Home Blog Page 82

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేసింది: పోలింగ్ ఎప్పుడంటే?

0

తెలంగాణాలో ఎన్నికల హడావుడి మొదలయింది. ఈ రోజు హైదరాబాద్ జిల్లాలోని జూబ్లీహిల్స్ నియోజక వర్గానికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్‌ను.. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుధీర్ రెడ్డి విడుదల చేశారు. దీంతో హైదరాబాద్ అంతటా ఎన్నికల కోడ్ అమలులోనికి వచ్చింది. అన్నీ రాజకీయ పార్టీలు మరియు రాజకీయ నాయకులకు సంబంధించిన ప్రతి ఫొటోను, బ్యానర్లను అన్నింటినీ ఎన్నికల యంత్రాంగం తొలగించే కార్యక్రమాన్ని చేపట్టిందని ఎలక్షన్ ఆఫీసర్ తెలియజేశారు.

ఎన్నికల షెడ్యూల్ వివరాలు..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను 2025 నవంబర్ 11వ తేదీన నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి.. అభ్యర్థుల దగ్గర నుంచి అక్టోబర్ 13న నామినేషన్ పత్రాలను స్వీకరిచడం జరుగుతుంది. నామినేషన్స్ సమర్పించడానికి అక్టోబర్ 21వ తేదీని చివరి గడువు ఇచ్చారు. కాగా ఈనెల 23న ఉపసహరణకు అవకాశం కల్పించారు. వచ్చే నెల 11న పోలింగ్/ఓటింగ్ జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నవంబర్ 14వ తేది.. కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగుతుందని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుధీర్ రెడ్డి మీడియా ద్వారా తెలియజేశారు.

ఓటర్లు ఓటు వేయడానికి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ బుక్, పోస్టు ఆఫీస్ బుక్, బ్యాంకు బుక్ లాంటివి 12రకాల ఐడీలలో ఏదో ఒకటి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఓటర్ లిస్టులో తమ వివరాలు ఉన్నాయా లేదా అని సరిచూసుకోవాల్సి ఉంటుంది.

ఓటర్ల జాబితా

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు 139 కేంద్రాలు, 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ పేర్కొన్నారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,98,982 ఉండగా.. ఇందులో పురుషులు సంఖ్య 2,07,382 మందిగాను, మహిళలు 1,91,593 మంది ఉన్నారు. జాబితాలో 25 మంది ట్రాన్సజెండర్లు, 6106 మంది యువ ఓటర్లు, 2613 మంది వృద్ధులు, 1891 మంది వికలాంగులు, 311 మంది బధిరులు, 519 మంది అంధులు, ఇతర కేటగిరీలు 722 మంది, విదేశి ఓటర్లు 95 మంది ఉన్నారని ఎలక్షన్ కమిషన్ తెలిపింది.

మాగంటి గోపినాథ్ భార్యకు టికెట్

జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూసిన కారణంగా.. ఈ ఉప ఎన్నిక నిర్వహించడం జరుగుతోంది. ఆయన ఈ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి ఏఐఎమ్ఐఎమ్ పైన 9వేల పైచిలుకు మెజారితో గెలిచారు. 2018లో టీఆర్ఎస్ పార్టీలో చేరి వరుసగా మరో రెండుసార్లు విజయం సాధించాడు. జూన్ 2025లో ఆయన పరమపదించారు.

బీఆర్ఎస్ తిరిగి టికెట్‌ను మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీతకు కేటాయించిది. దీంతో సానుభూతి ఓట్లు సంపాదించి తన స్థానాన్ని నిలుపుకోవాలని చూస్తోంది. మిగిలిన పార్టీలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్, బీజేపీ హై కమాండ్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రచారంలో అయితే ఇప్పటికే ఒకరిమీద ఒకరు పోటీగా ఇల్లు ఇల్లు తిరుగుతున్నారు. ప్రజలు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే నవంబర్ 14 వరకు ఆగాల్సిందే. ఎవరి గెలుపు ఎంతమేరకు ఉందో మీ అభిప్రాయాలు తెలియజేయండి.

‘ఈ ప్రేమ ఆ చూపుతో మొదలయింది’: పలాస హీరో అందమైన లవ్‌స్టోరీ

0

పలాస ఫేమ్ హీరో రక్షిత్ అట్లూరి, హీరోయిన్ కోమలీ ప్రసాద్ కలిసి జంటగా నటించిన రొమాంటిక్ సినిమా శశివదనే. అక్టోబర్ 10న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్‌వీఎస్ కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఏజీ ఫిలిం కంపెనీ నిర్మాణంలో అహితేజ బెల్లంకొండ నిర్మిస్తుండగా.. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా శరవణ వాసుదేవన్, సినిమాటోగ్రాఫర్‌గా సాయి కుమార్ దార, ఎడిటర్‌గా గ్యారీ బీహెచ్ వ్యవహరించారు.

మొదటి సినిమా అంతంతమాంత్రంగానే..

రక్షిత్ లండన్ బాబులు సినిమాతో వచ్చినప్పటికి.. ఆ చిత్రం తనకు కొంతమేరకు పాపులరిటీ మాత్రమే తీసుకుని వచ్చింది. అయితే పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర కూడా అంతంత మాత్రం ఫలితాలను రాబట్టింది అనే టాక్ నడించింది. అయితే చాలా గ్యాప్ తరువాత తీసిన పలాస 1978 తన కెరియ‌ర్‌కు పెద్ద బ్రేక్ ఇచ్చింది.

