24.7 C
Hyderabad
Saturday, March 15, 2025
Home Blog Page 8

నెక్సాన్ సిఎన్‌జీ రెడ్ డార్క్ ఎడిషన్: ఫిదా చేస్తున్న డిజైన్ & ధర ఎంతంటే?

0

Tata Nexon Red Dark Edition Launched: అమ్మకాల్లో అగ్రగామిగా ముందుకు సాగుతున్న టాటా మోటార్స్ యొక్క నెక్సాన్ సిఎన్‌జీ (Nexon CNG).. ఎట్టకేలకు రెడ్ డార్క్ ఎడిషన్ రూపంలో మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

వేరియంట్స్ & ధర

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త ‘టాటా నెక్సాన్ సిఎన్‌జీ రెడ్ డార్క్ ఎడిషన్’ (Tata Nexon CNG Red Dark Edition) మూడు వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అవి క్రియేటివ్ ప్లస్ ఎస్, క్రియేటివ్ ప్లస్ పీఎస్ మరియు ఫియర్‌లెస్ ప్లస్ పీఎస్. వీటి ధరలు వరుసగా రూ. 12.7 లక్షలు, రూ. 13.7 లక్షలు మరియు రూ. 14.5 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా). ఈ కారు ధర సాధారణ సిఎన్‌జీ కారు కంటే రూ. 20,000 ఎక్కువ.

డిజైన్

పేరుకు తగ్గట్టుగానే నెక్సాన్ సిఎన్‌జీ రెడ్ డార్క్ ఎడిషన్.. రెడ్ అండ్ డార్క్ కలర్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి కారులో అక్కడక్కడా.. రెడ్ కలర్ యాక్సెంట్స్ చూడవచ్చు. అంతే కాకుండా ఎక్స్‌టీరియర్ మొత్తం కార్బన్ బ్లాక్ పెయింట్ స్కీమ్ పొందుతుంది. రెడ్ లెథెరెట్ అపోల్స్ట్రే, రెడ్ స్టిచ్చింగ్ మరియు పియానో బ్లాక్ ఇంటీరియర్ వంటివి ఈ కారులో చూడవచ్చు.

ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్

కొత్త టాటా నెక్సాన్ సిఎన్‌జీ రెడ్ డార్క్ ఎడిషన్ యొక్క ఇంటీరియర్ కూడా రెడ్ అండ్ బ్లాక్ కలర్స్ పొందుతుంది. కాబట్టి ఇచ్చి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో 10.20 ఇంచెస్ డిజిటల్ స్క్రీన్స్, రియర్ ఏసీ వెంట్స్, క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎల్ఈడీ లైట్స్ మరియు వివిధ భాషలకు సపోర్ట్ చేసే పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

ఇంజిన్ డీటెయిల్స్

నెక్సాన్ సిఎన్‌జీ రెడ్ డార్క్ ఎడిషన్ చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. ఇంజిన్ మరియు పనితీరులో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఈ కారులో 1అదే .2 లీటర్ త్రీ సిలిండర్ టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది సిఎన్‌జీతో నడుస్తున్నప్పుడు.. 100 హార్స్ పవర్ మరియు 170 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది. కాబట్టి ఇది మంచి పనితీరును అందిస్తుంది.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో గొప్ప అమ్మకాలను పొందుతూ.. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న టాటా నెక్సాన్ 2017లో దేశీయ విఫణిలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి అనేక అప్డేట్స్ పొందుతూ.. ఇప్పుడు డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్ మరియు సిఎన్‌జీ రూపాల్లో అందుబాటులో ఉంది. కాగా ఇప్పుడు ఆధునిక హంగులతో సిఎన్‌జీ రెడ్ డార్క్ ఎడిషన్ రూపంలో మార్కెట్లో అడుగు పెట్టింది. ఇది కూడా తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుంది భావిస్తున్నాము.

ఇండియాలో నెక్సాన్ సేల్స్

భారతదేశంలో టాటా నెక్సాన్ లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 7 లక్షల కంటే ఎక్కువ మంది దీనిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ఈ కారుకు ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు కంపెనీ ఓ స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది, కాబట్టి మరిన్ని అమ్మకాలు నెక్సాన్ ఖాతాలో చేరే అవకాశం ఉంది. అంతే కాకుండా ఆధునిక కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అంతకంతకు పెరుగుతూ ఉండటంతో నెక్సాన్ ఈవీ అమ్మకాలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాము.

Also Read: ఐదు లక్షల మంది కొన్న ఏకైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఇదే!.. ధర తెలిస్తే మీరు కొనేస్తారు

నిజానికి కొంతమంది ఉన్న వాహనాలనే కొంత భిన్నంగా ఉండాలని కోరుకుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా అప్పుడప్పుడు సరికొత్త ఎడిషన్స్ లాంచ్ చేస్తున్నాయి. ఇప్పుడు టాటా మోటార్స్ లాంచ్ చేసిన కొత్త రెడ్ డార్క్ ఎడిషన్ కూడా స్టాండర్డ్ సిఎన్‌జీ కారుకు కొంత భిన్నంగా కనిపిస్తుంది.

పెళ్లి గురించి చెప్పిన జాన్వీ కపూర్.. నాకు కూడా అక్కడే అంటున్న ఖుషి

0

Janhvi Kapoor Speak About Her Marriage Place and More: తెలుగు సినీ పరిశ్రమలో చెప్పుకోదగ్గ మరియు అందరికి ఎంతోఇష్టమైన నటి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి.. అతిలోక సుందరిగా ఎదిగిన ఈమె ఇప్పుడున్న ఎంతోమంది సినీ ప్రముఖులకు ఆదర్శప్రాయం. ఈమె వారసురాలిగా తెరమీదకు వచ్చిన ‘జాన్వీ కపూర్’ (Janhvi Kapoor) కూడా తల్లికి తగ్గ కూతురుగా.. తనదైన రీతిలో ఎంతోమంది ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.

జాన్వీ కపూర్ మొదటి హిందీ సినీ పరిశ్రమలో.. తన కెరీర్ ప్రారంభించింది. కాగా దేవర సినిమాతో తెలుగు చిత్ర సీమలో కూడా అడుగుపెట్టింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్న ఈ అమ్మడు.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన కూడా నటించే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే.. టాలీవుడ్ పరిశ్రమలో కూడా జాన్వికి మంచి అవకాశాలు వస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఎనలేని భక్తి

ఇదిలా ఉండగా ‘జాన్వీ కపూర్’కు తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ఎనలేని భక్తి. ఎందుకంటే.. తన తల్లికి కూడా ఆ దేవదేవుడంటే అమితమైన భక్తి, ఈ కారణంగానే శ్రీదేవి బతికున్న రోజుల్లో చాలాసార్లు స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇప్పుడు ఆ విధానాన్నే జాన్వీ కపూర్ కూడా వారసత్వంగా పాటిస్తోంది. దీంతో ఏడాదికి కనీసం నాలుగైదు సార్లు అయినా.. ఈమె తిరుమల దేవుణ్ణి దర్శించుకుంటుంది. అంతే కాకుండా శ్రీదేవి పుట్టిన రోజుకు, వర్థంతికి కూడా ఈమె తప్పకుండా తిరుమలకు మెట్లమార్గంలో కాలినడకన వెళ్తుంది.

కాగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పెళ్లి ప్రస్తావన వచ్చింది. పెళ్లి ఎక్కడ చేసుకుంటారు? పెళ్లి తరువాత ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? అనే ప్రశ్నకు.. జాన్వీ కపూర్ సమాధానం ఇస్తూ, నేను తిరుమలలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్లి తరువాత కూడా భర్తతో కలిసి తిరుమలలోనే ఉండాలనుకుంటున్నాను అని వెల్లడించింది. జాన్వీ కపూర్ సమాధానం ఎంతోమందిని ఫిదా చేసింది. సెలబ్రిటీలందరూ.. పెళ్లిళ్లు, పెళ్లి తరువాత ఉండే ప్రదేశాలు అన్నీ కూడా విదేశాలే. అలాంటిది.. శ్రీదేవి కుమార్తె.. తిరుమలలో దేవదేవుని చెంత ఉండాలనుకోవడం ప్రశంసనీయం.

పెళ్లిపై ఖుషి కపూర్ వ్యాఖ్యలు

జాన్వీ కపూర్ మాదిరిగానే.. శ్రీదేవి చిన్న కూతురు, జాన్వీ చెల్లెలు ఖుషి కపూర్ కూడా తన పెళ్లి గురించి ప్రస్తావించింది. తనకు పెళ్లిపై చాల గౌరవం ఉందని, అందుకే బంధువులు.. సన్నిహితుల పెళ్ళిలో ఎక్కువగా కనిపిస్తుంటానని చెప్పింది. నేను కూడా అక్క మాదిరిగానే తిరుమలలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. పెళ్లి తరువాత.. మా నాన్న మాతోనే ఉండాలని ఖుషి కపూర్ చెప్పుకొచ్చింది. నేను, నా భర్త, చాలా పెంపుడు కుక్కలు.. జీవితం ఇలా ఉండేలా ఊహించుకుంటానని ఆమె వెల్లడించింది.

అందాల తార శ్రీదేవి కూతుళ్లు ఇద్దరూ.. తిరుమలలోనే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మంచి విషయం. సినీతారనటందరూ.. పెళ్ళికి ఇతర దేశాలు ఎంచుకుంటున్న వేళ ముంబైకి చెందిన అక్క చెల్లెల్లు (జాన్వీ, ఖుషి కపూర్) తిరుమల నాధుని చెంత పెళ్లి చేసుకోవాలనుకోవడం.. ఎందోమందికి ఆదర్శనీయం. కాబట్టి వారు అనుకున్న విధంగా తిరుమలలోనే పెళ్లి జరగాలని ఆశిద్దాం అని నెటిజన్లు చెబుతున్నారు.

జాన్వీ కపూర్ నెట్‍వర్త్

ఖుషి కపూర్ 2023లో సినీ రంగ ప్రవేశం చేసి.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా ఇప్పుడు ఈమె ‘లవ్ యాపా’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 7న తెరమీదకు రానుంది. ఇది తమిళంలో సూపర్ హిట్ మూవీ అయిన ‘లవ్ టుడే’ చిత్రానికి రీమేక్ అని తెలుస్తోంది. దీనికి కూడా ప్రదీప్ రంగనాథ్ నిర్మాతగా ఉన్నారు.

Also Read: దేవర భామ ‘జాన్వీ కపూర్’ కొత్త కారు ఇదే!.. ధర తెలిస్తే షాకవుతారు

ఇక జాన్వీ కపూర్ విషయానికి వస్తే.. అటు సినిమాలు, ఇటు లెక్కకు మించిన యాడ్స్ చేస్తూ బిజీగా ఉంది. ఈమె లెక్సస్ ఎల్ఎమ్, రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 250 డీ, బీఎండబ్ల్యూ ఎక్స్5 మరియు లెక్సస్ ఎల్ఎక్స్ 570 అనే ఖరీదైన కార్లను ఉపయోగిస్తోంది. సినీరంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న జాన్వీ కపూర్ నెట్‍వర్త్ రూ. 82 కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది. కాగా ఈమె ఒక సినిమాలో నటించడానికి సుమారు రూ. 5 కోట్ల కంటే ఎక్కువ తీసుకుంటుందని సమాచారం.

ఐదు లక్షల మంది కొన్న ఏకైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఇదే!.. ధర తెలిస్తే మీరు కొనేస్తారు

0

Royal Enfield Hunter 350 Bike Sales Cross 5 Lakh Units: ఇండియన్ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) బైకులకు మంచి డిమాండ్ ఉందన్న విషయం జగమెరిగిన సత్యం. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కంపెనీ దేశీయ విఫణిలో ఎప్పటికప్పుడు కొత్త బైకులను లాంచ్ చేస్తూ.. వాహన ప్రియులను ఆకర్షిస్తోంది. అంతే కాకుండా ప్రత్యర్థులకు కూడా గట్టి పోటీ ఇస్తోంది. కాగా ఇటీవల కంపెనీ యొక్క 350 సీసీ మోడల్ ‘హంటర్ 350’ (Hunter 350) అమ్మకాల్లో అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 2022 ఆగష్టు ప్రారంభంలో హంటర్ 350 బైకును మార్కెట్లో లాంచ్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంస్థ దీనిని ఐదు లక్షల మందికి విక్రయించినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే.. మార్కెట్లో ఈ బైకుకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

2.5 ఏళ్లలో ఐదు లక్షలు

2023 ఫిబ్రవరి నాటికి 1 లక్ష యూనిట్ల విక్రయాలను సాధించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్.. ఆ తరువాత ఐదు నెలల్లో (జులై) మరో లక్ష యూనిట్ల అమ్మకాలను సాధించగలిగింది. దీంతో రెండు సంవత్సరాలు పూర్తి కాకుండానే ఈ బైకును రెండు లక్షల మంది కొనుగోలు చేశారు. కాగా ఇప్పటికి 5 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకుంది. అంటే.. ఈ బైక్ మార్కెట్లో లాంచ్ అయిన 2.5 సంవత్సరాలలో ఐదు లక్షల సేల్స్ మైలురాయిని చేరుకుంది.

రూ. 1.50 లక్షల నుంచి రూ. 1.75 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ధర వద్ద లభిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ బ్రాండ్ యొక్క పోర్ట్‌ఫోలియోలోనే అత్యంత సరసమైన మోటార్‌సైకిల్‌గా ప్రజాదరణ పొందింది. కాగా కంపెనీ ఈ బైకును ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా.. ఇండోనేషియా, జపాన్, కొరియా, థాయిలాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూకే, అర్జెంటీనా మరియు కొలంబియా వంటి దేశాల్లో కూడా విక్రయిస్తోంది. మెక్సికో, ఆస్ట్రేలియా మరియు బ్రెజిల్, న్యూజిలాండ్ దేశాల్లో కూడా ఈ బైక్ సేల్స్ సాగుతున్నాయి.

