Home Blog Page 87

ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్‌పై డైరెక్టర్ హింట్: బాలయ్యతో పోటీ తప్పదా?

0

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్‘ కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పాపులర్ హీరోయిన్స్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో విడుదలైన సినిమా ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. కాబట్టి వీరి కాంబినేషన్‌లో విడుదలకు సిద్దమవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అంతే కాకుండా నటి శ్రీలీల, రాశీఖన్నా ఇద్దరూ ఈ సినిమాలో నటిస్తుండటం మరో ప్లస్ పాయింట్ అయినట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులను చిత్ర బృందం వేగవంతం చేస్తోంది.

పరోక్షంగా డైరెక్టర్ క్లారిటీ..

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా.. 2025 డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ చిత్ర బృందం మాత్రం దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయడమే తన లక్ష్యం అంటూ.. డైరెక్టర్ హరీష్ శంకర్.. ఓ సందర్భంలో పేర్కొన్నారు. అయితే సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలనే విషయాన్ని నిర్మాతలే చూసుకుంటారని అన్నారు. కాగా ఈ సినిమా.. బహుశా డిసెంబర్‌లోనే రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోందని ఆయన పరోక్షంగా హింట్ ఇచ్చేసారు.

హరీష్ శంకర్ మాటలను బట్టి చూస్తుంటే.. డిసెంబర్‌లోనే ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఈ డేట్ మిస్ అయితే రిలీజ్ ఎప్పుడనే దానిపై చిత్ర బృందమే ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా ఈ సినిమా కోసం రూ. 150 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. కలెక్షన్స్ ఎలా ఉంటాయన్నది.. రిలీజ్ తరువాత తెలుస్తుంది.

ఇక పొతే పవన్ కళ్యాణ్ ‘ఓజీ‘ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. అంతే మరికొన్ని రోజుల్లోనే చిత్ర బృందం సినిమాను రిలీజ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఓజీ సినిమా రిలీజ్ కానున్నట్లు వస్తున్న పుకార్ల కారణంగా.. నటసింహం బాలయ్య నటించిన ‘అఖండ 2‘ రిలీజ్ వాయిదా పడింది. మేకర్స్ ఈ సినిమాను డిసెంబర్ నెలలోనే రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్, బాలయ్య మధ్య పోటీ తప్పదా?

ఉస్తాద్ భగత్ సింగ్ డిసెంబర్ నెలలోనే రిలీజ్ అవుతున్నట్లు వస్తున్న పుకార్ల కారణంగా.. బాలకృష్ణ అఖండ 2.. అప్పుడు కూడా వాయిదా పడుతుందా?, అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇదే నిజమయితే బాలయ్య బాబు, కళ్యాణ్ బాబు సినిమాల మధ్య పోటీ తప్పదేమో అనిపిస్తోంది. ఈ రెండు సినిమాలు పోటీపడుతున్న సమయంలో ప్రభాస్ సినిమా ‘రాజాసాబ్’ రిలీజ్ జనవరి 9కి చేరింది. నిజానికి ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉంది. మొత్తం మీద మంచి కలెక్షన్స్ రాబట్టుకోవడానికి.. సినిమాలు పోటీని అంతగా ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

భారత్‌లో ఒకేసారి రెండు కార్లు లాంచ్ చేసిన విన్‌ఫాస్ట్: ధర, బుకింగ్స్ & వివరాలు

0

ఇప్పటికే.. భారతీయ మార్కెట్లో జర్మన్, జపాన్, చైనా బ్రాండ్ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వియాత్నం బ్రాండ్ కార్లు కూడా మార్కెట్లో అడుగుపెట్టేశాయి. వియత్నామీస్ కంపెనీ విన్‌ఫాస్ట్.. ఒకేసారి రెండు ఎలక్ట్రిక్ కార్లను (వీఎఫ్6, వీఎఫ్7) లాంచ్ చేస్తూ, ధరలను ప్రకటించింది. ఈ సరికొత్త కార్ల ధరలు, బుకింగ్స్, డెలివరీ వంటి మరిన్ని వివరాలను ఈ కథనంలో చూసేద్దాం.

విన్‌ఫాస్ట్ వీఎఫ్6 ఎలక్ట్రిక్ కారు

వేరియంట్స్, ధరలు: విన్‌ఫాస్ట్ కంపెనీ తన వీఎఫ్6 కారును మూడు వేరియంట్లలో లాంచ్ చేసింది. అవి ఎర్త్, విండ్, విండ్ ఇన్ఫినిటీ. వీటి ధరలు వరుసగా రూ. 16.49 లక్షలు, రూ. 17.79 లక్షలు, రూ. 18.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). కాగా కంపెనీ ఇప్పటికే ఈ కారు కోసం రూ. 21000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు బహుశా దసరా, దీపావళి సమయంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము.

➤వీఎఫ్6 ఎర్త్: రూ.16.49 లక్షలు
➤వీఎఫ్6 విండ్: రూ. 17.79 లక్షలు
➤విండ్ ఇన్ఫినిటీ: రూ. 18.29 లక్షలు

డిజైన్& ఫీచర్స్: సరికొత్త డిజైన్ కలిగిన ఈ వీఎఫ్6 ఎలక్ట్రిక్ కారు.. ముందు, వెనుక భాగంలో పూర్తి వెడల్పు అంతటా విస్తరించి ఉండే.. ఎల్ఈడీ లైట్స్, డీఆర్ఎల్, బ్రాండ్ లోగో వంటివి కనిపిస్తాయి. వాలుగా ఉండే రూఫ్‌లైన్, 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఇక్కడ గమనించవచ్చు. పరిమాణం పరంగా కూడా ఇది ఉత్తమంగా ఉంటుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ కొత్త వీఎఫ్6 కారు పనోరమిక్ గ్లాస్ రూఫ్, 8వే పవర్ డ్రైవర్ సీటు, క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్స్, 8 స్పీకర్ సౌండ్ సిస్టం, వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటితో పాటు.. ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 ఏడీఏఎస్, ఆటో పార్క్ అసిస్ట్, ఆటోమాటిక్ హెడ్‌లైట్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360 డిగ్రీ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది.

