Home Blog Page 116

ఒకేసారి రెండు బైకులు లాంచ్ చేసిన యమహా: ధరలు & వివరాలు ఇలా..

జపనీస్ బైక్ తయారీ సంస్థ యమహా.. ఇండియన్ మార్కెట్లో ఒకేసారి రెండు బైకులు లాంచ్ చేసింది. అవి ఒకటి ఎక్స్ఎస్ఆర్ 155, మరొకరి ఎఫ్‌జెడ్ రేవ్. సంస్థ లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ బైక్స్ డిజైన్, ఇతర ఫీచర్స్ వంటి వివరాలతో ధరలను కూడా ఈ కథనంలో చూసేద్దాం.

యమహా ఎక్స్ఎస్ఆర్ 155

కంపెనీ లాంచ్ చేసిన ఎక్స్ఎస్ఆర్ 155 బైక్ ధర రూ. 1.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది నియో రెట్రో స్టైలింగ్ పొందుతుంది. ఇందులోని 155 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్.. 10000 ఆర్పీఎం వద్ద 18.4 హార్స్ పవర్, 7500 ఆర్పీఎం వద్ద 14.1 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఎక్స్ఎస్ఆర్ 155 బైకు రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, టెయిల్ లాంప్ పొందుతుంది. అయితే ఈ బైక్ బ్రాండ్ లోగోకు బదులుగా యమహా పేరుతో ఉండటం చూడవచ్చు. ఇందులో సింగిల్ పీస్ సీటు ఉంటుంది. ఇది రైడర్, పిలియన్ ఇద్దరికీ మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది రెట్రో ప్రేరిత ఫుల్ ఎల్‌సీడీ యూనిట్. ఇందులో యమహా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సూట్ కూడా ఉంటుంది. అదనంగా ట్రాక్షన్ కంట్రోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఈ బైకులో ఉన్నాయి. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ ఈ లేటెస్ట్ యమహా బైకులో ఉంది. సస్పెన్షన్స్ మరియు బ్రేకింగ్ సెటప్ అద్భుతంగా ఉండటం చూడవచ్చు.

యమహా ఎఫ్‌జెడ్ రేవ్

కంపెనీ లాంచ్ చేసిన మరో బైక్.. యమహా ఎఫ్‌జెడ్ రేవ్. దీని ప్రారంభ ధర రూ. 1.17 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఫుల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ లైట్, కొత్త డిజైన్ ఫ్యూయెల్ ట్యాంక్, కాంపాక్ట్ ఎగ్జాస్ట్ పొందుతుంది. ఈ బైక్ కూడా సింగిల్ పీస్ సీటును పొందుతుంది. క్రిస్పీ టెయిల్ లాంప్ ఇందులో చూడవచ్చు.

ఎఫ్‌జెడ్ రేవ్ బైకులో.. 149 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 12.2 బీహెచ్పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి బైక్ స్మూత్ రైడింగ్ అందిస్తుంది. 136 కేజీల (కర్బ్ వెయిట్) బరువున్న ఈ లేటెస్ట్ బైక్ 17 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు కావడం గమనార్హం. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ పెద్దది కాబట్టి.. లాంగ్ రైడ్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

ఇండియన్ మార్కెట్లో యమహా బైకులకున్న డిమాండ్

భారతదేశంలో స్టైలిష్ బైక్ అనగానే గుర్తొచ్చేది యమహా బ్రాండ్ బైకులే. ఈ కంపెనీ కేవలం బైకులు మాత్రమే కాకుండా స్కూటర్లను కూడా విక్రయిస్తోంది. దీంతో ఇది ఇండియన్ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందుతోంది. ప్రస్తుతం దేశీయ విఫణిలో మొత్తం 22 మోడల్ యమహా టూవీలర్స్ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతే కాకుండా మార్కెట్లో తన కస్టమర్ల సంఖ్యను పెంచుకోవడానికి.. కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త బైకులను లాంచ్ చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే.. ఇప్పుడు తాజాగా రెండు బైకులు లాంచ్ చేసింది. ఇవి కూడా మంచి అమ్మకాలు పొందుతాయని భావిస్తున్నాము.

శోభిత ధూళిపాళ సినిమా తరువాతే.. సార్పట్ట-2 షూటింగ్!

0

ప్రస్తుతం డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం వెట్టువమ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ పనులు అన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఒక పది లేదా పదహైదు రోజులు మాత్రమే షూట్ మిగిలి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ తరువాత పా. రంజిత్  సార్పట్ట-2 మూవీ షూటింగ్ పనులు మొదలు పెట్టనున్నారు. ఈ రెండు సినిమాలకు సంబందించిన విశేషాలు కొన్ని..

వెట్టువమ్ తరువాత.. సార్పట్ట-2

సినీ హీరో ఆర్య, అట్టకత్తి దినేష్ & శోభిత ధూళిపాళ నటిస్తున్న చిత్రం వెట్టువమ్. నీలం స్టూడియోస్ మరియు గోల్డెన్ రేషియో ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పా. రంజిత్, అధితి ఆనంద్, పియుష్ సింగ్, అభయానంద్ సింగ్, అశ్విని చౌదరి, సొరబ్ గుప్తా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జీవీ. ప్రకాష్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. 2025 సంవత్సరం చివరిలో లేదా 2026లో ఈ సినిమా రిలీజ్ ఉండనుంది. షబ్బీర్ కల్లరక్కల్, మిమి గోపి, జాన్ విజయ్, లింగేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

వెట్టువమ్ (వెట్టువమ్ అనేది ఒక తమిళ పదం.. దీనికి కొట్టడంతో పాటు అనేక అర్థాలు వస్తాయి. సినిమా పరిభాషలో చెప్పాలంటే హీరో ప్రతీకారం తీర్చుకోవడం లేదా గ్యాంగ్‌స్టర్‌కు సంబంధించిన వయొలెన్స్ అయినా కావచ్చు). ఒక గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి గ్యాంగ్‌స్టర్‌ చుట్టూ తిరుగుతుందట. అందులో అతను జైలుకు వెళ్లిన తరువాత అక్కడ ఉన్న పరిస్థితులు, మరియు సామాజిక కోణం.. అధికారాన్ని, నేరాన్ని, న్యాయాన్ని కూడా రంజిత్ స్టైల్‌లో చూపించనున్నారు. మొట్ట మొదటిసారి సైన్స్ ఫిక్షన్ పరంగా టచ్ చేయనున్నాడంట. మరి సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

పా. రంజిత్ సార్పట్ట పరంపర గురించి

సార్పట్ట పరంపర సినిమా.. ఆర్య, దుషరా విజయన్ జంటగా నటించినగా పా. రంజిత్ దర్శకత్వంలో వచ్చింది. ఈ మూవీ 2021వ సంవత్సరంలో కరోనా కారణంగా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయింది. అయినప్పటికీ అతి పెద్ద విజయం అందుకునింది. బాక్సింగ్ స్పోర్ట్స్ డ్రామా మరియు పాలిటిక్స్, కులం, సమాజం అన్నీ కలిసి ఉంటాయి.