ఈ సినిమా పేరు తెలియవారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. రక్షిత్ అట్లూరికి ఈ సినిమా ఒక మంచి మాస్ ఇమేజ్ తీసుకొచ్చిందనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో అంతటి విజయాన్ని సొంతం చేసుకునింది. నాది నక్కిలీసు గొలుసు పాటతో మరింత ప్రేక్షకాదరణ పొందింది. 2019 చివరలో అంటే దాదాపు కరోనా సమయంలో విడుదల అయినప్పటికీ కూడా డైరెక్టర్ కరుణకుమార్ ఎంచుకున్న కథ, సినిమాను నడిపించిన విధానం వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో సఫలం అయింది.

రెండేళ్ల విరామం తరువాత

పలాస తరువాత మళ్ళీ రెండు సంవత్సరాలు విరామం తీసుకొని నరకాసుర, ఆపరేషన్ రావణ చిత్రాలు చేశారు. వరుసగా చేసిన ఈ రెండు కూడా డిసప్పాయింట్ చేశాయనే చెప్పాలి. అటు డబ్బులు పరంగా, ప్రేక్షకుల ఆదరణ పరంగా.. అన్నీ విధాలుగా నిరాశపరిచిందనే చెప్పాలి. కథ, కథనం అన్నీ కూడా అడియన్స్ తికమక పెట్టే విధంగా ఉన్నాయి అని రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడు రిలీజ్ కానున్న శశివదనే సినిమా ట్రైలర్ మంచి రొమాంటిక్ వైబ్ తీసుకొచ్చింది. డైలాగ్స్ అన్నీ లవ్ చుట్టూనే తిరుగుతున్నాయి. పలాస, నరకాసుర, ఆపరేషన్ రావణ మూడు చిత్రాలు మాస్ లుక్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ లవర్ బాయ్ ఇమేజ్ తీసుకొచ్చేలాగా ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. వరుసగా ఫెయిల్యూర్స్ కారణంగా శశివదనేతో హిట్ టాక్ తెచ్చుకోడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకు తగినట్టుగానే సన్నాహకాలు జరుగుతున్నాయి. ఇది రక్షిత్ లైఫ్‌లో బిగ్ హిట్ అవ్వాలని కోరుకుందాం.

హృదయాన్ని హత్తుకునే డైలాగ్స్

”ఈ ప్రేమ ఆ చూపుతో మొదలయింది, కాలం బొమ్మలా ఆగిపోయింది, ఆమెతో పాటే నా మనసు కూడా మాయమైపోయింది” అని ట్రైలర్‌లో హీరో చెప్పే మాటలు హృదయానికి హత్తుకునేలా ఎంతో ఫీల్‌తో ఉన్నాయి. ”ఒక్కసారి ప్రేమించాలని డిసైడ్ అయ్యామంటే ఎన్ని వచ్చినా యుద్ధం చేయాల్సిందే” అంటూ శ్రీమాన్ రక్షిత్‌తో చెప్పే మాటలు ప్రేమ ఎంత బలమైనదో చెప్పడానికి ఉదాహరణలు. మొత్తంగా ఆడియన్స్ అందరినీ ఫుల్ లవ్ మూడ్‌లోకి తీసుకెళ్లిపోనున్నారన్నమాట. కథ అంతా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, అమలాపురం చుట్టూ తిరిగినట్లు కనిపిస్తోంది. గోదావరి పరివాహక అందాలు వీడియోలో ఆకట్టుకుంటున్నాయి. శశివదనేతో హీరో రక్షిత్ అట్లూరి ఖాతాలో విజయం ఖాయం అయినట్టే అనిపిస్తోంది. ఆల్ ద బెస్ట్ రక్షిత్.

అనుకోకుండా తీసుకున్న నిర్ణయం.. ‘నువ్వు నా సొంతమా’ సాంగ్ గురించి చెప్పిన రష్మిక

0

ఇప్పుడు సోషల్ మీడియాలో రష్మిక మందన్న పేరు తెగ ట్రెండ్ అవుతోంది. దీనికి కారణం రహస్యంగా విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం చేసుకోవడమే అని తెలుస్తోంది. అయితే ఈ జంట (విజయ్ దేవరకొండ & రష్మిక మందున్న) తమ ఎంగేజ్‌మెంట్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే సోషల్ మీడియా ఖాతాలో మాత్రం రష్మిక థామా (Thamma) సినిమా ప్రమోషన్ చేయడంలో బిజీ అయిపోయింది. విజయ్ దేవరకొండ పుట్టపర్తి వెళ్లినట్లు సమాచారం.

సాంగ్ అక్కడే ఎందుకంటే?

థామా సినిమా ప్రమోషన్‌లో భాగంగా రష్మిక మందన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేశారు. నువ్వు నా సొంతమా సాంగ్ రిలీజ్ అయిన సందర్భంగా.. ఈ సాంగ్ ఎందుకు ఆ లొకేషన్‌లో చేయాల్సి వచ్చిందనే విషయాన్ని రష్మిక వెల్లడించారు. మేము 10-12 రోజుల పాటు ఒక అద్భుతమైన, అందమైన ప్రదేశంలో షూటింగ్ చేశాము. అంత అద్భుతమైన ప్రదేశంలో సాంగ్ ఎందుకు తీయకూడదు అని దర్శక, నిర్మాతలకు ఒక ఆలోచన వచ్చింది. ఆ లొకేషన్ నాకు కూడా నచ్చింది. దీంతో మేము 3-4 రోజులు రిహార్సిల్స్ చేసి పాటను షూట్ చేసాము.

నిజానికి మేము అనుకోకుండా తీసుకున్న నిర్ణయంతో.. ఆ లొకేషన్‌లో సాంగ్ షూట్ చేశాము. అది అద్భుతంగా వచ్చింది. పాట పూర్తయ్యాక, అందరూ ఎంతగానో ఆశ్చర్యపోయారు. ప్లాన్ చేసి టీసింగ్ షూటింగ్ కంటే కూడా ఈ సాంగ్ చాలా బాగా వచ్చింది. ఈ పాటలో భాగస్వాములైన అందరికీ కృతజ్ఞతలు అంటూ రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. అంతే కాకుండా ఈ పాటకు సంబంధించిన కొన్ని స్టిల్స్ కూడా షేర్ చేశారు.

