్లీ ఎందుకో వెనక్కి వెల్లిపోయినోళ్లు ఉన్నారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఎల్లమ్మ సినిమాని పట్టాలెక్కించారు. మొదటి చిత్రంతో తన సత్తా ఏమిటి అనేది నిరూపించుకున్నాడు.

రెండో మూవీ విషయంలో కూడా అంతే శ్రద్ధ, పట్టుదలను ప్రదర్శిస్తూ తన శక్తియుక్తులన్నిటిని ప్రయోగిస్తున్నట్టుగా అర్థమవుతున్నది. కాకపొతే ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ను హీరోగా ఎంచుకోవడమే ఆలోచించాల్సిన విషయం. నటనను ఎలా రాబట్టుకోవాలి, ఏ విధంగా చూపించాలి అనేదాని పట్ల వేణుకు ఒక స్పష్టత ఉంటుంది. కాబట్టి బాగనే ఉంటుంది అనేది ఒకవైపు ప్రేక్షకుల వాదన.

గ్రామీణ నేపథ్యంలోనే!

గ్రామ దేవత ఎల్లమ్మ చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది అని తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో స్వచ్ఛమైన సంస్కృతి, సాంప్రదాయం, ఆచారం వాటిని వాడుకుని పల్లెల్లో కొంత మంది చేసే అధికార దోపిడీ, అణచివేతలను ఎదిరించేవాడి కథగా ప్రచారంలో ఉన్నది. టీజర్ మొదటల్లోనే చిన్న వేపాకుతో వీడియో మొదలవుతుంది. పొట్టేలును చూపిస్తూ, రెండు కాళ్లకు గజ్జెలు కట్టుకుని పరిగెత్తడం ఒక పక్కన, రెండు కాళ్లకు షూ వేసుకొని పరిగెత్తడం మరో పక్కన మనకు కనిపిస్తుంది. రాత్రి పూట జోరు వానలో, పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు కురుస్తుండగా ఒక చెట్టుకింద రాతి మీద ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు. ఆ చెట్టు మొదలుకి రక్తంతో ఉన్న కొడవలి చెక్కబడి ఉంటుంది. ఆ కూర్చొని ఉన్న వ్యక్తి చొక్కా లేకుండా ఎడమ పక్కన భుజానికి డప్పు వేలాడదీసుకొని రక్తపు మరకలతో, పొడువాటి జుట్టు వేసుకొని మెరుపుల వెలుతురులో ముఖం చూపిస్తారు. అతడే సినిమా హీరో దేవి శ్రీ ప్రసాద్. చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు.

రిలీజ్ ఎప్పుడంటే?

ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత కావడం కలిసొచ్చే విషయం. డబ్బులు పెట్టడంలో గానీ.. మూవీకి ఎక్కువ థియేటర్లను అందించడంలో గానీ ఎక్కడ లోటు ఉండదు. అయితే ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు, షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే సంగతి ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

రోడ్డు పక్కన ఈ రాళ్లు గమనించారా.. ఏ రంగు రాయి దేనిని సూచిస్తుందంటే?

0

మనం అందరూ సాధారణంగా మన అవసరాల రీత్యా ఏదో ఒక సందర్భంలో అనేక పట్టణాలకి, ప్రాంతాలకి ప్రయాణం చేస్తూ ఉంటాము. ఆ క్రమంలో మీరు గనక గమనించి ఉంటే రోడ్డు పక్కన కిలోమీటర్ లేదా నెంబర్ రాళ్లు నాటి ఉంటారు. ఆ రాళ్లలో నలుపు, పసుపు లేదా ఎరుపు, కాషాయం రంగులు ఎక్కువగా చూసుంటాము. వీటితో పాటు నీలం, పచ్చ, బూడిద, గోధుమ రంగు మైలురాళ్లు కూడా ఉంటాయి. అయిత ఆ రాళ్లు దేనికోసం నాటుతారు, ఆ రంగుల అర్థం ఏమిటి?, అనే విషయాలు చాలా మందికి తెలియదు. కొంతమందికి తెలిసి ఉండచ్చు. అందరి అనుమానాలకు సమాధానంగా ఆ రాళ్ల సమాచారాన్ని కొంతవరకు తెలుసుకుందాం.

రాష్ట్రాలు, పట్టణాలు, ఊర్లు సరిహద్దులు తెలపడానికి మరియు ఒక ఊరికి ఇంకో ఊరికి మధ్య ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందో చెప్పడానికి, ఆ రోడ్డు ఏ రకమైనదో.. అంటే నేషనల్ రోడ్డు, రాష్ట్ర రోడ్డు, సిటీ రోడ్డు, గ్రామీణ రోడ్డు, రైల్వే రోడ్డు, ఎయిర్‌పోర్ట్ రోడ్డు, బ్రిడ్జిలు, పోర్ట్ లేదా హార్బర్లను సూచించడం కోసం ఈ రాళ్లను నాటుతారు. వీటిపైన తెలుపు రంగులో ఉన్న ప్రాంతంలో.. నలుపు రంగుతో కిలోమీటర్లు నెంబర్లు, ఊరి పేర్లు రెండు వైపులా రాస్తారు. ప్రయాణికులకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయి.

