Home Blog Page 66

అనిల్ రావిపూడికి మెగాస్టార్ గిఫ్ట్.. ఈ కారు ధర ఎంతో తెలుసా?

0

ఒక సినిమా హిట్ కొట్టగానే.. నిర్మాతలు డైరెక్టర్లకు, హీరోలకు ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వడం చాన్నాళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. కొన్ని సందర్భాల్లో హీరోలు కూడా డైరెక్టర్లకు లగ్జరీ కార్లను గిఫ్ట్స్ ఇస్తూ.. సర్‌ప్రైజ్ చేస్తుంటారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి.. దర్శకుడు అనిల్ రావిపూడికి రేంజ్ రోవర్ కారును గిఫ్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కారు ధర ఎంత?, ఇతర వివరాలు ఏమిటనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

మెగాస్టార్ ఖరీదైన కారు గిఫ్ట్

చిరంజీవి, నయనతార నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతికి రిలీజై మంచి హిట్ సాధించింది. ఇప్పటికే ఈ మూవీ రూ. 300 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్ సాధించింది. సినిమా బ్లాక్ బస్టర్ సాధించడంతో.. మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడికి ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ కారును గిఫ్ట్ ఇచ్చారు.

కారును గిఫ్ట్ ఇస్తూ.. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, సేఫ్టీ చాలా ముఖ్యమని చిరంజీవి పేర్కొన్నారు. కారు నచ్చిందా అని చిరంజీవి అడగడంతో.. నచ్చడం ఏమిటి సర్ మహదానందం అని సినిమాలోని డైలాగ్ చెబుతారు అనిల్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు అనిల్ రావిపూడికి శుభాకాంక్షలు చెబుతున్నారు.

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్

మెగాస్టార్ చిరంజీవి.. అనిల్ రావిపూడికి గిఫ్ట్ ఇచ్చిన కారు ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ వేలార్ అని తెలుస్తోంది. దీని ధర ఇండియన్ మార్కెట్లో రూ. 85 లక్షల నుంచి రూ. 95 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. అత్యాధునిక డిజైన్ కలిగిన ఈ కారు.. ఎక్కువమంది సెలబ్రిటీలకు ఇష్టమైన కార్లలో ఒకరి. ఈ కారణంగానే చాలామంది దీనిని కొనుగోలు చేస్తూ ఉంటారు.

రేంజ్ రోవర్ వేలార్ కారు డీజిల్, పెట్రోల్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 300 పీఎస్ పవర్, 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ 240 పీఎస్ పవర్, 500 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు 220 కిమీ / గం వరకు వేగవంతం (యాక్సలరేషన్) అవుతుంది.

డిజైన్ మరియు ఫీచర్స్ ఇలా

స్లీక్ గ్రిల్, సన్నని ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వంటివి కలిగి ఉండే.. రేంజ్ రోవర్ వేలార్ కారు లెదర్ సీట్లు, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లతో చాలా లగ్జరీగా ఉంటుంది. వాహన వినియోగదారులకు ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. డ్యాష్‌బోర్డ్‌లో డ్యూయెల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మెరిడియన్ సౌండ్ సిస్టంలాంటి ఫీచర్స్ కూడా ఈ కారులో లభిస్తాయి.

రేంజ్ రోవర్ వేలార్ కారు అత్యంత సురక్షితమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. జాబితాలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. ఈ సేఫ్టీ ఫీచర్స్ ప్రమాదం సమయంలో వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి. ప్రయాణిల ప్రాణాలకు కొంత రక్షణ అందిస్తాయి.

జాతీయ ఓటర్ల దినోత్సవం: ఇదేనా అంబేద్కర్ కోరుకుంది?.. ప్రజలు చేస్తున్నదేమిటి!

0

ఈ రోజు (ఆదివారం) భారత జాతీయ ఓటర్ల దినోత్సవం. దేశం అంతటా ఇవాళ ఓటర్ల దినోత్సవాన్ని పురష్కరించుకుని.. అన్ని చోట్లా ఘనంగా కార్యక్రమాలను నిర్వహిస్తారు. 1950 జనవరి 25న మనకు భారతదేశంలో భారత ఎన్నికల సంఘం ఏర్పాటు చేయబడింది. దానిని పురష్కరించుకుని 2011 నుంచి ప్రతి ఏటా జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటూ వస్తున్నాము. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, విశ్వవిద్యాలయాలు అన్నిటిలోనూ వేడుకగా నిర్వహిస్తారు. కొంతమంది ప్రముఖులు ఓటు ఆవశ్యకతను, ప్రయోజనాన్ని ఈ సందర్బంగా తెలియజేస్తారు. పట్టణ, పల్లె ప్రాంతాల్లో ఓటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొత్తగా నమోదు చేసుకున్న యువ ఓటర్లకు ఓటు కార్డును అందజేస్తారు. ఇవాళ 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.

చదువుకున్నవారికే ఓటు హక్కు!

బ్రటీషర్స్ రాకముందు రాచరిక వ్యవస్థ అమలులో ఉండేది. కాబట్టి ప్రజలు తమ ప్రతినిధిని.. అంటే తమ పరిపాలనను చూసుకునే బాధ్యతాయుతమైన నాయకున్ని ఎన్నుకునే అవకాశం లేదు. ఎవరో ఒకరి కింద, ప్రజలు బానిసలుగా బతికిన కాలాలు ఉన్నాయి. ఆ తరువాత భారతదేశానికి స్వాతంత్య్రం రాకమునుపు.. బ్రిటిష్ ఇండియా కాలంలో కేవలం చదువుకున్న వారికి, డబ్బు ఉన్నవారికి అలా ఒక అర్హత కలిగిన వారికి మాత్రమే ఓటు హక్కు వుండేది. అందులోనూ మహిళలకు గానీ తక్కిన నిమ్నవర్గాల ప్రజలకు గానీ ఓటు వేసే హక్కు లేకుండా ఉండేది. ఇక్కడ చదువులేని, సంపదలేని, అధికారం లేని వ్యక్తులు తమ బాగోగులు చూసుకునే మనిషిని ఎంచుకోవడంలో హక్కును కోల్పోయారు. దాంతో వారు ఎవరికి పట్టనివారిగా ఉండిపోయారు. తమని పరిపాలిస్తున్న వారిని తాము ఎన్నుకోరు కాబట్టి మహిళలు, అణగారిన ప్రజలు తమ సమస్యలను చెప్పుకోలేరు. ఎప్పటికి వారి సమస్యలు తీరవు.

అంబేద్కర్ పోరాటం..

