37.7 C
Hyderabad
Saturday, March 15, 2025
Home Blog Page 33

సూర్యకుమార్ యాదవ్ ఇంతమంచి కారు కొన్నాడా? వారెవ్వా ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

0

Suryakumar Yadav Mercedes Benz G63 AMG: ప్రముఖ క్రికెటర్ ‘సూర్యకుమారి యాదవ్’ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో అద్భుతమైన క్యాచ్ పట్టి అభిమానుల మనసుదోచుకున్నాడు. మంచి క్రికెటర్‌గా పేరుపొందిన సూర్యకుమార్ ఆటోమొబైల్ ఔత్సాహికుడు కూడా. ఈ కారణంగానే ఎప్పటికపుడు తనకు నచ్చిన మరియు ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన జీ63 ఏఎంజీ (Mercedes Benz G63 AMG) కారును కొనుగోలు చేసినట్లు సమాచారం.

సూర్యకుమార్ యాదవ్ మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో గమనిస్తే మాట్టే బ్లాక్ కలర్ జీ63 ఏఎంజీ కారు చూడవచ్చు. అయితే అందులో డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఎవరనేది స్పష్టంగా తెలియడం లేదు. అయితే వీడియో రికార్డ్ చేసిన వ్యక్తి.. ఆ కారు సూర్యకుమార్ యాదవ్ కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. కానీ ఇందులో వాస్తవం ఎంత ఉందనేది తెలియదు. కాబట్టి కనిపించే కారు ‘సూర్యకుమార్ యాదవ్’కు చెందినదా? కాదా? అనేది కూడా తెలియాల్సి ఉంది.

వీడియోలో కనిపించే కారు మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ యొక్క గ్రాండ్ ఎడిషన్ అని తెలుస్తోంది. ఈ ఎడిషన్ ప్రపంచ వ్యాప్తంగా కేవలం 1000 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. కాగా ఈ కారును భారతదేశానికి కేవలం 25 మాత్రమే కేటాయించారు. ఈ ఎడిషన్ గత ఏడాదే మార్కెట్లో అడుగుపెట్టింది.

బెంజ్ జీ63 ఏఎంజీ గ్రాండ్ ఎడిషన్

మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ గ్రాండ్ ఎడిషన్.. ప్రత్యేకమైన కలర్ ఆప్షన్ పొందుతుంది. ఇది గోల్డ్ గ్రాఫిక్స్ కూడా పొందుతుంది. 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగిన ఈ స్పెషల్ ఎడిషన్ యొక్క బంపర్, ఫ్రంట్ స్కిడ్ ప్లేట్, స్పేర్ వీల్ రింగ్ మరియు సీట్ స్టిచింగ్ వంటివన్నీ కూడా గోల్డ్ యాక్సెంట్స్ పొందింది. కారు లోపలి భాగం కూడా గ్రాండ్ ఎడిషన్ బ్యాడ్జ్ పొందుతుంది. నప్పా లెదర్ సీట్లు ఇందులో ఉన్నాయి.

ప్రత్యేకంగా కనిపించే ఈ జీ63 ఏఎంజీ గ్రాండ్ ఎడిషన్.. అద్భుతమైన కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. అయితే ఇది స్టాండర్డ్ ఎడిషన్ యొక్క అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి ఇందులో 4.0 లీటర్ వీ8 ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 585 పీఎస్ పవర్ మరియు 850 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. మొత్తం మీద ఇది అత్యుత్తమ పర్ఫామెన్స్ అందిస్తుందని తెలుస్తోంది.

సూర్యకుమార్ యాదవ్ ఇతర కార్లు

క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ బెంజ్ జీ63 ఏఎంజీ గ్రాండ్ ఎడిషన్ కొనుగోలు చేశారా? లేదా? అనే విషయం మీద ఎటువంటి స్పష్టత లేదు. ఒకవేలా కొనుగోలు చేసి ఉంటే.. ఈయన గ్యారేజిలో మరో బెంజ్ కారు చేరినట్లే అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే సూర్యకుమార్ గ్యారేజిలో ‘మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్’ (Mercedes Benz GLS) లగ్జరీ కారును కలిగి ఉన్నారు. ఈ కారును సంవత్సరం క్రితం ఆయన భార్య దేవిషా శెట్టితో కలిసి డెలివరీ తీసుకున్నారు.

మెర్సిడెజ్ బెంజ్ కార్లు మాత్రమే కాకుండా.. సూర్యకుమార్ యాదవ్ గ్యారేజిలో నిస్సాన్ జొంగా 1 టన్ పికప్ ట్రక్ కూడా కలిగి ఉన్నారు. మహేంద్ర సింగ్ ధోని మాదిరిగానే ఈయన కూడా కస్టమైజ్డ్ పికప్ ట్రక్కును కలిగి ఉన్నారు. ఇది కైనెటిక్ ఎల్లో లేదా నియాన్ గ్రీన్ షేడ్‌లో చూడముచ్చటగా ఉంది.

Don’t Miss: ఆటో ఇండస్ట్రీ మొత్తం ఈ 14 కంపెనీల కిందే! మీకు నచ్చిన కారు ఎక్కడుందో చూసుకోండి

భారతదేశంలో మెర్సిడెస్ బెంజ్ జీ63 కలిగిన ఇతరులు

సూర్యకుమార్ యాదవ్ మాత్రమే కాకూండా.. శ్రేయాస్ అయ్యర్, హార్థిక్ పాండ్యా, ఎంఎస్ ధోని వంటి ఇండియన్ క్రికెటర్లు కూడా బెంజ్ జీ63 కారును కలిగి ఉన్నట్లు సమాచారం. క్రికెటర్లు మాత్రమే కాకుండా.. రణబీర్ కపూర్, జాన్వీ కపూర్, రోహిత్ శెట్టి, సారా అలీ ఖాన్, సునీల్ శెట్టి, శిల్పా శెట్టి, అమ్రితా అరోరా, దుల్కర్ సల్మాన్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ సెలబ్రిటీల వద్ద కూడా ఈ జీ63 ఏఎంజీ కారు ఉన్నట్లు తెలుస్తోంది.

ఆటో ఇండస్ట్రీ మొత్తం ఈ 14 కంపెనీల కిందే! మీకు నచ్చిన కారు ఎక్కడుందో చూసుకోండి

0

Entire Auto Industry in These Companies: కార్లు, బైకులు అంటే ఎవరి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు.. మధ్య తరగతి కుటుంబం నుంచి ధనికుల వరకు అందరికీ వాహనాలంటే ఇష్టమే. మరికొందరికైతే వెహికల్స్ అంటే ఫ్యాషన్ లేదా పిచ్చి అనే చెప్పాలి. అయితే ఎవరినైనా కార్లు గురించి లేదా కార్ బ్రాండ్స్ గురించి చెప్పమంటే.. ఇండియాలో టాటా మోటార్స్, మహీంద్రా వంటి పేర్లు. అన్యదేశ్య బ్రాండ్స్ అయితే బెంజ్, ఆడి, పోర్స్చే వంటి పేర్లు చెబుతారు.

ఎంతమంది ఎన్ని కార్ల పేర్లు చెప్పినా.. ఎన్ని బ్రాండ్స్ పేర్లు చెప్పినా.. అవన్నీ కూడా కేవలం 14 సంస్థల ఆధీనంలో ఉన్న విషయం బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న కార్లు ఏంటి? కేవలం 14 సంస్థల అధీనంలో ఉండటం ఏంటనే కొంత ఆశ్చర్యంగానే అనిపించవచ్చు. కానీ ఇది నమ్మలేని నిజం.

14 కంపెనీల కింద ఉన్న కార్ బ్రాండ్స్..

ఆటోమొబైల్ రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. కొత్త వాహనాలు పుడుతూనే ఉన్నాయి. అయితే మార్కెట్లో అమ్ముడవుతున్న దాదాపు 54 ప్రముఖ బ్రాండ్ కార్లు కేవలం 14 సంస్థల అధీనంలో ఉండటం గమనార్హం. ఇందులో అత్యధికంగా జీఎమ్ మోటార్స్ (జనరల్ మోటార్స్) ఏకంగా 9 బ్రాండ్స్ తన అధీనంలో ఉంచుకున్నట్లు సమాచారం. ఆ తరువాత ఫోక్స్​వ్యాగన్ 8 బ్రాండ్లను తన అధీనంలో ఉంచుకుంది.

పూర్తి వివరాలు

టాటా: టాటా కింద టాటా మోటార్స్, జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు మార్కెట్లో టాటా నెక్సాన్, టియాగో, హారియార్, సఫారీ, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, జాగ్వార్ ఎక్స్ఈ, ఎఫ్-టైప్ మొదలైన కార్లను విక్రయిస్తున్నాయి.

