22.7 C
Hyderabad
Tuesday, March 18, 2025
Home Blog Page 26

క్రెటా నైట్ ఎడిషన్: మతిపోగోట్టే కలర్ ఆప్షన్.. అంతకు మించిన ఫీచర్స్

0

Hyundai Creta Knight Edition Launched: హ్యుందాయ్ కంపెనీ తన ఆరా ఈ సీఎన్‌జీ వేరియంట్ లాంచ్ చేసిన తరువాత మరో స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఆ స్పెషన్ ఎడిషన్ పేరు ‘క్రెటా నైట్ ఎడిషన్’. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త కారు గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ప్రైస్ (Price)

భారతీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త ‘హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్’ (Hyundai Creta Knight Edition) ధరలు రూ. 14.51 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఇది ఎస్ (ఓ) మరియు ఎస్ఎక్స్ (ఓ) వేరియంట్లుగా.. 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఈ నైట్ ఎడిషన్ ధర స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ.5000 ఎక్కువ.

వేరియంట్స్

క్రెటా నైట్ ఎస్ (ఓ) పెట్రోల్ ఎమ్‌టీ: రూ. 14.51 లక్షలు
క్రెటా నైట్ ఎస్ (ఓ) పెట్రోల్ సీవీటీ: రూ. 16.01 లక్షలు
క్రెటా నైట్ ఎస్ఎక్స్ (ఓ) పెట్రోల్ ఎమ్‌టీ: రూ. 17.42 లక్షలు
క్రెటా నైట్ ఎస్ఎక్స్ (ఓ) పెట్రోల్ సీవీటీ: రూ. 18.88 లక్షలు
క్రెటా నైట్ ఎస్ (ఓ) డీజిల్ ఎమ్‌టీ: రూ. 16.08 లక్షలు
క్రెటా నైట్ ఎస్ (ఓ) డీజిల్ ఏటీ: రూ. 17.58 లక్షలు
క్రెటా నైట్ ఎస్ఎక్స్ (ఓ) డీజిల్ ఎమ్‌టీ: రూ. 19.00 లక్షలు
క్రెటా నైట్ ఎస్ఎక్స్ (ఓ) డీజిల్ ఏటీ: రూ. 20.15 లక్షలు

డిజైన్ అప్డేట్స్

కొత్త హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ యొక్క బ్లాక్ అవుట్ గ్రిల్, బ్లాక్ లోగో, రెడ్ కాలిపర్‌లతో కూడిన బ్లాక్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. అంతే కాకుండా స్కిడ్ ప్లేట్స్, రూఫ్ రెయిల్స్, సీ-పిల్లర్ గార్నిష్, స్పాయిలర్, ఓఆర్వీఎమ్ వంటివన్నీ నలుపు రంగులోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ కారును చాలా ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి.

ఫీచర్స్

చూడచక్కని బ్లాక్ అవుట్ థీమ్ కలిగిన హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్.. డ్యూయెల్ టోన్ గ్రే ఇంటీరియర్ కలర్ స్కీమ్ పొందుతుంది. స్పోర్టియర్ మెటాలిక్ ఫినిష్డ్ పెడల్స్ కూడా ఇందులో చూడవచ్చు. అయితే ఫీచర్స్ విషయంలో చెప్పుకోదగ్గ అప్డేట్స్ లేదని తెలుస్తోంది. కాబట్టి స్టాండర్డ్ మోడల్ యొక్క అన్ని ఫీచర్స్ కూడా నైట్ ఎడిషన్ కారులో కూడా ఉన్నాయి.

బ్లాక్ పెయింట్ స్కీమ్‌తో అందుబాటులో ఉన్న క్రెటా నైట్ ఎడిషన్‌ను.. ఇప్పుడు టైటాన్ గ్రే మ్యాట్ పెయింట్ స్కీమ్‌తో కొనుగోలు చేయాలనుకుంటే రూ. 5000 అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. క్యాబిన్ సిల్వర్ కలర్ ఇన్సర్ట్‌లకు బదులుగా.. రెడ్ కలర్ ఇన్సర్ట్‌లను కూడా పొందుతుంది. ఇది చూడటానికి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

పవర్‌ట్రెయిన్స్

కొత్త హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. పెట్రోల్ ఇంజిన్ 115 హార్స్ పవర్ మరియు 144 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆప్షనల్ సీఈటీ గేర్‌బాక్స్ పొందుతుంది.

క్రెటా నైట్ ఎడిషన్ యొక్క డీజిల్ ఇంజిన్ ఇంజిన్ విషయానికి వస్తే.. ఇది 116 హార్స్ పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో వస్తుంది. రెండు ఇంజిన్స్ ఉత్తమ పర్ఫామెన్స్ అందిస్తాయని భావిస్తున్నాము.

Don’t Miss: ఎక్కువ మైలేజ్ ఇచ్చే Hyundai కొత్త కారు.. ధర చాలా తక్కువే

అమ్మకాల్లో దూసుకెళ్తున్న క్రెటా

భారతదేశంలో అత్యధిక అమ్మకాలు పొందుతున్న హ్యుందాయ్ క్రెటా, ఇప్పుడు నైట్ ఎడిషన్ రూపంలో రావడం వాహనప్రియులకు శుభవార్త అనే చెప్పాలి. ప్రత్యేకమైన పెయింట్ స్కీమ్ చాలామంది కస్టమర్లను తప్పకుండా ఆకర్షిస్తుందని భావిస్తున్నాము. కాబట్టి ఇది తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము. ఈ కారు ఎలాంటి అమ్మకాలను పొందుతుందనేది త్వరలోనే తెలుస్తుంది.

ఎక్కువ మైలేజ్ ఇచ్చే Hyundai కొత్త కారు.. ధర చాలా తక్కువే

0

Hyundai Aura E CNG Launched: దేశీయ మార్కెట్లో సీఎన్‌జీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు భారతీయ విఫణిలో ఆటోలు, కార్లు మాత్రమే సీఎన్‌జీ విభాగంలో ఉండేవి. ఇప్పుడు ఈ విభాగంలోకి బైకులు కూడా యాడ్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే బజాజ్ ఆటో సీఎన్‌జీ బైకును లాంచ్ చేసింది. మరికొన్ని కంపెనీలు కూడా సీఎన్‌జీ బైకులను లాంచ్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఈ తరుణంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘హ్యుందాయ్’ (Hyundai) తన ఆరా యొక్క ఈ వేరియంట్‌ను సీఎన్‌జీ విభాగంలో లాంచ్ చేసింది.

ధర & వేరియంట్స్

దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త ‘హ్యుందాయ్ ఆరా ఈ సీఎన్‌జీ’ (Hyundai E Aura CNG) ధర రూ. 7.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ధరల పరంగా ఈ కొత్త కారు అత్యంత సరసమైన సీఎన్‌జీ కారుగా నిలిచింది. ఇది ఈ, ఎస్ మరియు ఎస్ఎక్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది.

సాధారణంగా పెట్రోల్ కార్ల ధరల కంటే కూడా సీఎన్‌జీ కార్ల ధరలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఆరాఈ  సీఎన్‌జీ దాని పెట్రోల్ వేరియంట్ కంటే కూడా రూ. 82000 తక్కువ కావడం విశేషం. ధర తక్కువ కావడంతో ఈ కారు టాటా టిగోర్ సీఎన్‌జీ, మారుతి డిజైర్ సీఎన్‌జీ వంటి వాటికంటే కూడా సరసమైనదిగా నిలిచింది.

ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే కొత్త హ్యుందాయ్ ఆరాఈ  సీఎన్‌జీ డ్యూయల్ సిలిండర్ సెటప్ పొందుతుంది. అంటే ఇందులో రెండు సీఎన్‌జీ ట్యాంక్స్ ఉంటాయన్నమాట. అయితే ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్‌జీ మరియు ఎక్స్‌టర్ సీఎన్‌జీ రెండూ కూడా సింగిల్ సిలిండర్ కలిగి ఉన్నాయి. దీని వల్ల బూట్ స్పేస్ తగ్గుతుంది. ఈ సమస్యను తీర్చడానికి హ్యుందాయ్ ఇప్పుడు తన ఆరా సీఎన్‌జీలో డ్యూయల్ సిలిండర్ సెటప్ పెట్టింది. దీంతో బూట్ స్పేస్ కొంత ఎక్కువగానే లభిస్తుంది.

పవర్‌ట్రెయిన్

కొత్త హ్యుందాయ్ ఆరా ఈ సీఎన్‌జీ 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇందులోని సీఎన్‌జీ 69 హార్స్ పవర్ మరియు 95 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. పెట్రోల్ వెర్షన్ 83 హార్స్ పవర్ మరియు 114 న్యూటన్ మీటర్ టార్క్అందిస్తుంది . 28 కిమీ/కేజీ మైలేజ్ అందించే సీఎన్‌జీ వెర్షన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ పొందుతుంది. పెట్రోల్ వేరియంట్ 5 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా పొందుతుంది.

డిజైన్ మరియు ఫీచర్స్

హ్యుందాయ్ ఆరా ఈ సీఎన్‌జీ.. చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉంటుంది. కానీ ఇది సీఎన్‌జీ కారు అని చెప్పకనే చెప్పడానికి సీఎన్‌జీ బ్యాడ్జెస్ పొందుతుంది. వీటి ద్వారా ఇది సీఎన్‌జీ అని స్పష్టంగా తెలుస్తుంది. హెడ్‌లైట్, టెయిల్ లైట్, సైడ్ ప్రొఫైల్, రియర్ ప్రొఫైల్ అన్నీ కూడా మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటాయి. ఫీచర్స్ కూడా చెప్పుకోదగ్గ అప్డేట్స్ పొందలేదు. కాబట్టి స్టాండర్డ్ ఆరాలోని అన్ని ఫీచర్స్ సీఎన్‌జీ ఆరాలో కూడా ఉంటాయి. కాబట్టి వాహన వినియోగదారుడు మంచి డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు.

ప్రత్యర్థులు

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త హ్యుందాయ్ ఆరా ఈ సీఎన్‌జీ కారు.. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న టిగోర్ సీఎన్‌జీ (రూ. 7.75 లక్షల నుంచి రూ. 9.95 లక్షలు), డిజైర్ సీఎన్‌జీ (రూ. 8.44 లక్షల నుంచి రూ. 9.12 లక్షలు) వంటి వాటికి మాత్రమే కాకుండా హోండా అమేజ్ పెట్రోల్ కారుకు కూడా ప్రత్యర్థిగా ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే భారతీయ విఫణిలో హ్యుందాయ్ ఆరా సీఎన్‌జీ అమ్మకాల పరంగా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.

Don’t Miss: ఫిదా చేస్తున్న కలర్ ఆప్షన్స్.. Jawa 42 FJ బైక్ లాంచ్: రేటెంతో తెలుసా?

రాబోయే రోజుల్లో కొత్త వాహనాలు!

హ్యుందాయ్ కంపెనీ ఎప్పటికప్పుడు ఇండియన్ మార్కెట్లో కొత్త లేదా అప్డేటెడ్ వాహనాలను లాంచ్ చేస్తూ వాహనప్రియులను ఆకర్షిస్తోంది. అదే సమయంలో ఇది దాని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూనే.. దాని ఉనికిని కూడా కాపాడుకుంటోంది. రాబోయే రోజుల్లో కూడా హ్యుందాయ్ కంపెనీ మరిన్ని కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ దిశగా సంస్థ అడుగులు వేస్తోంది.

ఫిదా చేస్తున్న కలర్ ఆప్షన్స్.. Jawa 42 FJ బైక్ లాంచ్: రేటెంతో తెలుసా?

0

Jawa 42 FJ Bike Launched in India: రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవల తన 2024 క్లాసిక్ 350 బైక్ లాంచ్ చేసిన తరువాత.. జావా మోటారుసైకిల్ ఎట్టకేలకు ’42 ఎఫ్‌‌‌‌‌‌‌‌జే’ బైకును లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ దాని 42 శ్రేణిలో భాగమే. అయితే ఇది జావా 42 బేస్ మోడల్ బైక్ కంటే రూ. 26000 ఎక్కువ ధర వద్ద లభిస్తుంది.

ధరలు & కలర్ ఆప్షన్స్ (Price & Colour Options)

కొత్త జావా 42 ఎఫ్‌‌‌‌‌‌‌‌జే (Jawa 42 FJ) బైక్ ధరలు రూ. 1.99 లక్షల నుంచి రూ. 2.20 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇది మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఎంచుకునే కలర్ ఆప్షన్ మీద ధర ఆధారపడి ఉంటుంది. ఆ ధరలను ఇక్కడ చూడవచ్చు.

అరోరా గ్రీన్ మాట్టే (స్పోక్ వీల్ పొందుతుంది): రూ. 1.99 లక్షలు
అరోరా గ్రీన్ మాట్టే: రూ. 2.10 లక్షలు
మిస్టిక్ కాపర్: రూ. 2.15 లక్షలు
కాస్మో బ్లూ మాట్టే: రూ. 2.15 లక్షలు
డీప్ బ్లాక్ మాట్టే బ్లాక్ క్లాడ్: రూ. 2.20 లక్షలు
డీప్ బ్లాక్ మట్టీ రెడ్ క్లాడ్: రూ. 2.20 లక్షలు

డిజైన్ (Design)

కొత్త జావా 42 ఎఫ్‌‌‌‌‌‌‌‌జే బైక్.. స్టాండర్డ్ జావా 42 కంటే చాలా స్పోర్టియర్ డిజైన్ పొందుతుంది. అయితే ఇందులోని ట్విన్ ఎగ్జాస్ట్ కొంచెం అప్‌స్వెప్ట్ డిజైన్ పొందుతుంది. టియర్ డ్రాప్ షేప్ ఫ్యూయెల్ ట్యాంక్.. ఎల్ఈడీ లైటింగ్ సెటప్ ఇందులో చూడవచ్చు. సైడ్ కవర్ మాత్రం మునుపటి మోడల్ మాదిరిగానే ఉంది. ఈ బైక్ జావా 42 కంటే 790 మిమీ ఎక్కువ పొడవుగా ఉంటుంది.

ఫీచర్స్ (Features)

కొత్త జావా 42 ఎఫ్‌‌‌‌‌‌‌‌జే బైకులోని ఫీచర్స్ దాదాపు స్టాండర్డ్ మోడల్ బైకును తలపిస్తాయి. ఇందులోని సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ బైక్ గురించి రైడర్లకు చాలా సమాచారం అందిస్తుంది. సింగిల్ పీస్ సీటు లాంగ్ రైడ్ చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తం మీద ఈ బైకులో రైడర్లకు కావలసిన ఫీచర్స్ అన్నీ ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ఇంజిన్ (Engine)

జావా 42 ఎఫ్‌‌‌‌‌‌‌‌జే కొంత అప్డేటెడ్ డిజైన్ పొందినప్పటికీ.. జావా 42 బైకులోని అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి ఇందులో 334 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 29.1 హార్స్ పవర్ మరియు 29.6 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి పనితీరు ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నాము.