వీటిని గమనించినటువంటి అత్యంత విద్యావంతుడైన మేధావి, లాయర్, భారత స్వాతంత్ర సమర యోధుడు, హక్కుల ప్రధాత, రాజకీయ నాయకుడు, ఆర్థికవేత్త, ప్రొఫెసర్, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ఉద్యమకారుడు, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ అప్పుడు జరిగిన ప్రతి సమావేశంలో కూడా ఓటు హక్కు కోసం విపరీతంగా పోరాటం చేశారు.

మహిళలకు, నిమ్నవర్గాల ప్రజలకు చదువు, సంపద, హోదాతో సంబంధం లేకుండా వయోజనులు అయినటు వంటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించాలి అని సైమన్ కమిషన్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, రాజ్యాంగ పరిషత్తు సభలో కావచ్చు, అవకాశం ఉన్న ప్రతి చోట ఓటు హక్కు కోసం అంబేద్కర్ తన యొక్క మాటలతో, రాతలతో అనేక విధాలుగా అలుపెరుగని పోరాటం చేశారు. చివరికి భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కుల, మత, ప్రాంత, వర్గ, లింగ బేధాలు లేకుండా ఓటు హక్కును తీసుకురావడంలో ఎనలేని కృషి చేసి మొత్తానికి తమని పాలించేవారిని తామే ఎన్నుకునే అవకాశాన్ని సాధించారు అంబేద్కర్. భారత రాజ్యాంగం ద్వారా ఓటు కు ఒక సుస్థిర స్థానం కల్పించారు డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్.

ఓటు యొక్క ముఖ్య ఉద్దేశ్యం

భారత రాజ్యాంగ సంస్థ అయిన భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటుతో ప్రజలు తమ యొక్క భవిష్యత్తు నిర్మించే నాయకున్ని లేదా ప్రతినిధి నిర్ణయించడం కోసం ఉపయోగించాలి. తమని ఎవరు పరిపాలించాలి, ఎవరు తమ యొక్క మంచి చెడులు చూసుకుంటారు, తమ జీవితాలకు ఎవరు సరైన భరోసా ఇవ్వగలరు, తమ ప్రాంతం అభివృద్ధిని ఎవరు సరిగ్గా సమర్థవంతంగా నడిపించగలరు అనేది ప్రజలు వారికి కల్పించిన ఓటు హక్కు ద్వారా నిర్ణయించుకోగలరు. ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉండాలో ఎవరు దిగిపోవాలో ఓటు నిర్ణయిస్తుంది. ఇక్కడ ఓటు వేయకుండా ఉండటం అనేది ఒక రకంగా నేరం అనే చెప్పాలి. ఎందుకు అంటే తమ భవిష్యత్తుకు సంబంధించిన పోరులో పాల్గొనకపోవడం వలన ఆ నిర్ణయం వేరొక్కరు తీసుకుంటారు. నువ్వు సరైన ప్రతినిధిని ఎన్నుకోకపోవడం వలన సమాజం తప్పు దారిలో నడిచే అవకాశం ఉంటుంది. అందుకు ఓటు వేయని వారంతా బాధ్యులవుతారు. కాబట్టి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం అనేది ఓటు ఉన్నవారి ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి అప్పుడే ప్రజాస్వామిక దేశంగా మారుతుంది.

అంబేద్కర్ భావించింది ఇదేనా?

ఓటు హక్కు పొందడం ద్వారా అణగారిన వర్గాలు, మహిళలు వారికి ఉన్న అనేక రకాలైన సమస్యలను, బాధలను తీర్చే వారి సమూహాలకు చెందిన నాయకులను ఎన్నుకుంటారు. ఓటు హక్కు ఉండటం కారణంగా నాయకులు కూడా ప్రజల యొక్క నివాస ప్రాంతాలకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటారని అంబేద్కర్ భావించారు. తద్వారా బడుగు, బలహీన, దళిత వర్గాల ప్రజలు తమలోనుంచే ఒక నాయకున్ని తయారు చేసుకుని అధికారం వైపు అడుగులు వేస్తారు అని అంబేద్కర్ అనుకున్నారు. కానీ ఆయన ఏమి ఆశించారో అది నెరవేరలేదు. ఈ నిమ్నవర్గాల జనాలు తమ వేలితో తమ కంటినే పొడుచుకుంటున్నారు.

తమ హక్కును సక్రమంగా ఒక్కరోజు వినియోగించుకున్నా చాలు దేశంలో ఒక సంచలనం సృష్టించబడుతుంది. తమ హక్కులు ఏమిటి, అవి ఎవరికోసం సృష్టించబడ్డాయి, దేనికోసం అనేది తాము తెలుసుకోలేనంత కాలం అధికారం పొందలేరు, అణిచివేతను ఆదిగమించలేరు. అంబేద్కర్ కోరుకున్న సమసమాజాన్ని, సమానత్వాన్ని నిర్మించలేరు. నీ ఓటును నీవు (మీకు)వేసుకుంటే నువ్వు రాజువు అవుతావు, లేకుంటే ఎప్పటికి ఒకరి కింద బానిసగా మిగిలిపోతావు. అంబేద్కర్ కోరుకున్నది జరగాలి అంటే మొదట ఓటు హక్కు ఎప్పుడు, ఎందుకు, ఎలా మనకు వచ్చిందో దాని చరిత్ర తెలుసుకోవాలి. అప్పుడే అది సాధ్యం అవుతుంది.

ఓటు హక్కును దుర్వినియోగం చేస్తున్నారు!

కొంత వరకు అది సాధ్యం అయినప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం అమలు కాలేకపోయింది. ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు ఇప్పటికీ సరైన విద్యను అందించలేదు, దాని కారణంగా సరైన జ్ఞానం మరియు అవగాహన జనాలకు అందలేదు. రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిపక్వత లేనికారణంగా ఎవరు తమ సరైన ప్రతినిధి అనేది నేటికీ తెలుసుకోలేని స్థితిలోకి నెట్టివేయబడ్డారు. నాయకులు నైతికత కోల్పోయారు, చట్టపరంగా నడుచుకోవాల్సిన రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంగించి అక్రమంగా ప్రజలను భయపెట్టి, ప్రలోబపెట్టి ఓటును కొనుక్కుంటున్నారు.

ప్రజాస్వామ్యం యొక్క అసలు స్వరూపాన్ని మార్చివేశారు. డబ్బుకు, మందుకు, చీరలుకు, ఉంగరాలుకు, ఎలక్ట్రానిక్స్ ఇలా అనేక ప్రలోభాలకు లోనయ్యి ప్రజలు తమ ఓటు హక్కును దుర్వినియోగం చేస్తున్నారు. ఓటును కొనడం అమ్మడం చేసి జీవితాలను తాకట్టు పెట్టి ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేశారు అని చెప్పొచ్చు. వ్యవస్థ మొత్తంలో ఒక పెను తుఫాన్ లాగా విప్లవాత్మకమైన మార్పు సంభవిస్తే తప్పా ఈ పరిస్థితి మారే స్థితిలో లేని విధంగా ఈరోజు సంస్థలు, వ్యవస్థ బ్రష్టు పట్టిపోయాయి.

