ప్రభాస్‌తో సినిమా?: రష్మిక మందన్న ఏమందంటే..

గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో రష్మిక మందన్న పేరు గట్టిగా వినిపిస్తోంది. విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం!, థామా రిలీజ్ అండ్ సక్సెస్.. ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా ప్రమోషన్స్.. మరోవైపు మైసా సినిమా షూటింగ్ ఇలా వరుసగా నేషనల్ క్రష్ పేరు ఏదోలా వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా ప్రభాస్ సినిమాల్లో నటించడానికి తాను సిద్ధమంటూ పేర్కొంది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూసే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ప్రభాస్‌తో సినిమా..

రష్మిక మందన్న.. తన ఎక్స్ ఖాతా ద్వారా మీరు ప్రశ్నలు అడగండి, నేను సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అంటూ ట్వీట్ చేసింది. దీనిపై స్పందిస్తూ.. భారతదేశంలోని పెద్ద నటులలో ఒకరైన ప్రభాస్తో కలిసి పనిచేస్తారా? అనే ప్రశ్న అడిగారు. దీనికి రష్మిక రిప్లై ఇస్తూ.. అది నాకు కూడా ఇష్టమే (ప్రభాస్‌తో కలిసి పనిచేయడం నాకు కూడా ఇష్టమే).. ప్రభాస్ ఈ చూస్తారని ఆశిస్తున్నాను. త్వరలోనే మనం దీనిపై కలిసి పనిచేస్తామని కూడా భావిస్తున్నా అంటూ పేర్కొంది.

సంతోషంలో అభిమానులు

నటి రష్మిక మందన్న చేసిన ట్వీట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటు రష్మిక అభిమానులు, ఇటు ప్రభాస్ అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు. అయితే రష్మిక ప్రభాస్‌తో కలిసి పనిచేస్తుందా? లేదా అనేది?, కేవలం ఒక ప్రశ్న మాత్రమే. ఇప్పటి వరకు దాదాపు చాలామంది హీరోలతో పనిచేసిన రష్మిక.. ప్రభాస్‌తో కలిసి నటించలేదు. బహుశా రాబోయే రోజుల్లో ఇది జరిగే అవకాశం కూడా ఉంది.

స్పిరిట్ సినిమాలో..

నిజానికి.. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాలో, ప్రభాస్ సరసన నటించడానికి చర్చలు జరిపినట్లు సమాచారం. ఆ తరువాత ఆ సినిమాలో దీపికా పదుకొనేను ఎంచుకున్నారు. అయితే అనుకోని కొన్ని పరిణామాల కారణంగా.. దీపికా స్థానంలో త్రిప్తి డిమ్రీని ఎంపిక చేసుకున్నారు. కాగా రష్మిక మందన్న.. సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాలో.. రణబీర్ సరసన నటించిన విషయం తెలిసిందే. కాబట్టి.. స్పిరిట్ సినిమాలో కూడా ఈమెకు అవకాశం లభిస్తుందేమో అని ఊహించారు. కానీ అలా జరలేదు.

త్వరలో మైసా..

నటి రష్మిక మందన్న.. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ సినిమాల్లో నటిస్తూ.. తనదైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రారంభంలో లవ్, రొమాంటిక్ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు హారర్ సినిమా (థామా)లో కూడా కనిపించింది. ఇప్పుడు యాక్షన్ సినిమా మైసాలో కనిపించనుంది. ఈ సినిమా (మైసా) షూటింగ్ ఇప్పటికే కేరళ అడవుల్లో ప్రారంభమైనట్లు.. ఆ చిత్ర దర్శకుడు అధికారికంగా పేర్కొన్నాడు.

విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం!

ఇకపోతే.. రష్మిక మందన్న & విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం జరిగిందని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి. కానీ దీనిపై అటు విజయ్.. ఇటు రష్మిక క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ కొన్ని సమావేశాల్లో బహుశా ఇది నిజమే అయి ఉండొచ్చని వారి ప్రవర్తనే చెబుతుంది. ఇదే నిజమైతే.. విజయ్ & రష్మికల పెళ్లి 2026లో జరిగే అవకాశం ఉందని సమాచారం.