Home Blog Page 123

తెలుగులో మాట్లాడిన తమిళ్ హీరో: పేపర్ మీద రాసుకొచ్చి మరీ..

0

బైసన్ మూవీ తమిళంలో రిలీజ్ అయ్యి అతి పెద్ద విజయాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు అక్టోబర్ 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి జగదాంబా ఫిలిం బ్యానర్ వాళ్ళు సిద్దమయ్యారు. అందుకు సంబంధించిన ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బైసన్ సినిమా హీరో ధృవ్ విక్రమ్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, మ్యూజిక్ డైరెక్టర్ నివాస్ కె ప్రసన్న, ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్ బాలాజి హాజరయ్యారు.

పేపర్‌లో రాసుకొని ప్రిపేర్ అయ్యి..

ఈ కార్యక్రమంలో.. ధృవ్ తెలుగుని పేపర్‌లో రాసుకొని వచ్చి బాగా ప్రిపేర్ అయ్యి మాట్లాడటం జరిగింది. అతను ఏం మాట్లాడాడనే విషయానికి వస్తే, అందరికి నమస్కారం అని చెబుతూ అలాగే మీడియా మిత్రులకి, సినీ ప్రముఖులకి, ఈవెంట్ ఆర్గనైజర్లకు చాలా థాంక్స్ అని చెప్పడం జరిగింది. దీంతో అక్కడ చప్పట్లు మొగాయి. తాను కూడా చిన్నగా నవ్వాడు. హైదరాబాద్‌లో ప్రమోట్ చేస్తున్న నా మొదటి సినిమా అని, అందుకే ఇది స్పెషల్ అని చెప్పుకొచ్చాడు. నా పేరు ధృవ్ అంటూ సరదాగా తనను తాను సభకు పరిచయం చేసుకున్నారు.

నిజంగా జరిగిన ఒక ఘటన

ఈమధ్యనే సూట్‌కేస్ కొనడం కోసం ఒక మాల్‌కు వెళ్ళానని చెబుతూ అక్కడ ఆ షాప్ ఓనరుకు హీరో ధృవ్‌కు మధ్యలో జరిగిన సంభాషణ గురించి పేర్కొన్నాడు. ఆ షాప్ ఎదురుగా కొంతమంది ధృవ్‌కు అలాగే చూస్తూ నిలబడ్డారంట దాన్ని చూసిన షాప్ ఓనర్ “వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఆ” అని అడిగితే కాదన్నాను. పోనీ మీరు ఏమైనా సినిమా యాక్టరా అని ఆ ఓనర్ అడిగారు. అప్పుడు నేను అవును అని అతనికి చెప్పాను. అతను అప్పుడు మీరు అచ్చం హీరో చియాన్ విక్రమ్ మాదిరిగా ఉన్నావని అన్నాడంట. నేను ఆయన కొడుకునే అనేసరికి వెంటనే అతను మీ నాన్న నటన అంటే చాలా ఇష్టం అని, చాలా కష్టపడి పైకి వచ్చాడని చాలా గర్వంగా, సంతోషంగా విక్రమ్ పట్ల ఎంతో ప్రేమని చూపించాడంట ఆ ఓనర్.

ఇంకా ధృవ్ మాట్లాడుతూ.. మా నాన్న ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అన్ని రాష్ట్రాల్లో, దేశం మొత్తం మీద ఇంత పాపులరీటినీ, ప్రేమని, ఇంత అభిమానాన్ని సంపాదించడం అనేది నిజంగా చాలా అద్భుతం. నేను అందుకు చాలా గర్వపడుతున్నాను.. అని తన తండ్రి విక్రమ్ గురించి చెప్పుకొచ్చారు. ఒక కొడుకుగా నాకు అన్ని కూడా చాలా సులభంగా వచ్చేసాయి అనిపిస్తోంది. నాకు తెలుసు నేను ఏమి ఇంకా సాధించలేదని, కానీ మీ ఆదరణ, అభిమానం పొందడానికి నేను చాలా కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాను.. అని హీరో ధృవ్ తన తెలుగు మాటలను చాలా ముద్దు ముద్దు చెప్పాడు. ఇది అక్కడ ఉన్న అందరినీ ఆనందలో ముంచేసింది చెప్పట్ల మోత మోగింది.

ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి

తెలుగు వాళ్ళు ఫుడ్ను, సినిమాని ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారో నాకు బాగా తెలుసు. నాకు తెలుగులో పని చేయాలని కోరిక మరియు అందులో ఈ సినిమా.. నా మొదటి అడుగు అని నేను నమ్ముతున్నాను. బైసన్ నా జీవితంలో చాలా ముఖ్యమైన సినిమా, మీతో ఇదంతా మాట్లాడటానికి మూడు సంవత్సరాలు ఎదురు చూశాను. ఈ సమయంలో ఈ సినిమా కోసం ప్రొఫెషనల్ కబడ్డీ ఆట నేర్చుకున్నాను. నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, మూవీ నచ్చితే సపోర్ట్ చేయండి. అది నాకు చాలా బలం ఇస్తుంది. నేను నాన్నగారి లాగే కష్టపడతాను. నా నుండి వందశాతం ఎఫెర్ట్ పెడతాను.

కొంపముంచుతున్న ఏఐ?.. కష్టాల్లో వీకీపీడియా!!

చాలామంది ఏదైనా సమాచారం కావాలంటే.. ఒకప్పుడు వికీపీడియానే సందర్శించేవారు. కానీ ఇప్పుడు ఏం కావాలన్నా చాట్‌జీపీటీ అండ్ సెర్చ్ ఇంజిన్ మీదనే ఆధారపడుతున్నారు. దీనివల్ల వీకిపీడియాను సందర్శించేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని.. సంస్థ నివేదించింది. ఇదిలాగే కొనసాగితే.. వికీపీడియా ఉనికికే నష్టం కలుగుతుందని ఆరోపించింది.