కాషాయపు రంగు

మైలురాయికిపై భాగంలో ఆరెంజ్ రంగు కింది భాగంలో తెలుపు రంగు పూసి ఉంటుంది. దీనిపైన ఊరి పేరు కిలోమీటర్లు రాసి ఉంటారు. ఈ రాళ్లను దానికి సంబంధించిన రోడ్డుని పంచాయితీ రాజ్ శాఖ చూసుకుంటుంది. ఈ రకం రంగు గ్రామీణ రోడ్డును సూచిస్తుంది. గ్రామాలను నగరాలతో కలపడం దీని యొక్క ఉద్దేశ్యం.

నలుపు రంగు

నలుపు రంగు రాయి పట్టణ ప్రాంతాల్లో ఉంటుంది. నగరాలు లేదా సిటీలలో మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. పైభాగంలో నలుపు రంగు, కింది భాగంలో తెలుపు రంగును కలిగి ఉంటుంది. కిలోమీటర్లు, ఊరి పేరు రాసి ఉంటారు. ఈ రాళ్లు మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ పరిధిలో ఉంటాయి. ఈ రోడ్లు నిర్వహణ మరియు పరిపాలన మొత్తం మున్సిపాలిటీ వాళ్లు చూసుకుంటారు. ఈ నలుపు రంగు రాళ్లు పట్టణాల రోడ్లను రాష్ట్రాల రోడ్లతో కలుపుతాయి.

ఆకుపచ్చ రంగు

రాష్ట్రాలు మరియు భవనాల శాఖ ఈ ఆకుపచ్చ రంగు కలిగిన రాళ్ల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం జరుగుతుంది. ఆ రోడ్డుకు సంబంధించిన మరమ్మత్తులను ఇతరత్ర కార్యక్రమాలను రాష్ట్ర, భవనముల మినిస్ట్రీ చూసుకుంటుంది. మైలురాయికి సగ భాగం పైన పచ్చ రంగు, కింద సగ భాగం తెలుపు పూసి ఉంటారు. ఈ రోడ్డు ఆ యొక్క రాష్ట్ర ముఖ్య పట్టణాలతో పాటుగా జాతీయ రహదారులను కూడా కలుపుతుంది.

పసుపు రంగు

ఈ పసుపు రంగు రాళ్లు దేశంలో ఉన్న రాష్ట్రాలు రాష్ట్రాల మధ్య దారులను కలుపుతాయి. ఈ రోడ్లని జాతీయ రహదారులు అంటారు. వ్యాపార సంబంధమైన అవసరాల కొరకు, సరుకుల రవాణాకు చాలా బాగా ఉపయోగపడుతాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. మరమ్మత్తులు గానీ రహదారుల భద్రతకు సంబంధించిగానీ కేంద్ర మంత్రిత్వ రవాణా శాఖ మరియు రహదారులు చూసుకుంటుంది. పై భాగంలో పసుపు రంగు కింది భాగంలో తెలుపు రంగు పూసి ఉంటారు. కిలోమీటర్లు, ఊర్ల పేరు రాసి ఉంటారు. వీటిని నేషనల్ హైవేస్ అని పిలుస్తారు.

బూడిద రంగు

ఈ రంగు దేశంలో ఎక్కడైనా రోడ్డు మార్గంలో వెళ్ళేటప్పుడు మనకు నదులు, కాలవులు, రైల్వే ట్రాక్‌లపైన బ్రిడ్జిలు కట్టివుంటారు. ఆ వంతెనలను సూచించడానికి, ఇక్కడ వంతెన ఉంది అని ముందుగానే వాహనాదారులను హెచ్చరించడానికి, ప్రమాదాలను నివారించడానికి ఆ బూడిద రంగు రాళ్లను నాటుతారు. ఇది మైలురాయి కాదు, దూరాన్ని తెలిపేది కూడా కాదు.

గోధుమ రంగు

ఈ గోధుమ రంగు రాయిని పోర్టులను గుర్తించడానికి నాటే రాయి. ఈ గోధుమ రంగు రాయి ఉంది అంటే అది ఓడలు, పెద్ద పెద్ద షిప్పులు ఉండే సముద్రం తీరం అని గమనించాలి. అంతర్జాతీయంగా దేశావిదేశాలతో వ్యాపారాలు చేయడానికి, సరుకును ఎగుమతులు, దిగుమతులు చేసుకోవడానికి ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. దీనిని ఆ పోర్టుకు సంబంధించిన వాళ్లు లేదా ఆ తీర ప్రాంతం ఎక్కడ ఉంటే ఆ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వం కార్యకలాపాలను నిర్వహించడం జరుగుతుంది.

నీలం రంగు

నీలం రంగు రాయి విమానాలకు వెళ్లే దారిని చూపిస్తుంది. విమానాశ్రయానికి వెళ్లే రోడ్డులో ఈ రాళ్ళను నాటుతారు. విమానం ఆకాశంలో ఎగురుతుంది కాబట్టి ఆకాశం నీలం రంగు లో ఉంటుంది గనుక ఆ ప్రాంతానికి వెళ్లే దారిలో నీలం రంగు రాళ్లను నాటుతారు. విమాన శాఖ వీటి యొక్క బాధ్యతను నిర్వహించడం జరుగుతుంది.

ఎరుపు రంగు

ఈ ఎరుపు రంగు కలిగిన రాళ్లను మనం ఎక్కువ సార్లు చూసి ఉంటాము. రైల్వే గేట్ వేసినప్పుడు అందరూ అక్కడ ఆగినప్పుడు రోడ్డు దగ్గర మనకు ఈ రాళ్లు కనిపిస్తాయి. అవి ఎరుపు రంగులో ఉండటానికి కారణం ఏమిటి అంటే అవి ప్రమాదాన్ని సూచిస్తాయి. వచ్చిపోయే ప్రయాణికులను అలర్ట్‌గా ఉండమని దాని యొక్క అర్థం. వీటిని రైల్వే శాఖ పర్యవేక్షణ చేస్తుంది.