రేంజ్: వీఎఫ్6 ఎలక్ట్రిక్ కారు 59.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఎర్త్ వేరియంట్ 468 కిమీ రేంజ్, విండ్ వేరియంట్ 463 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారు 8.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇవి డీసీ ఫాస్ట్ ఛార్జర్‌లకు మాత్రమే కాకుండా.. 3.3 కేడబ్ల్యు, 7.2 కేడబ్ల్యు ఛార్జర్‌లకు సపోర్ట్ చేస్తుంది.

విన్‌ఫాస్ట్ వీఎఫ్7 ఎలక్ట్రిక్ కారు

వేరియంట్స్, ధరలు: కంపెనీ వీఎఫ్7 కారును ఐదు వేరియంట్లలో లాంచ్ చేసింది. అవి ఎర్త్, విండ్, విండ్ ఇన్ఫినిటీ, స్కై, స్కై ఇన్ఫినిటీ. సంస్థ ఈ కార్ల కోసం కూడా రూ. 21000తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

➤ఎర్త్ ఫ్రంట్ వీల్ డ్రైవ్: రూ. 20.89 లక్షలు
➤విండ్ ఫ్రంట్ వీల్ డ్రైవ్: రూ. 23.49 లక్షలు
➤విండ్ ఇన్ఫినిటీ ఫ్రంట్ వీల్ డ్రైవ్: రూ. 23.99 లక్షలు
➤స్కై ఆల్ వీల్ డ్రైవ్: రూ. 24.99 లక్షలు
➤స్కై ఇన్ఫినిటీ ఆల్ వీల్ డ్రైవ్: రూ. 25.49 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్).

డిజైన్, ఫీచర్స్: కొత్త విన్‌ఫాస్ట్ వీఎఫ్7 ఎలక్ట్రిక్ కారు.. సిగ్నేచర్ ‘వీ పేస్’ ఎల్ఈడీ డీఆర్ఎల్ కలిగి.. దానికి కింది భాగంలో ఎల్ఈడీ హెడ్‌లైట్స్ పొందుతుంది. ఎయిర్ డ్యామ్‌లు బ్రష్డ్ మెటల్ ట్రిమ్స్ కలిగి ఉంటాయి. ఇది ప్రత్యేకమైన ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ పొందటం వల్ల ప్రీమియం రూపాన్ని పొందుతుంది. 19 ఇంచెస్ వీల్స్ కలిగి.. వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ లైట్ పొందుతుంది.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. వీఎఫ్7 కారు 12.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పెద్ద ఫిక్స్‌డ్ గ్లాస్ రూఫ్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు వంటి అధునాతన ఇంటీరియర్ ఫీచర్స్ మాత్రమే కాకుండా.. ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

రేంజ్: ఎంట్రీ లెవల్ మోడల్ 59.6 కిలోవాట్ బ్యాటరీ (431 కిమీ/ఛార్జ్) పొందుతుంది. మిగిలిన అన్ని వేరియంట్స్ ఏసీ, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 70.8 కిలోవాట్ బ్యాటరీ (450 కిమీ/ఛార్జ్) పొందుతాయి. పర్ఫామెన్స్ ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది.

‘బసాల్ట్ ఎక్స్’ లాంచ్ చేసిన సిట్రోయెన్: రూ.11 వేలతో బుకింగ్..

0

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన.. ప్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్, దేశీయ విఫణిలో ‘బసాల్ట్ ఎక్స్‘ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన.. ఈ సరికొత్త వేరియంట్ ధరలు ఎలా ఉన్నాయి?, అప్డేటెడ్ ఫీచర్స్ ఏమిటి?, బుకింగ్స్.. డెలివరీ వంటి వివరాలను ఇక్కడ చూసేద్దాం..

ధర & బుకింగ్స్

సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ ధరలు రూ. 7.95 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. కంపెనీ ఈ కారు కోసం రూ. 11000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా కొంత ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. కాబట్టి ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఆకర్షణీయంగా ఉంటుంది.

డిజైన్ & ఫీచర్స్

బసాల్ట్ ఎక్స్ కారు.. కూపే సిల్హౌట్ పొందుతుంది. ఇది చాలా స్టైలిష్ డిజైన్ పొందుతుంది. టెయిల్‌గేట్‌పై కొత్త ఎక్స్ బ్యాడ్జ్.. గ్రిల్ మీద ఎల్ఈడీ డేటైమ్ స్ట్రిప్స్, డ్యూయెల్ జోన్ 16 ఇంచెస్ అల్లాయ్స్ వంటివన్నీ ఇక్కడ చూడవచ్చు. అయితే కొనుగోలుదారు రూ. 21000 చెల్లించి డ్యూయెల్ టోన్ రూఫ్ ఫినిషింగ్ ఎంచుకోవచ్చు. మొత్తం మీద డిజైన్ చూడచక్కగా ఉంటుంది.