తగ్గుతున్న వీక్షకులు

వికీపీడియా సీనియర్ ప్రొడక్ట్ డైరెక్టర్ మిల్లర్ ప్రకారం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చాట్‌బాట్‌లు, సెర్చ్ ఇంజిన్ వంటివి వికీపీడియా కంటెంట్‌ను స్క్రాప్ చేసి వినియోగదారులకు అందించడం వల్ల.. వికీపీడియాను సందర్శించే వినియోగదారుల సంఖ్య 8 శాతం తగ్గినట్లు సమాచారం. ఏఐ ఇలాంటిపని చేస్తుండటం వల్ల.. వీక్షకుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని ఆరోపించారు.

బ్రెజిల్‌లో ఎక్కువ ప్రభావం!

ప్రతినెలా.. వికీపీడియాను, వికీపీడియా ప్రాజెక్టులను సందర్శించే వారి సంఖ్య బిలియన్ల కొద్దీ ఉంది. అయితే ఈ ట్రాఫిక్ ఏఐ కారణంగా హ్యూమన్ ట్రాఫిక్ స్థాయి తగ్గిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉన్నప్పటికీ.. ఈ ప్రభావం బ్రెజిల్‌లో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 2025 మే నెలలో వీక్షణలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అయితే దీనిని మళ్ళీ పెంచుకోవడానికి ప్రత్యేక బాట్ నిర్మిస్తున్నట్లు వికీపీడియా వెల్లడించింది.

నిజానికి వికీపీడియా కొన్నేళ్ల నుంచి కొంత ఆందోళనను ఎదుర్కొంటూనే ఉంది. దీనికి కారణం వికీపీడియా సందర్శకుల సంఖ్య తగ్గడమనే తెలుస్తోంది. స్వచ్ఛంద సంపాదకులు, దాతలు కూడా తగ్గుతున్నారు. హ్యూమన్ ఇన్‌పుట్ తగ్గడం వికీపీడియా భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. కాబట్టి వినియోగదారులు అసలు మూల విషయాన్ని సందర్శించాలని కోరుకుంది.

వికీపీడియా గురించి

నిజానికి ఒకప్పుడు చాలా విషయాల గురించి తెలుసుకోవడానికి.. ప్రజలు వికీపీడియానే సందర్శించేవారు. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయ్. ఏ ప్రశ్నకు సమాధానం కావాలన్నా.. ఏఐను సందర్శిస్తున్నారు. దీనివల్ల వికిపీడియాకు మాత్రమే కాకుండా కొన్ని వెబ్‌సైట్‌లకు కూడా వ్యూవ్స్ భారీగా తగ్గుతున్నాయి. ఒక యూజర్ అడిగే ప్రశ్నకు.. తనదైన రీతిలో లోతుగా సమాధానం ఇస్తుంది. దీంతో ఏఐనే ప్రశ్నిస్తున్నారు.. సమాధానాలు తెలుసుకుంటున్నారు. వికీపీడియాలో అక్కడున్న విషయం గురించి మాత్రమే తెలుసుకోవచ్చు. కానీ ఏఐ చాట్‌బాట్ నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానము ఇస్తుంది.

ఏఐ చాట్‌బాట్ విషయాన్ని పక్కనపెడితే.. అసలు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ కారణంగా.. ఉద్యోగుల ఉద్యోగాలు కూడా ప్రశ్నార్థకంగా మారిపోయాయి. చాలామంది ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయాయి. ఇంకొంతమంది తమ ఉద్యోగాలు.. ఎప్పుడు పోతాయో అని బిక్కుబిక్కుమంటున్నారు. కొంతమంది మేధావులు ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయని చెబుతుంటే, ఇంకొందరు నిపుణులు ఏఐ వల్ల భయపడాల్సిన అవసరం లేదని.. కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది, కానీ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ

ఏఐ అనేది ఒకప్పుడు నెమ్మదిగా విస్తరించి.. ఈరోజు అన్ని రంగాల్లోకి ప్రవేశించింది. ఇది ఒకరకంగా చాలామందికి ఉపయోగకరంగా ఉన్నప్పటికీ.. మరీ ఇంత వేగవంతమైన అభివృద్ధి కొన్ని రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తును కూడా ప్రశ్నార్ధకం చేసింది. దీనిపై అనేక సదస్సులు, సమావేశాలు జరిగి చర్చించుకున్నప్పటికీ.. స్పష్టమైన క్లారిటీ మాత్రం కరువైపోయింది. ఇప్పుడు వికీపీడియా భవిష్యత్తను కూడా ఆందోళనలో పడేసింది.

మాటలకందని వైభవం.. ఊహకందని గండికోట చరిత్ర: తెలుసా?

గండికోట గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే అటు గొప్ప చరిత్ర.. ఇటు సినిమాలలో కూడా దీని గురించి చాలానే విని ఉంటారు. దీనికి సంబందించిన పూర్వాపరాల విషయానికి వస్తే..

చార్రిత్రాత్మక ప్రశస్తి ఉన్న గండికోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, కడప జిల్లాలో ఉంది. ఒకప్పుడు ఈ గండికోట ప్రాంతాన్ని కాకతీయులు, విజయనగర రాజులు, బుక్కరాయలు, కుతుబ్ షాహిలు పరిపాలించిన చరిత్ర ఉన్నది. కానీ ఇప్పుడు ఇది ఒక పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. బోటింగ్, రోప్ క్లింబింగ్, జిప్ లైన్ లాంటి అడ్వెంచర్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా అనేకరకాలుగా ప్రభుత్వ.. ప్రభుత్వేతర సంస్థలు ఆదాయ మార్గాలను అవలంబిస్తున్నాయి. ఎంతోమంది వీక్షకులకు ఇది చాలా ఆహ్లాదమైన వాతావారణాన్ని కల్పిస్తుంది. కాలయాపన చేయడం కోసం, సెలవు రోజుల్లో విద్యార్థులకు, పెద్దవాళ్లకు అందరికి  కూడా ఆనందంగా గడపడానికి గండికోట అనుకూలమైన ప్రాంతం. ఇక దీనికి సంబంధించిన చారిత్రక విషయాలలోనికి మనం వెళ్లినట్లయితే..

