Home Blog Page 64

టెరాన్ కారు లాంచ్ చేసిన ఫోక్స్‌వ్యాగన్: రూ.51 వేలతో బుకింగ్స్!

0

ఫిబ్రవరి నెలలో కొత్త కార్ల లాంచ్ జరుగుతూనే ఉంది. ఇప్పటికే మారుతి సుజుకి కంపెనీ ఈవిటారా లాంచ్ చేయగా, నిస్సాన్ కంపెనీ గ్రావైట్ కారును లాంచ్ చేసింది. ఇప్పుడు ఫోక్స్‌వ్యాగన్ సంస్థ టెరాన్ ఆర్-లైన్ లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ కారు డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ వివరాలతో పాటు, ధరలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.

ఫోక్స్‌వ్యాగన్ లాంచ్ చేసిన టెరాన్ ఆర్-లైన్ కారు ప్రారంభ ధర రూ. 46.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు కోసం ఫ్రీ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభమైపోయింది. కాబట్టి రూ.51 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్..

సెవన్ సీటర్ విభాగంలో లాంచ్ అయిన ఫోక్స్‌వ్యాగన్ టెరాన్ ఆర్-లైన్ ఎంక్యూబీ ఈవీఓ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైన మూడు వరుసల కారు. ఇందులోని 2.0 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ 204 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డీఎస్జీ & ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇది 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం కావడానికి పట్టే సమయం 7.3 సెకన్లు మాత్రమే. ఈ కారు టాప్ స్పీడ్ 224 కిమీ/గం అని తెలుస్తోంది.

ఫుల్లీ లోడెడ్ మోడల్!

టెరాన్ ఆర్-లైన్ కారు మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్స్, 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటి వాటితో పాటు ముందు, వెనుక భాగంలో ప్రకాశవంతమైన లోగోలు పొందుతుంది. మొత్తం మీద ఇది ప్రీమియం జర్మన్ డిజైన్ కలిగి.. చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంది.

అప్డేటెడ్ ఫీచర్స్

విలాసవంతమైన క్యాబిన్, విశాలమైన లేఅవుట్ కలిగిన ఈ కారు.. పనోరమిక్ సన్‌రూఫ్, ఏర్గోనమిక్ ఫ్రంట్ సీట్లు పొందుతుంది. డ్యాష్‌బోర్డ్‌లో 15 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, 10.25 ఇంచెస్ డిజిటల్ కాక్‌పిట్, అగ్మెంటెడ్ హెడ్స్ అప్ డిస్‌ప్లే కూడా ఉన్నాయి. ముందు సీట్లు మెమరీ, వెంటిలేషన్, మసాజ్ ఫీచర్, లంబార్ సపోర్ట్ వంటి వాటితో 12 వే అడ్జస్టబుల్ అందిస్తాయి. యాంబియంట్ లైటింగ్ సిస్టమ్‌లో 30 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి.

కావలసినన్ని సేఫ్టీ ఫీచర్స్

భద్రత విషయానికి వస్తే.. ఫోక్స్‌వ్యాగన్ టెరాన్ ఆర్-లైన్ కారు తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు పొందుతుంది.ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసెంట్, డీసెంట్ అసిస్ట్, మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. లెవల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉండటం వల్ల.. ప్రయాణికులు కొంత భద్రతను పొందవచ్చు. ప్రస్తుత కాలంలో.. డిజైన్, ఫీచర్స్ మాత్రమే కాకుండా.. సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా కార్లనే వాహన వినియోగదారులు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు.

ప్రత్యర్థులు ఇవే..

ఈ కొత్త కారు ఇండియన్ మార్కెట్లోని.. స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్, టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ మెజెస్టర్ వంటి వాటికి అమ్మకాల్లో ప్రధాన ప్రత్యర్థిగా వ్యవహరించనుంది. కాబట్టి అమ్మకాల్లో ఇది కొంత పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది. ప్రీమియం డిజైన్, ఫీచర్స్ కావాలనుకునే వారికి టెరాన్ కారు మంచి ఎంపిక అవుతుంది. కాగా కంపెనీ ఇప్పుడు దేశీయ విఫణిలో టైగన్, వర్టస్ వంటి మోడల్స్ విక్రయిస్తోంది. ఇవి కూడా అమ్మకాల్లో ఆశాజనకంగానే ఉన్నాయి.

నిస్సాన్ గ్రావైట్ వచ్చేసింది: ధర రూ.5.65 లక్షలు మాత్రమే!

0

మాగ్నైట్ ఎస్‌యూవీతోనే కాలం నెట్టుకొస్తున్న నిస్సాన్ కంపెనీ.. ఎట్టకేలకు గ్రావైట్ పేరుతో కాంపాక్ట్ ఎంపీవీ లాంచ్ చేసింది. రెనాల్ట్ కంపెనీ మాదిరిగా సీఎంఎఫ్ ఏ ప్లస్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ కారు.. అత్యాధునిక డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఈ లేటెస్ట్ కారు ధరలు ఎలా ఉన్నాయి?, ఇతరత్రా వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

ధరలు & బుకింగ్స్

నిస్సాన్ కంపెనీ లాంచ్ చేసిన గ్రావైట్ కారు ప్రారంభ ధర రూ.5.65 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే ఈ ధర మొదటి 5000 యూనిట్లకు మాత్రమే పరిమితం. అంతే కాకుండా.. మొదటి 5000 బుకింగ్‌లకు మొదటి ఐదేళ్ల పాటు ఉచితంగానే సర్వీస్, అప్‌గ్రేడ్ ప్రయోజనాలు లభిస్తాయి. సంస్థ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది.

గ్రావైట్ కారు చూడటానికి చాలా వరకు ట్రైబర్ మాదిరిగా ఉంటుంది. హెడ్‌లైట్‌లలో విభిన్నమైన డీఆర్ఎల్ సిగ్నేచర్ పొందుతుంది. ప్రత్యేకంగా కనిపించే వీల్ డిజైన్.. సీ షేప్ సిల్వర్ ఇన్సర్ట్‌లతో రీడిజైన్ చేయబడిన బంపర్స్, బోనెట్ & టెయిల్‌గేట్ మీద గ్రావైట్ అనే ఇంగ్లీష్ అక్షరాలు ఉండటం చూడవచ్చు. హనీకూంబ్ గ్రిల్ ఉంటుంది. డిజైన్ చూడటానికి ఆకట్టుకునే విధంగా ఉందని మాత్రమే అర్థమవుతోంది.