ఆ విధంగా ఏయే రాయి ఎందుకు నాటుతారో, వాటి ఉపయోగాలు ఏమిటో చాలా మందికి తెలిసే అవకాశం ఉంటుంది అని భావిస్తున్నాను. ఇవి మీ పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడచ్చు.

చిరు ఖాతాలో హిట్ పడినట్టేనా?.. అనిల్ రావిపూడికి ఎలా సాధ్యమైంది!

0

మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటించిన చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు.. ఈ రోజు (జనవరి 12) విడుదలైంది. సాహు గారపాటి, కొణిదెల సుష్మిత సంయుక్తంగా షైన్ స్క్రీన్స్ అండ్ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ మూవీని నిర్మించారు. ఫేమస్ తెలుగు ఫిలిం డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్ అతిధి పాత్రలో నటించారు.

చిరంజీవి ఖాతాలో మరో విజయం

ఫన్ అండ్ యాక్షన్ ప్రధానంగా తెరకెక్కిన మన శంకర వర ప్రసాద్ గారు సినిమా ఆద్యంతం అదే వినోదంతో కొనసాగినట్టుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మళ్లీ తిరిగి పాత చిరంజీవిని చూపించారని, వయసుతో సంబంధం లేకుండా పోటీపడి నటించారని ఆయన అభిమానులే కాకుండా.. మిగిలినటువంటి సినిమా ప్రేక్షకులు సైతం కొనియాడుతున్నారు. మొదటి రోజే ఓవ‌ర్సీస్‌లో దాదాపు 1. 20 మిలియన్ డాలర్స్ దాక రాబట్టి గత గణాంకాల చరిత్రను తిరగరాసినట్టు తెలుస్తోంది.

రిలీజ్‌కు ముందే దగ్గరదగ్గర రూ.100 కోట్లు పైనే వసూళ్లు జరిగినట్టు వార్తలు వచ్చాయి. రివ్యూ వెబ్సైట్స్ అయితే 3.5 వరకు రేటింగ్ ఇచ్చి పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశాయి. సంక్రాతికి మంచి కుటుంబ కథా చిత్రాన్ని అందించారని సినిమా ప్రేమికులు భావిస్తున్నారు. చిరంజీవి తన శైలిలో హాస్యాన్ని, డ్యాన్స్ మరియు నటనను అద్భుతంగా పండించినట్టు చెబుతున్నారు.

డైరెక్టర్ ఫార్ములా

అనిల్ రావిపూడి తన మొదటి చిత్రం పటాస్ నుంచి.. నేటి మన శంకరవరప్రసాద్ గారు సినిమా వరకు కూడా అన్ని మాస్, కామెడీ, యాక్షన్ ప్రాముఖ్యతను ఇస్తూ వస్తున్నాడు. ఆయన ఎంచుకున్న ఫార్ములా ఏదైతే ఉందో.. అది అతనిని ప్రతిసారి విజయాల బాట పట్టిస్తూనే ఉంది. అయితే చిరంజీవి రాజకీయాలు వదిలి సినిమాల్లోకి వచ్చాక చేసిన ఆరు చిత్రాల్లో కేవలం ఖైదీ నెం 150, వాల్తేరు వీరయ్య రెండు మాత్రమే బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నాయి. సైరా నరసింహారెడ్డి, గాడ్ పాదర్ (మలయాళం రీమేక్) చిత్రాలు యావరేజ్‌గా నడిచాయి. తక్కిన రెండు చిత్రాలు ఆచార్య, భోళా శంకర్ అత్యంత దారుణంగా పరాజయం పాలైనట్టు సమాచారం. కాబట్టి ఇప్పుడు చిరంజీవికి ఒక మంచి హిట్ అవసరం అయింది.

చాన్నాళ్ల తరువాత సక్సెస్

ఈ సమయంలో ఓటమి ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి చిరు కోసం చంటబ్బాయి, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఘరానా మొగుడు లాంటి కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ కథను సిద్ధం చేసుకొని సినిమా చేశాడు. అంతకు ముందు దర్శకులు ఎవరు చేయలేనిది అనిల్ చేసింది ఏమిటంటే.. అందరికి నచ్చిన పాతతరం చిరుని మళ్లీ తిరిగి తీసుకురావడమే. అడపాదడప చిన్న చిన్న ప్రయత్నాలు జరిగిన మన శంకరవరప్రసాద్ గారు లాగా అయితే సక్సెస్ కాలేకపోయాయి.

నయనతారతో అంతకు మునుపు ఎప్పుడు చిరు నటించిన దాఖలాలు లేవు. సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చాక వరుసగా మూడు చిత్రాల్లో కలిసి నటించారు. అనిల్ ఈ సినిమాలో కూడా అదే కాంబినేషన్ కొనసాగించాడు. ఆమె కూడా ఆ పాత్రకు అంతే న్యాయం చేసింది. ఇక మంచి ఫామ్‌లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సంగీత దర్శకుడిగా ఎంచుకోవడం కలిసొచ్చిన అంశం. ఆయన చేసిన పాటలన్నీ కూడా చిన్నా..పెద్ద బేధం లేకుండా అందరికీ తెగ నచ్చేసాయి. మీసాల పిల్ల, హుక్ స్టెప్, శశిరేక, చిరు వెంకీ సాంగ్ అన్నీ కూడా పెద్ద హిట్ అయ్యాయి.

