Home Blog Page 122

సైకిల్‌పై అసెంబ్లీకి వెళ్లిన ఎమ్మెల్యేగా శివరాజ్ కుమార్: ఎవరీ గుమ్మడి నర్సయ్య?

0

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ప్రధాన కథనాయకుడుగా నటిస్తున్న.. గుమ్మడి నర్సయ్య అనే సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. ఈ మూవీ ప్రవల్లిక ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. పరమేశ్వర్ హిర్వాలే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఎడిటింగ్ పనులు సత్య గిడుటూరి చూస్తున్నారు.

ఎవరీ గుమ్మడి నర్సయ్య?

గుమ్మడి నర్సయ్య.. తెలంగాణలోని ఖమ్మం జిల్లా, ఇల్లందు నియోజకవర్గ వాసి. ఇల్లందు నియోజకవర్గం నుంచి ఏకంగా ఐదు సార్లు శాసనసభకు ఎన్నికైన రాజకీయ నేత. కమ్యూనిస్ట్ (సీపీఐ ఎంల్)పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన నేటి వరకు అదే జెండా, అదే సిద్దాంతం, అదే ఆలోచన విధానం, అదే జీవన శైలితో జీవిస్తున్న నిబద్ధుడు. ఇప్పటికి తనకంటూ ఒక సొంత ఇల్లు, భూమి సంపాదించుకోకుండా, ఎక్కడికైనా వెళ్ళిరావాలంటే ఎంత దూరమైనా సరే కేవలం సైకిల్ తొక్కుకుంటూనే వెళ్ళివస్తారు.

తన ఇల్లును కూడా పార్టీ ఆఫీసుగా మార్చి, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిన జీతాన్ని, ఇప్పుడు తనకి వస్తున్న పెన్షన్‌ను సైతం పార్టీకి ఇచ్చేసే నిస్వార్థపరుడు గుమ్మడి నర్సయ్య. ఏ మాత్రం అవినీతి, అక్రమ మచ్చలేని మహామనిషి. ఎప్పుడు ప్రజా సమస్యల కోసం పోరాడి, వాటిని పరిష్కరించి, జనమందరితో మమేకమై.. వారి మధ్యనే అతి సాధాసీదాగా జీవించే నిజమైన ప్రజల నాయకుడు, నిరాడంబరుడు. జీతాన్ని, జీవితాన్ని రెండింటిని కూడా పార్టీకి, ప్రజలకి అంకితం చేసిన త్యాగధనుడు, ప్రజానాయకుడు గుమ్మడి నర్సయ్య .ప్రస్తుతం ఈయన జీవితాన్నే ఇప్పుడు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు.

టీజర్ విషయానికి వస్తే..

వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు.. చాలా గమ్మత్తుగా, ఆలోచనత్మాకంగా ఉన్నాయి. ముందుగా శాసనసభను కనిపించి తరువాత డాక్టర్ బీ ఆర్. అంబేద్కర్ విగ్రహం మీదుగా వెళ్లి.. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా పుస్తకాలను చూపిస్తారు. ఆ తరువాత గాంధీ విగ్రహం చూపించి శివరాజ్ కుమార్ అద్దాలు పెట్టుకోవడాన్ని మనం చూడచ్చు. ఇంకా ఒక పాత సైకిల్, అరిగిన తోలు చెప్పులు, కళ్ళజోడు, భుజానికి ఒక తెల్ల సంచి తగిలించుకుని ఉన్నవన్నీ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. అందరూ ఎమ్మెల్యేలు, సీఎం (సంకేతంగా ఎన్టీ రామారావు చూపించినట్టున్నారు) ఇలా అంతా అంబాసిడర్ కార్లల్లో అసెంబ్లీకి బయలుదేరుతుంటే.. శివరాజ్ కుమార్ మాత్రం సైకిల్ మీద వెళ్లడాన్ని వీడియోలో చూపించారు.

ప్రజల నాయకుడి సినిమా.. కన్నడ హీరో

గుమ్మడి నర్సయ్య నీతి, నిజాయితీ, నిబద్దత, ఆయన ఆలోచన, సిద్ధాంతం, అయన పాటించిన విలువలకు నిదర్శనంగా వీడియో ఉండటం చూడవచ్చు. వీడియోకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. శివరాజ్ కుమార్ గుమ్మడి నర్సయ్య పాత్రకి సరిగ్గా సరిపోయాడు. తెలుగువాడు అయిన ప్రజల నాయకుణ్ణి కన్నడ హీరో గుర్తించి సినిమా చేయడం అనేది నిజంగా అభినందించవలసిన అంశం. షూటింగ్ ఇప్పుడే ప్రారంభించినట్టుగా వీడియోలో చూపించారు. ట్రైలర్, సినిమా విడుదల తేదీ విషయాలను ఇంకా వెల్లడించలేదు.

2025 హ్యుందాయ్ వెన్యూ కోసం మొదలైన బుకింగ్స్: లాంచ్ ఎప్పుడంటే?

భారతదేశంలో అత్యధిక అమ్మకాలు పొందిన కార్ల జాబితాలో హ్యుందాయ్ కంపెనీకి చెందిన వెన్యూ ఒకటి. అయితే ఈ కారు ఇప్పుడు ఆధునిక హంగులతో 2025 వెన్యూ పేరుతో.. దేశీయ విఫణిలో లాంచ్ కావడానికి సిద్ధమైంది. అంతే కాకుండా హ్యుందాయ్.. ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఈ అప్డేటెడ్ మోడల్ లాంచ్, డెలివరీ మొదలైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

లాంచ్ & బుకింగ్ ప్రైస్

2025 హ్యుందాయ్ వెన్యూ.. 2025 నవంబర్ 04న ఇండియన్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ కానుంది. కాగా కంపెనీ ఈ కారు కోసం రూ. 25000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఆసక్తికలిగిన కాస్తర్మర్లు కంపెనీ డీలర్‌షిప్‌లలో లేదా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు.. లాంచ్ తరువాత ప్రారంభమవుతాయి. ఈ కారు ఇప్పుడున్న మోడల్ కంటే కొంత ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది.

వేరియంట్స్ & కలర్ ఆప్షన్స్

2025 హ్యుందాయ్ వెన్యూ మొత్తం ఎనిమిది వేరియంట్లలో.. ఎనిమిది రంగుల్లో లభిస్తుంది. అవి హెచ్ఎక్స్ 2, హెచ్ఎక్స్ 4, హెచ్ఎక్స్ 5, హెచ్ఎక్స్ 6, హెచ్ఎక్స్ 6టీ, హెచ్ఎక్స్ 7, హెచ్ఎక్స్ 8, హెచ్ఎక్స్ 10. అయితే కంపెనీ ఏ వేరియంట్ ధర ఎంత అనే విషయాన్ని ఇప్పటికి అధికారికంగా వెల్లడించలేదు. ఈ వివరాలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.