కలర్ ఆప్షన్స్

నిస్సాన్ గ్రావైట్ ఫారెస్ట్ గ్రీన్, ఒనిక్స్ బ్లాక్, బ్లేడ్ సిల్వర్, స్నో వైట్, మెటాలిక్ గ్రే అనే రంగులలో లభిస్తుంది. కాగా కంపెనీ దీనిని లిమిటెడ్ రన్ లాంచ్ ఎడిషన్ రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది. ఇది 1001 యూనిట్లకు మాత్రమే పరిమితం. ఇది సీ షేప్ ఇన్సర్ట్‌లకు ఆరంజ్ కలర్ యాక్సెంట్స్, సైడ్ వైట్ టైర్ ప్రింట్ డెలాక్స్ పొందుతుంది.

ఫీచర్స్ జాబితా

ఇంటీరియర్ విషయానికి వస్తే.. నిస్సాన్ గ్రావైట్ 5+2 సీటింగ్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. డ్యాష్‌బోర్డ్ డిజైన్ చాలా సరళంగా ఉంటుంది. త్రీ స్పోక్ ప్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, క్లైమేట్ కంట్రోల్స్, స్టోరేజ్ స్పేస్ మొదలైనవి ఉన్నాయి. డ్యాష్‌బోర్డ్ మధ్య భాగంలో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 7 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమాటిక్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, యాంబియంట్ లైటింగ్, జేబీఎల్ సౌండ్ సిస్టం, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ కూడా ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. గ్రావైట్ ఎంపీవీ ఆరు ఎయిర్‌బ్యాగులు, రియర్ ఏసీ వెంట్స్, పార్కింగ్ సెన్సార్లు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, రివర్స్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం మొదలైనవి ఉన్నాయి.

ఇంజిన్ వివరాలు ఇవే

నిస్సాన్ గ్రావైట్ 1.0 లీటర్ త్రీ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 72 హార్స్ పవర్, 96 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 19.3 కిమీ/లీ మైలేజ్ అందిస్తే.. ఆటోమాటిక్ వేరియంట్ 19.6 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. కంపెనీ దేనిని త్వరలనే సీఎన్‌జీ రూపంలో కూడా లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం.

మారుతి సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు ఇదే.. ధర రూ.10.99 లక్షలు!

0

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ కంపెనీ.. ఇండియన్ మార్కెట్లో చెప్పినట్లుగానే తన తొలి ఎలక్ట్రిక్ కారు ‘ఈ విటారా‘ను లాంచ్ చేసింది. ఈ కథనంలో దీని ధరలు, బ్యాటరీ, రేంజ్, ప్రత్యర్థులు మొదలైన చాలా విషయాలను వివరంగా తెలుసుకుందాం.

కంపెనీ లాంచ్ చేసిన మారుతి ఈవిటారా కారు ప్రారంభ ధర రూ.10.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ ధరలు మార్చి 31 వరకు మాత్రమే. అంటే ఆ తరువాత కారు ధరలు మారే అవకాశం ఉంది. అయితే కంపెనీ ఈ కారును బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ కింద కూడా విక్రయిస్తోంది. దీని ప్రకారం.. ధరలు ఇంకా తగ్గుతాయి. ఈ కారు కోసం రూ.21 వేలు చెల్లించి బుక్ చేసుకునే అవకాశాన్ని సంస్థ కల్పించింది.

బ్యాటరీ & రేంజ్

కొత్త మారుతి సుజుకి ఈవిటారా ఎలక్ట్రిక్ కారు హార్టెక్ట్ ఈ ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా నిర్మితమైంది. ఇది 49 కిలోవాట్ బ్యాటరీ, 61 కిలోవాట్ బ్యాటరీ అనే రెండు బ్యాటరీ ఎంపికలలో లభిస్తుంది.

49 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఈవిటారా 144 హార్స్ పవర్ అందిస్తుంది. సింగిల్ మోటార్ పొందుతుంది. 61 కిలోవాట్ బ్యాటరీ కూడా ఒకే మోటారును కలిగి 174 హార్స్ పవర్ అందిస్తుంది. ఈ రెండూ 189 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. రేంజ్ విషయానికి వస్తే.. చిన్న బ్యాటరీ 440 కిమీ రేంజ్ అందిస్తుంది. పెద్ద బ్యాటరీ 543 కిమీ రేంజ్ అందిస్తుంది.

ఈవిటారా ఈవీ డిజైన్

మారుతి సుజుకి ఈవిటారా కారు ట్రై-ఎల్ఈడీ డీఆర్ఎల్, ముందు భాగంలో క్లోస్డ్ గ్రిల్ ఉన్నాయి. దిగువ బంపర్‌లో స్కిడ్ ప్లేట్‌లతో పాటు చిన్న ఫాగ్ లాంప్ కూడా ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ ఏరోడైనమిక్ డిజైన్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. వెనుక భాగంలో టెయిల్ లాంప్ కోసం స్పెషల్ డిజైన్ ఉండటం చూడవచ్చు. చూడటానికి చాలా వరకు సాధారణ విటారా మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని అప్డేట్స్ కనిపిస్తాయి.

క్యాబిన్ & ఫీచర్స్

అద్భుతమైన డిజైన్ కలిగిన క్యాబిన్ ఈవిటారా ఎలక్ట్రిక్ కారు సొంతం. ఇందులో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ రెండింటికీ ప్లోటింగ్ డ్యూయల్ స్క్రీన్ ఉన్నాయి. గ్లోసీ బ్లాక్ ఫినిషింగ్‌తో ప్లోటింగ్ సెంటర్ కన్సోల్ ఉంది. గేర్ ఎంపికల కోసం కంట్రోల్స్, ఈ-బ్రేక్, డ్రైవ్ మోడ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఇందులో చూడవచ్చు. టూ స్పోక్ స్టీరింగ్ వీల్, బ్రష్డ్ సిల్వర్ యాక్సెంట్‌లతో దీర్ఘచతురస్రాకార ఏసీ వెంట్స్, రోటరీ డ్రైవ్ స్టేట్ సెలెక్టర్, లెథరెట్ అపోల్స్ట్రే కూడా లభిస్తాయి.