ఫన్ అండ్ పాజిటివ్..

చిరంజీవి, నయనతార ఇద్దరి డాన్స్ ఊర మాస్ అనే చెప్పాలి. దీనికి తోడు ఒకప్పుడు చిరంజీవికి పాటలు పాడిన ఉదిత్ నారాయణ్, బాబా సెహెగెల్ లాంటి వింటేజ్ సింగర్లను తీసుకొచ్చి పాటలు పాడించాడు అనిల్ రావిపూడి. విక్టరీ వెంకటేశ్‌తో తీసిన ఎఫ్-2, ఎఫ్-3, సంక్రాతికి వస్తున్నాం సినిమాలతో అనిల్‌కు ఉన్న సత్సంబంధాల కారణంగా చిరు, వెంకీ కాంబినేషన్ సెట్ చేశాడు. వారి ఇద్దరి సన్నివేశాలు అభిమానులకు సరైన ఫన్ పాజిటివ్ ఎనర్జీని ఇస్తున్నాయి. ఇక సినిమా ప్రమోషన్స్ కూడా డైరెక్టర్ స్టైల్‌లో ప్రత్యేకంగా చేయడంతో ప్రేక్షకులకు మన శంకరవరప్రసాద్ గారు చిత్రం బాగా దగ్గరైయింది. ప్రస్తుతం ప్రేక్షకుల దగ్గర నుంచి.. మంచి హిట్ పాజిటివ్ రెస్పాన్స్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాతికి అసలైన వినోదాత్మక సినిమాగా థియేటర్లలో నడుస్తోంది.

బోగి మంటల్లో ఇవన్నీ వేస్తే.. కాలుష్య మండలి హెచ్చరిక!

తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం ప్రారంభమైంది. ప్రతి ఏటా.. జనవరి మాసంలో బోగి, సంక్రాతి, కనుమ పండుగలను వరుసగా జరుపుకుంటారు. అందరూ కూడా ఈ సందర్బంగా తెల్లవారుజామున వీధుల్లో లేదా ఇంటి ముందు బోగి మంటలు వేయడం ఆనవాయితీ. పాత వస్తువులును ఆ మంటలలో వేసి కొత్త దనాన్ని జీవితంలోకి ఆహ్వానించడం దీని ఉద్యేశంగా చెబుతారు. అయితే ఈ బోగి మంటలు వేసే క్రమంలో ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే విషయంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పీ. కృష్ణయ్య ప్రజలకు కొన్ని సూచనలు, సలహాలు అందించారు.

ఏపీ కాలుష్య మండలి చైర్మన్ సూచనలు

బోగి పండుగను ప్రజలందరికి ఆరోగ్యకరమైన వాతావరణంలో జరుపుకోవాలని, ఎటువంటి ప్రమాదకరమైన వస్తువులు కూడా మంటల్లో వేయకూడదని ఆయన తెలిపారు. మంచు కురిసే కాలంలో గాలిలో దూళి కణాలు ఎక్కువగా ఉంటాయని.. ఈ తరుణంలో మంటలలో విషపూరిత వస్తువులు వేయడం కారణంగా వచ్చే పొగలు వలన జనం ఆరోగ్య పరిస్థితులపైన దాని ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని తెలిపారు. పొద్దు పొద్దున్నే అన్ని ఊర్లల్లో కూడా మంచు ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి సమయంలో ఏవిపడితే అవి తీసుకొచ్చి మంటపెట్టి.. అది గాలిలో కలిసి ప్రజలకు హాని కలిగిస్తాయి.

ఉపయోగించకూడని వస్తువులు

కొంతమంది అయితే.. అందరూ మంటలు వేస్తున్నారు మనం కూడా ఏదో ఒకటి చేయాలనే ఆత్రుతలోనో సరదాకోసమే ఏది దొరికితే అది తీసుకొచ్చి బోగి మంటల్లో వేస్తుంటారు. అలాంటి వారిని ఆయన హెచ్చరించారు. వాడని వాహనాల టైర్లు, ఎన్నో రకాల కెమికల్ కలిసిన ప్లెక్సీలు, బ్యానర్లు, అనేక రకాల ప్లాస్టిక్ కవర్లు, డబ్బాలు, బిందెలు, చెప్పులు, మనం ఎలాగో వాడటం లేదు కదా అని వాటన్నింటిని బోగి మంటల్లో పడేస్తుంటారు. ఇవి కాలి కార్బన్ , మెర్క్యూరి, సల్ఫర్, నైట్రోజన్ లాంటి యాసిడ్స్, ఆక్సిజన్స్ వాతావరణంలో కలిసి మొత్తం కాలుష్యం విషం అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి, ఇది గుర్తించి అటువంటి వ్యర్థ పదార్థాలను ఉపయోగించకూడదని వారు కోరడం జరిగింది.

ఇలాంటి ప్రమాదాలు వచ్చే అవకాశం!