ఇక కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే.. కొత్త హ్యుందాయ్ వెన్యూ ఆరు మోనోటోన్ (సింగిల్ కలర్), రెండు డ్యూయెల్ కలర్ ఎంపికలలో లభిస్తుంది. అయితే ఇందులో హాజెల్ బ్లూ, మిస్టిక్ సఫైర్ అనేవి కొత్త కలర్స్. మొత్తం మీద ఇది మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించడం వల్ల.. కొనుగోలుదారు తమకు నచ్చిన కలర్ కారును కొనుగోలు చేసుకోవచ్చు.

డిజైన్ & ఫీచర్స్

టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, కియా సోనెట్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉందనున్న కొత్త హ్యుందాయ్ వెన్యూ అప్డేటెడ్ ఫ్రంట్ ఎండ్ పొందుతుంది. బోనెట్ మీద ఎల్ఈడీ స్ట్రిప్, హెడ్‌ల్యాంప్ యూనిట్ పక్కన డీఆర్ఎల్ ఉండటం చూడవచ్చు. గ్రిల్ కూడా కొత్తగా ఉంటుంది. ఫ్రంట్ బంపర్ కింద స్కిడ్ ప్లేట్స్, కొత్త ఫంక్షనల్ రూఫ్ రైల్ కూడా ఉన్నాయి. వెనుక భాగంలో బ్లాక్ ప్యానెల్‌లను కలిగి ఉన్న ఎల్ఈడీ టెయిల్‌లైట్‌లతో అప్డేట్ అయి ఉండటం గమనించవచ్చు. కొత్త అల్లాయ్ వీల్స్ ఇందులో కనిపిస్తుంది.

లోపలి భాగం కూడా చాలా అప్డేట్ అయి ఉంది. డ్యూయెల్ టోన్ లెదర్ సీట్లు, కొత్త స్టీరింగ్ వీల్, 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవన్నీ ఉన్నాయి. అంతే కాకుండా.. రియర్ విండో సన్‌షేడ్, సరౌండ్ యాంబియంట్ లైటింగ్, ప్రీమియం లెదర్ ఆర్మ్‌రెస్ట్, రియర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి.

ఇంజిన్ వివరాలు

2025 హ్యుందాయ్ వెన్యూ మొత్తం మూడు ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉండనుంది. అవి 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్. ఇవన్నీ మాన్యువల్, ఆటోమాటిక్, డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంటాయి. కాబట్టి పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుందని సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌కు తుఫాన్ సూచన: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు గట్టిగా కురుస్తున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ హెచ్చరికను జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం పశ్చిమ – వాయువ్య దిశగా కొనసాగుతున్న ఈ అల్పపీడనం.. ఆదివారం నాటికి వాయుగుండంగా మారి.. సోమవారం నాటికి తీరందాటే సమయంలో తీవ్ర తుఫానుగా మారుతుందని వెల్లడించింది.

ఈ జిల్లాల్లో భారీ వర్షం!

ఈ రోజు (శనివారం) కూడా వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని, వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా.. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కోనసీమ, కృష్ణ, బాపట్ల జిల్లాల్లో వర్షాలు తీవ్రంగా ఉంటాయని వెల్లడించింది. అయితే మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏపీఎస్‌డీఎంఏ) ప్రకారం.. రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, భారీ వర్షాలు కురుస్తాయి. అంతే కాకుండా తీరప్రాంతాల్లో గంటకు 50 కిమీ నుంచి 70 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది. వర్షం తీవ్రత బలంగా ఉండటం వల్ల.. మత్స్యకారులు సముద్రం మీదకు వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను.. సురక్షితమైన ప్రాంతాలకు తరలించడానికి ప్రభుత్వం కూడా అత్యవసర ప్రోటోకాల్ అమలు చేసింది. అంతే కాకుండా.. వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద లేదా విద్యుత్ మౌలిక సదుపాయాల దగ్గర ఉండకూడదు. ఇవి అనుకోని ప్రమాదాలను తెచ్చిపెడతాయని సూచించింది.

తుఫాను పేరు ఏంటంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాను సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని ప్రారంభంలోనే తెలుసుకున్నాం. ఈ తుఫానుకు మోంథా అని నామకరణం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పేరు థాయ్‌లాండ్‌ను సూచిస్తుంది.

ఈ తుఫాను ప్రభావం.. రాష్ట్రవ్యాప్తంగా ఐదురోజుల పాటు ప్రభావాన్ని చూపిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శని, ఆదివారాలు బాపట్ల, కడప, కాకినాడ మొదలైన ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. సోమ, మంగళవారాలు రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉంది. నిన్న (శుక్రవారం) ఏలూరు, అనకాపల్లి, కృష్ణ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా పాకాల ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం (152.25 మిమీ) నమోదైంది.

అధిక వర్షాల వల్ల లాభ, నష్టాలు

గత ఏడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. వర్షాలు అధికంగా కురవడం వల్ల.. ఎక్కువ లాభాలు ఉన్నప్పటికీ, నష్టాలు కూడా సంభవిస్తాయనేది నిజం. వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. పంటలు బాగా పెరుగుతాయి, వాతావరణం కూడా సుబ్రమవుతుంది. అదే సమయంలో పంట చేతికి వచ్చే సమయంలో.. వర్షాలు కురిస్తే, రైతు నష్టపోవాల్సి వస్తుంది. మౌలిక వసతులు కోల్పోవడం, రవాణా సమస్యలు, వ్యాధుల వ్యాప్తి పెరగడం, వరదలు సంభవించడం వంటివి జరుగుతాయి. ఏది ఏమైనా ప్రకృతి విపత్తులను ఎవరూ ఆపడం సాధ్యం కాదు. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయడం ఎలా?: దీని ప్రయోజనాలివే..

భారతదేశంలో ప్రజా రహదారులపై వాహనాలు నడపాలంటే.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. అయితే డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అందరూ కూడా.. తమ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ యాక్టివేట్‌లో ఉందని నిర్దారించుకోవాలని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. దీనికి వెనుక ఉన్న కారణాలు ఏమిటి? మొబైల్ నెంబర్ యాక్టివేట్‌లో లేకుంటే.. ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

మొబైల్ నెంబర్ యాక్టివేట్‌

మీ డ్రైవింగ్ లైసెన్స్‌కు లింక్ చేసిన.. మొబైల్ నెంబర్ యాక్టివేట్‌లో ఉంటే, మీరు చలాన్లు, ఫెనాల్టీ నోటీసులు, రెన్యూవల్ రిమైండర్స్ వంటి వాటితో పాటు.. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన మెసేజస్ పొందుతారు. లింక్ కాని ఎడల.. నోటిఫికెషన్స్ కోల్పోవాల్సి వస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

యాక్టివేట్‌లో లేకుంటే..

