Home Blog Page 79

తమిళ సినిమాకు జూ.ఎన్టీఆర్ ప్రమోషన్!: దీని వెనుక ఇంత కథ ఉందా?

0

తెలుగు కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సహజంగా తనకు నచ్చిన వ్యక్తులకు లేదా తనను నమ్మిన మనుషులకు అన్ని వేళల్లో అండగా నిలబడటం.. వారి విషయాల పట్ల సానుకూలంగా స్పందించడం అనేది సర్వసాధారణమైన అంశం. ఇలాంటి ఉదారభావం కలిగి ఉన్నందుకు ఎల్లలు దాటిన అభిమానులను.. జూనియర్ ఎన్టీఆర్ తన సొంతం చేసుకోగలిగారు. ఆ కారణంగా ఆయన్ని సపోర్ట్ చేసేవాళ్ళు.. ఆయన సపోర్ట్ చేసే వాళ్ళు అన్ని సినిమా ఇండస్ట్రీలలో కూడా పెరిగిపోయారు అనే చెప్పొచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే తమిళ యాక్టర్ శిలంబరసన్ టి.ఆర్ (శింబు) నటిస్తున్న “అరసన్ ” సినిమా ప్రోమో వీడియోని ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.

వెట్రిమారన్ & శింబు మూవీ..

సినిమా ప్రమోషన్ కోసం ఈ వీడియోని విడుదల చేశారు. దాదాపు ఐదు నిముషాల కంటే ఎక్కువే నిడివి కలిగిన వీడియోను చాలామందే చూశారు. ఈ చిత్రానికి ఎన్టీఆర్ అభిమాన దర్శకుడు వెట్రిమారన్ డైరెక్ట్ చేయడం ఇంకో విశేషం అని చెప్పాలి. అందులోనూ వెట్రి సొంత బ్యానర్ అయిన వీ క్రియేషన్స్ పతాకంపైనే ఈ మూవీని నిర్మిస్తున్నారు. సినిమాల పట్ల మంచి అభిరుచి కలిగిన.. పాపులర్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శింబు, వెట్రిలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక అభిమాన ఘనం ఉండటం ఒకెత్తైతే.. దానికి తోడు స్వయానా తెలుగువాడైనా ఎన్టీఆర్ ఈ వీడియోను ప్రమోట్ చేయడంతో మూవీకి మరింత హైప్ వచ్చిందని చెప్పొచ్చు.

జూ. ఎన్టీఆర్ ఏమన్నారంటే?

ఎన్టీఆర్ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టి ఏమని విష్ చేసారంటే.. “అత్యంత ప్రతిభను కలిగిన వ్యక్తి వెట్రిమారన్ సర్, నా తమ్ముడు శిలంబరసన్, ఇంకా రాక్ స్టార్ అనిరుద్ & చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు” అని అన్నారు. అంతే కాకుండా “శింబు లో ఇంకా ఉత్తమమైన నటన దాగి ఉందని, ఆ విషయం నాకు తెలుసని మరియు దాన్ని ఒక పెద్ద తెరపైన చూపించడానికి వెట్రిమారన్ సర్ కంటే మెరుగైన వాళ్ళు ఇంకెవరు లేరని” ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

వెట్రిమారన్ కూడా ఈ వీడియోలో శింబుతో ఎన్టీఆర్ పేరు వచ్చే డైలాగ్ చెప్పించాడు. నా కథను సినిమాగా తీస్తే దానికి హీరో ఎన్టీఆర్ అయితే సరిపోతాడు అనే అర్థం వచ్చేలాగా శింబు వీడియో స్టార్టింగ్ చెబుతారు. దీంతో వెట్రి, ఎన్టీఆర్ కలిసి సినిమా చేయబోతున్నారేమో అనే ఊహాగనాలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. విషెస్ చెప్పడం కూడా అందులో భాగమేనేమో అనుకుంటున్నారు.

అప్పటి నుంచే క్యూరియాసిటీ!

ఎన్టీఆర్ ఒకానొక సినిమా కార్యక్రమంలో తమిళనాడులో ఒక యాంకర్ “మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు, మీకు ఎవరితో సినిమా చేయాలని ఉంది” అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. “నాకు చాలా ఇష్టమైన దర్శకుడు వెట్రిమారన్” అని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఆయనతో నాకు సినిమా చేయాలనుందని, అది కూడా డైరెక్ట్ తమిళ్ సినిమా చేయాలని, డబ్బింగ్ సినిమా కాదు అని కూడా ఆయన అనడం జరిగింది. దీంతో అప్పటి నుంచి కూడా వెట్రి, తారక్ అభిమానుల్లో వీరి ఇద్దరి మధ్య సినిమా ఎప్పుడు వస్తుందా అనే క్యూరియాసిటీ పెరిగిపోయింది.