ఈ విధంగా విడుదలయ్యే ప్రమాదకర వాయువులు మనుషుల అనారోగ్యానికి తీవ్ర కారణం అవుతాయి. క్యాన్సర్ రావడం, ఒళ్లంతా దురదలు పుట్టడం, కళ్లు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తులు, గుండె వంటి అవయవాలన్నింటికి సంబంధిత శాశ్వతమైన అనేక రకాల వ్యాధులు రావడానికి, భవిష్యత్తులో మరింతగా పెరగడానికి దారి తీస్తాయని చైర్మన్ హెచ్చరించారు. కొంత మంది తెలిసి, ఇంకొంత మంది తెలియక చేసే కొన్ని తప్పిదాల వల్ల చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది. వీలైనంత వరకు అలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటే సమాజానికి ఎంతో కొంత మేలు చేసినవాళ్లము అవుతాము.

బోగి ఇలా జరుపుకోండి!

అయితే ఇక్కడ బోగి పండుగ చేసుకోవద్దా అనే ప్రశ్నలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏ పండగైనా మనం జరుపుకోవచ్చును కానీ అది మనలో సుఖ సంతోషాలను, ఆయురారోగ్యాలను కలిగించే విధంగా ఉండాలి. ఎవరికి ఎటువంటి హాని తలపెట్టకుండా పదికాలాల పాటు పచ్చగా బతకాలి. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ చెప్పిదాని ప్రకారం మన ఇంటి దగ్గర దొరికే సహజమైన కట్టెలు, చెట్లలోని ఆకులు, సేధ్యానికి ఉపయోగపడని పాత పనిముట్లు, హానికరం కానీ ఏ వస్తువులు అయినా వాడుకోవచ్చు అని తెలిపారు. మన ఇంట్లో పాతబడిపోయిన వాటిని తీసుకొచ్చి వీధుల్లో వేసి మంట పెట్టకుండా దయచేసి చెత్తను తీసుకెళ్లే పారిశుధ్య శాఖ వాహనాల వారికి వాటిని అప్పజెబితే వారు తీసుకెళ్తారని ఈ సందర్బంగా ఆయన తెలియజేశారు. ప్రజల అందరినీ కూడా మంచి వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఆయన కోరారు.

10వ తరగతి, ఇంటర్ అర్హతతో.. ప్రభుత్వ, ప్రైవేట్ జాబ్స్

0

చదువు పూర్తయిన చాలామంది లక్ష్యం జాబ్ తెచ్చుకోవడమే. అది 10వ తరగతి చదివినవాళ్లకైనా, ఇంటర్ పూర్తి చేసినవాళ్లకైనా, డిగ్రీ & పీజీలు చేసినవాళ్లకైనా. నిజానికి నేటి ఆధునిక కాలంలో చదువు కేవలం ఒక అర్హత మాత్రమే. మనిషికి ఉన్న తెలివి, సామర్థ్యాలను బట్టి కూడా ఉద్యోగాలు వచ్చేస్తున్నాయ్. అయితే ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రం చాలా గట్టిగా సిద్దమవ్వాల్సి ఉంటుంది. ఈ కథనంలో 10వ తరగతి, ఇంటర్ పూర్తి చేసిన తరువాత లభించే ఉద్యోగాలు ఏవి?, అనే విషయాలు తెలుసుకుందాం.

10వ తరగతి అర్హతతో జాబ్స్

చాలామంది 10వ తరగతి అర్హతతో ఏ జాబ్స్ వస్తాయి అనుకుంటారు. నిజానికి ఇది చాలా పొరపాటు. ఎందుకంటే 10వ తరగతి అర్హతతో బోలెడన్ని జాబ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు మాత్రమే కాకుండా.. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి.

సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు
➤ఎస్ఎస్సీ: మల్టి టాస్కింగ్ స్టాఫ్
➤ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్
➤ఇండియన్ రైల్వేస్ (ట్రాక్ మ్యాన్, హెల్పర్)
➤ఇండియా పోస్ట్: గ్రామీణ డెక్ సేవక్
➤డిఫెన్స్: ఆర్మీ (జీడీ)
➤నేవీ: సైలర్ ఎమ్ఆర్
➤ఎయిర్ ఫోర్స్ (గ్రూప్ సీ)

స్టేట్ గవర్నమెంట్ (ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ)
➤పోలీస్ డిపార్ట్మెంట్: కానిస్టేబుల్
➤పంచాయితీ లేదా మున్సిపల్ శాఖ: ఆఫీస్ సబార్డినేట్, స్వీపర్ / అటెండర్
➤ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్: హెల్పర్
➤హెల్త్ డిపార్ట్మెంట్: వార్డుబాయ్ / ఆయా

ప్రైవేట్ జాబ్స్
➤ఫ్యాక్టరీ వర్కర్స్
➤డేటా ఎంట్రీ ఆపరేటర్
➤ఆఫీస్ బాయ్
➤డెలివరీ ఎగ్జిక్యూటివ్ (స్విగ్గీ, జొమాటో, అమెజాన్)
➤సెక్యూరిటీ గార్డ్
➤సేల్స్ బాయ్
➤షోరూమ్ అసిస్టెంట్

ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు

సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు
➤ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్
➤లోయర్ డివిజన్ క్లర్క్
➤డేటా ఎంట్రీ ఆపరేటర్
➤ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్
➤ఇండియన్ రైల్వే: క్లర్క్, టికెట్ కలెక్టర్
➤ఇండియా పోస్ట్: పోస్టర్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్
➤డిఫెన్స్ జాబ్స్: ఆర్మీ (క్లర్క్. జీడీ), నేవీ (ఎస్ఎస్ఆర్ / ఏఏ), ఎయిర్ ఫోర్స్ (గ్రూప్ ఎక్స్ & వై)