కొత్త జావా 42 ఎఫ్‌‌‌‌‌‌‌‌జే యొక్క సీటు ఎత్తు 790 మిమీ వరకు ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 178 మిమీ కాగా ఈ బైక్ మొత్తం బరువు 184 కేజీలు. ఇంజిన్ 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్‌తో డబుల్ క్రెడిల్ ఫ్రేమ్ చుట్టూ చుట్టబడిన ఉంటుంది. వీల్‌బేస్ పొడవు 1440 మీమీ. ఈ బైక్ 320 మిమీ ఫ్రంట్ డిస్క్, వెనుక భాగంలో కూడా డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా అందుబాటులో ఉంది.

ప్రత్యర్థులు (Rivals)

మల్టిపుల్ కలర్ ఎంపికలలో లభించే జావా 42 ఎఫ్‌‌‌‌‌‌‌‌జే దేశీయ విఫణిలో ఇప్పటికే అమ్మకానికి ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, హోండా సీబీ350 మరియు హీరో మావ్రిక్ 440 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా కొంత పోటీ తట్టుకోక తప్పదు. అయితే ఈ జావా 42 ఎఫ్‌‌‌‌‌‌‌‌జే బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా హుందాగా ఉంది. ఇది తప్పకుండా ఎక్కువమంది వాహన ప్రియులను ఆకర్షిస్తుందని భావిస్తున్నాము.

Don’t Miss: ఓటమి ఎరుగని దర్శకధీరుడు ‘రాజమౌళి’ కార్లు చూశారా? బెంజ్, ఆడి, వోల్వో ఇంకా..

భారతదేశంలో కొత్త బైకులకు డిమాండ్ పెరుగుతున్న సమయంలో జావా కొత్త 42 ఎఫ్‌‌‌‌‌‌‌‌జే బైక్ లాంచ్ చేసింది. ఇది దేశీయ విఫణిలో ఎలాంటి అమ్మకాలను పొందుతుంది. ప్రత్యర్థులను ఎదుర్కోగలదా? ఈ బైక్ ఎలాంటి పర్ఫామెన్స్ అందిస్తుంది వంటి మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో తెలుస్తాయి. అయితే ఈ బైక్ ఆధునిక కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. కాబట్టి తప్పకుండా పొందుతుందని భావిస్తున్నాము.

ఒకేసారి రెండు కార్లు లాంచ్ చేసిన స్కోడా: ధర & వివరాలు చూడండి

0

Skoda Slavia Monte Carlo and Kushaq Sportline Launched in India: చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ ‘స్కోడా’ (Skoda) భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఒకటి. ఈ కంపెనీ స్లావియా, కుషాక్ వంటి కార్లను దేశీయ విఫణిలో లాంచ్ చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అంతే కాకుండా ఈ సంస్థ ఇప్పుడు మరో రెండు కొత్త ఎడిషన్ లాంచ్ చేసింది. అవి ‘స్కోడా స్లావియా మోంటే కార్లో’ (Skoda Slavia Monte Carlo) మరియు స్కోడా కుషాక్ స్పోర్ట్‌లైన్ (Skoda Kushaq Sportline).

స్కోడా స్లావియా మోంటే కార్లో (Skoda Slavia Monte Carlo)

దేశీయ మార్కెట్లో అత్యుత్తమ అమ్మకాలతో దూసుకెళ్తున్న స్కోడా స్లావియా కారును కంపెనీ ఇప్పుడు ‘మోంటే కార్లో’ పేరుతో లాంచ్ చేసింది. ఈ సెడాన్ ప్రారంభ ధరలు రూ. 15.79 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారును బుక్ చేసుకున్న మొదటి 5,000 మంది రూ. 30,000 ప్రయోజనాలు పొందవచ్చు. ఈ అవకాశం సెప్టెంబర్ 6వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

స్కోడా స్లావియా మోంటే కార్లో మోడల్ అనేది స్టాండర్డ్ మోడల్ యొక్క టాప్ స్పెక్ ట్రిమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది చూడటానికి సాధారణ స్లావియా మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇందులో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ చూడవచ్చు. గ్రిల్, బ్యాడ్జ్, డోర్ హ్యాండిల్స్, సైడ్ స్కర్ట్స్, రియర్ స్పాయిలర్, బంపర్ మీద బ్లాక్ కలర్ హైలెట్స్ అన్నీ కూడా దీని కొత్త వేరియంట్ అని గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఈ సెడాన్ బ్లాక్ కలర్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది.

స్లావియా మోంటే కార్లో ఎడిషన్ లోపల రెడ్, బ్లాక్ కలర్ థీమ్ పొందుతుంది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా రెడ్ కలర్ థీమ్ పొందుతుంది. ఇందులో అల్యుమియం పెడల్స్ చూడవచ్చు. అంతే కాకుండా ఇందులో పవర్ సన్‌రూఫ్, 8 స్పీకర్ ఆడియో సిస్టం, ఫ్రంట్ వెంటిలేషన్ సీట్లు, 8 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉంటాయి.

ఇక ఇంజిన్ విషయానికి వస్తే.. స్కోడా స్లావియా మోంటే కార్లో ఎడిషన్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇవి రెండూ వరుసగా 115 హార్స్ పవర్ మరియు 150 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి రెండూ స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే మంచి పర్ఫామెన్స్ అందిస్తుందని భావిస్తున్నాము.

స్కోడా కుషాక్ స్పోర్ట్‌లైన్ (Skoda Kushaq Sportline)

ఇక స్కోడా కుషాక్ స్పోర్ట్‌లైన్ విషయానికి వస్తే.. ఇది మిడ్‌సైజ్ ఎస్‌యూవీ. దీని ధరలు రూ. 14.70 లక్షల నుంచి రూ. 17.40 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. అక్కడక్కడా బ్లాక్ కలర్ ట్రీట్‌మెంట్ పొందిన ఈ కారు మొత్తం మూడు ఇంజిన్ ఆప్షన్లలో వస్తుంది.

స్కోడా కుషాక్ స్పోర్ట్‌లైన్ బ్లాక్ గ్రిల్ సరౌండ్, రియర్ స్కఫ్ ప్లేట్స్, బ్లాక్ అవుట్ రూఫ్, రూఫ్ రెయిల్స్ మరియు బ్లాక్ విండో లైన్, టెయిల్‌గేట్ గార్నిష్‌లు పొందుతుంది. ఇవన్నీ చూడటానికి కుషాక్ మోంటే కార్లో మాదిరిగా ఉంటాయి. అంతే కాకుండా బ్లాక్ డోర్ గార్నిష్, 17 ఇంచెస్ బ్లాక్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ ఫెండర్ మీద స్పోర్ట్‌లైన్ బ్యాడ్జ్ వంటివి ఇందులో చూడవచ్చు.

ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇది డ్యూయెల్ టోన్ కలర్ పొందుతుంది. ఇందులో 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి మరెన్నో లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి.

Don’t Miss: పండుగ సీజన్‌లో పండుగలాంటి వార్త!.. భారీగా తగ్గిన ధరలు

కొత్త స్కోడా కుషాక్ స్పోర్ట్‌లైన్ మోడల్ 115 హార్స్ పవర్, 178 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 150 హార్స్ పవర్ & 250 న్యూటన్ మీటర్ టార్క్ అందించే 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్స్ పొందుతుంది. ఇవి రెండూ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. మూడో ఇంజిన్ 1.5 లీటర్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా ఉంది. మొత్తం మీద అన్ని వేరియంట్స్ ఉత్తమ పనితీరును అందిస్తాయని ఆశిస్తున్నాము.