10వ తరగతి/ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు: 1426 పోస్టులకు నోటిఫికేషన్

0

చాలామంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్మీ సోల్జర్ రిక్రూట్‌మెంట్ వచ్చేసింది. ఈ సారి ఏకంగా 1426 సోల్జర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్. సరైన అర్హతలు కలిగి.. ఆర్మీ జాబ్ కోసం వేచి చూస్తున్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

పోస్టుల వివరాలు

మొత్తం 1426 పోస్టులలో.. 1372 సోల్జర్స్ (జనరల్ డ్యూటీ), 07 సోల్జర్ (క్లర్క్), 19 సోల్జర్ (చెఫ్ కమ్యూనిటీ), 03 సోల్జర్ (చెఫ్ స్పెషల్), 02 సోల్జర్ (మెస్ కుక్), 03 సోల్జర్ (ఈఆర్), 02 సోల్జర్ (స్టీవార్డ్), 02 సోల్జర్ (ఆర్డిసాన్ మెటలర్జీ), 02 సోల్జర్ (ఆర్టిసాన్ వుడ్ వర్క్), 05 సోల్జర్ (హెయిర్ డ్రెస్సర్), 01 సోల్జర్ (టైలర్), 03 సోల్జర్ (హౌస్ కీపర్), 04 సోల్జర్ (వాషర్‌మన్) వంటివి ఉన్నాయి.

క్వాలిఫికేషన్ డీటైల్స్

  • సోల్జర్ (జనరల్ డ్యూటీ): ఈ పోస్టుకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు 10వ తరగతి / మెట్రిక్యులేషన్ పాసై ఉండాలి.
  • సోల్జర్ (క్లర్క్): ఈ పోస్టులు అప్లై చేయాలనుకునేవారు 12వ తరగతి / ఇంటర్మీడియట్ పాసై ఉండాలి.
  • సోల్జర్ ట్రేడ్స్‌మెన్: 10వ తరగతి పాసై ఉండాలి.
  • సోల్జర్ ట్రేడ్స్‌మెన్ (హౌస్ కీపర్, మెస్ కుక్ పోస్టుకు కాకుండా): 8వ తరగతి పాసై ఉండాలి.

వయోపరిమితి & దరఖాస్తు విధానం

నోటిఫికేషన్ ప్రకారం ఈ ఆర్మీ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు వయసు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు ఉండాలి. కాగా వయసు సడలింపుకు సంబంధించిన నియమాలు వర్తించవు. ఈ ఉద్యోగానికి పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అప్లై చేయాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం

ఈ ఉద్యోగానికి అప్లై చేసిన అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు అనే విషయానికి వస్తే.. రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెరిట్ లిస్ట్ అనే నాలుగు విధాలుగా ఉంటుందని సమాచారం. ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కానీ వచ్చే నెల 15 (2025 నవంబర్ 11) నుంచి 2025 డిసెంబర్ 01 వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. అయితే రాత పరీక్ష ఎప్పుడు అనే విషయం.. అప్లై చేసుకున్న తరువాత తెలుస్తుంది. ఎంపికైన వారికి జీతాలు కూడా భారీగానే ఉంటుందని తెలుస్తోంది.

ఉద్యోగానికి ఎలా సిద్ధమవ్వాలి

నిజానికి ఆర్మీ జాబ్ అంటేనే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. అలా అని ఫిజికల్ ఫిట్నెస్ ఒక్కటి మాత్రమే ఉంటే సరిపోదు. కాబట్టి రాత పరీక్షకు కూడా అభ్యర్థులు సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగాల కోసం పోటీపడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. ఈ పోటీని ఎదుర్కోవడానికి నేర్పుతో సిద్ధమవ్వాలి. పరీక్షలు ఏ సిలబస్ చదవాలి?, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు ఉంటాయి? అనే విషయాలను తెలుసుకోవడం మాత్రమే కాకుండా.. జనరల్ అవేర్నెస్ వంటి వాటిపై మంచి పట్టు సాదించాలి. మొత్తం మీద మీ ప్రయత్నం గట్టిగా ఉంటే.. తప్పకుండా ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పకుండా గుర్తుంచుకోవాలి. దీనికి తగిన విధంగా సన్నద్ధమవ్వాలి. ఫిజికల్ ఫిట్నెస్ కోసం కూడా వ్యాయామం అవసరం అనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు.

వెట్రిమారన్ ‘సామ్రాజ్యం’.. శింబు అదిరిపోయే ప్రోమో భయ్యా!

0

వెట్రిమారన్ ఎట్టకేలకు తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చేశాడు. శిలంబరసన్ (శింబు)తో చేస్తున్న తమిళంలో అరసన్ సినిమా ప్రోమో వీడియోని తెలుగులో సామ్రాజ్యం పేరుతో వడా చెన్నై గురించి చెప్పని కథ అని సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీంతో తమిళ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెట్రి & శింబు అభిమానులు దీపావళి పండుగకు ఇచ్చిన బహుమతిగా భావిస్తూ మొత్తం సంతోషంలో మునిగి తేలుతున్నారు. దీనికి సంబంధించిన మరికొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

వీ క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విభిన్న సినిమాల దర్శకుడైన వెట్రిమారన్.. స్టోరీ, డైరెక్షన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇందులో హీరోగా శిలంబరసన్ టి. ఆర్ (శింబు) అద్భుతమైన మాస్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. కిషోర్ కుమార్. జి, సముద్రఖని, ఆండ్రియా తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. 2025లోనే ఈ మూవీని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియా కొన్ని వార్తలు వస్తున్నప్పటికీ.. ఇది 2026లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

కథ ఏంటంటే?