రవాణా శాఖ నుంచి వచ్చే సమాచారం మొత్తం.. డ్రైవింగ్ లైసెన్స్‌కు లింక్ చేసిన మొబైల్ నెంబరుకు మాత్రమే వస్తుంది. అయితే మొబైల్ నెంబర్ యాక్టివేట్‌లో లేకుంటే.. నోటిఫికెషన్స్ రావు. ఇలా జరిగితే కొన్ని సమస్యలు తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు సరైన సమయంలో సందేశాలను చూడకపోతే.. డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది.

మీ మొబైల్ నెంబర్.. యాక్టివేట్‌లో లేకపోతే ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే యాక్టివేట్ చేసుకోవచ్చు. దీనికోసం రవాణా శాఖ పరివాహన్ పోర్టల్ లేదా సంబంధిత అధికారిక వెబ్‌సైట్లను అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ.. మీరు మొబైల్ నెంబరును అప్డేట్ చేసుకోవచ్చు. ఇలా అప్డేట్ చేసుకోవడం ద్వారా.. మళ్లీ మొబైల్ నెంబరును యాక్టివేట్ చేసుకోవచ్చు.

ఎలా అప్డేట్ చేసుకోవాలంటే?

  • పరివాహన్ లేదా రాష్ట్ర రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
  • ఆన్‌లైన్ సర్వీసెస్ అనే విభాగంలోని డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి.
  • ఈ పేజీ ఓపెన్ అయిన తరువాత స్టేట్ సెలక్ట్ చేసుకున్న తరువాత.. మీకు మొబైల్ నెంబర్ అప్డేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • ఇది సెలక్ట్ చేసుకున్న తరువాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి.. ఓటీపీతో ద్రువీకరించి.. అప్డేట్ చేసుకోవచ్చు.

ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు

ఇప్పటికి కూడా డ్రైవింగ్ లైసెన్స్‌కు లింక్ చేసిన.. యాక్టివేట్‌లో లేని మొబైల్ నెంబర్స్ చాలానే ఉన్నాయని రవాణా శాఖ వెల్లడించింది. డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లు.. దీనిని గుర్తించి, సకాలంలో యాక్టివేట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడే.. రవాణా శాఖ అందించే అధికారిక హెచ్చరికలు మీకు అందుతాయి. దీంతో జరిమానాలు, రెన్యువల్ వివరాలు, లైసెన్స్ సస్పెన్షన్ వంటివి నివారించుకోవడంలో సహాయపడుతుంది.

డ్రైవింగ్ లైసెన్స్ ఆవశ్యకత

నిజానికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది.. అర్హత కలిగిన వారికి, ప్రజా రహదారులపై వాహనం నడపడానికి ఇచ్చే ఒక ధ్రువీకరణ. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి.. సురక్షితమైన డ్రైవింగ్ చేయడానికి ఇది మీ అర్హతను నిర్థారిస్తుంది. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్నవారికి మాత్రమే.. భారత ప్రభుత్వం మన దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తుంది. అయితే 16 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న వారికి లర్నింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. అయితే ప్రజా రహదారులపై డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరం.

బైసన్ రివ్యూ: కిట్టయ్య ఎదుగుదలకు అడ్డొచ్చిన కులం.. మరి అధిగమించాడా..!?

0

తమిళ ఇండస్ట్రీలో ఈనెల అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలై.. బాక్సాఫీస్ బద్దలు కొట్టి, ఇప్పటికీ ఏమాత్రం కలెక్షన్స్ తగ్గకుండా అదే ఊపుతో విజయవంతంగా దూసుకుపోతున్న బైసన్ సినిమా ఇవ్వాళ (అక్టోబర్ 24న) రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో రిలీజ్ అయింది. అందులోని నటినటులు మరియు సినిమాకు సంబంధించిన విశేషాలు ఎలా ఉన్నాయంటే..

నటినటులు: ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్, పశుపతి, రజిష విజయన్, లాల్, అమీర్ సుల్తాన్ తదితరులు
దర్శకుడు: మారి సెల్వరాజ్
రచయిత: మారి సెల్వరాజ్
నిర్మాతలు: పా. రంజిత్, అధితి ఆనంద్, దీపక్ సెగల్, సమీర్ నాయిర్
సంగీతం: నివాస్ కే. ప్రసన్న
సినిమాటోగ్రాఫర్ : ఎయిల్ అరసు కే
ఎడిటర్: శక్తి తిరు
ఆర్ట్ డైరెక్టర్: కుమార్ గంగప్పన్
లిరిక్స్: మారి సెల్వరాజ్

కథ ఏంటంటే?

ఒక సాధారణ గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక స్కూల్ స్టూడెంట్ కిట్టయ్య (ధృవ్) అతనికి కబడ్డీ ఆట ఆడటం అంటే అమితమైన ప్రేమ, ఇష్టం. కానీ అక్కడ కోచ్ (అనురాగ్ అరోరా) అతన్ని కేవలం బెంచికి మాత్రమే పరిమితం చేస్తాడు. ఎన్నో ఒడిదుడుకులను, అడ్డంకులను దాటి ఇండియా తరపున జపాన్‌లో.. పాకిస్తాన్‌తో ఆడటానికి ఎంపిక అవుతాడు. అంతకు ముందు సెలక్షన్ కమిటీ రిజెక్ట్ చేసి కిట్టయ్యని ఇంటికి పంపుతుంది. తన తండ్రి(పశుపతి)కి కూడా.. తన కొడుకు కబడ్డీ ఆడటం ఏ మాత్రం ఇష్టం ఉండదు. కబడ్డీ ఆడకూడదు అని ఒట్టుకూడా వేయించుకుంటాడు. వాళ్ళ ఊరిలోనే ఉన్న ఒక అమ్మాయి (అనుపమ పరమేశ్వరన్) హీరోని ఇష్టపడుతుంది. తను కూడా ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ వాళ్ళ నాన్నకు అస్సలు ఇష్టం ఉండదు. ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్ళికి ఏర్పాట్లు చేస్తారు. హీరో అక్క (రజిష విజయన్) తమ్ముడికి ఎంతో సపోర్ట్‌గా ఉంటుంది. తనకి ఒక లవ్ స్టోరీ ఉంటుంది.

