అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ పనితీరు గురించి వివరణ ఇచ్చారు. గత 20 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చాలా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలతో పాటు.. ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కూడా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో.. పనిచేయడం వల్లే, ఈ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేయడంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు.
సూపర్ సిక్స్ పథకాల అమలు
Super Six schemes రాష్ట్రంలో ప్రధాన సంక్షేమ కార్యక్రమాలుగా అమలవుతున్నాయని సీఎం పేర్కొన్నారు. ఈ పథకాల ద్వారా సమాజంలోని వివిధ వర్గాలకు ఆర్థిక సహాయం & సంక్షేమ ప్రయోజనాలు అందుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. చిన్న తప్పు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
ఉగాది సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు
రాబోయే Ugadi పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని సీఎం వెల్లడించారు. రైతులకు మద్దతుగా Annadata Sukhibhava పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.50 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాలు ప్రజలకు పండుగ కానుకగా అందించనున్నామని పేర్కొన్నారు.
అభివృద్ధికి అవకాశాల మెండు
రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు అన్నారు. అధికారులు సమర్థవంతంగా పనిచేస్తే మరింత వేగంగా అభివృద్ధి సాధించవచ్చని తెలిపారు. పరవాలేదు.. అనే నిర్లక్ష్య భావన ఉంటే అభివృద్ధి సాధ్యం కాదని ఆయన హెచ్చరించారు. ప్రతి అధికారి బాధ్యతగా పనిచేయాలని సూచించారు.
సూపర్ సిక్స్ పథకాలు
- అన్నదాత సుఖీభవ: రాష్ట్రంలోని రైతులకు సంవత్సరానికి రూ. 20,000 ఆర్థిక సహాయం.
- తల్లికి వందనం: పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15,000.
- ఆడబిడ్డ నిధి: 19–59 సంవత్సరాల వయసున్న మహిళలకు నెలకు రూ. 1,500 ఆర్థిక సహాయం.
- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: రాష్ట్రంలోని APSRTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.
- యువతకు ఉద్యోగాలు / నిరుద్యోగ భృతి: 20 లక్షల ఉద్యోగాలు కల్పించటం లక్ష్యం. ఉద్యోగం రాకపోతే నెలకు రూ. 3,000 నిరుద్యోగ భృతి ఇవ్వడం.
- దీపం 2.0: అర్హులైన కుటుంబాలకు ప్రతి సంవత్సరం 3 ఉచిత LPG గ్యాస్ సిలిండర్లు.
కూటమి ప్రభుత్వం.. రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తూనే ఉంది. ప్రస్తుతం దాదాపు అన్ని పథకాలను అమలు చేశారు. యువతకు ఉద్యోగాలను కల్పించడానికి కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. కాగా నిరుద్యోగ భృతికి సంబంధించిన విషయాలపై స్పష్టత వెలువడాల్సి ఉంది. బహుశా దీనిని కూడా ప్రభుత్వం త్వరలోనే అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రజల క్షేమం కోసం గట్టిగా కృషి చేస్తోంది.
Also read: శుభవార్త.. రైతులకు ఖాతాల్లోకి రూ.6000!

మహేష్ – నేను MarthaTelugu వెబ్‌సైట్‌లో రెండు సంవత్సరాలుగా సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నాను. నాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన వార్తలు రాయడంలో అనుభవం ఉంది. జర్నలిజం రంగంలో నాకు 8 సంవత్సరాల అనుభవం ఉంది. డిజిటల్ మార్కెటింగ్, తెలుగు కంటెంట్ సృష్టిలో నైపుణ్యం కలిగిన నేను.. క్రియేటివ్, ఆకర్షణీయ, సమాచారపరమైన కంటెంట్ రూపకల్పనలో ప్రత్యేకత కలిగి ఉన్నాను.