125 సంవత్సరాల చరిత్ర.. 2026 చీఫ్ వింటేజ్: అదిరిపోయే లుక్

0

ఇండియన్ మోటార్ సైకిల్ కంపెనీ తన 125వ యానివర్సరీ సందర్భంగా.. 2026 చీఫ్ వింటేజ్ పేరుతో బైక్ ఆవిష్కరించింది. ఈ లేటెస్ట్ బైక్ 1940 కాలం నాటి ఐకానిక్ చీఫ్ మోడల్స్ నుంచి ప్రేరణ పొందింది. అయితే ఇది క్లాసిక్ అమెరికని స్టైలింగ్ పొందటమే కాకుండా.. మంచి పర్ఫామెన్స్, టెక్నాలజీ వంటి వాటిని పొందుతుంది.

దశాబ్దాల నాటి ప్రేరణ

కొత్త చీఫ్ వింటేజ్ బైక్ దాని పూర్వీకుల వారసత్వాన్ని నిలుపుకోవడం మాత్రమే కాకుండా.. నేటి రైడర్లను ఆకట్టుకునేలా డిజైన్ పొందింది. ఇది అసలైన 1940లలో మార్కెట్లో అమ్ముడైన అసలైన ఇండియన్ చీఫ్ బైక్ నుంచి ప్రేరణ పొందింది. ఇందులో ఫ్రంట్ ఫెండర్లు, లిట్ హెడ్‌డ్రెస్ ఆర్నమెంట్, వైర్ స్పోక్ వీల్స్, వింటేజ్ స్టైల్ సీటు మొదలైనవి ఉన్నాయి. రియర్ సబ్‌ఫ్రేమ్, క్లాసిక్ హ్యాండిల్‌బార్లు ఓల్డ్ మోడల్ బైకును గుర్తుకు తెస్తాయి.

కొత్త స్టైలింగ్!

డిజైన్ మాత్రమే కాకుండా.. ఇంజిన్ ఫినిషింగ్ మీద కూడా కంపెనీ శ్రద్ద చూపింది. థండర్ స్ట్రోక్ ఇంజిన్ సిల్వర్ పెయింటెడ్ సిలిండర్ హెడ్స్, పుష్ రాడ్ ట్యూబ్లతో కూడిన బ్లాక్ సిలిండర్లను ఈ బైకులో చూడవచ్చు. ఇది ఒకప్పుడు.. ప్రారంభంలో భారతదేశంలోని మోటార్ సైకిళ్లలో కనిపించే స్టైలింగ్.

ఇంజిన్ డీటెయిల్స్

1940 నాటి ఇండియన్ చీఫ్ బైక్ అమెరికన్ ఆటోమొబైల్ చరిత్రలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. ఇప్పుడు దాని ప్రేరణతో మార్కెట్లో లాంచ్ అయిన 2026 చీఫ్ బైక్.. తప్పకుండా చాలామంది బైక్ ప్రేమికులను ఆకట్టుకుంటుందని సమాచారం. ఇందులో ఎయిర్ కూల్డ్ థండర్ స్ట్రోక్ 116 వీ-ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 156 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఇది దూర ప్రయాణాలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఫీచర్స్ ఇలా..

2026 చీఫ్ బైక్.. టూర్, స్టాండర్డ్, స్పోర్ట్స్ అనే మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. రైడర్ తమ రైడింగ్ ప్రాధాన్యతను బట్టి త్రాటల్ రెస్పాన్స్ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బైకులో లేటెస్ట్ ఎలక్ట్రానిక్స్ పొందుతుంది. ఇందులో రైడ్ కమాండ్ సిస్టం ద్వారా పవర్ ఇచ్చే 101 మిమీ రౌండ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉండటం చూడవచ్చు. రైడర్లు యాప్ ఎన్‌హాన్స్‌డ్ న్యావిగేషన్ కూడా ఉపయోగించవచ్చు. ఇది గూగుల్ మ్యాప్స్, యాపిల్ మ్యాప్స్ వంటి స్మార్ట్‌ఫోన్ యాప్‌ల నుంచి నేరుగా మోటార్‌సైకిల్ డిస్‌ప్లేకి కనెక్ట్ చేస్తుంది.

టర్న్ బై టర్న్ న్యావిగేషన్, రైడ్ డేటా, మ్యూజిక్ కంట్రోల్, బ్లూటూత్ లేదా యూఎస్బీ ద్వారా ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ 2026 చీఫ్ బైకులో ఉన్నాయి. కాగా కంపెనీ ఈ బైక్ ధరలను ఇంకా వెల్లడించలేదు. అంతే కాకుండా ఇది.. ఎప్పుడు మార్కెట్లోకి అమ్మకానికి వస్తుందనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు.

లిమిటెడ్ ఎడిషన్‌గా వస్తుందా?

ఒక కంపెనీ విజయాలకు గుర్తుగా వాహనాలను లాంచ్ చేయడం ఇదేమి కొత్త కాదు. ఇప్పటికే చాలా సంస్థలు తమ వారసత్వాలకు నిదర్శనంగా బైకులు, కార్లను లాంచ్ చేశాయి. ఇవన్నీ చాలా వరకు లిమిటెడ్ ఎడిషన్ రూపంలోనే అందుబాటులోకి వవచ్చాయి. అయితే ఇప్పుడు ఇండియన్ మోటార్ సైకిల్ ఆవిష్కరించి బైక్.. ఎన్ని యూనిట్లు అమ్మకానికి రానుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది.

నిహారిక హారర్‌ మూవీ.. రిలీజ్‌ ఎప్పుడంటే?

0

కొణిదెల నిహారిక తన సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో నిర్మించినటువంటి కమిటీ కుర్రాళ్లు సినిమా మంచి విజయం సాధించింది. 2024 సంవత్సరంలో ఆ చిత్రం గెలుపు ఇచ్చిన ఊపులో మరో సినిమాని తీసేసారు. మ్యాడ్ సినిమా ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా రాకాస చిత్రాన్ని ఆమె జీ స్టూడియోస్ సౌత్ కలిసి నిర్మించారు. 2026 జనవరి 23న ఈ సినిమా టీజర్ విడుదల చేశారు.