స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు (ఏపీ / టీఎస్)
➤పోలీస్ శాఖ: కానిస్టేబుల్
➤రెవెన్యూ / పంచాయితీ శాఖ: జూనియర్ అసిస్టెంట్
➤ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్: జూనియర్ లైన్ మ్యాన్ (జేఎల్ఎమ్)
➤రవాణా శాఖ: కండక్టర్

ప్రైవేట్ ఉద్యోగాలు
➤డేటా ఎంట్రీ ఆపరేటర్
➤జూనియర్ క్లర్క్
➤కాల్ సెంటర్ / బీపీఓ ఎగ్జిక్యూటివ్
➤బ్యాంక్ జాబ్స్: రిసెప్షనిస్ట్ / సేల్స్ ఎగ్జిక్యూటివ్ / ఇన్సూరెన్స్ అడ్వైసర్

చదువు పూర్తయిన తరువాత ప్రభుత్వ జాబ్ తెచ్చుకోవడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో.. ప్రతి ఏటా చాలామంది చదువు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. వీరందరికీ ప్రభుత్వ ఉద్యోగం అంటే అసాధ్యమే. అయితే తప్పకుండా గట్టిగా ప్రయత్నిస్తే.. గవర్నమెంట్ జాబ్ తెచుకొవడం అంత కష్టమేమీ కాదు. అయితే ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగం కోసమే ప్రయత్నాలు చేయడం బహుశా మూర్ఖత్వమే అవుతుంది.

ఉద్యోగం ప్రధాన లక్ష్యం జీతం తీసుకోవడమే. అది ప్రభుత్వ రంగమైనా, ప్రైవేట్ అయినా. ప్రైవేట్ ఉద్యోగాల్లో భద్రత కొంత ప్రశ్నార్థకమే అయినప్పటికీ.. ఉన్నన్ని రోజులు మంచి జీతం తీసుకోవచ్చు. కాబట్టి దేనికైనా వంద శాతం కృషి చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్న లోపం ఉండకూడదు. ఉద్యోగం ఏదైనా అంకిత భావంతో చేస్తే.. తప్పకుండా పురోగతి కనిపిస్తుంది. ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది.

రెండో పెళ్లి తర్వాత ఫస్ట్‌ మూవీ.. ఈసారి మరింత పవర్‌ఫుల్‌గా!

0

సమంత లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో నటిస్తున్న తాజా సినిమా మా ఇంటి బంగారం. నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ట్రలాల మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత, రాజ్ నిడిమోరు & హిమాంక్ దువ్వూరు కలిసి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దీనికి సంబంధించిన్ ట్రైలర్‌ను మూవీ టీమ్ విడుదల చేయడం జరిగింది.

రెండో పెళ్లి తరువాత మొదటి సినిమా..

నటి సమంత రుత్ ప్రభు తన రెండో వివాహం తరువాత చేస్తున్న మొదటి చిత్రం ఇది. నాగచైతన్యతో 2021లో విడాకులు తీసుకున్న తరువాత తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు, నిందలు మోస్తూ వచ్చింది. ఇంటా, బయట అన్ని సోషల్ మీడియా వేదికలలోనూ ఎన్నో రకాల మాటలు భరిస్తూ వచ్చింది. అయితే ఈ పరిస్థితుల మధ్య తను ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మహానటి, ఓ బేబీ, యూ టర్న్, యశోద, జాను, శాకుంతలం, ఖుషి ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తోంది.

ఇదిలా ఉండగా.. గత సంవత్సరం 2025 డిసెంబర్‌లో సమంత.. ప్రొడ్యూసర్ రాజ్ నిడిమోరుతో కలిసి తన రెండో వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. పెళ్లి అయిన తరువాత తను చేస్తున్న మొదటి చిత్రం ఈ మా ఇంటి బంగారం. నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోంది. శ్యామ్, నందిని వీరిద్దరి కలయికలో ఇది రెండో సినిమాగా వస్తోంది. మునుపు వీరు ఓ బేబీ అనే సినిమా చేశారు. అది వారి ఇద్దరికీ కూడా మంచి విజయాన్ని అందించింది. ఇప్పుడు మా ఇంటి బంగారం మూవీ కూడా అదే విధంగా సక్సెస్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.

సొంత బ్యానర్‌పై సినిమా..

సమంత మా ఇంటి బంగారం సినిమాను తన సొంత బ్యానర్‌పై తానే నిర్మిస్తోంది. అయితే పోయిన ఏడాది శుభం అనే చిత్రాన్ని ఆమె ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి ఇందులో కూడా తనకి మంచి అనుభవం ఉంది. భర్త రాజ్ నిడిమోరు కూడా సహ నిర్మాతగా ఉన్నారు మరియు కథ కూడా అందించారు. పెళ్లి కాకముందు ది ఫ్యామిలీ మ్యాన్ -2, సిటాడెల్,హనీ బన్నీ లాంటి వెబ్ సిరీస్‌లు వీరి కాంబినేషన్‌లో వచ్చాయి. ఇక ఈ సినిమాకి సంగీతం అందించిన సంతోష్ నారాయణ్00 తమిళ చిత్ర పరిశ్రమలో అత్యంత ఆదరణ, గుర్తింపు కలిగిన మంచి సంగీత దర్శకుడు. అతని మ్యూజిక్ స్టైల్ మార్క్ ఈ మా ఇంటి బంగారం సినిమా ట్రైలర్‌లో కనిపిస్తోంది. మాటలు తక్కువ యాక్షన్ ఎక్కువ ఉన్న ఈ టీజర్‌కు మ్యూజిక్ బలంగా పనిచేసింది. చిత్రంలో శ్రీముఖి, గుల్షన్ దేవయ్య, గౌతమి లాంటి వారు ప్రధాన పాత్రల్లో నటించారు.