గండికోటకు ఆ పేరెలా వచ్చిందంటే..

మొదట ఈ ప్రాంతానికి గండికోట అనే పేరు ఎలా వచ్చింది అంటే గండి అనగా వాగు అని అర్థమట.. కోట అనగా మాములుగా పెద్ద భవనాన్ని కోట అంటాము. ఈ గండి, కోట అనే రెండు స్వచ్ఛమైన తెలుగు పదాల నుంచి ఉద్భవించాయి. ఈ గొప్ప కోటని పెన్నా నది వాగుపైన నిర్మించారు. దీనినే గండికోట అని పిలుస్తారు.

కోటకు సంబంధించిన చుట్టూ ఉన్న ప్రాంతం చూస్తే చాలా పెద్దగా దాదాపు ఒక ఎనిమిది.. తొమ్మిది కిలోమీటర్లు దాకా ఉంటుంది. ఇక్కడ మాధవరాయ, రంగనాథస్వామికి చెందిన రెండు గుడులు కూడా ఉండాయి. అవి విజయనగర రాజుల పరిపాలన కాలంలో వారి యొక్క అభిరుచి తగినట్టు కట్టించుకున్నవిగా మనకు అనిపిస్తుంది. తరువాత జామీ మసీదు, దాన్యపు భవనము, చార్మినార్, ఇంకా కొన్ని కట్టాలన్నీ కూడా కుతుబ్ షాహీలు కట్టించినట్టు పురావాస్తు ఆధారాలు చెబుతున్నాయి. ఇవి చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడూ కూడా నీళ్లు చాలా బాగా అందుబాటులో ఉంటాయంటే.. అప్పటి రాజులు ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నారన్నమాట.

ఏయే రాజులు ఈ కోటను పరిపాలించారంటే?

చరిత్ర ప్రకారం.. చూసుకున్నట్టయితే కాప మహారాజు అనే వ్యక్తి 12వ శాతబ్దంలో గండికోటను కట్టించినట్టు చెబుతారు. ఆ తర్వాత పదమూడో శతాబ్దంలో కాకతీయుల ప్రవేశించినప్పుడు దీని చరిత్ర స్టార్ట్ అవుతుంది. వీరి తర్వాత విజయనగర రాజులు వశపరుచుకుంటారు. ఒకటవ బుక్కరాయలు సమయంలో.. కోట మొత్తం మంచిగా తయారు చేసి అభివృద్ధి చేశారట. రంగనాథ స్వామి, మాధవరాయ రెండు ఆలయాలు వీరి టైమ్‌లోనే నిర్మించారు. తరువాత విజయనగర రాజులు ఓడిపోవడం, వారి సామ్రాజ్యం మొత్తం పతనమవడంతో అదే అదునుగా హైదరాబాద్ కుతుబ్ షాహిలు కోటను కైవసం చేసుకున్నారు (మీర్ జుమ్లా ఆధ్వర్యంలో) ఇది జరిగింది.

వీరి అనంతరం కడప నవాబులు కోటపై యుద్ధం చేసి కుతుబ్ షాహిల దగ్గర నుంచి రాజ్యాన్ని చేజిక్కించుకున్నారట. ఆ తరువాత టిప్పు సుల్తాను, హైదర్ వీరు1.. ఇద్దరు కొంతకొంత కాలం పరిపాలించిన తరువాత నిజాం ఒప్పందంలో భాగంగా గండికోట ప్రాంతాన్ని క్రీస్తుశకం 1800ల సంవత్సరములో బ్రిటిష్ వాళ్లకి అప్పగించాల్సి వచ్చిందట. వారి తరువాత కోటని ఇండియా సంరక్షిస్తున్నది. ఈ విధంగా గండికోట విశేషాలు, దాని చరిత్ర గురించి తెలుసుకున్నాము కదా.. మీలో ఎంతమంది గండికోటకు చూసారు.. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి.

తమిళ సినిమాకు జూ.ఎన్టీఆర్ ప్రమోషన్!: దీని వెనుక ఇంత కథ ఉందా?

0

తెలుగు కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సహజంగా తనకు నచ్చిన వ్యక్తులకు లేదా తనను నమ్మిన మనుషులకు అన్ని వేళల్లో అండగా నిలబడటం.. వారి విషయాల పట్ల సానుకూలంగా స్పందించడం అనేది సర్వసాధారణమైన అంశం. ఇలాంటి ఉదారభావం కలిగి ఉన్నందుకు ఎల్లలు దాటిన అభిమానులను.. జూనియర్ ఎన్టీఆర్ తన సొంతం చేసుకోగలిగారు. ఆ కారణంగా ఆయన్ని సపోర్ట్ చేసేవాళ్ళు.. ఆయన సపోర్ట్ చేసే వాళ్ళు అన్ని సినిమా ఇండస్ట్రీలలో కూడా పెరిగిపోయారు అనే చెప్పొచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే తమిళ యాక్టర్ శిలంబరసన్ టి.ఆర్ (శింబు) నటిస్తున్న “అరసన్ ” సినిమా ప్రోమో వీడియోని ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.

వెట్రిమారన్ & శింబు మూవీ..

