యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నివసిస్తున్న.. ప్రవాస భారతీయుల కోసం, దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా జీపీఎస్‌పీ 2.0 కింద గ్లోబల్ పాస్‌పోర్ట్ సేవా పాస్‌పోర్ట్ ప్రారంభించింది. దీనిద్వారా మరింత వేగవంతమైన, సురక్షితమైన పాస్‌పోర్ట్ ధరఖాస్తు అనుభవం పొందవచ్చు. ఈ సరికొత్త పాస్‌పోర్ట్ సేవా 2.0 గురించి, ఎలా అప్లై చేసుకోవాలని అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఎలక్ట్రానిక్ చిప్ పాస్‌పోర్ట్
పాస్‌పోర్ట్ సేవా 2.0 కింద చిప్ ఎనేబుల్డ్ ఈ-పాస్‌పోర్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇది చూడటానికి సాధారణ పాస్‌పోర్ట్ మాదిరిగా అనిపించినప్పటికీ.. ఇందులో ఎలక్ట్రానిక్ చిప్ ఉంటుంది. ఈ చిప్‌లో పాస్‌పోర్ట్ హోల్డర్ బయోమెట్రిక్ డేటా, వ్యక్తిగత వివరాలు, డిజిటల్ సిగ్నేచర్ వంటివి సురక్షితంగా ఉంటాయి. దీంతో కౌంటర్‌ఫీటింగ్ మరియు మోసాల నుంచి బయటపడొచ్చు.
అదనపు ఖర్చు లేకుండా
యూఏఈలో నివసిస్తున్న.. భారతీయులకు పాస్‌పోర్ట్ సేవలను మరింత పారదర్శకంగా, యూజర్ ఫ్రెండ్లీగా మరియు సమర్థవంతంగా మార్చడమే లక్ష్యంగా ఈ అప్‌గ్రేడ్ తెచ్చినట్లు కాన్సులేట్ వెల్లడించింది. ఇప్పుడు వినియోగదారు ఈ జీపీఎస్‌పీ 2.0 ద్వారా ఆన్‌లైన అప్లికేషన్ డాక్యుమెంట్స్, ఐసీఏఓ కంప్లైంట్ ఫొటోస్, సంతకాలు వంటివి సిస్టమ్‌లోకి నేరుగా అప్‌లోడ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా పాస్‌పోర్ట్ కేంద్రం దగ్గర ప్రజలు వేచి ఉండాల్సిన సమయం తగ్గుతుంది. అంతే కాకుండా అప్లికేషన్ ఫారాలను తిరిగీ టైప్ చేయాల్సిన అవసరం లేకుండా.. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండానే.. చిన్న చిన్న సవరణలు సులభంగా చేసుకోవచ్చు.
దుబాయ్, అబుదాబిలలోనే భారత రాయబర కార్యాలయాల్లో ఈ-పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసుకోవచ్చు. కొత్త విధానం ద్వారా అప్లై చేసుకోవడంతో.. ప్రాసెసింగ్ వేగవంతం అవుతుంది. ఇలాంటి ఈ-పాస్‌పోర్డ్ ద్వారా ఇమ్మిగ్రేషన్ చెక్‌పాయింట్ల వద్ద ఆటోమేటెడ్ వెరిఫికేషన్ కూడా సాధ్యమవుతుంది. నిజానికి 2022లోనే భారత ప్రభుత్వం.. దేశంలో ఈ-పాస్‌పోర్ట్స్ ప్రారంభించింది. ఇప్పుడు విదేశాలకు విస్తరిస్తోంది.
యూఏఈలో ఈ-పాస్‌పోర్ట్ కోసం ఎలా అప్లై చేయాలంటే?
- అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి.. మీరు ఉన్న ప్రదేశం సెలక్ట్ చేసుకోవాలి.
- కొత్త యూజర్ అయితే.. రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేసి, ఈఈమెయిల్, పాస్‌వర్డ్ వంటి వాటితో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
- ఇలా చేసిన తరువాత అకౌంట్ యాక్టివేషన్ లింక్ మీ ఈమెయిల్‌కు వస్తుంది. దాన్ని క్లిక్ చేయడంతో అకౌంట్ యాక్టివేట్ అవుతుంది.
- అప్లికేషన్ హోల్డర్.. హోమ్ పేజీలోని కొత్త అప్లికేషన్ కోసం సంబంధిత ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫిల్ చేసిన తరువాత.. ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసిన ఫామ్ ప్రింటవుట్ తీసుకోండి.
- ప్రింటవుట్ తీసుకున్న తరువాత.. అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుని, మీకు దగ్గరలో ఉన్న బీఎల్ఎస్ కేంద్రాన్ని సెలక్ట్ చేసుకోండి.
అపాయింట్‌మెంట్ రోజున తీసుకెళ్లాసిన డాక్యుమెంట్స్
- అప్లికేషన్ ఫామ్ ప్రింటవుట్
- మీ పాత పాస్‌పోర్ట్
- యూఏఈ రెసిడెన్సీ వీసా పేజీ కాపీ
- ఎమిరేట్స్ ఐడీ కాపీ, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు (వైట్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి). చెల్లించాల్సిన ఫీజు మీరు ఎంచుకునే సెంటర్ మీద ఆధారపడి ఉంటుంది.
- బయోమెట్రిక్ పూర్తయిన తరువాత.. మీ అప్లికేషన్ భారత రాయభార కార్యాలయానికి పంపిస్తారు.
- పాస్‌పోర్ట్ ప్రాసెసింగ్ మొత్తం పూర్తయిన తరువాత.. చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్ ప్రింట్ చేస్తారు. 2-3 వారాల్లో దీనిని మీరు పొందవచ్చు.