గ్లామర్‌తో కట్టిపడేసిన రష్మిక

ఇక నువ్వు నా సొంతమా అనే పాట విషయానికి వస్తే.. రష్మిక మందన్న తన గ్లామర్‌తో నెటిజన్లను ఆకట్టుకుంది. రష్మిక చెప్పినట్లు లోకేష్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆయుష్మాన్ ఖురానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా అక్టోబర్ 21న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆదిత్య సర్పోత్దార్ థామా సినిమాకు దర్శకత్వం వహించారు. అమర్ కౌశిక్, దినేష్ విజన్.. నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా కోసం రూ. 60 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.

రష్మిక మందన్న థామా సినిమా రిలీజ్ తరువాత.. ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నవంబర్ 7న రిలీజ్ అవుతుందని సమాచారం. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఇది కూడా మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. మొత్తం మీద రష్మిక మందన్న వరుస సినిమాలతో చాలా బిజీ అయిపోయిందని స్పష్టంగా అర్థమవుతోంది.

ఎంగేజ్‌మెంట్ గురించి చెప్పకపోవడానికి కారణం

నిజానికి ఎవరి జీవితంలో అయిన పెళ్లి అనేది చాలా ముఖ్యమైన సెలబ్రేషన్. అంతకు ముంది జరిగే నిశ్చితార్థం.. సగం పెళ్లి అయిపోయినట్టు చెప్పే ఒక తంతు. అలాంటి శుభవార్తను రష్మిక మందన్న గానీ.. విజయ్ దేవరకొండ గానీ ఎందుకు చెప్పుకోవడం లేదో.. అనేది చాలామంది మనసులో పుట్టిన ప్రశ్న. ఏ విషయాన్ని దాచుకున్న ఏం పర్లేదు. కానీ నిశ్చితార్థం, పెళ్లి వంటి విషయాలను తమ అభిమానులకు కూడా తెలియజేయకపోవడం.. ఆశ్చర్యంగా ఉంది. అయితే తమ ఎంగేజ్‌మెంట్ విషయం బయటకు చెప్పకుండా ఉండటానికి ఏమైనా బలమైన కారణం కూడా ఉండొచ్చని ఇంకొందరి వాదన. ఏది ఏమైనా.. ఏ విషయమైనా ఏదో ఒకరోజు బయటకు రావాల్సిందే.

అలనాటి తారలు.. అందరూ ఒక్కచోట: ప్రత్యేక ఆకర్షణలో హీరోయిన్స్!

0

జరిగిపోయిన.. ఒకప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. ఇది సాధారణ ప్రజలకైనా.. సెలబ్రిటీలకైనా ఒకటే. దీని కోసమే 80’s స్టార్స్ రీయూనియన్ పేరుతో ఓ కార్యక్రమం ప్రారంభించారు. సినిమా నటులు అందరు సరదాగా ఒక చోట కలుసుకుని ఆనందంగా గడపడం మరియు వారి మధ్య ఉన్న స్నేహపూర్వకమైన అనుబంధాన్ని మరింత బలపరుచుకోడానికి చేసే కార్యక్రమం ఇది. ఇందులో ఆనాటి సినిమాల మధుర జ్ఞాపకాలను, అనుభవాలను తిరిగి గుర్తుకు తెచ్చుకోవడం లాంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇలాంటివి మనం స్కూల్‌లో.. కాలేజీలలో ఇతర అనేక డిపార్ట్‌మెంట్లలో సర్వసాధారణంగా ఏర్పాటు చేసుకునేవే.

2010లో మొదలైన రీయూనియన్

1980 నుంచి 1989 మధ్య కాలంలో సినిమాల్లో నటీనటులుగా ప్రవేశించిన వారందరూ కలసి ఏర్పాటు చేసుకునేదే ఈ రీయూనియన్ ప్రోగ్రాం. ఈ కార్యక్రమాన్ని 2010 సంవత్సరం నుంచి ప్రతి ఏటా జరుపుకుంటూ వస్తున్నారు. దీనిని ఖుష్బు సుందర్, సుహాసిని మణిరత్నం, లిజీ ప్రియదర్శిన్, పూర్ణిమ భాగ్యరాజ్ మొదట్లో ప్రారంభించారు. సాధారణంగా ఒక్కోసారి ఒక్కొక్కరు ఈ ప్రోగ్రాంను నిర్వహిస్తూ వస్తున్నారు. ఫస్ట్ టైం చెన్నైలో లిస్సీ ప్రియదర్శన్ తమ ఇంటిలో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇది ఆనవాయితీగా వస్తూనే ఉంది.

తాజాగా చెన్నైలో..

ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం జరుపుకునే ఈ ఈవెంట్ నిన్న అక్టోబర్ 4వ తేదీన చెన్నైలో రీయూనియన్ ప్రోగ్రాంను నిర్వహించుకోవడం జరిగింది. క్లాస్ ఆఫ్ 80’s పేరుతో యాక్టర్ అండ్ డైరెక్టర్ అయిన శ్రీప్రియా & రాజకుమార్ సేతుపతి హోస్ట్ చేశారు. సుహాసిని మణిరత్నం, కుశ్బు సుందర్, లిస్సీ లక్ష్మి, పూర్ణిమ భాగ్యరాజ్ దీనిని ఆర్గనైజ్ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ పాల్గొన్నారు. ఇందుకు వీరు ఇద్దరు కలిసి చార్టర్ ఫ్లైట్‌లో చెన్నైకి వెళ్లారు. చిరు, వెంకీ కలిసి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి. వీరు మాత్రమే కాకుండా.. భాను చందర్, విక్రమ్ ప్రభూ, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, నరేష్, సురేష్ కృష్ణ, రెహ్మాన్, జయరామ్ లాంటి హీరోస్ అందరూ ఇందులో పాల్గొన్నారు.