సార్పట్ట పరంపరకి ఇడియప్ప పరంపరకి ఎప్పటి నుంచో బాక్సింగ్ పోటీలు జరుగుతూ ఉంటాయి. అందులో హీరో ఒక వర్గానికి చెందిన వ్యక్తి. సార్పట్ట పరంపరకి ఆడాలని తన చిన్నపటి నుంచి కోరిక. అందుకే బాక్సింగ్ ఎక్కడ జరిగినా అక్కడకి వెళ్లిపోతూ ఉంటాడు. కానీ వాళ్ల నాన్న ఆ బాక్సింగ్ కారణంగానే వేరేవాళ్లు చంపేయడంతో హీరో అమ్మకు ఏమాత్రం ఇష్టం ఉండదు. ఆ కారణంగా సార్పాట్ట పరంపరకి చెందిన మెంటర్ రంగయ్యోరు అతన్ని ఆటలో చేర్చుకోరు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో వాళ్లలో వాళ్లకు పోటీ జరిగినప్పుడు కబీలన్ పోటీకి దిగి గెలుస్తాడు. అప్పుడు రంగయ్య ఆశ్చర్యం వ్యక్తం చేసి కొంచెం గర్వపడతాడు. ఆ తరువాత వారి మధ్యలో రంగయ్యకు అవమానం జరుగుతుంది అది చూసి తట్టుకోలేని హీరో కబిలన్ మెయిన్ బాక్సర్ వేట పులితో ఆటకు సవాల్ విసురుతాడు. అతనితో ఆడాలంటే ముందుగా డాన్సింగ్ రోజ్ (షబ్బీర్)తో గెలిచి చూపించమంటారు. అతనితో కూడా గెలిచి ఫైనల్ ఆటకు సిద్దమైనప్పుడు అప్పట్లో కొన్ని కుట్రలు పన్ని బాక్సింగ్ రింగులోనే అతన్ని బట్టలు విప్పి కొట్టి గెలవకుండా చేసి అవమానిస్తారు. అప్పుడే రాజకీయ ఎమర్జెన్సీ కారణాలు వళ్ళ ఆట ఆగిపోతుంది.

మెంటర్ రంగయ్య (పశుపతి)ని అరెస్ట్ చేస్తారు. ఆ తరువాత కొంతమంది వల్ల.. హీరో తాగుడుకు బానిసై భార్యా, తల్లిని, ఆటని మర్చిపోయి ఎందుకు పనికిరాని వాడిలా తయారవుతాడు. బాక్సింగ్‌కు పనికిరాకుండా తయారవుతాడు. ఆపై మళ్లీ రంగయ్య జైలు నుంచి విడుదల అవుతాడా లేదా మళ్ళీ బాక్సింగ్ ఆట జరుగుతుందా జరగదా, తల్లి సపోర్ట్ చేస్తుందా చేయదా, హీరో మునుపటిలా ఆడగలడా, ఆడి తన గురువు రంగయ్య పేరు నిలబెడతాడా లేదా అనేదే కథ. ఆర్య కబిలన్ అనే పాత్రలో అద్భుతంగా నటించాడు. ఐఎండీబీలో 8.5 స్టార్స్ రివ్యూతో మంచి హిట్ టాక్ తెచ్చుకునింది. పా. రంజిత్ అప్పటికే కబాలి, కాలా, మద్రాస్, అట్టకత్తి లాంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. సార్పట్టా ఒక చరిత్ర సృష్టించింది. అయితే ఇది థియేటర్లలో రిలీజ్ కాకపోవడం అనేది అభిమానులకి, పా.రంజిత్‌కు కూడా ఒకింత నిరాశ కలిగించింది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు: ఆ పార్టీనే గెలుస్తుందంటున్న ఎగ్జిట్ పోల్స్!

తెలంగాణలో ఇన్ని రోజులు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వీసీకె ఇతరత్రా పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు అందరూ కూడా హోరా హోరిగా ఎన్నికల ప్రచారాలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. మొత్తానికి హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఈరోజు సాయంత్రానికి (11/10/2025)న ముగిసింది. ఎవరి భవితవ్యం ఏమిటి అనేది నియోజకవర్గ ప్రజలు నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించిన సంబందించిన ఓట్లన్నీ ఈవిఏంలో భద్రంగా ఉన్నాయి. అయితే వారి నిర్ణయం ఏమై ఉంటుంది?, ఎవరిని గెలిపించారు?, ఎవరిని వద్దనుకున్నారు?, అనేది తెలియడానికి మాత్రం ఇంకా మూడు రోజులు (14/10/2025) ఆగాల్సిందే. అయితే అంతకు ముందే పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రూపంలో ఇప్పటికే ఎవరు ఎమ్మెల్యే అవుతారని తీర్పులు ఇచ్చేశాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం..

ఎగ్జిట్ పోల్స్ ఏమి చెబుతున్నాయంటే

నాగన్న సర్వే

  • కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి: 47 శాతం
  • బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి: 46 శాతం
  • బీజేపీ పార్టీ అభ్యర్థి: 8.7
  • ఇతరులుకు: 00 శాతంగా

ఈ నాగన్న సర్వే అనే సంస్థ తమ యొక్క సర్వేని ఇలా బయటపెట్టింది ఇక్కడ చూస్తే కాంగ్రెస్, బిఆర్ఎస్ పోటాపోటీగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. బీజేపీ గెలుపుకి ఆమడం దూరంలో ఉంది. ఇతరులకు అయితే అస్సలు ఒక్క శాతం కూడా ఛాన్స్ ఇవ్వలేదు.

