Home Blog Page 86

రాయల్ ఎన్‌ఫీల్డ్.. 2025 మీటియోర్ 350 లాంచ్: ధర ఎంతో తెలుసా?

0

ప్రముఖ వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్.. జే-సిరీస్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన తన మొట్టమొదటి బైక్ ‘మీటియోర్ 350‘ను ఎట్టకేలకు ఆధునిక హంగులతో.. దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఆకర్షణీయంగా ఉండటం గమనించవచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ 2020లో తన మీటియోర్ 350 బైకును లాంచ్ చేసింది. ఇది అప్పట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగిన థండర్‌బర్డ్‌కు వారసత్వంగా దేశీయ విఫణిలో లాంచ్ అయింది. కంపెనీ ఈ బైకును లాంచ్ చేసిన తరువాత.. ఆధునిక ప్యాకేజీతో, కొత్త పెయింట్ స్కీమ్‌లతో, అదనపు ఫీచర్స్ కూడా జోడించడానికి సిద్ధమైంది. అందులో నుంచి పుట్టుకొచ్చినదే.. ఈ 2025 మీటియోర్ 350.

వేరియంట్స్ & ధరలు

సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 బైక్ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధరలు రూ. 1.96 లక్షల నుంచి రూ. 2.15 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. నిజానికి దీని ధరలు రూ. 2.08 లక్షల నుంచి రూ. 2.32 లక్షల మధ్య ఉండేది. కానీ జీఎస్టీ సవరణల కారణంగా ధరలు తగ్గాయి.

➜ఫైర్‌బాల్ (ఫైర్‌బాల్ ఆరంజ్ & ఫైర్‌బాల్ గ్రే): రూ. 1,95,762
➜స్టెల్లార్ (స్టెల్లార్ మ్యాట్ & స్టెల్లార్ మెరైన్ బ్లూ): రూ. 2,03,419
➜అరోరా (అరోరా రెట్రో గ్రీన్ & అరోరా రెడ్) : 2,06,290
➜సూపర్నోవా (సూపర్నోవా బ్లాక్): రూ. 2,15,883

డిజైన్ & ఫీచర్స్

2025 రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 బైకులో చెప్పుకోదగ్గ అప్డేట్ ఏమిటంటే.. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ ఇండికేటర్స్. అయితే ఫైర్‌బాల్, స్టెల్లార్ వేరియంట్లలో ఇవి హాలోజన్ యూనిట్లుగా ఉన్నాయి. స్లిప్పర్ క్లచ్ లభిస్తుంది. ఈ అప్‌గ్రేడ్ మొదట.. క్లాసిక్ 350లో, ఆ తరువాత హంటర్ 350లో జరిగింది. ఇప్పుడు మీటియోర్ 350లో కనిపించింది. యూఎస్‌బీ టైప్-సీ ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇందులో చూడవచ్చు. కాగా సూపర్నోవా, అరోరా వేరియంట్లలో అడ్జస్టబుల్ లివర్స్ కూడా ఉన్నాయి.

ఇంజిన్ వివరాలు

సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 బైకులోని ఇంజిన్ ఎటువంటి అప్డేట్స్ పొందలేదని తెలుస్తోంది. కాబట్టి ఇందులో 349 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 20.2 హార్స్ పవర్, 27 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. అయితే ఛాసిస్, సస్పెన్షన్, బ్రేకింగ్ వంటి వాటిలో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. కాబట్టి పనితీరుపరంగా ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకున్న డిమాండ్

దేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అయితే జీఎస్టీ ప్రతిపాదనలకు ముందు ధరలు పెరుగుతాయని వార్తలు వినిపించాయి. కానీ 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైకుల ధరలు మాత్రమే పెరుగుతాయని జీఎస్టీ ప్రతిపాదనలు స్పష్టం చేశాయి. దీంతో ఇప్పుడు లాంచ్ అయిన కొత్త మీటియోర్ 350 ధరలు మాత్రమే కాకుండా.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న క్లాసిక్ 350, హంటర్ 350 బైకుల ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. దీంతో కంపెనీ అమ్మకాలు.. పండుగల సమయంలో మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందని, ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా కంపెనీ భావిస్తోంది.

డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్: దేశంలో ఎక్కడా లేని విధానం!

0

భారతదేశంలో రోడ్డుపై వాహనం నడపాలంటే తప్పకుండా.. డ్రైవింగ్ లైసెన్స్ కావాలని అందరికీ తెలుసు. ఈ డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి కొన్ని పరీక్షలు ఉంటాయన్న సంగతి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ పరీక్షలను మరింత కఠినం చేసిన మొదటి రాష్ట్రంగా కేరళ రికార్డ్ క్రియేట్ చేసింది. 2025 అక్టోబర్ 1 నుంచి ఈ కఠిన పరీక్షలు అమలులోకి వచ్చేలా కొన్ని సంస్కరణలు చేస్తున్నట్లు సమాచారం.

పెరిగిన ప్రశ్నలు

దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి కేరళ ప్రభుత్వం దోహదపడుతోంది. ఇందులో భాగంగానే.. ఆచరణాత్మక డ్రైవింగ్ టెస్ట్ మరింత కఠినతరం చేస్తోంది. లెర్నర్స్ లైసెన్స్ టెస్టులో ప్రశ్నలు 20 నుంచి 30కి పెరిగాయి. ఇందులో 60 శాతం ఉత్తీర్ణత లేదా స్కోర్ సాధించాలి. సమాధానం ఇచ్చే సమయంలో కూడా మార్పులు చేసినట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కే.బీ. గణేష్ కుమార్ పేర్కొన్నారు. మొత్తం మీద డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి 83 శాతం అర్హత సాధించాలని పేర్కొన్నారు.