ఫీచర్స్ విషయానికి వస్తే.. 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు అనుకూలమైన 10.1 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, క్లౌడ్ బేస్డ్ న్యావిగేషన్, పనోరమిక్ సన్‌రూఫ్, 12 కలర్ ఆప్షన్‌లతో యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఇవి కాకుండా.. వైర్‌లెస్ ఛార్జింగ్, జేబీఎల్ సౌండ్ సిస్టం, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టిపుల్ యూఎస్బీ పోర్టులు, ఎయిర్ ప్యూరిఫైయర్ మొదలైనవి కూడా ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్స్

కారు కొనాలంటే.. చాలామంది ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న కార్లనే కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ.. తన విటారా కారులో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లెవల్ 2 ఏడీఏఎస్ మొదలైనవి ఉన్నాయి.

డిగ్రీ అర్హతతో ఆర్‌బీఐలో ఉద్యోగం.. అర్హతలు, జీతం వివరాలు ఇవే!

0

చదువున్న ప్రతి ఒక్కరూ.. ఒకే రంగంవైపు రావాలని ఏమి ఉండదు, కదా!. ఎవరి అభిరుచి వారిది. ఉద్యోగ సంపాదనలో ఎవరి దారి వారిది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా బ్యాంకింగ్ రంగంవైపు వస్తున్నా యువత చాలామంది ఉన్నారు. ఇలాంటి వారిలో.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)లో జాబ్స్ తెచ్చుకోవాలని కలలు కంటుంటారు. అలాంటి వారికి ఇప్పుడు శుభవార్త.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని వివిధ కార్యాలయాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 650 పోస్టులు ఉన్నట్లు వెల్లడించింది. పరీక్షలో మంచి ర్యాంక్ తెచ్చుకోవడం ద్వారా జాబ్ సొంతం చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

  • ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకునేవారు ఈ రోజు (2026 ఫిబ్రవరి 16) నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
  • అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 2026 మార్చి 08.
  • ఫీజు చెల్లించటానికి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 16 నుంచి మార్చి 8 వరకు.
  • ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ 2026 ఏప్రిల్ 11
  • ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్ 2026 జూన్ 7 (అభ్యర్థులు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అవసరమైతే ఈ తేదీలను మార్చుకునే హక్కు ఆర్‌బీఐకు ఉంటుంది.

ఖాళీల వివరాలు

హైదరాబాద్, బెంగళూరు. ఢిల్లీ, ముంబై, భోపాల్, చండీగఢ్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, లక్నో, కోల్‌కతా, అహ్మదాబాద్, చెన్నై, గువహతి, పాట్నా, నాగ్‌పూర్, తిరువనంతపురం మొదలైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాల్లో 650 అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.

అర్హతలు

  • ఆర్‌బీఐ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకే వ్యక్తి తప్పకుండా భారతీయ పౌరుడై ఉండాలి.
  • వయసు కనీసం 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయసు సడలింపులు ఉంటాయి.
  • విద్యార్హత కనీసం 50 శాతం మార్కులతో బ్యాచలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • కంప్యూటర్‌లో వర్డ్ ప్రాసెసింగ్ స్కిల్ ఉండాలి.
  • అప్లై చేసుకునే అభ్యర్థి రాష్ట్రం లేదా ప్రాంతన్ని బట్టి స్థానిక భాషపై పట్టు (చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం) ఉండాలి.

సెలక్షన్ & పరీక్షా విధానం

  • ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (ఎల్పీటీ) అనే మూడు ఎంపికల ఆధారంగా సెలక్షన్ ప్రక్రియ ఉంటుంది. నెగటివ్ మార్కులు ఉంటాయి అభ్యర్థులు గమనించాలి.
  • ప్రిలిమినరీ ఎగ్జామ్ 100 మార్కులు.. 60 నిముషాలు (ఇంగ్లీష్ – 30 మార్కులు, రీజనింగ్ – 35 మార్కులు, న్యూమరిక్ ఎలిజిబిలిటీ – 30 మార్కులు)
  • మెయిన్స్ 200 మార్కులు (రీజనింగ్ 40 మార్కులు, ఇంగ్లీష్ 40 మార్కులు, న్యూమరికల్ ఎలిజిబిలిటీ 40 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 40 మార్కులు, కంప్యూటర్ పరిజ్ఞానం 40 మార్కులు)

అప్లికేషన్ ఫీజు & జీతభత్యాలు!

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.450 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులు రూ.50 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి.
  • ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల బేసిక్ శాలరీ రూ.29000. ఇతర అలవెన్సులు కలిపి నెలకు దాదాపు రూ.58514 జీతంగా లభిస్తుంది.

ఏ విభాగం నుంచి ఎన్ని మార్కులు అనే వివరాలు తెలిసిపోయింది. కాబట్టి ఈ ఉద్యోగానికి సిద్ధమయ్యే అభ్యర్థులు ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధమైతే.. తప్పకుండా జాబ్ తెచ్చుకోవచ్చు. పరీక్షలు కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని సన్నద్ధమవ్వడానికీ ప్రయత్నించాలి.

2026లో తొలి సూర్యగ్రహణం.. టైమ్.. పాటించాల్సిన నియమాలు!