స్మార్ట్ పోల్ సర్వే

  • కాంగ్రెస్ అభ్యర్థి: 48.2 శాతం
  • బీఆర్ఎస్ అభ్యర్థి: 42.1 శాతం
  • బీజేపీ అభ్యర్థి: 7.6 శాతం
  • ఇతరులు: 2.1 శాతం

పైన చెప్పిన నాగన్న సర్వేతో పోల్చుకుంటే.. స్మార్ట్ పోల్ సర్వే కాంగ్రెస్ పార్టీకీ ఒకశాతం పెంచి చూపించింది. బీఆర్ఎస్ పార్టీకి అయితే దాదాపు నాలుగు శాతం తగ్గించేశారు. బీజేపీకి కూడా ఇంకా ఒక శాతం తగ్గిపోయింది. ఈ ఇతరులకు అయితే ఒక రెండు శాతం ఫలితం ఉండే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.

పీపుల్స్ పల్స్ సర్వే

  • కాంగ్రెస్ అభ్యర్థి: 48 శాతం
  • బీఆర్ఎస్: 41 శాతం
  • బీజేపీ: 06 శాతం
  • ఇతరులు: 05 శాతం

పీపుల్స్ పల్స్ సర్వే దాదాపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెబుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థికి కూడా నలభై ఒక్క శాతం గెలుపు అవకాశాలు ఉన్నాయని చెబుతోంది. బీజేపీ ఆ దరిదాపుల్లో ఎక్కడ కనిపించడం లేదన్నట్టుగా చెబుతోంది. ఇతరులు కూడా ఎక్కడో ఐదు శాతం దగ్గర ఉన్నారు.

చాణక్య స్ట్రాటజీస్ సర్వే

  • కాంగ్రెస్ పార్టీకి: 46 శాతం
  • బీఆర్ఎస్ పార్టీకి: 43 శాతం
  • బీజేపీ పార్టీకి: 06 శాతం
  • ఇతరులకు: 05 శాతం

చాణక్య స్ట్రాటజీస్ పొలిటికల్ సర్వే సంస్థ కూడా అన్ని సంస్థల సర్వే లాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎక్కువ విజయం వైపు అడుగులు ఉన్నట్టు వెల్లడించింది. అదే విధంగా ఇంకా కొన్ని సంస్థలు ఈ కింది విధంగా తమ సర్వేలను వెల్లడించాయి.

  • పల్స్ టుడే: కాంగ్రెస్ 47 శాతం, బీఆర్ఎస్ 44 శాతం, బీజేపీ 07 శాతం
  • పబ్లిక్ పల్స్: కాంగ్రెస్ 48.5 శాతం, బీఆర్ఎస్ 41.8 శాతం, బీజేపీ 6.5 శాతం
  • హెచ్ఏంఆర్ సర్వే : కాంగ్రెస్ 48.31 శాతం, బీఆర్ఎస్ 43.18 శాతం, బీజేపీ 5.84 శాతం

ఎగ్జిట్ పోల్స్‌తో సంబంధం లేకుండా అన్నీ పార్టీల అభ్యర్థులు తమ గెలుపు గురించి వారి వారి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత.. ఒక్కసారి టీడీపీ గెలిచింది. వరుసగా గత రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు పట్టం కట్టారు. ఇలా మూడు సార్లు మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆయన భార్య మాగంటి సునీత మళ్లీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసింది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి, వీసీకె తెలంగాణ శ్యామ్ ఇంకా అనేకులు పోటీలో ఉన్నారు. మరి ఫలితాలు తెలిసేది ఎప్పుడు అంటే 14/11/2025 అని ఎలక్షన్ కమిషన్ ముందే నోటిఫికేషన్‌లో చెప్పిన విషయం అందరికి విదితమే.

వాడుతున్న కారును అమ్మేస్తున్నారా?: జాగ్రత్త.. ఇవి మరచిపోకండి!

సాధారణంగా కొత్త వాహనాలు (కారు లేదా బైక్) కొనుగోలు చేస్తే ఏ ఇబ్బంది ఉండదు. కానీ పాత వాహనం లేదా సెకండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు చాగేసినప్పుడు లేదా అమ్మినప్పుడు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ఊహకందని ఇబ్బందుల్లో లేదా సమస్యల్లో పడతారు.

విక్రేత/కొనుగోలుదారుకు సూచనలు

ఉపయోగించిన కారును కొనుగోలు చేసినప్పుడు లేదా అమ్మేటప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ అందించాలి. దీనికోసం కొనుగోలుదారు, విక్రేత ఇద్దరూ కలిసి డాక్యుమెంట్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. అవసరమైన ఫారమ్‌లను సిద్ధం చేసుకోవాలి. విక్రయించే వ్యక్తి వాహనానికి కారుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, బీమా పత్రాలు, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటి వాటితో పాటు విక్రేతకు సంబంధించిన చిరునామా వివరాలను అందించాలి. కొనుగోలుదారు కూడా తనకు సంబంధించిన వివరాలను విక్రేతకు ఇవ్వాలి. సంబంధిత డాక్యుమెంట్స్ పూర్తిగా పరిశీలించిన తరువాత.. కొత్త రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ చేస్తుంది.

ఈ ఫారమ్స్ పూరించాలి

కారు కొనుగోలుదారు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందటానికి.. ఆర్టీఓ లేదా పరివాహన్ వెబ్‌సైట్ నుంచి ఫారం 29, ఫారం 30 వంటివి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళా ఇతర రాష్ట్రాలకు బదిలీ అవ్వాలంటే.. ఆర్టీఓ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేదా ఎన్ఓసీ పొందాలి. దీనికోసం ఫారం 28 అవసరమవుతుంది. ఒకవేళా కారుపై లోన్ వంటివి ఉంటే.. విక్రేత వాటిని తీర్చేయాలి. లేకుంటే.. దాని ఎఫెక్ట్ కొనుగోలుదారుపై పడుతుంది.