మల్టిపుల్ కలర్ ఆప్షన్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ ఫ్యాక్టరీ బ్లాక్, డాపర్ వైట్, డాపర్ గ్రే, రెబెల్ బ్లాక్, రెబెల్ బ్లూ, రెబెల్ రెడ్ వంటి మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ కలర్ స్కీమ్‌లలో మాత్రమే కాకుండా కంపెనీ గత ఏడాది డాపర్ ఆరెంజ్ మరియు డాపర్ గ్రీన్ అనే రెండు కొత్త కలర్స్ కూడా ప్రవేశపెట్టింది.

హంటర్ 350 బైక్.. 349 సీసీ సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ పొందుతుంది. ఇది 6100 ఆర్‌పిఎమ్ వద్ద 20.11 బిహెచ్‌పీ పవర్, 27 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. కాబట్టి ఇది అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. నగర ప్రయాణానికి, రోజువారీ ప్రయాణానికి కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

అత్యంత ప్రజాదరణ పొందిన హంటర్ 350 బైక్ యొక్క ముందు భాగంలో టెలిస్కోపిక్ పోర్కులు, వెనుక వైపు ట్విన్ షాక్ అబ్జార్బర్ వంటివి ఉన్నాయి. సస్పెన్షన్ కూడా చాలా దృఢంగా ఉంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఈ బైక్ రెండు చివర్లలో డిస్క్ బ్రేస్క్ ఉంటాయి. అయితే డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఆఫర్‌లో ఉంటుంది. అయితే బేస్ వేరియంట్ యొక్క ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ఉన్నాయి.

Also Read: రూ.1.69 లక్షలకే కొత్త బైక్.. మొదటి 100 మందికి సూపర్ బెనిఫిట్!

హంటర్ 350కు ఎందుకంత డిమాండ్

సాధారణంగా చాలామందికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొనాలని ఉంటుంది. కానీ ధర కొంత ఎక్కువగా ఉండటం వల్ల కొంత వెనుకడుగు వేస్తారు. అయితే హంటర్ 350 ధర కొంత తక్కువే. కాబట్టి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉపయోగించాలని ఆశపడేవారు.. ఎక్కువగా ఈ బైకును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అంతే కాకుండా ఇది ఆకర్షణీయమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ కలిగి.. రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కారణాల వల్ల ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. దీంతో అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి.

రూ.1.69 లక్షలకే కొత్త బైక్.. మొదటి 100 మందికి సూపర్ బెనిఫిట్!

0

Keeway K300 SF Launched In India: భారతీయ ఆటో మొబైల్ మార్కెట్లో రోజు రోజుకి గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగానే లెక్కకు మించిన వాహనాలు దేశీయ విఫణిలో లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో తాజాగా హంగేరి బేస్డ్ కంపెనీ మరియు ఆదీశ్వర్ ఆటో రైడ్ ద్వారా రిటైల్ చేస్తున్న కీవే (Keeway) ఎట్టకేలకు కే300 ఎస్ఎఫ్ (K300 SF) పేరుతో ఓ కొత్త బైక్ లాంచ్ చేసింది.

ధర

కీవే లాంచ్ చేసిన సరికొత్త కే300 ఎస్ఎఫ్ బైక్ ధర రూ. 1.69 లక్షలు (ఎక్స్ షోరూమ్) మాత్రమే. ఈ ధర మొదటి 100 మంచి కస్టమర్లకు లేదా 100 మంది కొనుగోలుదారులకు మాత్రమే. ఆ తరువాత ధరలలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ బైక్ సీకేడీ మార్గం ద్వారా దిగుమతి అవుతుంది.

చూడటానికి కీవే కే300ఎన్ మాదిరిగా అనిపించినప్పటికీ.. కే300 ఎస్ఎఫ్ కొన్ని అప్డేట్స్ కలిగి ఉండటం గమనించవచ్చు. అప్డేటెడ్ డీకాల్స్, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ మరియు డిజిటల్ కన్సోల్ వంటివన్నీ కూడా ఇందులో గమనించవచ్చు. ఈ బైక్ రెడ్, బ్లాక్ మరియు వైట్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కొంత తక్కువ ధరలో.. ఓ మంచి స్ట్రీట్ ఫైటర్ బైక్ కావాలనుకునే వారికి ఇది తప్పకుండా మంచి ఎంపిక అవుతుంది.

ఇంజిన్ డీటెయిల్స్

కీవే కే300 ఎస్ఎఫ్ బైక్ 249.4 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8750 rpm వద్ద 27.1 హార్స్ పవర్ మరియు 7000 rpm వద్ద 25 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది స్లిప్పర్ క్లచ్‌తో కూడిన 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కాబట్టి ఇది అద్భుతమైన పనితీరును అందిస్తుంది.

కీవే కే300 ఎస్ఎఫ్ బైక్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్‌తో ఒకే సింగిల్ డిస్క్ బ్రేక్, యూఎస్‍డీ ఫోర్క్, మోనోషాక్ వంటి వాటిని పొందుతుంది. కాబట్టి ఇది మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇది రోజువారీ ప్రయాణానికి మాత్రమే కాకుండా.. లాంగ్ రైడ్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

భారతీయ మార్కెట్లో తక్కువ ధర వద్ద, మంచి పర్ఫామెన్స్ అందించే బైకులలో ఒకటైన కీవే కే300 ఎస్ఎఫ్.. హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్, టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 310, కేటీఎమ్ డ్యూక్, సుజుకి జిక్సర్ 250 మరియు బీఎండబ్ల్యూ జీ310ఆర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము.

మార్కెట్లోని కీవే బైక్

భారతీయ మార్కెట్లో కీవే బ్రాండ్ ఇప్పటికే ఎస్ఆర్ 125, ఎస్ఆర్ 250, కే300 ఆర్, వీ302 సీ, సిక్స్టీస్ 300ఐ (Sixties 300i), విస్టే 300 (Veste 300) మరియు కే300 ఎన్ వంటి వాటిని విక్రయిస్తోంది. కాగా ఇప్పుడు కంపెనీ కే300 ఎస్ఎఫ్ పేరుతో మరో బైక్ లాంచ్ చేసింది. మొత్తం మీద కంపెనీ దేశీయ విఫణిలో తన ఉనికిని చాటుకోవడానికి మాత్రమే కాకుండా.. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైందని స్పష్టమవుతోంది.

Also Read: కొత్త కారవ్యాన్ కొనుగోలు చేసిన ‘ప్రకాష్ రాజ్’ – ఇంద్రభవనమా అంటున్న నెటిజన్స్!