ఇంటీరియర్ డిజైన్ విషయానికి వస్తే.. బసాల్ట్ ఎక్స్ లోపల టాన్ అండ్ బ్లాక్ ఇంటీరియర్ చూడవచ్చు. బ్రాంజ్ కలర్ ట్రిమ్ ఇన్సర్ట్‌లు కూడా ఇక్కడ కనిపిస్తాయి. మరింత ప్రీమియం అనుభూతి కోసం సరికొత్త డాష్‌బోర్డ్ లభిస్తుంది. టాప్ వేరియంట్లలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, కప్‌హోల్డర్‌లతో కూడిన రియర్ ఆర్మ్‌రెస్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటివన్నీ ఉన్నాయి.

ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే.. బసాల్ట్ ఎక్స్ మోడల్ వైర్‌లెస్ ఫోన్ మిర్రరింగ్‌తో కూడిన 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 7 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్, ఆటో డిమ్మింగ్ ఐఆర్‌వీఎమ్, 360 డిగ్రీ కెమెరా (రూ. 25000లు వెచ్చించాలి), రియల్ టైమ్ ప్లైట్ స్టేటస్, ట్రాఫిక్ ఆప్టిమైజేషన్, స్మార్ట్ రిమైండర్‌లు వంటివి కూడా ఉన్నాయి.

అత్యుత్తమ సేఫ్టీ రేటింగ్ కలిగిన బసాల్ట్ ఎక్స్ వేరియంట్.. ఆరు ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, ఐసోఫిక్స్ మౌంట్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైన సేఫ్టీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి భద్రతను కల్పించడంలో ఉపయోగపడుతాయి.

ఇంజిన్ వివరాలు

బసాల్ట్ ఎక్స్ అనేది సిట్రోయెన్ కొత్త వేరియంట్ అయినప్పటికీ.. ఇంజిన్ విషయంలో ఎలాంటి మార్పులు లేదు. కాబట్టి ఇందులోని అదే 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 82 బీహెచ్‌పీ పవర్, 115 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందుతుంది. మరో ఇంజిన్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ విషయానికి వస్తే.. ఇది 110 హార్స్ పవర్, 205 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ పొందుతుంది. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది.

బిగ్‏బాస్ సీజన్ 9.. ఆటలో పోటీపడే కంటెస్టెంట్స్ వీరే?

0

బిగ్‏బాస్ రియాలిటీ షో.. ప్రారంభంలో దీనిని మంచి క్రేజ్ ఉండేది. రాను రాను.. బిగ్‏బాస్ షో అంటే విమర్శించేవాళ్లే ఎక్కువైపోయారు. ఆదరణ కూడా బాగా తగ్గిపోయింది. దీంతో బిగ్‏బాస్ సీజన్ 8 అంతంత మాత్రమే అన్నట్లు సాగింది. ఈసారి మాత్రం (బిగ్‏బాస్ సీజన్ 9) సరికొత్తగా ప్లాన్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ రియాలిటీ షో ప్రారంభమైనప్పటికీ.. అసలైన ఆట మాత్రం అక్టోబర్ 7 నుంచి మొదలవుతుంది. కాగా ఈ సీజన్‌లో బిగ్‏బాస్ హౌస్‌లోకి వెళ్ళేది ఎవరు?, హౌస్‌లో చేసిన మార్పులు ఏమిటి? అనే ఆసక్తికరమైన విషయాలు మీ కోసం..

రెండు హౌస్‌లు

గతంలో బిగ్‏బాస్ సీజన్ 9 షోలో పాల్గొనే కంటెస్టెంట్లను నేరుగా హౌస్‌లోకి పంపించేవారు. కానీ ఈ సార్ మాత్రం అందుకు భిన్నంగా.. కంటెస్టెంట్లకు అగ్ని పరీక్ష అంటూ కొన్ని పోటీలను నిర్వహించారు. ఇందులో గెలిచినవారే బిగ్‏బాస్ హౌస్‌లో అడుగుపెడతారు. ఇంకో విషయం ఏమిటంటే.. ఇంతకు ముందు మాదిరిగా బిగ్‏బాస్ హౌస్ ఒక్కటి కాదు. రెండు హౌస్‌లు ఉంటాయి. ఈ సీజన్‌లో 15 కంటే ఎక్కువమంది కంటెస్టెంట్స్ పాల్గొనే అవకాశం ఉంది. కాగా ఇందులో సగంమంది ఒక హౌస్‌లో ఉంటే.. మరోసగం మంది ఇంకో హౌస్‌లో ఉంటారు. ఎవరు ఏ హౌస్‌లో ఉంటారనేది.. వాళ్ళ ఆట తీరును బట్టి ఉంటుందని సమాచారం.

కేటగిరీలు

బిగ్‏బాస్ రియాలిటీ షోలో పాల్గొనే కంటెస్టెంట్లను నిర్వాహకులు వివిధ కేటగిరీల నుంచి సెలక్ట్ చేసుకుంటారు. ఇందులో సినీ తారలు, సోషల్ మీడియా పర్సన్స్, సీరియల్ యాక్టర్, కామన్ మెన్ కేటగిరి, సింగర్స్, కమెడియన్స్ ఇలా చాలానే కేటగిరీలు ఉన్నాయి. కామన్ మెన్ కేటగిరిలో సెలక్ట్ అవ్వాలంటే చాలా పరీక్షలే నెగ్గాల్సి ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న అగ్ని పరీక్షలో గెలించిన వారిలో ఐదు లేదు ఆరుమందిని హౌస్‌లోకి పంపిస్తారు. కాగా బిగ్‏బాస్ హౌస్‌లో ఎవరు ఉండబోతున్నారు.. పాల్గొనే కంటెస్టెంట్స్ లిస్ట్ బయటకు వచ్చింది.