భయం, కామెడీ పండిస్తున్న గ్లింప్స్

రాకాసా గ్లింప్స్ వీడియో మొదలవగానే ఒక గుహ కనిపిస్తుంది, అందులోకి వెళ్లగానే మొత్తం చీకటిగా ఉంటుంది. ఆ చీకటి నిండిన పాడుపడ్డ గుహలో చనిపోయిన మనిషి కలేబరం ఒకటి కనిపించి అందులో నుంచి పెద్ద తేలు బయట వస్తుంది. ఒక వ్యక్తి నడుచుకొని వచ్చి అక్కడ మండుతున్న రెండు వెలుగుతున్న కట్టెల్లో నుంచి చేత్తో ఒక కట్టెను తీసుకోగానే ఆ కట్టే కింద నుంచి ఒక శవం కట్టెను అందించినట్టు భూమిలో నుంచి ఒక చెయ్యి పైకి లేస్తుంది అప్పటి నుంచి బాగానే అనిపించిన ఒక్కసారిగా భయం పుడుతుంది.

బ్యాక్‌గ్రౌండ్‌లో శోభన్ యుగయుగాలుగా ప్రతి కథలో ఒక సమస్య, ఆ సమస్యను చేధించడానికి ఒక వీరుడుపుడతాడు, ఆ వీరుడు ఎవడు అని తెలిసేలోపే నిశ్శబ్దంగా తన పని ముగిస్తాడు, ఈ కథలో ఆ వీరుడు అంటూ డైలాగ్ వస్తుండగా ఆ మండుతున్న కట్టే వెలుతురులోంచి హీరో ముఖం మనకు కనబడుతుంది. మొదటగా భయపడిన హీరోను ఎలివేట్ చేస్తూ ఆ మాటలు చెప్పే విధానం మనకు నవ్వు తెప్పిస్తుంది. అలా నడుస్తూ వెళ్తుడుండగా వెంటనే ఒక తాడుతో కట్టిన వలన వచ్చి హీరోని సడన్‌గా పైకి లాక్కెల్లిపోతుంది. వల చుట్టూ తన లాగే పైకి వచ్చిన వలలు ఉంటాయి. అందులో మొత్తం చనిపోయిన శవాల పుర్రెలు, ఎముకలు, అన్నీ కలేబరాలే కనిపిస్తాయి. ఎలా కిందకు దిగేది అని శోభన్ ఆలోచన చేస్తుండగా ఎదురుగా ఒక మండుతున్న మంటల వెలుతురులోంచి ఒక రకమైన కట్టెకు పదునైన ఇనుప ముల్లు తన మీదకి వస్తున్నట్టుగా చూపిస్తూ అక్కడితో ఒక థ్రిల్లింగ్ ఇంట్రెస్ట్ మరియు ఒక రకమైన భయాన్ని కలిగిస్తూ గ్లింప్స్ ముగుస్తుంది.

హీరోయిన్‌గా నయన్ సారిక

ఇది ఒక పాంటసీ, హారర్ అండ్ కామెడీ ఆధారంగా తీసిన సినిమాగా తెలుస్తోంది. సంగీత్ శోభన్ ఎంత మంచి హాస్యాన్ని పండించగలడో మ్యాడ్ సినిమాలో మనం అందరం చూశాము. కాబట్టి ఈ చిత్రంలో అంతే నటనను కనబరుస్తాడని అర్థమవుతోంది. ఇక ఇతర నటీనటుల విషయానికి వస్తే హీరోయిన్‌గా నయన్ సారిక చేస్తుండగా, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను లాంటివారు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

రిలీజ్ ఎప్పుడంటే?

ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సల్ ఇద్దరు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం సమకూర్చారు. 03 ఏప్రిల్ 2026న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఓటీటీకి సంబంధించిన రైట్స్ నెట్‌ఫ్లిక్స్ మరియు జీ5 దక్కించుకున్నట్టుగా సమాచారం. నిహారికకు చెందిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థ పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా ఈ మధ్య దానికి సంబందించిన వేడుకలు కూడా జరిగాయి.

మహీంద్రా థార్ రాక్స్ ‘స్టార్ ఎడిషన్’ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

మహీంద్రా థార్ కారుకు దేశీయ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. అటు అమ్మకాల్లో.. ఇటు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్న ఈ ఆఫ్ రోడర్‌ను కంపెనీ ఇప్పుడు రాక్స్ స్టార్ ఎడిషన్ పేరుతో ఓ స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 16.85 లక్షల నుంచి రూ. 18.35 లక్షల మధ్య ఉంది. ఈ సరికొత్త ఎడిషన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సరికొత్త మహీంద్రా రాక్స్ థార్ స్టార్ ఎడిషన్.. సాధారణ మోడల్ కంటే కూడా ఎక్కువ గ్రాఫిక్ డిజైన్స్ పొందింది. డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ కలిగిన ఈ కారు.. మెటాలిక్ ఫినిషింగ్ పొందుతుంది. చూడటానికి ఇది కొంత స్టాండర్డ్ టాప్ ఎండ్ మోడల్ మాదిరిగా కనిపించినప్పటికీ.. కొన్ని అప్డేట్స్ కనిపిస్తాయి.

డిజైన్ & కలర్ ఆప్షన్స్!

గ్రిల్, బంపర్, లైటింగ్ సెటప్ అన్నీ కూడా సాధారణ థార్ మాదిరిగానే ఉన్నాయి. అయితే రాక్స్ థార్ స్టార్ ఎడిషన్ వెనుక భాగంలో.. ప్రత్యేకమైన బ్యాడ్జ్ కనిపిస్తుంది. కాగా ఈ మోడల్ టాంగో రెడ్, ఎవరెస్ట్ వైట్, స్టీల్త్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. లోపలి భాగం దాదాపు నలుపు రంగులో ఉంది. లెదర్ సీట్లు కనిపిస్తాయి. రూప్ లైనింగ్ గోధుమ రంగులో ఉంది. డోర్ ప్యానెల్స్ బేజ్ కలర్ పొందుతాయి. అంటే ఇది డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్ పొందుతుందన్నమాట.

ఇంటీరియర్ ఫీచర్స్ ఇలా..

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమాటిక్ టెంపరేచర్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, టైర్ డైరెక్షన్ మానిటరింగ్ సిస్టం, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, ఆరు ఎయిర్‌బ్యాగులు, రియర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం కూడా ఉన్నాయి.

అదే ఇంజిన్

సరికొత్త థార్ రాక్స్ స్టార్ ఎడిషన్.. అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి ఈ కారులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ లేదా 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. ఈ రెండూ కూడా మాన్యువల్ లేదా ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తాయి. కాగా ఇది రియర్ వీల్ డ్రైవ్ సిస్టం ఎంపికలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. పనితీరు పరంగా ఇది సాధారణ మోడల్ మాదిరిగానే ఉంటుందని సమాచారం.