కంపెనీ అందిస్తున్న బైకులలో అత్యంత సరసమైన బైక్ ఎస్ఆర్ 125. దీని ధర రూ. 1.19 లక్షలు (ఎక్స్ షోరూమ్) మాత్రమే. 2022లో మార్కెట్లో అడుగుపెట్టిన ఈ బైక్ సింపుల్ డిజైన్ కలిగి.. అత్యుత్తమ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 125 సీసీ సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 9000 rpm వద్ద 9.5 Bhp పవర్ 7500 rpm వద్ద 8.2 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14.5 లీటర్లు. కాబట్టి ఇది మంచి రైడింగ్ అనుభూతిని అందించడమే కాకుండా.. లాంగ్ రైడ్ చేయడానికి కూడా అనుమతిస్తుంది. ఈ కారణంగానే చాలామంది బైక్ లవర్స్ దీనిని (ఎస్ఆర్ 125) ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.

కొత్త కారవ్యాన్ కొనుగోలు చేసిన ‘ప్రకాష్ రాజ్’ – ఇంద్రభవనమా అంటున్న నెటిజన్స్!

0

Famous Actor Prakash Raj Buys New Caravan: ఏ పాత్రలో అయినా.. ఏ భాషలో అయినా.. ఇట్టే ఇమిడిపోయే నటుడు ప్రకాష్ రాజ్. ఈ విషయం దాదాపు అందరికి తెలిసిందే. తెలుగు భాషలో మాత్రమే కాకుండా.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ మొదలైన భాషా చిత్రాల్లో నటింటి అనేక ఉత్తమ అవార్డులు పొందిన ఈయన ఆటో మొబైల్ ఔత్సాహికులలో ఒకరు. ఈ కారణంగానే.. ఎప్పటికప్పుడు తనకు నచ్చిన వాహనాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. కాగా తాజాగా క్యాంపర్ వ్యాన్ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నటుడు ప్రకాష్ రాజ్ కొనుగోలు చేసిన క్యాంపర్ వ్యాన్.. ఫోర్స్ అర్బెనియా అని తెలుస్తోంది. కుటుంబంతో కలిసి క్యాంపింగ్‌కు వెళ్ళడానికి దీనిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యాన్‌ను ప్రకాష్ రాజ్ తన కోసం ప్రత్యేకంగా రూపొందించామని తయారీదారు వెల్లడించారు. అంతే కాకుండా.. దీనిని ఢిల్లీలో రూపొందించి, సుమారు 2200 కిమీ దూరంలో.. మైసూర్‌లో ఉన్న ప్రకాష్ రాజ్‌కు డెలివరీ చేశారు.

ప్రకాష్ రాజ్ క్యాంపర్ వ్యాన్

నటుడు ప్రకాష్ రాజ్‌కు క్యాంపర్ వ్యాన్ అప్పగించడానికి ముందే.. ఈ వెహికల్ సర్వీస్ గురించి కూడా డెలివరీ చేసిన వ్యక్తులు వెల్లడించారు. అంతే కాకుండా దీని డిజైన్ వంటి వాటి గురించి కూడా పేర్కొన్నారు. లైటింగ్ సెటప్, లోపల సోఫాలు, ఏసీ సెటప్, వెనుక భాగంలో చిన్న కిచెన్, లోపల వైపున చిన్న టాయిలెట్ వంటివన్నీ చాలా అనుకూలంగా.. అద్భుతంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

కారవ్యాన్‌ను డెలివరీ చేసుకున్న తరువాత.. నటుడు ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, తాను ఊహించిన విధంగానే వ్యాన్‌ను అభివృద్ధి చేశారని తయారీదారులు మెచ్చుకున్నారు. అంతే కాకుండా తన చాలా ఆనందగా ఉందని పేర్కొన్నారు.

ప్రకాష్ రాజ్ కార్ కలెక్షన్

నటుడు ప్రకాష్ రాజ్ కారవ్యాన్ డెలివరీ చేసుకోవడానికి ముందే.. మహీంద్రా థార్ మరియు ల్యాండ్ రోవర్ డిఫెండర్ వంటి వాటిని కలిగి ఉన్నట్లు సమాచారం.

మహీంద్రా థార్

సినీ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు ప్రకాష్ రాజ్ గ్యారేజిలో మహీంద్రా థార్ ఉంది. దీనిని ఈయన 2021లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ కొనుగోలు చేసిన కారు న్యాపోలీ బ్లాక్ కలర్‌లో చూడచక్కగా ఉంది. ఇది ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ పొందిన టాప్ ఎండ్ మోడల్ ఎల్ఎక్స్ అని తెలుస్తోంది. దీని ధర రూ. 16.28 లక్షలు (ఎక్స్ షోరూమ్).

ఇండియన్ మార్కెట్లో ఎక్కువమంది వాహన ప్రియులను ఆకర్శించిన ఆఫ్-రోడర్లలో ఒకటి.. మహీంద్రా థార్. ఇది ఎల్ఈడీ డీఆర్ఎల్, అల్లాయ్ వీల్స్, హార్డ్ రూఫ్‌టాప్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, ఐసోఫిక్స్ సీట్లు మొదలైనవి పొందుతుంది. ఇది 2.0 లీటర్ ఎంస్టాలిన్ 150 టీజీజీఐ మరియు 2.2 లీటర్ ఎంహాక్ 130 ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇవి రెండూ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతాయి. కాబట్టి అత్యుత్తమ పనితీరును అందిస్తాయి.

ల్యాండ్ రోవర్ డిఫెండర్

ప్రకాష్ రాజ్ గ్యారేజిలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ కూడా ఉన్నట్లు సమాచారం. గతంలో ఈయన డిఫెండర్ కారులో ప్రయాణిస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన చాలా వివరాలు అందుబాటులో లేదు. ఎందుకంటే.. ఈ కారులో ప్రకాష్ రాజ్ కనిపించిన సన్నివేశాలు చాలా తక్కువే అనే చెప్పాలి.

ల్యాండ్ రోవర్ కార్లను కలిగి ఉన్న సెలబ్రిటీలు

భారతదేశంలో చాలామంది సెలబ్రిటీలు ల్యాండ్ రోవర్ కార్లను కలిగి ఉన్నారు. ఈ జాబితాలో అర్జున్ కపూర్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, మలైకా అరోరా, రణబీర్ కపూర్, అలియా భట్, ఆయుష్ శర్మ, అనుష్క శర్మ, పృద్విరాజ్, కరీనా కపూర్, అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, సన్నీ డియోల్, సునీల్ శెట్టి మరియు విరాట్ కోహ్లీ మొదలైనవారు ఉన్నారు. వీరందరూ.. కూడా ఈ కార్లను రోజువారీ వినియోగానికి ఉపయోగిస్తున్నట్లు సమాచారం.

Also Read: హిందూపూర్ ఎంఎల్ఏ ‘బాలయ్య’ వాడే రూ.4 కోట్ల కారు గురించి తెలుసా!