వీటన్నిటి మధ్యలో వీళ్ళ ఊరి వాళ్ళకి చెందిన పాండిరాజ్(అమీర్ సుల్తాన్)కి & వేరే ఊరికి చెందిన కందస్వామి(లాల్)కి ఎప్పుడు ఆధిపథ్య పోరు, దీనికోసం వారి మధ్య జరిగే గొడవలు కొట్లాటలు. ఎప్పుడు చూసినా కులం పేరుతో.. ఎక్కడ చూసిన హీరోకు అవమానం ఎదురవుతూనే ఉంటాయి. బెంచికి పరిమితమైన హీరో చివరికి పాకిస్తాన్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడుతాడా? లేదా?.. ఆ మ్యాచ్‌లో గెలుస్తారా గెలవరా..? కొడుకు కబడ్డీ ఆడకూడదని ఒట్టు వేయించుకున్న తండ్రి చివరి వరకు అలాగే ఉంటాడా తన కొడుక్కి సపోర్ట్ చేస్తాడా..? చేయడా..? తను ప్రేమించిన అమ్మాయి తనకి దక్కుతుందా..? దక్కదా..? తన అక్క ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది..? లవ్ స్టోరీ లో ట్విస్ట్ ఏంటి..? కిట్టయ్యను సెలక్షన్ కమిటీ ఎందుకు రిజెక్ట్ చేసింది..? పాండిరాజ్, కందస్వామిల మధ్య గొడవలు కిట్టయ్య(హీరో)ను ఏ విధంగా ప్రభావితం చేశాయి..? వారి గొడవలు చివరికి ఆ ఊరిని ఏ స్థాయికి తీసుకెళ్తాయి..? కులపరమైనా అవమానాలను ఏ విధంగా భరించాడు..? బెంచ్ కి పరిమితం చేసిన కోచ్, కబడ్డీ వద్దన్నా తండ్రి, విఫలమైన ప్రేమ, ఊరిలో గొడవలు, కులపరంగా అవమానం వీటన్నిటి అధిగమించి కిట్టయ్య.. ఏ విధంగా కబడ్డీ ఆడగలిగాడు, తన ఊరికి, కుటుంబానికి ఎటువంటి పేరు తీసుకొచ్చాడు. తనకి “బైసన్”అని ఎవరు పేరు పెట్టారు. తన చుట్టూ జరిగే అన్ని పరిస్థితులను ఎదిరించి ఏ రకంగా పోరాడాడు అనేదే “బైసన్” కథ.

ఎవరెవరు ఎలా నటించారంటే?

ధృవ్ పూర్తిగా కబడ్డీ ప్లేయర్‌గా మారిపోయాడు. ఇందులో మనం మన స్నేహితున్నో.. పక్కింటి కుర్రాడినో చూసినట్టు పాత్రలో అట్టే ఒదిగిపోయాడు. తనకు ఇచ్చిన క్యారెక్టర్‌కు వందశాతం న్యాయం చేశాడు. కబడ్డీ ఆటగాడిగా, కొడుకుగా, ప్రేమికుడిగా, తమ్ముడిగా, ఒక పల్లెటూరు కుర్రాడిగా అన్ని రకాలుగా మనల్ని అందరినీ కూడా బాగా ఆకట్టుకుంటాడు.

అనుపమ పరమేశ్వరన్ గత సినిమాలన్నిటికంటే ఈ సినిమాలో చాలా సహజంగా నటించింది. ఆమె నటన ప్రేక్షకుల కళ్ళు తిప్పుకొనీకుండా చేసింది. ఒక ప్రేయసిగా అద్భుతంగా చేసింది. తండ్రిగా పశుపతి అల్టిమేట్ యాక్టింగ్ చేశాడు. ప్రతి సీనుకు అదరగోట్టేసాడనే చెప్పొచ్చు. అతన్ని చూస్తే అతని స్థానంలో.. మన నాన్న మనల్ని ప్రోత్సహించినట్టే ఉంటుంది. తండ్రి అంటే ఇలానే ఉండాలి రా అని అనిపిస్తుంది. పశుపతి ఒక్కరే ఆ పాత్ర చేయగలరు. ఇంక లాల్, అమీర్ ఇద్దరు ఇద్దరే.. యాక్టింగ్ విషయంలో ఎవరికి ఎవరు కూడా తీసిపోరు. అక్కగా రజిష విజయన్ బాగా సరిపోయింది. ఆమె తప్పా ఇంకెవరు ఆ పాత్ర చేసిన అంత బాగుండేది కాదేమో అనిపిస్తుంది. ఈ విధంగా ప్రతి పాత్ర కూడా వారి వారి స్థాయికి తగినట్టు వారు జీవించారు అని చెప్పొచ్చు.

అక్కడక్కడా కొంచం స్లో అయినట్టు అనిపించినా.. ఎక్కడా కూడా సినిమా మనల్ని బోర్ కొట్టించదు. ఇది ఓటీటీలోకి వచ్చినాక చూద్దాం అనుకునే సినిమా కాదు, పక్కా థియేటర్లకు వెళ్లి చూడాల్సిన సినిమా.

మరో మెట్టు ఎక్కిన డైరెక్టర్

దర్శకుడు మారి సెల్వరాజ్ ప్రతి పాత్రను చాలా వాస్తవంగా తీర్చిదిద్దారు. తను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పగలిగారు. డైరెక్టర్ రాసుకున్న ప్రతి పాత్రని ఎంతమేరకు వాడుకోవాలో అంత బాగా వాడుకున్నారు. గత సినిమాలకు.. దీనికి చాలా వ్యాత్యాసం కనిపిస్తుంది. ఈ సినిమాతో డైరెక్టర్ మరో మెట్టు పైకి ఎక్కాడు అని చెప్పొచ్చు. దర్శకుడిగా తన విజయ పరంపరని కొనసాగించారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్. సినిమా చూస్తున్నంతసేపు మనల్ని మ్యూజిక్ అలాగే కట్టిపడేస్తుంది. ఏ సీనుకు ఎంత సంగీతం అందివ్వాలో ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో అలాగే ఇచ్చాడు. ప్రేక్షకులను నివాస్ కే ప్రసన్న తన సంగీతంతో మంత్రముగ్దల్ని చేసేశాడు.

పల్లెటూరి మనుషుల్లా..

పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. తెలుగు నేటివిటీ అలాగే ఉట్టిపడిందని చెప్పొచ్చు. ప్రతి పాట ఒక ఆణిముత్యం. సినిమాని ముందుకు తీసుకెళ్లడంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. పాటలు ఎంతగానో తోడ్పాటుని అందించాయి. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే చాలా బాగా తీశారు. ప్రతి ఒక్క ప్రేమ్ మనల్ని మన వాస్తవ జీవితంలోనికి తీసుకెలుతుంది అంత అద్భుతమైన కెమెరా వర్కింగ్ జరిగింది. చూడటానికి చాలా కొత్తగా ఉంది. ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్ డిజైనింగ్ మన పల్లెటూరు ఇదే అన్నట్టుగా వారంతా మన ఊరి మనుషులే అన్నంత గొప్పగా తీర్చిదిద్దారు.