తమిళనాడులోని.. నార్త్ చెన్నైలో కొన్ని గ్రూపుల మధ్య జరిగే గ్యాంగ్ వార్లు, పవర్ కోసం వాళ్ళు చేసే రాజకీయాలు మరియు ప్రాంతంపై అధిపత్యం చేలాయించడానికి వారు చేసే హత్యలు, అన్నీ సామాజిక, రాజకీయ, ఆర్థిక, మాస్ యాక్షన్ డ్రామా ఉండనున్నట్టు బయట వినబడుతున్నది. వెట్రి మారన్ ఇంతకు ముందు వడా చెన్నై పేరుతో హీరో ధనుష్తో ఒక సినిమా చేశారు. ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక ప్రభంజనం సృట్టించిందనే చెప్పాలి. ఆ మూవీకి ధనుష్ స్టైల్‌లో యాక్టింగ్, వెట్రి మారన్ దర్శకత్వం, మ్యూజిక్ అన్నీ కూడా బాగా కుదిరాయి.

ఇప్పుడు అదే నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న కారణంగా.. ఊహాగానాలు పెరిగిపోయాయి అని తెలుస్తోంది. కానీ ఇది వడా చెన్నైకి సీక్వెల్ కాదని ఇప్పటికే వెట్రి మారన్ ప్రకటించారు. శింబుతో తీస్తున్నది వేరే కథ అని.. ధనుష్‌తో పార్ట్-2 కథ వేరే ఉందని చెప్పారు. అదేంటో తెలియాలి అంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఇది వెట్రి మార్క్ మూవీ అనే చెప్పాలి.

టీజర్ గురించి..

శింబు రక్తంతో తడిసిన బట్టలతో, చేతిలో కత్తిపట్టుకుని వచ్చే సీన్ హైలెట్‌గా ఉంది. దానికి అనిరుద్ మ్యూజిక్ మరింత హైప్ క్రియేట్ చేసింది. వీడియో మొదటిలోనే ‘ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా తీస్తున్న కథ అని దీంతో కొంత మంది జైలుకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది’ అని చెప్పి కానీ దానికి డిస్‌క్లైమర్ వేసుకోమని ముందే హీరోతో చెప్పించాడు డైరెక్టర్. కానీ అది నిజజీవిత ఆధారమే అయినా డైరెక్టర్‌కు అది చెప్పడం ఇష్టం లేదు అని అర్థం అవుతున్నది. దీనికి అతని కారణాలు అతనికి ఉండొచ్చు కానీ ఇది ఎవరి గురించి అనేది ఆసక్తిగా మారింది. కోర్ట్ సీన్లు కూడా బాగున్నాయి.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు: ఓటర్ లిస్టులో సమంత, తమన్నా, రకుల్ ఫోటోలు

0

తెలంగాణలోని (హైదరాబాద్) జూబిలీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల వేడి రోజురోజుకి పెరుగుతోంది. ఇలాంటి సమయంలో సెలబ్రిటీల పేరుతో ఫేక్ ఓటర్ ఐడీలు వెలుగులోకి రావడం సంచలనం రేపుతోంది. అందులోనూ ప్రముఖ నటీమణులు సమంత రూత్ ప్రభు, తమన్నా భాటియా, రకుల్ ప్రీత్ సింగ్ ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఓటర్ లిస్టులో నకిలీ ఐడీలు

ఓటర్ లిస్టులో సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోలు.. వివరాలు వంటివి రావడంతో, ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. నకిలీ ఫోటోలను ఉపయోగించి వీటిని రూపొందించినట్లు.. ఎన్నికల అధికారులు నిర్దారించడంతో మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సయ్యద్ యాహియా కమల్ ప్రకారం.. నటీమణుల చిరునామా హైదరాబాద్‌లోని ఒకే ప్రాంతానికి చెందినట్లు ఐడీలను క్రియేట్ చేసారని తెలుస్తోంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోల ప్రకారం.. ముగ్గురి హీరోయిన్స్ హౌస్ నెంబర్ ఒకేవిధంగా ఉంది.

వివిధ సెక్షన్స్ కింద కేసు నమోదు

ప్రజలను తప్పుదారి పట్టించడానికి.. అధికారిక ఎన్నికల సమాచారాన్ని దుర్వినియోగం చేయడానికి, ఉద్దేశ్యపూర్వకంగానే ఇలాంటి నకిలీ ఐడీలు సృష్టిస్తున్నారని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. దీంతో పోలీసులు ఈ సంఘటనపై.. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 336(4) (ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించే ఉద్దేశ్యం), 353 (1) (C) (దుష్ప్రవర్తన) కింద కేసు నమోదు చేశారు. దీనికి కారణమైనవారిని గుర్తించి పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు.

జీహెచ్ఎంసీ హెచ్చరిక

ఇదిలా ఉండగా.. అధికారిక ధృవీకరణ లేని సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) హెచ్చరించింది. కొందరు తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేసి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అంతే కాకుండా చెల్లని నెంబర్లను ఉపయోగించి.. ప్రభుత్వాన్ని కించపరిచే ఉద్దేశ్యంతో ఇలాంటి నకిలీ ఐడీలు సృష్టిస్తున్నారని పేర్కొంది. అయితే దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు

2025 నవంబర్ 11న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. అంతకంటే ముందే ఈ సంఘటన జరగడం ఒకింత అధికారులను కూడా ఆందోళనకు గురిచేసింది. ఎన్నికలు నిజాయితీగా జరగాలని చూస్తున్న తరుణంలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జాగకుండా చూస్తామని సంబంధిత అధికారులు హామీ ఇచ్చారు. అంతే కాకుండా ఎన్నికల సంఘం ధృవీకరించిన సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని కోరారు. కాగా ఎన్నికల ఓట్ల లెక్కింపు 2025 నవంబర్ 14న జరుగుతుంది.