అవసరమైన డాక్యుమెంట్స్

విక్రేత ఒరిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, చెల్లుబాటు అయ్యే బీమా, చెల్లుబాటు అయ్యే పొల్యూషన్ సర్టిఫికేట్ వంటి డాక్యుమెంట్స్ విక్రేతకు అందించాలి. అదే సమయంలో విక్రేత తన చిరునామాతో పాటు.. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను అందించాలి. ఇద్దరు వ్యక్తులూ అవసరమైన డాక్యుమెంట్స్ ఫిల్ చేసి ఆర్టీఓకు సమర్పిస్తే.. ఓనర్షిప్ మారుస్తారు. ఆర్టీఓ ఆ సమయంలోనే ఆ కారుపై ఏమైనా చలాన్స్, కేసులు ఉన్నాయేమో అని చెక్ చేస్తుంది. ఇలా అన్నీ పగడ్బందీగా చూసి.. పాత కారును కొనుగోలు చేసినప్పటికీ.. ఎవరికీ ఎలాంటి సమస్య ఉండదు.

ఇవి చేయకుంటే.. సమస్యలకు ఆహ్వానం!

రిజిస్ట్రేషన్ సరిఫికేట్ మార్చకుండానే.. విక్రేత నుంచి కొనుగోలుదారు కొనుగోలు చేసే సంఘటనలు కోకొల్లలు. దీనికి కారణం నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యమే అనుకోని సమస్యలోకి నెడుతుంది. విక్రేత తన కారును లేదా బైకును.. ఎవరికైనా విక్రయించాడు అనుకున్నారనుకోండి. ఆ వ్యక్తి ఏదైనా సంఘ విద్రోహ కార్యకలాపాలను ఆ వాహనాలను ఉపయోగిస్తే?, ఆ ప్రభావం అసలైన ఓనర్ మీద పడే అవకాశం తప్పకుండా ఉంది. నిజానికి జరిగిన సమస్యకు అసలైన యజమానికి.. విద్రోహ కార్యకలాపాల్లో ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఓనర్షిప్ మార్చకపోవడంతో.. సమస్యల్లో ఇరుక్కుంటాడు.

ఢిల్లీ ఘటన

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనలో హ్యుందాయ్ ఐ20 కారు పేలిపోయింది. నిజానికి ఆ కారును 2013లో సల్మాన్ అనే వ్యక్తి కొనుగోలు చేశారు. ఆ తరువాత కాలంలో దానిని అతడు వేరే వాళ్లకు అమ్మేశాడు. ఆ వ్యక్తి కూడా దానిని ఇంకొకరికి విక్రయించాడు. ఇలా చాలామంది చేతులు మారినప్పటికీ.. ఆ హ్యుందాయ్ ఐ20 కారు రిజిస్ట్రేషన్ అసలైన ఓనర్ పేరు మీదనే ఉంది. కాబట్టి ఢిల్లీ ఘటన కారణంగా సల్మాన్ కూడా ఇబ్బందుల్లో పడ్డాడు. కాబట్టి కార్లను విక్రయించే వాళ్లు దీనిని తప్పకుండా మనసులో ఉంచుకోవాలి. తప్పకుండా ఓనర్షిప్ బదిలీ చేసేయాలి.

కొత్త ఆడి కార్లు వచ్చేసాయి.. వీటి స్పెషాలిటీ ఏంటంటే?

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి.. భారతదేశంలో క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్, క్యూ5 సిగ్నేచర్ మోడల్స్ లాంచ్ చేసింది. ఇవి సాధారణ మోడల్స్ కంటే కొంత భిన్నంగా ఉంటాయి. కంపెనీ లాంచ్ చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ గురించి పూర్తి వివరాలు.. ఈ కథనంలో తెలుసుకుందాం.

ధరలు

  • ఆడి క్యూ3: రూ. 52.31 లక్షలు
  • ఆడి క్యూ3 స్పోర్ట్‌బ్యాక్: రూ. 53.55 లక్షలు
  • ఆడి క్యూ5: రూ. 69.86 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్)

ప్రత్యేకమైన డిజైన్

సాధారణ ఆడి కార్ల మాదిరిగా కాకుండా.. ఈ సిగ్నేచర్ ఎడిషన్స్ ఆడి లోగోకు ప్రొజెక్టర్ ఎల్ఈడీ వెల్కమ్ లాంప్ ఫిట్ చేశారు. ఇది కారులో చెప్పుకోదగ్గ స్పెషాలిటీ. అంతే కాకుండా క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ కార్లు ప్రత్యేకంగా కొత్త 18 ఇంచెస్ 5 స్పోక్ అల్లాయ్ వీల్స్, ప్రోగ్రెసివ్ రెడ్ కలర్ ఆప్షన్స్ పొందుతాయి. కాగా క్యూ5 మాత్రం గ్రాఫైట్ రంగులో పూర్తి చేయబడిన కొత్త 19 ఇంచెస్ అల్లాయ్స్ పొందుతుంది.

కలర్ ఆప్షన్స్ & ఇంటీరియర్

ఆడి కంపెనీ లాంచ్ చేసిన సిగ్నేచర్ ఎడిషన్స్.. డిస్ట్రిక్ట్ గ్రీన్, గ్లేసియర్ వైట్, మాన్‌హట్టన్ గ్రే, మైథోస్ బ్లాక్, నవర్రా బ్లూ అనే ఇది రంగుల్లో లభిస్తుంది.

ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఆడి కంపెనీ ఇందులో విలాసవంతమైన క్యాబిన్ అందించింది. ఈ సిగ్నేచర్ మోడళ్లలో క్యాబిన్ సువాసన వెదజల్లే డిస్పెన్సర్, స్టెయిన్‌లెస్ స్టీల్ పెడల్ కవర్స్ చూడవచ్చు. క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ మోడల్స్ పార్క్ అసిస్ట్ ప్లస్‌తో పాటు 12 వోల్ట్స్ అవుట్‌లెట్ మరియు వెనుక ప్రయాణికుల కోసం యూఎస్బీ పోర్ట్‌లు పొందుతాయి. కంపెనీ లాంచ్ చేసిన ఈ స్పెషల్ ఎడిషన్.. దేశంలోని ఆడి డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఎన్ని యూనిట్లు అనేది సంస్థ వెల్లడించలేదు.

ఆడి ఇండియా హెడ్ ఏమన్నారంటే?