ఇది 1990లకు సంబంధించిన కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా తీసిన చిత్రం. ముఖ్యంగా తమిళనాడుకు చెందిన అర్జున అవార్డు గ్రహీత మనతి గణేశన్ అనే కబడ్డీ ఆటగాడి ఆట మరియు ఆయన నిజ జీవితంలో చుట్టూ జరిగిన పరిస్థితులను సినిమాగా తీశారు.

ఉపాసన సీమంతం వేడుక: సందడి చేసిన సెలబ్రిటీలు

0

చిరంజీవి తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. మరోమారు తండ్రి కాబోతున్నారు. ఈయన భార్య ఉపాసన మళ్లీ గర్భం ధరించారు. సీమంతం వేడుక కూడా వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమానికి.. మెగాస్టార్ బంధువులు, ఉపాసన బంధువులు అందరూ హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

డబుల్ సెలబ్రేషన్స్!

”ఈ దీపావళి డబుల్ సెలబ్రేషన్స్ తీసుకురావడంతో పాటు.. రెట్టింపు ప్రేమ, ఆశీర్వాదాలను తీసుకొచ్చింది” అని ఉపాసన కొణిదెల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు. దీంతో సినీ తారలు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా ఉపాసన ఈసారి కవలలకు జన్మనివ్వనున్నట్లు సమాచారం.

2023లో మొదటి బిడ్డ

నటుడు రామ్ చరణ్.. ఉపాసన 2012లో పెళ్లి చేసుకున్నారు. కాగా ఈ దంపతులు 2023 జూన్ 20న హైదరాబాద్‌లో తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ బిడ్డ నామకరణం వేడుకలను ఘనంగా జరిపారు. ఆ సమయంలో పాపకు ‘క్లిన్ కారా కొణిదెల’ అని నామకరణం చేశారు. ఈ పేరును లలితా సహస్రనామం నుంచి తీసుకున్నట్లు ఆ సమయంలోనే వెల్లడించారు.

క్లిన్ కారా.. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ చిన్న పాప ముఖాన్ని, తల్లిదండ్రులు & కుటుంబ సభ్యులు కూడా రివీల్ చేయలేదు. అయితే క్లిన్ కారా కోసం రామ్ చరణ్ దంపతులు ప్రత్యేక కేరింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం. తనను నాన్న అని పిలిచినప్పుడే.. క్లిన్ కారా ముఖాన్ని చూపిస్తా అని ఒక కార్యక్రంలో కూడా వెల్లడించారు. అయితే ఇప్పటికే క్లిన్ కారాకు సంబంధించిన వీడియోలు చాలానే సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చినప్పటికీ.. ఎక్కడ పాప ముఖం కనిపించకుండా ఉపాసన దంపతులు జాగ్రత్త పడ్డారు.

కవలలకు జన్మనివ్వనున్న ఉపాసన

ఇప్పటికే క్లిన్ కారాకు జన్మనిచ్చిన.. ఉపాసన ఇప్పుడు రెండోసారి గర్భం దాల్చారు. అయితే ఇప్పుడు కవలలకు జన్మనివ్వనున్నట్లు సమాచారం. ఉపాసన కవలలకు జన్మనివ్వనున్నట్లు వార్త తెలియడంతో అటు మెగా అభిమానులలో సందడి నెలకొంది. బుల్లి స్టార్స్ రాబోతున్నట్లు కామెంట్స్ పెడుతున్నారు.

సీమంతం వేడుకకు ప్రముఖు

ఉపాసన సీమంతం వేడుకకు.. మెగాస్టార్ చిరంజీవి దంపతులు మాత్రమే కాకుండా, ఉపాసన తల్లిదండ్రులు, నాగబాబు దంపతులు, వరుణ్ తేజ్ దంపతులు, నిహారిక కొణిదెల మొదలైనవారు హాజరయ్యారు. వీరంతా ఉపాసన, రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. అంతే కాకుండా.. ఉపాసనకు పండ్లు వంటివి గిఫ్ట్‌గా ఇచ్చారు. మొత్తం మీద అందరూ ఉపాసనను ఆశీర్వదించారు. ప్రత్యేకించి చిరంజీవి తల్లి.. ఆమెను దీవించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

రామ్ చరణ్ & ఉపాసన కొణిదెల గురించి

రామ్ చరణ్ గురించి అందరికి తెలుసు. అయితే ఉపాసన గురించి బహుశా కొంతమందికే తెలిసి ఉంటుంది. నిజానికి ఈమె అపోలో హాస్పిటల్ ఫౌండర్ సీ. ప్రతాప్ రెడ్డి మనువరాలు. ఈమె తల్లి శోభన కామినేని (అపోలో హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్ పర్సన్). లండన్ యూనివర్సిటీలో చదువుకున్న ఉపాసన.. అపోలో హాస్పిటల్స్‌లో కీలక బాధ్యతలు చేపడుతోంది. కాగా ఈమె త్వరలోనే కవలలకు జన్మనివ్వనుంది.

ఐదు రెట్లు పెరిగిన టమోటా ధరలు: పాకిస్తాన్‌లో ఎందుకిలా జరుగుతోంది!

పాకిస్తాన్ ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ తరుణంలోనే పాక్ & ఆప్ఘనిస్తాన్ దేశాల మధ్య సరిహద్దు మూతపడింది. ఈ చర్య అక్కడి నిత్యావసరాల ధరలను భారీగా పెంచేసింది. టమోటా రేటు ఐదు రెట్లు పెరిగింది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.

మూతపడిన సరిహద్దులు

ఈ నెలలో (2025 అక్టోబర్) రెండు దేశాల మధ్య (పాక్ & ఆప్ఘనిస్తాన్) పోరాటం మొదలైంది. ఈ కారణంతోనే ఈ దేశాల సరిహద్దులు మూతపడ్డాయి. రెండు ఇరుగుపొరుగు దేశాలు. కాబట్టి నిత్యావసరాలు ఎగుమతి, దిగుమతులు జరిగేవి. అయితే సరిహద్దులు మూత పడటంతో ఇవన్నీ ఆగిపోయాయి. అంతే కాకుండా ఈ సరిహద్దుల వద్ద సుమారు 5000 కంటైనర్లు ఉన్నట్లు, సరైన సమయానికి సరఫరా ఆగిపోవడంతో అందులోని కూరగాయలన్నీ చెడిపోయినట్లు కొందరు చెబుతున్నారు.