నెగటివ్ మార్కులు

డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి నిర్వహించే టెస్టులో నెగటివ్ మార్కులు కూడా ఉన్నాయి. సమాధానం తెలియని ప్రశ్నలకు వదిలిపెట్టే అవకాశం కూడా కల్పిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 పాయింట్లు తీసేస్తారు. బహుశా ఇలాంటి విధానం దేశంలోనే ఎక్కడా లేదు. టెస్టుకు సిద్దమవ్వడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్ కూడా ప్రారంభించింది. ఇందులో సిలబస్, ప్రాక్టీస్ సెట్, మాక్ టెస్ట్ వంటివి ఉన్నాయి.

పబ్లిక్ రోడ్డుపై టెస్టింగ్

ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్ కూడా ప్రత్యేకంగా రూపొందించారు. ఇందులో పాల్గొనే అభ్యర్థులు యాంగ్యులర్, సమాంతర పార్కింగ్, గ్రేడియంట్ డ్రైవింగ్, జిగ్-జాగ్ విన్యాసాలను చూపించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా వాస్తవ ప్రపంచ పరిస్థితులను అనుకరించే విధంగా నిర్మించబడి ఉంటాయి. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. పబ్లిక్ రోడ్ టెస్టింగ్. అభ్యర్థులు క్లోజ్డ్ ట్రాక్‌లలో కాకుండా.. నిజమైన ట్రాఫిక్‌లో వాహనం నడపాల్సి ఉంటుంది.

టెక్నాలజీ సాయం

కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ కొత్త విధానం.. ఎక్కువగా టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. టెస్టింగ్ వాహనాలకు డాష్‌బోర్డ్ కెమెరాలు, జీపీఎస్ ట్రాకర్స్ మొదలైనవి ఉంటాయి. ఇవి ఎప్పటికప్పుడు అభ్యర్థుల పనితీరును రికార్డ్ చేస్తాయి. ఈ రికార్డ్ మొత్తం దాదాపు మూడు నెలలు ఉంటుంది. ఏదైనా వివాదాలు తలెత్తితే.. దానికి ఇవే పరిష్కారం చూపిస్తాయి. అంతే కాకుండా 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసైనా కార్లను టెస్ట్ కోసం ఉపయోగించడం నిషేధం.

రోజుకు కొంతమందే!

కఠినమైన విధానాలు డ్రైవింగ్ లైసెన్స్ కోసం వేచి ఉండే సమయాన్ని పెంచింది. మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ ప్రతిరోజూ నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే డ్రైవింగ్ టెస్టుకు అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. దీంతో చాలా మంది అప్లై చేసుకున్న వారు కూడా వారి తేదీ వచ్చే వరకు వేసి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రాసెసింగ్ నెమ్మదిగా ఉన్నప్పటికీ.. పరీక్షలు మాత్రం విజయవంతంగా నిర్వహిస్తోంది. దీంతో డ్రైవింగ్ లైసెన్స్ టెస్టులో పాస్ అయ్యేవారి సంఖ్య తగ్గిపోతోంది. దీనిపై ప్రస్తుతం కొంత వ్యతిరేకత కూడా మొదలైంది.

ఆగస్టులో ఎక్కువమంది కొన్న కారు ఇదే!.. దీని గురించి తెలుసా?

0

2025 ఆగస్టు నెల పూర్తి కావడంతో.. వాహన తయారీ సంస్థలు తమ అమ్మకాల డేటాను విడుదల చేశాయి. ఈ నివేదికలో గత నెలలో అత్యధిక అమ్మకాలు పొందిన కారుగా ”మారుతి సుజుకి ఎర్టిగా” తన ఆధిపత్యం చెలాయించింది. దీంతో హ్యుందాయ్ క్రెటా, మారుతి డిజైర్ వంటి కార్లు సైతం అమ్మకాల్లో వెనుకబడ్డాయి.

తాజా నివేదికల ప్రకారం.. మారుతి సుజుకి ఇండియా 2025 ఆగస్టులో 18,445 యూనిట్ల ఎర్టిగా కార్లను విక్రయించింది. దీంతో ఎర్టిగా నెలవారీ అమ్మకాల్లో అగ్రస్థానములో నిలిచింది. కాగా డిజైర్ 16,509 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలువగా.. మూడో స్థానంలో హ్యుందాయ్ క్రెటా 15,924 యూనిట్ల అమ్మకాలను సొంతం చేసుకుంది. ఆ తరువాత టాప్ 10 జాబితాలో వరుసగా వ్యాగన్ ఆర్, టాటా నెక్సాన్, బ్రెజ్జా, బాలెనొ, ఫ్రాంక్స్, స్విఫ్ట్, ఈకో వంటి కార్లు ఉన్నాయి.

మారుతి ఎర్టిగా గురించి

ఎర్టిగా 1.5 లీటర్ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 103 బీహెచ్‌పీ పవర్, 137 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇది ప్రస్తుతం సీఎన్‌జీ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇది 88 బీహెచ్‌పీ పవర్, 121 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ మాత్రమే పొందింది. ఎర్టిగా సీఎన్‌జీ వేరియంట్.. 26 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. దీంతో ఇది ప్రస్తుతం దేశంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఎంపీవీగా నిలిచింది.