రీయూనియన్ కార్యక్రమంలో హీరోయిన్స్

హీరోయిన్స్ విషయానికి వస్తే.. రమ్యకృష్ణ, రేవతి, సుమలత, శోభన, రాధిక శరత్ కుమార్, సుహాసిని మణిరత్నం, లిస్సీ, నదీయా, మేనక, పార్వతి జయరాం, ఖుష్భు, పూర్ణిమ భాగ్యరాజ్, అంబికా, శరణ్య పోవన్నన్, జయమాల, మధూ మొదలైనవారు ఈ రీ-యూనియన్ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

2024 సంవత్సరంలో వచ్చిన వరదల కారణంగా అప్పుడు రీయూనియన్ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు. అయితే నిన్న జరిగినటువంటి ఈవెంట్ ఫోటోలని మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పరమైన కలయిక సినిమా ఇండస్ట్రీలో అయినా.. సమాజంలో అయినా మంచి పరిణామానికి సూచికగా చెప్పొచ్చు. మానవ సంబంధాలు చాలాకాలం పాటు బలంగా నిలబడటానికి ఇలాంటివి దోహదపడుతాయి. ఇలాంటి కార్యక్రమాలను సెలబ్రిటీలు మాత్రమే కాకుండా.. సాధారణ ప్రజలు కూడా అప్పుడప్పుడు నిరవహించుకుంటే బంధాలు బలపడతాయి.

తమిళనాడులో అతిపెద్ద స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ కాంపిటీషన్.. ముఖ్య అతిధిగా కేటీఆర్

0

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తురులో అక్టోబర్ 11న.. 10వ ‘ఎఫ్ఎమ్ఏఈ’ నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ కాంపిటీషన్ 2025 జరగనుంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ముఖ్య అతిధిగా పాల్గొని ఆయన చేతుల మీదగా ఈ స్పోర్ట్స్ కాంపిటీషన్ ప్రారంభించనున్నారు.

1300 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు

ఈ ఈవెంట్‌ను ఫ్రాటర్నిటీ ఆఫ్ మెకానికల్ అండ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్ (ఎఫ్ఎమ్ఏఈ) అనే సంస్థ నిర్వహిస్తోంది. ఇందుకుగానూ కోయంబత్తురులోని కుమరగురు ఇన్‌స్టిట్యూషన్స్ వేదికగా నిలవనుంది. ఈ పోటీలో దాదాపుగా 101 విద్యాసంస్థలకు చెందిన 1300 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. వీరంతా కలిసి 70కి పైగా చిన్న చిన్న టీమ్స్‌గా పోటీ చేయనున్నారు. ఇక్కడ విద్యార్థులు అందరూ వారి సొంత మేధస్సుతో, తెలివితేటలతో తయారు చేసిన వెహికల్స్ (మినీ రేసింగ్ వాహనాల) ప్రదర్శించనున్నారు.

విజేతల ఎంపిక ఇలా..

విద్యార్థులు వారు తయారు చేసిన వాహనాలను ట్రాక్‌లో నడిపి వారి ప్రతిభను పరీక్షించుకోనున్నారు. ఈ వెహికల్స్ అన్ని పెట్రోల్, డీజిల్ లేదా కరెంటుతో నడిచేవి కూడా ఐయుండచ్చు. ఒక్కో వాహనం ఎంత స్పీడ్ వెళ్తోంది, తయారు చేసిన డిజైన్ అండ్ మోడల్ ఏ విధంగా ఉంది, వెహికల్ పికప్, సేఫ్టీ వాటి ఇన్నోవేషన్ అంటే బ్యాటరీ, సెన్సార్లు,ఇంజన్ ఇవన్నీ కొత్త టెక్నాలజీ తో చేశారా లేదా ఇంకా కంట్రోలింగ్, బ్రేక్ సిస్టమ్, మానిటరింగ్ ఫిచర్లు ఏ పద్ధతిలో చేశారో వంటివాటిని బట్టి ఈ పోటీలో విజేతలను ఎంపిక చేస్తారు. జడ్జిమెంట్ ఇవ్వడానికి అత్యంత ప్రతిభ కలిగిన ఇరవై ఐదు మంది నిపుణులు ఇందులో పాల్గొననున్నారు. వీరందరూ దేశంలోని అతి పెద్ద ఆటోమొబైల్ కంపెనీలకి చెందిన ప్రతినిధులు. వీరే పోటీలో పాల్గొనే విన్నింగ్ పర్సన్‌ని నిర్ణయిస్తారు.

విద్యార్థులు భవిష్యత్తుకు ఓ దారి

ఈ స్పోర్ట్స్ కాంపిటీషన్ అనేది.. భవిష్యత్తులో ఆటోమొబైల్ రంగంలో ఇంజనీర్స్ అవ్వాలనుకునే విద్యార్థులకు మంచి అవకాశాలను కల్పించడానికి దారిచూపుతుందని చెప్పవచ్చు. అంతే కాకుండా వారిలో ఉన్న కొత్త కొత్త ఆలోచనలను, ప్రాక్టికల్ నాలెడ్జ్, టీమ్ వర్క్, సాంకేతిక నిపుణ్యాన్ని ప్రోత్సహించడానికి భవిష్యత్తులో మరింత అభివృద్ధి పరచడానికి ఈ పోటీ ఉపయోగపడుతుంది అనేది ఎఫ్ఎమ్ఏఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం.