ల్యాండ్ రోవర్ కార్లను ఇష్టపడి కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం.. వాటి డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాదు. వీటి బెస్ట్ పర్ఫామెన్స్ కూడా. ఈ కార్లు రోజువారీ వినియోగానికి మాత్రమే కాకుండా.. లాంగ్ డ్రైవ్ వంటి వాటికి కూడా ఈ మోడల్ కార్లు అద్భుతంగా ఉంటాయి.

మూడు కోట్లమంది మెచ్చిన స్కూటర్.. ఇప్పుడు సరికొత్త హంగులతో: ధర రూ.80950 మాత్రమే!

0

2025 Honda Activa Launched in India: ఇండియన్ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు పొందిన ‘హోండా మోటార్‌సైకిల్’ (Honda Motorcycle) బ్రాండ్ యాక్టివా (Activa) ఇప్పుడు సరికొత్త హంగులతో 2025 ఎడిషన్‌గా లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ అప్డేటెడ్ మోడల్ డిజైన్, ఫీచర్స్ మరియు వేరియంట్స్, ధరలను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

వేరియంట్స్ & ధరలు

2025 హోండా యాక్టివా స్కూటర్ ‘ఎస్టీడీ, డీఎల్ఎక్స్ మరియు హెచ్-స్మార్ట్’ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే కంపెనీ బేస్ వేరియంట్ ధరలను మాత్రమే ప్రస్తుతానికి అధికారికంగా ప్రకటించింది. మిగిలిన వేరియంట్ల ధరలను వెల్లడించాల్సి ఉంది. కాబట్టి యాక్టివా బేస్ వేరియంట్ ధర రూ. 80,950 (ఎక్స్ షోరూమ్). ఇది దాని స్టాండర్డ్ వేరియంట్ కంటే రూ. 2,266 ఎక్కువని తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే.. మిగిలిన వేరియంట్స్ ధరలు కూడా కొంత ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.

బుకింగ్స్ & కలర్ ఆప్షన్స్

హోండా కొత్త యాక్టివా కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కాబట్టి దీనిని బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కంపెనీ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

2025 యాక్టివా స్కూటర్ ఆరు రంగుల్లో లభిస్తుంది. అవి పెర్ల్ ప్రెసియస్ వైట్, డీసెంట్ బ్లూ మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ యాక్సెస్ గ్రే మెటాలిక్, రెబెల్ రెడ్ మెటాలిక్ మరియు పెర్ల్ సైరన్ బ్లూ కలర్స్. ఇవన్నీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

డిజైన్ & ఫీచర్

కొత్త హోండా యాక్టివా స్కూటర్ చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి అదే హెడ్‌లైట్, టెయిల్ లైట్ మరియు ఇండికేటర్స్ ఉంటాయి. అయితే ఇందులో కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ చూడవచ్చు. ఇందులో 4.2 ఇంచెస్ TFT కలర్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది మైలేజ్ ఇండికేటర్, ట్రిప్ మీటర్, ఎకో ఇండికేటర్ వంటి సమాచారం అందిస్తుంది. అంతే కాకుండా మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి ఇందులో USB టైప్ సీ ఛార్జింగ్ ఫోర్ట్ కూడా లభిస్తుంది. కాబట్టి ఇది వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇంజిన్ డీటెయిల్స్

కొత్త 2025 హోండా యాక్టివా స్కూటర్ 109.51 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8000 rpm వద్ద 7.8 Bhp పవర్ మరియు 5500 rpm వద్ద 9.05 Nm టార్క్ అందిస్తుంది. ఇంధనాన్ని పొదుపు చేయడానికి కంపెనీ.. ఇందులో ఐడ్లింగ్ స్టార్ట్ – స్టాప్ సిస్టం అందించింది. కాబట్టి ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ మైలేజ్ అందిస్తుంది.

టీవీఎస్ జుపీటర్, హీరో ప్లెజర్ ప్లస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే ఈ కొత్త యాక్టివా స్కూటర్.. ఇండియన్ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. ఇప్పటికే కంపెనీ తన సాధారణ యాక్టివా లేదా మునుపటి యాక్టివాను లక్షల యూనిట్ల విక్రయాలను విజయవంతంగా పూర్తి చేసింది. కాబట్టి ఇప్పుడు మార్కెట్లో లాంచ్ అయిన 2025 యాక్టివా కూడా మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంది.

Also Read: ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన లగ్జరీ కార్లు ఇవే.. చూశారా?

కంపెనీ తన కొత్త హోండా యాక్టివా స్కూటర్ లాంచ్ చేసిన సందర్భంగా.. హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ సీఈఓ, ఎండీ సుత్సుము ఒటాని మాట్లాడుతూ.. భారతీయ కస్టమర్లకు అప్డేటెడ్ లేదా కొత్త వాహనాలను అందించడానికి సంస్థ ఎప్పుడూ కట్టుబడి ఉంది. 2025 యాక్టివా మోడల్ కావాలనుకునే వారికి.. ఇప్పుడు మార్కెట్లో లాంచ్ అయిన కొత్త స్కూటర్ తప్పకుండా మంచి ఎంపిక అవుతుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ వంటి వాటితో పాటు TFT డిస్‌ప్లే కూడా పొందుతుంది. కాబట్టి ఇది తప్పకుండా ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షిస్తుందని.. మంచి అమ్మకాలు పొందుతుందని ఆశిస్తున్నాము.

మార్కెట్లో హోండా యాక్టివా సేల్స్

2001లో లాంచ్ అయిన.. హోండా యాక్టివా కాలక్రమంలో అనేక అప్డేట్స్ పొందింది. 2023 జూన్ నాటికి కంపెనీ యాక్టివాను ఏకంగా మూడు కోట్ల కంటే ఎక్కువ మందికి విక్రయించింది. దీన్ని బట్టి చూస్తే.. యాక్టివాకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 2025 మోడల్ యాక్టివా కూడా కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము.

ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన లగ్జరీ కార్లు ఇవే.. చూశారా?

0

Luxury Cars in Bharat Mobility Expo 2025: జనవరి 17 నుంచి 22 వరకు జరిగిన ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025’లో చాలా వాహన తయారీ సంస్థలు.. లెక్కకు మించిన బైకులను, కార్లను ఆవిష్కరించాయి. ఇందులో భారతీయ కంపెనీలు మాత్రమే కాకుండా.. విదేశీ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ కథనంలో ఆటో ఎక్స్‌పో వేదికగా ఇండియాలో అడుగుపెట్టిన లగ్జరీ కార్లను గురించి వివరంగా తెలుసుకుందాం.

ఎంజీ మెజెస్టర్ (MG Majestor)

మోరిస్ గ్యారేజ్ (MG Motor) కంపెనీ తన ‘మెజెస్టర్’ కారును ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఈ కారును సంస్థ 2025 ఫిబ్రవరి 18న మార్కెట్లో లాంచ్ చేయనుంది. దీని ధర రూ. 40 లక్షల నుంచి రూ. 46 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది. ఒక్క చూపుతోనే ఆకట్టుకునే డిజైన్ కలిగిన ఈ కారు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడిన 1996 సీసీ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. కాబట్టి ఇది అద్భుతమైన పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము.