0

సూర్య, చంద్ర గ్రహణాలు గురించి అందరూ వినే ఉంటారు. ఈ గ్రహణాల వెనుక సైన్స్, సంప్రదాయాలు ఉన్నాయి. అయితే 2026 ప్రారంభమైన తరువాత ఏర్పడనున్న మొదటి సూర్యగ్రహణం ఈ రోజే (ఫిబ్రవరి 17). గ్రహణం సమయం ఏమిటి?, భారతదేశంలో కనిపిస్తుందా?, దీని ప్రభావం ఏమిటి? వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2026లో తొలి సూర్యగ్రహణం

అమావాస్య రోజున సూర్యగ్రహణం సంభవించడం సర్వ సాధారణం. అయితే దీనికి తోడు ఈ రోజు మంళవారం కూడా. కాబట్టి దీనిని కొందరు అశుభంగా భావిస్తారు. అయితే ఇది అశుభం కాదని, అశుభం అనేది కేవలం అపోహ మాత్రమే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇకపోతే ఈ రోజు ఏర్పడనున్న సూర్యగ్రహణాన్ని కంకణాకార సూర్యగ్రహణం అంటారు. ఇది భారతదేశంలో కనిపించదు (అంటే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించాడన్నమాట). భూమికి, సూర్యునికి మధ్యలో చంద్రడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యుడు కొంత సమయం కనిపించడు. దీన్నే సూర్యగ్రహణం అంటారు.. ఇది సైన్స్. కానీ రాహువు.. సూర్యన్ని మింగేస్తాడని అప్పుడు కొంత సమయం సూర్యుడు కనిపించడు, ఇదే సూర్యగ్రహణం అంటారని హిందూ సంప్రదాయాలు చెబుతున్నాయి.

కంకణకార సూర్యగ్రహణం అంటే?

చంద్రుడు భూమి నుంచి కొంత దూరంగా ఉన్నప్పుడు అది చిన్నగా కనిపించడమే కాకుండా.. సూర్యుని కేంద్రాన్ని కప్పివేస్తూ సూర్యగ్రహణాన్ని ఏర్పరుస్తుంది. ఇలాంటి సమయంలో సూర్యుని అంచులు మిరమిట్లు గొలిపే ఒక వలయం మాదిరిగా కనిపిస్తుంది. దీన్నే రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఏఏ దేశాల్లో సూర్యగ్రహణం కనిపిస్తుంది?

భారతదేశంలో ఈ రోజు సూర్యగ్రహణం కనిపించదు. అయితే సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, అంటార్కిటికా, దక్షిణ అమెరికా, మారిషస్, టాంజానియా, అర్జెంటీనా మొదలైన దేశాల్లో కంకణాకార సూర్యగ్రహణం సంభవిస్తుంది. భారతకాలమానం ప్రకారం.. గ్రహణం మధ్యాహ్నం 3.26 గంటల నుంచి రాత్రి 7.58 గంటల వరకు ఉంటుంది. అంటే మొత్తం గ్రహణ సమయం 4 గంటల 32 నిముషాలు.

సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు, కాబట్టి సూతక కాలం పాటించాల్సిన అవసరం లేదు. బహుశా దేవలయాలు కూడా మూసివేయకపోవచ్చు. గర్భిణీ స్త్రీలు కూడా ప్రత్యేకించి నియమాలు పాటించాల్సిన అవసరం లేదని కొందరు చెబుతున్నారు. కానీ గర్భిణీలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

సూర్యగ్రహణం నేరుగా చూడవచ్చా?

సంపూర్ణ సూర్యగ్రహణం లేదా పాక్షిక సూర్యగ్రహణం వంటి సమయంలో ప్రజలు ఈ దృశ్యాలను నేరుగా వీక్షించకూడదు. దీనికి కారణం సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు నేరుగా కళ్లపై పడితే.. ప్రమాదం జరగవచ్చు. ఎందుకంటే.. గ్రహణం సమయంలో సూర్యుని నించి శక్తివంతమైన కిరణాలు వెలువడతాయని కొందరి నమ్మకం. కాబట్టి.. సూర్యగ్రహణం చూడాలనుకునేవారు టెలిస్కోప్, బైనాక్యులర్ లేదా బ్లాక్ కళ్లజోడు ద్వారా ఉపయోగించాల్సి ఉంటుంది. నేరుగా చూడటం ప్రమాదం.

జాగ్రత్తలు అవసరమా?

సాధారణంగా భారతదేశంలో గ్రహణం కనిపించినట్లయితే.. దేవాలయాలు మూసి వేస్తుంటారు. గర్భిణీ స్త్రీలు సైతం బయట తిరగకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తారు. గ్రహణం పూర్తయిన తరువాత స్నానాది కార్యక్రమాలు ఆచరించి.. దేవాలయాలను సందర్శిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతారు. అయితే ఈ రోజు ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి.. ఇలాంటి బహుశా అవసరం లేదేమో. జాగ్రత్తలు తీసుకున్నా.. మంచిదే.

ఎక్కువ దూరం వెళ్లే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

0

ఇండియాలో బైక్ అయినా.. స్కూటర్ అయినా, కార్ అయినా ఇంకే వాహనం అయినా.. కొనేవాళ్లు ముందుగా చూసేది మైలేజ్. కాబట్టి ఈ కథనంలో ఎక్కువ దూరం ప్రయాణించే ఐదు ఉత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి (ధర, బ్యాటరీ, రేంజ్) పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఓలా ఎస్1 ప్రో

దేశీయ టూ వీలర్ దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్.. మార్కెట్లో లాంచ్ చేసిన ఎస్1 ప్రో ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటర్లలో ఒకటి. ఇది 5.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పిందుతుంది. కాగా ఈ స్కూటర్ ఎస్1 ప్రో స్పోర్ట్స్, ఎస్1 ప్రో ప్లస్ అనే వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 1,49,999, రూ. 1,54,999 (ఎక్స్ షోరూమ్). ప్రో ప్లస్ వేరియంట్ స్కూటర్ 13 కిలోవాట్ పవర్ ప్రొడ్యూస్ చేస్తూ.. 2.1 సెకన్లలో 0 నుంచి 40 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 130 కిమీ దూరం ప్రయాణిస్తుంది. కాగా ప్రో స్పోర్ట్స్ వేరియంట్ 152 కిమీ దూరం ప్రయాణించగలదు.

సింపుల్ ఎనర్జీ వన్ జెన్ 2

5.0 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 265 కిమీ రేంజ్ అందించే సింపుల్ ఎనర్జీ కంపెనీకి చెందిన ఈ వన్ జెన్ 2 స్కూటర్ మన జాబితాలో చెప్పుకోదగ్గ మోడల్. దీని ధర రూ. 177999 (ఎక్స్ షోరూమ్). మంచి డిజైన్, లేటెస్ట్ బ్యాటరీ కలిగిన ఈ మోడల్ అనేక అప్‌గ్రేడ్‌లతో మార్కెట్లో అమ్మకానికి ఉంది. 2.55 సెకన్లలో 0 నుంచి 40 కిమీ/గం వేగవంతం అయ్యే ఈ స్కూటర్ 115 కిమీ వేగంతో ముందుకు దూసుకెళ్తుంది.

