Home Blog Page 121

పుట్టిన ఊరికే గర్వకారణం.. కబడ్డీ ఆటలో బంగారం: ఎవరీ కార్తీక?

కార్తీక ఎక్స్‌ప్రెస్.. ఇది ఏ ట్రైన్ పేరు అనుకుంటే మీరు పొరబడినట్టే!. ఆటలో కార్తీక వేగానికి, బలానికి, ఆట తీరుకి పెట్టిన పేరే ఈ కార్తీక ఎక్స్‌ప్రెస్. యావత్ భారతదేశం అంతటా ఇప్పుడు ఈ నేషనల్ కబడ్డీ ప్లేయర్ ఆర్. కార్తీక పేరే వినబడుతున్నది. ముఖ్యంగా తమిళనాడులో మారుమోగుతోంది. రాజకీయంగా (అధికార, ప్రతిపక్ష వర్గాలు) సామాజికంగా, క్రీడా పరంగా, చలన చిత్ర ఇలా అన్నీ రంగాల నుంచి కార్తీక ఎనలేని ప్రశంసలు అందుకుంటోంది. కబడ్డీ అందరూ ఆడుతారు కానీ కొంతమంది మాత్రమే అందులో తమ ప్రత్యేకతను చాటుకుంటారు. ఇది అతి కొద్దిమందికి మాత్రమే సాధ్యమయ్యే విషయం. ఇంతకీ ఈమె ఎవరు.? ఎక్కడ నుండి వచ్చింది..? ఎందుకు కోసం కబడ్డీ ఆడుతోంది..? ఇవన్నీ తెలుసుకుంటే కార్తీక ఎందుకు అంత స్పెషల్ అనేది తెలుస్తుంది.

కబడ్డీలో గోల్డ్ మెడల్

ఆర్. కార్తీక ప్రస్తుతం భారత జాతీయ కబడ్డీ జట్టులో ఆడుతున్నారు. అంతే కాకుండా అండర్-18 కబడ్డీ మహిళల జట్టుకు ఆమె వైస్ కెప్టెన్ కూడా. ఇండియా వర్సెస్ ఇరాన్ అంతర్జాతీయ కబడ్డీ ఫైనల్లో బహ్రెయిన్‌లో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించారు. 75-21తో ఓడించడం విశేషం. ఇందుకుగాను ఆమె బంగారు పతకం సాధించింది. ఈ విజయం ఒక్క తమిళనాడుకే కాదు.. ఇది ఇండియన్ హిస్టరీలోనే ఒక అద్భుతమైన గట్టం. ఆసియా యూత్ గేమ్స్ 2025 పేరుతో ఈ కబడ్డీ ఈవెంట్స్ జరిగాయి.

కార్తీక తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఉన్న కన్నగి నగర్ అనే ప్రాంతానికి చెందినవారు. తల్లి శరణ్య ఆటో రిక్షా వర్క్ చేస్తుంది. ఆమెకు వచ్చే డబ్బులతోనే కబడ్డీకి సంబంధించిన ఖర్చులన్ని బరిస్తూ వచ్చింది. ఈమెకి ఒక చెల్లి కూడా ఉంది. ఆమె కూడా కబడ్డీ ఆడుతుంది. నాన్న కన్‌స్ట్రక్షన్ కూలీ పనులకు వెళ్తారు. కార్తీక చెన్నై కార్పొరేషన్ స్కూల్లో పన్నెండో తరగతి చదువుతోంది.

ఘన స్వాగతం పలికిన తమిళనాడు

అంతర్జాతీయ కబడ్డీ ఫైనల్ గెలిచిన తరువాత తమిళనాడులో ఆమెకి ఘనస్వాగతం లభించింది. పూల మాలలతో స్వాగతం పలుకుతూ.. టపాసాలు పెల్చుతూ, దారిపొడుగునా పూలు చల్లుతూ ఇండియన్ కబడ్డీ క్వీన్‌కు స్వాగతం పలికారు. తరువాత తమిళనాడు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయానిధి స్టాలిన్, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళని స్వామి, సినిమా డైరెక్టర్ పా. రంజిత్ తదితరులు ఆమెను ప్రశంసించారు.

కార్తీక పదకొండు సార్లు జాతీయ స్థాయిలో తమిళనాడు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. అనేక చోట్ల మెడల్స్, ఖేలో ఇండియా మెడల్స్, జూనియర్ నేషనల్ 2024లో సిల్వర్ కూడా గెలిచింది. 2025లో జాతీయ కబడ్డీకి సెలెక్ట్ అయింది. జూనియర్స్ స్థాయిలో మంచి పేరు తెచ్చుకునింది.