సినిమా ప్రమోషన్ కోసం ఈ వీడియోని విడుదల చేశారు. దాదాపు ఐదు నిముషాల కంటే ఎక్కువే నిడివి కలిగిన వీడియోను చాలామందే చూశారు. ఈ చిత్రానికి ఎన్టీఆర్ అభిమాన దర్శకుడు వెట్రిమారన్ డైరెక్ట్ చేయడం ఇంకో విశేషం అని చెప్పాలి. అందులోనూ వెట్రి సొంత బ్యానర్ అయిన వీ క్రియేషన్స్ పతాకంపైనే ఈ మూవీని నిర్మిస్తున్నారు. సినిమాల పట్ల మంచి అభిరుచి కలిగిన.. పాపులర్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శింబు, వెట్రిలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక అభిమాన ఘనం ఉండటం ఒకెత్తైతే.. దానికి తోడు స్వయానా తెలుగువాడైనా ఎన్టీఆర్ ఈ వీడియోను ప్రమోట్ చేయడంతో మూవీకి మరింత హైప్ వచ్చిందని చెప్పొచ్చు.

జూ. ఎన్టీఆర్ ఏమన్నారంటే?

ఎన్టీఆర్ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టి ఏమని విష్ చేసారంటే.. “అత్యంత ప్రతిభను కలిగిన వ్యక్తి వెట్రిమారన్ సర్, నా తమ్ముడు శిలంబరసన్, ఇంకా రాక్ స్టార్ అనిరుద్ & చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు” అని అన్నారు. అంతే కాకుండా “శింబు లో ఇంకా ఉత్తమమైన నటన దాగి ఉందని, ఆ విషయం నాకు తెలుసని మరియు దాన్ని ఒక పెద్ద తెరపైన చూపించడానికి వెట్రిమారన్ సర్ కంటే మెరుగైన వాళ్ళు ఇంకెవరు లేరని” ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

వెట్రిమారన్ కూడా ఈ వీడియోలో శింబుతో ఎన్టీఆర్ పేరు వచ్చే డైలాగ్ చెప్పించాడు. నా కథను సినిమాగా తీస్తే దానికి హీరో ఎన్టీఆర్ అయితే సరిపోతాడు అనే అర్థం వచ్చేలాగా శింబు వీడియో స్టార్టింగ్ చెబుతారు. దీంతో వెట్రి, ఎన్టీఆర్ కలిసి సినిమా చేయబోతున్నారేమో అనే ఊహాగనాలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. విషెస్ చెప్పడం కూడా అందులో భాగమేనేమో అనుకుంటున్నారు.

అప్పటి నుంచే క్యూరియాసిటీ!

ఎన్టీఆర్ ఒకానొక సినిమా కార్యక్రమంలో తమిళనాడులో ఒక యాంకర్ “మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు, మీకు ఎవరితో సినిమా చేయాలని ఉంది” అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. “నాకు చాలా ఇష్టమైన దర్శకుడు వెట్రిమారన్” అని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఆయనతో నాకు సినిమా చేయాలనుందని, అది కూడా డైరెక్ట్ తమిళ్ సినిమా చేయాలని, డబ్బింగ్ సినిమా కాదు అని కూడా ఆయన అనడం జరిగింది. దీంతో అప్పటి నుంచి కూడా వెట్రి, తారక్ అభిమానుల్లో వీరి ఇద్దరి మధ్య సినిమా ఎప్పుడు వస్తుందా అనే క్యూరియాసిటీ పెరిగిపోయింది.

సినిమాల్లోనే కాదు.. రేసింగ్ కూడా: హీరోయిన్ ‘నివేదా’ స్పోర్ట్స్ కారు గురించి తెలుసా?

సాధారణంగా పురుషులకు మాత్రమే కాకుండా.. స్త్రీలకు కూడా వాహనాలంటే (కార్లు, బైకులు) చాలా ఇష్టం. ఈ కారణంగానే తమకు నచ్చిన ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తుంటారు. ఈ కోవకు చెందినవారిలో ఒకరు నివేదా పేతురాజ్. విజయ్ యాంటోనీ రోషగాడు సినిమాలో హీరోయిన్‌‌గా కనిపించిన ఈమె.. అల వైకుంఠపురంలో సినిమాలో కూడా నటించారు. ఈమె సినిమాలు ఎక్కువభాగం తమిళంలోనే ఉన్నాయి. ఇక విషయానికి వస్తే.. నివేదా ఖరీదైన మరియు ప్రత్యేకమైన అమెరికన్ మజిల్ కారులో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రేసర్ కూడా..

అమెరికన్ మజిల్ కారు అనేది.. డాడ్జ్ ఛాలెంజర్ స్పోర్ట్ కారు. ఈ కారును ప్రపంచ వ్యాప్తంగా చాలా తక్కువమంది మాత్రమే కలిగి ఉన్నారు. ఈ జాబితాలో ఒకరు ఇండియన్ హీరోయిన్ నివేదా పేతురాజ్. ఈమె కేవలం నటి మాత్రమే కాకుండా రేసర్ కూడా. ఈమె రేసింగ్ చేసిన వీడియోలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.

డాడ్జ్ ఛాలెంజ్ మజిల్ కారును నివేదా పేతురాజ్ 2014లో కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే.. దుబాయ్‌లో డాడ్జ్ ఛాలెంజర్ మజిల్ కారును కలిగి ఉన్న మహిళ నివేదా కావడం గమనార్హం. ఈ విషయాన్ని ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పేర్కొన్నారు.

ఫార్ములా 1 రేసింగ్ డ్రైవర్‌

నివేదా పేతురాజ్.. ఒక ప్రొఫెషనల్ రేసర్ అని ప్రారంభంలో చెప్పుకున్నాము. ఈమె ఫార్ములా రేస్ కార్ శిక్షణా కార్యక్రమంలో లెవల్-1 పూర్తి చేశారు. 2021లో ఫార్ములా 1 రేసింగ్ డ్రైవర్‌గా కూడా ఈమె అర్హత సాధించింది. అంతే కాకుండా ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎమ్‌ఎస్‌సీఐ) ద్వారా సర్టిఫైడ్ లెవల్ 2 ఫార్ములా రేసర్ కూడా. బహుశా ఈ విషయం చాలామందికి తెలిసి ఉండే అవకాశం లేదు.