పెరిగిన థార్ ధరలు

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ.. తన ఆఫ్ రోడర్ ఎస్‌యూవీ థార్ ధరలను రూ. 20,000 పెంచింది. పెరిగిన ధరలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. అంటే.. ఇప్పటికే కారును బుక్ చేసుకున్నవారికి పాత ధరలే వర్తిస్తాయి. ఇకపై థార్ కొనాలంటే.. అదనంగా రూ. 20వేలు చెల్లించాల్సిందే. ముడిసరుకుల ధరలు పెరగడం వల్ల.. థార్ ధరలను పెంచినట్లు కంపెనీ వెల్లడించింది.

కాగా ఇప్పటికే మన దేశంలోని చాలా కంపెనీలు (టయోటా, మారుతి సుజుకి, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, బీవైడీ, హీరోమోటోకార్ప్ మొదలైనవి) తమ ఉత్పత్తుల ధరలను పెంచాయి. ఇందులో కార్లు మాత్రమే కాకుండా.. బైకులు ఉన్నాయి. ఏడాది మారిన తరువాత లేదా కొత్త ఏడాది పుట్టినప్పుడు ప్రతిసారీ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే పద్దతిని పాటిస్తూ.. ధరలను పెంచడం జరిగింది.

ఆధునిక కాలంలో కొత్త ప్రయోగం.. మాటల్లేని సినిమా గురించి తెలుసా?

0

భారతదేశ చలన చిత్ర రంగంలో నటులుగా అరుదైన ప్రతిభా ఘనత కలిగిన వాళ్లలో అరవింద్ స్వామి మరియు విజయ్ సేతుపతి ఇద్దరు కూడా ఉంటారు. ఇరువురు వారివారి శైలిలో సహజమైన హావభావాలతో ఒక ప్రత్యేకమైన గుర్తింపును కలిగి ఉన్నారు. అటువంటి వాళ్లు ఒక్కరు వెండితెరపైన కనిపిస్తే చాలు ప్రేక్షకులకు పండగే. అలాంటిది ఇద్దరు ఒకేసారి ఒకే చిత్రంలో కనిపిస్తున్నారు అంటే ఇంక చూడటానికి రెండు కళ్లు చాలవు అనే చెప్పాలి. ప్రస్తుతం అరవింద్, విజయ్ సేతుపతిల ద్వయం గాంధీ టాక్స్ అనే ఒక మూకీ సినిమాతో కనిపించనున్నారు. ఈ మూవీ 2026 జనవరి 30వ తేదిన మన ముందుకు రాబోతున్నారు.

ఛానళ్ల తరువాత మూకీ సినిమా

ఈ మూకీ మూవీ 2022లోనే రిలీజ్ అయినప్పటికీ థియేటర్లలోకి ఇప్పటి వరకు రాలేదు. అయితే 2023 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకునింది. ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు.. 2026లో విడుదలకు సిద్ధం అయ్యింది. మూకీ సినిమాలు అనేటివి ఎప్పుడో స్వాతంత్య్ర దినోత్సవమునకు ముందే ఆగిపోయాయి.

1913లో సత్య హరిశ్చంద్ర చిత్రంతో భారతదేశంలో ఈ మూకీ చిత్రాలు ప్రారంభం కావడం జరిగింది. తరువాత వచ్చిన సాంకేతికత కారణంగా 1934తో మూకీ స్థానంలో.. టాకీ చిత్రాలు రావటంతో మూకీ సినిమాలు మరుగున పడిపోయాయి. ఆ తరువాత సుమారు 50 సంవత్సరాల తరువాత 1987లో పుష్పవిమానం అనే చిత్రంతో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, కమల్ హాసన్ కలిసి ఒక ప్రయోగాన్ని చేశారు. అందులో వారు సఫలీకృతం అయ్యారు. మళ్లీ 39 ఏళ్లు గాడిచాక ఇప్పుడు “గాంధీ టాక్స్” సినిమా మూకీగా మన ముందుకు వస్తోంది.

మాటల్లేవ్!

ఇందులో అసలు ఏ మాత్రం మాటలు అనేవే ఉండవు, కేవలం నాటీనటుల యాక్టింగ్, నేపథ్య సంగీతం, కెమెరా పనితనం మాత్రమే చిత్రాన్ని ముందుకు నడిపిస్తాయి. ఒకప్పుడు పరిస్థితి వేరు అప్పుడు మూకీ సినిమాలు విజయం సాధించి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఉన్న తరానికి మూకీ చిత్రాల గురించి తెలియదు. టాకి సినిమాకి అలవాటు పడిన ప్రేక్షకులకు మూకీ ఏమేరకు అర్థం అవుతుంది అనేది ఇప్పుడు పెద్ద సవాల్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌లో మాత్రం విజయ్, అరవింద్, అధితిలు నటనతో కట్టిపడేసారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతమే ఈ సినిమాను నడిపిస్తుందని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. మ్యూజిక్ అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.

సమాజాన్ని డబ్బు నడిపిస్తోందా?

కరెన్సీ నోటు మీద ఉన్న గాంధీకి, అసలైన గాంధీ ఆలోచనలకు మధ్య వ్యాత్యాసాన్ని డైరెక్టర్ స్పష్టంగా చూపించారు. ఇక్కడ సమాజాన్ని అంతా కూడా డబ్బే నడిపిస్తుంది. దానికి కోసం ఎంతైనా తెగిస్తారు అనేది వీడియోలో కనిపిస్తోంది. వీడియో మొదటిలోనే వందరూపాయల నోటు మీద గాంధీ బొమ్మని చింపి అందులోంచి కన్నుపెట్టి చూడటంతో మనకు అనిపిస్తుంది అక్కడ ఉన్న బొమ్మ కన్నా ఆ కాగితంకి విలువ ఎక్కువ ఇస్తారు జనాలు అని. అదే విధంగా చివరిలో న్యూస్ పేపర్ మీద గాంధీ గురించి ఉన్న ఆర్టికల్ మురికి కాలువలో కొట్టుకుపోవడాన్ని మనుషులు యొక్క మానసిక స్థితిని తెలియజేస్తుంది.

రిలీజ్ ఎప్పుడంటే?

గాంధీ టాక్స్ చిత్రాన్ని జీ స్టూడియోస్, క్యూరియస్ & మావిమిల్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించారు. కిషోర్ పాండురంగ్ దర్శకత్వం వహించారు. ఏ. ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమాకూర్చారు. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావ్ హైదరి, సిద్దార్థ్ జాదవ్ లాంటి వారు ఇందులో నటించారు. 2026 జనవరి 30వ తేదీన గాంధీ వర్ధంతికి సినిమా థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయ్యింది. ఇప్పటికే విడుదల అయిన పాటలు, టీజర్ సినిమాకి మంచికి హైప్ క్రియేట్ చేశాయి.