మారుతి ఎర్టిగా (ధర రూ. 9.11 లక్షలు, ఎక్స్ షోరూమ్).. హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్, 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటివి పొందుతుంది. ఇది 7 ఇంచెస్ స్మార్ట్‌ప్లే ప్రో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, రెండో వరుసలో రూఫ్ మౌంటెడ్ ఏసీ, కలర్ టీఎఫ్టీ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే మొదలైన ఫీచర్స్ ఇందులో చూడవచ్చు.

సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే మారుతి ఎర్టిగాలో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటివి ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న చాలా కార్లు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతాయి. ఎర్టిగా మాత్రం రెండు ఎయిర్‌బ్యాగ్‌లతోనే సరిపెట్టుకుంటోంది.

ఆగస్టులో ఎక్కువ అమ్మకాలు పొందిన టాప్ 10 కార్లు

➤మారుతి ఎర్టిగా: 18,445 యూనిట్లు
➤మారుతి డిజైర్: 16,509 యూనిట్లు
➤హ్యుందాయ్ క్రెటా: 15,924 యూనిట్లు
➤మారుతి వ్యాగన్ ఆర్: 14,552 యూనిట్లు
➤టాటా నెక్సాన్: 14,004 యూనిట్లు
➤మారుతి బ్రెజ్జా: 13,620 యూనిట్లు
➤మారుతి బాలెనొ: 12,549 యూనిట్లు
➤మారుతి ఫ్రాంక్స్: 12,422 యూనిట్లు
➤మారుతి స్విఫ్ట్: 12,385 యూనిట్లు
➤మారుతి ఈకో: 10,785 యూనిట్లు

స్పీడుమీదున్న ఆటోమొబైల్ రంగం

భారతదేశ ఆటోమొబైల్ రంగం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. లెక్కకు మించిన కంపెనీలు దేశీయ విఫణిలో కొత్త కార్లను లాంచ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో జర్మనీ, జపాన్, అమెరికా, చైనా, స్వీడన్, ఫ్రెంచ్, వియాత్నం మొదలైన దేశాలకు చెందిన బ్రాండ్స్ ఉన్నాయి. దేశ ఆర్ధిక రంగం అభివృద్ధి చెందడానికి కూడా ఆటోమొబైల్ రంగంలో చాలా దోహదపడుతోంది. అంతే కాకుండా వాహన ప్రేమికులు కూడా ఎప్పటికప్పుడు కొత్త కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ కారణంగానే దేశంలో కార్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది.

బిగ్‏బాస్ 9: 15 మంది కంటెస్టెంట్స్.. ఒక్కక్కరికి ఎంత రెమ్యునరేషన్ అంటే?

0

బిగ్‏బాస్ సీజన్ 9 మొదలైపోయింది. ఈ సీజన్ ప్రారంభమయ్యేదాకా.. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరనే కుతూహలం చాలామందిలో ఉండేది. ఇప్పుడు ఆ జాబితా తెలిసిపోయింది. కాగా ఇప్పుడు వారి రెమ్యునరేషన్ ఎంత?, రోజుకు ఎంత తీసుకుంటారు.. సెలబ్రిటీలకు ఎంత?, సామాన్యులకు ఎంత అనే వివరాల కోసం నెట్టింలో తెగ సెర్చ్ చేసేస్తున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో..

తెలుగు బిగ్‏బాస్ సీజన్ 9లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇందులో 6 మంది కామన్ కేటగిరి (సామాన్య ప్రజలు) ఉన్నారు. మిగిలిన 9 మంది సెలబ్రిటీలు. సాధారణ ప్రజలను అగ్నిపరీక్ష అనే కార్యక్రమం ద్వారా ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి వీరికి కూడా మంచి రెమ్యునరేషన్ అందిస్తున్నారు. సెలబ్రిటీలకు ఎలాగో వారికి తగ్గ రెమ్యునరేషన్ దక్కుతుందనే విషయం అందరికి తెలిసిందే.

రెమ్యునరేషన్ వివరాలు (వారానికి)

➤భరణి: రూ. 3,50,000
➤ఫ్లోరా సైని: రూ. 3,00,000
➤సుమన్ శెట్టి: రూ. 2,50,000
➤సంజన గల్రాని: రూ. 2,75,000
➤రైతు చౌదరి: రూ. 2,75,000
➤తనూజ: రూ. 2,50,000
➤ఇమ్మాన్యుయేల్: రూ. 2,50,000
➤రాము రాథోడ్: రూ. 2,00,000
➤శ్రష్టి వర్మ: రూ. 2,00,000
➤డీమాన్ పవన్: రూ. 70,000
➤మిలటరీ కళ్యాణ్: రూ. 70,000
➤మర్యాద మనీష్: రూ. 70,000
➤హరీష్: రూ. 70,000
➤ప్రియా ఈపూరు: రూ. 70,000
➤దమ్ము శ్రీజ: రూ. 70,000

ప్రస్తుతానికి వెల్లడైన రెమ్యునరేషన్ వివరాలను బట్టి చూస్తే భరణికి ఎక్కువ రెమ్యునరేషన్ ఉందని స్పష్టమవుతోంది. ఆ తరువాత ఫ్లోరా సైని, సుమన్ శెట్టి, రీతూ చౌదరి మొదలైనవారు ఉన్నారు. వీరి రెమ్యునరేషన్ వారానికి లక్షల్లో ఉన్నాయి. కానీ నార్మల్ కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ మాత్రం వేలల్లోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా వీరందరికీ కూడా ఒకే విధమైన రెమ్యునరేషన్ అని కూడా తెలుస్తోంది.