ఇటీవలే ఈమె కారును డ్రైవ్ చేసిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కూడా పోస్ట్ చేశారు. ఇందులో ఈమె చాలామంది ప్రొఫెషనల్ రేసర్లతో కలిసి డ్రిప్టింగ్ చేస్తున్నట్లు కనిపించింది. ఈమె పూర్తిగా కస్టమ్ బిల్ట్ డ్రిఫ్ట్ రేస్ కారును ట్రాక్‌పై స్లైడింగ్ అండ్ డ్రిప్పింగ్ చేయడం కూడా కనిపిస్తుంది. నివేదా పేతురాజ్ డ్రైవ్ చేసిన కారు ‘డాడ్జ్ ఛాలెంజర్ ఎస్/టీ’ అని తెలుస్తోంది.

డాడ్జ్ ఛాలెంజర్ ఎస్/టీ

అమెరికన్ స్పోర్ట్స్ కారు అయిన డాడ్జ్ ఛాలెంజర్ ఎస్/టీ మజిల్ 3.6 లీటర్ వీ6 ఇంజిన్ పొందుతుంది. ఇది 305 బీహెచ్‌పీ పవర్, 364 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్ డెలివరీ వెనుక చక్రాలకు సరఫరా అవుతుంది. దీంతో కారు డ్రైవ్ చేయడం కొంత కఠినంగానే ఉన్నప్పటికీ.. రేసింగ్ చేసేవారికి సరదాగా ఉంటుంది.

నివేదా పేతురాజ్ గురించి..

తెలుగు వారికి సుపరిచయమైన నివేదా పేతురాజ్.. ఒక తమిళ నటి. ఈమె 2016లో ఒరు నాల్ కూతు అనే సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అయితే మెంటల్ మదిలో అనే తెలుగు సినిమాతో.. టాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1990 నవంబర్ 30న కోవిల్‌పట్టిలో జన్మించిన ఈమె.. తన పాఠశాల విద్యను తూత్తుకుడిలో పూర్తి చేసింది. చిన్నప్పుడే తల్లిదండ్రులతో కలిసి దుబాయ్ వెళ్లి.. అక్కడే 20ఏళ్ళు ఉండిపోయింది. ఆ తరువాత ఇండియాకు తిరిగి వచ్చి.. సినిమాల్లో నటించడం ప్రారంభించింది.

10వ తరగతి/ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు: 1426 పోస్టులకు నోటిఫికేషన్

చాలామంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్మీ సోల్జర్ రిక్రూట్‌మెంట్ వచ్చేసింది. ఈ సారి ఏకంగా 1426 సోల్జర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్. సరైన అర్హతలు కలిగి.. ఆర్మీ జాబ్ కోసం వేచి చూస్తున్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

పోస్టుల వివరాలు

మొత్తం 1426 పోస్టులలో.. 1372 సోల్జర్స్ (జనరల్ డ్యూటీ), 07 సోల్జర్ (క్లర్క్), 19 సోల్జర్ (చెఫ్ కమ్యూనిటీ), 03 సోల్జర్ (చెఫ్ స్పెషల్), 02 సోల్జర్ (మెస్ కుక్), 03 సోల్జర్ (ఈఆర్), 02 సోల్జర్ (స్టీవార్డ్), 02 సోల్జర్ (ఆర్డిసాన్ మెటలర్జీ), 02 సోల్జర్ (ఆర్టిసాన్ వుడ్ వర్క్), 05 సోల్జర్ (హెయిర్ డ్రెస్సర్), 01 సోల్జర్ (టైలర్), 03 సోల్జర్ (హౌస్ కీపర్), 04 సోల్జర్ (వాషర్‌మన్) వంటివి ఉన్నాయి.

క్వాలిఫికేషన్ డీటైల్స్

  • సోల్జర్ (జనరల్ డ్యూటీ): ఈ పోస్టుకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు 10వ తరగతి / మెట్రిక్యులేషన్ పాసై ఉండాలి.
  • సోల్జర్ (క్లర్క్): ఈ పోస్టులు అప్లై చేయాలనుకునేవారు 12వ తరగతి / ఇంటర్మీడియట్ పాసై ఉండాలి.
  • సోల్జర్ ట్రేడ్స్‌మెన్: 10వ తరగతి పాసై ఉండాలి.
  • సోల్జర్ ట్రేడ్స్‌మెన్ (హౌస్ కీపర్, మెస్ కుక్ పోస్టుకు కాకుండా): 8వ తరగతి పాసై ఉండాలి.

వయోపరిమితి & దరఖాస్తు విధానం

నోటిఫికేషన్ ప్రకారం ఈ ఆర్మీ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు వయసు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు ఉండాలి. కాగా వయసు సడలింపుకు సంబంధించిన నియమాలు వర్తించవు. ఈ ఉద్యోగానికి పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అప్లై చేయాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం

ఈ ఉద్యోగానికి అప్లై చేసిన అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు అనే విషయానికి వస్తే.. రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెరిట్ లిస్ట్ అనే నాలుగు విధాలుగా ఉంటుందని సమాచారం. ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కానీ వచ్చే నెల 15 (2025 నవంబర్ 11) నుంచి 2025 డిసెంబర్ 01 వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. అయితే రాత పరీక్ష ఎప్పుడు అనే విషయం.. అప్లై చేసుకున్న తరువాత తెలుస్తుంది. ఎంపికైన వారికి జీతాలు కూడా భారీగానే ఉంటుందని తెలుస్తోంది.