కంటెస్టెంట్స్ జాబితా

సంజన గల్రానీ: ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో త్రిష చెల్లి
శ్రష్టి వర్మ: కొరియోగ్రాఫర్
ఆశా షైనీ: సీనియర్ హీరోయిన్
ఇమ్మాన్యుయేల్: జబర్దస్త్ కమెడియన్
రమ్య మోక్ష: అలేఖ్య చిట్టి పికెల్స్
హర్షిత్ రెడ్డి: యువ హీరో
సుమన్ శెట్టి: కమెడియన్
తనూజ పుట్టుస్వామి: కన్నడ సీరియల్ నటి
భరణి: సీరియల్ యాక్టర్
నాగ దుర్గ: ఫోక్ డ్యాన్సర్
రాము రాధోడ్: రాను బొంబాయికి రాను సింగర్, డ్యాన్సర్
శ్రీజ, నాగ ప్రకాష్, పవన్ కళ్యాణ్, మాస్క్ మ్యాన్ హరీష్: కామన్ పర్సన్స్ కేటగిరి

ఇప్పటికి బయటపడిన జాబితా ప్రకారం.. పైన పేర్కొన్న కంటెస్టెంట్స్ బిగ్‏బాస్ సీజన్ 9లో పాల్గొంటున్నారు. అయితే ఫైనల్ లిస్ట్ అక్టోబర్ 7న తెలుస్తుంది. పైన చెప్పిన జాబితాకు ఎవరైనా యాడ్ అవుతారా?, జాబితాలో ఉన్నవాళ్లు ఎవరైనా మిస్ అవుతారా అనేది ఆదివారం తెలిసిపోతుంది. ఈ సారి బిగ్‏బాస్ సీజన్.. ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్స్ కంటే కూడా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. ఎలా ఉంటుందనేది.. ఆట మొదలైతేగానీ తెలియదు.

కోరుకున్నవాటిపై కొండంత డిస్కౌంట్స్!.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మెగా ఫెస్టివల్ సేల్

0

వినాయక చవితి ముగిసింది. దసరా (విజయదశమి) వచ్చేస్తోంది. ఆ వెంటనే దీపావళి కూడా రానుంది. ఈ పండుగ సీజన్ సమయంలో.. ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా?, నచ్చినవాటిని కొంత తక్కువ ధరలు ఎప్పుడు కొనేద్దామా అని చాలామంది వేచి చూస్తుంటారు. అలాంటి వారికోసం.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ దిగ్గజాలు శుభవార్త చెప్పాయి.

ఫ్లిప్‌కార్ట్

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అయిన ఫ్లిప్‌కార్ట్.. పండుగ సీజన్ సమయంలో ‘బిగ్ బిలియన్ డేస్ 2025‘ ప్రకటించింది. అయితే కంపెనీ దీనికి సంబంధించిన తేదీలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఫ్లిప్‌కార్ట్ హోమ్‌పేజీలో మాత్రం త్వరలో వస్తుందని కనిపించింది. పండుగ సమయంలో ఎంపిక చేసిన చాలా వస్తువుల మీద కంపెనీ భారీ డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ అందిస్తుంది. చాలామంది ప్రజలు కూడా ఈ ఆఫర్స్ కోసం ప్రతి ఏటా వేచి చూడటం ఆనవాయితీగా వస్తోంది.

అమెజాన్

ఈ కామర్స్ దిగ్గజాల్లో ఒకటైన అమెజాన్ కూడా.. ఫ్లిప్‌కార్ట్ మాదిరిగానే ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025‘ పేరుతో డిస్కౌంట్స్ అందించడానికి సిద్ధమైంది. ఇది కూడా తేదీలను అధికారికంగా వెల్లడించలేదు. ఆఫర్స్ ప్రకటించడానికి 24 గంటల ముందు ప్రైమ్ సభ్యులకు యాక్సెస్ లభిస్తుంది. వీరు సాధారణ కస్టమర్ల కంటే ముందుగానే.. షాపింగ్ చేసుకోవచ్చు. ఈ అవకాశం ఫ్లిప్‌కార్ట్ కూడా అందిస్తుంది.

వీటిపై భారీ తగ్గింపులు

ఈ కామర్స్ కంపెనీలు ఫెస్టివల్ సేల్ సమయంలో అందించే ఆఫర్స్ ద్వారా.. ఎలక్ట్రానిక్స్.. ముక్యంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి వాటిమీద గొప్ప ప్రయోజనాలను పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్25, గూగుల్ పిక్సెల్ 10, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 వంటివాటితో పాటు.. ఐఫోన్ 16 ధరలు కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ ఏడాది అతిపెద్ద షాపింగ్ ఈవెంట్ రానుంది. అద్భుతమైన ఆఫర్స్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు మిస్ చేసుకోకండి.. ఉత్సాహంతో మీ షాపింగ్ అనుభూతిని పెంచుకోండి అని ఫ్లిప్‌కార్ట్ తన అధికారిక వెబ్‌సైట్ పేజీలో వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తుంటే.. సంస్థ మంచి ఆఫర్స్ అందించనున్నట్లు చెప్పకనే చెబుతోందని అర్థమవుతోంది.

ఇదే వరుసలో అమెజాన్ కూడా చేరింది. ఈ సంవత్సరం కస్టమర్లు.. తమకు నచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహోపరణాల మీద గొప్ప డీల్స్ పొందవచ్చు. వేగవంతమైన డెలివరీలను పొందటమే కాకుండా.. విలువ ఆధారిత చెల్లింపులు కూడా చేసుకోవచ్చు అని ఒక బ్లాగ్ కంపెనీ పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది.

