చాలామంది ఏదైనా సమాచారం కావాలంటే.. ఒకప్పుడు వికీపీడియానే సందర్శించేవారు. కానీ ఇప్పుడు ఏం కావాలన్నా చాట్‌జీపీటీ అండ్ సెర్చ్ ఇంజిన్ మీదనే ఆధారపడుతున్నారు. దీనివల్ల వీకిపీడియాను సందర్శించేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని.. సంస్థ నివేదించింది. ఇదిలాగే కొనసాగితే.. వికీపీడియా ఉనికికే నష్టం కలుగుతుందని ఆరోపించింది.
తగ్గుతున్న వీక్షకులు
వికీపీడియా సీనియర్ ప్రొడక్ట్ డైరెక్టర్ మిల్లర్ ప్రకారం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చాట్‌బాట్‌లు, సెర్చ్ ఇంజిన్ వంటివి వికీపీడియా కంటెంట్‌ను స్క్రాప్ చేసి వినియోగదారులకు అందించడం వల్ల.. వికీపీడియాను సందర్శించే వినియోగదారుల సంఖ్య 8 శాతం తగ్గినట్లు సమాచారం. ఏఐ ఇలాంటిపని చేస్తుండటం వల్ల.. వీక్షకుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని ఆరోపించారు.
బ్రెజిల్‌లో ఎక్కువ ప్రభావం!
ప్రతినెలా.. వికీపీడియాను, వికీపీడియా ప్రాజెక్టులను సందర్శించే వారి సంఖ్య బిలియన్ల కొద్దీ ఉంది. అయితే ఈ ట్రాఫిక్ ఏఐ కారణంగా హ్యూమన్ ట్రాఫిక్ స్థాయి తగ్గిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉన్నప్పటికీ.. ఈ ప్రభావం బ్రెజిల్‌లో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 2025 మే నెలలో వీక్షణలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అయితే దీనిని మళ్ళీ పెంచుకోవడానికి ప్రత్యేక బాట్ నిర్మిస్తున్నట్లు వికీపీడియా వెల్లడించింది.
నిజానికి వికీపీడియా కొన్నేళ్ల నుంచి కొంత ఆందోళనను ఎదుర్కొంటూనే ఉంది. దీనికి కారణం వికీపీడియా సందర్శకుల సంఖ్య తగ్గడమనే తెలుస్తోంది. స్వచ్ఛంద సంపాదకులు, దాతలు కూడా తగ్గుతున్నారు. హ్యూమన్ ఇన్‌పుట్ తగ్గడం వికీపీడియా భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. కాబట్టి వినియోగదారులు అసలు మూల విషయాన్ని సందర్శించాలని కోరుకుంది.
వికీపీడియా గురించి
నిజానికి ఒకప్పుడు చాలా విషయాల గురించి తెలుసుకోవడానికి.. ప్రజలు వికీపీడియానే సందర్శించేవారు. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయ్. ఏ ప్రశ్నకు సమాధానం కావాలన్నా.. ఏఐను సందర్శిస్తున్నారు. దీనివల్ల వికిపీడియాకు మాత్రమే కాకుండా కొన్ని వెబ్‌సైట్‌లకు కూడా వ్యూవ్స్ భారీగా తగ్గుతున్నాయి. ఒక యూజర్ అడిగే ప్రశ్నకు.. తనదైన రీతిలో లోతుగా సమాధానం ఇస్తుంది. దీంతో ఏఐనే ప్రశ్నిస్తున్నారు.. సమాధానాలు తెలుసుకుంటున్నారు. వికీపీడియాలో అక్కడున్న విషయం గురించి మాత్రమే తెలుసుకోవచ్చు. కానీ ఏఐ చాట్‌బాట్ నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానము ఇస్తుంది.
ఏఐ చాట్‌బాట్ విషయాన్ని పక్కనపెడితే.. అసలు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ కారణంగా.. ఉద్యోగుల ఉద్యోగాలు కూడా ప్రశ్నార్థకంగా మారిపోయాయి. చాలామంది ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయాయి. ఇంకొంతమంది తమ ఉద్యోగాలు.. ఎప్పుడు పోతాయో అని బిక్కుబిక్కుమంటున్నారు. కొంతమంది మేధావులు ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయని చెబుతుంటే, ఇంకొందరు నిపుణులు ఏఐ వల్ల భయపడాల్సిన అవసరం లేదని.. కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది, కానీ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ
ఏఐ అనేది ఒకప్పుడు నెమ్మదిగా విస్తరించి.. ఈరోజు అన్ని రంగాల్లోకి ప్రవేశించింది. ఇది ఒకరకంగా చాలామందికి ఉపయోగకరంగా ఉన్నప్పటికీ.. మరీ ఇంత వేగవంతమైన అభివృద్ధి కొన్ని రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తును కూడా ప్రశ్నార్ధకం చేసింది. దీనిపై అనేక సదస్సులు, సమావేశాలు జరిగి చర్చించుకున్నప్పటికీ.. స్పష్టమైన క్లారిటీ మాత్రం కరువైపోయింది. ఇప్పుడు వికీపీడియా భవిష్యత్తను కూడా ఆందోళనలో పడేసింది.