కేటీఆర్ రాకతో మరింత ప్రాముఖ్యత

స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ కాంపిటీషన్ అనేది మన ఇండియాలో మాత్రమే కాదు.. ఆసియాలోనే అతి పెద్ద పోటీ అనే చెప్పుకోవాలి. ఇటువంటి పోటీకి తెలంగాణ రాష్ట్ర రాజకీయ నేత కేటీ రామారావు రావడం అనేది మరింత ప్రచారం పొందటమే కాకుండా.. ప్రాముఖ్యతను సంతరించుకుంది. కేటీఆర్ ఎప్పుడు కూడా విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీలో మరింత అభివృద్ధి చెందాలని ప్రోత్సహం అందిస్తూ ఉంటారు కాబట్టి.. ఈ కార్యక్రమం ఒక ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పవచ్చు. అయితే ఏ విభాగంలో ఎవరు విజేత.. ఎవరి సామర్థ్యం ఎంత అని తెలుసుకోవడానికి ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని, విద్యార్థుల భవిష్యత్తుకి మంచి మార్గం చూపాలని ఆశిద్దాం.

ఆస్ట్రేలియా టూర్‌కు టీమిండియా రెడీ: జట్టులో శ్రేయస్ అయ్యర్.. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్

0

ఈ నెల అక్టోబర్ 19వ తేదీన ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డే సిరీస్ మ్యాచ్‌కు మరియు అక్టోబర్ 29న ప్రారంభం కానున్న ఐదు టీ20 సిరీస్ మ్యాచ్‌లకు భారత క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీసీఐ) చీఫ్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ టీమ్ సభ్యులు.. రెండు టీమ్స్ ప్రకటించారు. వన్డే కెప్టెన్ పగ్గాలను శుభ్‌మన్ గిల్‌కు అప్పగించింది. చాలాకాలం తరువాత టీమ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు చోటు కల్పించి అతడికి వైస్ కెప్టెన్ బాధ్యతలు ఇచ్చారు. ఇప్పటి వరకు వన్డే కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ కేవలం బ్యాట్స్‌మన్‌గా మాత్రమే జట్టులో కొనసాగనున్నాడు. కాగా శుభ్‌మన్ గిల్ టెస్ట్ కెప్టెన్‌సీతో పాటు ఇప్పటి నుంచి వన్డే సారథిగా కొత్త బాధ్యతలు స్వీకరించబోతున్నాడు.

కొందరికి దక్కని చోటు

ఇక జట్టు విషయానికి వస్తే సంజూ సాంసన్, మహమ్మద్ షమీ, జడేజాలకు వన్డే మ్యాచ్‌లో చోటు దక్కలేదు. ఇది వారి అభిమానులకు కొంత నిరాశను కలిగించే వార్త. బౌలింగ్ విభాగంలో బుమ్రాకి బదులు ప్రసిద్ కృష్ణకి అవకాశం ఇచ్చారు. ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్య స్థానంలో మన తెలుగువాడు నితీష్ కుమార్ రెడ్డిని తీసుకున్నారు. ఈ మార్పులతో బిసీసీఐ వన్డే జట్టుకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 19, 23, 25 తేదీల్లో పెర్త్, సిడ్నీ అడిలేడ్ నగరాల్లో ఈ మ్యాచ్‌లు ఆడనున్నారు

వన్డే టీమ్

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, దృవ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్.

టీ20 సిరీర్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగనున్నాడు. ఇందులో పెద్దగా మార్పులు ఏమి లేనట్టుగానే కనిపిస్తోంది. కేవలం కొన్ని గాయాల కారణంగా హార్దిక్ పాండ్య స్థానంలో నితీష్ వచ్చాడు. అదనంగా వాషింగ్టన్ సుందర్ వచ్చి చేరాడు. ఆసియా కప్ గెలిచిన ఆనందంతో ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్న తేడాలతో అదే జట్టుతో ఇండియా ఆస్ట్రేలియతో బరిలో దిగనుంది. 2025 అక్టోబర్ 29, 31.. నవంబర్ 2, 6, 8 తేదిలలో వరుసగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

టీ20 టీమ్

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ ), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్ ), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దుబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ సాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్.

ఇప్పటి వరకు దాదాపు అన్ని మ్యాచ్‌లలోనూ అత్యుత్తమ ప్రతిభ చూపిన టీమిండియా.. ఆస్ట్రేలియాలో జరగనున్న మ్యాచ్‌లో కూడా మంచి పర్ఫామెన్స్ చూపిస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇక త్వరలో జరగనున్న మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. ఈ సారి గెలుపు ఎవరిదో తెలుసుకోవడానికి ఇంకొన్ని రోజులు నిరీక్షించక తప్పదు. అయితే ఇందులో కూడా టీమిండియా గెలుపొందాలని ఆశిద్దాం.

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!: లాస్ట్ ఎగ్జామ్ ఎప్పుడంటే?

సీబీఎస్ఈ ఇటీవలే 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పుడు తాజగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (బీఐఈఏపీ) ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

పరీక్షల షెడ్యూల్ & సమయం

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి నోటిఫికేషన్ ప్రకారం.. పరీక్షలు 2026 ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమై 2026 మార్చి 24 వరకు జరుగుతాయి. అంటే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫిబ్రవరి 23న ప్రారంభమవుతుంది. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మొదలవుతాయి. అన్నీ పరీక్షలు ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు (మూడు గంటలు) జరుగుతాయి.

ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష పేపర్ 1తో (తెలుగు, హిందీ, సంస్కృతం మొదలైన లాంగ్వేజెస్) మొదలవుతుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష లాంగ్వేజ్ పేపర్ IIతో ప్రారంభమవుతుంది. ఆ తరువాత ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎకానమీ, హిస్టరీ, కామర్స్, సివిక్స్ పరీక్షలు జరుగుతాయి. చివరి పరీక్ష 2026 మార్చి 24న జరుగుతుందని తెలుస్తోంది.