టీవీఎస్ ఐక్యూబ్

ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన టీవీఎస్ స్కూటర్. ఇది 5.3 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 212 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని ధర రూ. 1,58,834 (ఎక్స్ షోరూమ్). 4.5 సెకన్లలో 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అయ్యే ఈ స్కూటర్ 4.4 కిలోవాట్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 82 కిమీ వేగంగా ముందుకెళ్తుంది. ఈ స్కూటర్ 17.78 సెంమీ టచ్‌స్క్రీన్ పొందుతుంది. డిజైన్ చూడచక్కగా ఉంటుంది.

విడా వీ2

ఎక్కువ దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో విడా వీ2 కూడా ఒకటి. ఇది 165 కిమీ (ఒక ఛార్జితో) దూరం ప్రయాణిస్తుంది. దీని ధర రూ. 1,20,300 (ఎక్స్ షోరూమ్). 3.9 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్ 2.9 సెకన్లలో 40 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. దీని స్పీడ్ గంటకు 90 కిమీ. అత్యాధునిక డిజైన్ కలిగిన ఈ స్కూటర్ 7 ఇంచెస్ టచ్‌స్క్రీస్ డ్యాష్ బోర్డు పొందుతుంది. ఇందులోని బ్యాటరీ రిమూవబుల్ (బయటకు తీయొచ్చు). క్రూయిజ్ కంట్రోల్, బ్రేక్ రీజెన్ వంటి ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.

రివర్ ఇండీ

రూ. 1,46,399 ధర (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే ఈ స్కూటర్.. ఒక ఫుల్ ఛార్జితో 163 కిమీ దూరం ప్రయాణిస్తుంది. ఒక వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ స్కూటర్ 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది 3.5 సెకన్లలో 40 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం 90 కిమీ/గం. కాగా ఇది హిల్ హోల్డ్ అసిస్ట్, రీడిజైన్ క్లస్టర్ వంటివి పొందుతుంది. కాబట్టి ఇది అన్ని విధాలా రైడింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

ఏడుకొండల స్వామికి ఎందుకు శనివారం ప్రత్యేకం!

0

కలియుగ ప్రత్యక్ష దైవం.. ఏడుకొండల వెంకన్న అందరికీ ఆరాధ్యదైవమే. కుల, మత బేధాలు లేకుండా అందరూ దర్శించుకుంటూ ఉంటారు. ఈ కారణంగానే.. ప్రతి రోజూ లక్షలాదిమంది భక్తులు తిరుమలకు వెళ్తుంటారు. భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుమల పరమ పవిత్రం, పావనం. తిరుమల గురించి అందరికీ తెలిసిందే, కానీ శ్రీవారిని శనివారం దర్శించుకుంటే మంచిదని చాలామంది అనుకుంటుంటారు. నిజంగా శనివారం స్వామివారికి ప్రత్యేకమేనా?, ఈ రోజు దర్శించుకుంటే మాత్రమే కోరిన కోరికలు నెరవేరుతాయా?, దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటనే తెలుసుకుందాం.

శనివారం ప్రత్యేకం!

హిందూ సంప్రదాయం ప్రకారం.. ప్రతి దేవునికి ఒక్కో ప్రత్యేకమైన రోజు ఉంటుందని నమ్మకం. ఇందులో భాగంగానే వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రత్యేకం అని విశ్వసిస్తారు. కానీ స్వామివారికి ప్రతిరోజూ ప్రత్యేకమే, ప్రతి రోజూ సమానమే. అయితే శనివారం మాత్రం ఆధ్యాత్మిక, జ్యోతిష్య శాస్త్రాలకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి.

శని ప్రభావం నుంచి విముక్తి!

శనివారం.. శనిగ్రహానికి సంబంధించిందని, శని ప్రభావం నుంచి బయటపటడానికి వెంకటేశ్వర స్వామిని ఎక్కువమంది పూజిస్తారు. ఈ రోజున చాలామంది శనివారం రోజు స్వామివారిని దర్శించుకోవడం మాత్రమే కాకుండా.. వ్రతాలు మొదలైనవి కూడా చేస్తారు. ఏది ఏమైనా.. శనివారం రోజు భక్తుల రద్దీ కొంత ఎక్కువగా ఉంటుంది. కొందరు భక్తులు శనివారం రోజు ప్రత్యేకంగా.. ఉపవాసాలు ఉండి, పూజలు చేసి, సాయంత్రం ప్రసాదం తీసుకుంటారు.

రోజువారీ సేవలు యథాతథం!

పురాణాల ప్రకారం.. వెంకటేశ్వర స్వామిని కష్టాలు, బాధలు తొలగించే దయామయుడిగా కొలుస్తారు. కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం.. దేవదేవుణ్ణి శనివారం రోజు కొలవడం సర్వసాధారణం అయిపోయింది. మొత్తం మీద చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. శనివారం అని కొందరు చెప్పుకుంటారు, కానీ కొండపైన అన్ని సేవలు రోజువారీగా నిర్విఘ్నంగా జరుగుతుంటారు.

శనైశ్వరునికి.. శనివారానికి సంబంధం

ఒక్కొరోజుకి ఒక్కో గ్రహాధిపతి ఉంటారని హిందూ పురాణాలూ చెబుతాయి. దీని ప్రకారమే శనివారానికి శనైశ్వరుడు అధిపతి. అందుకే ఈ రోజు (శనివారం) శని దేవునికి ప్రత్యేక పూజలు చేసి, ఆయన కృపకు పాత్రులు అవుతారు. సూర్య భగవానుని కుమారుల్లో ఒకరైన ఈయన.. న్యాయదేవునిగా ప్రసిద్ధి చెందారు. మనిషి చేసిన పాప పుణ్యాల ఫలితంగానే వారికి ఫలితాలను ఇస్తారు. శని గ్రహాన్ని కర్మ ఫలదాత అని కూడా అంటారు. కాబట్టి ప్రజలు ప్రత్యేకించి శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు చేసుకుంటారు.