స్తంభించిన వాణిజ్యం

2021లో తాలిబన్లు.. కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి పోరాటం జరుగుతూనే ఉంది. ఈ కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 2600 కిమీ (1600 మైల్స్) సరిహద్దులో.. భూపోరాటం, పాకిస్తాన్ వైమానిక దాడుల తరువాత.. 2025 అక్టోబర్ 11 నుంచి సరిహద్దులు మూసేసారు. దీంతో వాణిజ్యం, రవాణా వంటివన్నీ స్తంభించిపోయాయి. దీంతో నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగినట్లు పాక్ – ఆఫ్ఘన్ వాణిజ్య మండలి అధిపతి ఖాన్ జాన్ ఆలోకోజాయ్ పేర్కొన్నారు.

ఒక రోజు గడిస్తే.. రెండువైపులా (పాకిస్తాన్ & ఆప్ఘనిస్తాన్) సుమారు 1 మిలియన్ డాలర్ల నష్టాన్ని చూడాల్సి వస్తోంది. పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులు స్తంభించిపోయాయి. వాణిజ్య పరంగా ఇవే అధికంగా ఉన్నాయని ఖాన్ జాన్ ఆలోకోజాయ్ స్పష్టం చేశారు.

400 శాతం పెరిగిన టమోటా ధరలు

ప్రత్యేకమైన టమోటాల ధరలు సుమారు 400 శాతం పెరిగాయి. దీంతో కేజీ టమోటా ధరలు పాకిస్తాన్ దేశంలో 600 పాకిస్తానీ రూపాయలకు చేరింది. అంతే కాకుండా ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చే ఆపిల్స్ ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని ఆలోకోజాయ్ స్పష్టం చేశాయి. సరిహద్దులు మూతపడటం వల్ల అక్కడ చాలా కంటైనర్లు నిలిచిపోయాయి. అందులోని కూరగాయలు, ఆహార పదార్థాలు చెడిపోయాయని ఆయన అన్నారు. ఇప్పటికే మార్కెట్లో టమోటాలకు మాత్రమే కాకుండా.. ఆపిల్, ద్రాక్ష వంటి వాటికి కూడా కొరత చాలానే ఉంది. కాబట్టి దీనిపై అక్కడి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయనేది తెలియాల్సి ఉంది.

అక్టోబర్ 25న తదుపరి చర్చలు

పాకిస్తాన్‌పై.. తమ ఉమ్మడి సరిహద్దు దాటుకుని వచ్చి దాడిచేస్తున్న ఉగ్రవాదులను కాబూల్ నియంత్రించాలని ఇస్లామాబాద్ డిమాండ్ చేయడంతో ఈ ఘర్షణలు తలెత్తాయి. దీనిని తాలిబన్లు ఖండిస్తూ.. తాము ఆప్ఘనిస్తాన్ స్వర్గధామాల నుంచి పనిచేస్తున్నామని చెప్పుకుంటున్నారు. అంతే కాకుండా ఖతార్, టర్కీ మధ్య నిర్వహించిన చర్చల కారణంగా.. గొడవలు కొంత సద్దుమణిగాయి. అయితే వాణిజ్యం మూసివేయబడింది. ఇది సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అయితే అక్టోబర్ 25న ఇస్తాంబుల్‌లో.. ఈ విషయంపైనే తదుపరి చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో సానుకూల నిర్ణయాలు తీసుకుని.. ప్రజల ఇబ్బందులను తొలగిస్తారా? లేదా?, ధరల నియంత్రణకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.

కుమార్తె కోరిక.. తండ్రి లక్ష్యం: నాణేలు పోగేసి నచ్చిన గిఫ్ట్!

కలియుగంలో తల్లిదండ్రులను పట్టించుకోని బిడ్డలు ఉన్నారు, బిడ్డలను పట్టించుకోని తల్లిదండ్రులూ ఉన్నారు. అయితే ఏదో ఒకమూల, ఎక్కడో ఒక దగ్గర ఇప్పటికీ.. తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే సంఘటలు వెలుగులోకి వస్తున్నాయి. అలంటి ఘటనే ఇటీవల తెరమీదకు వచ్చింది. దీని పూర్వాపరాలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

కుమార్తె కోసం..

చండీగఢ్ ప్రాంతానికి ఒక పేద రైతు.. తన కుమార్తె కోరిక తీర్చడానికి గొప్ప సాహసమే చేశారు. రోజంతా కష్టపడితేగానీ బువ్వ దొరకని పరిస్థితుల్లో ఉండే.. వారి కుటుంబంలో, తన కుమార్తె ఒకరోజు తనకు ఒక స్కూటర్ కావాలని కోరింది. కూతురు అడిగిందనే కారణంతో.. ఆ రోజు నుంచే డబ్బు (చిల్లర నాణేలు) కూడబెట్టడం మొదలు పెట్టాడు. సరిగ్గా ఆరు నెలలు పోగుచేసాడు.

రూ. 40వేల విలువైన నాణేలు

రైతు పోగు చేసిన నాణేలను.. ఛత్తీస్‌గఢ్‌లోని ఒక షోరూంకు తీసుకెళ్లి, సిబ్బంది ముందు పోసి తాను స్కూటర్ కొనాలనే విషయాన్ని స్పష్టం చేశారు. అదంతా అక్కడి సిబ్బందికి ఆశ్చర్యం కలిగించింది. కాని తన కుమార్తె కోసం.. ఆ రైతు చేసిన పనికి అక్కడంతా ఫిదా అయిపోయారు. దీంతో ఆయన తెచ్చిన నాణేలను లెక్కబెట్టడం ప్రారంభించారు. మొత్తం రూ. 40వేలు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే స్కూటర్ కొనడానికి మిగిలిన డబ్బును లోన్ (ఈఎంఐ) రూపంలో చెల్లిస్తామని చెప్పారు. దీనికి అక్కడి సిబ్బంది అంగీకరించడం మాత్రమే కాకుండా.. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా సిద్ధం చేశారు.

ఉప్పొంగిన ఆనందం

పేద రైతు కూడబెట్టిన డబ్బు తీసుకుని.. మిగిలిన మొత్తాన్ని ఈఎంఐ రూపంలో కట్టించుకోవడానికి ఒప్పుకుని షోరూం సిబ్బంది తన కుమార్తెకు హోండా యాక్టివా స్కూటర్ తాళాలను అందించారు. స్కూటర్ తన జీవితంలోకి రావడంతో.. ఆ అమ్మాయి ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఇది చూసిన తండ్రి (రైతు) మరింత ఆనందపడ్డారు. కాగా ఈ స్కూటర్ కొనుగోలు చేసిన తరువాత పండుగ ఆఫర్ కింద వారికి ఒక మిక్సర్ గ్రైండర్ కూడా గిఫ్ట్‌గా లభించింది. అందరూ హ్యాపీగా ఇంటికి వెళ్లారు.