2025లో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన మొత్తం విద్యార్థులు సంఖ్య 10,17,102. అయితే ఈసారి 2026లో ఇంతకంటే ఎక్కువమంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు.. పరీక్షలు నిర్వహించడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేసింది. దీన్ని బట్టి చూస్తే ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఇంకో మూడు నెలల సమయం మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

ఏపీ ఇంటర్మీడియార్ ప్రాక్టికల్ పరీక్షల విషయానికి వస్తే.. జనరల్ కోర్సులకు ప్రాక్టికల్స్ 2026 ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు (మొత్తం పది రోజులు) రెండు సెషన్లలో జరుగుతాయి. ప్రాక్టికల్ పరీక్ష ఫస్ట్ సెషన్ ఉదయం 9:00 గంటల నుంచి 12:00 గంటల మధ్య జరుగుతుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల మధ్య జరుగుతుంది. ఆదివారాల్లో కూడా ఈ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని సమాచారం.

ఒకేషనల్ కోర్సు ప్రాక్టికల్ పరీక్షలు 2026 జనవరి 27 నుంచి 2026 ఫిబ్రవరి 10 వరకు జరుగుతాయి. ఇక్కడ తెలుసుకోవలసిన మరో విషయం ఏమిటంటే.. ప్రస్తుతం విడుదలైన ఇంటెర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ తాత్కాలికమైనది మాత్రమే అని బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి డాక్టర్ నారాయణ్ భరత్ గుప్తా వెల్లడించారు. 2026లో ప్రభుత్వ సెలవులు.. హొలీ, ఉగాది, రంజాన్ పండుగలను బట్టి ఈ తేదీలలో మార్పులు జరిగే అవకాశం ఉంది. పరీక్షల షెడ్యూల్‌లో ఏవైనా మార్పులు జరిగితే అధికారికంగా వెల్లడిస్తారు.

పరీక్షలు ఎప్పుడు జరిగినా.. రాయడానికి విద్యార్థులు సిద్ధం కావలి. ఇక కేవలం కొన్ని రోజుల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయి. కాబట్టి ఇప్పటికైనా ఒక టైమ్ టేబుల్ సిద్ధం చేసుకుని చదివితే.. పరీక్షల్లో పాస్ అవ్వడం సమస్యే కాదు. ఏదైనా సబ్జెక్టులో డౌట్స్ ఉంటే.. లెక్చరర్స్ ద్వారా నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతే కాకుండా అవసరమైన విషయాలను తెలుసుకోవడానికి మీ సీనియర్లను కూడా సంప్రదించి తెలుసుకోవచ్చు. మొత్తం మీద ఇంటర్మీడియట్ పరీక్షలు ఉత్తీర్ణత కావడానికి ప్రయత్నించండి. సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయవద్దు.

నిరాడంబరంగా నిశ్చితార్థం!.. విజయ్ & రష్మికల పెళ్లి ఎప్పుడంటే?

0

కొన్నాళ్లుగా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న ఎక్కడ కనిపించినా.. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, డేటింగ్‌లో ఉన్నారని కొన్ని పుకార్లు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. ఈ పుకార్లకు చెక్ పెట్టి.. వీరిరువురు నిశ్చితార్థం చేసుకున్నట్లు తాజాగా కొన్ని వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఈ వార్త నిజమేనా? ఒట్టి గాసిప్ మాత్రమేనా?.. దీనిపై విజయ్, రష్మిక ఏమైనా స్పందించారా? అనే విషయాలను ఈ కథనంలో చూసేద్దాం.

విజయ్ & రష్మికల ఎంగేజ్‌మెంట్!

నటి రష్మిక మందన్న, నటుడు విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమాలో జంటగా నటించారు. ఆ తరువాత డియర్ కామ్రేడ్ చిత్రంలో కనువిందు చేశారు. అయితే ఆ తరువాత కాలంలో వీరిద్దరిపై కొన్ని పుకార్లు రావడం మొదలయ్యాయి. దీనికి తోడు.. ఈ జంట అప్పుడప్పుడు విమానాశ్రయాల్లో కూడా కనిపించారు. దీంతో ఆ పుకార్లకు మరింత బలం వచ్చింది. అంతే కాకుండా గతంలో కూడా ఈ జంట ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అవన్నీ నిజం కాదని తెలిసిపోయింది. ఇప్పుడు తాజాగా ఇదే న్యూస్ మళ్ళీ తెరమీదకు వచ్చింది.

పెళ్లి ఎప్పుడంటే?

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ.. కొంతమంది సన్నిహితులతో హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ నివాసం నిశ్చితార్థం చేసుకున్నారని సమాచారం. వీరి పెళ్లి 2026 ఫిబ్రవరిలో ఉంటుందని కూడా చెబుతున్నారు. అయితే దీనిపై విజయ్ దేవరకొండ గానీ, రష్మిక గానీ ఎవరూ అధికారికంగా స్పందించలేదు. కాబట్టి నిశ్చితార్థం నిజమా?, కాదా అనే విషయం తెలుసుకోవాలంటే.. వీరిలో ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంటుంది. అప్పటివరకు ఇది ఎంతవరకు నిజం అనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించలేము.

చాలాకాలంలో విజయ్, రష్మికలపై వస్తున్న పుకార్లపై.. అప్పుడప్పుడు రష్మిక స్పందించింది. కొన్ని ఇంటర్వ్యూలలో విజయ్ దేవరకొండ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా కొన్ని పండుగలకు రష్మిక.. విజయ్ ఇంట్లో కనిపించింది. విజయ్ దేవరకొండ కూడా వీరి బంధం గురించి ఎప్పుడూ బయటపెట్టలేదు. కానీ పుకార్లు మాత్రం అలా.. అలా పెరుగుతూనే ఉన్నాయి. కాగా ఇప్పుడు ఈ జంట నిశ్చితార్థం చేసుకున్న మాట నిజమే అని కొందరు సన్నిహితులు చెబుతున్నారు. కానీ నిశ్చితార్థం జరిగిందనే చెప్పే ఫోటోలు లేదా వీడియోస్ బయటకు రాలేదు. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ద్రువీకరించలేకపోతున్నాము.

