spot_img
Monday, February 9, 2026
HomeOff Beatరూ.53 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్: ధరలు పెరిగేవి.. తగ్గేవి ఫుల్ లిస్ట్

రూ.53 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్: ధరలు పెరిగేవి.. తగ్గేవి ఫుల్ లిస్ట్

-

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యూనియన్ బడ్జెట్ 2026ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. ఈ రోజు (ఫిబ్రవరి 1) ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సుమారు 1 గంట 30 నిమిషాలు జరిగిన బడ్జెట్ ప్రసంగంలో వికసిత్ భారత్ లక్ష్యంగా అనేక విషయాలను వెల్లడించారు. అయితే బడ్జెట్ అనగానే.. చాలామంది వేటి ధరలు తగ్గాయి?, వీటి ధరలు పెరిగాయనే? చూస్తారు. కాబట్టి ఈ కథనంలో ఆ విషయాలను వివరంగా తెలుసుకుందాం.

వీటి ధరలు తగ్గుతాయి

➤విదేశీ పర్యాటక ప్యాకేజీలు
➤విదేశీ విద్య
➤క్యాన్సర్ మందులు
➤ఆల్కహాలిక్ లిక్కర్ స్క్రాప్ & కొన్ని ఖనిజాలు
➤పాదరక్షలు
➤ఎనర్జీ ట్రాన్సిషన్ పరికరాలు
➤తోలు వస్తువులు
➤మైక్రోవేవ్ ఓవెన్లు
➤టీవీ పరికరాలు
➤కెమెరాలు
➤వీడియో గేమ్‌ల తయారీ భాగాలు
➤అణు విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన వస్తువుల దిగుమతులు

ఏది ఖరీదైనది అవుతుంది?

➤లగ్జరీ వాచీలు
➤విదేశీ మద్యం
➤బీడీలు
➤గుట్కా
➤పాన్ మసాలా
➤సిగరెట్లు
➤కొన్ని ఎరువులు
➤స్టాక్ ఆప్షన్స్ & ఫ్యూచర్స్ ట్రేడింగ్
➤బొగ్గు
➤కాఫీ & వెండింగ్ మెషీన్లు

రూ. 53 కోట్ల బడ్జెట్

మొత్తం రూ. 53,47,315 కోట్ల బడ్జెట్ 2026ను నిర్మలా సీతారామన్ వివిధ రంగాలకు కేటాయించారు. ఇందులో వ్యవసాయ, ఆరోగ్య, రక్షణ, విద్య, వైద్యం మొదలైన రంగాలు ఉన్నాయి. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ), రైల్ కారిడార్ వంటి వాటికోసం ఎక్కువ నిధులను కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.

బడ్జెట్ ఎఫెక్ట్ కుప్పకూలిన స్టాక్ మార్కెట్స్

సాధారంగా ఎప్పుడూ స్టాక్ మార్కెట్లకు ఆదివారం సెలవు. కానీ ఈ రోజు సెలవైనా ఆదివారం కేంద్ర బడ్జెట్ కారణంగా మార్కెట్లు యదావిధిగా నడిచాయి. ఉదయం మార్కెట్ ప్రారంభమయ్యే సమయానికి స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 11 గంటల సమయంలో లాభాల్లో నడిచాయి. బడ్జెట్ ప్రసంగం ముగిసే సమయానికి మార్కెట్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి కూడా మార్కెట్స్ కుప్పకూలాయి.

కుప్పకూలిన బంగారం వెండి ధరలు

బడ్జెట్ ముందు రోజే భారీగా తగ్గిన గోల్డ్, సిల్వర్ ధరలు.. యూనియన్ బడ్జెట్ రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. దీంతో తులం ధరల రేటు చాలా వరకు తగ్గాయి. ఇది పసిడి ప్రియులకు ఒక మంచి శుభవార్త అనే చెప్పాలి. కాగా.. రాబోయే రోజుల్లో గోల్డ్ రేటు మరింత తగ్గుతుందని కొంతమంది ఆర్ధిక వేత్తలు, మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు కూడా బంగారం, వెండి తగ్గే అవకాశం ఉందని చెబుతున్నాయి.

బడ్జెట్ 2026పై రాజకీయ ప్రముఖుల అభిప్రాయం

నిర్మలా సీతారామన్ వరుసగా ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026పై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందిస్తూ.. దేశం నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోంది. అయినప్పటికీ బడ్జెట్ 2026లో ఉద్యోగాల కల్పనకు సంబంధించిన విషయాలను లేదా అవకాశాలకు సంబంధించిన విషయాలను ప్రస్తావించకపోవడం ఏ మాత్రం భావ్యం కాదని అన్నారు.

2026 బడ్జెట్ వాస్తవాలకు చాలా దూరంగా ఉందని, దీనివల్ల పేదప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని అఖిలేష్ యాదవ్ అన్నారు. ఈ బడ్జెట్ టైమ్ వెస్ట్ తప్పా.. ఉపయోగం లేదని ప్రముఖ వ్యాపారవేత్త అష్నీర్ గ్రోవర్ అన్నారు.

Uma Siri
Uma Sirihttps://marthatelugu.com/
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Latest posts