ఎలివేట్ స్పెషల్ ఎడిషన్.. ఫిదా చేస్తున్న డిజైన్: ధర ఎంతంటే?

ఇండియన్ మార్కెట్లో స్పెషల్ ఎడిషన్ కార్లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. దీనిని దృష్టిలో ఉందుకుని హోండా కంపెనీ.. ఎలివేట్ ఏడీవీ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది సాధారణ ఎలివేట్ కంటే కూడా కొంత భిన్నంగా ఉండటం చూడవచ్చు.

హోండా ఏడీవీ ఎడిషన్.. టాప్ స్పెక్ ఎలివేట్ జెడ్ఎక్స్ ట్రిమ్‌లో మాత్రమే లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 15.29 లక్షలు కాగా.. టాప్ వేరియంట్ ధర రూ. 16.66 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది మాన్యువల్, సీవీటీ అనే రెండు ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో లభిస్తుంది. ధరలు సాధారణ వేరియంట్ ధర కంటే కొంత ఎక్కువే అని స్పష్టమవుతుంది. కానీ ఇది చాలావరకు కాస్మొటిక్ అప్డేట్స్ పొందటం వల్ల.. చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.

డిజైన్ ఎలా ఉందంటే?

హోండా ఏడీవీ ఎడిషన్ చూడటానికి.. ఎలివేట్ సాధారణ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ, కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. ఇందులో ప్రధానంగా నారింజ రంగు డెకాల్స్. ఈ కారు ముందు భాగంలోని హుడ్.. నారింజ రంగు హైలైట్‌లతో డెకాల్స్ పొందుతుంది. గ్రిల్ కోసం బ్లాక్ సరౌండ్స్ చూడవచ్చు. హెడ్‌ల్యాంప్‌లను కనెక్ట్ చేసే ట్రిమ్.. క్రోమ్‌కు బదులుగా నలుపు రంగులో పూర్తి చేయబడి ఉండటం కనిపిస్తుంది.

సైడ్ ప్రొఫైల్.. ఫెండర్ వంటి వాటిపై ఏడీవీ గుర్తులను చూడవచ్చు. ముందు డోర్ మీద ఏడీవీ డెకాల్, బ్లాక్ అవుట్ రూఫ్ రెయిల్స్, అవుట్‌సైడ్ రియర్‌వ్యూ మిర్రర్స్, డోస్ హోల్డింగ్, విండ్ లైన్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, డోర్ హ్యాండిల్స్ కనిపిస్తాయి. సీ పిల్లర్ డ్యూయెల్ టోన్ వెర్షన్లలో మాత్రం బ్లాక్ చేసి ఉన్నాయి. 16 ఇంచెస్ ఆల్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ కూడా నారింజ రంగులో ఉండటం చూడవచ్చు.

రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. బంపర్ బాడీ కలర్ రియర్ స్కిడ్ ప్లేట్, ఆరంజ్ హైలెట్స్, టెయిల్ గేట్ మీద ఏడీవీ బ్యాడ్జ్ కనిపిస్తాయి. ఏడీవీ ఎడిషన్ మోనోటోన్, డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది మెటియోరాయిడ్ గ్రే మెటాలిక్ & లూనార్ సిల్వర్ మెటాలిక్ అనే రంగుల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఇంటీరియర్ డిజైన్ & ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే?

హోండా ఎలివేట్ ఏడీవీ ఎడిషన్.. పూర్తిగా బ్లాక్ కలర్ క్యాబిన్ పొందుతుంది. అయితే అక్కడక్కడా నారింజ రంగు యాక్సెంట్స్ కనిపిస్తాయి. సీట్లపై కూడా నారింజ రంగు కుట్లు ఉన్నాయి. ఏడీవీ లోగోలు కూడా కనిపిస్తాయి. ప్రత్యేకమైన యాంబియంట్ లైటింగ్ సెటప్ కూడా చూడవచ్చు.

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 360 డిగ్రీ కెమెరా ఉంది. మిగిలిన ఫీచర్స్ చాలావరకు జెడ్ఎక్స్ ట్రిమ్‌లో ఉన్నవే ఉన్నట్లు సమాచారం. కాగా సన్‌రూఫ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కూడిన 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 7 ఇంచెస్ సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 8 స్పీకర్ సౌండ్ సిస్టం, ఏడీఏఎస్ అండ్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటివెన్నో ఉన్నాయి.

పవర్‌ట్రెయిన్ వివరాలు

ఇంజిన్ విషయానికి వస్తే, ఎలివేట్ ఏడీవీ ఎడిషన్.. సాధారణ ఎలివేట్ మాదిరిగానే 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా.. 121 హార్స్ పవర్, 145 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, సీవీటీ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి పనితీరులో పెద్దగా వ్యత్యాసం కనిపించదు.