ఉద్యోగానికి ఎలా సిద్ధమవ్వాలి

నిజానికి ఆర్మీ జాబ్ అంటేనే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. అలా అని ఫిజికల్ ఫిట్నెస్ ఒక్కటి మాత్రమే ఉంటే సరిపోదు. కాబట్టి రాత పరీక్షకు కూడా అభ్యర్థులు సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగాల కోసం పోటీపడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. ఈ పోటీని ఎదుర్కోవడానికి నేర్పుతో సిద్ధమవ్వాలి. పరీక్షలు ఏ సిలబస్ చదవాలి?, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు ఉంటాయి? అనే విషయాలను తెలుసుకోవడం మాత్రమే కాకుండా.. జనరల్ అవేర్నెస్ వంటి వాటిపై మంచి పట్టు సాదించాలి. మొత్తం మీద మీ ప్రయత్నం గట్టిగా ఉంటే.. తప్పకుండా ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పకుండా గుర్తుంచుకోవాలి. దీనికి తగిన విధంగా సన్నద్ధమవ్వాలి. ఫిజికల్ ఫిట్నెస్ కోసం కూడా వ్యాయామం అవసరం అనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు.

స్టైలిష్ బైక్ లాంచ్ చేసిన కవాసకి: రేటెంతో తెలుసా?

ప్రముఖ బైక్ తయారీ సంస్థ కవాసకి.. ఇండియన్ మార్కెట్లో 2026 జెడ్900 బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ఇప్పుడున్న బ్రాండ్ యొక్క ఇతర బైకుల కంటే హుందాగా.. చూడగానే రైడ్ చేయాలనిపించేలా ఉంది. ఇంతకీ ఈ మోటార్ సైకిల్ రేటు ఎంత? ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రారంభ ధర & కలర్ ఆప్షన్స్

కవాసకి లాంచ్ చేసిన కొత్త జెడ్900 బైక్ ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఇప్పుడు రెండు డ్యూయెల్ టోన్ కలర్ ఎంపికలలో అందుబాటులో ఉంది. అవి ఒకటి కాండీ లైమ్ గ్రీన్ / మెటాలిక్ కార్బన్ గ్రే.. మరొకటి మెటాలిక్ మాట్టే గ్రాఫెనెస్టీల్ / మెటాలిక్ ప్లాట్ స్పార్క్ బ్లాక్.

ఆకట్టుకునే డిజైన్ & ఫీచర్స్

జపనీస్ బ్రాండ్ అయిన కవాసకి.. లాంచ్ చేసిన 2026 జెడ్900 బైక్, చూడటానికి చాలా వరకు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉన్నప్పటికీ.. టెక్నికల్ అప్డేట్స్ గమనించవచ్చు. కాంపాక్ట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, సుగోమీ డిజైన్ ఫిలాసఫీ బాడీ చూడవచ్చు.

ఫీచర్స్ విషయానికి వస్తే.. కొత్త కవాసకి జెడ్900 బైక్ కార్నరింగ్ మేనేజ్‌మెంట్ ఫంక్షన్, ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్, పవర్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ థ్రాటిల్ వాల్వ్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్, క్విక్ షిఫ్టర్, ఎకనామికల్ రైడింగ్ ఇండికేటర్, డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ వంటివన్నీ ఉన్నాయి. అంతే కాకుండా.. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 5 ఇంచెస్ టీఎఫ్‌టీ కలర్ డిస్‌ప్లే ఇందులో చూడవచ్చు. రైడాలజీ యాప్ ద్వారా.. రైడర్లు కాల్స్, మెసేజస్, ఈమెయిల్స్, వెహికల్ డేటా, రైడింగ్ లాగ్‌లకు కావాల్సిన యాక్సెస్ పొందవచ్చు. టర్న్ బై టర్న్ న్యావిగేషన్ కూడా సాధ్యమవుతుంది.

ఇంజిన్ వివరాలు

కొత్త కవాసకి జెడ్900 బైకులో కాస్మొటిక్ అప్డేట్స్.. టెక్నికల్ ఫీచర్స్ గమనించవచ్చు. కానీ.. యాంత్రికంగా ఎలాంటి అప్డేట్స్ పొందలేదు. ఇందులో అదే 948 సీసీ ఇన్‌లైన్ 4 సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 125 హార్స్ పవర్, 98.6 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా 1 హార్స్ పవర్, 1.2 న్యూటన్ మీటర్ టార్క్ ఎక్కువ కావడం గమనార్హం. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.

2026 కవాసకి జెడ్900 లాంచ్‌పై మా అభిప్రాయం

నిజానికి ఇండియన్ మార్కెట్లో కవాసకి బైకులకు మంచి డిమాండ్ ఉంది. కాబట్టి కంపెనీ లాంచ్ చేసిన ఈ జెడ్900 బైకుకు కూడా మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నాము. అయితే ధర కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ.. ధరకు తగిన ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. మొత్తం మీద ఇది పండుగ సమయంలో మార్కెట్లో లాంచ్ కావడం వల్ల.. మంది అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. కాగా ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో.. సుమారు 34 మోడల్ కవాసకి బైకులు ఉన్నట్లు సమాచారం. భారతదేశంలో అత్యంత ఖరీదైన బైకు (నింజా హెచ్2ఆర్: రూ. 79.90 లక్షలు) కూడా ఈ కంపెనీకి చెందినదే కావడం గమనించదగ్గ విషయం.

వెట్రిమారన్ ‘సామ్రాజ్యం’.. శింబు అదిరిపోయే ప్రోమో భయ్యా!

0

వెట్రిమారన్ ఎట్టకేలకు తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చేశాడు. శిలంబరసన్ (శింబు)తో చేస్తున్న తమిళంలో అరసన్ సినిమా ప్రోమో వీడియోని తెలుగులో సామ్రాజ్యం పేరుతో వడా చెన్నై గురించి చెప్పని కథ అని సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీంతో తమిళ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెట్రి & శింబు అభిమానులు దీపావళి పండుగకు ఇచ్చిన బహుమతిగా భావిస్తూ మొత్తం సంతోషంలో మునిగి తేలుతున్నారు. దీనికి సంబంధించిన మరికొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

వీ క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విభిన్న సినిమాల దర్శకుడైన వెట్రిమారన్.. స్టోరీ, డైరెక్షన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇందులో హీరోగా శిలంబరసన్ టి. ఆర్ (శింబు) అద్భుతమైన మాస్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. కిషోర్ కుమార్. జి, సముద్రఖని, ఆండ్రియా తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. 2025లోనే ఈ మూవీని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియా కొన్ని వార్తలు వస్తున్నప్పటికీ.. ఇది 2026లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

కథ ఏంటంటే?