నిజానికి ఇప్పటికి వెల్లడైన కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ అనేది కేవలం ఒక అంచనా మాత్రమే. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం బిగ్‏బాస్ బృందంగానీ, కంటెస్టెంట్స్ గానీ ఎవరూ పంచుకోలేదు. అయితే కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందని సమాచారం. అప్పుడు ఎవరికి ఎంత అనే విషయంపై ఒక క్లారిటీ వచ్చేస్తుంది.

బిగ్‏బాస్ హౌస్ విశేషాలు

ఇప్పటికే బిగ్‏బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇక ఎలిమినేషన్స్ గురించి కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరా అని.. చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయం కూడా త్వరలోనే తెలుస్తుంది. కాగా మొదటివారం బిగ్‏బాస్ సీజన్ 9 ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదని తెలుస్తోంది. సాధారణంగా అన్ని సీజన్లలోనూ మొదటి వారం ఇలాగే ఉంటుందని, ఆ తరువాత అసలైన ఆట మొదలవుతుందని నెటిజన్లు చెబుతున్నారు. మొత్తానికి ఈ సారి గెలిచేది ఎవరు?, బిగ్‏బాస్ 9 టైటిల్ విన్నర్ ఎవరనేది ఇప్పటికి ఊహకు అందటం లేదు. టైటిల్ గెలిచేది.. కామన్ మెన్ కేటగిరిలోనివారా?, సెలబ్రిటీల అనేది ముందు ముందు తెలుస్తుంది. ప్రస్తుతానికి సెలబ్రిటీలు, కమాన్ మెన్స్ అందరూ కూడా తమదైన రీతిలో.. తమను తాము నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి గెలుపెవరిది అనేది తెలుసుకోవడానికి ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు ప్రజలు: సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

0

నేపాల్‌లో జరుగుతున్న అల్లర్ల కారణంగా.. అక్కడి ప్రభుత్వం అతలాకుతలమైంది. ఈ అల్లర్ల కారణంగానే ఆ దేశంలో పరిస్థితులు తారుమారయ్యాయి. ఇక్కడ నేపాలీ ప్రజలు మాత్రమే కాకుండా.. కొంతమంది తెలుగు ప్రజలు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ సుమారు 200 మంది తెలుగు వారు చిక్కుకుపోయారని సమాచారం. వీరిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంది.

సమీప దేశమైన నేపాల్‌లో చిక్కుకున్న 200 మంది తెలుగు ప్రజలను కాపాడే బాధ్యతను తీసుకున్న కూటమి ప్రభుత్వం.. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను మంత్రి నారా లోకేష్‌కు అప్పగించారు. ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ సమావేశంలో ప్రసంగించిన చంద్రబాబు నాయుడు.. తెలుగు ప్రజలు కష్ట సమయంలో ఉన్నప్పుడు స్పందించడం రాష్ట్ర ప్రభుత్వం విధి అని అన్నారు.

నారా లోకేష్‌కు బాధ్యతలు

నేపాల్‌లో నిరసనలు జరుగుతున్న సమయంలో.. అక్కడే ఇరుక్కున్న తెలుగు కాపాడాలి. రియల్ టైమ్ గవర్నెన్స్‌లో పరిస్థితిని పర్యవేక్షించాలని.. మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్‌ను ఆదేశించాను. ఈ క్లిష్ట సమయంలో మన ప్రజలకు స్పందించడం, వారికి తోడుగా నిలబడటం మన విధి అని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

తెలుగు ప్రజలకు సహాయం చేయడానికి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీలోని ఆంధ్ర భవన్‌లో అత్యవసర విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇది పౌరులకుఇ కలిగిన అశాంతిని ఎదుర్కొంటుంది. ఆంధ్రప్రదేశ్ భవన్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు.. కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడును, ఆంధ్ర భవన్ అధికారులను అన్ని విధాలా సహాయ సహకారాలను అందించాలని కోరినట్లు పేర్కొన్నారు.

భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు

ఇకపోతే.. నేపాల్‌లోని ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం పూర్తి సహకారాన్ని అందించనున్నట్లు హామీ ఇచ్చింది. ఖాట్మండులోని బఫాల్‌లో సుమారు 30 మంది తెలుగు ప్రజలకు ఆహరం, వసతి, వైద్య సహాయం అందిస్తున్నట్లు శ్రీకాంత్ తెలియజేసారు. దీనికోసం ఆంధ్ర భవన్‌లో అత్యవసర నోడల్ అధికారిగా ఒకరిని నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా.. అక్కడి పరిస్థితిని పర్యవేక్షించడానికి, తెలుగు ప్రజలను రక్షించడానికి టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వశాఖ మరియు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

ఖాట్మండులోని ఒక హోటల్‌లో బస చేస్తున్న కొన్ని తెలుగు కుటుంబాలను.. నేపాల్ ఆందోళనకారులు బెదిరించారని సమాచారం. ఈ కారణంగానే అధికారుల పర్యవేక్షణలో ఉన్న గెస్ట్ హౌస్‌కు వీరందరిని తరలించారు. ఇక్కడ చిక్కున్న ప్రజలను వీలైనంత తొందరగా.. భారతదేశానికి తీసుకురావడానికి ఇక్కడ ప్రభుత్వం కావలసిన అన్ని ఏర్పాట్లను చేస్తోంది.