విద్యార్థుల్లోకి వేమన.. టెక్నాలజీతో అద్భుతం!

ప్రజాకవి వేమన గురించి దాదాపు అందరికి తెలుసు. తన పద్యాలతో సామజిక అంశాలను గురించి కళ్లకు కట్టినట్లు చెప్పిన ఈ మహానుభావుడు.. నేటికీ ఎంతోమందికి ఆదర్శనీయుడనే చెప్పాలి. చదువురాని వారు కూడా వేమన పద్యాలను అలవోకగా చెప్పేస్తున్నారంటే.. ఆయన శైలి ఎంత సులభంగా ఉండేదో అందరూ అర్థం చేసుకోవచ్చు. నేటి సమాజానికి కూడా ఈయన అవసరం చాలా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కొత్త విధానానికి తెరలేపింది. టెక్నాలజీ ద్వారా వేమనను పిల్లలకు చేరువ చేశారు.

90 రోజుల పర్యటన!

జనవరి 19న వేమన జయంతి సందర్భంగా.. సత్యసాయి జిల్లా తలుపుల మండలంలోని కటారుపల్లిలో ఓ కార్యక్రమం ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగానే.. రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించడానికి వేమన విజ్ఞాన యాత్రను ప్రారంభించారు. దీనిని కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ దీనికోసం ఒక బస్సును ప్రారంభించారు. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో కూడిన ఈ బస్సు రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాలను 90 రోజుల్లో పర్యటించనుంది.

ఏఐ వేమన!

కవి, సంస్కరణవాది, తత్వవేత్త అయిన వేమన గురించి విద్యార్థులకు తెలియజేయడానికి 15మంది సభ్యుల సాఫ్ట్‌వేర్ నిపుణులు & ఇతర టెక్నీకల్ బృందాలు ఈ బస్సులో ఉంటారు. బస్సులో ఎల్ఈడీ స్క్రీన్ ఉంటుంది. దానిపై వేమన పద్యాలను వినవచ్చు, చరిత్రను చూడవచ్చు, వినవచ్చు. విద్యార్థులు నిపుణులతో మాట్లాడవచ్చు, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అంటే విద్యార్థులు వేమనను చూసే భాగ్యం పొందవచ్చు అన్నమాట. ఇదంతా ఏఐ ఘనత అనే చెప్పాలి.

నిజానికి వేమన గురించి చరిత్రలో చాలా కథలు వినిపిస్తాయి. ఎన్నెన్ని కథలు వినిపించినా.. ప్రజాకవి వేమన జీవితం చాలా అద్భుతం అనే చెప్పాలి. జీవితం అంటే ఏమిటి?, మనిషి ఎలా ఉండాలి?, ఎలా ఉండకూడదు? అనే ఎన్నో విషయాలను తన అనుభవం ద్వారా వెల్లడించిన మహా మనిషి వేమన. అన్నింటిని త్యజించి.. ఇదే జీవితం అని నమ్మి ప్రజల్లోని మూఢనమ్మకాల మీద ఎన్నో పద్యాలను ఆశువుగా చెప్పారు. దశాబ్దాలు దాటినా వేమన పద్యాలు నేటికీ ప్రజల నోళ్లలో నానుతున్నాయంటే.. అప్పటి మాటలే, ఇప్పటికీ కనిపిస్తున్నాయనడానికి నిలువెత్తు నిదరదర్శనం అనే చెప్పాలి.

వేమన జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే.. ఈ ఏడాది కూడా ప్రారంభించారు. అయితే ఈసారి ఏఐ టెక్నాలజీ ఉపయోగించి, వేమనను విద్యార్థులకు చేరువ చేశారు. ఈ జయంతి ఉత్సవాల్లో భాగంగా.. వేమన పద్య పఠనాలు, సాహిత్య సమావేశాలు మొదలైనవి నిర్వహిస్తారు. దీని ద్వారా సమాజంలో కొంత చైతన్యం రావాలని, వేమన బోధలు ప్రజల్లోకి వెళ్లాలని చేయడం జరుగుతుంది.

ప్రజాకవి వేమన జయంతి ఉత్సవాల ఉద్దేశం ఏమిటంటే?

రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో వేమన జయంతి జరుపుకుంటారు. వేమన విగ్రహాలకు పూలమాలలు సమర్పిస్తారు. సంస్కృతికి కార్యక్రమాలను సైతం నిర్వహిస్తారు. కులభేదాలు, మూఢనమ్మకాలను అప్పట్లోనే వేమన గట్టిగా విమర్శించారు. వేమన జయంతి ఉత్సవాల ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. ఆయన పద్యాల ద్వారా సామజిక అవగాహన కల్పించడం, అంతే కాకుండా.. సమానత్వం, మానవత్వం, నైతిక విలువలను ప్రచారం చేయడం.

ట్రాఫిక్ ఫైన్ ఆటో డిడక్షన్!.. ముఖ్యమంత్రి కీలక సూచనలు

0

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే జరిమానాలు చెల్లించాలి. దీనికోసం సంబంధిత అధికారులు చలాన్స్ జారీ చేస్తారు. అయితే కొందరు వాహనదారులు ఎప్పటికప్పుడు వీటిని క్లియర్ చేసుకుంటారు. ఇంకొందరు రాష్ట్ర ప్రభుత్వం ఆఫర్ (50 శాతం రాయితీ) కట్టేద్దాం అని వేచి చూస్తారు. కానీ వీటికి చరమగీతం పాడటానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు.

రేవంత్ రెడ్డి సూచనలు

తెలంగాణ పోలీస్ శాఖ నిర్వహించిన 10 రోజుల రోడ్డు భద్రతా ప్రచార కార్యక్రమం ‘అరైవ్ అలైవ్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇకపై పెండింగ్ చాలన్స్ ఉండకూడదని అన్నారు. దీనికోసం వాహనదారుల బ్యాంక్ ఖాతా నుంచే ఆటోమాటిక్‌గా డిడెక్ట్ (కట్) అయ్యేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించారు. పెరిగిపోతున్న ట్రాఫిక్ పెండింగ్ చలాన్స్ క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేశారు.

టెక్నాలజీ ఉపయోగించుకోండి!

వాహన వినియోగదారులు.. వాహనాలను కొనుగోలు చేసినప్పుడే, రిజిస్ట్రేషన్లను.. బ్యాంక్ అకౌంట్ వివరాలతో సమీకరించాలని పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల మాన్యువల్ కలెక్షన్ లేదా చెల్లింపులలో ఆలస్యం వంటి వాటిని నిరోధించవచ్చని అన్నారు. వెహికల్ రిజిస్ట్రేషన్ సమయంలోనే.. బ్యాంక్ అకౌంట్ వివరాలను సేకరించి, టెక్నాలజీ ద్వారా వాటిని ఖాతా నుంచే చలానా కట్ అయ్యే విధంగా ట్రాఫిక్ విభాగానికి అనుసంధానించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించింది.