ఫుల్ యాక్షన్ మోడ్‌లో

మా ఇంటి బంగారం అనే టైటిల్‌కు సమంత సరిగ్గా సరిపోయింది అని చెప్పొచ్చు. ట్రైలర్ అద్భుతంగా ఉంది. పబ్లిక్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఒక సాధారణ కుటుంబ స్త్రీ గా వీడియో మొదటలో మనకు కనిపిస్తుంది.. కానీ చివరికి వచ్చే సరికి ఒక రెబల్ మాదిరిగా తయారవుతుంది. ఫుల్ యాక్షన్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. చీర కట్టులోనే ఫైట్ సీన్స్ మొత్తం అద్భుతంగా చేసింది. ఇంట్లో మాత్రం అందరూ మెచ్చిన ఇల్లాలుగా బాగా నటించడం జరిగింది. ఈ చిత్రంలో మనం ఇంతకు ముందు ఎప్పుడు చూడని సమంతను చూస్తాము. ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉన్నట్టగా అర్థమవుతోంది. తుపాకులు పట్టుకుని ఊర మాస్‌గా కనిపిస్తున్న సమంత ఏ విధంగా ఆకట్టుకుంటుందో సినిమా విడుదల తరువాత తెలుస్తుంది.

2026లో పోటీ పరీక్షల షెడ్యూల్: ఇలా చదివితే సక్సెస్ మీదే!

0

సాధారణంగా చదువుతున్న విద్యార్థులు తమ వార్షిక పరీక్షల కోసం.. చదివు పూర్తి చేసుకున్న అభ్యర్థులు పోటీ పరీక్షల కోసం సన్నద్ధమవుతుంటారు. ఈ ఇరువురికి కొత్త ఏడాది వచ్చిందంటే.. ఎగ్జామ్స్ మొదలవుతాయి. పదవతరగతి, ఇతర విద్యార్థులకు కూడా పరీక్షలు ప్రారంభమవుతాయి. రానున్న రెండు మూడు నెలల్లో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఏ పరీక్షలు ఉన్నాయి?, వాటికోసం ఎలా సిద్ధమవ్వాలి?, అనే విషయాలను ఇక్కడ వివరంగా చూసేద్దాం.

2026 జనవరిలో పరీక్షల షెడ్యూల్

తెలంగాణ టెట్ (టీజీ టెట్): 2026 జనవరి 03 నుంచి 20 మధ్య పరీక్షలు జరుగుతాయి.
ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్-II: 2026 జనవరి 18, 19 తేదీల్లో
సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (ఏఐఎస్ఎస్ఈఈ): 2026 జనవరి 18న
జేఈఈ మెయిన్స్ సెషన్ 1: 2026 జనవరి 21 నుంచి 30 వరకు జరుగుతాయి.
ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్: 2026 జనవరి 27, 28వ తేదీల్లో..
ఆంధ్రప్రదేశ్ జూనియర్ లెక్షరర్ (లైబ్రరీ సైన్స్), ఏఎంవీఐ: జనవరి 27, 28వ తేదీల్లో..
ఆంధ్రప్రదేశ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (గ్రేడ్-2), అసిస్టెంట్ ఇంజనీర్: 2026 జనవరి 27, 28, 29వ తేదీల్లో జరుగుతాయి.
ఎస్ఎస్సీ స్టెనో స్కిల్ టెస్ట్: 2026 జనవరి 28, 29వ తేదీల్లో జరుగుతాయి.

2026 ఫిబ్రవరిలోని ఎగ్జామ్స్

2026 ఫిబ్రవరి 04: ఎస్ఎస్సీ మల్టీ టాస్కింగ్ (ఎంటీఎస్)
2026 ఫిబ్రవరి 07: నవోదయ (9వ, 11వ తరగతి) పరీక్షలు
2026 ఫిబ్రవరి 7 నుంచి 15 మధ్య: గేట్ 2026 ఎగ్జామ్స్
ఫిబ్రవరి 9,10వ తేదీలు: ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్
ఫిబ్రవరి 11న: ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3
ఫిబ్రవరి 11, 12 తేదీలు: ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోలర్
ఫిబ్రవరి 12, 13 తేదీల్లో: ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్
ఫిబ్రవరి 23న: ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్

మార్చి 2026లో పరీక్షలు

సీబీఎస్ఈ స్టేట్ బోర్డు ఎగ్జామ్స్
ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సీ బోర్డ్ ఎగ్జామ్స్
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలు
తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్
ఆర్ఆర్బీ (రైల్వే ఎగ్జామ్స్ -టెక్నికల్/ ఏఎల్పీ/ ప్యారామెడికల్)
జేఈఈ మెయిన్స్
యూపీఎస్సీ- సివిల్ సర్వీసెస్

పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలంటే?

విద్యార్థులైనా.. ఉద్యోగం కోసం సిద్దమవుతున్న అభ్యర్థులైనా.. వారి లక్ష్యం టార్గెట్ రీచ్ అవ్వడమే. అంటే విద్యార్థులు ఎగ్జామ్ పాస్ అవ్వాలి. అభ్యర్థులు జాబ్ కొట్టాలి. కాబట్టి లక్ష్యాన్ని సాధించడానికి ముందుగా ఒక టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోవాలి. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుని.. తదేక దీక్షతో చేస్తే, తప్పకుండా లక్ష్యం సాధించడం మహా కష్టమేమీ కాదు. అయితే దానికోసం ఒక పటిష్టమైన ప్రణాళిక అవసరం.