పండుగ సీజన్‌లో పండుగలాంటి వార్త!.. భారీగా తగ్గిన ధరలు

0

Maruti Suzuki Price Cuts K10 And S-Presso: భారతదేశంలో ఎక్కువ మందికి ఇష్టమైన మారుతి సుజుకి యొక్క ‘ఆల్టో కే10’ (Alto K10) మరియు ‘ఎస్-ప్రెస్సో’ (S-Presso) కార్లను ఇప్పుడు అద్భుతమైన తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అయితే కంపెనీ ఈ తగ్గింపులను ఆల్టో కే10 యొక్క వీఎక్స్ఐ & ఎస్-ప్రెస్సో యొక్క ఎల్ఎక్స్ఐ వేరియంట్లకు మాత్రమే పరిమితం చేసింది.

తగ్గిన ధరలు

మారుతి సుజుకి ఆల్టో కే10 వీఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ కొనుగోలుపైన కస్టమర్ రూ. 6500 తగ్గింపును పొందుతాడు. అదే సమయంలో ఎస్-ప్రెస్సో యొక్క ఎల్ఎక్స్ఐ పెట్రోల్ మోడల్ కొనుగోలుపైన కేవలం రూ.2000 మాత్రమే తగ్గింపు లభిస్తుంది. ఈ డిస్కౌంట్స్ సెప్టెంబర్ 2నుంచి అమలులోకి వచ్చాయి.

కొత్త ధరలు

మారుతి సుజుకి తన ఆల్టో కే10 మరియు ఎస్-ప్రెస్సో కార్ల ధరలను తగ్గించిన తరువాత ఎక్స్ షోరూమ్ ధరలు తగ్గాయి. కాబట్టి మారుతి ఆల్టో కే10 వీఎక్స్ఐ వేరియంట్ ధర రూ. 5.06 లక్షలు (భారతదేశంలో ఆల్టో కే10 ధరలు రూ. 3.99 లక్షల నుంచి రూ. 5.96 లక్షల మధ్య ఉన్నాయి, ఎక్స్ షోరూమ్ ఇండియా).

ఎస్-ప్రెస్సో ఎల్ఎక్స్ఐ ధరలు ఇండియన్ మార్కెట్లో రూ. 4.27 లక్షల నుంచి రూ. 6.12 లక్షల మధ్య ఉన్నాయి. ధరల తగ్గింపు తరువాత ఎస్-ప్రెస్సో ఎల్ఎక్స్ఐ వేరియంట్ ధర రూ. 5.02 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఇండియా). ఈ తగ్గింపులు కంపెనీ యొక్క అమ్మకాలను పెంచే అవకాశం ఉంది.

భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. ఈ సమయంలో కొంతమంది కొత్త కార్లను కొనుగోలు చేయాలని చాలా ఆసక్తి చూపుతారు. ఈ సమయంలో కంపెనీ తన కార్లమీద తగ్గింపులు ప్రకటించడం.. కొత్త కస్టమర్లను ఆకర్శించగలదు. ఇదే జరిగితే మారుతి సుజుకి అమ్మకాలు మళ్ళీ పుంజుకుంటాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతున్న బ్రాండ్ సేల్స్ పెంచుకోవడానికి కంపెనీ ఈ తగ్గింపులు ప్రకటించిందని స్పష్టమవుతోంది.

ధరల తగ్గింపులకు కారణం

మార్కెట్లో మారుతి సుజుకి యొక్క ఎంట్రీ లెవెల్ కార్ల అమ్మకాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని నెలలుగా ఇదే వరుస జరుగుతోంది. గత నెలలో మారుతి చిన్న కార్ల విక్రయాలు 13 శాతం క్షిణించగా.. జూన్ నెలలో ఏకంగా 33 శాతం తగ్గిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే వీటి అమ్మకాలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో కొత్త సమస్యలను తీసుకు వచ్చే ప్రమాదం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి ఈ కార్ల మీద (ఆల్టో, ఎస్-ప్రెస్సో) తగ్గింపులు ప్రకటించడం జరిగింది.

తగ్గిన సేల్స్

2024 ఆగష్టు నెలలో కంపెనీ యొక్క దేశీయ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ 143075 యూనిట్లుగా నమోదయ్యాయి. 2023 ఆగష్టులో ఈ సేల్స్ 156114 యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే గత నెలలో సంస్థ అమ్మకాలు 8 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంట్రీ లెవెల్ మోడల్‌లు ఆల్టో కే10 మరియు ఎస్-ప్రెస్సో సేల్స్ 10648 యూనిట్లు. 2023 ఆగష్టులో ఈ సేల్స్ 12209 యూనిట్లు. ఈ లెక్కన సేల్స్ మునుపటి ఏడాది కంటే ఈ ఏడాది 13 శాతం తగ్గినట్లు స్పష్టమవుతోంది.

మారుతి ఆల్టో కే10 యొక్క అమ్మకాలను పరిశీలిస్తే.. 2024 జనవరిలో ఈ హ్యాచ్‌బ్యాక్ సేల్స్ 12395 యూనిట్లు. ఏప్రిల్ 2024లో 9043 యూనిట్లు. జులై 2024 ఈ సంఖ్య 7354 యూనిట్లకు చేరింది. దీన్ని బట్టి చూస్తే మారుతి ఎంట్రీ లెవెల్ కార్లకున్న డిమాండ్ తగ్గుతున్నట్లు అవగతమైంది. కాబట్టి ఈ అమ్మకాలను పెంచుకోవడానికి ఉత్తమ మార్గం తగ్గింపులు ఒక్కటే అని తలచి, కంపెనీ ఇప్పుడు ధరలను తగ్గించింది.

Don’t Miss: ‘పవన్ కళ్యాణ్’ వాహన ప్రపంచం చూశారా!.. ఓ లుక్కేసుకోండి

భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూనే.. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను లేదా అప్డేటెడ్ ఉత్పత్తులను లాంచ్ చేస్తూ తన ఉనికిని చాటుకుంటోంది. రాబోయే ఈ పండుగ సీజన్లో కంపెనీ తన వాహనాల విక్రయాలను పెంచుకోవడానికి, కస్టమర్లను ఆకర్శించడానికి ఆఫర్స్ కూడా అందించే అవకాశం ఉంది. మొత్తం మీద కంపెనీ అమ్మకాలను పెంచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కాబట్టి కంపెనీ ఉత్తమ అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము.

‘పవన్ కళ్యాణ్’ వాహన ప్రపంచం చూశారా!.. ఓ లుక్కేసుకోండి

0

Pawan Kalyan Car Collection: ముందుగా.. అశేష జనవాహిని గుండెల్లో వెలిగే సూర్యుడు పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’కు జన్మదిన శుభాకాంక్షలు.  ‘పవన్ కళ్యాణ్’ (Pawan Kalyan).. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. సినీ ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని లెక్కకు మించిన అభిమానులను కలిగి ఉండటమే కాకుండా.. జనసేన అనే పార్టీ పెట్టి రాజకీయ అరంగేట్రం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం MLAగా గెలుపొందారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా.. పంచాయతీ రాజ్ శాఖా, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ, అటవీ పర్యావరణ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

సినిమా రంగంలో అంచెలంచెలుగా ఎదిగి.. రాజకీయంలో కూడా అఖండ మెజారిటీతో గెలుపొందిన జనసేనాని పవన్ కళ్యాణ్ గతంలో ఎలాంటి కార్లను ఉపయోగించారు, ఎలాంటి బైకులను వాడారు, వాటి వివరాలు ఏంటి అనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..

పవన్ కళ్యాణ్ ఉపయోగించిన కార్లు

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్.. మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీ63, జాగ్వార్ ఎక్స్‌జే, బెంజ్ జీ55 ఏఎంజీ, ఫోర్డ్ ఎండీవర్, బీఎండబ్ల్యూ 520డీ, బెంజ్ ఆర్350 మరియు ఆడి క్యూ7 కలిగి ఉన్నారు. వీటితో పాటు ఖరీదైన హార్లే డేవిడ్‌సన్ బైకును కలిగి ఉన్నారు.

మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీ63

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ‘ఏఎంజీ జీ63’ కారు పవన్ కళ్యాణ్ గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 2.2 కోట్లు అని తెలుస్తోంది. పవర్ స్టార్ట్ గతంలో ఎక్కువగా ఈ కారులో కనిపించే వారు. ఇది ఆయనకు ఎంతగానో ఇష్టమైన కారు కూడా. దీనిని ఇప్పటికి కూడా ఎక్కువ మంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. ఈ కారు అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. పర్ఫామెన్స్ అయితే వేరే లెవెల్ అనే చెప్పాలి.

జాగ్వార్ ఎక్స్‌జే

పవన్ కళ్యాణ్ గ్యారేజిలో మరో ఖరీదైన కారు జాగ్వార్ కంపెనీకి చెందిన ‘ఎక్స్‌జే’ కూడా ఉన్నట్లు సమాచారం. దీని ధర రూ. 1.1 కోట్లు. విలాసవంతమైన ఈ కారును సినీ పరిశ్రమలోని వారు మాత్రమే కాకుండా చాలామంది ప్రముఖులు కూడా ఉపయోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ కారు పవన్ కళ్యాణ్ వద్ద ఉందా? లేదా అనే విషయం స్పష్టంగా తెలియదు. ఈ అయితే గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఈ కారులో ఎప్పుడూ కనిపించలేదు.

ఫోర్డ్ ఎండీవర్

అమెరికన్ కార్ల తయారీ సంస్థ అయిన ఫోర్డ్ కంపెనీకి చెందిన ఎండీవర్ కూడా పవన్ కళ్యాణ్ ఉపయోగించిన కార్లలో ఒకటి అని తెలుస్తోంది. దీని ధర రూ. 33.7 లక్షలు. ప్రస్తుతం ఫోర్డ్ కంపెనీ మన దేశంలో తమ ఉత్పత్తులను పూర్తిగా నిలిపివేసింది. అయినప్పటికీ ఫోర్డ్ కంపెనీ కార్లు ఇప్పుడు కూడా రోడ్ల మీద విరివిగా కనిపిస్తున్నాయి. కొందరు సెలబ్రిటీల గ్యారేజీలు ఫోర్డ్ ఎండీవర్ కూడా ఉంది.

బీఎండబ్ల్యూ 520డీ

జర్మన్ కార్ల తయారీ సంస్థ అయిన బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ‘520డీ’ను కూడా పవన్ కళ్యాణ్ ఉపయోగించినట్లు సమాచారం. దీని ధర రూ. 60 లక్షలు. ఈ కారు అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి అత్యుత్తమ పనితీరును అందించేలా రూపొందించబడి ఉంది. ఈ కారును ఇప్పటికే పలువురు ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు కూడా తమ గ్యారేజిలో కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి భారతీయ మార్కెట్లో బీఎండబ్ల్యూ కంపెనీ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది.

మెర్సిడెస్ బెంజ్ ఆర్350

పవన్ కళ్యాణ్ గ్యారేజిలోని మరో బెంజ్ కారు ఆర్350. క్రోమైట్ బ్లాక్ రంగులో కనిపించే ఈ కారు ధర రూ. 67 లక్షలు. ప్రస్తుతం ఈ కారు ఉత్పత్తిలో లేదు, కానీ ఈ కారు అక్కడక్కడా రోడ్ల మీద కనిపిస్తుంటుంది. ఇది పాత మోడల్ అయినప్పటికీ.. ఇది మార్కెట్లో అడుగుపెట్టిన సమయంలో మంచి సంఖ్యంలో అమ్ముడైంది. ఈ కారు కూడా పవన్ కళ్యాణ్ గ్యారేజిలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆడి క్యూ7

పవన్ కళ్యాణ్ గ్యారేజిలోని మరో జర్మన్ బ్రాండ్ కారు ఆడి క్యూ7. దీని ధర రూ. 67 లక్షలు. కేవలం పవన్ కళ్యాణ్ గ్యారేజిలో మాత్రమే కాకుండా ఈ కారును పలువురు సెలబ్రిటీలు కూడా తమ రోజువారీ వినియోగానికి ఉపయోగిస్తున్నారు. ఇది చూడటానికి మంచి డిజైన్ కలిగి, వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ కారణంగానే చాలామంది ఈ కారును కొనుగోలు చేస్తుంటారు. ఆడి కార్లకు కూడా దేశీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రూ. 18 లక్షల ఖరీదైన హార్లే డేవిడ్‌సన్ బైక్ కూడా కలిగి ఉన్నారు. దీంతో పాటు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రచారం కోసం ‘వారాహి’ని కూడా ప్రత్యేకంగా తయారు చేసుకున్నారు. అంతే కాకుండా ఈయనకు జూబ్లీహిల్స్‌లో రూ. 12 కోట్ల విలువైన ఓ బంగ్లా ఉన్నట్లు, తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో ఓ ఫామ్‌హౌస్.. మామిడి తోట, వ్యవసాయ భూమి ఉన్నట్లు సమాచారం.

ఒకప్పుడు సినిమాలు చేస్తూ.. విలాసవంతమైన జీవితం గడిపే పవన్ రాజకీయంలో అడుగుపెట్టిన తరువాత ఆస్తుల కంటే అప్పులే ఎక్కువయ్యాయి. ఉన్న డబ్బు కౌలు రైతులకు అండగా నిలబడటానికి దారాదత్తం చేశారు. పైన మనం చెప్పుకున్న కార్లు ఇప్పుడు ఆయన వద్ద ఉన్నాయో.. లేదో కూడా తెలియదు. పేదవాడి కష్టం చూస్తే.. తనకున్నదంతా ఇచ్చే గుణం ఉన్న నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అనటంలో ఎటువంటి సందేహం లేదు.

MLAగా పవన్ కళ్యాణ్ జీతం?

రాజకీయరంగేట్రం చేసినప్పుడు జీతం తీసుకోకుండా పనిచేస్తానన్న పవన్ కళ్యాణ్.. ఎన్నికల్లో గెలిచిన తరువాత MLAగా తాను పూర్తి జీతం తీసుకుంటానని ప్రకటించారు. ప్రజల డబ్బు జీతంగా తీసుకుంటాను, కాబట్టి తప్పకుండా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన తనను అనునిత్యం వెంటాడటానికి ఈ జీతం తీసుకుంటానని, జవాబుదారీ రాజకీయాన్ని మనమే ప్రజలకు నేర్పించాలని పవన్ కళ్యాణ్ గట్టిగా నమ్మారు. జీతం తీసుకునేవాడు తప్పకుండా జీతానికి తగిన పని చేయాలి.. ఈ భావనతోనే పవన్ కళ్యాణ్ మొత్తం జీతం తీసుకుంటానని పేర్కొన్నారు.

Don’t Miss: వింతగా ఉన్నా అందరి మనసు దోచేస్తోంది!.. ఆనంద్ మహీంద్రా చెంతకు ‘బుజ్జి’

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎంఎల్ఏకు జీతం రూ.1.25 లక్షల వరకు అందుతుంది. MLAలకు క్వార్టర్స్ లేకపోవడం వాళ్ళ హెచ్ఆర్ఏ కింద మరో రూ. 50000 అందుతుంది. వీటితో పాటు సిట్టింగ్ అలవెన్స్, టెలిఫోన్ సదుపాయాలు అందిస్తారు. ఎంఎల్ఏల అవసరాలకు అనుగుణంగా 1+1 లేదా 2+2 గన్‌మెన్‌లతో భద్రత కల్పిస్తారు. MLAల జీతాలు రాష్ట్రాన్ని బట్టి, ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థిని బట్టి మార్పుతూ ఉంటాయి.