సమస్యకు పరిష్కారం కనుగొనాలి

నిజానికి నకిలీ ఓటర్ ఐడీలు వెలుగులోకి రావడం అనే సమస్య.. ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా భారతదేశం మొత్తం ఉంది. ఇప్పటికే బీహార్‌లో కూడా ఈ వివాదం తలెత్తింది. కాబట్టి ఎన్నికల కమిషన్ జారీచేసిన వాటిని మాత్రమే.. అధికారిక ఐడీలుగా గుర్తించాలి. అంతేకాకుండా ఇలాంటి ఫేక్ ఐడీలు వెలుగులోకి రాకుండా చూడటానికి ఎన్నికల కమిషన్ కూడా టెక్నాలజీని ఉపయోగించి సమస్యలను పరిష్కించి దిశగా ఆలోచించడం మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

చెప్పినట్లే చేసిన స్కోడా: భారత్‌లో ఖరీదైన కారు లాంచ్

0

స్కోడా ఆటో చెప్పినట్లుగానే.. దేశీయ విఫణిలో సరికొత్త ఆక్టావియా ఆర్ఎస్ కారును అధికారికంగా లాంచ్ చేసింది. ఇప్పటికే ఈ కారు గురించి చాలా విషయాలు లాంచ్ కావడానికి ముందే తెలిసిపోయినప్పటికీ.. ధరలు మాత్రమే ఈ రోజు వెల్లడయ్యాయి. ఈ కారు ధర ఎంత, బుకింగ్స్, డిజైన్, డెలివరీ వంటి అన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆక్టావియా ఆర్ఎస్ ధర & బుకింగ్స్

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ ధర రూ. 49.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ కారు కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే భారతదేశానికి కేటాయించబడిన అన్ని యూనిట్లు అమ్ముడైపోయాయి. దీన్ని బట్టి చూస్తే ధర ఎక్కువైనా.. ఈ కారుకు మంచి డిమాండ్ ఉందని అవగతం అవుతోంది. కాగా స్కోడా 100 యూనిట్ల ఆక్టావియా ఆర్ఎస్ కార్లను మాత్రమే కేటాయించి. ఇప్పుడు అన్ని యూనిట్లను విక్రయించేయడంతో.. ఇక డెలివరీలు చేయడమే ఆలస్యం. ఈ పనిని సంస్థ 2025 నవంబర్ 6 నుంచి ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే నవంబర్ 6 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయన్నమాట.

పవర్‌ట్రెయిన్ వివరాలు

2025 స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ కారు 2.0 లీటర్ టీఎస్ఐ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 245 బీహెచ్‌పీ పవర్, 370 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ పొందుతుంది. ఈ కారు 6.7 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. పవర్‌ట్రెయిన్ ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ (వీఏక్యూ)తో కూడిన ఫ్రంట్ వీల్ డ్రైవ్ లేఅవుట్‌తో అనుసంధానించబడి.. అసాధారణమైన ట్రాక్షన్ కంట్రోల్ మరియు కార్నరింగ్ స్టెబిలిటీ అందిస్తుంది. కాబట్టి పనితీరు అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది.

ఎక్స్‌టీరియర్ డిజైన్

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్.. సిగ్నేచర్ ఆర్ఎస్ బ్యాడ్జింగ్, గ్లా బ్లాక్ గ్రిల్, ఏరోడైనమిక్ బాడీ కిట్‌తో.. బ్లాక్ ఎక్స్‌టీరియర్ పొందుతుంది. ఎల్ఈడీ మ్యాట్రిక్డ్ హెడ్‌ల్యాంప్, 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, డౌన్‌ఫోర్స్‌ను పెంచే రియర్ స్పాయిలర్ వంటివన్నీ ఈ కారులో ఉన్నాయి. సిగ్నేచర్ కూపే మాదిరిగా ఉండే రూఫ్‌లైన్ కూడా ఇందులో చూడవచ్చు.

ఇంటీరియర్ డిజైన్ & ఫీచర్స్

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇది స్పోర్ట్ సీట్లు, అల్యుమియం పెడల్స్, త్రీ స్పోక్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటివి ఉన్నాయి. ఇవి కాకుండా 10.25 ఇంచెస్ వర్చువల్ కాక్‌పిట్, వైర్‌లెస్ స్మార్ట్‌లింక్‌తో కూడిన 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం కూడా ఈ కారులో ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్స్

ఆధునిక కాలంలో కార్లు కొనుగోలు చేసేవారు డిజైన్, మైలేజ్, ధర వంటి విషయాలతో పాటు సేఫ్టీ కూడా చూస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కంపెనీలు కూడా వాహన వినియోగదారులకు కావలసిన సేఫ్టీ అందిస్తోంది. స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ కారులో.. 10 ఎయిర్‌బ్యాగ్‌లు, లేన్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఎలామర్జెన్సీ బ్రేక్, పార్క్ అసిస్ట్ వంటివన్నీ అందించింది.