అప్పుడే సక్సెస్ సాధ్యమవుతుంది!

చదుకోవడం అంటే.. చదివింది గుర్తు పెట్టుకోవడం అన్నమాట. ఇది శరీరానికి సంబంధించినది కాదు. మెదడుకు సంబంధించింది. కాబట్టి మెడిటేషన్ అవసరం. మెదడు పదునుగా ఉంటే సరిపోతుంది అనుకుంటే.. అది మీ అమాయకత్వమే అవుతుంది. కాబట్టి అటు బ్రెయిన్ యాక్టివ్ అవ్వాలి. శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే అనుకున్నది సాధించడానికి సాధ్యమవుతుంది. పరీక్ష ఏదైనా.. ఒక ప్రణాళికతో చదివితే తప్పకుండా సక్సెస్ సాధ్యమవుతుంది. ఆదమరిస్తే.. పోటీ ప్రపంచంలో గెట్ ఇన్ అవ్వడం చాలా కష్టమవుతుంది. సమయాన్ని ఏ మాత్రం వృధా చేయకుండా ముందుకు సాగాలి. ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు నిర్మించుకుంటూనే ఉండాలి.

ఛార్జీల విషయంపై కీలక ప్రకటన.. రవాణాశాఖ హెచ్చరిక

0

సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. నగరాల్లో ఉండే దాదాపు అందరూ ఇళ్ల బాట పడతారు. ఈ సమయంలో కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం అధిక ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ కీలక ప్రకటన జారీ చేసింది.

అధిక ఛార్జీలు వసూలు చేస్తే..

పండుగ (సంక్రాంతి) సీజన్‌ను ఆసరాగా తీసుకుని.. ప్రయాణికుల నుంచి ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే, కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది రవాణా శాఖ హెచ్చరించింది. అంతే కాకుండా చట్ట విరుద్ధమైన వస్తువులను రవాణా చేయడం కూడా నేరమని పేర్కొంది. పర్మిట్ రూల్స్ అతిక్రమించడం, కాంట్రాక్ట్ క్యారేజిలను స్టేజ్ క్యారేజీలుగా నడపడం వంటివి చేయకూడదని బస్సు ఆపరేటర్లను హెచ్చరించింది.

నిబంధనలు ఉల్లంఘిస్తే..

సంక్రాంతి సీజన్‌లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ బస్సులపై ప్రత్యేకమైన తనిఖీలు నిర్వహించాలని రవాణా శాఖ సంబంధిత అధికారులను ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను స్వాధీనం చేసుకోమని స్పష్టం చేసింది. ప్రతి బస్సు.. రాష్ట్ర రవాణా నిబంధనలను అనుకూలంగా ఉండాలని హెచ్చరించింది. ప్రయాణికులకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా రవాణాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

భద్రత ముఖ్యం

గత కొన్ని రోజులుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురవ్వడం, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం వంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రవాణాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ బస్సు యాజమాన్యానికి కీలక సూచనలు చేసింది. ప్రజలు సంతోషంగా పండుగ జరుపుకోవడానికి ఇళ్లకు వెళ్లే సమయంలో విషాదం నెలకొంటే.. చాలా బాధాకరం. కాబట్టి ట్రావెల్స్ యాజమాన్యం కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ట్రావెల్స్ యాజమాన్యం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బస్సు ప్రయాణానికి సిద్దమవ్వడానికి ముందే.. బ్రేక్స్ సరిగ్గా ఉన్నాయా? లేదా? అని చెక్ చేసుకోవాలి. ఇంకా ఏదైనా ఇబ్బందులు బస్సులో ఉన్నాయా?, ఒకవేళా సమస్యలు ఉంటే వాటిని తప్పకుండా పరిష్కరించుకోవాలి. సమస్యలు ఉన్న బస్సును నడిపితే.. అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే.. అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఛార్జీల విషయానికి వస్తే..

కొంతమంది ప్రైవేట్ యాజమాన్యం.. పండుగ సీజన్ సమయంలో ప్రయాణికుల నుంచి ఎక్కువ డబ్బు వసూలు చేసిన సందర్భాలు గతంలో కూడా కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇది సాధారణ ప్రజలకు ఒకరకంగా ఆర్ధిక భారం కూడా. కాబట్టి ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు ఎట్టి పరిస్థితుల్లో అధిక ఛార్జీలు వసూలు చేయకూడదు. ఇది చట్టరీత్యా నేరం కూడా.

రవాణాశాఖ ఆదాయం

2025-26 ఆర్ధిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలంలో తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ.. మొత్తం 5142 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించినట్లు వెల్లడించింది. ఇందులో రూ. 3611 కోట్లు లైఫ్‌టైమ్ ట్యాక్స్, రూ. 730 కోట్లు త్రైమాసిక పన్ను, గ్రీన్ ట్యాక్స్ రూ. 57 కోట్లు కాగా.. వివిధ ఫీజుల ద్వారా రూ. 408 కోట్లు వచ్చినట్లు సమాచారం. తనిఖీల ద్వారా రూ. 153 కోట్లు, సర్వీస్ ఛార్జీల ద్వారా రూ. 181 కోట్ల ఆదాయం లభించింది.