తిరుమల గురించి

భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుమల, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోవెల. ఇక్కడికి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తూ పోతుంటారు. నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా అలరారుతున్న ఈ దేవాలయం చుట్టూ అనేక పుణ్యతీర్థాలు ఉన్నాయి. తిరుమల కొండమీద ఎంతోమంది పుణ్య పురుషులు చెట్లు, పుట్టలు, కొండలుగా ఉంటూ నిత్యం స్వామివారిని సేవించుకుంటున్నారని ఐతిహ్యం. అంతటి మహామాన్విత పుణ్యక్షేత్రం భారతదేశంలో ఉంటడం భారతీయలు చేసిన పుణ్యమనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ కాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన పావన క్షేత్రం ఈ ఇల వైకుంఠం (తిరుమల).

ఆయన జ్ఞాపకార్థంగానే వాలెంటైన్స్ డే.. ప్రేమికులకు కూడా తెలియని నిజాలు!

0

ప్రేమ.. ఇది కేవలం రెండక్షరాల పదమే కావచ్చు. కానీ.. ఎప్పుడు, ఎవరికి, ఎలా పుడుతుందో చెప్పలేము. చెప్పడం మేధావులకు సైతం సాధ్యం కాదు. ఎల్లలు దాటిన ప్రేమ కథలు విన్నాం.. చరిత్రలో నిలిచిపోయిన ప్రేమికుల గురించి కూడా విన్నాం. చాలామంది ప్రేమ, ప్రేమ అంటూ.. ప్రేమికుల రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఈ ప్రేమికుల రోజు ఎలా మొదలైంది?, ఎక్కడ మొదలైందనే విషయం చాలామంది ప్రేమికులకు కూడా తెలియదు. ఈ కథనంలో ఆ విషయాలను తెలుసుకుందాం.

ఆయన జ్ఞాపకార్థంగానే.. వాలెంటైన్స్ డే

ప్రేమికుల రోజు అని ప్రత్యేకంగా చెప్పడమే కానీ.. ప్రేమించేవారికి, ప్రేమలో ఉన్నవారికి ప్రతిరోజూ ప్రేమికుల రోజే. చరిత్రలోకి వెళ్తే.. ప్రేమికుల రోజు ప్రాచీన రోమన్ సామ్రాజ్య కాలానికి చెందింది. అప్పటి రోమన్ చక్రవర్తి క్లాడియస్ II సైనికులు పెళ్లి చేసుకుంటే.. బాధ్యతలు పెరుగుతాయని, యుద్ధంలో ధైర్యంగా పోరాడలేరు అని భావించి.. యువకులకు వివాహాలే నిషేదించారు. అయితే ఆ సమయంలోనే సెయింట్ వాలెంటైన్ (రోమన్ క్యాథలిక్ పూజారి – ఫాదర్).. ప్రేమికులకు రహస్యంగా వివాహాలు జరిపించడం మొదలుపెట్టారు. ఇది తెలుసుకున్న క్లాడియస్ II.. ఆయనను 270 ఏడీ ఫిబ్రవరి 14న ఉరి తీయించారు. ఆయన జ్ఞాపకంగానే ప్రతి ఏటా ఫిబ్రవరి 14న వాలైంటైన్స్ డే జరుపుకోవడం మొదలైంది.

ఆ తరువాత కాలంలో ప్రేమికుల రోజును ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం మొదలుపెట్టారు. ప్రేమికుల రోజు అనేది కేవలం ప్రేమికులకే కాకుండా.. జీవితంలో ముఖ్యమైన వ్యక్తుల పట్ల ప్రేమ, గౌరవం, కృతజ్ఞత తెలియజేయడానికి ఒక ప్రత్యేకమైన సందర్భం.

ప్రేమను వర్ణించడానికి భాష సరిపోదు, భావాలు సరిపోవు. ప్రేమను అనుభవించిన వారికి మాత్రమే ప్రేమ అర్థమవుతుంది. చూసేవారికి లేదా చెప్పేవారికి ప్రేమ ఒక ట్రాష్ లేదా టైమ్ పాస్ అనుకోవచ్చు. నిజమైన ప్రేమ.. ఖండాంతరాలు దాటేస్తుంది. దీనికి ఉదాహరణ ప్రతి ఒక్కరికి, ఏదో ఒక సందర్భంలో తెలిసే ఉంటుంది.

చరిత్రలో నిలిచిన శాశ్వత ప్రేమ కథలు

ప్రేమకు అర్థం ఏమంటే.. నిన్ను నన్ను చూపిస్తా అని ఒక పాటలో వినే ఉంటారు. కానీ ప్రేమంటే.. ఈ రోజుకూ లైలా – మజ్ను, పారు – దేవదాస్, సలీం – అనార్కలి అనే చెబుతారు. అలాంటి ప్రేమికులు నభూతో న భవిష్యత్ అనే చెప్పాలి. బహుశా ఈ కాలంలో కూడా ఎక్కడో ఓ చోట ఉండే ఉండొచ్చు!

లైలా – మజ్ను

తెలుగు సినిమాల్లో కనిపించే లైలా – మజ్ను అనుకుంటే పొరపాటే. అరబ్ దేశాల్లో ప్రసిద్ధి చెందిన ప్రేమ కథ ఈ లైలా – మజ్ను స్టోరీ. నిజానికి మజ్ను పేరు ఖైస్. ఈయన లైలాపై అమితమైన ప్రేమ పెంచుకున్నప్పటికీ.. కుటుంబాల వ్యతిరేఖత, అప్పటి సమాజం పరిస్థితులు వీరి ప్రేమకు అడ్డుకట్ట వేసాయి. ప్రేమలో మునిగిపోయిన ఖైస్‌ను అందరూ మజ్ను అని పిలిచారు. మజ్ను అంటే పిచ్చివాడు అని అర్థం. ఈ కథనే 12వ శతాబ్దంలో ఒక కవి రచించారు. ఆ తరువాత ఇది అందరికీ తెలిసింది.