కంపెనీ భారతదేశంలో తన సిగ్నేచర్ ఎడిషన్స్ లాంచ్ చేసిన సందర్భంగా.. ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాన్ మాట్లాడుతూ.. ఆడి క్యూ3, క్యూ5 మొదళ్లకు.. ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. ఇవే కంపెనీ అమ్మకలకు దోహదపడుతున్నాయి. ఈ కార్లు మంచి పనితీరును అందించడం వల్లనే మార్కెట్లో వీటికి ఆదరణ పెరుగుతోందని అన్నారు. కొత్తగా లాంచ్ అయిన ఈ సిగ్నేచర్ ఎడిషన్స్ కూడా తప్పకుండా.. మంచి అమ్మకాలు పొందుతాయని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు.

ఆడి కార్లకు ఇండియాలో డిమాండ్ ఇలా..

లగ్జరీ కార్లు అనగానే చాలామందికి గుర్తొచ్చేది.. ఆడి, బెంజ్ కంపెనీలు. దీన్నిబట్టి చూస్తే వీటికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆడి కంపెనీ మన దేశంలో సుమారు 10 కంటే ఎక్కువ మోడల్స్ విక్రయిస్తోంది. ఇందులో ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. ఆడి కార్లను కొనుగోలు చేసేవారి జాబితాలో ఎక్కువగా సెలబ్రిటీలు, క్రికెటర్లు, పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. దీనికి కారణం ఆడి కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉండటమే. అంతే కాకుండా ఆడి కార్లు ధరకు తగిన డిజైన్, ఫీచర్స్ మరియు లగ్జరీ అందిస్తుంది.

యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బుతో కాలేజ్ ఫీజు: ఫిదా అవుతున్న నెటిజన్లు

భారతదేశంలో యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్న వారు చాలామందే ఉన్నారు. తమ పని తాము చేసుకుంటూనే వీడియోస్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొందరు అన్ని పనులు మానుకుని వీడియోలు చేయడం ద్వారానే డబ్బు సంపాదిస్తున్నారు. ఎవరు ఎలా చేసినా.. డబ్బులు మాత్రం సంపాదిస్తున్నారు. ఇలా యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బుతోనే ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఒక విద్యార్థిని తమ మొదటి సంవత్సరం కాలేజీ ఫీజును చెల్లించింది.

ప్రారంభంలో 50-100 వ్యూవ్స్ మాత్రమే!

ఇషానీ శర్మ.. అందరిలాగానే యూట్యూబ్ క్రియేట్ చేసి వీడియోలు చేయడం ప్రారంభించింది. మొదట్లో తాను చేసిన వీడియోలకు 50 నుంచి 100 వ్యూవ్స్ (వీక్షణలు) మాత్రమే వచ్చేవి. ప్రారంభంలో సరైన వీడియో ఎడిటింగ్ లేదు, ఫ్యాన్సీ థంబ్‌నెయిల్ కూడా లేదు. కానీ వీడియోస్ చేయాలనే తపన మాత్రం ఉంది. ఇలాంటి సమయంలోనే.. ఆమె పదవ తరగతి విద్యార్థులు కోసం 5 నిమిషాల వీడియో రికార్డ్ చేసి.. తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసింది. ఇది నెట్టింట్లో బాగా వైరల్ అయింది. నిజానికి ఈమె యూట్యూబ్ కంటెంట్ కూడా విద్యార్థుల చదువుకోవడానికి కావలసిన టిప్స్ చెప్పడం, సలహాలు చెప్పడమే.

దశ మార్చిన ఒక్క వీడియో

మొత్తానికి ఒక్క వీడియో తన దశను మార్చేసింది. తన ఛానల్ మానిటైజేషన్‌కు అర్హత సాధించింది. ఆ తరువాత మరిన్ని వీడియోస్ చేయడంలో నిమగ్నమైంది. ఇలా డబ్బు సంపాదించడం మొదలు పెట్టింది. ఇప్పుడు ఆలా వచ్చిన డబ్బుతోనే తన మొదటి సంవత్సరం కాలేజీ ఫీజును చెల్లించింది. ఈమె చదువుతున్న కాలేజీ ప్రభుత్వ కళాశాల, అందులో చెల్లించాల్సిన ఫీజు కూడా చాలా తక్కువే.. అయినప్పటికీ, తాను సంపాదించిన డబ్బుతో ఫీజు కట్టుకోవడం అనేది చాలా గర్వంగా ఉందని పేర్కొంది. ఈమె చేసిన పని చాలామందికి ప్రేరణగా కూడా నిలుస్తుంది.

ఫీజు తక్కువే.. గర్వంగా ఉంది

ప్రభుత్వ కళాశాలో చదువుకు ఫీజు చాలా తక్కువే.. కానీ నాకు ఇది ఒక పెద్ద సక్సెస్ అని ఇషానీ పేర్కొంది. నేను నా సంపాదన ద్వారా ఫీజు చెల్లిస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఇష్టపడే పని చేస్తే తప్పకుండా.. ఫలితం ఉంటుందని నేను గట్టిగా నమ్ముతాను. మీరు కూడా ఏదైనా ప్రారంభించాలని అనుకుంటే.. ఒక యూట్యూబ్ ఛానల్, ఒక బ్లాగ్, పాడ్‌కాస్ట్ ఏదైనా కావచ్చు, సరైన సమయం రావాలని వేచి చూడకండి. ఇప్పుడే ప్రారంభించండి. దానిని ఆస్వాదిస్తూ కొనసాగించండి. ఎదో ఒకరోజు తప్పకుండా సక్సెస్ లభిస్తుందని ఆమె వెల్లడించింది.

ఇష్టమైన పనిచేస్తూ ముందుకు పోతే..

ప్రస్తుతం ఇషానీ చదువుపై ద్రుష్టి పెట్టడం వల్ల యూట్యూబ్ వీడియోలకు కొంత విరామం ప్రకటించింది. కానీ త్వరలోనే మళ్ళీ వీడియోలు క్రియేట్ చేయడం మొదలుపెడుతుంది ఆమె ఫాలోవర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె కథ వైరల్ అయింది. ఇష్టమైన పనిచేస్తూ ముందుకు పోతే.. తప్పకుండా ఏదైనా సాధ్యమవుతుందని నిరూపించిన ఈమెను పలువురు ప్రశంసిస్తున్నారు.

ప్రస్తుతం చాలామంది యోట్యూబ్ వీడియోలు చేస్తూ లెక్కకు మించిన డబ్బు సంపాదిస్తున్నారు. అయితే ఇది అందరికీ వర్తిస్తుందని చెప్పడం కష్టమే. ఒక వందమంది యూట్యూబ్ ఛానల్ పెడితే.. ఏ ఒక్కరికో, లేదా ఇద్దరికో (కంటెంట్ బాగుంటే) మాత్రమే మానిటైజేషన్ వస్తుంది. కానీ ఎవరైనా మంచి కంటెంట్‌తో స్టార్ట్ చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారని మాత్రం చెప్పవచ్చు.

బైక్ vs స్కూటర్: ఎక్కువ పెట్రోల్ దేనికి అవసరం, ఎందుకు?

సాధారణంగా భారతదేశంలో చాలామంది రోజువారీ వినియోగానికి బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేసి, వినియోగిస్తుంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే బైక్ ఎక్కువ ఇంధనం (పెట్రోల్) ఉపయోగిస్తుందా?.. స్కూటర్ ఎక్కువ ఇంధనం ఉపయోగిస్తుందా?. ఈ కథనంలో మీ అనుమానానికి సమాధానం తెలుసుకుందాం.. కారణాలు కూడా చూసేద్దాం.

సింపుల్ పద్దతిలో విశ్లేషించుకుంటే.. పరిమాణం, బరువు, ఇంజిన్ కెపాసిటీ, రైడింగ్ స్టైల్ వంటివి పరిగణలోకి తీసుకోవాలి. వీటిని పరిగణలోకి తీసుకుంటే.. సులభంగా అర్థమైపోతుంది.

పరిమాణం

బైక్.. స్కూటర్ రెండూ టూవీలర్స్ అయినప్పటికీ.. పరిమాణంలో భిన్నంగా ఉంటాయి. అంటే స్కూటర్ కంటే బైక్ కొంత పెద్దదిగా ఉంటుంది. అంటే బరువు కూడా ఎక్కువే ఉంటుందన్న మాట. వెహికల్ బరువు ఎక్కువ ఉన్నప్పుడు, అది ముందుకు కదలాలంటే.. ఇంధనం కొంత ఎక్కువ కావాల్సిందే. కాబట్టి బైక్ ఫ్యూయెల్ వినియోగం కొంత ఎక్కువగానే ఉంటుంది.

ఇక స్కూటర్ పరిమాణంలో చిన్నదిగా ఉండటమే కాకుండా.. బరువు కూడా బైక్ కంటే తక్కువగానే ఉంటుంది. అంటే తేలికైన వాహనాల వినియోగానికి ఎక్కువ ఫ్యూయెల్ అవసరం లేదు. బైక్ కొంత ఎక్కువ ఫ్యూయెల్ వినియోగిస్తుంది అని చెప్పడానికి ఒక ప్రధాన కారణం.

ఇంజిన్ కెపాసిటీ

ఫ్యూయల్ వినియోగంలో ప్రధాన పాత్ర ఇంజిన్ మీదనే ఉంటుంది. ఉదాహరణకు బైకులో 350 సీసీ ఇంజిన్, 650 సీసీ ఇంజిన్ 1100 సీసీ ఇంజిన్స్ కూడా ఉంటాయి. 350 సీసీ బైక్ 40 కిమీ/లీ మైలేజ్ అందిస్తే.. 650 సీసీ ఇంజిన్ 25-30 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. అదే 1100 సీసీ ఇంజిన్ విషయానికి వస్తే.. దీని మైలేజ్ చాల తక్కువే ఉంటుంది. ఇలాంటి ఇంజిన్స్ దాదాపు బైకుల్లోనే ఉంటాయి.

స్కూటర్ల విషయానికి వస్తే.. స్కూటర్ మహా అంటే 125 సీసీ, 150 సీసీ, 250 సీసీ ఇంజిన్ ఎంపికలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఇంజిన్ కెపాసిటీ తక్కువ కాబట్టి.. ఫ్యూయెల్ వినియోగం కూడా తక్కువగానే ఉంటుంది. లాంగ్ రైడ్ చేయడానికి కూడా స్కూటర్లు అంత కంఫర్ట్ కాదు.

సీవీటీ ట్రాన్స్‌మిషన్ / గేర్స్

స్కూటర్లలో.. కంటిన్యూయస్లీ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (సీవీటీ) ఉంటుంది. ఇది ఇంజిన్‌ను అధిక ఆర్పీఎం దగ్గర ఉంచుతుంది. అయితే బైక్ మాన్యువల్ గేర్ సిస్టం పొందుతుంది. తద్వారా ఇంధన వినియోగం కొంత ఎక్కువగానే ఉంటుంది. పనితీరు విషయంలో రెండూ వేరువేరుగా ఉంటాయి. వేగంగా.. దూర ప్రయాణం చేయడానికి బైక్ ఉపయోగపడుతుంది. స్కూటర్ చిన్న దూరాలకు, నగరంలో ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.

రైడింగ్ స్టైల్

ఇంధన వినియోగం.. రైడింగ్ స్టైల్ మీద కూడా డిఫెండ్ అయి ఉంటుంది. అంటే.. మైలేజ్ అనేది బైక్ లేదా స్కూటర్ రైడ్ చేసే రైడర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒక నిర్దిష్ట వేగంతో బైక్ నడిపితే.. మైలేజ్ కొంత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ లేదా గతుకులు రోడ్డుపై రైడింగ్ చేస్తే.. ఫ్యూయెల్ వినియోగం కొంత ఎక్కువగా ఉంటుందనేది నిజం. అంతే కాకుండా స్కూటర్లు ప్రత్యేకించి చిన్న దూరాలకు నిర్దేశించి ఉంటాయి. బైక్ విషయంలో ఇది వేరుగా ఉంటుంది.

అనాథలా పెరిగి.. అందనంత ఎత్తుకెదిగిన అందెశ్రీ: ఇక లేరు

తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలందరినీ.. ఏకతాటిపైకి తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించిన ప్రముఖ కవి, గేయ రచయిత, గాయకుడు అందెశ్రీ ఈరోజు ఉదయం గాంధీ ఆసుపత్రిలో గుండెపోటుతో కన్నుముశారు.

జీవితం మొదలైందిలా..

డాక్టర్ అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. ఆయన జూలై 18వ తేదీన 1961వ సంవత్సరంలో రెబర్తీ అనే ఊరు, మద్దూరు మండలం, సిద్దిపేట జిల్లాలో జన్మించారు. ఒక అనాథగా పెరిగి.. గొర్రెలు మేపుకుంటూ, అతి సాదాసీదాగా జీవనం సాగించేవారు. అక్కడ నుంచే స్వయం కృషితో అక్షరాలు నేర్చుకుని తెలుగు సాహిత్యంపైన పట్టు సాధించారు.

చిన్నప్పుడు బడికి వెళ్లి చదువుకోలేదు, కానీ ఆసువుగా కవిత్వం చెబుతారు. తెలుగు సాహితీ, కళా రంగానికి ఎనలేని సేవలు అందించారు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇంట్లో పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను నవంబర్ 10వ తేది 2025న హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ అరభై నాలుగేళ్ల వయసులో అందెశ్రీ తన కలానికి, గళానికి స్వస్తి పలికారు.

మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు..

గేయ రచయితగా అందెశ్రీ తెలంగాణ రాష్ట్ర గేయంతో పాటు అనేక సామాజిక పాటలు, తెలంగాణ ఉద్యమం కోసం పాటలు, సినిమా పాటలు రచించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్తగా ఎప్పటికీ నిలిచిపోయే తెలంగాణ రాష్ట్ర గేయాన్ని అందెశ్రీ చేత రాయించి.. అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఆ పాటని ఇప్పుడు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో “జయ జయ జయహే తెలంగాణ, జననీ జయకేతాన్ని” గీతంగా ఆలపిస్తున్నారు.

“మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకంతైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు” అనే పాటను ఆర్. నారాయణమూర్తి సినిమా కోసం అందెశ్రీ రాశారు. ఆ తరువాత ఆ పాటను తెలుగు పాఠ్యపుస్తకాలలో ఒక పాఠంగా చేర్చారు. పల్లెటూరు వాతావరణం, జీవితం, తెలంగాణ సంస్కృతి, ఉద్యమం గురించి ఎన్నో మరచిపోలేని పాటలు ఆయన అందించారు.

అందెశ్రీ అందుకున్న పురస్కారాలు..

  • తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పోరాటాన్ని, కృషిని గుర్తించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కుమార్ రెడ్డి చేతుల మీదగా 2024 సంవత్సరంలో కోటి రూపాయలు నగదు అందజేశారు.
  • 2006లో గంగ అనే సినిమా కు ప్రభుత్వం నుంచి నంది అవార్డు తీసుకున్నారు.
  • 2014 సంవత్సరంలో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ కాకతీయ విశ్వవిద్యాలం ఆయనను గౌరవ డాక్టరేట్ పట్టా ఇచ్చి సత్కరించడం జరిగింది.
  • 2015లో దాశరథి సాహితీ పురస్కారం స్వీకరించారు.
  • 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం అందుకున్నారు.
  • రావూరి భారద్వాజ సాహిత్య పురస్కారం అందుకున్నారు.

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

ప్రజల సందర్శనార్థం భౌతిక కాయాన్ని ఆయన స్వగృహం లాలాగూడలో ఉంచారు. కవులు, రచయితలు, కళాకారులు, రాజకీయ ప్రముఖులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఆయనతో వారికున్న సాన్నిహిత్యాన్ని, చేసిన సేవలను, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వ లాంచనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దానికి సంబందించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

దుల్కర్ సల్మాన్ గ్యారేజిలోకి కొత్త కారు: ధర రూ.2.59 కోట్లు!

0

లగ్జరీ కార్లను ఎక్కువగా ఇష్టపడే నటుల జాబితాలో దుల్కర్ సల్మాన్ అగ్రస్థానంలో ఉంటారు. బెంజ్, ఆడి, ఫెరారీ, పోర్స్చే వంటి కార్లను కలిగి ఉన్న ఈయన, ఇప్పుడు తాజాగా రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

రూ.2.59 కోట్ల కొత్త కారు..

దుల్కర్ సల్మాన్ కొనుగోలు చేసిన కారు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కంపెనీకి చెందిన డిఫెండర్ 110 ఓసీటీఏ. దీని ధర రూ. 2.59 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఈ కారును దుల్కర్ సల్మాన్ కొచ్చిలోని జాగ్వార్ ల్యాండ్ రోవర్ డీలర్ వద్ద డెలివరీ చేసుకున్నారు. ఇది పెట్రో కాపర్ రంగులో ఉండటం చూడవచ్చు. రూఫ్, టెయిల్ గేట్ వంటివి నలుపు రంగులో ఉండటం చూడవచ్చు. ఈ కొత్త కారును నెంబర్ ప్లేట్ లేదు. అయితే వీరి గ్యారేజిలోని కార్లకు 369 నెంబర్ మాత్రమే ఉంటుంది. కాబట్టి కొత్త కారుకు కూడా అదే నెంబర్ ఇవ్వనున్నారు.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఓసీటీఏ గురించి

2025 ప్రారంభంలో దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన డిఫెండర్ ఓసీటీఏ కారు.. బ్రాండ్ యొక్క అత్యంత శక్తివంతమైన కారు. దృఢమైన బాడీ కలిగిన ఈ కారు.. మార్కెట్లోని మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. దుల్కర్ సల్మాన్ గ్యారేజిలో బెంజ్ ఏఎంజీ కారు కూడా ఉంది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఓసీటీఏ కారు అత్యుత్తమ పనితీరును అందించేలా తయారు చేశారు. ఇందులో 4.4 లీటర్ ట్విన్ టర్బో వీ8 పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 635 హార్స్ పవర్, 750 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 3.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 250 కిమీ/గం. ఇలాంటి ఇంజిన్ బీఎండబ్ల్యు ఎం5 కారులో కూడా ఉంటుంది.

డిఫెండర్ ఓసీటీఏ ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ పొందుతుంది. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు.. అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. 22 ఇంచెస్ వీల్స్ కలిగిన ఈ మోడల్.. బయటి వైపు ఓసీటీఏ బ్యాడ్జ్‌లు పొందుతుంది. గ్రిల్ పరిమాణం కూడా కొంత పెద్దదిగా ఉంటుంది. ఇది కార్పాతియన్ గ్రే, చారెంటే గ్రే, ఫారో గ్రీన్, పెట్రా కాపర్ అనే నాలుగు రంగుల్లో లభిస్తుంది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఓసీటీఏ కారులో 11.4 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, సియెన్నా సెమీ లెదర్ అపోల్స్ట్రే, ఇంటిగ్రేటెడ్ హెడ్‌రెస్ట్, సెంటర్ కన్సోల్ లోపల మినీ ఫ్రిజ్ మొదలైనవి ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. ఇది మంచి డ్రైవింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది.