తమిళనాడులోని.. నార్త్ చెన్నైలో కొన్ని గ్రూపుల మధ్య జరిగే గ్యాంగ్ వార్లు, పవర్ కోసం వాళ్ళు చేసే రాజకీయాలు మరియు ప్రాంతంపై అధిపత్యం చేలాయించడానికి వారు చేసే హత్యలు, అన్నీ సామాజిక, రాజకీయ, ఆర్థిక, మాస్ యాక్షన్ డ్రామా ఉండనున్నట్టు బయట వినబడుతున్నది. వెట్రి మారన్ ఇంతకు ముందు వడా చెన్నై పేరుతో హీరో ధనుష్తో ఒక సినిమా చేశారు. ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక ప్రభంజనం సృట్టించిందనే చెప్పాలి. ఆ మూవీకి ధనుష్ స్టైల్‌లో యాక్టింగ్, వెట్రి మారన్ దర్శకత్వం, మ్యూజిక్ అన్నీ కూడా బాగా కుదిరాయి.

ఇప్పుడు అదే నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న కారణంగా.. ఊహాగానాలు పెరిగిపోయాయి అని తెలుస్తోంది. కానీ ఇది వడా చెన్నైకి సీక్వెల్ కాదని ఇప్పటికే వెట్రి మారన్ ప్రకటించారు. శింబుతో తీస్తున్నది వేరే కథ అని.. ధనుష్‌తో పార్ట్-2 కథ వేరే ఉందని చెప్పారు. అదేంటో తెలియాలి అంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఇది వెట్రి మార్క్ మూవీ అనే చెప్పాలి.

టీజర్ గురించి..

శింబు రక్తంతో తడిసిన బట్టలతో, చేతిలో కత్తిపట్టుకుని వచ్చే సీన్ హైలెట్‌గా ఉంది. దానికి అనిరుద్ మ్యూజిక్ మరింత హైప్ క్రియేట్ చేసింది. వీడియో మొదటిలోనే ‘ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా తీస్తున్న కథ అని దీంతో కొంత మంది జైలుకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది’ అని చెప్పి కానీ దానికి డిస్‌క్లైమర్ వేసుకోమని ముందే హీరోతో చెప్పించాడు డైరెక్టర్. కానీ అది నిజజీవిత ఆధారమే అయినా డైరెక్టర్‌కు అది చెప్పడం ఇష్టం లేదు అని అర్థం అవుతున్నది. దీనికి అతని కారణాలు అతనికి ఉండొచ్చు కానీ ఇది ఎవరి గురించి అనేది ఆసక్తిగా మారింది. కోర్ట్ సీన్లు కూడా బాగున్నాయి.

థామా కోసం ‘రష్మిక మందన్న’ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

0

ఛలో సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన రష్మిక మందన్న.. అగ్రస్థాయి కథానాయకిల జాబితాలోకి అడుగుపెట్టడమే కాకుండా.. అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో కూడా ఒకరుగా నిలిచారు. అయితే ఇప్పుడు ఈమె నటించిన తాజా సినిమా థామా సినిమాలో నటించారు. ఈ సినిమా దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ కథనంలో ఈ సినిమా కోసం వెచ్చించిన బడ్జెట్ ఎంత? అనే విషయాలను తెలుసుకుందాం.

థామా సినిమా బడ్జెట్

ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న జంటగా నటించిన హారర్ కామెడీ చిత్ర థామా.. అక్టోబర్ 21న రిలీజ్ అవుతుంది. అయితే ఇప్పటివరకు రిలీజ్ అయిన హారర్ సినిమాల్లో థామా బడ్జెట్ కొంత ఎక్కువనే తెలుస్తుంది. దీనికోసం నిర్మాతలు రూ. 125 కోట్లు ఖర్చు చేసినట్లు.. ప్రమోషన్స్ వంటివాటికోసం మరో రూ. 20 కోట్లు ఖర్చు పెట్టినట్లు (మొత్తం రూ. 145 కోట్లు) బాలీవుడ్ హంగామా వెల్లడించింది. అయితే ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించలేదు. ఈ సినిమా ‘వీఎఫ్ఎక్స్’తో కూడుకున్నది కావడంతో బడ్జెట్ ఎక్కువగానే అయి ఉంటుందని నిపుణులు కూడా చెబుతున్నారు.

స్త్రీ 2 కంటే ఎక్కువే!

థామా బడ్జెట్.. రాజ్ కుమార్ రావు, శ్రద్దా కపూర్, ఆయుష్మాన్ ఖురానా, పంకజ్ త్రిపాఠీ, అభిషేక్ బెనర్జీ నటించిన ‘స్త్రీ 2’ బడ్జెట్ కంటే కూడా ఎక్కువని తెలుస్తోంది. ఈ సినిమా (స్త్రీ 2) కోసం నిర్మాతలు రూ. 125 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. అయితే థామా సినిమా.. మంచి కలెక్షన్స్ రాబడుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వివరాలు కచ్చితంగా తెలియాలంటే.. సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

రష్మిక మందన్న థామా గురించి

నటి రష్మిక మందన్న హారర్ సినిమాలో నటించడం బహుశా ఇదే మొదటిసారి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఒకవైపు హారర్ సీన్లు.. మరోవైపు కామెడీ సీన్లు బాగున్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. దీన్నిబట్టి చూస్తుంటే.. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని తెలుస్తోంది.