పారు – దేవదాస్

సినిమాల పుణ్యమా అని కొన్ని కథలు వెలుగులోకి వచ్చాయి. అందులో ఈ పారు – దేవదాస్ ఒకటి. ప్రియురాలిని మర్చిపోలేక, ముందుకు బానిసై చివరికి తాను ప్రేమించిన యువతి ఇంటిముందు ప్రాణం వదిలిన ప్రేమ కథే ఇది. పార్వతి, దేవదాస్ చిన్నప్పటి నుంచే మంచి స్నేహితులు. కుటుంబ గౌరవం, జాత్యహంకార కారణాల వల్ల.. పారు మరొకరిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత ముందుకు బానిసైన దేవదాస్.. చివరికి ప్రేయసి ఇంటి ముందరే కన్ను మూస్తారు.

సలీం – అనార్కలి

ఇది మొఘల్ కాలానికి చెందిన విషాదగాథ. యువరాజు సలీం, నర్తకి అయిన అనార్కలిని ప్రేమించాడు. అయితే ఈయన తండ్రి అక్బర్ వీరి ప్రేమను అంగీకరించలేదు. రాజవంశ గౌరవం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేసాడు. చివరికి సలీం కళ్ల ముందరే.. అనార్కలికి బతికుండగానే సమాధి కట్టాడు. ఇలా ఈ ప్రేమ కథ కూడా విషాదంగా మిగిలిపోయింది.

నిజానికి పైన చెప్పుకున్న సంఘటనలు గమనిస్తే.. ప్రేమకు జాతి, మతం, హెచ్చు తగ్గులు లేవని స్పష్టంగా తెలుస్తోంది. కానీ ప్రేమించుకుంటే.. ప్రాణాలు వదిలేయలేమో అనే అనుమానం కూడా కలుగుతుంది.

ఒక్కటి మాత్రం నిజం.. ప్రేమించినప్పుడు ఉన్నంత ఆనందం.. కలిసి జీవించినప్పుడు ఉండకపోవచ్చు. కాబట్టి ప్రేమించే ముందు.. కలిసి జీవించే ముందు తప్పకుండా ఒకసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఆ ప్రయాణంలో ఇద్దరు మాత్రమే నడవాల్సి ఉంటుంది, ఏ ఒక్కరి అండా కనిపించదు. ఒక్కోసారి భరించలేని బాధలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ”ప్రేమంటే రెండు మనసుల కలయిక మాత్రమే కాదు.. ఎందోమంది మనుషుల దూరం” అనేది తప్పకుండా గుర్తుంచుకోవాలి.

ఎంజీ మెజెస్టర్ vs ఎంజీ గ్లోస్టర్ కంపారిజన్: డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ డీటెయిల్స్!

0

ఎంజీ మోటార్ ఇండియా దేశీయ విఫణిలో మెజెస్టర్ కారును అధికారికంగా ఆవిష్కరించింది. ఇది గ్లోస్టర్ ఆధారంగా రూపొందించంబడినప్పటికీ.. డిజైన్, ఫీచర్స్ వంటి విషయాల్లో మాత్రమే కాకుండా, ధరలో కూడా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ కథనంలో ఈ రెండు ఎస్‌యూవీల మధ్య తేడా ఏమిటి?.. ఇతరత్రా విషయాలు వివరంగా తెలుసుకుందాం.

గ్లోస్టర్ vs మెజెస్టర్ డిజైన్

కొత్త ఎంజీ మెజెస్టర్.. గ్లోస్టర్ కంటే కూడా అత్యాధునిక ఫ్రంట్ ఎండ్ పొందుతుంది. లైటింగ్ సెటప్ భిన్నంగా ఉంటుంది. గ్లోస్టర్ ముందు భాగంలో క్రోమ్ ఎలిమెంట్స్ ఎక్కువగా కనిపిస్తుంది, మెజెస్టర్ తక్కువగా పొందుతుంది. సైడ్ ప్రొఫైల్ దాదాపు గ్లోస్టర్ మాదిరిగానే ఉంటుంది. కానీ మెజెస్టర్ 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కోసం కొత్త డిజైన్, వీల్ ఆర్చెస్, సైడ్ సిల్స్‌కు బ్లాక్ ట్రీట్‌మెంట్ అందిస్తుంది.

ముందు భాగం చాలా భిన్నంగా ఉంటుంది. ఇదే విధంగా వెనుక కూడా చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఇక్కడ రీ డిజైన్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు కనెక్టెడ్ లైట్ బార్ పొందుతుంది. అయితే మెజెస్టర్‌లో బ్రాండ్ లోగో స్థానంలో మోరిస్ గ్యారేజ్ అని ఉండటం చూడవచ్చు. గ్లోస్టర్ క్వాడ్ టిప్డ్ ఎగ్జాస్ట్ పొందుతుంది. మెజెస్టర్ డ్యూయెల్ టిప్డ్ ఎగ్జాస్ట్ పొందుతుంది.

పరిమాణం (డైమెన్షన్స్)

ఎంజీ గ్లోస్టర్ కంటే.. ఎంజీ మెజెస్టర్ కొంత పెద్దదిగా ఉంటుంది. మెజెస్టర్ పొడవు 5046 మిమీ, వెడల్పు 2016 మిమీ, ఎత్తు 1876 మిమీ, వీల్‌బేస్ 2950 మిమీ వరకు ఉంటుంది. గ్లోస్టర్ విషయానికి వస్తే.. దీని పొడవు 4985 మిమీ, వెడల్పు 1926 మిమీ, ఎత్తు 1867 మిమీ, వీల్‌బేస్ 2950 మిమీ మాత్రమే.

ఇంటీరియర్ & ఫీచర్స్

మెజెస్టర్ క్యాబిన్ లేఅవుట్ గ్లోస్టర్ కంటే భిన్నంగా ఉంటుంది. గ్లోస్టర్ బ్లాక్ అండ్ బేజ్ థీమ్ పొందితే.. మెజెస్టర్ సింగిల్ టోన్ బ్లాక్ థీమ్ పొందుతుంది. ఇందులో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కనిపిస్తాయి. సెంటర్ కన్సోల్ మౌంటెడ్ గ్రాబ్ హ్యాండిల్స్ పొందుతుంది. ఇది 6 సీట్లు, 7 సీట్ల వేరియంట్లుగా అందుబాటులో ఉంటాయి.