హ్యుందాయ్: హ్యుందాయ్ కింద హ్యుందాయ్ మరియు కియా కంపెనీలు ఉన్నాయి. కియా ఏంటి? హ్యుందాయ్ కింద ఉండటం ఏంటి అని చాలామందికి అనుమానం రావొచ్చు. కానీ ఇది నిజం.. కియా హ్యుందాయ్ కింద ఉన్న ఓ కంపెనీ. ఇది మార్కెట్లో కియా సెల్టోస్, కారెన్స్, కార్నివాల్ మొదలైన కార్లను విక్రయిస్తోంది. ఇక హ్యుందాయ్ కంపెనీ క్రెటా, ఐ20, టక్సన్, వెర్నా, ఐయోనిక్ 5 మొదలైన కార్లను విక్రయిస్తోంది.

బీఎండబ్ల్యూ: బీఎండబ్ల్యూ కింద రోల్స్ రాయిస్, బీఎండబ్ల్యూ మరియు మినీ కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ అత్యంత ఖరీదైన అన్యదేశ్య బ్రాండ్స్. భారతదేశంలో కూడా ఎక్కవమంది ఈ బ్రాండ్ కార్లకు అభిమానులు ఉన్నారు. ఈ కారణంగానే ఈ సంస్థలు ఎప్పటికప్పుడు మార్కెట్లో కార్లను లాంచ్ చేస్తున్నాయి.

హోండా: భారతదేశంలో ఎక్కువమంది ఇష్టపడే బ్రాండ్లలో ఒకటి హోండా. దీని కింద అక్యూరా మరియు హోండా అనే రెండు బ్రాండ్స్ ఉన్నాయి. అక్యురా అనే పేరు చాలామందికి పెద్దగా పరిచయం లేకపోయినా.. హోండా మాత్రమే సుపరిచయమే. ఈ కంపెనీ సిటీ, ఎలివేట్ మొదలైన కార్లను విక్రయిస్తోంది.

ఫోక్స్​వ్యాగన్: చెక్ రిపబ్లిక్ బ్రాండ్ అయిన ఫోక్స్​వ్యాగన్ కింద ఏకంగా ఎనిమిది సంస్థలు ఉన్నాయి. అవి ఆడి, స్కోడా, లంబోర్ఘిని, పోర్స్చే, బెంట్లీ, బుగాటీ, సీట్ మరియు ఫోక్స్​వ్యాగన్ ఉన్నాయి. ఈ కంపెనీలో ఒక్కొక్కటి ఎన్ని కార్లను మార్కెట్లో లాంచ్ చేసి విక్రయిస్తున్నాయో దాదాపు అందరికి తెలుసు.

జనరల్ మోటార్స్: ‘జీఎం’గా పిలువబడే జనరల్ మోటార్ కింద ఏకంగా 9 కంపెనీలు ఉన్నాయి. అవి క్యాడిలాక్, వూలింగ్ మోటార్స్, బావోజున్, బ్యూయిక్, జీఎంసీ, ఒపెల్, వాక్స్ వాల్, హోల్డెన్ మరియు షెవర్లే. బహుశా ఈ కంపెనీలు ఇండియాలోని ప్రజలలో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఇది అమెరికన్ మార్కెట్లోని అగ్రగామి కార్ల తయారీ సంస్థల్లో ఒకటిగా ఉంది.

టయోటా: టయోటా కింద లెక్సస్, డాయ్ హత్సు మరియు టయోటా కంపెనీలు ఉన్నాయి. ఇందులో లెక్సస్ మరియు టయోటా కంపెనీలు విరివిగా మార్కెట్లో కార్లను లాంచ్ చేస్తూ.. విపరీతమైన అమ్మకాలను పొందుతున్నాయి. అంతే కాకుండా ఇవి వాటి ప్రత్యర్థులకు కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి.

ఎఫ్‌సీఏ (ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్): దీనికి కింద ఫియట్, క్రిస్లెర్ ఉన్నాయి. ఈ కంపెనీల కింద అంటే ఫియట్ కింద.. మాసెరటీ, లాంసియా, అల్పా రోమియో మరియు క్రిస్లెర్ కింద ర్యామ్, డాడ్జ్ మరియు జీప్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇందులో ఫియట్ మరియు జీప్ బ్రాండ్స్ అధిక ప్రజాదరణ పొందాయి.

రెనో: రెనో లేదా రెనాల్ట్, శాంసంగ్, డాసియా అనే మూడు బ్రాండ్స్ దీని కింద ఉన్నాయి. ఇందులో రెనో.. కైగర్, క్విడ్ మొదలైన కార్లను విక్రయిస్తూ ముందుకు సాగుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని కార్లను మార్కెట్లో విక్రయించడానికి ఈ సంస్థ సన్నద్ధమవుతోంది.

డైమ్లర్: మెర్సిడెస్ బెంజ్, స్మార్ట్ వంటి రెండు బ్రాండ్స్ ఈ డైమ్లర్ కింద ఉన్నాయి. స్మార్ట్ గురించి పెద్దగా తెలియకపోయినా.. బెంజ్ గురించి పరిచయమే అవసరం లేదు. ఎదుకంటే ఈ కంపెనీ కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇందులో ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయి.

ఫోర్డ్: అమెరికాకు చెందిన దీని కింద ఫోర్డ్ మరియు ద లింకన్ మోటార్స్ కంపెనీ రెండు ఉన్నాయి. ఫోర్డ్ ప్రస్తుతం భారతదేశంలో తన కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే మళ్ళీ ఈ కంపెనీ సరికొత్త ఉత్పత్తితో మార్కెట్లో అడుగుపెట్టే సూచనలు ఉన్నట్లు సమాచారం.

నిస్సాన్: ఇన్ఫినిటీ, నిస్సాన్ మరియు డాట్సన్ అనే మూడు కంపెనీలు దీని కింద ఉన్నాయి. నిస్సాన్ కంపెనీ ప్రస్తుతం మాగ్నైట్ కారును మాత్రమే దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది. ఇక డాట్సన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం దీనికున్న ఆదరణ భ్రాతదేశంలో బాగా తగ్గిపోయింది.

గిలీ: బహుశా ఈ పేరు ఎవరికీ తెలియకపోవచ్చు. అయితే ప్రముఖ కంపెనీ వోల్వో దీని కింద ఉంది. ఇది మాత్రమే కాకుండా ది లండన్ ట్యాక్సీ కంపెనీ మరియు గిలీ అనే రెండు సంస్థలు ఉన్నాయి. వోల్వో కంపెనీ ఎప్పటికప్పుడు మార్కెట్లో లేటెస్ట్ కార్లు లాంచ్ చేస్తూ మంచి ఆదరణ పొందుతోంది.

పీఎస్ఏ: చివరగా మన జాబితాలో చెప్పుకోదగ్గ పేరు పీఎస్ఏ. దీనికి డీఎస్ ఆటోమొబైల్స్, సిట్రోయెన్ మరియు ఫూజియోట్ ఉన్నాయి. సిట్రోయెన్ కంపెనీ భారతదేశంలో ప్రస్తుతం అధిక ప్రజాదరణ పొందుతున్న సంస్థ. పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసిన ఈ కంపెనీ మరో కొత్త కారును వచ్చే నెలలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది.

గమనిక:- నిజానికి పైన చెప్పుకున్నవి ప్రధానమైన బ్రాండ్స్. ఇవి కాకుండా మరిన్ని వాహన తయారీ సంస్థలు, స్టార్టప్ కంపెనీలు లెక్కకు మించి ఉన్నాయి. కాబట్టి పాఠకులు ఈ విషయాన్ని గమనించాలి. అంతర్జాలంలో లభించిన కొన్ని ఆధారాల ద్వారా మాత్రమే ఈ కథనం రూపొందించబడింది. కాబట్టి దేశీయ మార్కెట్లో, గ్లోబల్ మార్కెట్లో మరిన్ని కంపెనీలు ఉండవచ్చు.

కేటీఎమ్ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? చరిత్ర తెలిస్తే తప్పకుండా షావుతారు!

0

Interesting Facts About KTM: ఇండియన్ మార్కెట్లోకి ఎన్ని బైక్ బ్రాండ్స్ వచ్చినా.. ‘కేటీఎమ్’ (KTM) సంస్థ లాంచ్ చేసే బైకులకు మాత్రమే ఓ స్పెషల్ క్రేజు ఉంది. దశాబ్దాల క్రితం మొదలైన కేటీఎమ్ ప్రయాణం ఇప్పటికి కూడా నిర్విరామంగా ముందుకు దూసుకెల్తూనే ఉంది అంటే.. దీనికి ప్రధాన కారణం ఈ బైకులపై యువకులకు ఉన్న ఇష్టం అనే చెప్పాలి. 2024లో కూడా కేటీఎమ్ బైకులు కొనుగోలు చేస్తున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది.