స్కోడా కొత్త కారు లాంచ్‌పై మా అభిప్రాయం

ఇండియన్ మార్కెట్లో స్కోడా కంపెనీకి మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ స్లావియా, కుషాక్ వంటి మోడల్స్ విక్రయిస్తోంది. అయితే ఇప్పుడు లాంచ్ చేసిన ఆక్టావియా ఆర్ఎస్ కారు ధర.. బ్రాండ్ యొక్క ఇతర మోడల్స్ కంటే కూడా చాలా ఎక్కువ. ధర ఎక్కువ అయినప్పటికీ.. ఇప్పటికే అన్నింటినీ కొనేశారంటే, దీనికున్న డిమాండ్ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం కంపెనీ దీనిని 100 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను పెంచుతుందా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.

శ్రియాతో.. రామ్ చరణ్ ఫస్ట్ సీన్: అప్పుడెలా చేసారో తెలుసా?

0

ఈ రోజు గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్ గురించి అందరికి తెలుసు. అయితే ఒకప్పుడు యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న.. డైలాగ్స్ చెప్పడంలో ఇబ్బంది పడిన రామ్ చరణ్ గురించి బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. అయితే దీనికి సంబంధించిన వీడియోను సదరు ఆ యాక్టింగ్ స్కూల్ యాజమాన్యం రిలీజ్ చేసింది.

శ్రియాతో లవ్ సీన్!

నిజం చెప్పాలంటే.. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ్ 2007లో చిరుత సినిమాలో తెరమీదకు వచ్చారు. అంతకంటే ముందు.. సినిమాల్లోకి అడుగుపెట్టడానికి.. యాక్టింగ్ బాగా నేర్చుకోవడానికి ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. ఇక్కడ చాలామంది బాలీవుడ్ ప్రముఖులు కూడా యాక్టింగ్ నేర్చుకున్నారు. అయితే ఆ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నప్పుడు.. నటి శ్రియాతో ఒక లవ్ సీన్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో రామ్ చరణ్ చాలా కొంత ఇబ్బందిపడినట్లు.. ఇన్‌స్టిట్యూట్ కోచ్ పేర్కొన్నారు. దీనికి కారణం చరణ్ కెమెరా ముందు నటించడం అదే మొదటిసారి.

వీడియోలో నటి శ్రియ కూడా కనిపించారు. ఆమెలో ఎలాంటి బిడియం లేదు. ఎందుకంటే అప్పటికే ఆమె సౌత్ ఇండియన్ పాపులర్ హీరోయిన్లలో ఒకరుగా ఉన్నారు. ఈమె 2001లోనే ఇష్టం అనే సినిమాతో సినిమా అరంగేట్రం చేసింది. అయినప్పటికీ యాక్టింగ్ఇంకా మెరుగుపరచుకోవాలనే ఉద్దేశ్యంతో శ్రియ కూడా యాక్టింగ్ స్కూల్లో చేరారు. అలాంటి సమయంలో శ్రియ, రామ్ చరణ్ మధ్య ఈ సన్నివేశం చిత్రీకరించారు.

హార్స్ రైడింగ్ & డ్యాన్స్

ఇకపోతే రామ్ చరణ్ కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా.. హార్స్ రైడింగ్, డ్యాన్స్ వంటి వాటిలో కూడా ప్రత్యేక శిక్షణ పొందారు. ఇవన్నీ కూడా తన సినిమా కెరియర్‌లో చాలా ఉపయోగపడ్డాయి. మొదటి సినిమా తరువాత చాలామంది.. రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలడా అని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ రోజు గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. కష్టపడితే.. తప్పకుండా గుర్తింపు వస్తుంది అని చెప్పడానికి రామ్ చరణ్ నిదర్శనం.

రామ్ చరణ్ సినిమా ప్రయాణం

నటుడు రామ్ చరణ్.. చిరుత సినిమాతో తెరమీదకు వచ్చినప్పటికీ, మగధీర సినిమాతో తన జీవితంలోనే అతిపెద్ద సక్సెస్ చూసేసారు. ఆ తరువాత వచ్చిన సినిమాల్లో కూడా తనదైన రీతిలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. కాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో మరింత క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం పెద్ది సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు, గ్లిమ్స్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

రామ్ చరణ్, శ్రియ జంటగా నటించిన సినిమాలు లేదు, కానీ ఆర్ఆర్ఆర్ సినిమాలో మాత్రం చరణ్ తల్లిగా నటించారు. యాక్టింగ్ నేర్చుకుంటున్న సమయంలో చరణ్ జుట్టు పెంచి ఉండటం, గెడ్డం స్టైల్ అంత ఎలా ఉందో.. వీడియోలో చూడవచ్చు. అయితే ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ.. తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగారు. ఉపాసనను పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు క్లింకార అనే పాప కూడా ఉంది.

ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్.. 2570 పోస్టులు: ఇదిగో పూర్తి వివరాలు

0

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ).. 2,570 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఈ ఉద్యోగానికి కావలసిన అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, జీతం వివరాలు మొదలైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ & వయోపరిమితి

ఆర్ఆర్‌బీ విడుదల చేసిన.. జూనియర్ ఇంజినీర్ పోస్టులకు ఈ నెల 31 నుంచి (2025 అక్టోబర్ 31) నుంచి అప్లై చేసుకోవచ్చు. అయితే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 2025 నవంబర్ 30 అని తెలుస్తోంది. అంటే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి.. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఏకంగా నెల రోజుల సమయం కల్పించిందన్నమాట.

వయోపరిమితి విషయానికి వస్తే.. కనిష్ట వయసు 18 సంవత్సరాలు, గరిష్టంగా 33 సంవత్సరాలు అన్నట్లు ఆర్ఆర్‌బీ స్పష్టం చేసింది. 2026 జనవరి 1 నాటికి 33 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండకూడదు. ఈ విషయాన్ని దరఖాస్తుదారులు తప్పకుండా గుర్తుంచుకోవాలి.