ఈ కామర్స్ కంపెనీల సీజనల్ జాబ్స్

పండుగ సమయంలో.. తమ కస్టమర్లకు చేరువలో ఉండటానికి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ రెండూ కూడా లక్షలాది సీజన్ ఉద్యోగుల కోసం మెగా నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. నగరాల్లో వేగవంతమైన డెలివరీలు చేయడానికి ఈ రెండు కంపెనీలు ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమయ్యాయి. దీపావళి తరువాత కూడా సంక్రాంతి వస్తోంది. ఆ సమయంలో కూడా ఉద్యోగుల అవసరం ఉంటుంది. కాబట్టి జాబ్ కోసం ఎదురు చూస్తున్నవారికి ఇదో మంచి సదావకాశం. ఇది కొన్ని రోజులు తాత్కాలిక ఉద్యోగాన్ని అందిస్తుంది.

24 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు: గరుడ సేవ ఎప్పుడంటే?

0

భూలోకవైకుంఠం.. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన ప్రదేశం తిరుమల. వెంకటేశ్వర స్వామికి ప్రతి ఏటా రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే.. టీటీడీ యాజమాన్యం సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఈ ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి?, అందరూ ఎంతగానో ఎదురుచూసే గరుడ సేవ ఎప్పుడు అని వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం.

సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీనివాసుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభమై.. అక్టోబర్ 02 వరకు జరుగుతాయి. 23వ తేదీ అంకురార్పణతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు.. చక్ర స్నానంతో ముగుస్తాయి. అంతే కంటే ముందు 16వ తేదీ ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల సమయంలో.. ఉత్సవ మూర్తుల ఊరేగింపు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు.. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల మధ్య జరుగుతాయి. అంటే రోజుకు రెండు వాహనాల మీద ఆ పరమ పురుషుడు ఊరేగింపుగా దర్శమిస్తాడన్నమాట.

వాహన సేవల తేదీలు

➤2025 సెప్టెంబర్ 24: సాయంత్రం 5:43 గంటల నుంచి 6:15 వరకు ధ్వజారోహణం, రాత్రి 9:00 గంటలకు పెద్ద శేష వాహనంపై ఊరేగింపు.
➤2025 సెప్టెంబర్ 25: ఉదయం 8:00 గంటలకు చిన్న శేష వాహనంపై ఊరేగింపు.. రాత్రి 7:00 గంటలకు హంస వాహనం.
➤2025 సెప్టెంబర్ 26: ఉదయం 8:00 గంటలకు సింహ వాహనసేవ, రాత్రి 7:00 గంటలకు ముత్యపు పందిరిపై ఊరేగింపు.
➤2025 సెప్టెంబర్ 27: ఉదయం 8:00 గంటలకు కల్పవృక్ష వాహనం, రాత్రి 7:00 గంటలకు సర్వ భూపాల వాహనంపై ఊరేగింపు.
➤2025 సెప్టెంబర్ 28: ఉదయం 8:00 గంటలకు మోహినీ అవతారం.. సాయంత్రం 6:30 గంటల నుంచి గరుడ సేవ.
➤2025 సెప్టెంబర్ 29: ఉదయం 8:00 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4:00 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7:00 గంటలకు గజవాహనంపై ఊరేగింపు.
➤2025 సెప్టెంబర్ 30: ఉదయం 8:00 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7:00 గంటలకు చంద్రప్రభ వాహనంపై ఊరేగింపు.
➤2025 అక్టోబర్ 1: ఉదయం 7:00 గంటలకు రథోత్సవం, రాత్రి 7:00 గంటలకు అశ్వ వాహనంపై ఊరేగింపు.
➤2025 అక్టోబర్ 2: ఉదయం 6:00 గంటల నుంచి 9:00 గంటల వరకు చక్ర స్నానం, రాత్రి 8:30 గంటల నుంచి 10:00 గంటల వరకు ధ్వజారోహణం.

బ్రేక్ దర్శనాలు

శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాల వేళ.. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు విచ్చేస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకుని టీటీడీ యాజమాన్యం బ్రహ్మోత్సవాల సమయంలో.. బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. అయితే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే ఈ బ్రేక్ దర్శన సౌకర్యం లభిస్తుంది. మిగిలిన వారికి బ్రేక్ దర్శనాలు ఉండవు. భక్తులు ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి.

తిరుమలలో పటిష్టమైన భద్రత కోసం.. విజిలెన్స్ అధికారులు, పోలీసుల సంఖ్యను పెంచారు. అంతే కాకుండా కొండపై పార్కింగ్ వంటి వాటికోసం కూడా సంబంధిత యాజమాన్యం ఏర్పాట్లను చేసింది. ట్రాఫిక్ సమస్య రాకుండా చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించి టీటీడీ బోర్డు ప్రణాళికలను కూడా సిద్ధం చేసింది.

వాహనాలకు అనుమతి ఇలా..

బ్రహ్మోత్సవాల సమయంలో కొండపై భక్తుల రద్దీ అధికం అవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. సెప్టెంబర్ 27వ తేదీ రాత్రి 9:00 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 6:00 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు. ఈ విషయాన్ని భక్తులు తప్పకుండా గమనించాలి. శ్రీవారి భక్తులు కొండపై ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా.. మాడవీధుల్లో క్యూలైన్స్, అన్న ప్రసాదాల పంపిణీ అన్నీ కూడా సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.

హ్యుందాయ్ క్రెటా కింగ్ ఎడిషన్స్ వచ్చేశాయ్: ధరలు ఎలా ఉన్నాయంటే?