ఎప్పుడు చూసినా కేటీఎమ్, కేటీఎమ్ అని వింటూనే ఉన్నాము. కానీ కేటీఎమ్ ఫుల్ ఫామ్ ఏంటి? ఈ పేరు వెనుక ఉన్న చరిత్ర ఏంటి? అని ఎప్పుడైనా.. ఎవ్వరైనా ఆలోచించారా? ఆలోచించినవారి సంగతి పక్కన పెడితే.. అసలు కేటీఎమ్ ఫుల్ ఫామ్ తెలియనివారు చాలామందే ఉన్నారు. అలాంటి వారికోసం ఈ ప్రత్యేక కథనం..

కేటీఎమ్ ఫుల్ ఫామ్

ఎక్కడపడితే అక్కడ కేటీఎమ్ బైకులు కనిపిస్తూనే ఉంటాయి. కేటీఎమ్ పూర్తి పేరు ”క్రాఫ్ట్‌ఫార్‌జెగ్ ట్రంకెన్‌పోల్జ్ మట్టిగోఫెన్” (Kraftfahrzeuge Trunkenpolz Mattighofen). బహుశా ఇంత క్లిష్టమైన పేరు చాలామంది ఎక్కడా విని ఉండకపోవచ్చు. ఈ పేరు పలకడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఈ పేరు వెనుక పెద్ద చరిత్రే ఉంది.

కేటీఎమ్ చరిత్ర

నిజం చెప్పాలంటే కేటీఎమ్ అనేది బైక్ తయారీ సంస్థ కాదు. 1934 ప్రాంతంలో డీకేడబ్ల్యు మోటార్ సైకిల్, ఒపెల్ కార్ల కోసం రిపేర్ షాప్ మరియు డీలర్‌షిప్‌గా మొదలైంది. ఆ తరువాత బైక్స్ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టింది. ఈ కంపెనీని ఆస్ట్రియన్ ఇంజినీర్ హన్స్ ట్రంకెన్‌పోల్జ్ మట్టిగోఫెన్ ప్రాంతంలో స్థాపించారు. కేటీఎమ్‌లో ‘కే’ అంటే.. మోటార్ సైకిల్, ‘టీ’ అంటే.. సంస్థను స్థాపించిన వ్యక్తి పేరు (ట్రంకెన్‌పోల్జ్), ‘ఎమ్’ అంటే.. కంపెనీకి స్థాపించిన ప్రాంతం (మట్టిగోఫెన్) అని తెలుస్తోంది.

కేటీఎమ్ మొదటి బైక్ తయారీ

సంస్థను 1934లో ప్రారంభిస్తే.. 1951కి మొదటి బైక్ ఫ్రొటోటైప్ ఆర్100 తయారు చేశారు. దీని ఉత్పత్తి 1953లో ప్రారంభమైంది. ఈ బైకులో ఫిచ్‌టెల్ మరియు సాచ్స్ తయారు చేసిన రోటాక్స్ ఇంజిన్ ఉపయోగించారు. ఆ సమయంలో కంపెనీలో 20 మంది ఉద్యోగులు మాత్రమే పని చేసేవారని తెలుస్తోంది.

ఇక 1953లో ఎర్నెస్ట్ క్రోన్‌రీఫ్ అనే వ్యక్తి కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసి.. కంపెనీకి క్రోన్‌రీఫ్ అండ్ ట్రంకెన్‌పోల్జ్ మట్టిగోఫెన్ అని పేరుపెట్టారు. 1954లో ఆర్125 టూరిస్ట్ బైక్ లాంచ్ చేశారు. ఆ తరువాత గ్రాండ్ టూరిస్ట్, మిరాబెల్ స్కూటర్ లాంచ్ చేసి.. 1955లో 125 సీసీ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో రేసింగ్ టైటిల్ గెలుచుకుంది.

1956లో కేటీఎమ్ ఇంటర్నేషనల్ సిక్స్ డేస్ ట్రయల్స్ పోటీలో అరంగేట్రం చేసి ఏకంగా గోల్డ్ మెడల్ సాధించింది. ఆ తరువాత 125 సీసీ మోపెడ్ బైకులను రూపొందించడం మొదలుపెట్టింది. 1960లో కేటీఎమ్ పోనీ I, 1962లో పోనీ II, 1963లో కామెట్ వంటి వాటిని తయారు చేసి క్రమంగా మార్కెట్లో బ్రాండ్ పేరును సుస్థిరం చేసింది.

కంపెనీ ప్రారంభించిన ఎర్నెస్ట్ క్రోన్‌రీఫ్ 1960లో, ట్రంకెన్‌పోల్జ్ 1962లో కన్నుమూశారు. ఆ తరువాత ట్రంకెన్‌పోల్జ్ కుమారుడు ఎరిచ్ ట్రంకెన్‌పోల్జ్ కంపెనీ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. కేవలం 20 మందితో ప్రారంభమైన కంపెనీ 1971నాటికి 400 మంది ఉద్యోగులతో విరాజిల్లింది.

క్రమంగా దినదినాభివృద్ధి వైపు అడుగులు వేసిన కేటీఎమ్ క్రమంగా విదేశాల్లో కూడా తన కార్యకలాపాలను ప్రారంభించాలని యోచించి 1978లో యూఎస్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. 1981 నాటికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 700 కావడం గమనార్హం. ఆ తరువాత 1988లో కంపెనీ నష్టాల్లో నడిచి.. అప్పుల్లో కూరుకుపోయింది. 1991లో కంపెనీని బ్యాంకుల కన్సార్టియం కంపెనీ నియంత్రణను చేపట్టింది. ఇలా కంపెనీ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని.. ఇప్పటికి కూడా గ్లోబల్ మార్కెట్లో తిరుగులేని ప్రజాదరణ పొంది సాగుతూ ఉంది.

భారతీయ మార్కెట్లోని కేటీఎమ్ బైకులు

దేశీయ విఫణిలో కేటీఎమ్ కంపెనీ దాదాపు పది కంటే ఎక్కువ బైకులను విక్రయిస్తోంది. ఇందులో కేటీఎమ్ 200 డ్యూక్, 250 డ్యూక్, 390 డ్యూక్, ఆర్‌సీ 200, ఆర్‌సీ 390, 125 డ్యూక్, 390 అడ్వెంచర్ ఎక్స్, 390 అడ్వెంచర్, 250 అడ్వెంచర్ మరియు ఆర్‌సీ 125 బైకులు ఉన్నాయి. కాగా త్వరలో కంపెనీ మరికొన్ని అప్డేటెడ్ మోడల్స్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.

Don’t Miss: బైకులు డీజిల్ ఇంజిన్‌తో ఎందుకు రావో తెలుసా? ఆసక్తికర విషయాలు!

ఒకప్పుడు కేవలం ఇతర కంపెనీల కోసమే ప్రారంభమైన కేటీఎమ్ ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో తన హవా చాటుతోంది. 20 మంది ఉద్యోగులతో మొదలైన సంస్థ ఈ రోజు ప్రపంచంలోనే అనేక దేశాల్లో ఎంతోమందికి ఉపాధి కలిగిస్తోంది. దశాబ్దాల చరిత్రను మూటగట్టుకున్న కేటీఎమ్ ఘనత ప్రశంసనీయం.. అనన్య సామాన్యం.

బైకులు డీజిల్ ఇంజిన్‌తో ఎందుకు రావో తెలుసా? ఆసక్తికర విషయాలు!

0

Bike Do Not Come With Diesel Engine What Is The Reason: మనం నిత్యజీవితంలో పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మరియు CNG వాహనాలను చాలానే చూస్తున్నాము. ఇందులో చాలా వరకు కార్లు, హెవీ వెహికల్స్, ట్రాక్టర్లు మొదలైనవన్నీ కూడా డీజిల్ ఇంజిన్లను కలిగి ఉంటాయి. డీజిల్ ద్వారానే నడుస్తాయి. అయితే ఇప్పటి వరకు మనకు తెలిసిన మరియు చూస్తున్న బైకులు అన్నీ కూడా పెట్రోల్ ద్వారానే నడుస్తున్నాయి. బైకులు పెట్రోలుతోనే ఎందుకు పనిచేస్తుంటాయి, డీజిల్‌తో ఎందుకు పనిచేయవు? కంపెనీలు కూడా బైకులలో ఎందుకు డీజిల్ ఇంజిన్లను ప్రవేశపెట్టడం లేదు? అనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ధరలు

పెట్రోలా మరియు డీజిల్ మధ్య ధరల వ్యత్యాసం ప్రధానంగా చెప్పుకోవాలి. నిజానికి గతంలో పెట్రోల్ ధరలు డీజిల్ కంటే కూడా ఎక్కువ ధర వద్ద లభించేవి, కానీ ఇప్పుడు డీజిల్, పెట్రోల్ ధరలు దాదాపు సమానంగానే ఉన్నాయి. ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ ధరలు రెండూ కూడా రూ. 100 దాటేశాయి. మొత్తానికి డీజిల్ కంటే పెట్రోల్ కొంత తక్కువకే లభిస్తుందనేది వాస్తవం.

ఇంజిన్ల మధ్య తేడా..

పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది. నిజానికి డీజిల్ ఇంజిన్ కంటే కూడా పెట్రోల్ ఇంజిన్ వెంటనే పవర్ డెలివరీ చేస్తుంది. డీజిల్ ఇంజిన్లో కార్బ్యురేటర్ ఉండదు, పెట్రోల్ ఇంజిన్లో ఉంటుంది. అంతే కాకుండా డీజిల్ ఇంజిన్ తయారు చేయడానికి కంపెనీ కొంత ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.

బైకులు డీజిల్ ఇంజిన్‌తో ఎందుకు లేదంటే?

నిజానికి బైకులు పరిమాణంలో ఇతర వాహనాల కంటే (కార్లు, హెవీ వెహికల్స్) కూడా చిన్నగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ పవర్ కూడా బైకులకు అవసరం లేదు. అంతే కాకుండా పెట్రోల్ కంటే కూడా డీజిల్ ఇంజిన్లు ఎక్కువ ప్రెజర్ ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ ప్రెజర్ అందించడానికి కంపెనీలు వీటిని పరిమాణం పరంగా చాలా పెద్దగా తయారు చేసి ఉంటాయి. ఎక్కువ కంప్రెషన్ కారణంగా డీజిల్ ఇంజిన్లు ఎక్కువ పవర్ డెలివరీ చేస్తాయి.

పరిమాణం కార్లు పెద్దవిగా ఉండటం వల్ల వాటికి పవర్ కూడా ఎక్కువ అవసరం, కానీ బైకులకు అంత పవరే అవసరం లేదు. అంతే కాకుండా డీజిల్ ఇంజిన్లు ఎక్కువ ధర కలిగి ఉండటం కూడా బైకులో డీజిల్ ఇంజిన్ లేకపోవడానికి ఒక కారణమనే తెలుస్తోంది.

ఉదాహరణకు ఒక బైక్ విలువ రూ. లక్ష అనుకుంటే.. అందులో డీజిల్ ఇంజిన్ ప్రవేశపెడితే దాని ధర రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో బైకులు కొనేవారి సంఖ్య కూడా భారీగా తగ్గుతుంది. అయితే కార్ల ధరలు కనీసం రూ. 10 లక్షల వరకు ఉంటాయి, వాటిలో డీజిల్ ఇంజిన్లు ప్రవేశపెట్టిన దానిని కొనుగోలుదారుడు సులభంగా భరించగలడు.

ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో ప్రధానమైన విషయం ఏమిటంటే.. బైకులో డీజిల్ ఇంజిన్ ఫిక్స్ చేయడానికి కావాల్సిన స్పేస్ కూడా ఉండదు. ఒకవేలా తెగించి డీజిల్ ఇంజిన్లను బైకులలో ప్రవేశపెడితే.. బైకు పరిమాణంలో ఇంజిన్ ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. దీంతో బైకు పరిమాణం తగ్గే అవకాశం ఉంటుంది.

బైకులో డీజిల్ ఫిల్ చేస్తే ఏమవుతుందంటే?

పెట్రోల్ ఇంజిన్‌లో డీజిల్ పోసినా.. డీజిల్ ఇంజిన్‌లో పెట్రోల్ పోసినా చాలా ప్రమాదమే. ఎందుకంటే ఇంజిన్ పూర్తిగా చెడిపోయే అవకాశం ఉంటుంది. దీనికి కారణం ఏమిటంటే.. పెట్రోల్ ఇంజిన్ మరియు డీజిల్ ఇంజిన్లు ప్రత్యేకంగా తయారుచేయబడి ఉంటాయి, కాబట్టి డీజిల్ ఇంజిన్ డీజిల్‌తోనే.. పెట్రోల్ ఇంజిన్ పెట్రోల్‌తోనే పనిచేస్తాయి.

Don’t Miss: బ్యాడ్మింటన్‌ నుంచి స్టార్‌ హీరోయిన్‌.. వందల కోట్ల ఆస్తి, లగ్జరీ కార్లు.. రాయల్‌ లైఫ్‌!

పొరపాటున ఎప్పుడైనా డీజిల్ ఇంజిన్‌లో పెట్రోల్ పోసినా.. పెట్రోల్ ఇంజిన్‌లో డీజిల్ పోసినా.. వెంటనే మెకానిక్ వద్దకు తీసుకెళ్లి.. ఆయిల్ ట్యాంక్, ఆయిల్ పంపు నుంచి మొత్తం ఫ్యూయెల్ తీసేయాలి. ఆ తరువాత డీజిల్ ఇంజిన్ అయితే.. డీజిల్, పెట్రోల్ ఇంజిన్ అయితే పెట్రోల్ పోసుకోవచ్చు. ఆలా కాదని సాహసించి బైకులో డీజిల్ నింపి స్టార్ట్ చేయడానికి చూస్తే.. ఇంజిన్ పాడవుతుంది. వాహనం వినియోగదారులు తప్పకుండా తెలుసుకోవాలి.

రూ. లక్షల విలువైన బైక్స్.. ఫ్లిప్‌కార్ట్‌లో కోనేయండిలా..

0

Bajaj Bikes Available On Flipkart Now: దేశంలో వాహన వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు కూడా కావలసినన్ని డీలర్లను నియమిస్తూ.. ప్రజలకు దగ్గరవుతున్నాయి. అయితే కొందరు ఇప్పుడు ఆన్‌లైన్ కొనుగోళ్ళకు అలవాటుపడి డీలర్‌షిప్‌కు రావడానికి కొంత వెనుకాడుతున్నారు. ఈ తరుణంలో బజాజ్ ఆటో కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ తన మొత్తం మోటార్‌సైకిల్ శ్రేణిని ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంచింది.

ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండే బజాజ్ బైకులు

బజాజ్ పల్సర్, డామినార్, అవేంజర్, ప్లాటినా మరియు సీటీ 100 బైకులు అన్నీ కూడా ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి బజాజ్ బైక్ కావాలనుకునే కాష్ఠరమార్లు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. వీటి ధరలు రూ. 69000 నుంచి రూ. 2.31 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ సదుపాయం 25 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. దీన్ని మరిన్ని నగరాలకు చేరువ చేయడానికి బజాజ్ సిద్ధమవుతోంది. కాబట్టి రాబోయే రోజుల్లో భారతదేశంలోని మరిన్ని ప్రధాన నగరాల్లో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. అయితే త్వరలో కంపెనీ తన మొట్ట మొదటి సీఎన్‌జీ బైక్ ‘ఫ్రీడమ్ 125’ను కూడా ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తుంది భావిస్తున్నాము.

ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడం ఎలా?

సాధారణంగా నిత్యావసర వస్తువులు, బట్టలు, మొబైల్స్ వంటి ఇతరత్రా ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే.. నేరుగా హోమ్ డెలివరీ ఇస్తారని అందరికి తెలుసు. కానీ బైక్ బుక్ చేస్తే ఫ్లిప్‌కార్ట్ అధీకృత డీలర్లకు కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఆ తరువాత డీలర్షిప్ సందర్శించి డెలివరీ తీసుకోవాలి. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయాలంటే ముందుగా ఎక్స్-షోరూమ్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తం.. అంటే ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, కేవైసీ మొదలైనవాటికి అయ్యే మొత్తం డీలర్షిప్ వద్ద చెల్లించాల్సి ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో బైక్ కొనుగోలు చేసిన తరువాత రిజిస్ట్రేషన్ వంటి వాటికోసం కంపెనీ అధీకృత డీలర్‌షిప్‌కు వెళ్లాల్సి ఉంటుంది. మొత్తం డాక్యుమెంటేషన్ ప్రక్రియ 8 నుంచి 12 రోజుల్లో పూర్తవుతుంది. కస్టమర్లు రెండు వారాల తరువాత బైక్ డెలివరీ తీసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే లభించే ఆఫర్స్ ఏవంటే?

ఫ్లిప్‌కార్ట్‌లో బజాజ్ బైక్ కొనుగోలు చేస్తే.. కస్టమర్లు రూ. 5000 స్పెషల్ లాంచ్ డిస్కౌంట్ పొందవచ్చు. దీనితోపాటు 12 నెలల నో-కాస్ట్ ఈఎమ్ఐ, కార్డు ఆఫర్ వంటివి కూడా లభిస్తాయి. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఎప్పుడూ ఈ ఆఫర్స్ అందుబాటులో ఉంటయని ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి ఆఫర్స్ గురించి ముందుగానే ఆరా తీయడం మంచిది.

కరోనా వైరస్ అధికంగా ప్రబలిన సమయంలో ప్రజలకు ఆన్‌లైన్ సేవలను అందించడానికి చాలా కంపెనీలు ముందుకు వచ్చాయి. అప్పటి నుంచి ఈ ఆన్‌లైన్ సేవలు క్రమంగా విస్తరిస్తూ వచ్చాయి. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో కూడా బైకులు అంద్భుతలోకి వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే ఆన్‌లైన్ బుకింగ్ మీద కస్టమర్లకు ఎంత ఆసక్తి ఉందో ఇట్టే అర్థమైపోతోంది.