మెజెస్టర్ కారు పెద్ద గ్రిల్, మాస్కులర్ బాడీ క్లాడింగ్, సొగసైన ఎల్ఈడీ హెడ్‌లైట్స్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం వంటి వాటిని పొందుతుంది. ఇది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కొడియాక్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

ఎంజీ సైబర్‌స్టర్ (MG Cyberster)

భారతదేశంలో అడుగుపెట్టిన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్ కారు ఈ ఎంజీ సైబర్‌స్టర్. లంబోర్ఘిని స్టైల్ డోర్స్ కలిగిన ఈ కారు ఓ కన్వర్టిబుల్ కారు మాదిరిగా ఉంది. దీని ధర రూ. 60 లక్షల నుంచి రూ. 70 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ కారులో 77 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుందని సమాచారం. ఇది 580 కిమీ రేంజ్ అందిస్తుంది. కొత్త డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

బీఎండబ్ల్యూ ఎక్స్3 (BMW X3)

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తన ‘ఎక్స్3’ కారును మార్కెట్లో.. ఆటో ఎక్స్‌పో వేదికగా లాంచ్ చేసింది. కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. రూ. 75.80 లక్షల ఖరీదైన ఈ కారు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఆప్షన్లలో లభిస్తుంది. లేటెస్ట్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగిన ఈ కారు.. అధునాతన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. పనితీరు కూడా ఉత్తమంగా ఉంటుంది.

బీఎండబ్ల్యూ ఐఎక్స్1 ఎల్‌డబ్ల్యుబీ (BMW iX1 LWB)

లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ లాంచ్ చేసిన మరో కారు ‘ఐఎక్స్1 ఎల్‌డబ్ల్యుబీ’. ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులో 66.4 కిలోవాట్ బ్యాటరీ 531 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది కేవలం 8.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులోని పొడవైన వీల్‌బేస్ ఇంటీరియర్ స్పేస్‌ను మెరుగుపరుస్తుంది. ఈ కారులో పనోరమిక్ సన్‌రూఫ్ మరియు ఏడీఏఎస్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా పొందుతుంది. కాబట్టి ఇది మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

స్కోడా కొడియాక్ (SKoda Kodiaq)

చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా కూడా 2025 ఆటో ఎక్స్‌పోలో తన కొడియాక్ కారును ప్రదర్శించింది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభించనుంది. దీని ధరను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇది 40 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. పటిష్టమైన డిజైన్ కలిగిన ఈ కారు, అధునాతన ఫీచర్స్ కూడా పొందుతుంది.

స్కోడా సూపర్బ్ (Skoda Superb)

ఆటో ఎక్స్‌పో 2025లో కనిపించిన మరో స్కోడా కారు సూపర్బ్. ఈ కారుకు సంబంధించిన చాలా వివరాలను కంపెనీ వెల్లడించలేదు. కానీ.. ఈ కారు విలాసవంతమైన డిజైన్, ఫీచర్స్ పొందుతుందని స్పష్టమవుతోంది. దీని ధర రూ. 50 లక్షల వరకు ఉంటుందని అంచనా. దీనికి సంబంధించిన చాలా వివరాలు రాబోయే రోజుల్లో అధికారికంగా వెల్లడవుతాయి.

హ్యుందాయ్ స్టారియా (Hyundai Staria)

స్టారియా అనే కారు కూడా ఆటో ఎక్స్‌పోలో హ్యుందాయ్ ఆవిష్కరించింది. సొగసైన డిజైన్, విశాలవంతమైన ఫీచర్స్ కలిగిన ఈ కారు ధర రూ. 60 లక్షల కంటే ఎక్కువ అని సమాచారం. ఫ్యామిలీలను లక్ష్యంగా చేసుకుని కంపెనీ ఈ కారును లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఇది అన్ని విధాలా.. రోజువారీ వినియోగానికి మరియు లాంగ్ డ్రైవ్ వంటి వాటికి ఇచ్చి చాలా అనుకూలంగా ఉంటుంది.

Also Read: ఆటో ఎక్స్‌పో 2025లో హీరో.. ఒకేసారి నాలుగు వెహికల్స్

భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పోలో లగ్జరీ కార్లు మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ కార్లు, కాన్సెప్ట్ మోడల్స్ కూడా కనిపించాయి. ఆరు రోజులు జరిగిన ఈ కార్యక్రమానికి మీడియా ప్రతినిధులు, ప్రముఖ వ్యాపారవేత్తలు మాత్రమే కాకుండా.. వేలాదిమంది వాహన ప్రేమికులు కూడా హాజరయ్యారు. కాగా ఈ ఈవెంట్ మళ్ళీ రెండేళ్ల తరువాత జరగనుంది.

తండ్రికి మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన రింకూ సింగ్: అదేంటో తెలుసా?

0

Rinku Singh Kawasaki Ninja 400 Gift To Father: సినీ తారలు తమ తల్లిదండ్రులకు ఖరీదైన వాహనాలను గిఫ్ట్స్ ఇచ్చిన సంఘటనలు గతంలో చాలానే తీసుకున్నాం. ఇప్పుడు ప్రముఖ ఇండియన్ క్రికెటర్ ‘రింకూ సింగ్’ (Rinku Singh) తన తండ్రి ఖాన్‌చంద్ర సింగ్‌కు ఒక ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ రింకూ గిఫ్ట్ ఇచ్చిన బైక్ ఏది? దాని ధర ఎంత? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

క్రికెటర్ రింకూ సింగ్.. తన తండ్రికి ఇచ్చిన బైక్ పేరు కవాసకి నింజా 400 (Kawasaki Ninja 400). ఈ బైక్ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 5 లక్షల కంటే ఎక్కువని తెలుస్తోంది. ఎక్కువమంది బైక్ లవర్స్.. ఇష్టపడి కొనుగోలు చేసే బైకులలో ఇది ఒకటి. ఇది అత్యుత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనించినట్లయితే.. రింకూ సింగ్ తండ్రి ఖాన్‌చంద్ర సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని వీధుల్లో బైక్ రైడ్ చేయడం చూడవచ్చు. ఈయన ఆ ప్రాంతంలోనే LPG సిలిండర్ పంపిణీ ఏజెన్సీలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి వీరు చాలా కష్టాలను చవి చూసి ఎదిగినవారు. కాబట్టే ఖాన్‌చంద్ర సింగ్ ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నారని చెబుతారు.