ఎంజీ మెజెస్టర్ కొత్త ఫీచర్స్ జాబితాలో.. పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ల కోసం హీటింగ్, మసజింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి. జేబీఏ 12 స్పీకర్ ఆడియో సిస్టం, రెండు వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్‌లు ఉన్నాయి. ఆఫ్ రోడింగ్ కోసం డిఫరెన్షియల్ లాకింగ్, క్రాల్ మోడ్ వంటివి ఉన్నాయి.

గ్లోస్టర్ vs మెజెస్టర్ పవర్‌ట్రెయిన్

ఎంజీ మెజెస్టర్ కారులో.. గ్లోస్టర్ కారులోని అదే 2.0 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఇంజిన్ 215 హార్స్ పవర్ & 478 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ కారు 4×2, 4×4 డ్రైవ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. అయితే గ్లోస్టర్ కారులోని 2.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ 161 హార్స్ పవర్, 374 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ధరలు ఇలా..

ఎంజీ గ్లోస్టర్ ధరలు రూ. 38.33 లక్షల నుంచి రూ. 46.24 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. అయితే మెజెస్టర్ ధరలు అధికారికంగా వెల్లడి కాలేదు.. కానీ దీని ధరలు రూ. 40 లక్షల నుంచి రూ. 45 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది. కాగా కంపెనీ దీని కోసం రూ. 41000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు మే 2026లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

మహా శివరాత్రి హిస్టరీ.. భారత్‌లోనే కాదు నేపాల్‌లో కూడా!!

0

రానున్నది మహా శివరాత్రి. హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఇది ఒకటి. ప్రతి ఏటా.. వచ్చే ఈ పండుగను దేశవ్యాప్తంగా అత్యంత భక్తితో జరుపుకుంటారు. సాధారణంగా ఈ పండుగ ఫిబ్రవరి – మార్చి నెలల్లో వస్తుంది. ఈసారి ఫిబ్రవరి 15న (ఆదివారం) వచ్చింది.

పురాణాల ప్రకారం..

మహా శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహా శివరాత్రి అని పురాణాలూ చెబుతాయి. లింగోద్భవం ఈ రోజున జరిగిందని, శివ పార్వతుల కల్యాణం, సాగర మధనం కూడా ఈ రోజునే జరిగాయని.. అందుకే ఇది అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. మహా శివరాత్రి పండుగను.. అటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు.. దేశంలో నలుమూలలా జరుపుకుంటారు.

ఉపవాస దీక్ష..

శివరాత్రి రోజున చాలామంది ఉపవాస దీక్షతో ఉండి.. శివాలయాలకు వెళ్తారు. దేవదేవుణ్ణి (శివుడు) భక్తితో పూజిస్తారు. కేవలం పత్రం, ఫలం, నీరు సమర్పిస్తే చాలు ఆ జంగమయ్య మురిసిపోతాడని ఎంతోమంది యోగులు చెబుతుంటారు. ఆడంబరాలు లేకుండా.. జరుపుకునే పండుగలలో ఇది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.

ఇలా శుభ ఫలితాలు..

ఉదయాన్నే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకోవాలి. శుభ్రమైన దుస్తులు ధరించి.. దేవదేవుని నామస్మరణ చేస్తూ, శివయ్యకు మీకు తోచింది (పువ్వు, బిల్వ పత్రమో ఇలా..) ఎదో ఒకటి సమర్పించాలి. కోపాన్ని వదిలి.. ప్రేమతో మెలగాలి. అభ్యాగతులను సైతం ఆదరించాలి.

రోజంతా ఉపవాసం ఉండి.. రాత్రి సమయంలో జాగారం (నిద్రపోకుండా ఉండటం) చేస్తారు. ఈ సమయంలో ఓం నమఃశివాయ అనే మంత్రం జపించుకోవాలని కొందరు చెబుతారు. ఈ మంత్రం శుభ ఫలితాలను ఇస్తుందని నమ్మకం. అంతే కాకుండా శివ పురాణం చదవడం, భజనలు చేయడం వంటివి కూడా చేస్తుంటారు.

శివుని ప్రత్యకత & గొప్పతనం

పురాణాల ప్రకారం.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు (శివుడు) అని చెబుతారు. ఇందులో శివుడు లయకారుడు, బోళాశంకరాదు. కేవలం దేవతలకు మాత్రమే కాకుండా.. రాక్షసులకు సైతం వారలు ఇచ్చే దయామయుడు ఆ పరమేశ్వరుడు. సాగర మధనం సమయంలో పుట్టిన హాలాహలం(విషం)ను కంఠంలో దాచి సృష్టిని కాపాడిన జంగమయ్య.. అందరికీ ఆరాధ్య దైవం. మెడలో పాము, చేతిలో త్రిశూలం పట్టుకుని హిమాలయ్యాలో ధ్యానంలో ఉండిపోయే ఆ మహానుభావుడు, భక్తులపాలిట కల్పతరువు.

మహా శివుడు అంటే.. దయకు, త్యాగానికి నిలువెత్తు నిదర్శనం, సమానత్వానికి సంకేతం, ఆధ్యాత్మిక జ్ఞానానికి మార్గం. శివుడంటే కేవలం భగవంతుడు మాత్రమే కాదు.. ఆలోచనలను అందని అతీత శక్తి. అంతటి మహాత్మునికి ఇష్టమైన రోజే.. ఈ మహా శివరాత్రి.

నేపాల్ దేశంలో కూడా..

మహాశివరాత్రి పండుగను వారణాసిలో అత్యంత వైభవంగా జరుపుతారు. అంతే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి సమీపంలో ఉండే ద్వాదశ లింగాల్లో ఒకటైన శ్రీకాళహస్తిలో (శ్రీకాళహస్తీశ్వరాలయం) కూడా గొప్పగా జరుపుతారు. మన దేశంలో ఊరు, వాడల్లో ఎంతో భక్తి భావంతో జరుపుకునే ఈ పండుగను.. నేపాల్ దేశంలో కూడా జరుపుకుంటారు. ఇక్కడ ఖాట్మండులోని పశుపతినాథ్ ఆలయానికి లక్షలాదిమంది భక్తులు మాత్రమే కాకుండా సన్యాసులు, నాగ సాధువులు కూడా వస్తారని చెబుతారు.