బజాజ్ ఫ్లిప్‌కార్ట్‌తో చేతులు కలపడానికి కారణం

భారతదేశంలో ప్రముఖ వాహన తయారీ సంస్థగా కీర్తించబడుతున్న బజాజ్ ఆటో కస్టమర్లకు మరింత చేరువ కావడానికి, సేవలను మరింత మెరుగుపరచడానికి ఫ్లిప్‌కార్ట్‌తో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. దీని ద్వారా కంపెనీ అమ్మకాలు పెరుగుతాయని సంస్థ భావిస్తోంది. అయితే ఇప్పటికే కొన్ని స్టార్టప్ కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ టూ వీలర్లను ఫ్లిప్‌కార్ట్ ద్వారానే విక్రయిస్తున్నాయి.

Don’t Miss: బైక్ మాదిరిగా ఉండే ఎలక్ట్రిక్ కారు.. ధర రూ.2 లక్షలు మాత్రమే!

ప్రస్తుతం బజాజ్ కంపెనీ అత్యుత్తమ బైకులను విక్రయిస్తోంది. ఇందులో చెప్పుకోదగ్గ మరియు యువతకు ఇష్టమైన మోడల్ పల్సర్. ఒకప్పటి నుంచి గొప్ప అమ్మకాలు పొందుతూ మార్కెట్లో దూసుకెళ్తున్న ఈ బైక్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. ఆధునిక హంగులను పొందుతూనే ఉంది. ఇది మాత్రమే కాకుండా కంపెనీ ఇటీవలే ఫ్రీడమ్ 125 పేరుతో సీఎన్‌జీ బైక్ లాంచ్ చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్. ఈ బైక్ డెలివరీలు ఇప్పటికే మొదలైపోయాయి. సంస్థ ఈ బైక్ కోసం బుకింగ్స్ దేశవ్యాప్తంగా స్వీకరిస్తోంది.

బైక్ మాదిరిగా ఉండే ఎలక్ట్రిక్ కారు.. ధర రూ.2 లక్షలు మాత్రమే!

0

Most Affordable Electric Car in India Wings EV Robin: కాలం మారుతోంది, టెక్నాలజీ పెరుగుతోంది. ఈ సమయంలో కొందరు పెట్రోల్, డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయాలనుకుంటారు. కానీ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలంటే కనీసం రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షల లోపు డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. ఇది అందరికీ సాధ్యమయ్యే పనికాదు. దీనిని దృష్టిలో ఉంచుకుని వింగ్స్ ఈవీ అనే కొత్త స్టార్టప్ రాబిన్ అనే సరికొత్త ఎలక్ట్రిక్ కారును సృష్టించింది. ఈ కారు ధర కేవలం రూ. 2 లక్షలు మాత్రమే. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

వింగ్స్ ఈవీ రాబిన్

రాబిన్ ఎలక్ట్రిక్ కారును కంపెనీ మూడు విభిన్న వేరియంట్లలో అందిస్తోంది. అవి బేస్ వేరియంట్ (60 కిమీ రేంజ్), ఎస్ వేరియంట్ (90 కిమీ రేంజ్), ఎక్స్ వేరియంట్ (90 కిమీ రేంజ్). వీటి ధరలు వరుసగా రూ. 2 లక్షలు, రూ. 2.5 లక్షలు మరియు రూ. 3 లక్షలు. మొదటి రెండు వేరియంట్లలో ఏసీ ఉండదు. టాప్ వేరియంట్ మాత్రమే ఏసీ ఆప్షన్ పొందుతుంది. సంస్థ ఈ ఎలక్ట్రిక్ కార్ల కోసం బుకింగ్స్ కూడా స్వీకరించడం ప్రారంభించింది. బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు అధికారిక వెబ్‌సైట్ సందర్శించవచ్చు. డెలివరీలు వచ్చే ఏడాదిలో ప్రారంభమవుతాయి.

వింగ్స్ ఈవీ రాబిన్ చూడటానికి ఓ బైక్ పరిమాణంలో ఉంది. ఇందులో కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించడానికి అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేవారు ఒకరు. వెనుక ప్యాసింజర్ సీటు ఒకటి మాత్రమే ఉంది. టూ డోర్స్ కారు మాదిరిగా ఇది టూ సీట్ కారన్నమాట. ఈ కారు ఒక ఫుల్ చార్జితో ఏకంగా 90 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. అంతే కాకుండా ఇది కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ / గం వేగవంతమవుతుంది.

రాబిన్ ఎలక్ట్రిక్ కారు రోజువారీ వినియోగానికి, రద్దీగా ఉన్న నగర ప్రయాణాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పరిమాణంలో చిన్నగా ఉండటం వల్ల ట్రాఫిక్ సమయంలో కూడా ఇది సజావుగా ముందుకు సాగిపోతుంది. ఛార్జింగ్ పోర్ట్ కారు యొక్క వెనుక భాగంలో ఉంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేయడానికి ఐదు గంటల (16 ఆంపియర్ ప్లగ్ ఉపయోగించి) సమయం పడుతుంది. ఈ కారులో బీఎల్డీసీ హబ్ మోటార్ ఉంటుంది. ఇది 282 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

డైమెన్షన్ (పరిమాణం)

వింగ్స్ ఈవీ ఎలక్ట్రిక్ కారు పరిమాణం విషయానికి వస్తే.. దీని పొడవు 2250 మిమీ, వెడల్పు 945 మిమీ, ఎత్తు 1560 మిమీ వరకు ఉంటుంది. ఈ కారు యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 160 మిమీ మాత్రమే. చూడటానికి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మ మాదిరిగా కనిపించే ఈ కారు అత్యుత్తమ పర్ఫామెన్స్ అందిస్తుందని నిర్దారించబడింది.

సింపుల్ డిజైన్ కలిగిన వింగ్స్ ఈవీ రాబిన్ ఎలక్ట్రిక్ కారు కేవలం రెండు డోర్స్ మాత్రమే కలిగి ఉంటుందని తెలుస్తోంది. మెయిన్ డోర్ లేదా డ్రైవర్ డోర్ కుడివైపున ఉంటుంది. వెనుక ప్రయాణికుల కోసం డోర్ ఎడమవైపున ఉంటుందని. కాబట్టి ప్రయాణికులు సులభంగా లోపలి వెళ్ళవచ్చు, బయటకు రావచ్చు.

ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ ప్యాక్

సరసమైన ధర వద్ద లభించే రాబిన్ ఎలక్ట్రిక్ కారు 5.6 కేడబ్ల్యుహెచ్ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. సాధారణ బ్యాటరీలతో పోలిస్తే ఈ రకమైన బ్యాటరీలు ఎక్కువ స్థిరంగా ఉంటాయి. భారతదేశ సమశీతోష్ణ స్థితిని తట్టుకునేలా ఈ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ పొడవు కేవలం 69 మిమీ మాత్రమే. కాబట్టి ఇదే ప్రపంచంలోనే అత్యంత సన్నని ఆటోమోటివ్ బ్యాటరీ ప్యాక్ అని తెలుస్తోంది.

డ్రైవ్ బై వైర్ టెక్నాలజీ

వింగ్స్ రాబిన్ ఈవీ కారులో లేటెస్ట్ డ్రైవ్ బై వైర్ టెక్నాలజీ ఉంటుంది. సాధారణంగా ఈ టెక్నాలజీని ఫైటర్ జెట్ మరియు ఎఫ్1 కార్లలో మాత్రమే ఉపయోగించేవారు. ఇది మోటార్ల యొక్క స్వతంత్ర నియంత్రణకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఉత్తమ పెరఫామెన్స్ లభిస్తుంది.

Don’t Miss: ఆగష్ట్‌లో లాంచ్ అయ్యే కార్లు ఇవే!.. థార్ 5 డోర్, టాటా కర్వ్ ఇంకా..

చూడటానికి చిన్నదిగా ఉన్నప్పటికీ రూ. 2 లక్షల ధర అంటే చాలా సరసమైనదనే చెప్పాలి. ఇంత తక్కువ ధరకు ప్రస్తుతం భారతదేశంలో ఏ కారు అందుబాటులో లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి తక్కువ ధరలో లభించే ఈ కారు తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. డిజైన్ మరియు రేంజ్ వంటివి ఉత్తమంగా ఉన్నప్పటికీ.. సేఫ్టీకి సంబంధించి ఎలాంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయో తెలియాల్సి ఉంది.

ఆగష్ట్‌లో లాంచ్ అయ్యే కార్లు ఇవే!.. థార్ 5 డోర్, టాటా కర్వ్ ఇంకా..