ఆర్ధిక కష్టాల నుంచి

ఆర్ధిక కష్టాల్లో మునిగి ఉన్నప్పుడు.. క్రికెట్ ఆడటం మానేసి, కుటుంబానికి సహాయం చేయడానికి ఏదైనా పని చేయాలని.. రింకూ సింగ్‌ను కోరినట్లు సమాచారం. అయితే రింకూ సింగ్ పట్టు వదలకుండా.. కష్టపడి అనుకున్నది సాధించి, కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టాడు. ఇప్పుడు లక్షల ఖరీదైన బైకును.. తన తండ్రి కోసం కొనుగోలు చేసి ఇచ్చాడు.

రింకూ సింగ్ తన తండ్రికి బైక్ గిఫ్ట్ ఇవ్వడం.. ఎంతో మంది నెటిజన్లను ఆకర్శించింది. అభిమానులు కూడా గొప్పగా ప్రశంసిస్తున్నారు. డెలివరీ తీసుకునే సమయంలో.. రింకూ సింగ్ సోదరుడు జీతూ సింగ్‌ను చూడవచ్చు. ఈ వీడియో షేర్ చేస్తూ.. తండ్రి తరువాత పెద్దన్నయ్య ఆశీర్వాదం అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కవాసకి నింజా 400 (Kawasaki Ninja 400)

భారతదేశంలో ఎక్కువమంది మనసు దోచిన సూపర్ బైకులలో ఒకటి ఈ ‘కవాసకి నింజా 400’. దేశీయ మార్కెట్లో 2018లో లాంచ్ అయిన ఈ బైక్ ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). బిఎస్ 6 ఉద్గార ప్రమాణాల కారణంగా కంపెనీ దీని ఉత్పత్తిని ఆ తరువాత రోజుల్లో నిలిపివేసినప్పటికీ.. 2020లో బిఎస్6 వెర్షన్ రూపంలో మళ్ళీ లాంచ్ అయింది.

399 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ కలిగిన కవాసకి నింజా 400 బైక్.. 45 పీఎస్ పవర్ మరియు 37 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కలిగిన ఈ బైక్ స్లిప్పర్ క్లచ్ అసిస్ట్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఈ బైకులో సెమీ డిజిటల్ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ హెడ్‌లైట్ ఉన్నాయి. ట్రెల్లిస్ ఫ్రేమ్ ఆధారంగా రూపొందించబడిన ఈ బైక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో ఫ్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ పొందుతాయి. ఈ బైక్ టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 మరియు కేటీఎమ్ ఆర్‌సీ 390 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

Also Read: శ్రీవల్లి (రష్మిక) వాడే కార్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే.. ఒక్కో కారు అంత రేటా?

కవాసకి బైక్ నింజా 400 బైక్ చూడగానే ఆకర్శించబడే డిజైన్ కలిగి, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇది రైడర్లకు కూడా అత్యుత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ కారణంగానే ఎక్కువమంది వీటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. కాగా ప్రస్తుతం కవాసకి కంపెనీ మార్కెట్లో లెక్కకు మించిన బైకులను లాంచ్ చేసి.. ఎంతోమంది వాహన ప్రియులను ఆకర్షిస్తోంది. రాబోయే రోజుల్లో కూడా కంపెనీ మరిన్ని బైకులను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. కాబట్టి తప్పకుండా ఈ బ్రాండ్ మరింత మంచి బైక్ ప్రేమికులను ఆకట్టుకోనుంది.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 567 కిమీ వెళ్లొచ్చు!: ఈ ఎలక్ట్రిక్ కారు గురించి తెలుసా?

0

BYD Sealion 7 Unveiled in India At Auto Expo 2025: ప్రముఖ చైనీస్ వాహన తయారీ సంస్థ ‘బిల్డ్ యువర్ డ్రీమ్’ లేదా బీవైడీ (BYD) ఆటో ఎక్స్‌పో 2025లో ‘సీలియన్ 7’ (Sealion 7) పేరుతో మరో ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. అంతే కాకుండా.. కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఈ కారును కంపెనీ ఎప్పుడు మార్కెట్లో లాంచ్ చేస్తుంది? బుకింగ్ ప్రైస్ ఎంత.. డెలివరీలు ఎప్పుడు, అనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

బుకింగ్ ప్రైస్ & డెలివరీలు

బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు కోసం రూ. 70,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. మార్చిలో డెలివరీలు ప్రారంభమవుతాయి. అయితే కంపెనీ ఈ కారు ధరలను ఫిబ్రవరి 17న అధికారికంగా వెల్లడించనుంది. సీలియన్ 7 అనేది బ్రాండ్ యొక్క నాల్గవ మోడల్. ఇది కాస్మోస్ బ్లాక్, అట్లాంటిస్ గ్రే, అరోరా వైట్ మరియు షార్క్ గ్రే అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారును ఫిబ్రవరి 17లోపు బుక్ చేసుకుంటే.. కంపెనీ అందించే అదనపు ప్రయోజనాలను (7 సంవత్సరాలు / 1.50 లక్షల కిమీ వారంటీ & ఫ్రీ ఇన్‌స్టాలేషన్‌తో ఫ్రీ 7 కిలోవాట్ ఛార్జర్) పొందవచ్చు.

డిజైన్ మరియు ఫీచర్స్

బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు అద్భుతమైన డిజైన్ పొందుతుంది. హెడ్‌ల్యాంప్ మరియు కెనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ సెటప్ వంటివి ఇక్కడ చూడవచ్చు. దూకుడుగా కనిపించే ఫ్రంట్ అండ్ రియర్ బంపర్ మరింత చూడచక్కగా ఉంటుంది. 4.8 మీటర్ల వరకు విస్తరించిన బీవైడీ సీలియన్ 2930 మిమీ వీల్‌బేస్ పొందుతుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారులో 15.6 ఇంచెస్ రొటేషన్ టచ్‌స్క్రీన్ డ్యాష్‌బోర్డ్ మధ్యలో ఉంటుంది. ఈ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ ద్వారా మెజారిటీ ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు, కంట్రోల్ చేయవచ్చు. ప్లోటింగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మెమరీ ఫంక్షన్‌తో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, సన్‌షేడ్‌తో కూడిన పనోరమిక్ గ్లాస్ రూఫ్, 50 వాట్స్ వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, హెడ్స్ ఆఫ్ డిస్ప్లే, కనెక్టెడ్ కార్ టెక్ మరియు పవర్డ్ టెయిల్ గేట్ మొదలైన అప్డేటెడ్ ఫీచర్స్ కూడా ఈ కారులో ఉన్నాయి.

కొత్త బీవైడీ సీలియన్ 7 కారు 11 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ఏడీఏఎస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం) వంటి టెక్నాలజీ కలిగి ఉంటుంది. కాబట్టి ఇది సురక్షితమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ కారులోని బూట్ స్పేస్ 520 లీటర్లు.. అయితే వెనుక సీట్లను మడతపెట్టడం వల్ల దీనిని 1789 లీటర్ల విస్తరించవచ్చు.

బ్యాటరీ & పర్ఫామెన్స్

బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు ప్రీమియం మరియు పర్ఫామెన్స్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ రెండూ కూడా 82.5 కిలోవాట్ లిథియం ఐరన్ ఫాస్పెట్ బ్లేడ్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది.