ఇకపై పెండింగులో ఉన్న చలానాలకు వసూలు చేయడానికి డిస్కౌంట్స్ పద్దతి అవసరం లేదు, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారికి ఎలాంటి మినహాయింపులు లేకుండా మొత్తం చెల్లించేలా సంబంధిత శాఖ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ప్రతిపక్షాల విమర్శలు

సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై.. ప్రతిపక్ష పార్టీలు మాత్రమే కాకుండా, సాధారణ ప్రజలు కూడా విమర్శిస్తున్నారు. అధికారంలోకి రాకముందు.. పెండింగ్ ట్రాఫిక్ చాలన్స్ మీద 50 శాతం రాయితీ ఇస్తామని ముఖ్యమంత్రి.. ఇప్పుడు మాట మారుస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. సీఎం చెబుతున్న ఈ విధానం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఫైన్ విధించడానికి ముందే.. వాహన వినియోగదారులకు వివరించాలని, అప్పీల్ చేయడానికి లేదా పరిష్కారం కోరుకోవడానికి అవకాశం కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని అన్నారు.

ఆటోమాటిక్ డెబిట్ విషయంలో.. బ్యాంకులు కస్టమర్ అనుమతి తీసుకోవాలి. లేకుంటే ఆర్ధిక పరమైన సమస్యలు తలెత్తుతాయని ప్రజలు చెబుతున్నారు. ఓ కొత్త విధానం అమలు చేసే సమయంలో.. అది ప్రజలకు ఉపయోగపడుతుందా?, లేదా? అని విషయాన్ని ఆలోచించాలని నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

అందుకే చలానాల విషయంలో కఠినంగా!

హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్న.. రేవంతా రెడ్డి రోడ్డు ప్రమాదాలు ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా మారిపోయిందని అన్నారు. ఒక యుద్ధంలో కన్నుమూసి సైనికుల కంటే కూడా.. రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారే ఎక్కువ ఉన్నారని చెప్పారు. దేశంలో నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం.. మూడు నిమిషాలకు ఒకరు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని వివరించారు. రోడ్డు ప్రమాదాల వచ్చే సమస్యలు కూడా వివరించారు. అందుకే చలానాల విషయంలో కొంత కఠినంగా ఉండాల్సి వస్తోందని అన్నారు.

శుభవార్త.. యూపీఐ నుంచి పీఎఫ్ విత్‌డ్రా: ఎలా అంటే?

0

ఉద్యోగం చేసే దాదాపు అందరికీ ఈపీఎఫ్ అకౌంట్ ఉంటుంది. ఈ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి ఒకప్పుడు చాలా కష్టపడాల్సి ఉండేది. ఫారమ్ ఫిల్ చేసి.. సబ్మిట్ చేసి, కొన్ని రోజులు వేచి చూడాల్సి వచ్చేది. కానీ క్రమంగా ఈపీఎఫ్ విత్‌డ్రా చాలా సులభతరమైపోయింది. ఇప్పుడు కేవలం వారం రోజుల వ్యవధిలోనే పీఎఫ్ బ్యాలెన్స్.. బ్యాంక్ ఖాతాలోకి జమ అయిపోతోంది. దీనిని మరింత సులభతరం చేయడానికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఓ కొత్త విధానం తీసుకురాబోతోంది.

ఈపీఎఫ్ఓ ఖాతాలోని డబ్బును కొత్త విధానం ద్వారా.. యూపీఐకు బదిలీ చేసుకోవచ్చు. ఆ తరువాత మీకు కావాలనుకునే ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ విధానం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చాలా వేగంగా జరుగుతున్నట్లు కూడా పేర్కొన్నారు.

పీఎఫ్ యూపీఐ విత్‌డ్రా

చందాదారులు తమ సీడెడ్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయడంతో పీఎఫ్ బ్యాలెన్స్ చూడవచ్చు. మీ యూపీఐకు కూడా పిన్ నెంబర్ ఉపయోగించి లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చు. ఇది మొత్తం సురక్షితమైన ప్రక్రియ. ఇలా బదిలీ చేసుకున్న తరువాత.. సదరు వ్యక్తి లేదా పీఎఫ్ ఖాతాదారు ఏటీఎం నుంచి డెబిట్ కార్డులను ఉపయోగించి విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఎనిమిది కోట్ల మందికి ప్రయోజనం

ప్రస్తుతం ఈ విధానం సజావుగా జరిగేలా చూడటానికి ఈపీఎఫ్ఓ.. సాఫ్ట్‌వేర్ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది. ఇది ఒకసారి అమలులోకి వస్తే.. ఏకంగా ఎనిమిది కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల చందారులు ప్రత్యేకంగా క్లెయిమ్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. సమయం కూడా ఆదా అవుతుంది.

కొత్త విధానం అమలులోకి వచ్చిన తరువాత.. మాన్యువల్ జోక్యం ఉండదు. అంతే కాకుండా పరిమితిని కూడా లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు పెంచారు. ఇందులో హెల్త్, ఎడ్యుకేషన్, వివరం, గృహ నిర్మాణం వంటి వాటికోసం పీఎఫ్ ఉపసంహరించుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. చందాదారులు మొత్తం విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం లేదు.

సురక్షితమైన ప్రక్రియ

చందాదారులు ఖాతాలో 25 శాతం బ్యాలెన్స్ ఉంచాలి. దీనివల్ల 8.25 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. ఇది పదవీ విరమణ తరువాత భవిష్యనిధిని పెంచుకోవడంలో సహాయపడుతుంది. కాగా.. కొత్త విధానానికి సంబంధించిన నోటిఫికేషన్ అధికారికంగా వెల్లడి కాదు. అయితే కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ ఆమోదించిన తరువాత.. నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ మునుపటి కంటే వేగంగా, సురక్షితంగా ఉంటుందని చెబుతున్నారు.

ఈపీఎఫ్ఓ గురించి

ఒక ఉద్యోగి జీతం నుంచి ప్రతి నెలా కొంత మొత్తం డబ్బును పొదుపు కోసం ఈపీఎఫ్ఓ జమ చేస్తుంది. ఈ డబ్బు సదరు వ్యక్తి లేదా ఉద్యోగి రిటైర్మెంట్ తరువాత లేదా ఏదైనా అవసరమైన సందర్భాల్లో తీసుకోవచ్చు. ఇలా అవసరమైన సందర్భాల్లో.. డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి ఉద్యోగి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకూడదు అనే ఉద్దేశంతో.. ఈపీఎఫ్ఓ ఇప్పుడు యూపీఐ నుంచి పీఎఫ్ విత్‌డ్రా విధానానికి శ్రీకారం చుట్టింది. ఇది అందుబాటులోకి వచ్చిన తరువాత చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది.