థామా సినిమాలో కేవలం రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా మాత్రమే కాకుండా.. పరేష్ రావల్, సత్యరాజ్, ఫైజల్ మాలిక్, వరుణ్ ధావన్, నోరా ఫతేహి, మలైకా అరోరా, అమర్ కౌశిక్ కూడా నటిస్తున్నారు. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు.. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ చాలా వరకు ఢిల్లీ, ముంబై, ఊటీలలో జరిగినట్లు తెలుస్తోంది.షూటింగ్ 2024 మధ్యలో ప్రారంభమై.. 2025 మధ్య వరకు జరిగింది. ఆ తరువాత సినిమాను ప్రమోషన్ చేయడంలో చిత్ర బృందం బిజీ అయిపోయింది.

రెమ్యునరేషన్ వివరాలు

సుమారు రూ. 140 కోట్లు ఖర్చు పెట్టి తెరకెక్కిస్తున్న థామా సినిమాలో నటించిన నటీనటులకు కూడా చిత్ర బృందం భారీ పారితోషకాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయుష్మాన్ ఖురానాకు రూ. 8 కోట్ల నుంచి రూ. 10 కోట్లు, రష్మిక మందన్నకు రూ. 5 కోట్ల నుంచి రూ. 7 కోట్లు, నవాజుద్దీన్ సిద్దిఖీకు రూ. 3 కోట్ల నుంచి రూ. 4 కోట్లు, పరేష్ రావల్ రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్లు తీసుకున్నట్లు, మలైకా అరోరా ఒక పాటకు డ్యాన్స్ వేసినందుకుగానూ రూ. 2 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. రెమ్యునరేషన్ అనేది కేవలం ఒక అంచనా మాత్రమే. ఈ విషయాలను చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించలేదు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు: ఓటర్ లిస్టులో సమంత, తమన్నా, రకుల్ ఫోటోలు

తెలంగాణలోని (హైదరాబాద్) జూబిలీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల వేడి రోజురోజుకి పెరుగుతోంది. ఇలాంటి సమయంలో సెలబ్రిటీల పేరుతో ఫేక్ ఓటర్ ఐడీలు వెలుగులోకి రావడం సంచలనం రేపుతోంది. అందులోనూ ప్రముఖ నటీమణులు సమంత రూత్ ప్రభు, తమన్నా భాటియా, రకుల్ ప్రీత్ సింగ్ ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఓటర్ లిస్టులో నకిలీ ఐడీలు

ఓటర్ లిస్టులో సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోలు.. వివరాలు వంటివి రావడంతో, ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. నకిలీ ఫోటోలను ఉపయోగించి వీటిని రూపొందించినట్లు.. ఎన్నికల అధికారులు నిర్దారించడంతో మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సయ్యద్ యాహియా కమల్ ప్రకారం.. నటీమణుల చిరునామా హైదరాబాద్‌లోని ఒకే ప్రాంతానికి చెందినట్లు ఐడీలను క్రియేట్ చేసారని తెలుస్తోంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోల ప్రకారం.. ముగ్గురి హీరోయిన్స్ హౌస్ నెంబర్ ఒకేవిధంగా ఉంది.

వివిధ సెక్షన్స్ కింద కేసు నమోదు

ప్రజలను తప్పుదారి పట్టించడానికి.. అధికారిక ఎన్నికల సమాచారాన్ని దుర్వినియోగం చేయడానికి, ఉద్దేశ్యపూర్వకంగానే ఇలాంటి నకిలీ ఐడీలు సృష్టిస్తున్నారని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. దీంతో పోలీసులు ఈ సంఘటనపై.. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 336(4) (ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించే ఉద్దేశ్యం), 353 (1) (C) (దుష్ప్రవర్తన) కింద కేసు నమోదు చేశారు. దీనికి కారణమైనవారిని గుర్తించి పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు.

జీహెచ్ఎంసీ హెచ్చరిక

ఇదిలా ఉండగా.. అధికారిక ధృవీకరణ లేని సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) హెచ్చరించింది. కొందరు తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేసి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అంతే కాకుండా చెల్లని నెంబర్లను ఉపయోగించి.. ప్రభుత్వాన్ని కించపరిచే ఉద్దేశ్యంతో ఇలాంటి నకిలీ ఐడీలు సృష్టిస్తున్నారని పేర్కొంది. అయితే దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు

2025 నవంబర్ 11న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. అంతకంటే ముందే ఈ సంఘటన జరగడం ఒకింత అధికారులను కూడా ఆందోళనకు గురిచేసింది. ఎన్నికలు నిజాయితీగా జరగాలని చూస్తున్న తరుణంలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జాగకుండా చూస్తామని సంబంధిత అధికారులు హామీ ఇచ్చారు. అంతే కాకుండా ఎన్నికల సంఘం ధృవీకరించిన సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని కోరారు. కాగా ఎన్నికల ఓట్ల లెక్కింపు 2025 నవంబర్ 14న జరుగుతుంది.

సమస్యకు పరిష్కారం కనుగొనాలి

నిజానికి నకిలీ ఓటర్ ఐడీలు వెలుగులోకి రావడం అనే సమస్య.. ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా భారతదేశం మొత్తం ఉంది. ఇప్పటికే బీహార్‌లో కూడా ఈ వివాదం తలెత్తింది. కాబట్టి ఎన్నికల కమిషన్ జారీచేసిన వాటిని మాత్రమే.. అధికారిక ఐడీలుగా గుర్తించాలి. అంతేకాకుండా ఇలాంటి ఫేక్ ఐడీలు వెలుగులోకి రాకుండా చూడటానికి ఎన్నికల కమిషన్ కూడా టెక్నాలజీని ఉపయోగించి సమస్యలను పరిష్కించి దిశగా ఆలోచించడం మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.