రష్మిక మందన్న గురించి

1995 ఏప్రిల్ 5న జన్మించిన రష్మిక మందన్న 2014లో కిరిక్ పార్టీ అనే చిత్రంతో.. సినిమా రంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత కన్నడలో పునీత్ రాజ్ కుమార్ సరసన అంజనీ పుత్ర సినిమాలో కనిపించింది. తెలుగులో ఈమె మొదటి సినిమా చలో. ఆ తరువాత గీత్ గోవిందం, సరిలేరు నీకెవ్వరూ, భీష్మ, పుష్ప సినిమాల్లో కనిపించి బాగా పాపులర్ అయింది. తన నటనకుగానూ ఈమె.. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సైతం సొంతం చేసుకుంది.

విజయ్ దేవరకొండ గురించి

1989 మే 9న జన్మించిన విజయ్ దేవరకొండ.. నువ్విలా సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టినప్పటికీ.. అర్జున్ రెడ్డి సినిమాతో తెరపైకి వచ్చాడు. ఆ తరువాత రష్మికతో నటించిన గీత గోవిందం ఇతనికి మంచి హైప్ అందించింది. ఆ తరువాత వచ్చిన సినిమాలు చెప్పుకోదగ్గ స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాయి. ఈయన కూడా పలు అవార్డులను అందుకున్నారు.

అప్పు చేసి నిర్మాతలకు రూ.4.75 కోట్లు ఇచ్చిన సిద్దు: ఎందుకో తెలుసా?

0

డీజే టిల్లు సినిమాతో ఫేమస్ అయిన హీరో సిద్దు జొన్నలగడ్డ. ఈ సినిమాకంటే ముందు ఇతడు నటించిన సినిమాల విషయానికి వస్తే.. గుంటూరు టాకీస్, జోష్, కృష్ణ అండ్ హిస్ లీలా, మా వింత గాధ వినుమా, భీమిలి కబడ్డీ జట్టు, ఆరెంజ్, కల్కి లాంటి అనేక చిత్రాలు ఉన్నాయి. వీటన్నింటిలో కొద్దిగా మెయిన్ హీరోగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఏదైనా ఉంది అంటే.. అది మాత్రం గుంటూరు టాకీస్ అనే చెప్పుకోవాలి. ఇందులో నరేశ్‌కి, సిద్దుకి మధ్యలో నడిచే క్రైమ్ కామెడీ డ్రామా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. మాస్ ఇమేజ్‌తో సినీ ప్రేక్షకులకు సిద్దు చాలా దగ్గరయ్యాడు. ఆ తరువాత సినిమాలు చేస్తున్న కూడా అంత బజ్‌ను తీసుకురాలేకపోయాయి అనే చెప్పాలి. అటువంటి పరిస్థితిలో వచ్చిందే డీజే టిల్లు.

టిల్లు ఇచ్చిన ఉత్సహం అసాధారణం

మా వింత గాధ వినుమా.. తరువాత సిద్దునే విమల్ కృష్ణతో కలిసి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అన్నీ సిద్ధం చేసుకొని సితారా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై.. సూర్య దేవర నాగవంశీ నిర్మించిన చిత్రం డీజే టిల్లు. సిద్దు జొన్నలగడ్డకి ఈ సినిమా.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సుస్థిరమైన నటుడుగా నిలబెట్టింది. కనీవిననీ రీతిలో అఖండ విజయాన్ని అందజేసింది. అదే ఊపులో డానికి సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్ తీశారు. అది కూడా అంతే రెస్పాన్స్ తీసుకొచ్చింది. ఇప్పటికీ ఎక్కడ చూసిన టిల్లు పాటలు, ఆ డైలాగ్స్ అందరిని ఎంటర్‌టైన్‌ చేస్తూనే ఉంటాయి. పూర్తిస్థాయి హీరోని చేసిన చిత్రం టిల్లు అనే చెప్పాలి.

జాక్ సినిమాతో నష్టాలు

డీజే టిల్లు సీక్వెల్ తరువాత భారీ అంచనాలతో వచ్చిన సినిమా జాక్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తరువాత బొమ్మరిల్లు భాస్కర్ తీసిన చిత్రం జాక్. ప్రకాష్ రాజ్, వైష్ణవి చైతన్య, నరేష్ ,బ్రహ్మజీ, సుబ్బరాజు, రవి ప్రకాష్, రాహుల్ దేవ్, శబీర్ కలరక్కల్ వంటి మంచి పాపులర్ నటులు అందరూ కూడా ఇందులో నటించారు. ఈ మూవీని శ్రీవేంకటేశ్వర సినీ చిత్రాలు బ్యానర్‌పై శ్రీకాంత్, మణికాంత్ నిర్మించారు. అందరూ తెలిసిన మంచి మంచి నటులు, అనుభవమున్న దర్శకుడు, ఆల్రెడీ అందరికి పరిచయం ఉన్న హీరో, హీరోయిన్ అందరూ కూడా ఈ చిత్రంలో భాగం అయ్యారు. అయినప్పటికీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తాను నిరూపించుకోలేక పోయింది.