0

భారతదేశంలో స్పెషల్ ఎడిషన్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ కంపెనీ క్రెటా కింగ్ మరియు క్రెటా కింగ్ లిమిటెడ్ ఎడిషన్ పేరుతో రెండు కార్లను లాంచ్ చేసింది. క్రెటా కారు ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కొత్త కార్లను కంపెనీ లాంచ్ చేసింది.

ధరలు ఇలా

కొత్త హ్యుందాయ్ క్రెటా కింగ్ ఎడిషన్ ధరలు రూ. 17.89 లక్షల నుంచి రూ. 19.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). కింగ్ లిమిటెడ్ ఎడిషన్ ధర రూ. 19.64 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

క్రెటా కింగ్ ఎడిషన్

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త హ్యుందాయ్ క్రెటా కింగ్ ఎడిషన్ 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, పవర్ డ్రైవర్ సీటు కోసం మెమరీ ఫంక్షన్, ఫ్రంట్ ప్యాసింజర్ సీటు కోసం 8వే పవర్డ్ అడ్జస్ట్‌మెంట్, డ్యూయెల్ జోన్ ఏసీ, స్లయిడింగ్ ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్, కింగ్ ఎంబ్లెమ్ వంటివి పొందుతుంది. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ కారు 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది.

హ్యుందాయ్ క్రెటా కింగ్ కారు నైట్ ఎడిషన్ ట్రీట్‌మెంట్‌ను పొందుతుంది. కాబట్టి ఇది బ్లాక్ అవుట్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్ వంటివి కలిగి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది పెట్రోల్ సీవీటీ, డీజిల్ ఆటోమాటిక్ అనే పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ పొందుతుంది.

క్రెటా కింగ్ లిమిటెడ్ ఎడిషన్

హ్యుందాయ్ క్రెటా కింగ్ లిమిటెడ్ ఎడిషన్.. అనేది కూడా స్పెషన్ ట్రిమ్ వేరియంట్. ఇది సీట్‌బెల్ట్ కవర్, హెడ్‌రెస్ట్ కుషన్స్, కొత్త కార్పెట్ మ్యాప్స్, కీ కవర్ వంటి వాటితో పాటు అడిషినల్ డోర్ క్లాడింగ్ వంటివి పొందుతుంది. ఈ స్పెషల్ ఎడిషన్ 1.5 లీటర్ పెట్రోల్ సీవీటీ, 1.5 లీటర్ డీజిల్ ఆటోమాటిక్ అనే ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, బ్లాక్ మ్యాట్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

భారతదేశంలో ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేస్తున్న కార్ల జాబితాలో.. హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా ఒకటి. దీనిని ఇప్పటి వరకు 12 లక్షల మంది కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఇది స్పెషన్ ఎడిషన్స్ రూపంలో లాంచ్ కావదంతో మరింత మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. అయితే ఇది ఎలాంటి అమ్మకాలు పొందుతుందనే విషయం తెలుసుకోవడానికి ఇంకొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది.

ఇండియన్ మార్కెట్లోని స్పెషల్ ఎడిషన్స్

నిజానికి భారతదేశంలో స్పెషల్ ఎడిషన్స్.. లెక్కకు మించి ఉన్నాయి. ఇందులో హ్యుందాయ్ కంపెనీ కూడా ఒకటి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా, రెనాల్ట్, టయోటా కంపెనీలు కూడా దేశీయ విఫణిలో స్పెషల్ ఎడిషన్ కార్లను లాంచ్ చేశాయి. లగ్జరీ విభాగంలో కూడా స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ అయ్యాయి. కొత్తదనం కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకుని.. వాహన తయారీ సంస్థలు ఈ స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ చేస్తున్నాయన్నమాట.

త‌ల్లి సినిమా రీమేక్ చేస్తున్న జాన్వీ క‌పూర్: ఆశలన్నీ దానిపైనే..

0

అతిలోక సుందరి శ్రీదేవి గురించి సినీ ప్రపంచానికి పరిచయమే అవసరం లేదు. నాలుగేళ్ల వయసులోనే.. సినిమాలోకి అడుగుపెట్టిన ఈమె.. 13ఏళ్ల నాటికే హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. సుమారు 300 సినిమాలలో నటించిన శ్రీదేవి.. ఎంతమంది అభిమానుల మనసు దోచుకుందో.. ఎన్ని అవార్డులను సొంతం చేసుకుందో చెప్పడం కొంత అసాధ్యమే. అయితే తల్లికి వచ్చిన ఫేమ్.. తనయ (కుమార్తె) ‘జాన్వీ కపూర్‘ కు రావడం లేదు.

జాన్వీ కపూర్ 21 సంవత్సరాలకు హీరోయిన్‌గా సినిమాల్లో కనిపించిది. అప్పటి నుంచి పెద్ద బ్లాక్ బస్టర్స్ అందుకోలేదు. తెలుగు జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన దేవర కూడా అంతంత మాత్రమే అనిపించింది. అయితే ఇటీవల పరమ సుందరి సినిమాలో.. సుందరి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు తన తల్లి నటించిన సినిమానే రీమేక్ చేయనున్నట్లు.. అందులో జాన్వీ కపూర్ కనిపించనున్నట్లు సమాచారం.