విద్యార్హత వివరాలు & ఎంపిక విధానం

సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఈ లేదా బీటెక్, డిప్లొమో వంటివి పూర్తి చేసి ఉండాలి. ఆర్ఆర్‌బీ జూనియర్ ఇంజినీర్స్ ఉద్యోగాల భర్తీ నాలుగు దశలలో జరుగుతుంది. అవి ఫస్ట్ స్టేజి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (స్క్రీనింగ్ టెస్ట్), సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (మెరిట్ టెస్ట్), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ చెకింగ్. ఇలా నాలుగు దశల్లో పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

పరీక్ష విధానం

ఆర్ఆర్‌బీ జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలకు రెండు దశల్లో (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పరీక్షలు జరుగుతాయి. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పుకు 1/3 నెగెటివ్ మార్కులు ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ఖచ్చితంగా సమాధానం తెలిసిన ప్రశ్నలకు మాత్రమే ఆన్సర్ ఇవ్వడం మంచిది.

ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్: ఈ పరీక్షకు 90 నిమిషాల వ్యవధి ఉంటుంది. 100 ప్రశ్నలు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో గణితం నుంచి 30 ప్రశ్నలు (30 మార్కులు), జనరల్ సైన్స్ నుంచి 30 ప్రశ్నలు (30 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు (25 మార్కులు), జనరల్ అవేర్నెస్ నుంచి 15 ప్రశ్నలు (15 మార్కులు) ఇలా మొత్తం 100 ప్రశ్నలు.. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.

సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: రెండో దశలో పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. వ్యవధి 120 నిమిషాలు. దివ్యాంగులకు 160 నిమిషాల వ్యవధి కల్పిస్తారు. ఇందులో టెక్నికల్ ఎబిలిటీస్ నుంచి 100 ప్రశ్నలు, బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్ నుంచి 10 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ నుంచి 15 ప్రశ్నలు, భౌతిక & రసాయన శాస్త్రాల నుంచి 15 ప్రశ్నలు, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ నుంచి 10 ప్రశ్నలు.. ఇలా మొత్తం 150 ప్రశ్నలు (150 మార్కులు) ఉంటాయి.

ఇలా సిద్ధమవ్వండి

ఆర్ఆర్‌బీ ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందా.. అని ఎదురు చూసేవారికి ఇది ఒక మంచి శుభవార్త. ఈసారి 2570 పోస్టులు ఉన్నాయి, కాబట్టి కొంచెం పట్టుదలతో ప్రిపేర్ అయితే.. తప్పకుండా ఉద్యోగం మీ సొంతం అవుతుంది. అయితే సిలబస్ చూసుకుంటూ.. ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి, దీనికి ఎక్కువ సమయం కేటాయించాలి అనే విషయం తెలుసుకుని పరీక్షకు సిద్ధమవ్వాలి. అభ్యర్థులు ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. అప్పుడే ఉద్యోగం సంపాదించుకోగలరు.

మొన్న తండ్రికి కారు గిఫ్ట్: ఇప్పుడు కొత్తింట్లో అడుగుపెట్టిన యాంకర్ లాస్య

0

మనిషి బతకడానికి కూడు, గుడ్డ, గూడు ముఖ్యం అంటారు. చాలామంది తమ జీవితంలో సొంతిల్లు కలిగి ఉండాలని కలలు కంటారు. వాటిని కొందరు నిజం చేసుకుంటారు. మరికొందరికి ఆ కల.. కలగానే మిగిలిపోతుంది. అయితే తాజాగా యాంకర్ లాస్య కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

లాస్య గృహప్రవేశం

ప్రముఖ తెలుగు యాంకర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.. లాస్య తన భర్త మంజునాథ్‌తో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఈ గృహ ప్రవేశ వేడుకకు.. కొందరు సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ హాజరయ్యారు. ఇందులో దేత్తడి హారిక, నయని పావని, గీతూ రాయల్, నోయల్, బంచిక్ బబ్లూ మొదలైనవారు ఉన్నారు.

నోయల్ ఇన్‌స్టా పోస్ట్ & లాస్య రిప్లై

లాస్య కొత్త ఇల్లు గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలను.. నోయెల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. ”నోయెల్, నా కొత్త ఇంటిని చూసి నువ్వు అసూయపడతావు! అని లాస్య చెప్పారు. నేను ఖచ్చితంగా జలసీగా ఫీల్ అవుతాను. దేవుడు మీకు అందమైన ఇల్లు కట్టుకునేలా ఆశీర్వదించారు. మీ జంటకు (లాస్య, మంజునాథ్) అభినందనలు అంటూ పేర్కొన్నారు. దీనికి లాస్య రిప్లై ఇస్తూ.. ”నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు నోయెల్. కానీ నిజం చెప్పాలంటే.. నీ లాంటి స్నేహితులు ఉండటం అదృష్టం” అని పేర్కొన్నారు. ఇది చూసిన నెటిజన్లు లాస్య ఫ్యామిలీకి శుభాకాంక్షలు చెబుతున్నారు.

సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోవర్స్

తెలుగు టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా.. పరిచయమైన లాస్య తరువాత బాగా పాపులర్ అయింది. మంజునాథ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత కెరియర్‌కు కొంత గ్యాప్ ఇచ్చింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన జీవితంలో జరిగే.. దాదాపు అన్ని కార్యక్రమాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంది. ఈమెకు ఇన్‌స్టాలో 1.5 మిలియన్ కంటే ఎక్కువ ఫాలోవర్స్, కాగా యూట్యూబ్‌లో 1.9 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు.

యాంకర్ లాస్య బిగ్‌బాస్ సీజన్ 4లో పాల్గొంది. ఆ సమయంలో దేత్తడి హారిక, నోయల్ వంటి వారితో స్నేహం ఏర్పడింది. లాస్య బుల్లితెర మీద మాత్రమే కాకుండా.. రాజా మీరు కేక, ఎంమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయ్), స్వాతి ఐ లవ్ యూ వంటి సినిమాల్లో నటించి వెండి తెరపై కూడా కనిపించింది. అయితే ప్రస్తుతం భర్త.. తన ఇద్దరి పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతోంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరైంది.

తండ్రికి కారు గిఫ్ట్

గతంలో తన తల్లిదండ్రులకు కొత్త ఇల్లు కట్టించిన లాస్య.. నాలుగు నెలలకు ముందు ఫాదర్స్ డే సందర్భంగా, తన తండ్రికి టాటా ఆల్ట్రోజ్ కారును గిఫ్ట్ ఇచ్చింది. చిన్నప్పటి నుంచి నాన్న కారులో తిరిగితే చూడాలని కోరిక ఉండేదని, పెళ్లి తరువాత.. తాను (లాస్య) కొన్న కారుకి మా నన్నే ఈఎమ్ఐ కట్టారని చెప్పింది. ఇప్పుడు మా నాన్నకు కారు కొనివ్వడం నాకు చాలా ఆనందంగా ఉందని కూడా ఆమె పేర్కొన్నారు.

30 ఏళ్ల వయసులో.. రూ.95 లక్షల కారుకొన్న హీరోయిన్

0

సెలబ్రిటీలు లగ్జరీ కార్లు కొనుగోలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. మొన్నబాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన లెక్సస్ కారును కొనుగోలు చేశారు. ఇప్పుడు మలయాళీ నటి ఆహానా కృష్ణ జర్మన్ లగ్జరీ కారును కొనుగోలు చేసింది. ఈ కారు ధర రూ. 95 లక్షల నుంచి రూ. 1 కోటి మధ్యలో ఉందని సమాచారం.

ఆహానా కృష్ణ కొత్త కారు

మలయాళీ నటి అహానా కృష్ణ కొనుగోలు చేసిన కారు బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఎక్స్5. దీని ధర ఇండియన్ మార్కెట్లో రూ. 95 లక్షల నుంచి రూ. 1 కోటి (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని సమాచారం. ఆన్ రోడ్ ధర ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా ఆమె ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసింది.

అహానా ఇన్‌స్టా పోస్ట్

ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన కొత్త కారు ఫోటోలను షేర్ చేస్తూ.. 20 ఏళ్లు దాటి 30 ఏళ్లలోకి అడుగుపెడుతున్నాను. వయసు పెరుగుతుందని కొంత బాధగా ఉంది. అయితే పుట్టిన రోజు సందర్భంగా ఓ గిఫ్ట్ దొరికిందని అన్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ కారును అహానా తన పుట్టిన రోజు (అక్టోబర్ 13) సందర్భంగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

అంతే కాకుండా.. ఏమి చేయాలో, ఏమి చేయకూడదో ఎప్పుడూ చెబుతూ ఉండే నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు. నా నిబంధనల ప్రకారం నా జీవితాన్ని అన్వేషించడానికి.. అనుభవించడానికి నన్ను అనుమతించినందుకు, స్వేచ్ఛగా జీవించడానికి అనుమతి ఇచ్చినందుకు.. ప్రతిదానికీ మీరే కారణం, అంటూ పోస్ట్ చేసింది. అయితే కారు కొనడానికంటే ముందు.. ఏ కారు కొనాలి అనే విషయంలో నటుడు దుల్కర్ సల్మాన్ సలహా ఇచ్చినట్లు, ఆ తరువాతనే అహానా ఈ బీఎండబ్ల్యూ ఎక్స్5 కారును కొనుగోలు చేసినట్లు సమాచారం.

గృహప్రవేశం అనే సీరియల్ ద్వారా బుల్లితెరపై కనిపించిన అహానా కృష్ణ.. 2014లో ఎన్‌జెన్ స్టీవ్ లోఫెజ్ అనే సినిమాతో వెండితెరపై కనిపించింది. 2025 నాన్సీ రాణి, లోక చాప్టర్-1 అనే సినిమాల్లో కనిపించింది. అయితే ప్రస్తుతం ఏ సినిమాల్లోనూ నటించడం లేదని తెలుస్తోంది. అయితే త్వరలోనే మళ్ళీ తెరమీద కనిపించే అవకాశం ఉంది.

బీఎండబ్ల్యూ ఎక్స్5 గురించి

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బీఎండబ్ల్యూ కంపెనీ.. మార్కెట్లో సుమారు 20 నుంచి 24 మోడల్స్ విక్రయిస్తోంది. ఇందులో ఒకటి ఎక్స్5. దీని ఎక్స్-షోరూమ్ రేటు మనం ప్రారంభంలో చెప్పుకున్నట్లు సుమారు రూ. 1కోటి వరకు ఉంటుంది. ఆకట్టుకునే డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగిన ఈ కారు 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ టర్బో డీజిల్, పెట్రోల్ ఇంజిన్ అనే ఎంపికలతో అందుబాటులో ఉంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ పొందుతుంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతుంది.