హిందూపూర్ ఎంఎల్ఏ ‘బాలయ్య’ వాడే రూ.4 కోట్ల కారు గురించి తెలుసా!

0

Interesting Facts About Hindupur MLA Balakrishna Bentley Car: ముద్దుగా NBK లేదా బాలయ్యగా పిలుచుకునే నట సింహ ‘నందమూరి బాలకృష్ణ’ (Nandamuri Balakrishna) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నందమూరి తారక రామారావు బిడ్డగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ.. తనదైన నటనతో.. ఆహార్యంతో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అంటే, అది మొత్తం ఆయన ఘనత అనే చెప్పాలి.

ఈ రోజు బాలయ్యకు ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. అయితే బాలయ్య గురించి తెలిసిన చాలామందికి ఆయన ఉపయోగించే ఖరీదైన కారు గురించి బహుశా తెలిసిన ఉండకపోవచ్చు. ఈ కథనంలో బాలయ్య ఉపయోగించే ఖరీదైన కారు ఏది? దాన్ని ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..

బెంట్లీ కాంటినెంటల్ జీటీ (Bentley Continental GT)

నందమూరి బాలకృష్ణ ఉపయోగించే ఖరీదైన కార్లలో ఒకటి బెంట్లీ కంపెనీకి చెందిన ‘కాంటినెంటల్ జీటీ’. యూకే బ్రాండ్ అయిన ఈ కారు ధర భారతీయ మార్కెట్లో రూ. 4 కోట్ల (ఎక్స్ షోరూమ్) కంటే ఎక్కువని తెలుస్తోంది. ఈ కారును బాలయ్య కూతురు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు ‘నారా బ్రహ్మణి’ బాలకృష్ణ పుట్టినరోజు గిఫ్ట్‌గా అందించినట్లు సమాచారం. ఈ ఖరీదైన కారును మన దేశంలో చాలా తక్కువమంది మాత్రమే ఉపయోగిస్తారు. అందులో మన బాలయ్య ఒకరు కావడం గమనార్హం.

ఇక బెంట్లీ కాంటినెంటల్ జీటీ కారు విషయానికి వస్తే.. ఇది చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగి, ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ముందు భాగంలో హెడ్‌లైట్, బోనెట్ మీద బ్రాండ్ లోగో, అద్భుతమైన సైడ్ ప్రొఫైల్, రియర్ ప్రొఫైల్ కూడా చాలా అందంగా డిజైన్ చేయబడి ఉంటుంది. ఈ కారణంగానే ఇది చూడగానే ప్రజలను ఆకర్షిస్తుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. అత్యంత ఖరీదైన బెంట్లీ కాంటినెంటల్ జీటీ కారులో వాహన వినియోగదారులకు కావలసిన దాదాపు అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇందులో 10.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటితో పాటు ఏసీ వెంట్స్, మై బెంట్లీ కనెక్టెడ్ సర్వీస్ వంటివి కూడా ఉన్నాయి. మొత్తం మీద ఇందులోని ఫీచర్స్ అన్నీ కూడా లగ్జరీ డ్రైవింగ్ అనుభూతిని పొందటానికి అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది.

ఇంజిన్ అండ్ పర్ఫామెన్స్

బెంట్లీ కాంటినెంటల్ జీటీ కారు ట్విన్ టర్బో 4.0 లీటర్ వీ8 పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 6000 rpm వద్ద 550 పీఎస్ పవర్ మరియు 2000 – 4500 rpm వద్ద 770 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 4 .0 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు టాప్ గంటకు 318 కిమీ. దీన్ని బట్టి చూస్తే ఇది అత్యుత్తమ పనితీరుని అందిస్తుందని తెలుస్తోంది.

మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకూండా ఉత్తమ భద్రతా లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. ఇలాంటి అత్యుత్తమ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల దీనిని ఎక్కువమంది సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు, పొలిటికల్ లీడర్స్ ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.

MLAగా బాలయ్య జీతం ఎంతంటే?

నివేదికల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎంఎల్ఏ జీతం రూ. 1.25 లక్షలు మాత్రమే. ఇతర అలవెన్సులు క్రింద రూ. 50000 (హెచ్ఆర్ఏ), సిట్టింగ్ అలవెన్స్, టెలిఫోన్ సదుపాయాలు మాత్రమే కాకుండా.. సెక్యూరిటీ కింద గన్‌మెన్‌లను పొందవచ్చు. ఇప్పుడు బాలకృష్ణ హిందూపురం ఎంఎల్ఏ కాబట్టి ఈయన జీతం రూ. 1.25 మాత్రమే అని తెలుస్తోంది. నిజానికి ఒక ఎంఎల్ఏ జీతం కంటే ప్రతిపక్షం నేతలు లేదా ఎంఎల్సీ జీతాలే కొంత ఎక్కువగా ఉంటాయి.

Don’t Miss: వింతగా ఉన్నా అందరి మనసు దోచేస్తోంది!.. ఆనంద్ మహీంద్రా చెంతకు ‘బుజ్జి’

చూడటానికి పెద్ద మీసాలతో సింహం మాదిరిగా కనిపించినప్పటికీ.. బాలయ్య మనసు బంగారం అని సన్నిహితులు చెబుతారు. కోపమొస్తే కొడతాడు, ప్రేమ వస్తే దగ్గరకు తీసుకుంటారు బాలయ్య. కెమెరా ముందు అయినా, కెమెరా వెనుక అయిన బాలయ్య అంటే బాలయ్యే అంటారు. ఎందుకంటే రెండు స్వభావాలు బాలయ్యకు లేవు. ఏం చేయడానికైనా అదరడు, బెదరడు.. అందుకే అంటారు ఆయన్ను అందరూ జై బాలయ్య..

2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350.. ఇప్పుడు సరికొత్త హంగులతో: ధరలు చూశారా?

0

2024 Royal Enfield Classic 350 Launched in India: ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ (Royal Enfield) తన ‘2024 క్లాసిక్ 350’ (2024 Classic 350) బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ అప్డేటెడ్ డిజైన్, మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ పొందుతుంది. ఈ లేటెస్ట్ బైక్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇక్కడ మీ కోసం..

ధరలు & వేరియంట్స్

దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ ధర రూ. 1,99,500 కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 2,30,000 (ఎక్స్ షోరూమ్). 2009లో మొదటిసారి పరిచయమైన క్లాసిక్ 350 ఆ తరువాత అనేక మార్పులకు లోనైంది. ఇంజిన్ మరియు ఛాసిస్ వంటి వాటిలో కూడా అప్డేట్స్ జరిగాయి.

➤హెరిటేజ్ (మద్రాస్ రెడ్, జోధ్‌పూర్ రెడ్): రూ. 1,99,500
➤హెరిటేజ్ ప్రీమియం (మెడలియన్ బ్రాంజ్): రూ. 2,04,000
➤సిగ్నల్స్ (కమాండో సాండ్): రూ. 2,16,000
➤డార్క్ (గన్ గ్రే, స్టెల్త్ బ్లాక్): రూ. 2,25,000
➤క్రోమ్ (ఎమరాల్డ్): రూ. 2,30,000

డిజైన్

కొత్త 2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ లేటెస్ట్ క్లాసిక్ డిజైన్ పొందుతుంది. అయితే ఇందులో గమనించదగ్గ పెద్ద మార్పులు అయితే లేదు. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ పైలెట్ ల్యాంప్, టర్న్ ఇండికేటర్స్ ఇందులో ఉన్నాయి. ఇవన్నీ మంచి దృశ్యమానతనయు అందిస్తాయి.