చాల్‌బాజ్ సినిమా రీమేక్

నటి శ్రీదేవి నటించిన ‘చాల్‌బాజ్‘ సినిమా గొప్ప హిట్ అందుకుంది. ఆ సినిమానే ఓ ప్రముఖ నిర్మాత రీమేక్ చేయడానికి సిద్ధమైనట్టు సమాచారం. జాన్వీకి చాల్‌బాజ్ కేవలం సినిమా మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ. తన తల్లి నటించిన సినిమాలో జాన్వీ నటించే అవకాశం రావడం గొప్ప విషయం అని కొందరు చెబుతున్నారు. ఈ సినిమాను జాగ్రత్తగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా కొన్ని చర్చలు జరుగుతున్నప్పటికీ.. సెప్టెంబర్ చివరి నాటికి ఓ నిర్ణయం ఫైనల్ అవుతుంది.

ప్రస్తుతం జాన్వీ కపూర్.. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలో కనిపించనుంది. ఇప్పటి వరకు పెద్ద సక్సెస్ చూడని జాన్వికి ఈ సినిమా అయినా హిట్ ఇస్తుందా?, లేదా అనేది.. సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. పెద్ది సినిమా 2026 మార్చి 27న రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. రిలీజ్ తేదీలో ఏదైనా మార్పులు ఉన్నాయా?, లేదా.. అనేది కూడా రానున్న రోజుల్లో తెలుస్తుంది.

జాన్వీ కపూర్ గురించి

శ్రీదేవి.. బోనీ కపూర్ ముద్దుల కూతురు జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న జన్మించారు. ఈమె ముంబైలోని ఏకోల్ మోండియేల్ వరల్డ్ స్కూల్‌లో చదువుకుంది. జాన్వీ సినిమాల్లోకి అడుగుపెట్టడానికి ముందు.. కాలిఫోర్నియాలోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి యాక్టింగ్ కోర్సు నేర్చుకుంది. ఈ కోర్సు పూర్తయిన తరువాత 2018లో శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం ‘ధడక్‘లో మొదటిసారి కనిపించింది. ఆ తరువాత అనేక చిత్రాల్లో నటించిన ఈమె.. మొదటిసారి దేవర చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కనిపించింది. ఇప్పుడు పెద్ది సినిమాలో నటిస్తోంది.

జాన్వీ కపూర్ పొందిన అవార్డులు

సినిమాల్లో తల్లి మాదిరిగానే ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న జాన్వీ కపూర్.. అనేక అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఇందులో.. లోక్‌మత్ స్టైలిష్ అవార్డు, జీ సినీ అవార్డు, పింక్‌విల్లా స్టైల్ ఐకాన్స్ అవార్డు, పింక్‌విల్లా స్క్రీన్ అండ్ స్టైల్ ఐకాన్స్ అవార్డు మొదలైనవి ఉన్నాయి. ఇవి కాకుండా.. ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డు, బాలీవుడ్ హంగామా స్టైల్ అవార్డు మొదలైనవికి నామినేట్ అయింది.

నారా లోకేష్‌కు అరుదైన గౌరవం: నరేంద్ర మోదీ తరువాత..

0

ఆంధ్రప్రదేశ్.. కూటమి సర్కార్ సారథ్యంలో అభివృద్ధి మార్గం వైపు నడుస్తోంది. ఒకవైపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమదైన రీతిలో పరిపాలన చేస్తుంటే.. ఐటీ మినిస్టర్ ‘నారా లోకేష్’ కూడా కేంద్రమంత్రులను కలుసుకోవడం.. ప్రజల క్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కావాల్సిన ఏర్పాట్లు చేయాలనీ, కావలసిన నిధులను విడుదల చేసి.. రాష్ట్రాభివృద్ధిలో మాకు తోడుగా ఉండాలని చెబుతున్నారు. ప్రజాపాలనలో పాలు పంచుకుంటున్న నారా లోకేష్‌ను తాజాగా ఓ అరుదైన గౌరవం దక్కింది.

ఆస్ట్రేలియా నుంచి ఆహ్వానం

విద్యారంగంలో కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టి.. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ ప్రారంభించిన హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ (హెచ్ఆర్డీ) అండ్ ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) మంత్రి నారా లోకేష్.. ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ‘స్పెషల్ విజిట్ ప్రోగ్రామ్’ (SVP)లో పాల్గొనడానికి ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని ఆస్ట్రేలియన్ హైకమీషన్ ఫిలిప్ గ్రీన్.. మంత్రికి ఆహ్వాన లేఖను అధికారికంగా పంపించారు.

ఆంధ్రప్రదేశ్.. మానవ వనరులు, టెక్నాలజీ & ఆర్థిక రంగాలలో అభివృద్ధి సాధిస్తోందని.. దీనిని ఆస్ట్రేలియా ప్రభుత్వం అభినందిస్తూ.. అక్కడి జరగబోయే ఓ కార్యక్రమానికి లోకేష్ హాజరు కావాలని కోరింది. ఆస్ట్రేలియాలో జరిగే ఈ కార్యక్రమానికి గత 20 సంవత్సరాలుగా.. అనేకమంది భారతదేశంలోని రాజకీయ నాయకులు హాజరయ్యారు. 2001లో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఆస్ట్రేలియాలో జరగనున్న ఈ కార్యక్రమానికి.. ప్రపంచంలోని చాలామంది రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలు, విద్యా నిపుణులు హాజరవుతారు. కాబట్టి నారా లోకేష్ వీరందరిని కలుసుకోవడానికి సాధ్యమవుతుంది. ఈ పర్యటన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు.. ఇతర మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన చర్చలు కూడా సులభతరం అవుతాయని తెలుస్తోంది.