నేపాల్ అల్లర్లకు ప్రధాన కారణం

సోషల్ మీడియా నిషేధం, అవినీతి & శాశ్వత రాజకీయ వారసత్వాలు, నిరుద్యోగం & ఆర్ధిక అవకాశాల తగ్గుదల, పాలనా వ్యవస్థమీద నమ్మకం లేకపోవడం, యువతకు సంబంధించిన చాలా విషయాలను నిర్లక్ష్యం చేయడం మొదలైన కారణాల వల్ల.. అక్కడి ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా అల్లర్లు చేయడం మొదలు పెట్టారు. ఇదే తీవ్ర స్థాయికి చేరి.. చాలా నష్టం కలిగించింది. ఈ అల్లర్లను తగ్గించడానికి అక్కడ ప్రభుత్వంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.

మిత్రమా భయమేల.. డుగ్ డుగ్ బండి ధరలు తగ్గాయ్ కదా!

0

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ 2.0 ప్రకటించిన తరువాత.. భారతదేశంలో దాదాపు అన్ని వాహన తయారీ సంస్థలు తమ వాహనాల ధరలను తగ్గించాయి. ప్రారంభంలో బైక్ తయారీ దిగ్గజం రాయల్ ఎన్‌ఫీల్డ్ ధరలు తగ్గే అవకాశం లేదని కొన్ని వదంతులు వెల్లడయ్యాయి. కానీ ఇప్పుడు కంపెనీ తగ్గిన ధరలను ప్రకటించింది. ఇది డుగ్ డుగ్ బండి ప్రియులకు కొంత ఉపశమనం కలిగించింది.

రూ. 22,000 వరకు తగ్గిన ధరలు

జీఎస్టీ సంస్కరణల తరువాత తగ్గిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ధరలు 2025 సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి. నిజానికి 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైకుల ధరలు కూడా సవరించనున్నట్లు సంస్థ వెల్లడించింది. అయితే ప్రస్తుతానికి 350 సీసీ బైకుల ధరలు తగ్గాయి. ఇందులో క్లాసిక్ 350, హంటర్ 350, బుల్లెట్ 350, మీటియోర్ 350 మోడల్స్ ఉన్నాయి. ఎంపిక చేసిన మోడల్స్ మీద గరిష్టంగా రూ. 22,000 తగ్గుతుంది. కాగా భవిష్యత్తులో హిమాలయన్ 450, గెరిల్లా 450, 650 సీసీ విభాగంలోని బైకుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే ఎంత ధర తగ్గుతుందనే విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.

తగ్గిన ధరలను గురించి వ్యాఖ్యానిస్తూ.. ఐషర్ మోటార్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓ బీ గోవిందరాజన్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేటెస్ట్ జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయి. మొదటిసారి బైక్ కొనుగోలుచేసే వారికి కొంత తగ్గింపు కూడా లభిస్తుంది. జీఎస్టీ ప్రయోజనాలను మా వినియోగదారులకు అందజేస్తున్నామని ప్రకటించడం మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

28 శాతం నుంచి 18 శాతానికి

2025 సెప్టెంబర్ 22 నుంచి 350 సీసీ సామర్థ్యం కలిగిన మోటారు సైకిళ్లపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గుతుంది. దీనివల్ల బైక్ ధరలు ఓ మోస్తరుగా తగ్గుతాయి. కాగా 350 సీసీ కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న బైక్ ధరలు పెరుగుతాయని సమాచారం. ఎంత పెరుగుతాయి?, కొంచెమైనా తగ్గే అవకాశం ఉందా?, తగ్గితే ఏ కోణంలో తగ్గుతుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది.

నిజానికి భారతదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు ఓ ప్రత్యేకమైన ఆదరణ ఉంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కంపెనీ బైకులు ఒకప్పటి నుంచి వయసుతో బేధం లేకుండా.. యువకులను, పెద్దవారిని సైతం ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం 350 సీసీ, 450 సీసీ, 650 సీసీ విభాగంలో కూడా కంపెనీ బైకులను లాంచ్ చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అలంటి ఈ కంపెనీ బైకులు పేరుతాయనే విషయం.. కొత్తగా రాయల్ ఎన్‌ఫీల్డ్ కొనాలనుకున్న వారిలో ఒకింత భయాన్ని, నిరాశను కలిగింది. కానీ ఇప్పుడు కంపెనీ తగ్గిన ధరలను ప్రకటించి వారికి కొంత ఉపశమనం కలిగించింది.

జాబితాలో ఇతర కంపెనీలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ మాత్రమే కాకుండా.. ఇతర టూ వీలర్ తయారీ సంస్థలు కూడా ధరలను తగ్గిస్తూ అధికారిక ప్రకటనలు చేశాయి. ఇందులో బజాజ్ ఆటో ఎంపిక చేసిన బైకుల ధరలను రూ. 20,000 వరకు తగ్గించగా.. టీవీఎస్ మోటార్ కంపెనీ గరిష్టంగా రూ. 21,718 వరకు తగ్గింపులు ప్రకటించింది. బైక్ తయారీ దారులు మాత్రమే కాకుండా.. కార్ల తయారీదారులైన హ్యుందాయ్, టయోటా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, మినీ కంపెనీలు కూడా తగ్గిన ధరలను ఈ మధ్యకాలంలో ప్రకటించాయి. తగ్గిన ధరల కారణంగా.. వస్తున్న పండుగల (దసరా, దీపావళి) సమయంలో వాహన అమ్మకాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని పలువురు భావిస్తున్నారు.