0

Top 5 Car Launches in 2024 August: 2024 ప్రారంభమై దాదాపు ఏడు నెలలు కావొస్తోంది. ఏడాది ప్రారంభం నుంచి లెక్కకు మించిన కార్లు, బైకులు దేశీయ మార్కెట్లో లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఈ నెలలో కూడా బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్, హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ, పోర్స్చే ఎలక్ట్రిక్ కార్లు మొదలైనవి లాంచ్ అయ్యాయి. కాగా వచ్చే నెలలో కూడా కంపెనీ మరికొన్ని కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ కథనంలో 2024 ఆగష్టు నెలలో దేశీయ విఫణిలో లాంచ్ అయ్యే కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నిస్సాన్ ఎక్స్-ట్రైల్ (Nissan X-Trail)

భారతదేశంలో ప్రస్తుతం కేవలం ఒక కారును (నిస్సాన్ మాగ్నైట్) మాత్రమే విక్రయిస్తున్న నిస్సాన్ త్వరలో ఎక్స్-ట్రైల్ పేరుతో 7 సీటర్ కారును లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. కంపెనీ ఈ కారును ఆగష్టు 1న అధికారికంగా దేశీయ విఫణిలో లాంచ్ చేయనుంది. ఇది సీబీయూ మార్గం ద్వారా ఇండియాలోకి రానుంది. కాబట్టి దీని ధర కొంత ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ కారు ధర రూ. 40 నుంచి రూ. 45 లక్షల మధ్య ఉంటుందని సమాచారం. అయితే అధికారిక ధరలు ఆగష్టు 1న వెల్లడవుతాయి.

ఆగష్టు 1న లాంచ్ కానున్న కొత్త నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఆకర్షణీయమైన డిజైన్ కలిగి మూడు కలర్ (డైమండ్ బ్లాక్, పెర్ల్ వైర్ మరియు షాంపైన్ సిల్వర్) ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారు ఎల్ఈడీ లైటింగ్ పొందే అవకాశం ఉంది. ఇది 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం మరియు 12.3 ఇంచెస్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే మొదలైనవి పొందనున్నట్లు సమాచారం.

కొత్త నిస్సాన్ ఎక్స్-ట్రైల్ కారు 1.5 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందనున్నట్లు సమాచారం. ఇది 163 బీహెచ్‌పీ పవర్, 300 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది సీవీటీ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కారు మార్కెట్లో లాంచ్ అయిన తరువాత ఎంజీ గ్లోస్టర్, స్కోడా కొడియాక్ వంటి కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

సిట్రోయెన్ బసాల్ట్ (Citroen Basalt)

ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ ఆగష్టు 7న ‘బసాల్ట్’ పేరుతో సరికొత్త కారును లాంచ్ చేయడానికి సర్వత్రా సిద్ధమైంది. అంతంకంటే ముందు ఆగష్టు 2న ఈ కారును కంపెనీ ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ కారు ఇప్పటికే మార్కెట్లో విక్రయించబడుతున్న సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ఆధారంగా రూపొందించబడుతున్నట్లు తెలుస్తోంది. కాబట్టి చూడటానికి సీ5 ఎయిర్‌క్రాస్ మాదిరిగానే అనిపిస్తుంది.

సిట్రోయెన్ కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త బసాల్ట్ కారు మంచి డిజైన్ కలిగి, ఆధునిక కాలంలో ఉపయోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుందని ఫోటోలను చూస్తేనే అర్థమవుతోంది. ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందనున్నట్లు సమాచారం. కాగా బసాల్ట్ ధరలు ఎలా ఉంటాయి? బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఆ తరువాత డెలివరీలు ఎప్పుడు అనే వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

టాటా కర్వ్ (Tata Curvv)

దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ ఆగష్టు 7న తన కర్వ్ కూపేను అధికారికంగా లాంచ్ చేయనుంది. కూపే వంటి డిజైన్ కలిగిన ఈ కారు వాహన ప్రియులను తప్పకుండా ఆకర్షిస్తుంది. మంచి డిజైన్ కలిగిన టాటా కర్వ్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, టెయిల్ లైట్స్ మరియు 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. లోపల 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం ఉండే అవకాశం ఉంది. దీని పరిమాణం ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ కారులో చాలా వరకు లేటెస్ట్ ఫీచర్స్ ఉండనున్నాయి.

త్వరలో లాంచ్ కానున్న కొత్త టాటా కర్వ్ కారు ఐసీఈ మరియు ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లతో లభించే అవకాశం ఉంది. ఐసీఈ వేరియంట్ 125 పీఎస్ పవర్ మరియు 225 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఎలక్ట్రిక్ వేరియంట్ 55 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా సింగిల్ చార్జితో 550 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

మహీంద్రా థార్ 5 డోర్ లేదా థార్ ఆర్మడ (Mahindra Thar 5 Door / Thar Armada)

భారతదేశంలో ప్రారంభం నుంచి అత్యంత ప్రజాదరణ పొందుతున్న మహీంద్రా థార్ ఆగష్టు 15న 5 డోర్స్ వెర్షన్ రూపంలో లాంచ్ కానుంది. దీనినే థార్ ఆర్మడ అని కూడా పిలుస్తారు. చూడటానికి సాధారణ థార్ మాదిరిగా కనిపించినప్పటికీ.. ఇది పరిమాణంలో కొంత పెద్దదిగా ఉంటుంది. ఇది రీ డిజైన్ చేయబడిన ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది.

మహీంద్రా థార్ ఆర్మడ ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 360 డిగ్రీ కెమెరా, రియర్ వెంట్‌లతో క్లైమేట్ కంట్రోల్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ మరియు లెవెల్ 2 ఏడీఏఎస్ వంటివి ఉండనున్నాయి. ఈ కారు 2.0 లీటర్ పెట్రోల్ మరియు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇంజిన్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలను పొందుతుంది.

నాల్గవ తరం మారుతి సుజుకి డిజైర్ (Fourth Zen Maruti Suzuki Dzire)

ఇక చివరగా వచ్చే నెలలో లాంచ్ అయ్యే కార్లలో మారుతి సుజుకి నాల్గవ తరం డిజైర్ కూడా ఒకటి. ఇది చూడటానికి స్టాండర్డ్ మోడల్ డిజైర్ మాదిరిగా ఉన్నప్పటికీ.. చాలా వరకు అప్డేట్ అయి ఉంటుంది. ఇందులో రీ డిజైన్ హెడ్‌లైట్స్, కొత్త ఫ్రంట్ గ్రిల్, బంపర్ మరియు ఫాగ్‌లాంప్ వంటివి ఉంటాయి. ఇది ఆగష్టు చివరి నాటికి మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Don’t Miss: మహీంద్రా థార్‌తో దుమ్ములేపిన హీరోయిన్.. ఆఫ్-రోడింగ్ అయినా తగ్గేదేలే

త్వరలో లాంచ్ కానున్న కొత్త మారుతి సుజకి డిజైర్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, సింగిల్ పేన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటివి పొందనున్నట్లు సమాచారం. ఈ కారు 1.2 లీటర్ 3 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ కలిగి 5 ప్రొసీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందనుంది. కంపెనీ ఈ కారును భవిష్యత్తులో CNG రూపంలో మరియు స్ట్రాంగ్ హైబ్రిడ్ రూపంలో కూడా లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కార్ డోర్స్ ఎన్ని రకాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు – 19వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు..

0

History Of Car Doors: ఎంత పెద్ద కారైనా, ఎంత చిన్న కారైనా.. ఖరీదైన కారైనా, ఆఖరికి చీప్ కారైనా డోర్స్ అనేవి చాలా ప్రధానం. కారు లోపలికి వెళ్లాలన్నా.. బయటకు రావాలన్న డోర్స్ ఓపెన్ చేసి రావాల్సి ఉంటుంది. ఆధునిక కాలంలో కార్ డోర్స్ (Car Doors) ఎలా ఉన్నాయో అందరికి తెలుసు, అయితే ఈ డోర్స్ పరిణామం ఎలా జరిగింది.. 19వ శతాబ్దం చివరిలో ఆటోమొబైల్ ప్రారంభమైనప్పటి నుంచి కారు డోర్లు ఎలా రూపాంతరం చెందాయని ఆసక్తికరమైన వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సింపుల్ డోర్స్ (Simple Doors)

నిజానికి 19వ శతాబ్దం చివరలో మరియు 20వ శతాబ్దం ప్రారంభంలో కార్లు అభివృద్ధి చేయబడినప్పుడు అవి చాలా సింపుల్ డోర్స్ కలిగి ఉండేవి. వీటిని ఓపెన్ చేయడం లేదా క్లోజ్ చేయడం వంటి ప్రక్రియ కూడా చాలా సులభంగా ఉండేది. అప్పట్లో డోర్స్ యొక్క ప్రధాన ఉపయోగం కారు లోపలికి దుమ్ము, ధూళి వంటివి లోపలికి రాకుండా చూడటమే.