నిజానికి పిల్లల కళ్ళలో ఆనందం చూడటానికి.. చాలామంది తల్లిదండ్రులు ఆరాటపడుతుంటారు. బిడ్డల భవిష్యత్తే, వారి ఆనందమే వీరి ఆనందంగా భావిస్తారు. చరిత్రలో వెతికినా.. బిడ్డల చేతిలో మోసపోయిన తల్లిదండ్రులు చాలామందే కనిపిస్తారు. కానీ తల్లిదండ్రుల చేతిలో మోసపోయిన బిడ్డలు ఎక్కడ కనిపించరు అంటే? అదేమీ అతిశయోక్తి కాదు. కానీ పరిస్థితులు.. మారిపోయాయి. బంధాలు బలహీనమైపోయాయి.

హోండా యాక్టివా గురించి

ఇక హోండా యాక్టివా విషయానికి వస్తే.. ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన మోడల్. ఈ స్కూటర్ ప్రారంభ ధరలు ప్రస్తుతం రూ. 95,961 (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. ఇది మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి.. రోజువారీ వినియోగానికి, సిటీ ప్రయాణాలను కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది మల్టిఫుల కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండటం వల్ల.. కొనుగోలుదారులు తమకు నచ్చిన వేరియంట్ ఎంచుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇప్పటికే ఈ స్కూటర్ సుమారు మూడు కోట్ల యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలు పొందినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే.. మార్కెట్లో దీనికున్న డిమాండ్ స్పష్టంగా అర్థమైపోతుంది.

యువత కోసం.. కొత్త ప్రయోగం: మనసును హత్తుకునే సాంగ్

0

పాటకంటే ముందు.. వీడియో ప్రారంభంలో డైరెక్టర్ మారి సెల్వరాజ్ కొన్ని పవర్‌ఫుల్ పదాలు కనిపిస్తాయి. సినిమాలోని ప్రతి పాటకు ముందు అలాగే వేశారు ఆయన. అంటే ఆయన మాటల ద్వారా చెప్పాలి అనుకున్నదాన్ని ముందుగానే చెబుతున్నారు అన్నమాట. ఈ పాటకి ముందు ఇలా రాశారు.

నేనెక్కడికి నుండి వస్తున్నానో నీకు తెలుసు, ఎందుకు వస్తున్నానో కూడా నీకు తెలుసు, నేనక్కడికి వస్తే ఏమవుతుందో నీకు తెలుసు అందుకే.. నువ్వు ఆ తలుపులు మూసేశావు.. కానీ, నా తలపుల శక్తిలో వాటిని తెరిపిస్తా చూడు…” అంటూ వీడియో మొదట్లో రాశారు.

సరికొత్త ర్యాప్ సాంగ్

ఇంక సాంగ్ విషయానికి వస్తే ఒకప్పుడు యువత స్లో మెలోడీ పాటల్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్లు. కానీ ఇప్పుడు అలా లేదు.. ర్యాప్ సాంగ్ అంటే చాలు యువత ఈ రోజుల్లో బాగా కనెక్ట్ అయిపోతున్నారు. చాలామంది అటువంటి పాటలకు మాత్రమే కాకుండా.. ఆ పాటలు పాడే గాయకులకు కూడా అభిమానులుగా మారిపోతున్నారు. దాంతో ఎంతోమంది ర్యాప్ సింగర్స్ బయటకి వచ్చారు. వచ్చి వాళ్ళవాళ్ళ ప్రతిభకు తగినట్టుగా ప్రదర్శనలు ఇస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పా. రంజిత్ ఏకంగా ఒక గ్రూప్‌తో ర్యాప్ సాంగ్స్ మ్యూజిక్ బ్యాండ్ పెట్టించారు. అది తమిళనాడులోనే కాకుండా దేశం నలుమూలల బాగా పాపులర్ అయింది. అదంతా ఒకెత్తు అయితే ఈ ర్యాప్ పాడే వాళ్లలో అత్యంత ఆదరణ పొంది.. భారీ విజయాలను కైవసం చేసుకున్న ఒక ఇద్దరు సింగర్స్ ఉన్నారు. వారే తమిళనాడుకు చెందిన అరివు మరియు కేరళకు చెందిన వేదన్.

ఆ ఇద్దరు..

వేదన్, అరివు ఇద్దరు కూడా మొదట వ్యక్తిగతంగా ఆల్బమ్ చేసుకునే వాళ్లు. ఆ తరువాత అనేక చోట్ల షోస్ చేయడం ప్రారంభించారు. వీరు ఎక్కడ షో ఏర్పాటు చేసిన కూడా దాదాపు కొన్ని లక్షల మంది అభిమానులు స్వచ్చందంగా గుమిగూడతారు. చాలామంది ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న వాళ్ళే షో ఆర్గనైజ్ చేసి వీరిని ఆహ్వానిస్తారు. ఆ స్థాయికి ర్యాపర్స్ ఎదిగారు. ర్యాప్ సాంగ్స్ చాలా మంది పాడుతారు.. కానీ వీరికి వచ్చినంత సక్సెస్ ఎవరికీ రాలేదు. దీనికి కారణం కేవలం పాడటం మాత్రమే కాదు ఏదో తెలియని ప్రత్యేక ట్యాలెంట్ అనే చెప్పాలి.

వారిరువురు ఒక గొప్ప ప్రత్యేకమైన ఐడియాలాజి సొంతం చేసుకున్నారు. వీరి పాటల్లో సామాజిక, రాజకీయ, ఆర్థిక, న్యాయ వ్యవస్థ ఇలా అనేక అంశాలతో పాటు.. సమాజంలో ఉండే అణిచివేతలు, వెలివేతలు, అవమానాలు వీటిని అన్నిటిని ఎదిరించే ఒక కసితో కూడిన తెగింపును వారు యువతకు, సమాజానికి అందిస్తారు. అందుకే వేదన్ & అరివు ఇద్దరికీ వారి సొంత రాష్ట్రాల్లోనే కాకుండా దేశం దాటిన అభిమానం వారి వశం అయిందని చెప్పొచ్చు. అటువంటి ర్యాప్ సింగర్స్ ఇద్దరితో కలిపి బైసన్ సినిమా కోసం డైరెక్టర్ మారి సెల్వరాజ్ రచించిన రెక్క రెక్క అనే ఒక ప్రత్యేకమైన ర్యాప్ సాంగులు తమిళంలో వీరితోనే పాడించారు. అది అతి తక్కువ కాలంలోనే.. అత్యంత ప్రేక్షకాదరణ పొంది “బైసన్” సినిమాను ఒకరేంజ్​కు తీసుకుని వెళ్ళింది. అటువంటి పాటని ఇప్పుడు మన తెలుగు వెర్షన్ హద్దే లేని వేగం పెట్టి అనే టైటిల్ పెట్టి విడుదల చేశారు.