ఫీచర్స్

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. 2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో సెమి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, డిజిటల్ డిస్‌ప్లే, గేర్ పొజిషన్ ఇండికేటర్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ వంటివి ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఫీచర్స్ విషయంలో కూడా పెద్ద అప్డేట్స్ లేదని తెలుస్తోంది.

ఇంజిన్

2024 క్లాసిక్ 350 బైక్ అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి ఇందులో 349 సీసీ సింగిల్ సిలిండర్ జె సిరీస్ ఇంజిన్ ఉంటుంది. ఇది 6100 rpm వద్ద 20.2 బ్రేక్ హార్స్ పవర్ (BHP), మరియు 4000 rpm వద్ద 27 న్యూటన్ మీటర్ (Nm) టార్క్ అందిస్తుంది. ఇంజిన్ అప్డేట్ కాలేదు కాబట్టి పనితీరులో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి రైడర్లు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే అదే రైడింగ్ అనుభూతిని పొందవచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క 2024 క్లాసిక్ 350 బైక్ డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఎటువంటి అప్డేట్స్ పొందలేదు. అంతే కాకుండా బ్రేకింగ్ మరియు సస్పెన్షన్ కూడా మునుపటి మోడల్ మాదిరిగానే ఉన్నాయి. ఈ బైకు ముందు భాగంలో 41 మిమీ టెలిస్కోపిక్ పోర్క్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్ ఫ్రీలోడ్ అడ్జస్ట్ చేయగలవు. రెండు చివర్లలో డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి.

అప్డేటెడ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ధర మాత్రం దాని మునుపటి మోడల్ కంటే కొంత ఎక్కువగానే ఉంటుంది. ఇది దేశీయ విఫణిలో హోండా సీబీ 350, హైనెస్ సీబీ 350, జావా 350 మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 వంటి వాటికి ప్రధాన పోటీదారుగా ఉంటుంది. దీన్నిబట్టి చూస్తే.. అమ్మకాల పరంగా ఈ బైక్ గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది.

కంపెనీ ఈ బైకును ఎందుకు అప్డేట్ చేసింది?

నిజానికి ఏ కంపెనీ అయినా తన ఉనికిని నిరంతరం చాటుకోవడానికి మరియు కస్టమర్లను ఆకర్శించడానికి కొత్త బైకులు లేదా అప్డేటెడ్ బైకులు లాంచ్ చేయాల్సిందే. ఇందులో భాగంగానే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎప్పటికప్పుడు తన విభాగంలోని బైకులను ఆధునికంగా తీర్చిదిద్దుతూ ముందుకు సాగుతోంది. 2024 క్లాసిక్ 350 బైక్ లాంచ్ చేయడంలో ప్రధాన ఉద్దేశ్యం కూడా ఇదే.

Don’t Miss: ఒలంపిక్‌ విజేతలకు ఎలక్ట్రిక్‌ కారు గిఫ్ట్‌.. ఎవరిచ్చారంటే?

కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ తప్పకుండా కస్టమర్లను ఆకర్షిస్తుందని, అత్యుత్తమ అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. ఎందుకంటే మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ ప్రియులు చాలామందే ఉన్నారు. వీరంతా ఎప్పుడెప్పుడు ఈ బైక్ ఆధునిక హంగులను పొందుతుందా అని వేచి చూస్తున్నారు. అలంటి వారికి 2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ఓ మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

ఒలంపిక్‌ విజేతలకు ఎలక్ట్రిక్‌ కారు గిఫ్ట్‌.. ఎవరిచ్చారంటే?

0

Indian Olympic Medal Winners Get MG Windsor EV Gift: ఇటీవల ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఐదు కాంస్య పతకాలు (బ్రాంజ్ మెడల్స్), ఒక సిల్వర్ మెడల్ సాధించింది. మెడల్ గెలిచిన ప్రతి ఒక్కరికీ జేఎస్‌డబ్ల్యు చైర్మన్ ‘సజ్జన్ జిందాల్’ ఒక కారు గిఫ్ట్ ఇస్తామని గతంలోనే ప్రకటించారు. అన్నట్టుగానే ఈయన గెలిచిన క్రీడాకారులకు ఎంజీ మోటార్స్ యొక్క ‘విండ్సర్’ ఎలక్ట్రిక్ కారును (MG Windsor EV) గిఫ్ట్ ఇచ్చారు. ఈ కారు గిఫ్ట్‌గా పొందిన క్రీడాకారుల జాబితా కింద చూడవచ్చు.

కారు గిఫ్ట్‌గా పొందిన క్రీడాకారులు

ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరపున షూటింగ్‌లో మొదటి మెడల్ (బ్రాంజ్ మెడల్) గెలుపొందిన మను భాకర్, మిక్స్‌డ్ 10 మీటర్లు ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో మను భాకర్‌తో కలిసి మెడల్ గెలిచినా సరబ్‌జోత్ సింగ్, మెన్స్ 50 మీటర్లు రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో మెడల్ సాధించిన స్వప్నిల్ కుసాలే, నీరజ్ చోప్రా (జావెలిన్ త్రోలో సిల్వర్ మెడల్) మరియు పురుషుల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో బ్రాండ్ మెడల్ సాధించిన అమన్ సెహ్రావత్ ఉన్నారు.

వీరు మాత్రమే కాకుండా ఒలింపిక్స్‌లో స్పెయిన్‌ను ఓడించి ఇండియాకు కాంస్య పతకాన్ని అందించిన భారత హాకీ జట్టులోని సభ్యులు కూడా ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ కారును పొందనున్నట్లు సమాచారం. ఇందులో హర్మన్‌ ప్రీత్ సింగ్, పీఆర్ శ్రీజేష్, జర్మన్ ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, సుమిత్ వాల్మీకి, సంజయ్, రాజ్ కుమార్ పాల్, షంషేర్ సింగ్, మన్ ప్రీత్ సింగ్, హార్థిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, అభిషేక్, సుఖ్ జీత్ సింగ్, లలిక్ కుమార్ ఉపాధ్యాయ, మన్ దీప్ సింగ్ మరియు గుర్జంత్ సింగ్ వంటి మొత్తం 16 మంది క్రీడాకారులు ఉన్నారు.

జేఎస్‌డబ్ల్యు గ్రూప్ అథ్లెట్లతో, క్రీడాకారులతో మంచి సత్సంబంధం ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ బెంగళూరు ఎఫ్‌సీ, ఢిల్లీ క్యాపిటల్స్, హర్యానా స్టీలర్స్, ప్రిటోరియా క్యాపిటల్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్ ఉమెన్స్ టీమ్ వంటి వాటికి స్పాన్సర్‌గా వ్యవహరించడమే కాకుండా.. నీరజ్ చోప్రా, అక్షర్ పటేల్, ధృవ్ జురెల్, సాక్షి మాలిక్, జెమిమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ మొదలైనవారికి కూడా స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

ఎంజీ విండ్సర్ ఈవీ

ఒలంపిక్స్ క్రీడాకారులకు అందించిన ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ కారు భారతీయ విఫణిలో విఫణిలో 2024 సెప్టెంబర్ 11న అధికారికంగా లాంచ్ అవుతుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ఇంకా డీలర్‌షిప్‌లకు చేరకముందే.. క్రీడాకారుల గ్యారేజిలో చోటు సంపాదించుకుంది.

ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ కారు విశాలమైన మరియు ప్రీమియం ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన టీజర్లు వెల్లడయ్యాయి. ఈ కారు యాంబియంట్ లైటింగ్, 135 డిగ్రీల ఎయిర్‌ప్లేన్ స్టైల్ రిక్లైనింగ్ సీట్లు, గ్లాస్ రూప్, బ్లాక్ అపోల్స్ట్రే మరియు దాని విభాగంలో అతిపెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ మొదలైన ఫీచర్స్ పొందుతుంది.

గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎంజీ విండ్సర్ ఈవీ బ్యాటరీ ప్యాక్స్ పొందుతుంది. అవి 50.6 కిలోవాట్ బ్యాటరీ మరియు 37.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 136 పీఎస్ పవర్ మరియు 200 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. అయితే కంపెనీ త్వరలో లాంచ్ చేయనున్న తన విండ్సర్ ఎలక్ట్రిక్ కారులో ఎలాంటి బ్యాటరీ ఆప్షన్స్ అందిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఒకే బ్యాటరీతో అందిస్తుందా? రెండు బ్యాటరీ ఆప్షన్లతో అందిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.

Don’t Miss: ఎలక్ట్రిక్ కార్లపై మనసుపడ్డ సినీతారలు వీరే!.. ఓ లుక్కేసుకోండి

కంపెనీ ఈ కారు ధరలను అధికారికంగా వెల్లడించలేదు, అయితే ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 20 లక్షల కంటే తక్కువ ఉండొచ్చని తెలుస్తోంది. అంతే కాకుండా బుకింగ్స్ మరియు డెలివరీ వివరాలు కూడా తెలియాల్సి ఉంది. దేశీయ మార్కెట్లో ఈ కారు లాంచ్ అయిన తరువాత ఈ విభాగంలో గట్టి పోటీ ఎదుర్కోవాలి ఉంటుందని భావిస్తున్నాము. కానీ ఇప్పటికే కంపెనీ ఆధునిక వాహనాలను లాంచ్ చేసి మంచి అమ్మకాలను పొందుతోంది. కాబట్టి సెప్టెంబర్ 11న లాంచ్ కానున్న ఎంజీ విండ్సర్ దాని విభాగంలో మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.

ఎలక్ట్రిక్ కార్లపై మనసుపడ్డ సినీతారలు వీరే!.. ఓ లుక్కేసుకోండి

0

Five Indian Celebrities Who Recently Bought Electric Cars: గతంతో పోలిస్తే.. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ బాగా పెరిగింది. సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఈ విభాగంలోనే కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే చాలామంది సినీతారలు కొత్త ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేశారు. ఈ జాబితాలో రామ్ చరణ్, రాజ్ కుంద్రా, జస్లీన్ రాయల్ మొదలైనవారు ఉన్నారు. వీరు కొనుగోలు చేసిన కార్లు ఏవి? వాటి ధరలు ఎలా ఉన్నాయనే విషయాలు వివరంగా ఇక్కడ చూసేద్దాం..

రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఖరీదైన ‘రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఈవీ’ (Rolls Royce Spectre EV) కొనుగోలు చేసారు. ఈ కారులోనే వారు అంబానీ ఇంట జరిగిన పెళ్ళికి వెళ్ళడానికి ఎయిర్ పోర్టుకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పటికీ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

రామ్ చరణ్ కొనుగోలు చేసిన ఈ రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కారు ఇప్పటి వరకు హైదరాబాద్ నగరం ఎవరూ కొనుగోలు చేయలేదు. ఈ కారు బేస్ మోడల్ ధర రూ. 7.5 కోట్లు. ఇది 102 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 575 Bhp పవర్, 900 Nm టార్క్ అందిస్తుంది. ఈ కారు ఒక ఫుల్ చార్జితో గరిష్టంగా 530 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా దీనికిదే సాటి అని చెప్పాలి.

రాజ్ కుంద్రా

ప్రముఖ వ్యాపారవేత్త.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త ”రాజ్ కుంద్రా” లోటస్ ఎలెట్రే (Lotus Eletre) ఎలక్ట్రిక్ కారును కొన్నారు. ఈ కారు ధర రూ. 2.55 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు కొన్న మొదటి వ్యక్తి రాజ్ కుంద్రా కావడం విశేషం. బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ లోటస్ ఈ కారును మార్కెట్లో లాంచ్ చేసింది.

లోటస్ ఎలెట్రే ఎలక్ట్రిక్ కారు మూడు వేరియంట్లలో (ఎలెట్రే, ఎలెట్రే ఎస్ మరియు ఎలెట్రే ఆర్) అందుబాటులో ఉంది. మూడు వేరియంట్లు చూడటానికి ఒకేలా ఉన్నప్పటికీ ఫీచర్లలో కొంత వ్యత్యాసం గమనించవచ్చు. ఎలెట్రే, ఎలెట్రే ఎస్ మోడల్స్ రెండూ కూడా 603 హార్స్ పవర్, 710 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే డ్యూయెల్ మోటార్ సెటప్ పొందుతుంది. ఈ రెండు కార్లు ఒక సింగిల్ చార్జితో గరిష్టంగా 600 కిమీ రేంజ్ అందిస్తాయి. ఇక ఎలెట్రే ఆర్ మాత్రం 905 హార్స్ పవర్, 985 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే డ్యూయెల్ మోటార్ సెటప్ కలిగి, సింగిల్ చార్జితో 490 కిమీ రేంజ్ అందిస్తుంది.

జస్లీన్ రాయల్

పాపులర్ సింగర్, సాంగ్స్ రైటర్ జస్లీన్ రాయల్ ఇటీవల బీవైడీ కంపెనీకి చెందిన ఆట్టో3 ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసింది. ఈ కారు కొనుగోలు చేసిన తరువాత.. ఫోటోలను స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. ఇందులో బ్లాక్ కలర్ కారు కనిపిస్తుంది.

దేశీయ మార్కెట్లో బీవైడీ ఆట్టో3 ప్రారంభ ధర రూ. 24.99 లక్షలు కాగా.. టాప్ మోడల్ ధర రూ. 33.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు డైనమిక్, ఎక్స్‌టెండెడ్ రేంజ్ మరియు స్పెషల్ ఎడిషన్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. డైనమిక్ వెర్షన్ 49.92 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. టాప్ వేరియంట్ 60.48 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఈ రెండు బ్యాటరీలు ఒక ఫుల్ చార్జితో గరిష్టంగా 468 కిమీ, 521 కిమీ రేంజ్ అందిస్తాయి.

మందిరా బేడీ

టాటా మోటార్స్ యొక్క నెక్సాన్ ఈవీ కొనుగోలు చేసిన సెలబ్రిటీలతో మందిరా బేడీ ఒకరు. ఈమె చాలా రోజుల నుంచి ఈ కారును ఉపయోగిస్తోంది. అంతే కాకుండా ఇటీవల రూ. 62.95 లక్షల ఖరీదైన వోల్వో సీ40 రీఛార్జ్ ఈవీ కొనుగోలు చేసింది. ఇది 78 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి.. ఒక సింగిల్ చార్జితో 530 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని డ్యూయెల్ మోటార్ సెటప్ నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఇది 408 పీఎస్ పవర్, 660 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

Don’t Miss: లగ్జరీ కారు కొన్న స్టార్‌ హీరో బాడీగార్డ్‌.. ధర తెలిస్తే అవాక్కవుతారు!

అధ్యాయన్ సుమన్

ప్రముఖ నటుడు శేఖర్ సుమన్ కొడుకు అధ్యాయన్ సుమన్.. ఇటీవల ఆడి క్యూ8 ఈ-ట్రాన్ కొనుగోలు చేశారు. ఇది అతని తండ్రి నుంచి గిఫ్ట్‌గా పొందినట్లు తెలుస్తోంది. ఈ కారు ధర రూ. 1.15 కోట్ల నుంచి రూ. 1.27 కోట్ల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ కారు 95 కిలోవాట్ బ్యాటరీ మరియు 114 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇవి రెండూ వరుసగా 491 కిమీ రేంజ్ మరియు 582 కిమీ రేంజ్ అందిస్తుంది.