సీలియన్ ప్రీమియం వేరియంట్ రియర్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌లో 313 హార్స్ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇందులోని బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జితో 567 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది 6.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

పర్ఫామెన్స్ వేరియంట్ ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగి 530 హార్స్ పవర్, 690 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇందులోని బ్యాటరీ ప్యాక్ ఒక ఛార్జితో 542 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది 0 నుంచి 100 కిమీ / గం వేగవంతం కావడానికి పట్టే సమయం 4.5 సెకన్లు మాత్రమే. నిజానికి ఈ రేంజ్ అనేది వాస్తవ ప్రపంచంలో.. కొంత తగ్గే అవకాశం ఉంది.

Also Read: ఒకదాన్ని మించి.. మరొకటి: సరికొత్త హోండా స్కూటర్లు ఇవే..

అంచనా ధర & ప్రత్యర్థులు

బీవైడీ కంపెనీ తన సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు ధరలను అధికారికంగా ప్రకటించలేదు. కానీ దీని ధర రూ. 60 లక్షల వరకు ఉండొచ్చని సమాచారం. సీలియన్ ఎలక్ట్రిక్ కారుకు భారతీయ మార్కెట్లో ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు. కానీ ధరల పరంగా ఇది కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుందని సమాచారం.

ఒకదాన్ని మించి.. మరొకటి: సరికొత్త హోండా స్కూటర్లు ఇవే..

0

Honda Electric Scooters Launched in Auto Expo 2025: ఆటోమొబైల్ రంగం ఎలక్ట్రిక్ వైపు దూసుకెళ్తున్న సమయంలో ‘హోండా మోటార్‌సైకిల్’ (Honda Motorcycle) ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి.. తన కస్టమర్లను ఆకర్శించడానికి సరికొత్త టూ వీలర్స్ ఆవిష్కరించింది. ఇందులో యాక్టివా ఈ (Activa e) మరియు క్యూసీ1 (QC1) ఉన్నాయి. ఇవి రెండూ ఢిల్లీ వేదికగా జరుగుతున్న 2025 ఆటో ఎక్స్‌పో కార్యక్రమంలో కనిపించాయి. ఈ స్కూటర్ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.

హోండా యాక్టివా ఈ (Honda Activa e)

2024 డిసెంబర్ సమయంలో మార్కెట్లో అడుగుపెట్టిన హోండా యాక్టివా ఈ లేదా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలను కంపెనీ భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పో (ఆటో ఎక్స్‌పో 2025)లో అధికారికంగా ప్రకటించింది. దీని ధరలు రూ. 1.17 లక్షలు (బేస్ వేరియంట్), రూ. 1.52 లక్షలు (RoadSync Duo).

హోండా యాక్టివా ఈ స్కూటర్ రెండు స్వాపబుల్ 1.5 కిలోవాట్ బ్యాటరీలను పొందుతుంది. రేంజ్ 102 కిమీ వరకు ఉంది. గంటకు 80 కిమీ వేగంతో ప్రయాణించగల ఈ స్కూటర్ కేవలం 7.3 సెకన్లలో 0 నుంచి 60 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. బ్యాటరీ అనేది సీటు కింద ఉండటం వల్ల, ఉండరు సీట్ స్టోరేజ్ లభించే అవకాశం లేదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ స్కూటర్ యొక్క బ్యాటరీలను ఇంట్లో రీఛార్జ్ చేసుకోలేరు. హోండా పవర్ ప్యాక్ ఎక్స్‌ఛేంజర్ ఈ:స్వాపింగ్ స్టేషన్‌లలో మాత్రమే రీఛార్జ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ప్రస్తుతం ఓ పెద్ద సవాల్ అనే చెప్పాలి.

కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను త్వరలోనే షాప్ ఇన్ షాప్ కాన్సెప్ట్‌తో రెడ్ వింగ్ డీలర్‌ల ద్వారా విక్రయించనుంది. కంపెనీ లాంచ్ చేసిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు (యాక్టివా ఈ మరియు క్యూసీ1) రెండూ కర్ణాటకలోని హోండా యొక్క నర్సాపురా ప్లాంట్‌లో తయారవుతాయి. బెంగళూరులో కంపెనీకి చెందిన సుమారు 83 పవర్ ప్యాక్ ఈ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిని 2026 నాటికి 250కి చేర్చడానికి కంపెనీ సిద్ధమవుతోంది. కాగా ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో కూడా స్వాపింగ్ స్టేషన్స్ విస్తరించడానికి చూస్తోంది.

కంపెనీ తన యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను మొదట బెంగళూరు, ఢిల్లీ మరియు ముంబైలలో మాత్రమే ప్రారంభించనుంది. ఆ తరువాత దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు విస్తరించే అవకాశం ఉంది. భారతదేశంలో హోండా యాక్టివా ఎలక్ట్రిక్.. టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా, విడా వీ2, రివర్ ఇండీ మరియు ఓలా ఎస్1 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

హోండా క్యూసీ1 (Honda QC1)

ఆటో ఎక్స్‌పోలో కంపెనీ లాంచ్ చేసిన మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ‘హోండా క్యూసీ1’. దీని ధర రూ. 90,000. ధర తక్కువ ఉండటం వల్ల ఇది భారతీయ మార్కెట్లోని సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఒకటిగా నిలిచింది. ఈ స్కూటర్ 1.5 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 80 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 50 కిమీ కాగా.. ఇది కేవలం 9.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

హోండా క్యూసీ1 ఎలక్ట్రిక్ స్కూటర్ 330 వాట్స్ ఛార్జర్ ద్వారా ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 6 గంటల 50 నిముషాలు. కంపెనీ ఈ స్కూటర్ సీటు కింద బ్యాటరీలను ఫిక్స్ చేయడం వల్ల.. స్టోరేజ్ స్పేస్ లభించదు. కాగా USB ఛార్జర్‌తో పాటు మొబైల్ ఫోన్‌ను ఉంచడానికి మీకు ఆప్రాన్‌లో ఓ చిన్న కంపార్ట్‌మెంట్ లభిస్తుంది.

Also Read: రూ.3.25 లక్షలకే ఎలక్ట్రిక్ కారు: సోలార్ రూఫ్ కూడా గురూ..

ఐదు కలర్ ఆప్షన్లలో లభించే హోండా క్యూసీ1 డెలివరీలు ప్రారంభంలో ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్ మరియు చండీగఢ్ నగరాల్లో మాత్రమే మొదలవుతాయి. ఆ తరువాత ఇతర నగరాల్లో ప్రారంభమవుతాయని సమాచారం. కాగా ఈ స్కూటర్ కోసం కంపెనీ రూ. 1000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు ఏప్రిల్ 2025లో ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద హోండా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ చూడచక్కగా.. ఒక్క చూపుతోనే ఆకర్శించే విధంగా ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతోంది.