Home Blog Page 63

బెస్ట్ 7 సీటర్ కార్లు: రూ.10 లక్షలుంటే చాలు ఓ కారు కొనేయొచ్చు!

0

ఏడు మంది ప్రయాణికులు హాయిగా ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే 7 సీటర్ కార్లకు భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం విఫణిలో చాలా 7 సీటర్ కార్లు ఉన్నాయి. అయితే చాలామంది వాహన ప్రేమికులు కోరుకునేది మాత్రం కొంత తక్కువ ధర వద్ద అందుబాటులో ఉండే కార్లను. కాబట్టి ఈ కథనంలో బెస్ట్ సెవెన్ సీటర్ కార్లను గురించి వివరంగా తెలుసుకుందాం.

నిస్సాన్ గ్రావైట్

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యంత సరసమైన 7 సీటర్ కార్ల జాబితాలో నిస్సాన్ గ్రావైట్ ఒకటి. దీని ధరలు రూ. 5.65 లక్షల నుంచి రూ. 8.94 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. చూడటానికి కొంత ట్రైబర్ మాదిరిగా ఉండే ఈ కారు సీఎంఎఫ్ ఏప్లస్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారైంది. మూడు వరుసల సీటింగ్ ఆప్షన్ కలిగిన ఈ కారు అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి ఇది వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

రెనాల్ట్ ట్రైబర్

ట్రైబర్ ఎంపీవీ కూడా బెస్ట్ 7 సీటర్ కారు. దీని ధర రూ. 5.76 లక్షల నుంచి రూ. 8.6 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. ఇందులో కూడా మూడు వరుసల సీట్లు ఉంటాయి. సీట్లు స్లైడింగ్ అండ్ రిక్లైనింగ్. ఇందులోని 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 72 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో వస్తుంది. అత్యుత్తమ డిజైన్ కలిగిన ఈ కారు, అత్యాధునిక ఫీచర్స్ కూడా పొందుతుంది.

మహీంద్రా బొలెరో

దేశీయ వాహన తయారీ సంస్థ కూడా మన దేశంలో సరసమైన 7 సీటర్ కారును విక్రయిస్తోంది. దాని పేరు మహీంద్రా బొలెరో. దీని ప్రారంభ ధర 7.99 లక్షల రూపాయలు. లెదర్ అపోల్స్ట్రే, రీఫ్రెష్డ్ క్యాబిన్, వెంటిలేషన్ కోసం మెష్ సీటు, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ పరిమాణం 17.8 సెం.మీ.

మహీంద్రా బొలెరో నియో

మరో 7 సీటర్ మహీంద్రా కారు బొలెరో నియో. దీని ధరలు రూ.8.69 లక్షల నుంచి రూ.10.94 లక్షల మధ్య ఉన్నాయి. మంచి సీటింగ్ పొజిషన్ కలిగిన ఈ కారు డిజైన్ బాగుంటుంది. ఫీచర్స్ కూడా వాహన వినియోగదారులకు కావలసినన్ని ఉంటాయి. కుషనింగ్ కూడా దృఢంగా ఉంది. అయితే లోపల స్థలం కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇది కొంత పెద్ద కుటుంబాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మారుతి సుజుకి ఎర్టిగా

రూ. 8.80 లక్షల నుంచి రూ. 12.94 లక్షల మధ్య ధర వద్ద లభించే మారుతి సుజుకి ఎర్టిగా కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ, సరసమైన బైక్. నిజానికి 7 సీటర్ విభాగంలో ప్రత్యర్థులకు ఈ కారు గట్టి పోటీ కూడా ఇస్తోంది. ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 103 పీఎస్ పవర్, 139 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కాబట్టి పనితీరు అద్భుతంగా ఉంటుంది.

పైన చెప్పుకున్న కార్లు మాత్రమే కాకుండా కియా కారెన్స్, మహీంద్రా స్కార్పియో ఎన్, టయోటా రూమియన్, టాటా సఫారీ, హ్యుందాయ్ ఆల్కజార్, బీవైడీ ఈమ్యాక్స్ 7, టయోటా ఫార్ట్యూనర్, ఎంజీ గ్లోస్టర్, స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్, ఇన్నోవా హైక్రాస్, మహీంద్రా ఎక్స్‌యూవీ700 కూడా ఉన్నాయి. ల్యాండ్ రోవర్ డిఫెండర్, బీఎండబ్ల్యు ఎక్స్7, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్, లెక్సస్ ఎల్ఎమ్ వంటివి ప్రీమియం 7 సీటర్ కార్ల విభాగంలో ఉన్నాయి.

హోలీ రోజే చంద్రహణం.. ఇండియాలో గ్రహణం టైమ్ ఇదే!

0

ఇటీవలే (ఫిబ్రవరి 17) సూర్యగ్రహణం పూర్తయింది. ఇది భారతదేశంలో కనిపించలేదు. కానీ త్వరలో (మార్చి 03) చంద్రగ్రహణం రానుంది. ఇది ప్రపంచంలోని కొన్ని దేశాలతో పాటు ఇండియాలో కూడా కనిపిస్తుంది. అదే రోజు హోలీ పండుగ రావడం కూడా గమనార్హం. చంద్రగ్రహణం సమయం ఎప్పుడు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

2026లో మొదటి చంద్రగ్రహణం

మార్చి 3 (మంగళవారం) సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం రోజు భూమి, చంద్రునికి మధ్య సూర్యుడు వస్తాడు. ఆ సమయంలో కొన్ని గడియలు పాటు చంద్రుడు భూమిపై ఉన్నవారికి కనిపించడు. అయితే ఈ సమయంలో సూర్యుని కాంతి వల్ల చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు. దీనిని బ్లడ్ మూన్ అని పిలుస్తారు. కాగా 2026లో సంభవిస్తున్న మొదటి చంద్రగ్రహణం ఇదే. అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా – ఫసిఫిక్ ప్రాంతాలతో పాటు భారత ఉపఖండంలో కూడా ఈ గ్రహణం కనిపిస్తుంది.

గ్రహణ సమయం

మంగళవారం (మార్చి 3) మధ్యాహ్నం 3:20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:47 గంటలకు ముగుస్తుంది. గ్రహణం వీక్షించాలనుకునే వారు సాయంత్రం 6:33 గంటల నుంచి 6:40 గంటల మధ్య చూడవచ్చు. భారతదేశంలో చంద్రుడు ఆలస్యంగా ఉదయిస్తాడు. కాబట్టో సాయంత్రం సమయంలో గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బెంగాల్ మొదలైన ఈశాన్య రాష్ట్రాల్లో గ్రహణం దృశ్యాలు బాగా చూడవచ్చు.

బ్లడ్ మూన్ అంటే..

చంద్రుడు ఎరుపు లేదా రాగి రంగులో కనిపిస్తాడు. దీనికి కారణం భూమి నీడ చంద్రునిపైకి పడటమే. భూమి వాతావరణం, సూర్యకాంతిలోని నీలి రంగును చెల్లాచెదురు చేస్తుంది, కానీ.. ఎరుపు రంగును చంద్రునివైపుకు మళ్లిస్తుంది. అందుకే చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు. దీనినే బ్లడ్ మూన్ అని పిలుస్తారు. చంద్రుడు ఎర్రగా ఉండటం ప్రమాదం కాదు, చంద్రగ్రహణాన్ని ఎలాంటి రక్షణ (సన్ గ్లాసెస్) లేకుండా కూడా చూడవచ్చు. రక్షణ కోసం ఏదైనా ఉపయోగించినా మంచిదే.

హొలీ పండుగ

భారతదేశంలో చాలామంది ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగల్లో హోలీ ఒకటి. ఈ పండుగ సరిగ్గా చంద్రగ్రహణం రోజున రావడం అశుభ సూచికమా అని కొందరు అనుకోవచ్చు. కానీ అలాంటి అశుభాలు ఏమి ఉండవు. గ్రహణ సమయంలో కాకుండా.. మిగిలిన సమయంలో పండుగ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మన దేశంలో సాధారణంగా ఏదైనా గ్రహణం సంభవించిన తరువాత ప్రజలు స్నానాది కార్యక్రమాలు ఆచరించి, దేవాలయాలను సందర్శిస్తారు. పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఇది చాన్నాళ్లుగా ఉన్న ఆచారం. కాబట్టి ఈ సారి చంద్రగ్రహణం అనంతరం కూడా ఇలాంటి పనులు సర్వసాధారణం.

2026లో గ్రహణాలు

ఈ సంవత్సరం రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 17న ఒక సూర్యగ్రహణం ముగిసింది. మరొకటి ఆగష్టు 12న సంభవించనుంది. అదే సమయంలో చంద్రగ్రహణాలు మార్చి 3న, ఆగష్టు 27-28 మధ్యలో సంభవించనున్నాయి.

నిజానికి గ్రహణాలు అనేవి అశుభాలు కాదు, గ్రహాలు పరిభ్రమణాల వల్ల ఏర్పడతాయి. ఇది సర్వ సాధారణమైన అంశం. ఖగోళ శాస్త్రం ప్రకారం.. వీటివల్ల ఎలాంటి దోషాలు ఉండవు. అయితే గ్రహణం సమయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతారు.

పురుషులకు ప్రవేశంలేని దేవాలయాలు!.. మనదేశంలో ఎక్కడున్నాయో తెలుసా?

0

ఒక గుడి ఉందంటే.. చిన్న, పెద్ద, స్త్రీ & పురుష బేధం లేకుండా ఎవరైనా వెళ్లొచ్చు. కానీ కొన్ని ఆలయాలకు స్త్రీల ప్రవేశం నిషిద్ధం అని చాలా సందర్భాల్లో వినే ఉంటారు. కానీ పురుషులకు కూడా ప్రవేశం లేని దేవాలయాలు ఉన్నాయని బహుశా చాలామందికి తెలిసుండకపోవచ్చు. ఈ కథనంలో మగవాళ్ల ప్రవేశం నిషేధించిన ప్రముఖ ఆలయాల గురించి తెలుసుకుందాం.

అట్టుకల్ భగవతి ఆలయం

కేరళలోని తిరువనంతపురంలో అట్టుకల్ భగవతి ఆలయం. దీనిని ఎక్కువమంది మహిళల శబరిమల అని పిలుస్తారు. ముఖ్యంగా పొంగల్ సమయంలో లక్షలాదిమంది మహిళలు.. ఇక్కడి దేవతలకు నైవేద్యం వండటానికి గుమికూడుతారు. ఈ సమయంలో వీధులన్నీ వంటశాలలుగా మారుతాయి. పూజ సమయంలో దేవతలు ఉగ్రరూపం దాలుస్తారని చెబుతారు. ఇది ప్రపంచంలోనే ఎక్కువమంది మహిళా భక్తులు గుమికూడే ప్రదేశం అని చెబుతారు. ప్రత్యేక సమయంలో మాత్రమే పురుషులు అక్కడ ఉండరని చెబుతారు.

చక్కలతుకవు దేవాలయం

ఈ దేవాలయం కూడా కేరళలోనే ఉంది. ప్రతి ఏటా ఇక్కడ నారీ పూజ జరుగుతుంది. ఆ సమయంలో మహిళలను దేవతలుగా భావించి పూజిస్తారు. పూజారులు మహిళల పాదాలను కడుగుతారు. ఇలాంటి సమయంలో పురుషుల ప్రవేశం నిషేధం. ఇక్కడ మహిళను పూజించడం అంటే.. వారిలోని దైవత్వాన్ని పూజించడం అన్నమాట. ఇదొక సంప్రదాయం మాత్రమే. ఇది లింగ వివక్ష వ్యతిరేఖం మాత్రం కాదు.

బ్రహ్మ దేవాలయం

రాజస్థాన్ రాష్ట్రంలోని ఈ దేవాలయానికి పురుష ప్రవేశం ఉంది. కానీ కొన్ని ప్రదేశాల్లో మాత్రం వివాహిత పురుషులు నివేద్యం సమర్పించకుండా నియంత్రిస్తారు. ఇది బ్రహ్మ దేవునికి కేటాయించిన అతి కొన్ని ఆలయాల్లో ఒకటి కావడం విశేషం. కొన్ని పురాణాల ప్రకారం.. ఇక్కడ బ్రహ్మ చేసిన యజ్ఞం సమయంలో సరస్వతి దేవికి కోపం వచ్చింది. ఈ కారణంగానే వివాహిత పురుషులు నైవేద్యం సమర్పించడంపై ఆంక్షలు విధించినట్లు చెబుతారు.

కామాఖ్య ఆలయం

అస్సాంలోని కామాఖ్య ఆలయం.. భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన శక్తిపీఠాల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడ దేవతను సాధారణ మానవరూపంలో పూజించారు. స్త్రీ గర్భాన్ని సూచించే సహజరాతి నిర్మాణానికి పూజలు చేస్తారు. ప్రతి ఏటా అంబుబాచి మేళా సమయంలో ఒక్కడ ఆలయం మూడు రోజులపాటు మూసివేస్తారు. ఆ సమయంలో దేవత ఋతుచక్రాన్ని సూచిస్తుందని చెబుతారు. ఇక్కడికి కూడా పురుషుల ప్రవేశం పూర్తిగా నిషేధం కాదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే.

సంతోషి మాత దేవాలయం

బృందావనంలోని సంతోషిమాత దేవాలయంలో జరిగే కొన్ని పూజలకు మహిళలే నాయకత్వం వహిస్తారు. కొన్ని నిర్దిష్ట రోజుల్లో మాత్రం ఇక్కడికి పురుషులు ప్రవేశించకూడదు. కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు శుక్రవారం ఉపవాసాలు ఉండి, సంతోషి మాటకు పూజలు చేస్తుంటారు.

భగవతి దేవాలయాలు

తమిళనాడులోని కొన్ని భగవతి దేవాలయాలు కొన్ని ఆచార, సాంప్రదాయాలను పాటిస్తారు. ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో.. పురుషులు గర్భ గుడిలోకి ప్రవేశించరు. అక్కడ దేవతను కన్యగా పూజిస్తారు. స్వచ్ఛతకు, స్వయం సమృద్ధికి దేవతను సూచికగా ఆరాధిస్తారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మాత్రమే పురుషులకు ప్రవేశం నిషేధం.

నిజానికి భారతదేశంలోని దాదాపు అన్ని దేవాలయాలకు స్త్రీ, పురుషులు ఇద్దరూ వెళ్ళవచ్చు. కానీ కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే పురుషులకు ప్రవేశం ఉండదు. ఇందులో ఎలాంటి వివక్ష లేదు అనే విషయం అందరూ గమనించాలి. మన దేశంలో స్త్రీల ప్రవేశంపై కొన్ని సందర్భాల్లో / సమయాల్లో నిషేధం విధించే దేవాలయాలు కూడా ఉన్నాయి.

శాంసంగ్ గ్యాలక్సీ ఎస్26 స్మార్ట్‌ఫోన్ లాంచ్: ధర, ఫీచర్స్ & బ్యాటరీ వివరాలు

0

శాంసంగ్ కంపెనీ తన గ్యాలక్సీ ఎస్26 స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. దీనితో పాటు ఎస్26ప్లస్, ఎస్26 అల్ట్రా మోడల్స్ కూడా లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ధరలు ఎలా ఉన్నాయి?, డిజైన్, ఫీచర్స్, కలర్ ఆప్షన్స్ వంటివి ఈ కథనంలో తెలుసుకుందాం.

వేరియంట్స్ వారీగా ధరలు

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త శాంసంగ్ గ్యాలక్సీ ఎస్26 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.1,39,999 (12జీబీ + 256జీబీ). 12జీబీ + 512జీబీ వేరియంట్ ధర 1,59,999 రూపాయలు, టాప్ వేరియంట్ ధర రూ.1,89,999 (16జీబీ + 1టీబీ). బ్లాక్, బ్లూ, వైట్ కలర్ ఎంపికలలో అందుబాటులో ఉండే ఈ ఫోన్ అమెజాన్, శాంసంగ్ ఇండియా వంటి ఆన్‌లైన్ స్టోర్లలో అమ్మకానికి రానుంది.

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్

శాంసంగ్ గ్యాలక్సీ ఎస్26 అల్ట్రా 6.9 ఇంచెస్ డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లేను 3120 x 1440 పిక్సెల్స్ రిజల్యూషన్ & 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేటుతో వస్తుంది. రంగు ఖచ్చితత్వం కోసం 10 బిట్ కలర్ అవుట్‌పుట్ లభిస్తుంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ 2 ద్వారా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ పొందుతుంది. కాగా ఆండ్రాయిడ్ 16 ఆధారంగా వన్ యూఐ 8.5తో వస్తుంది.

ఏఐ ఫీచర్స్

గ్యాలక్సీ ఎస్26 అల్ట్రా అనేది అప్డేటెడ్ గ్యాలక్సీ ఏఐ ఫీచర్స్ పొందుతుంది. నౌ అసిస్ట్ ఆన్ స్క్రీన్ యాక్టివిటీ ఆధారంగా పనిచేస్తుంది. ఇమేజ్ (ఫొటోస్) ఎడిటింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. క్రియేటివ్ స్టూడియో కంటెంట్ వంటి వాటికీ మద్దతు ఇస్తుంది. వాయిస్ అసిస్ట్ సెట్టింగ్ అడ్జస్ట్ సెట్టింగుకు అనుమతిస్తుంది. కాగా గోప్యతకు సంబంధించిన హెచ్చరికలు, యాప్ డేటా యాక్సెస్ గురించి యూజర్లకు తెలియజేస్తుంది.

కెమెరా వివరాలు

ఫొటోగ్రఫీ కోసం శాంసంగ్ ప్రత్యేకంగా .. తన గ్యాలక్సీ ఎస్26 అల్ట్రాలో ఎఫ్/1.4 అపెర్చర్ అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 200 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ప్రైమరీ సెన్సార్ ద్వారా క్వాడ్ రియర్ కెమెరా పొందుతుంది. ఇది కాకుండా ఎఫ్/2.9 అపెర్చర్ అండ్ 5x ఆప్టికల్ జూమ్‌తో 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, ఎఫ్/1.9 అపెర్చర్‌తో 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైట్ యాంగిల్ లెన్స్ అండ్ ఎఫ్/2.4 అపెర్చర్ అండ్ 3x ఆప్టికల్ జూమ్‌తో 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా కూడా కలిగి ఉంటుంది.

రియర్ కెమెరా సిస్టం విషయానికి వస్తే.. ఇది 8కే వీడియో రికార్డింగ్, హెచ్‌డీఆర్10ప్లస్ క్యాప్చర్ & 360 డిగ్రీ హారిజాంటల్ లాక్ స్టెబిలైజేషన్‌తో సూపర్ స్టెడీ వీడియోకు సపోర్ట్ చేస్తుంది. ముందు భాగంలో ఎఫ్/2.2 అపెర్చర్ & 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

సరికొత్త ఫీచర్స్

ఫీచర్స్ విషయానికి వస్తే.. శాంసంగ్ గ్యాలక్సీ ఎస్26 అల్ట్రాలోని కనెక్టివిటీ ఎంపికలలో 5జీ, వైపై 7, బ్లూటూత్ 6, ఎన్ఎఫ్సీ & యూఎస్బీ టైప్-సీ సపోర్ట్ వంటివి ఉన్నాయి. హ్యాండ్‌సెట్ నానో సిమ్, ఈసిమ్ ఎంపికలతో డ్యూయల్ సిమ్ ఆప్షన్స్ ఉన్నాయి. శాటిలైట్ న్యావిగేషన్ సిస్టమ్‌లలో జీపీఎస్, గ్లోనస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, బీడీఎస్ వంటివి ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో గైరోస్కోప్, యాక్సిలరోమీటర్, బేరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ-కంపాస్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి. ఇది 60 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ & 25 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

బ్యాటరీ వివరాలు

శాంసంగ్ గ్యాలక్సీ ఎస్26 అల్ట్రా మొబైల్ 5000 యాంపియర్ బ్యాటరీ పొందుతుంది. ఈ ఫోన్ మొత్తం బరువు 214గ్రామ్స్. కాగా ఇది ఇప్పవరకు శాంసంగ్ లాంచ్ చేసిన వాటిలో అత్యంత సన్నని మోడల్. ఇది 6.9 అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లే పొందుతుంది. ప్రైవసీ డిస్‌ప్లే ఫీచర్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ఎస్ఓసీ వంటివి పొందుతుంది.

ఫిబ్రవరి నెలకు 28 రోజులు.. దీని వెనకున్న అసలు కథ ఇదే!

0

ఏడాదిలోని అన్ని నెలలకు 30 రోజులు లేదా 31 రోజులు ఉంటాయి. కానీ ఫిబ్రవరి నెలకు మాత్రం 28 రోజులు లేదా 29 రోజులు ఉంటాయి. ఎప్పుడైనా ఎందుకు ఫిబ్రవరి నెలకు మాత్రమే ఇలా ఉందని ఆలోచించారా?, ఒకవేలా ఆలోచించినా సమాధానం దొరకలేదా?, అయితే మీ సందేహానికి సమాధానమే ఈ కథనం..

ప్రాచీన రోమన్ క్యాలెండర్

ఫిబ్రవరి నెలకు తక్కువ రోజులు ఉండటానికి కారణం ప్రాచీన రోమన్ క్యాలెండర్ అని తెలుస్తోంది. నిజానికి కొన్నేళ్ల క్రితం సంవత్సరానికి 10 నెలలు మాత్రమే ఉండేది. కాలక్రమంలో.. తరువాతి రోజుల్లో రాజు నూమా పోంపిలియస్ జనవరి, ఫిబ్రవరి నెలలను చేర్చారు. రోమన్లు ప్రారంభంలో సరిసంఖ్యలను అపశకునాలకు ప్రతీకగా భావించేవారు. అందుకే ఎక్కువ నెలలకు 29 లేదా 31 రోజులుగా నిర్ణయించారు.

అందుకే చిన్న నెలగా

అప్పట్లో ఫిబ్రవరి నెలను పాప పరిహారం చేయడానికి, శుద్ధి కర్మలు చేయడానికి ప్రత్యేకంగా నిర్ణయించుకున్నారు. దీనివల్లనే అది చిన్న నెలగా మారిందని చెబుతారు. కొన్ని సంవత్సరాల తరువాత రోమన్ చక్రవర్తి.. జూలియస్ సీజర్ క్యాలెండర్‌లో చాలా పెద్ద మార్పులు చేశారు. ప్రస్తుతం ఏడాదికి 365 రోజులు ఉండటానికి కారణం ఆయన చేసిన మార్పులే. క్యాలెండర్ సంవత్సరం ఏడాదికి 365 రోజులు ఉండాలని అప్పట్లోనే నిర్ణయించారు.

అలా 365 రోజులు..

నిజానికి భూమి సూర్యుని చుట్టూ తిరిగే కాలం 365 రోజుల కంటే కొంత ఎక్కువగా ఉంటుందని, అందుకే నాలుగేళ్లకు ఒకసారి 366 రోజులు (లీప్ సంవవత్సరం) అయ్యాయి. సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 28 రోజులు, లీఫ్ ఇయర్‌లో ఫిబ్రవరి నెలలో 29 రోజులు వస్తున్నాయి. ఆ తరువాత గ్రెగోరియన్ క్యాలెండర్ వచ్చినప్పటికీ.. ఇదే విధానం కొనసాగింది. ఇప్పుడు ఆధునికులు కూడా దీనిని ఫాలో అవుతున్నారు.

ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. ఫిబ్రవరి నెలకు 28 రోజులు లేదా చిన్న నెలగా ఉండటానికి కారణం ప్రకృతి కాదు. దీనికి కారణం మనుషులు రూపొందించిన ప్రాచీన క్యాలెండర్ వ్యవస్థ. పురాతన రోమన్ నిర్ణయాలు & విశ్వాసాలు మాత్రమే కాకుండా.. ఆ తరువాత చేసిన అనేక సవరణలు ఏడాదికి 365 రోజులని ధృవీకరించాయి.

మరో ప్రత్యేకం..

ప్రతి నెలలోనూ తప్పకుండా నాలుగు ఆదివారాలు, నాలుగు సోమవారాలు, నాలుగు మంగళవారాలు, నాలుగు బుధవారాలు, నాలుగు గురువారాలు, నాలుగు శుక్రవారాలు, నాలుగు శనివారాలు ఉంటాయి. ఇందులో కొన్ని ఆదివారాలు, సోమవారాలు, మంగళవారాలు, బుధ, గురు, శుక్ర, శనివారాలు 5 రోజులు వస్తాయి. కానీ ఫిబ్రవరికి మాత్రం 28 రోజులు కాబట్టి.. ఆదివారం నుంచి శనివారం వరకు అన్ని రోజులు.. నాలుగుసార్లు రిపీట్ అవుతాయి. ఈ ఏడాది (2026 ఫిబ్రవరి) కూడా ప్రతి రోజు వారానికి నాలుగు సార్లు వచ్చింది.

వాతావరణంలో మార్పు & పండుగలు

ఫిబ్రవరి నెల చిన్నదే అయినప్పటికీ.. వాతావరణంలో మార్పు (శీతాకాలం నుంచి ఎండకాలం), ముఖ్యమైన పండుగలు (మహా శివరాత్రి) వంటివి ఈ నెలలోనే జరుగుతాయి. రోమన్లు దీనిని అశుభానికి ప్రతీక నెలగా భావించినప్పటికీ.. భారతీయులు మాత్రం ఈ నెలలో పవిత్రమైన శివరాత్రి జరుపుని తరిస్తారు. అంతే కాకుండా ప్రపంచ ప్రేమికుల దినోత్సవం కూడా ఈ నెలలోనే జరుపుకుంటారు.

41 కార్లు మాత్రమే అమ్మకానికి.. దీని రేటెంతో తెలుసా?

0

మార్కెట్లో సాధారణ కార్లకు మాత్రమే కాకుండా లిమిటెడ్ ఎడిషన్స్ లేదా స్పెషల్ ఎడిషన్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కొన్ని దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు అప్పుడప్పుడు ఈ తరహా కార్లను లాంచ్ చేస్తుంటాయి. ఇప్పుడు జీప్ ఇండియా రాంగ్లర్ విల్లీస్ 41 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ చేసింది. దీని గురించి పూర్తి సమాచారం ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

1941 నాటి కారుకు గుర్తుగా..

జీప్ రాంగ్లర్ విల్లీస్ 41 లిమిటెడ్ ఎడిషన్.. 1941 విల్లీస్ ఎంబీకి గుర్తుగా లాంఛ్ చేయడం జరిగింది. దశాబ్దాల నాటి మోడల్ పేరుతో ఇప్పుడు కారు లాంచ్ కావడం వాహన ప్రియులకు మంచి వార్త. అయితే దీనిని సంస్థ 41 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. అంటే 41 కార్లను మాత్రమే విక్రయిస్తుందన్నమాట. 2025లో కూడా జీప్ కంపెనీ విల్లీస్ 41 స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది. అది కేవలం ఏడు రోజుల్లోనే అమ్ముడైపోయింది.

2025లో లాంచ్ అయిన విల్లీస్ 41 స్పెషల్ ఎడిషన్ పొందిన డిమాండును దృష్టిలో ఉంచుకునే.. కంపెనీ మరోమారు ఈ మోడల్ స్పెషల్ ఎడిషన్ తీసుకొచ్చింది. ఇది చూడటానికి రాంగ్లర్ రూబికాన్ మాదిరిగా ఉంటుంది. కాగా ధర దానికంటే రూ. 2 లక్షలు ఎక్కువ.

స్పెషల్ ఎడిషన్ ప్రత్యేకత

జీప్ రాంగ్లర్ విల్లీస్ 41 లిమిటెడ్ ఎడిషన్.. 1941 నాటి థీమ్ గ్రాఫిక్స్ పొందుతుంది. ఇది లిమిటెడ్ ఎడిషన్ అని తెలియజేయడానికి బోనెట్ మీద సిన్స్ 1941 అని ఉండటం కనిపిస్తుంది. మొత్తం థీమ్ 1941 నాటి మిలిటరీ స్పెక్ విల్లీస్ అని తెలుస్తోంది.

విల్లీస్ లిమిటెడ్ ఎడిషన్ మోటరైజ్డ్ సైడ్ స్టెప్, ఇంటిగ్రేటెడ్ డాష్ కెమెరా వంటివి ఉన్నాయి. కంపెనీ రూ. 3.60 లక్షల ధరతో ఆప్షనల్ కిట్ కూడా అందిస్తోంది. ఇందులో సైడ్ ల్యాడర్ కలిగి.. ఒక రూప్ క్యారియర్ & సన్‌రైడర్ రూఫ్‌టాప్ ఉంది. ఈ కిట్ టూరింగ్ లేదా ఆఫ్ రోడింగ్ చేసేవారికోసం ప్రత్యేకంగా పరిచయం చేసింది.

ధర ఎంతంటే?

రూ. 70.31 లక్షల ఖరీదైన విల్లీస్ 41 లిమిటెడ్ ఎడిషన్.. 2.0 లీటర్ 4 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 266 బీహెచ్పీ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటికు గేర్‌బాక్స్ మాత్రమే కాకుండా.. 4 వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో జతచేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది.

ప్రస్తుతం జీప్ ఇండియా ఈ లిమిటెడ్ ఎడిషన్ కారును దేశంలోని బ్రాండ్ డీలర్‌షిప్‌లో ఉంచినట్లు సమాచారం. ఇది 41 యూనిట్లకు మాత్రమే పనిమితం కాబట్టి.. పరిమిత కాలం వరకు అందుబాటులో ఉంటుంది. అంటే ముందుకు బుక్ చేసుకున్న వాళ్లకు మాత్రమే లభిస్తుందన్నమాట.

భారతదేశంలోని జీప్ కార్లు!

జీప్ కంపెనీ లాంచ్ చేసే కార్లకు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కాబట్టి సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కార్లను లేదా కొంత అప్డేట్ చేసిన కార్లను లాంచ్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం జీప్ మెరిడియన్, జీప్ కంపాస్, జీప్ గ్రాండ్ చెరోకీ, జీప్ రాంగ్లర్ కార్లు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా లిమిటెడ్ ఎడిషన్ కూడా యాడ్ అయింది.

ఫిబ్రవరి 26న పెళ్లి.. తొలిసారి స్పందించిన రష్మిక & విజయ్

0

రష్మిక మందన్న & విజయ్ దేవరకొండ నిశ్చితార్థం జరిగింది, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా కోడై కూసింది. ఎన్ని పుకార్లు పుట్టినా.. దీనిపై వీరిద్దరూ అధికారికంగా స్పందించలేదు. ఇప్పుడు తాజాగా ఆ వార్తలు నిజమే అని తెలిసిపోయింది. అటు విజయ్, ఇటు రష్మిక సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించారు.

వెడ్డింగ్ ఆఫ్ విరోష్!

అభిమానులు ఇప్పటికే రష్మిక, విజయ్ జంటలకు విరోష్ అని పేరుకూడా పెట్టుకున్నారు. ఈ పేరుతోనే వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని ఒక పోస్ట్ షేర్ చేశారు. మేము ఏదైనా ప్లాన్ చేసుకోవడానికి ముందే, అభిమానులు వాటిని చేస్తున్నారు. అభిమానుల కోసం వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెట్టుకుంటున్నట్లు రష్మిక, విజయ్ ఇద్దరూ వెల్లడించారు.

పెళ్లి ఎప్పుడంటే?

రష్మిక, విజయ్ దేవరకొండ వివాహం ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరగనున్నట్లు సమాచారం. ఈ పెళ్లికి కొంతమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. కాగా వీరి పెళ్లి తరువాత మర్చి 4న హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో ఒక రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే వీరి పెళ్లికి ఎవెరెవరు హాజరవుతారనే విషయం కూడా ప్రస్తుతానికి అధికారికంగా వెల్లడికాలేదు.

ఇప్పటికే నిశ్చితార్థం

ప్రారంభం నుంచే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి విషయం చాలా రహస్యంగా ఉంచుతున్నారు. ఇప్పటికే జరిగిన వీరి నిశ్చితార్థం విషయం కూడా ఇన్ని రోజులు బయటపెట్టనేలేదు. ఎన్ని వార్తలు తెరమీదకు వచ్చినప్పటికీ.. మాకేం సంబంధం లేదు అన్నట్టుగానే ఉన్నారు. మొత్తానికి ఇప్పటికి వీరి పెళ్లి గురించి ప్రస్తావించారు. వీరిరువురి పెళ్లి కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

వెండితెర నుంచి మూడుముళ్ల బంధం!

గీత గోవిందం సినిమాతో కలిసి వెండితెరపై కనిపించిన ఈ జంట.. త్వరలోనే మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. గీత గోవిందం సినిమా వీరిద్దరికీ మంచి హిట్ ఇచ్చింది. ఆ తరువాత డియర్ కామ్రేడ్ సినిమాలో నటించారు. అయితే రష్మిక మందన్న మాత్రం చాలా సినిమాల్లో.. అగ్ర కథానాయకుల సరసన నటించి బాగా ఫేమస్ అయింది. విజయ్ దేవరకొండ కూడా చాలా సినిమాల్లో నటించినప్పటికీ.. చెప్పుకోదగ్గ సక్సెస్ అయితే సాధించలేకపోయారు. ఇక పోతే మళ్లీ రష్మిక మందన్న, విజయ్ జంటగా రణబలి సినిమాలో కనిపించనున్నారు.

రణబలి సినిమా గురించి

విజయ్ దేవరకొండ & రష్మిక మందన్న మరోసారి జంటగా కనిపించనున్న చిత్రం రణబలి. ఇది 2026 సెప్టెంబర్ 11న రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. 19వ శతాబ్దానికి చెందిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. ఇప్పటివరకు వచ్చిన విజయ్ దేవరకొండ అన్ని సినిమాల కంటే ఇది చాలా భిన్నగంగా ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన చాలా వివరాలు తెలియాల్సి ఉంది. ఇకపోతే.. రష్మిక పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తుందా?, సినిమాలకు పులుస్టాప్ పెడుతుందా? అనేది తెలియాల్సి ఉంది.

భార్యకు విడాకులిచ్చినా.. కుమారుడికి రూ.4 కోట్ల గిఫ్ట్!

0

టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా, ఆయన భార్య & నటి నటాషా స్టాంకోవిచ్ కొన్ని అనివార్య కారణాల వల్ల భార్యాభర్తలుగా విడిపోయారు. కానీ తమ బిడ్డ అగస్త్య విషయంలో మాత్రం తల్లిదండులుగా వారి బాధ్యతలు నెరవేర్చుకుంటూ ఉన్నారు. ఇందులో భాగంగానే హార్థిక్ పాండ్య ఇప్పుడు తన కుమారునికి కోట్ల రూపాయల విలువ చేసే కారును గిఫ్ట్ ఇచ్చారు.

బిడ్డకు ఖరీదైన గిఫ్ట్!

హార్దిక్ పాండ్యా.. తన బిడ్డ అగస్త్యకు ఇచ్చిన కారు విలువ రూ. 4 కోట్లు. ఇది ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన డిఫెండర్. ఈ కారును తీసుకోవడానికి నటాషా & అగస్త్య ఇద్దరు ముంబైలోని డీలర్‌షిప్‌కు చేరుకున్నారు. కారును డెలివరీ చేసిన విషయాన్ని డీలర్‌షిప్ కూడా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించింది.

నిజానికి ల్యాండ్ రోవర్ డిఫెండర్ ధర రూ. 2.60 కోట్ల నుంచి రూ. 3.02 కోట్ల మధ్యలో ఉంటుంది. హార్థిక్ పాండ్య కొనుగోలు చేసిన కారు టాప్ వేరియంట్ & కస్టమైజేషన్ మోడల్ అని సమాచారం. ఈ కారణంగానే దీని ధర రూ. 4 కోట్లు వరకు ఉందని తెలుస్తోంది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్

ఎక్కువమంది సెలబ్రిటీలు, పొలిటీషియన్స్, క్రికెట్సర్స్ ఇష్టపడే కార్ల జాబితాలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఒకటి. కాగా హార్దిక్ పాండ్యా తన కుమారునికి గిఫ్ట్ ఇచ్చిన కారు ఏ ఇంజిన్ ఆప్షన్ కలిగిన మోడల్ అనే విషయం వెల్లడికాలేదు. ఇది 2.0 లీటర్ పెట్రోల్, 3.0 లీటర్ పెట్రోల్, 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. అయితే డిఫెండర్ ఆక్టా వేరియంట్ 4.4 లీటర్ ట్విన్ టర్బో వీ8 మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ ఎంపికతో లభిస్తుంది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారు అత్యుత్తమ పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇది 3.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ / గం వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 250 కిమీ / గం కావడం గమనార్హం. ఆకట్టుకునే డిజైన్ కలిగిన ఈ ప్రీమియం కారు, ధరకు తగిన ఫీచర్స్ కలిగి ఉంటుంది.

ప్రీమియం ఫీచర్స్

దృఢమైన నిర్మాణం కలిగిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారు 10 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్స్ ఆఫ్ డిస్ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇవి కాకుండా మెరిడియన్ ప్రీమియం ఆడియో సిస్టం, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు కూడా ఉన్నాయి.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో ఎలక్ట్రానిక్ ఎయిర్ సస్పెన్షన్, 360 డిగ్రీ కెమెరా, హీటెడ్ సీట్లు, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, లెదర్ అపోల్స్ట్రే, రబ్బర్ ఫ్లోరింగ్, ఆరు ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి. ఇవన్నీ ప్రయాణికులకు ఎక్కువ రక్షణ అందిస్తాయి.

హార్దిక్ పాండ్యా గురించి

టీమిండియా ఆల్ రౌండర్ క్రికెటర్ అయిన హార్దిక్ పాండ్యా 2020లో నటాషాను పెళ్లి చేసుకున్నారు. వీరు 2024లో విడాకులు తీసుకున్నారు. కాగా అప్పటికే ఈ జంటకు అగస్త్య అనే ఒక బాబు ఉన్నాడు. ప్రస్తుతం మహీకా శర్మతో రిలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. అయినప్పటికీ.. తన బిడ్డ కోసం కోట్ల రూపాయల విలువైన కారును గిఫ్ట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్య పరిచారు.

70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ విజేతల లిస్ట్: జాబితాలోని యాక్టర్స్ వీరే!

0

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమం ఈసారి (70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్) కొచ్చిలో జరిగింది. ఈ వేడుకలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లో ఉత్తమ ప్రదర్శన కనపరిచిన నటులు, సహాయకులు, డైరెక్టర్లకు అవార్డులు ప్రధానం చేయడం జరిగింది. ఇందులో పుష్ప 2: ది రూల్ సినిమా తెలుగు విభాగంలో ఆధిపత్యం చెలాయించగా.. తమిళంలో అమరన్ సినిమా తన హవా చాటుకుంది. భాషల వారీగా విజేతల విషయానికి వస్తే..

తెలుగు

➤ఉత్తమ చిత్రం: పుష్ప 2: ది రూల్
➤ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప 2: ది రూల్)
➤ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): లక్కీ బాస్కర్ (వెంకీ అట్లూరి)
➤ఉత్తమ ప్రధాన నటుడు (మేల్): అల్లు అర్జున్ (పుష్ప 2)
➤ఉత్తమ నటుడు (క్రిటిక్స్): తేజ సజ్జ (హను-మాన్)
➤ప్రధాన ఉత్తమ నటి (ఫి మేల్): నివేతా థామస్ (35 చిన్న కథ కాదు)
➤ఉత్తమ నటి (క్రిటిక్స్): కాజల్ అగర్వాల్ (సత్యభామ)
➤ఉత్తమ సహాయ నటుడు (మేల్): అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 ఏడీ)
➤ఉత్తమ సహాయ నటి (స్త్రీ): అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)
➤ఉత్తమ సంగీత ఆల్బమ్: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప 2: ది రూల్)
➤ఉత్తమ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లె చుట్టేసింది – దేవర: పార్ట్ 1)
➤ఉత్తమ నేపథ్య గాయకుడు (మేల్): శ్రీ కృష్ణ (ఆ కుర్చిని మడతపెట్టి – గుంటూరు కారం)
➤ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (స్త్రీ): శిల్పా రావు (చుట్టమల్లె చేట్టేసింది – దేవర: పార్ట్ 1)
➤బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: యాధు వంశీ (కమిటీ కుర్రోళ్లు)
➤ఉత్తమ డెబ్యూ పురుషుడు: సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోల్లు)
➤ఉత్తమ డెబ్యూ నటి: నయన్ సారిక (గం గం గణేశ)
➤ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ), రామకృష్ణ & మోనిక (పుష్ప 2: ది రూల్)
➤ఉత్తమ కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్ (ఆ కుర్చి మడతపెట్టి – గుంటూరు కారం)

తమిళం

➤ఉత్తమ చిత్రం: అమరన్
➤ఉత్తమ దర్శకుడు: పి.ఎస్.వినోత్రాజ్ (కొట్టుక్కాలి) & రాజ్‌కుమార్ పెరియసామి (అమరన్)
➤ఉత్తమ చిత్రం (విమర్శకులు): మెయ్యజగన్ (సి. ప్రేమ్ కుమార్)
➤ఉత్తమ ప్రధాన నటుడు (పురుషుడు): శివకార్తికేయన్ (అమరన్)
➤ఉత్తమ నటుడు (విమర్శకులు): అరవింద్ స్వామి (మెయజగన్)
➤ఉత్తమ నటి (స్త్రీ): సాయి పల్లవి (అమరన్)
➤ఉత్తమ నటి (క్రిటిక్స్): అన్నా బెన్ (కొట్టుక్కాలి)
➤ఉత్తమ సహాయ నటుడు (పురుషుడు): కార్తీకి (మెయజగన్)
➤సహాయ పాత్రలో ఉత్తమ నటి (స్త్రీ): పార్వతి తిరువోతు (తంగళన్) & స్వసిక (లబ్బర్ పాండు)
➤ఉత్తమ సంగీత ఆల్బమ్: జివి ప్రకాష్ కుమార్ (అమరన్)
➤ఉత్తమ సాహిత్యం: ఉమా దేవి (యారో ఇవాన్ యారో – మెయియజగన్)
➤ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (పురుషుడు): హరిచరణ్ (హే మిన్నలే – అమరన్)
➤ఉత్తమ నేపథ్య గాయని (మహిళ): శ్వేతా మోహన్ (హే మిన్నాలే- అమరన్)
➤ఉత్తమ డెబ్యూ దర్శకుడు: సురేష్ మారి (జె బేబీ) & తమిజరసన్ పచ్చముత్తు (లబ్బర్ పాండు)
➤ఉత్తమ డెబ్యూ చిత్రం: హృదు హరూన్ (థగ్స్)
➤ఉత్తమ డెబ్యూ చిత్ర నటి: శ్రీ గౌరీ ప్రియ (ప్రేమికుడు)
➤ఉత్తమ సినిమాటోగ్రఫీ: సిహెచ్ సాయి (అమరాన్)
➤అత్యుత్తమ ప్రదర్శన: విక్రమ్ (తంగళన్)

టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్: ఒక ఛార్జితో 468 కిమీ ప్రయాణం!

0

ప్రముఖ వాహన తయారీ సంస్థ.. టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మిబిలిటీ లిమిటెడ్ చాలా రోజుల నిరీక్షణ తరువాత పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేసింది. ఇది బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) కింద కూడా లభిస్తుంది. ఇంతకీ దీని ధర ఎంత?, టాటా పంచ్ సాధారణ ఈవీకి, పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌కు మధ్య తేడా ఏమిటనేది ఇక్కడ తెలుసుకుందాం.

ఐదు వేరియంట్ & ధరలు ఇలా

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి స్మార్ట్, స్మార్ట్ ప్లస్, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్ ప్లస్ ఎస్. వీటి ధరలు రూ. 9.69 లక్షల నుంచి రూ. 12.59 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. అయితే దీనిని బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ కింద రూ. 6.49 లక్షలకు కొనుగోలు చేయవచ్చు.

డిజైన్ ఎలా ఉందంటే?

టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ చూడటానికి.. సాధారణ ఈవీ మాదిరిగా ఉన్నప్పటికీ, కొంత అప్డేటెడ్ డిజైన్ గమనించవచ్చు. స్టాండర్డ్ ఈవీలో కనిపించే బ్లాక్ స్ట్రిప్ ఇప్పుడు.. కొత్త కారులో కనిపించదు. బాడీ కలర్ ప్యానెల్‌లోనే క్లోజ్డ్ ఆఫ్ ఏరియా కనిపిస్తుంది. కాగా డీఆర్ఎల్ స్థానం కూడా మారింది. బంపర్ డిజైన్ కూడా కొంత అప్డేట్ పొంది ఉండటం గమనించవచ్చు. ఇది చూడటానికి కొంత నెక్సాన్ ఈవీ, హారియార్ ఈవీ కార్లను తలపిస్తుంది.

సైడ్ ప్రొఫైల్ గమనిస్తే.. ఇక్కడ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉండటం చూడవచ్చు. సిల్హౌట్ అలాగే ఉన్నప్పటికీ.. వెనుక డిజైన్ కూడా కొంత మార్పు చెంది ఉండటం చూడవచ్చు. ఇది ఏడు రంగుల్లో లభిస్తుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 195 మిమీ కాగా, వాటర్ వాడింగ్ కెపాసిటీ 450 మిమీ వరకు ఉంది. ఈ కారు బరువు 1360 కేజీలు. అయితే ఇది మంచి పనితీరును అందిస్తుంది.

ఇంటీరియర్ ఫీచర్స్ ఇలా..

టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ చాలా వరకు అప్డేట్ అయింది. లోపల 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఇల్యూమినేటెడ్ లోగోతో టూ స్పోక్ స్టీరింగ్ వీల్ ఉండటం ఇందులో గమనించవచ్చు. సెంటర్ కన్సోల్‌లో టచ్ ఆపరేటేడ్ కంట్రోల్స్ మాత్రమే కాకుండా.. రోటరీ డయల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, క్రూయిజ్ కంట్రోల్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్ వంటివన్నీ ఉన్నాయి.

సేఫ్టీ కోసం.. ఆరు ఎయిర్‌బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా, రియర్ వైపర్, డీఫాగర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఐసోఫిక్స్ మౌంట్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం మొదలైనవి ఉన్నాయి.

బ్యాటరీ & రేంజ్ వివరాలు

టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ కారు 40 కిలోవాట్ బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. ఇది 7.2 కేడబ్ల్యు, 3.3 కేడబ్ల్యు ఛార్జర్ వంటి వాటికి మాత్రమే కాకుండా 65 కేడబ్ల్యు డీసీ ఫాస్ట్ ఛార్జర్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 26 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఈ కారు ఒక ఫుల్ ఛార్జితో 468 కిమీ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే వాస్తవ ప్రపంచంలో రేంజ్ కొంత తగ్గవచ్చు.

కంపారిజన్

పాత పంచ్ ఈవీకి.. 2026 పంచ్ ఈవీకి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. ఇందులో కేవలం ధరలు మాత్రమే కాకుండా.. బ్యాటరీ ఆప్షన్ కూడా. ఓల్డ్ మోడల్ 25 కిలోవాట్, 35 కిలోవాట్ బ్యాటరీ ఎంపికలతో లభిస్తే.. కొత్త మోడల్ 40 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. డిజైన్ & ఫీచర్స్ విషయాల్లో కూడా సూక్షమైన అప్డేట్స్ ఉండటం ఇక్కడ చూడవచ్చు.