యూట్యూబ్ యాడ్స్‌కు చెక్.. ఫిబ్రవరి 15 నుంచి కొత్త రూల్!

0

ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా మైదాన ప్రాంతాల్లో బ్రతుకుతున్న ఇంచుమించు అందరి దగ్గర కూడా ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి. మనం ఫోన్ కొన్నప్పుడే అందులో కంపెనీ వాల్లే చాలా యాప్స్ ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. ఆటోమెటిక్‌గా యూట్యూబ్, ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ ఉపయోగించడం అలవాటు అవుతుంది. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికో లేదా ఏదైనా సమాచారం కోసమో వీడియోలు ఓపెన్ చేస్తే మొదటగా యాడ్స్ దర్శనమిచ్చి విసుగుతెప్పిస్తాయి. అవి కూడా చాలా వరకు స్కిప్ చేయడానికి వీలు లేకుండా.. తప్పనిసరిగా చూడాల్సిన యాడ్సే ఉంటాయి. ఇందువల్ల వ్యూవర్స్ యొక్క సమయం, డేటా వృథా అవుతోందని భావించిన వియత్నాం ప్రభుత్వం మొదటిసారిగా ప్రపంచంలో ఎక్కడా లేని సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.

ఐదు సెకండ్స్ తరువాత స్కిప్ ఆప్షన్!

సోషల్ మీడియా యూజర్స్ అనవసరంగా ఈ యాడ్స్ వల్ల ఇబ్బంది పడుతుండటం కారణంగా వియత్నాం గవర్నమెంట్ ఆ దేశంలో డిక్రి 342/2025 పేరుతో ఒక చట్టం తీసుకొచ్చింది. చాలా అడ్వర్‌టైజ్‌మెంట్స్ దాదాపు 15 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ నిడివితో వస్తుంటాయి. వాటిని స్కిప్ చేసే అవకాశం కూడా ఉండటం లేదు. మనకు కావాల్సిన వీడియో చూడటానికి ముందు అది అవసరం ఉన్నా లేకున్నా కచ్చితంగా ఆ యాడ్ చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిని పరిగణలోకి తీసుకున్న వియత్నాం ప్రభుత్వం ఇకపై 5 సెకండ్స్ తరువాత స్కిప్ చేసుకునే ఆప్షన్ ఇవ్వాలని ఆదేశించింది. దీని వలన యాడ్ చూడడం ఇష్టం లేనివారు స్కిప్ చేయొచ్చు. దీంతో ఇంక నుంచి ముందులాగా తప్పనిసరిగా యాడ్ చూసే పరిస్థితి అయితే ఉండదు.

వేచి ఉండాల్సిన అవసరం లేదు!

అనేక సోషల్ మీడియా యాప్‌లలో వీడియో రూపంలో కాకుండా.. కొన్ని మాత్రం ఫోటోల మాదిరిగా యాడ్ ఇస్తుంటారు, అలాగే ఇంకా బ్యానర్స్ మాదిరిగా కూడా మనకు కనిపిస్తుంటాయి. వాటిని అయితే స్కిప్ చేసే ఆప్షన్ ఉండదు. వాళ్లు ఇచ్చిన ఒక టైమ్ తరువాత క్లోజ్ చేసే బటన్ అనేది ఎక్కడో చిన్నగా కనిపించి కనిపించనట్టు ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికోసం వ్యూవర్స్ వేచి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆ యాడ్ క్లోసింగ్ బటన్స్ కూడా బాగా అందరికీ కనిపించే విధంగా పెద్దగా ఉండాలని చెప్పింది. ప్రేక్షకులను తప్పుదోవ పట్టించేలా కనిపించని ఆప్షన్స్ ఇవ్వకూడదని కఠినంగా చెప్పడం జరిగింది.

ఉద్దేశం ఏమిటంటే..

ఒకవేళ సమాజానికి హానికరం చేసే విధంగా ఉన్నా లేదా చాట్టాలని ధిక్కరించి తీసే ఎలాంటి ప్రకటనలపై అయినా.. కంప్లైంట్ చేసే సెట్టింగ్స్ చాలా ఎక్కువగా, అన్ని వర్గాల ప్రజలకు అర్థం అయ్యే పద్ధతిలో ఇవ్వాలని, వాళ్లు సంఘానికి నష్టం చేసే ఏ యాడ్స్‌కు అయినా రిపోర్ట్ సబ్మిట్ చేసే అన్ని ఆప్షన్స్ కల్పించాలని తెలిపింది. ఈ చట్టం వల్ల యాడ్ చూసే వారిని జాగ్రత్తగా కాపాడుకునే వీలుంటుందని, వ్యూవర్స్ సమయాన్ని వృధా చేయకుండా వారి విలువైన ఆ కాసేపటిని సమయాన్ని వారికి ఇవ్వాలన్నదే చట్టం యొక్క ఉద్దేశం అని గవర్నమెంట్ చెప్పుకొచ్చింది.

ఫిబ్రవరి 15 నుంచి అమలు!

అయితే ఈ చట్టం ఇప్పుడే వర్తించదు . రేపు నెల (2026 ఫిబ్రవరి 15) నుంచి వియత్నాం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలుపరుస్తుంది. ఆ తరువాత కూడా యాడ్స్‌కు సంబంధించిన ఎటువంటి పొరపాట్లు జరిగిన లేదా చట్టం చెప్పిన దాని ప్రకారం నడుచుకోకపోయినా అందుకు తగిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. ఏదైనా నోటీసులు ఇస్తే ఒకరోజు లోపు దానికి స్పందించాలని వెల్లడించింది. అలా కాకుండా.. చట్టాలను అతిక్రమించి ఏది చేసిన సరే శిక్ష అనుభవిస్తారు. ఆ యాప్ లేదా సంస్థకు సంబంధించిన కార్యకలాపాలను శాశ్వతంగా తమ దేశంలో నిలిపివేస్తామని హెచ్చరించింది.

వియత్నాం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అనేక దేశాలలోని ప్రజలు స్వాగతిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ రకమైన చట్టాలు రావాలని అభిప్రాయపడుతున్నారు. అప్పుడు ఈ అవసరం లేని యాడ్స్ స్కిప్ చేయడానికి అవకాశం దొరుకుతుంది అన్నది చాలామంది ఆలోచన.