సూసైడ్ డోర్స్ (Suicide Doors)

20వ శతాబ్దంలో సూసైడ్ డోర్స్ పేరిట కొన్ని డోర్స్ అందుబాటులో ఉండేవి. అప్పట్లో ఇలాంటి డోర్స్ ముఖ్యంగా ‘ఫోర్డ్ మోడల్ టీ’లో కనిపించేవి. కారులోకి వెళ్ళడానికి మరియు బయటకు రావడానికి సులభంగా ఉండటానికి ఇలాంటి డోర్స్ రేపాటు చేయడం జరిగింది. ఆ తరువాత కాలంలో ఇలాంటి డోర్లు లగ్జరీ కార్లలో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం రోల్స్ రాయిస్ కారులో ఇలాంటి డోర్స్ చూడవచ్చు.

స్లైడింగ్ డోర్స్ (Sliding Doors)

స్లైడింగ్ డోర్స్ అనగానే గుర్తోచింది మారుతి సుజుకి ఈకో. మినీ వ్యాన్ లాంటి కార్లలో ఇలాంటి డోర్లు కనిపించేవి. వీటిని ‘బార్న్ డోర్స్’ అని కూడా పిలిచేవారు. ఇలాంటి డోర్స్ వల్ల ప్రయాణికుడు లోపలికి సులభంగా రావచ్చు మరియు సులభంగా బయటకు వెళ్ళవచ్చు. ప్రస్తుతం కియా కార్నివాల్ MPVలో కూడా ఇలాంటి డోర్స్ చూడవచ్చు.

గుల్వింగ్ డోర్స్ (Gullwing Doors)

1950 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా అన్యదేశ్య కార్లలో ఇలాంటి డోర్స్ కనిపిస్తున్నాయి. ప్రారంభంలో మెర్సిడెస్ బెంజ్ 300ఎస్ఎల్ మరియు డెలోరియన్ DMC-12 వంటి కార్లలో ఈ డోర్స్ మొదలయ్యాయి. ఇవి సాధారణ కార్ల మాదిరిగా కాకుండా రెక్కల మాదిరిగా పైకి ఉంటాయి. ఇవి సాధారణంగా ఖరీదైన కార్లలో మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయి. నిజానికి సాధారణ కార్లలో ఇలాంటి డోర్స్ రూపొందించడం కొంత కష్టంతో కూడుకున్న పని.

సిజర్ డోర్స్ (Scissor Doors)

1960 నుంచి కత్తెర లాంటి డోర్స్ కలిగిన కార్లు వాడుకలో ఉండేవి. ఇలాంటి కార్లు ఎక్కువగా ఇటాలియన్ సూపర్ కార్లలో మాత్రమే ఎక్కువగా కనిపించేవి. ఇవి బయటకు పైకి తెరుచుకుంటాయి. కాబట్టి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. లంబోర్ఘిని కార్లలో ఇలాంటి డోర్స్ ఉండేవి. ఇప్పటికి కూడా చాలా సూపర్ కార్లలో ఇలాంటి డోర్స్ ఉన్నాయి.

బటర్‌ఫ్లై డోర్స్ (Butterfly Doors)

మనం ఇప్పటి వరకు చెప్పుకున్న కార్లలో ‘బటర్‌ఫ్లై డోర్స్’ చాలా ప్రత్యేకమైనవి. ఇవి సీజర్ డోర్స్ మరియు గుల్వింగ్ డోర్స్ కలిగినట్లు అనిపిస్తాయి. ఈ డోర్స్ పైకి మరియు వెలుపలికి పైవట్ అవుతాయి. ఇలాంటి డోర్స్ హైపర్‌కార్ మెక్‌లారెన్ సూపర్ కార్లలో కనిపిస్తాయి. ఈ కార్లు మిగిలిన కార్లకంటే కూడా భిన్నంగా ఉంటాయి.

ఫ్రేమ్‌లెస్ డోర్స్ (Frameless Doors)

ఆధునిక కాలంలో కొన్ని హై ఎండ్ కార్లలో ఇలాంటి ఫ్రేమ్‌లెస్ డోర్స్ కనిపిస్తాయి. ఇవి సాధారణ డోర్స్ మాదిరిగానే ఉంటాయి. కాకుంటే వీటికి పైన విండో ప్రేమ్ ఉండదు. మెర్సిడెస్ బెంజ్ మరియు ఆడి కార్లలో ఇలాంటి డోర్స్ ఉంటాయి. వీటి ధరలు సాధారణ కార్లకంటే ఎక్కువ కావడం గమనార్హం.

ఎలక్ట్రిక్ మరియు సెన్సార్ ఆపరేటెడ్ డోర్స్

టెక్నాలజీ రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న రోజుల్లో కార్లు మాత్రమే కాదు, కారు డోర్స్ కూడా కొత్త రూపాలను పొందుతున్నాయి. సాధారణ కార్లతో మొదలైన డోర్స్ పరిణామం ప్రస్తుతం సెన్సార్ ఆపరేటెడ్ డోర్స్ దాకా వచ్చేసాయి. దీన్ని బట్టి చూస్తీ డోర్లు ఎన్ని కొత్త డిజైన్స్ పొందాయనేది ఇట్టే అర్థమైపోతుంది.

Don’t Miss: Prabhas Car Collection: పాన్‌ ఇండియా స్టార్‌ ఇక్కడ.. కార్ల జాబితా పెద్దదే!

ఎలక్ట్రిక్ మరియు సెన్సార్ ఆపరేటెడ్ డోర్స్ అనేవి ఒక బటన్ నొక్కగానే వాటంతట అవే ఓపెన్ అవుతాయి, క్లోజ్ అవుతాయి. టెస్లా వంటి కార్లలో ఇలాంటి డోర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతానికి భారతదేశంలో ఇలాంటి కార్లు ఎక్కువ సంఖ్యలో అందుబాటులో లేదు.

మహీంద్రా థార్‌తో దుమ్ములేపిన హీరోయిన్.. ఆఫ్-రోడింగ్ అయినా తగ్గేదేలే

0

Bollywood Actress Nushrat Bharucha Mahindra Thar Off Roading: ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయి సంవత్సరాలు గడుస్తున్నా.. మహీంద్రా యొక్క థార్ ఎస్‌యూవీకి ఆదరనగానీ, డిమాండ్ గానీ ఏ మాత్రం తగ్గడం లేదు. దీనికి కారణం థార్ యొక్క డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా అద్భుతమైన ఆఫ్-రోడింగ్ కెపాసిటీ కూడా. ఈ కారును సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ బాలీవుడ్ నటి ‘నుష్రత్ భారుచా’ (Nushrat Bharucha) ఒకరు. ఇటీవల ఈమె తన థార్ ఎస్‌యూవీతో ఆఫ్-రోడింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..

నటి నుష్రత్ భారుచా.. గతంలో కూడా అనేక సందర్భాల్లో థార్ డ్రైవ్ చేస్తూ కనిపించారు. ఇప్పుడు ఏకంగా ఆఫ్-రోడింగ్ చేస్తూ చూపరులను ఫిదా చేస్తున్నారు. నటి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన వీడియోలో గమనిస్తే.. ఆఫ్-రోడింగ్ ఎలా చేయాలో ఓ అనుభవజ్ఞుడైన డ్రైవర్ ఇచ్చిన సూచనలను పాటిస్తున్నట్లు తెలుస్తోంది.

థార్ డ్రైవ్..

వీడియో ప్రారంభంలో పచ్చని గడ్డి మైదానంలో థార్ కారు డ్రైవ్ చేస్తూ రౌండే వేయడం చూడవచ్చు. ఇలా చేయడం ఆమెకు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఆ సమయంలో వర్షపు చినుకులు కురుస్తుండం కూడా చూడవచ్చు. ఆ తరువాత మెల్లగా ఏటవాలుగా వున్న ప్రదేశంలోకి కారును పోనిస్తుంది. ఆ తరువాత బురద గుంటల్లో కూడా కారును డ్రైవ్ చేస్తుంది. మొత్తం మీద అనుకున్న విధంగా ఆఫ్-రోడింగ్ పూర్తి చేసింది. ఇది మొత్తం అనుభవజ్ఞులైన వారి సమక్షంలో జరిగినట్లు తెలుస్తోంది.

నుష్రత్ భారుచా గతంలో మహీంద్రా థార్ సాధారణ డ్రైవ్ చేసినప్పటికీ.. ఆఫ్-రోడింగ్ ఎప్పుడూ చేయలేదని తెలుస్తోంది. బహుశా నుష్రత్ ఆఫ్-రోడింగ్ చేయడం ఇదే మొదటిసారి అయి ఉంటుందని తెలుస్తోంది. అయితే గతంలో చాలామంది ఆఫ్-రోడింగ్ ప్రియులు థార్ ఎస్‌యూవీతో పలుమార్లు ఆఫ్-రోడింగ్ చేస్తూ కనిపించారు. ఈ ఎస్‌యూవీ ఆఫ్-రోడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుందని చాలామంది వెల్లడించారు.

