spot_img
Monday, February 9, 2026
HomeAutomobile12 నెలల్లో.. 2 లక్షల మంది కొన్న టాటా కారు!

12 నెలల్లో.. 2 లక్షల మంది కొన్న టాటా కారు!

-

టాటా మోటార్ కంపెనీ.. భారతదేశంలో లాంచ్ చేసిన పంచ్ కారు గొప్ప అమ్మకాలను నమోదు చేసింది. ఇది మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి 7 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. కాగా గడిచిన 12 నెలలు (ఒక సంవత్సరం) కాలంలో 2 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకుంది.

4 సంవత్సరాలు.. 7 లక్షల సేల్స్!

పంచ్ ఎస్‌యూవీ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి.. అంటే 4 సంవత్సరాల, 3 నెలల కాలంలో మొత్తం 7 లక్షల యూనిట్ల సేల్స్ సాధించింది. దీన్ని బట్టి చూస్తే.. విఫణిలో ఈ కారుకు ఎంత డిమాండ్ ఉందో తెలిసిపోతోంది. 2026 జనవరి నెలలో కూడా కంపెనీ 19,000 టాటా పంచ్ కార్లను విక్రయించింది.

నెక్సాన్ కారును వెనక్కు నెట్టి..

టాటా పంచ్ అమ్మకాలు.. ఇప్పటికే మంచి అమ్మకాలతో ఎప్పుడూ ముందు వరుసలో ఉండే నెక్సాన్ కూడా వెనుకపడింది. ఇది మంచి అమ్మకాలు పొందటానికి ప్రధాన కారణం.. ఆకట్టుకునే డిజైన్, అవసరమైన ఫీచర్స్ & అత్యుత్తమ సేఫ్టీ అని తెలుస్తోంది. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన ఈ కారు.. అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో కూడా ఒకటిగా ఉంది.

పంచ్ ఫేస్‌లిఫ్ట్..

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో.. టాటా పంచ్ పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్‌జీ మోడల్స్ అమ్మకానికి ఉన్నాయి. కాగా ఈ మధ్య కాలంలోనే.. అప్డేటెడ్ ఫేస్‌లిఫ్టెడ్ రూపంలో మార్కెట్లో అడుగుపెట్టి టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలో అందుబాటులోకి వచ్చింది. దీనికోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం కూడా మొదలుపెట్టింది.

నెలకు 20వేల సేల్స్?

2026 జనవరి 13న దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ధరలు రూ. 5.59 లక్షల నుంచి రూ. 10.54 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. బుకింగ్స్ అయితే ప్రారంభమయ్యాయి. కానీ డెలివరీకి సంబంధించిన విషయాన్ని మాత్రం సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. నెలకు 20వేల యూనిట్ల మార్క్ దాటే అవకాశం ఉందని సమాచారం. మొత్తం మీద ఇది కూడా బెస్ట్ అమ్మకాలను పొందే అవకాశం ఉంటుంది.

టాటా పంచ్ ఈవీ

ఇండియన్ మార్కెట్లో టాటా మోటార్స్ తన పంచ్ కారును ఎలక్ట్రిక్ రూపంలో కూడా విక్రయిస్తోంది. ఇది 25 కిలోవాట్, 35 కిలోవాట్ బ్యాటరీ అనే రెండు ఎంపికలలో లభిస్తుంది. ఇవి వరుసగా 315 కిమీ & 421 కిమీ రేంజ్ అందిస్తాయి. ఈ కారు ధరలు రూ. 9.99 లక్షల నుంచి రూ. 14.44 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది.

టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు డిజైన్ పరంగా చూడటానికి సాధారణ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని చిన్న చిన్న కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. ముందు భాగంలోని బ్రాండ్ లోగో దగ్గర ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఈవీ అని తెలియజేయడానికి ప్రత్యేకమైన గుర్తులు కూడా ఉంటాయి. ఇంటీరియర్ డిజైన్ అద్భుతంగా ఉంటుంది. ఫీచర్స్.. కూడా ధరకు తగిన విధంగా ఉంటాయి. కాబట్టి ఈ కారు అన్ని విధాలా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహన విభాగంలో కూడా ఇది మంచి అమ్మకాలను పొందుతూ ఉంది. ఈ ఏడాది కూడా ఇది మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము.

Uma Siri
Uma Sirihttps://marthatelugu.com/
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Latest posts