అక్టోబర్ 17న తెలుసు కదా

సిద్దు జొన్నలగడ్డ కెరీర్‌లో అతి పెద్ద పరాభవాన్ని చవిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. దీనితో జాక్ సినిమా నిర్మాతలు నష్టాల్లో కూరుకుపోయారు. ఆ సమయంలో హీరోగా చేసిన సిద్దు నిర్మాతల ఇబ్బందిని చూడలేక తన దగ్గర డబ్బులు లేకపోయినా బయట నుంచి వడ్డీలకు అప్పు తెచ్చి నిర్మాతలకు రూ. 4.75 కోట్లు ఇచ్చారు. దీంతో ఇండస్ట్రీలో అప్పట్లో.. ఇదొక చర్చనీయాంశం అయింది. సిద్దు వయసులో చిన్నవాడు అయినప్పటికీ తాను ఈ చేసిన మంచి పనికి గొప్ప ప్రసంశలు పొందాడు. ఎదుటి వ్యక్తుల బాధను అర్థం చేసుకోవడంలో ఉన్నతంగా ఆలోచించాడని కొనియాడారు. కాగా ఈ నెల అక్టోబర్ 17న దీపావళి రోజున సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా అనే కొత్త సినిమాతో.. మళ్ళీ ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి బయలుదేరి వస్తున్నాడు.

విక్రమ్ కుమారునికి బ్రేక్ ఇచ్చే సినిమా!.. భారీ అంచనాల మధ్య దీపావళికి..

0

చియాన్ విక్రమ్ కుమారుడు హీరోగా ధృవ్ విక్రమ్.. హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా బైసన్ (కాలమాదన్). వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు మారీ సెల్వరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. నీలం స్టూడియోస్ మరియు అప్లాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై.. దర్శక నిర్మాత పా. రంజిత్, సమీర్ నాయర్, దీపక్ సెగల్, అదితి ఆనంద్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నివాస్ కే ప్రసన్న ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. పశుపతి.. హీరో తండ్రిగా ప్రధాన పాత్రలో కనిపించునున్నారు.

ధృవ్ విక్రమ్ ఆశలన్నీ బైసన్ పైనే..

ఇప్పటి వరకు ధృవ్ విక్రమ్ రెండు సినిమాల్లో మాత్రమే నటించాడు. అందులోను మొదటి చిత్రమే తెలుగులో వచ్చిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూవీని రీమేక్ చేశారు. వరమా అనే పేరుతో తీసిన ఫస్ట్ వెర్షన్‌లో అంత బలం లేకపోయేసరికి మళ్ళీ రీషూట్ చేసి ఆదిత్య వర్మ అనే పేరుతో విడుదల చేశారు. ఇందులో దృవ్ నటన, స్క్రీన్ ప్రెజన్స్ బాగున్నప్పటికి క్రిటిక్స్ నుంచి మిక్సడ్ పోసిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ వ్యాపార పరంగా చూసుకుంటే యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

ఇక రెండో సినిమా తండ్రి చియాన్ విక్రమ్‌తో కలిసి నటించిన మహాన్. అది ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో రిలీజ్ అవ్వడంతో మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో రిలీజ్ కాకపోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర నష్టపోయిందా, ఫలితాలు రాబట్టిందా అనడానికి వీలులేకుండా పోయింది. కానీ ప్రేక్షకుల్లో.. యువత ఎక్కువుగా అట్రాక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు. ఇప్పుడు మూడవ చిత్రం బైసన్.. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 17న అతి పెద్ద అంచనాలతో ప్రేకక్షకుల ముందుకు రాబోతున్నది. ఇప్పటికే విడుదలైన నాలుగు పాటలు అద్భుతంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో మిలయన్స్ వ్యూస్‌తో అత్యంత ఆదరణ పొందాయి. ధృవ్ విక్రమ్ మంచి మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. కంటెంట్ బాగుంటే ఇదే అతనికి బ్రేక్ ఇచ్చే సినిమా అవుతుంది అని ఊహగానాలు వినిపిస్తున్నాయి.

మారీ మార్క్ మళ్ళీ రిపీట్!

మారీ తీసిన సినిమాలు ఇప్పటి వరకు ఫెయిల్ అయిన దాఖలాలే లేవు. నాలుగు చిత్రాలు పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్, మామన్నన్, వాలై అఖండ విజయాన్ని సృష్టించ్చాయి. కులము, సమాజము, రాజకీయం, అధికారము వీటన్నింతో ఆయన పాత్రలు పోరాటం చేస్తుంటాయి. ధృవ్ లుక్ మిగిలిన రెండు చిత్రాల కంటే భిన్నంగా ఉంది. రఫ్, మాస్ స్టైల్‌లో ఉన్న ధృవ్‌ను చూస్తుంటే తన జీవితంలో ఇదే టర్నింగ్ సినిమా అవుతుందని సినీ క్రిటిక్స్ వర్గాలు చెబుతున్నాయి. మారీ సెల్వరాజ్ కెరీర్‌లో భారీ విజయం పొందనునున్నట్లు అర్థమవుతోంది. మారీ మార్క్ మళ్ళీ రిపీట్ అవ్వాలని కోరుకుందాం.

కథ విషయానికి వస్తే.. పల్లెటూరు వ్యవసాయ కుటుంబం మరియు కబడ్డీ ఆడే క్రీడాకారుని నేపథ్యంలో ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇంతవరకు ఆడిన సినిమాలు.. తండ్రి చియాన్ విక్రమ్ ఇమేజ్ చట్రంలోనే చూస్తున్నారు. బైసన్ ధృవ్‌కు ఒక సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేస్తుందని అందరూ భావిస్తున్నారు. అందుకు తగినట్టే విడుదలైన పాటలు.. అన్నీ నిరూపిస్తున్నాయి. ఈ నెల అక్టోబర్ 17న దీపావళి సంధర్బంగా మారీ, ధృవ్ అభిమానులకు కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారు. ఇందుకోసం ఫ్యాన్స్ కూడా అదే ఉత్సహంతో ఎదురుచూస్తున్నారు.