మహీంద్రా థార్

భారతదేశంలో ఒకప్పటి నుంచి గొప్ప అమ్మకాలు పొందుతున్న మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క థార్.. ఎస్‌యూవీ ఆఫ్-రోడింగ్ విభాగంలో సరసరమైన కారు. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఎంపికలలో లభిస్తుంది. ఇందులోని 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 150 పీఎస్ పవర్ మరియు 320 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇక 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ 130 Bhp పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

మహీంద్రా థార్ యొక్క పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లు రెండూ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతాయి. ఇక థార్ డిజైన్ మరియు ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే చూడగానే ఆకర్శించబడే డిజైన్ కలిగిన ఈ కారు వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. పర్ఫామెన్స్ పరంగా దీనికిదే సాటి.

థార్ ఎస్‌యూవీతో పాటు.. నుష్రత్ భారుచా ఖరీదైన బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎలక్ట్రిక్ కారును కూడా కలిగి ఉన్నారు. ఈమె మాత్రమే కాకుండా నటి కియారా అద్వానీ కూడా మహీంద్రా థార్ కలిగి ఉన్నట్లు సమాచారం. ప్రకాష్ రాజ్ మరియు కునాల్ ఖేము వంటి సెలబ్రిటీలు కూడా ఈ మహీంద్రా థార్ కారును కొనుగోలు చేశారు. దీన్ని బట్టి చూస్తే మహీంద్రా థార్ ఎస్‌యూవీ అంటే సెలబ్రిటీలకు ఎంత ఇష్టమో అర్థమవుతోంది.

Don’t Miss: ఒకప్పుడు సైకిల్.. ఇప్పుడు కోట్లు ఖరీదైన లగ్జరీ కార్లు – ఎవరీ అనురాగ్..

ఇక చివరగా మహీంద్రా థార్ యొక్క ధరల విషయానికి వస్తే.. దేశీయ విఫణిలో థార్ ధరలు రూ. 11.35 లక్షల నుంచి రూ. 17.60 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ మల్టిపుల్ వేరియంట్లలో.. వివిధ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. అంతే కాకుండా కంపెనీ మార్కెట్లో థార్ 5 డోర్ వెర్షన్ లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కారు పలుమార్లు టెస్టింగ్ సమయంలో కూడా కనిపించింది. దీన్ని బట్టి చూస్తే ఈ 5 డోర్ వెర్షన్ త్వరలో మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఒకప్పుడు సైకిల్.. ఇప్పుడు కోట్లు ఖరీదైన లగ్జరీ కార్లు – ఎవరీ అనురాగ్..

0

Fantasy Cricket Expert Anurag Dwivedi Vehicles: భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడల్లో క్రికెట్ ఒకటి. చిన్నా.. పెద్ద తేడా లేకుండా అందరు ఇష్టపడే ఆటల్లో ఒకటైన క్రికెట్ ఆట గురించి.. క్రికెట్ ఆటగాళ్ల గురించి కూడా ప్రత్యేకంగా పరిచయమే అవసరమే లేదు. కానీ వీరు ఎలాంటి కారును ఉపయోగిస్తారు, వాటి వివరాలు ఏంటి అనేది మాత్రం చాలామంది తెలుసుకోవాలని తెగ కుతూహల పడిపోతుంటారు.

ఈ కథనంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల ఫాంటసీ క్రికెట్ ఎక్స్‌పర్ట్ ‘అనురాగ్ ద్వివేది’ (Anurag Dwivedi) ఎలాంటి కార్లను కలిగి ఉన్నాడు, సైకిల్ ఉపయోగించే స్థాయి నుంచి ఎలాంటి ఖరీదైన లగ్జరీ కార్లను కలిగి ఉన్నారనే మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.

సైకిల్ (Cycle)

నిజానికి అనురాగ్ ద్వివేది ఇన్‌స్టాగ్రామ్ చూస్తే.. అట్లాస్ సైకిల్ మీద ఉన్న ఒక ఫోటో కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే అతని ప్రయాణం ఎక్కడ నుంచి మొదలైందో ఇట్టే తెలిసిపోతుంది. మొదట్లో క్రికెట్ ప్లేయర్‌గా అవ్వాలని కలలు కన్నాడు, కానీ ఆ కల.. కలగానే మిగిలిపోయింది. అయితే ఆ అభిరుచిని అలాగే కొనసాగిస్తూ ఆన్‌లైన్‌లో ఫాంటసీ క్రికెట్ ఎక్స్‌పర్ట్ అయ్యాడు. ప్రారంభంలో అతడు ఒక అట్లాస్ సైకిల్ వినియోగించేవాడని తెలుస్తోంది.

మారుతి డిజైర్ (Maruti Dzire)

అనురాగ్ ద్వివేది మొదటి కారు మారుతి కంపెనీకి చెందిన ఈ ‘డిజైర్’ అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎరుపు రంగులో చూడచక్కగా ఉన్న మారుతి డిజైర్ ముందు ద్వివేది ఉన్న ఫోటోలు కూడా చూడవచ్చు. మంచి డిజైన్ కలిగిన ఈ కారు ఉత్తమ పనితీరుని అందిస్తూ.. అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది.

బీఎండబ్ల్యూ  7 సిరీస్ (BMW 7 Series)

జర్మన్ బ్రాండ్ అయిన BMW యొక్క 7 సిరీస్ కూడా అనురాగ్ ద్వివేది గ్యారేజిలో ఉంది. ఇది ఐదవ తరం లగ్జరీ సెడాన్ కారుగా కనిపిస్తోంది. భారతీయ సెలబ్రిటీలు ఎక్కువ ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ఇది ఒకటి కావడం గమనార్హం. అనురాగ్ బీఎండబ్ల్యూ డీజిల్ వెర్షన్ అని తెలుస్తోంది.

ఫోర్డ్ ఎండీవర్ (Ford Endeavour)

అమెరికన్ కార్ల తయారీ సంస్థ అయిన ఫోర్డ్ యొక్క ఎండీవర్ కూడా ద్వివేది కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ కంపెనీ ప్రస్తుతం దేశీయ విఫణిలో తన కార్యకలాపాలను నిలిపివేసింది. అయినప్పటికీ కొందరు బ్రాండ్ కార్లను వినియోగిస్తూనే ఉన్నారు.

ఇక్కడ కనిపించే ఫోర్డ్ ఎండీవర్ 2.0 లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజిన్‌తో కూడిన BS6 వెర్షన్‌ అని తెలుస్తోంది. దీనిని ద్వివేది 2021లో కొనుగోలు చేసినట్లు సమాచారం. నలుపు రంగులో కనిపిస్తున్న ఈ కారు మంచి డిజైన్ మరియు అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ (Mercedes-Benz E-Class)

అనురాగ్ ద్వివేది గ్యారేజిలో జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బెంజ్ కంపెనీకి చెందిన ఈ-క్లాస్ కూడా ఉంది. నలుపు రంగులో ఉన్న ఈ కారుని యితడు తన ఫ్యామిలి కలిసి డెలివరీ తీసుకున్నట్లు సమాచారం. ఈ లగ్జరీ కారు 3.0 లీటర్ ఇన్‌లైన్ 6 ఇంజిన్ కలిగి 286 పీఎస్ పవర్ పవర్ 600 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మహీంద్రా థార్ (Mahindra Thar)

దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క థార్ SUV ని కూడా ద్వివేది కలిగి ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ ఆఫ్ రోడర్ కారుని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ద్వివేది కొనుగోలు చేసిన థార్ నలుపు రంగులోనే ఉంది.

బీఎండబ్ల్యూ జెడ్4 (BMW Z4)

మరో జర్మన్ లగ్జరీ కారు అయిన ‘బీఎండబ్ల్యూ జెడ్4’ స్పోర్ట్స్ కారును కూడా అనురాగ్ ద్వివేది కలిగి ఉన్నాడు. ఎరుపు రంగులో ఉన్న కారుని కొనుగోలు చేయడానికి ఢిల్లీలో ఈ కారుని డెలివరీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్పోర్ట్ కారు 3.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ ఇంజన్‌ కలిగి 335 Bhp పవర్ మరియు 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

Don’t Miss: బైకులు డీజిల్ ఇంజిన్‌తో ఎందుకు రావో తెలుసా? ఆసక్తికర విషయాలు!

ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 (Land Rover Defender 130)

తెలుపు రంగులో చూడచక్కగా ఉన్న ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 కూడా అనురాగ్ గ్యారేజిలో ఉంది. ఈ కారుని ఈ ఏడాది జూన్ నెలలో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సుమారు రూ. 1.41 కోట్ల ఎక్స్ షోరూమ్ ధర కలిగిం ఈ కారు 5 డోర్స్ 8 సీటర్ వెర్షన్. ఇది ఉత్తరప్రదేశ్‌లో డెలివరీ మొదటి కారు కావడం గమనార్హం.