దుల్కర్ సల్మాన్ గ్యారేజిలోని కార్లు

నటుడు దుల్కర్ సల్మాన్ గ్యారేజిలో.. బెంజ్ ఎస్ క్లాస్, బెంజ్ ఏఎంజీ జీ63, బెంజ్ ఏఎంజీ ఏ45, బీఎండబ్ల్యూ 7 సిరీస్, బెంజ్ మే బ్యాచ్ జీఎల్ఎస్ 600, ల్యాండ్ రోవర్ డిఫెండర్, మినీ కూపర్ ఎస్, ఇన్నోవా క్రిస్టా కార్లతో పాటు బీఎండబ్ల్యూ ఎం3 ఈ46, బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎంజీ, ఫోర్చే 911 జీటీ3 వంటివి ఉన్నాయి.

అప్పట్లో ఇళయరాజా సాంగ్ కంపోజింగ్ ఎలా చేసేవారో తెలుసా?

0

మ్యూజిక్ డైరెక్టర్స్ సినిమాలకు పాటలను ఎలా బాణి కడతారో మనకు తెలియదు. మనం ఎప్పుడు చూడలేదు. ఆ సంగీతం మీద మంచి పట్టు ఉన్న కొద్ది మందికి మాత్రమే ఆ పరిజ్ఞానం ఉంటుంది, వారికే తెలుస్తుంది. అందులో మళ్లీ అందరిదీ ఒకే తీరు ఉండదు. ఒక్కో పద్ధతిలో, ఒక్కో శైలిలో కంపోజ్ అండ్ రికార్డింగ్ చేస్తారు. మ్యూజిషన్స్ అందరిలోకి ఇళయరాజాది ఒక ప్రత్యేకమైన సంగీత ప్రపంచం. ఆయన ఒక పాటని ఆ రోజుల్లో ఎలా కంపోజ్ చేసేవాల్లో ఇక్కడ తెలుసుకుందాం.

పాట రికార్డ్ చెయ్యాలనుకుంటే..

ఒక పాట రికార్డు చెయ్యాలి అనుకుంటే ముందుగా దానికి తగ్గ నోట్స్ ప్రిపేర్ చేసుకుని. అది రాసుకున్న తరువాత ఆ బాణికి తగిన కావాల్సిన మ్యూజిషన్స్ అందరినీ ఒకే చోట ఉండేలా చూసుకునేవారు. చిత్ర దర్శకుడు కథ చెప్పి సందర్భం వివరించిన పాటకి 60 నుంచి 80 మంది ఒకే సమయంలో ఒకే చోట ఒక పాట కోసం సాధన చేసేవాళ్ళు. సంగీతం అంతా సరే అనుకున్న తరువాత అప్పుడు పాట రచయితని పిలిపించుకుని పాట రాయించుకునేవారు.

ఒక పాట కోసం లెక్కలేనన్ని టేక్స్!

మ్యూజిక్ విభాగంలో అన్నీ సరిపోయాయి అనుకున్నప్పుడు దానికి తగిన గాయకుల పేరుని ఒక పేపర్‌పైన రాసేవారు. అక్కడ ఉన్న మేనేజర్స్ వారికి ఫోన్ చేసి పిలిపించేవారు. సాంగ్ బాగా వచ్చేంతవరకు దాదాపు నాలుగు నుంచి పదిహేను టేక్స్ కూడా తీసుకునేవారు. పాట ఓకే అని ఇళయరాజా అనుకున్న తరువాత ఆ పాటకి షూటింగ్ చేసేవారు. అలా అందరూ ఒకే పనిని ఒకే ఏకాగ్రతతో ఒకే సమయంలో ఒకే దగ్గర చేయడం వలన పాటలన్నీ కూడా ఇప్పటికీ ఆదరణ పొందుతున్నాయి. ఇన్ని సంవత్సరాలుగా ఆ పాటలన్నీ అంతా బాగా అలరిస్తున్నాయి అంటే కారణం నా జీవితం అని ఇళయరాజా అన్నారు. ఆయన జీవితంలో జరిగిన సంఘటనలే పాటలుగా వచ్చాయని, అవే ఇప్పుడు మీరు సందర్బాన్ని బట్టి ఉపయోగించుకుంటున్నారని అన్నారు.

ఇలా ఉంటే.. పాటలో ఎలా ఫీల్ వస్తుంది!

ఇప్పుడు అంతా మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడో ట్యూన్ చేస్తాడు, రైటర్ ఇంకో చోట ఉంటాడు. సింగర్స్ ఒక్కోసారి ఒక్కరు వచ్చి పాడుతారు. వీళ్ళేం చేస్తారో వాళ్లకి తెలియదు, వాళ్ళేం చేస్తారనేది వీళ్లకు తెలియదు. కాబట్టి అందరి మైండ్‌సెట్ ఒకే లాగా పనిచేయదు. ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. అప్పుడు ఒక పాటలో ఫీల్ ఎలా వస్తుంది? రాదు, అని ఇళయరాజా సద్విమర్శలు చేశారు. ఇళయరాజాకు సంబంధించిన విజయవాడలో మ్యూజిక్ లైవ్ ప్రోగ్రాం జరగబోయే ముందు రోజు మీడియాతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు. వీటి గురించి నెటిజన్స్ ఒక్కొక్కరు ఒకలాగా స్పందిస్తున్నారు.

అదీ.. ఆయన అంకిత భావం!

ఆనాడు ఇళయరాజా అందించిన సంగీతం, ఆ పాటలు ఇప్పటి కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి. కేవలం ఆ పాటలు, సంగీతంతోనే హిట్ అయిన సినిమా బోలెడు. అందుకే ఆయనని మ్యూజిక్ మ్యాస్ట్రో అని పిలుస్తారు. ఇప్పటికీ ఇళయరాజాను సంగీత దర్శకుడిగా ఎంతో మంది కోరుకుని వారితో సినిమాలకు వర్క్ చేయించుకుంటున్నారు. ఇన్ని యేండ్లు అయినా ఆయన పనిలో ఎక్కడ కూడా వ్యత్యాసం కనిపించదు. అంతటి అంకిత భావంతో ఇళయరాజా పని చేస్తారు.