సుమారు 645 లీటర్ల బూట్ స్పేస్ కలిగిన బీఎండబ్ల్యూ ఎక్స్5 కారు 80 లీటర్ల ఇంధన సామర్థ్యం కలిగి ఉంటుంది. మైలేజ్ కూడా ఉత్తమాంగానే ఉంటుంది. అయితే ధర కొంత ఎక్కువగా ఉండటం చేత దీనిని ధనవంతులు మాత్రమే కొనుగోలు చేస్తుంటారు. ఈ మోడల్ కారు నటి సమంత, నటుడు ప్రభాస్ కూడా కలిగి ఉన్నట్లు సమాచారం.

పండక్కి ముందే.. కొత్త టీవీఎస్ అడ్వెంచర్ బైక్ వచ్చేసింది: పూర్తి వివరాలివే..

0

ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్.. వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అపాచీ ఆర్‌టీఎక్స్ 300 బైకును దేశీయ విఫణిలో అధికారికంగా లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్.. ఇప్పటి వరకు ఉన్న ఇతర బైకుల కంటే కూడా ఇది కొంత భిన్నంగా ఉండటం చూడవచ్చు. ఈ సరికొత్త బైక్ గురించి పూర్తి వివరాలు.. ఇక్కడ తెలుసుకుందాం.

ఈ బైక్ రేటు ఎంతంటే?

టీవీఎస్ లాంచ్ చేసిన కొత్త అపాచీ ఆర్‌టీఎక్స్ 300 ప్రారంభ ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీనిని కంపెనీ అడ్వెంచర్ టూరర్ విభాగంలో లాంచ్ చేసింది. అయితే ఇది కొత్త ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడి.. కేటీఎమ్ 250 అడ్వెంచర్, యెజ్డీ అడ్వెంచర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440 వంటి బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

ఇంజిన్ వివరాలు ఇవే

2025 అపాచీ ఆర్‌టీఎక్స్ 300 బైక్.. 299 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 9000 ఆర్పీఎమ్ వద్ద 35.5 హార్స్ పవర్, 7000 ఆర్పీఎమ్ వద్ద 28.5 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగిన ఈ బైక్ బై డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ కూడా పొందుతుంది. కాగా స్లిప్పర్ క్లచ్ అసిస్ట్ కూడా ఇందులో ఉంటుంది. ఇవన్నీ రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుందని స్పష్టమవుతోంది.

కొత్త డిజైన్ ఇలా..

సరికొత్త టీవీఎస్ అపాచీ ఆర్‌టీఎక్స్ 300 బైక్ స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ అండ్ అల్యూమినియం డైకాస్ట్ స్వింగార్మ్‌పై ఆధారపడి ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ పరిమాణంలో కొంత పెద్దదిగా ఉండటం చూడవచ్చు. సైడ్ ఫెండర్‌లు.. విండ్‌స్క్రీన్ వరకు విస్తరించి అనుసంధానించబడి ఉండటం చూడవచ్చు. బైక్ ముందు భాగంలో కన్ను ఆకారంలో ఉండే ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్ కనిపిస్తాయి. ఇషీ స్ప్లిట్ రియర్ సీటును పొందటమే కాకుండా అదనపు లగేజ్ కోసం లగేజ్ ర్యాక్ కూడా పొందుతుంది.

కలర్ ఆప్షన్స్ & ఫీచర్లు

వైపర్ గ్రీన్, టార్న్ బ్రాంజ్, మెటాలిక్ బ్లూ, లైట్నింగ్ బ్లాక్, పెర్ల్ వైట్ అనే ఐదు రంగులలో లభించే ఈ బైక్.. ఫుల్లీ కలర్ టీఎఫ్‌టీ డిస్ప్లే కలిగి స్పీడ్, కాల్ అండ్ ఎస్ఎమ్ఎస్ అలర్ట్, సెగ్మెంట్ ఫస్ట్ మ్యాప్ మిర్రరింగ్, గోప్రో కంట్రోల్ వంటి వివరాలను చూపిస్తుంది. ఈ బైక్ టూర్, ర్యాలీ, అర్బన్, రెయిన్ అనే నాలుగు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో ఉంటాయి.

టీవీఎస్ కొత్త అడ్వెంచర్ బైక్ లాంచ్‌పై మా అభిప్రాయం

నిజానికి టీవీఎస్ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త బైకులు లాంచ్ చేస్తూనే ఉంది. దేశం మొత్తం మీద ఎక్కువమంది టీవీఎస్ బైకులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు లాంచ్ చేసిన టీవీఎస్ అపాచీ ఆర్‌టీఎక్స్ 300 ఇప్పుడున్న బ్రాండ్ బైకుల కంటే కూడా చాలా భిన్నంగా ఉంది. ఇది తప్పకుండా బైక్ కొనుగోలుదారులను లేదా అడ్వెంచర్ చేయడానికి ఇష్టపడే వారిని ఆకట్టుకుంటుందని భావిస్తున్నాము. అయితే ఇది మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతుందో తెలుసుకోవాలంటే.. ఇంకా కొంతకాలం వేచి చూడాల్సిందే.