వారసుడొచ్చాడు.. కొడుకు ఫోటో షేర్ చేసిన వరుణ్ తేజ్

0

నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ తండ్రయ్యాడు. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని రెయిన్‌బో హాస్పిటల్‌లో.. లావణ్య త్రిపాఠి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి.. మన శంకర వరప్రసాద్ గారు సినిమా సెట్ నుంచే నేరుగా ఆసుపత్రికి వెళ్లి, ఈ మెగా దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వరుణ్ తేజ్ తన కొడుకు ఫోటోను షేర్ చేస్తూ లిటిల్ మ్యాన్ అంటూ క్యాప్సన్ ఇచ్చారు. అటు వరుణ్ ఫ్యాన్స్, ఇటు లావణ్య ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.

2023లో పెళ్లి

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. 2023 నవంబర్ 1న ఇటలీలోని టస్కానీలోని బొర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహనానికి మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితులు, స్నేహితులు పాల్గొన్నారు. ఆ తరువాత 2023 నవంబర్ 5న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా.. ఇతర సెలబ్రిటీలు, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు.

నిజానికి లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. 2017లో మిస్టర్ సినిమాలో ఇద్దరు కలిసి నటించారు. అప్పుడు ఏర్పడిన పరిచయం స్నేహంతో మొదలై.. ప్రేమగా మారి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత లావణ్య త్రిపాఠి దాదాపు సినిమాలకు దూరమైంది. కాగా ఈ ఏడాది మే నెలలో తాము తల్లిదండ్రులు అవుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇప్పుడు ఈ జంట మగబిడ్డకు జన్మనిచ్చింది. వారసుని రాకతో మెగా ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. నాగబాబు తాతయ్య ప్రమోషన్ తీసుకున్నారు.

లావణ్య త్రిపాఠి

1991 డిసెంబర్ 15న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జన్మించిన లావణ్య త్రిపాఠి.. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో పెరిగింది. తండ్రి హైకోర్టులో న్యాయవాది, కాగా అమ్మ ఉపాధ్యాయినిగా పనిచేశారు. లావణ్యకు ఒక చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. ఈమె (లావణ్య త్రిపాఠి) డెహ్రాడూన్‌లోని మార్షల్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసిన తరువాత.. ముంబై వెళ్లి, అక్కడ రిషి దయారాం నేషనల్ కాలేజీలో ఆర్థికశాస్త్రం పూర్తి చేసింది. 2006లో చదువుకునే రోజుల్లోనే మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ గెలుచుకుంది. ఆ సమయంలోనే భరతనాట్యం కూడా నేర్చుకుంది. అందాల రాక్షసి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఈమె తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల చిత్రాల్లో కూడా నటించింది. పెళ్లి తరువాత లావణ్య సినిమాలకు దూరంగా ఉంది.

వరుణ్ తేజ్

మెగా వారసుడు.. నాగబాబు తనయుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్.. ఆ తరువాత తనదైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బాలనటుడిగా సినిమాల్లో కనిపించినప్పటికీ.. ముకుంద సినిమాతోనే హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తరువాత కంచె, లోఫర్, మిస్టర్, ఫిదా వంటి సినిమాల్లో నటించారు. వరుణ్ తేజ్ చివరి సినిమా మట్కా. కాగా ఈయన ప్రస్తుతం ‘వీటీ15’ కోసం పనిచేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం ప్రస్తుతానికి వెల్లడికాలేదు. బహుశా దీనిని త్వరలోనే విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం.

అల్లు అర్జున్ ఫ్యామిలీకి నోటీస్.. కూల్చేయాలంటున్న జీహెచ్ఎంసీ అధికారులు

0

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు, కట్టడాలకు అడ్డుకట్ట వేయడానికి ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్’ (జీహెచ్ఎంసీ) నడుం బిగించింది. అక్రమ నిర్మాణాలకు పాల్పడినవారు.. ఎంతటివారైనా వారిని వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ కుటుంబానికి షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఎందుకు నోటీసులు జారీ చేశారు? అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

జూబ్లీహిల్స్ (హైదరాబాద్) రోడ్ నెంబర్ 45లో అల్లు బిజినెస్ పార్క్ భవనం ఉంది. అయితే ఈ భవనంపై అక్రమంగా పెంట్ హౌస్ నిర్మించారని.. జీహెచ్ఎంసీ సర్కిల్-18 అధికారులు సోమవారం షో-కాజ్ నోటీసు జారీ చేసారు. అంతే కాకుండా.. దానిని ఎందుకు కూల్చకూడదో చెప్పాలన్నారు.

అనుమతులను అధిగమించిన నిర్మాణం

రెండు సంవత్సరాల క్రితం.. అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అల్లు బిజినెస్ పార్క్ భవనం నిర్మించారు. ఈ భవనంలో గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ వంటి వాటికి సంబంధించిన వ్యాపారాలు, ఇతర కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఇప్పటి వరకు రెండు సెల్లార్లు మరియు ఒక గ్రౌండ్ ఫ్లోర్ + నాలుగు అంతస్థులకు సుమారు 1226 చదరపు గజాల స్థలంలో నిర్మాణానికి మాత్రమే అనుమతి లభించింది. అయితే ఇటీవల నాలుగో అంతస్తుపైన ఇంకో నిర్మాణం చెప్పారు.

నాలుగో అంతస్తుపై నిర్మించిన ఈ అక్రమ నిర్మాణం గురించి విచారణ జరపడానికి సర్కిల్ 18 డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య విచారణకు ఆదేశించారు. ఈ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయకుడదో వివరించాలని షో-కాజ్ నోటీసు జారీ చేశారు. అయితే ఈ నోటీసుపై అల్లు ఫ్యామిలీ ఇంకా స్పందించలేదు.

అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు అల్లువారి కుటుంబంపై పడింది. అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారు ఎంత పెద్దవారైనా.. ఒకే న్యాయం అంటూ, గతంలో అక్కినేని నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూల్చివేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెస్ట్ మానిటరింగ్ అండ్ ప్రొటక్షన్) పేరుతో ఒక బృందం ఏర్పాటు చేసి.. అక్రమ నిర్మాణాలను తొలగిస్తూ వచ్చింది.

హైడ్రా అక్రమ నిర్మాణాలను దాదాపు అంతమొందిస్తూ వచ్చింది. ఇందులో కొందరు ప్రజలు ఆవాసం లేకుండా.. నిలువ నీడ లేకుండా పోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. డబ్బున్న వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. డబ్బులేని వాళ్ళు బాధపడుతూ ఊరుకున్నారు. అయితే ఇప్పుడు అక్రమ కట్టడాల తొలగింపులో కొన్ని మార్పులు చేస్తూ.. కారకులను ముందుగా విచారించడం వంటివి చేస్తున్నారు. దీంతో నిర్మాణాల తొలగింపులు ముందుంత లేదు.

ఇప్పటివరకు.. హైడ్రా ఏర్పాటు అయిన తరువాత సుమారు 300 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు సమాచారం. తద్వారా 120.22 ఎకరాల భూమిని పొందింది. అక్రమ నిర్మాణాల కారణంగా అకాల వర్షాల సమయంలో ఇబ్బందులకు గురవుతారని, నీటి ముంపులో చుక్కుకునే ప్రమాదం ఉందని.. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఈ కఠినమైన చర్యలకు పూనుకోవలసి వచ్చింది. ఈ చర్య ప్రభుత్వంపై కొంత వ్యతిరేకతను కూడా కలిగించింది.

పుష్ప 3 టైటిల్ ఇదే.. క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్: ఆనందంలో ఫ్యాన్స్

0

అల్లు అర్జున్.. ఈ పేరు వినగానే చాలామందికి పుష్ప సినిమానే గుర్తొస్తుంది. ఇప్పటికే సంచలన విజయాలు కైవసం చేసుకుని.. భారీ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాలు ప్రతిష్టాత్మక అవార్డులను సైతం సొంతం చేసుకున్నాయి. పుష్ప, పుష్ప 2 సినిమాలు విజయవంతం కావడంతో.. పుష్ప 3 కూడా రానున్నట్లు డైరెక్టర్ సుకుమార్ వెల్లడించారు.

పుష్ఫ 3 వస్తుంది

నిజానికి పుష్ప సినిమా చూసిన తరువాత.. పుష్ప 2 సినిమా కోసం అభిమానులు ఎంతగానో వేచి చూసారు. ఇప్పుడు పుష్ప 3 కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి దర్శకుడు శుభవార్త చెప్పారు. రాబోయే పుష్ఫ సినిమాకు ”పుష్ప 3: ది రాంపేజ్” అని పేరు పెట్టారు. అయితే ఈ సినిమా ఎప్పుడు వస్తుందనే విషయాన్ని మాత్రం ఎవరూ చెప్పలేదు.

సైమా అవార్డ్ 2025

దుబాయ్‌లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025 (సైమా) కార్యక్రమంలో.. పుష్ప టీమ్ ఏకంగా ఐదు అవార్డులను గెలుచుకుంది. ఈ సమయంలో పుష్ప 3 సినిమా వస్తుందా?.. అనే ప్రశ్నకు తప్పకుండా వస్తుందని క్లారిటీ ఇచ్చారు. సైమా వేదికపై అల్లు అర్జున్ (బెస్ట్ యాక్టర్), రష్మిక మందన్న (ఉత్తమ నటి), సుకుమార్ (బెస్ట్ డైరెక్టర్), దేవిశ్రీ ప్రసాద్ (బెస్ట్ మ్యూజిక్ కంపోజర్), శంకర్ బాబు కందుకూరి (బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ – మేల్) అవార్డులను అందుకున్నారు. ఒకే సినిమా ఇన్ని అవార్డులు అందుకోవడం గొప్ప విషయం.

సైమా అవార్డు తరువాత అల్లు అర్జున్ రియాక్షన్

నిరంతరం ప్రేమ, గుర్తింపు ఇస్తున్న సైమాకు ధన్యవాదాలు. వరుసగా మూడు సైమా అవార్డులు గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా విజేతలకు, నామినీలందరికి అభినందనలు. దీన్ని (అవార్డు గెలుచుకోవడం) సాధ్యం చేసినందుకు.. ఈ క్రెడిట్ మొత్తం నా డైరెక్టర్ ‘సుకుమార్’కు చెందుతుంది. నా తోటి కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాత, చిత్ర బృందానికి ధన్యవాదాలు. ఈ అవార్డును నా అభిమానులకు అంకితం చేస్తున్నాను. వారి ప్రేమకు నేను ఎప్పుడు బద్ధుడను అని అల్లు అర్జున్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

పుష్ప 3 ఆలస్యం కావొచ్చు

పుష్ప సినిమా తరువాత పుష్ప 2 సినిమా ప్లాన్ ప్రకారం చిత్రీకరించారు. పుష్ప 3పై ముందుగా ఎలాంటి అంచనాలు లేవని తెలుస్తోంది. పుష్ప 2 భారీ విజయం సాధించిన తరువాత పుష్ప 3 కోసం ప్లాన్ చేసి ఉండొచ్చని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం నటుడు అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ఇద్దరూ కూడా వేరువేరు ప్రాజెక్టులలో ఉన్నారు.

