ప్రపంచంలోకి కక్రికెట్ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న T20 వరల్డ్ కప్ ఫైనల్ ముగిసింది. మరోసారి టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. అహ్మదాబాద్‌లో జరిగిన T20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ మూడు కీలక రికార్డులు సృష్టించింది.
➤T20 వరల్డ్ కప్‌ను మూడు సార్లు గెలిచిన తొలి జట్టు
➤టైటిల్‌ను విజయవంతంగా డిఫెండ్ చేసిన తొలి జట్టు
➤స్వదేశంలో కప్ గెలిచిన తొలి జట్టు
ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ గొప్ప ఆధిపత్యం చూపించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగులు చేసింది. ఇది T20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.
మెరిసిన టాప్ ఆర్డర్
భారత్ మునుపెన్నడూ లేనంత భారీ స్కోరు సాధించడానికి టాప్ ఆర్డర్ బ్యాటర్లు కీలక పాత్ర పోషించారు. Abhishek Sharma చాలా కాలంగా ఫామ్‌లో లేకపోయినా.. ఫైనల్లో అద్భుతంగా ఆడాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి 52 పరుగులు చేశాడు. అతడు Sanju Samsonతో కలిసి తొలి 7 ఓవర్లలోనే 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సామ్సన్ మాత్రం మరోసారి తన క్లాస్‌ను చూపించాడు. ఇతడు 46 బంతుల్లో 89 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు. ఇందులో 5 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి.
ఈ మ్యాచ్‌తో శాంసన్ మరో అరుదైన రికార్డు సాధించాడు. ఒకే T20 వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. మొత్తం టోర్నీలో 5 మ్యాచ్‌లలో 321 పరుగులు చేశాడు. ఈ రికార్డు ఇంతకుముందు Virat Kohli పేరిట ఉండేది. ఇప్పుడు సామ్సన్ ఈ రికార్డును కైవసం చేసుకున్నాడు.
దూబే అద్భుతం!
శాంసన్‌కు Ishan Kishan మంచి సహకారం అందించాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. కిషన్ 25 బంతుల్లో 54 పరుగులు చేసి న్యూజిలాండ్ బౌలర్లపై విజృంభించాడు. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ James Neesham ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి భారత్‌ను కొంత వెనక్కు నెట్టాడు. ఆ ఓవర్లో సామ్సన్, కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ ఔట్ అయ్యారు. అయితే చివర్లో Shivam Dube అద్భుతంగా ఆడాడు. చివరి ఓవర్లోనే రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు కొట్టి 24 పరుగులు సాధించాడు. దీంతో భారత్ 255 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
బుమ్రా బెస్ట్ బౌలింగ్
256 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. Jasprit Bumrah తన మొదటి బంతికే Rachin Ravindraను ఔట్ చేశాడు. బుమ్రా తన స్పెల్‌లో 4 వికెట్లు తీసి న్యూజిలాండ్ బ్యాటింగ్‌ను పూర్తిగా కుదిపేశాడు. అతని బౌలింగ్ గణాంకాలు 4/13. ఇది T20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్. ఇతడు న్యూజిలాండ్ కెప్టెన్ Mitchell Santner, జేమ్స్ నిషామ్, Matt Henryలను బౌల్డ్ చేసి మ్యాచ్‌ను భారత్ వైపు మళ్లించాడు.
ఫలించని న్యూజిలాండ్ పోరాటం!
న్యూజిలాండ్ తరఫున ఓపెనర్ Tim Seifert మాత్రమే కొంత పోరాడాడు. ఇతడు 26 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఇందులో 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. అయితే భారత్ భారీ స్కోరు ముందు అది సరిపోలేదు. Axar Patel కూడా 3 వికెట్లు తీసి న్యూజిలాండ్ బ్యాటింగ్‌ను కట్టడి చేశాడు. చివరికి న్యూజిలాండ్ 159 పరుగులకు ఆలౌట్ అయింది.
టీమిండియా చారిత్రాత్మక విజయం
ఈ విజయం భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం పొందింది. ఎందుకంటే T20 వరల్డ్ కప్ చరిత్రలో.. న్యూజిలాండ్‌పై భారత్ ఇదే మొదటి విజయం. అంతకుముందు మూడు మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోయింది. ఈ విజయంతో కెప్టెన్ Suryakumar Yadav మరో గొప్ప రికార్డు సాధించాడు. వరల్డ్ కప్ గెలిచిన భారత కెప్టెన్ల జాబితాలో Kapil Dev, MS Dhoni, Rohit Sharma తర్వాత నాలుగో స్థానంలో నిలిచాడు. మొత్తం మీద అహ్మదాబాద్‌లో జరిగిన T20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ భారత అభిమానులకు చిరస్మరణీయంగా మారింది
Also Read: ఆ ఒక్క విజయం.. భారతీయుల గుండెల్లో నిలిచిన క్రికెట్!
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.