ఇప్పటికే లోకేష్ పాల్గొన్న విదేశీ కార్యక్రమాలు

నిజానికి నారా లోకేష్ ఇప్పటికే చాలా విదేశీ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. 2018లో చైనాలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోని ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ కార్యక్రమంలో భారత ప్రతినిధిగా ఆహ్వానం పొందారు. 2024 అక్టోబర్ 25 నుంచి.. సుమారు ఒక వారం రోజులు అమెరికాలో పర్యటించి.. మైక్రోసాఫ్ట్, టెస్లా, అమెజాన్, యాపిల్, గూగుల్ మొదలైన కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. 2025 జనవరిలో డావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సంస్థల సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియాలో జరగబోయే కార్యక్రమానికి హాజరవుతారు.

నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం ఇలా..

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ (ఎంబీఏ) పూర్తి చేసిన నారా లోకేష్.. 2009 తరువాత తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నారు. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వ్యూహాలను రూపొందించి.. యువతను ఆకట్టుకున్న ఈయన 2013లో పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయ కర్తగా బాధ్యతలు స్వీకరించారు. 2017లో ఎంఎల్సీగా నియమితులయ్యారు. అదే ఏడాదిలో ఏపీ ఐటీ మంత్రిగా కేకల బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో ఓటమిపాలైనప్పటికీ.. 2024 ఎన్నికల్లో అదే నియోజకవర్గంలో గెలుపొందారు. ప్రస్తుతం మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించి.. రాష్ట్రాభివృద్ధికి తనదైన రీతిలో కృషి చేస్తూనే ముందుకు సాగుతున్నారు.

2025లో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్ – ఇదిగో జాబితా..

0

సౌత్ ఇండియా సినీ పరిశ్రమ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఏడాదికి వందలాది సినిమాలను రిలీజ్ చేస్తూ.. కొత్త హీరోలను, హీరోయిన్లను పరిచయం చేస్తోంది. అయితే చాలామంది మదిలో మెదిలే ఓ ప్రశ్న.. 2025లో దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎక్కువ పారితోషికం తీసుకున్న నటి ఎవరు?, తరువాత జాబితాలో ఎవరున్నారు అనే. ఆ ప్రశ్నకు సమాధానమే ఈ కథనం..

మొదటి స్థానంలో..

సౌత్ ఇండియా సినిమా ప్రపంచంలో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్స్ జాబితాలో ‘సాయి పల్లవి‘ అగ్రస్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది. నాగ చైతన్యతో నటించిన తండేల్ సినిమాకు ఈమె రూ. 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. నిజానికి సాయి పల్లవి ఒక్కో సినిమాకు రూ. 3కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు చెబుతారు. అయితే ఇది ఎంతవరకు నిజమనేది ఖచ్చితంగా చెప్పలేము. కాగా రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న.. నితేశ్ కుమార్ రామాయణ త్రయం (మూడు సినిమాలు) కోసం ఒక్కో సినిమాకు రూ. 6 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

రెండో స్థానంలో..

ఇక రెండో స్థానంలో నేషనల్ క్రష్, పుష్ప నటి రష్మిక మందన్న ఉన్నారు. ఈమె పుష్ప 2 సినిమాకు పారితోషికంగా రూ. 10 కోట్లు తీసుకున్నట్లు టాక్. చావా సినిమాకు రూ. 4కోట్లు, సల్మాన్ ఖాన్ సికిందర్ సినిమాకు రూ. 12 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈమె ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్లు చెబుతారు.

మూడో స్థానంలో..

మన జాబితాలో మూడో స్థానంలో.. నయనతార ఉన్నట్లు సమాచారం. భారతదేశంలో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్లలో.. నయనతార కూడా ఉన్నారు. 2018లో ఫోర్బ్స్ ఇండియా ‘సెలబ్రిటీ 100’ జాబితాలో ఈమె కూడా చోటు దక్కించుకుంది. నయనతార ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల నుంచి రూ. 12 కోట్లు పారితోషికంగా తీసుకుంటుందని సమాచారం.

నాలుగో స్థానంలో..

దక్షిణాది హీరోయిన్లలో చెప్పుకోదగ్గ వ్యక్తి త్రిష. తరగని అందంతో.. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ అమ్మడు తెలుగు, తమిళం సినిమాల్లో నటిస్తుంది. ఈమె కూడా ఎక్కువ పారితోషికం తీసుకునే కథానాయకిల జాబితాలో ఒకరుగా ఉన్నారు. త్రిష ఒక్కో సినిమాకు.. రూ. 10 కోట్ల నుంచి రూ. 12 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా విశ్వంభర సినిమా కోసం ఈమె రూ. 12 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్.

ఐదో స్థానంలో..

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ పేరును సొంతం చేసుకున్న స్వీటీ (అనుష్క శెట్టి).. కూడా ఎక్కువ పారితోషికం తీసుకునే వారిలో ఐదో స్థానంలో ఉంది. అనుష్క శెట్టి ఒక్కో సినిమాకు.. రూ. 5 కోట్ల నుంచి రూ. 7 కోట్లు పారితోషికం తీసుకుంటుందని చెబుతారు.

ఆరో స్థానంలో..

ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ల జాబితాలో మిల్కి బ్యూటీ తమన్నా కూడా ఉన్నారు. కేవలం సినిమాల్లో నటించడమే కాకుండా.. స్పెషల్ సాంగ్‌లలో కూడా కనిపించే ఈమె ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్లు పారితోషికంగా తీసుకుంటుంది. ఈమె సంతోషం ఫిల్మ్ అవార్డులు, రెండు సైమా అవార్డులు, కలైమామణి అవార్డు వంటి అనేక అవార్డులను సొంతం చేసుకుంది.