అల్లు అర్జున్.. అట్లీతో కలిసి ఏఏ22ఎక్స్ఏ6 (AA22xA6) అనే సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్.. రామ్ చరణ్‌తో కలిసి ఆర్‌సీ17 (RC17) కోసం పనిచేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత పుష్ప 3 షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. దీనికి బహుశా ఓ రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తానికి పుష్ప 3 షూటింగ్, రిలీజ్ వంటి విషయాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడలేదు. కాగా పుష్ప 3 సినిమా రిలీజ్ అయితే మాత్రం.. పుష్ప 2 రికార్డులను సైతం అవలీలగా దాటేసే అవకాశం ఉందని కొందరు అనుకుంటున్నారు.

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని టూ వీలర్స్: ధర కూడా చాలా తక్కువ..

0

ఇది వరకు మనం రూ.2 లక్షల కంటే తక్కువ ధరలో లభించే బైకుల గురించి తెలుసుకున్నాం. రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉండే కార్లను గురించి కూడా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు తక్కువ ధరలో లభించే.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని టూ వీలర్స్ గురించి తెలుసుకుందాం.

భారతదేశంలో పబ్లిక్ రోడ్డుపై ప్రయాణించాలంటే.. తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి తప్పకుండా కొన్ని అర్హతలు ఉండాలి. ఈ అర్హతల కారణంగా కొంతమంది డ్రైవింగ్ లైసెన్స్ పొందలేరు. అలాంటి వారికి ఇక్కడ చెప్పే ద్విచక్ర వాహనాలు తప్పకుండా సూట్ అవుతాయి.

యులు విన్

ప్రస్తుతం బెంగళూరు వంటి నగరాల్లో ఈ యులు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. రూ.59,999 ధర వద్ద లభించే ఈ స్కూటర్.. యులు యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉండే ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 24.9 కిమీ మాత్రమే. తక్కువ వేగం కారణంగానే దీనిని డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఇది ఓకే ఫుల్ ఛార్జితో 68 కిమీ రేంజ్ అందిస్తుంది. కాబట్టి నగర ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. ఇది రిమూవబుల్ బ్యాటరీ కలిగి ఉండటం చేత ఛార్జింగ్ అయిపోయిన తరువాత మార్చుకోవచ్చు.

జెమోపాయ్ మిసో

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని టూ వీలర్ల జాబితాలో ‘జెమోపాయ్ మిసో’ ఒకటి. భారతదేశానికి ప్రధాన నగరాల్లో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది. దీనిని కంపెనీ అధీకృత డీలర్షిప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.44,000 (ఎక్స్ షోరూం, ఢిల్లీ). గంటకు 25 కిమీ వేగంతో ప్రయాణించే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ ఛార్జితో 60 కిమీ నుంచి 75 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ వేగం కూడా తక్కువ కావడం చేత దీనిని కూడా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు.

జెలియో లిటిల్ గ్రేసీ

రూ.49,500 వద్ద అందుబాటులో ఉండే.. జెలియో ఈ మొబిలిటీ ”లిటిల్ గ్రేసీ” డ్రైవింగ్ లైసెన్స్ అవసరం మరో ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఎందుకుని వేరియంట్ను బట్టి ధర కొంత వ్యత్యాసం ఉంటుంది. దీని టాప్ స్పీడ్ 25 కిమీ/గం. ఒక ఫుల్ ఛార్జితో 70 కిమీ నుంచి 75 కిమీ రేంజ్ అందించే ఈ స్కూటర్ ఏకంగా 150 కేజీల బరువును మోయగలదు. డిజైన్ కొత్తగా ఉంది, ఫీచర్స్ రైడర్లకు అనుకూలంగా ఉన్నాయి.

హీరో ఎడ్డీ

మన జాబితాలో చెప్పుకోదగ్గ మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. హీరో ఎడ్డీ. ఓకే ఫుల్ ఛార్జితో 85 కిమీ రేంజ్ అందించే ఈ స్కూటర్ 30 యాంపియర్ బ్యాటరీ కలిగి.. 25 కిమీ/గం వేగంతో ప్రయాణిస్తుంది. దీని ధర రూ.72,000 (ఎక్స్ షోరూమ్). దీనిని రైడ్ చేయడానికి కూడా ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. సింపుల్ డిజైన్ కలిగిన ఈ బైక్.. అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది.

ఒకినావా ఆర్30 & ఒకినావా లైట్

ఒకేసారి ఛార్జ్ చేస్తే 60 కిమీ దూరం ప్రయాణించే ఒకినావా ఆర్30 కూడా డ్రైవింగ్ అవసరం లేని స్కూటర్లలో ఒకటి. రూ.61,998 (ఎక్స్ షోరూం) ధర వద్ద అందుబాటులో ఉండే ఈ స్కూటర్ 1.25 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ పొందుతుంది. గంటకు 25 కిమీ/గం వరకు వేగవంతం అయ్యే ఈ స్కూటర్.. రోజువారీ ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

ఒకినావా కంపెనీకి చెందిన మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ”లైట్”. దీని ఎక్స్ షోరూం ధర రూ.74,999. ఇందులో 1.25 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక ఛార్జితో 60 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 25 కిమీ/గం. దీని కోసం కూడా ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. డిజైన్, ఫీచర్స్ అద్భుతంగా ఉంటాయి.