యువతను ఆకట్టుకుంటోంది

పాటలోని పదాల అర్థం, సారాంశం వేరే లెవెల్‌లో ఉన్నాయి. యువతను అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఎగిరి గంతేసి పరిగెత్తి ఏదో ఒకటి సాధించి తీరాలి అనే కసిని ఈపాట క్రియేట్ చేస్తున్నది. “హద్దెలేని వేగం పట్టి, ఒంటరిగా పోరాడగా అడ్డేలేదు నీకు ఇంక సాగరా, కదలరా ఇది కల కాదు, భయానికి నువ్వు బలి కావు, మార్చరా నీ తలరాత చెలరేగరా ఓ కసితోని” అని బైసన్ పాట గూస్బమ్స్ తెప్పిస్తున్నది . తెలుగులో అక్టోబర్ 24న సినిమా రిలీజ్ అవుతున్నది.

ఆ ఆఫర్ మిస్సయ్యా.. అందుకే ఇది చేశా!: అనుపమ మరమేశ్వరన్

0

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తెలుగు, తమిళ్, మలయాళం ఇలా.. భాషతో సంబంధం లేకుండా సినిమాల్లో నటిస్తోంది. ఈమె నటించిన మూవీస్ వరుసగా రిలీజ్ అవుతున్నాయి. విడుదలైన అన్ని చిత్రాలు ఆమె విజయాన్ని అందించాయి. ఈ సంవత్సరంలోనే దాడ్పు నాలుగు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో డ్రాగన్ (తమిళం), జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (జేఎస్‌కే – మలయాళం), కిస్కింధపురి (తెలుగు), పరదా (పాన్ ఇండియా మూవీ), మళ్ళీ ఇప్పుడు బైసన్. పరదా అనేది లేడి ఒరియేంటెడ్ సినిమా. అనుపమను ఈ సినిమా చాలా నిరాశపరిచింది. మిగిలిన సినిమాలు అన్నిగొప్ప విజయాన్ని అందుకున్నాయి. బైసన్ కూడా ఈజాబిలో ఒకటి.

అందుకే మొదటి సినిమా మిస్!

బైసన్ సినిమా ఆల్రెడీ తమిళ భాషలో మాత్రమే దాదాపు ముప్పై ఐదు కోట్లు రాబట్టిందని ప్రొడ్యూసర్స్ చెబుతున్నారు. తెలుగులో మాత్రం అక్టోబర్ 24న విడుదల అవుతోంది. ఆ సినిమా ప్రమోషన్ కోసం ఆమె హైదరాబాద్‌కు వచ్చారు. మీడియాతో బైసన్ సినిమా విశేషాలను పంచుకున్నారు.

అనుపమ బైసన్ సినిమా విశేషాలను చెప్పాలంటే.. మొదట ఆ మూవీ దర్శకుడు మారి సెల్వరాజ్ పని తీరు & ఆయన గురించి మరిన్ని అంశాలు చెప్పాల్సి ఉంటుంది అని చెప్పుకొచ్చింది. అందరూ ఆయన ఫిలిమ్స్ చూసే ఉంటారు అని, మారి మొదటి చిత్రం పరియేరుమ్ పెరుమాళ్ అనే సినిమా సమయంలో ఆమెకి ఒక పాత్రని ఆఫర్ చేశారని, కానీ అది ఆమె చేయకపోవడంతో కొంచెం బాధపద్దారట. ఎందుకంటే ఆ సమయంలో వెంటవెంటనే ఆమె వేరే సినిమాలు చేయాల్సి రావడం వల్ల పరియేరుమ్ పెరుమాళ్ చేయలేదట.

మారి సెల్వరాజ్ అభిమానిని

పరియేరుమ్ పెరుమాళ్ సినిమాతో ఆయన మూవీస్ అన్నింటికీ కూడా ఒక పెద్ద ఫ్యాన్ అయ్యిందట. వాస్తవికంగా మూలాల్లోకి వెళ్లి సినిమా తియ్యడం అనేది నిజంగా అనుపమకి బాగా నచ్చుతుంది అని చెప్పుకొచ్చింది. ఆ రోజు నుంచి మారి సెల్వరాజ్ అనే దర్శకునికి పెద్ద ఫ్యాన్ ఐపోయాను అని చెప్పుకొచ్చింది. ఆమెకి మొదటి సినిమా మిస్ అయినా కూడా మళ్ళీ పిలిచి మారి సెల్వరాజ్ బైసన్ సినిమాలో నటించడానికి అవకాశం కల్పించారని మారిపైన ఉన్న గౌరవాన్ని ఆ విధంగా తెలియపరిచారు.

ఇక షూటింగ్ అనుభవాలు గురించి చెబుతూ ప్రేమమ్ సినిమాలో నటించినప్పుడు ఒక వర్కుషాప్ చేసినట్టు ఎలా అయితే ఫీల్ అయ్యారో అలాగే ఈ బైసన్ సినిమా చేసినప్పుడు కూడా సేమ్ అదే అనుభవాన్ని కలిగించిందని ఆమె చాలా సంతోషంగా అభిప్రాయాన్ని వెళ్లబుచ్చారు. హీరోయిన్‌గా తనకు మాత్రమే కాకుండా.. బైసన్ సినిమాతో పాలుపంచుకున్న అందరికీ సరికొత్తగా ఒక అనుభూతిని కలిగించిందని ఆమె పేరక్కొన్నారు.

ప్రేమాభిమానాలు అందిస్తున్న ప్రేక్షకులు

ఇప్పుడు ఒక వారం నుంచి తమిళనాడులో సినిమా రిలీజ్ అయిన అన్ని థియేటర్లకు వెళ్ళి అక్కడ రెస్పాన్స్ ఎలా ఉందో చూస్తున్నారట. తమిళనాడులో ప్రేక్షకులు తమ ప్రేమ & అభినందనలు అందిస్తున్నారని చెప్పారు. రోజురోజుకి తమిళనాడులో మా బైసన్ సినిమా కలెక్షన్స్ పెరుగుతున్నాయని ఆనందం వ్యక్తపరిచారు. బైసన్ మూవీ తెలుగులో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చాలామంది అనుపమను అడుగుతున్నారట. మొత్తం మీద ఈ సినిమా 2025 అక్టోబర్ 24న రిలీజ్ కాబోతోందని.. ఆమె తన స్పందనని తెలియజేశారు.