గర్వాంగా చెప్పుకుంటున్నా.. నాది కన్నగి నగర్

కన్నగి నగర్ అనే ప్రాంతం ఒక స్లమ్ ఏరియా.. అందులోనూ ఆ ప్రాంతాన్ని అందరూ పేదరికం, గ్యాంగ్ వార్స్ ఎక్కువ ఉండే ప్రాంతంగా చూసేవారని చెబుతారు. ఇక్కడ అతి పెద్ద స్లమ్ ప్రాజెక్టును కూడా చెప్పట్టినట్టు సమాచారం. చాలామంది ఈ ప్రాంతంలో నివసించేవారు కూడా.. కన్నగి నగర్ పేరు చెప్పుకునేవారు కాదు. కానీ కార్తిక సాధించిన విజయం.. ఈ ప్రాంతవాసులకు గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అంతే కాకుండా.. ఇప్పుడు నేను కన్నగి నగర్ అమ్మాయి అని గర్వంగా చెప్పుకుంటాను అంటూ కార్తీక సంతోషం వెలబుచ్చింది. ఆ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆమె ఎంతో తపనపడుతోంది. ఇప్పుడిప్పుడే కార్తీక వల్ల మార్పు వస్తోంది.

కియా కారెన్స్ ఇప్పుడు సీఎన్‌జీ రూపంలో: ధర & మైలేజ్ వివరాలు

ఇండియన్ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందిన సౌత్ కొరియన్ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్.. భారతీయ విఫణిలో కియా కారెన్స్ సీఎన్‌జీ కారును లాంచ్ చేసింది. ఇది చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్, పెరిగిన మైలేజ్ వంటి వాటిని గమనించవచ్చు. ఈ లేటెస్ట్ సీఎన్‌జీ కారు ధర, ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ప్రైస్ (ధర)

కియా కొత్త సీఎన్‌జీ కారెన్స్ ధర రూ.11.77 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే కంపెనీ ఈ సీఎన్‌జీని కేవలం ప్రీమియం (ఓ) ట్రిమ్‌లో మాత్రమే అందిస్తుంది. ధర కూడా సాధారణ మోడల్ కంటే ఎక్కువ. కంపెనీ ఈ సీఎన్‌జీ కిట్ మీద మూడేళ్లు లేదా ఒక లక్ష కిమీ థర్డ్ పార్టీ వారంటీని అందిస్తుంది.

ఇంజిన్

సరికొత్త కియా కారెన్స్ సీఎన్‌జీ మోడల్.. 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 113 బీహెచ్పీ పవర్, 144 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ మాత్రమే పొందుతుంది. కాగా పనితీరు కూడా అద్భుతంగా ఉంటుంది. ఇది కేజీ సీఎన్‌జీతో 23 కిమీ కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుందని సమాచారం. బహుశా ఇది వాస్తవ ప్రపంచంలో కొంత తగ్గే అవకాశం ఉంది.

కియా కారెన్స్ (ఓ) ప్రీమియం గురించి

సాధారణ కియా కారెన్స్ (ఓ) ప్రీమియం ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). కాగా కారెన్స్ సీఎన్‌జీ ధర స్టాండర్డ్ మోడల్ కంటే రూ. 77,900 ఎక్కువని తెలుస్తోంది.

కారెన్స్ (ఓ) ప్రీమియం వేరియంట్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, రూఫ్ మౌంటెడ్ ఏసీ, రెండవ వరుసలో వన్ టచ్ ఎలక్ట్రికల్ టంబుల్, సెమీ లెథరెట్ అపోల్స్ట్రే, కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రిక్ ఓఆర్వీఎం, షార్క్ ఫిన్ యాంటెన్నా, రియర్ వ్యూ కెమెరా మొదలైన ఫీచర్స్ పొందుతుంది. అయితే ఇప్పుడు సీఎన్‌జీ ఆప్షన్ రావడంతో.. ఇందులో బూట్ స్పేస్ ఎంత ఉంటుందనే విషయం స్పష్టంగా వెల్లడికాలేదు. అయితే ఫ్యూయెల్ మోడల్స్ మాత్రం 216 లీటర్స్ బూట్ స్పేస్ పొందుతుంది.

సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. కియా కారెన్స్ (ఓ) వేరియంట్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, ఆల్ వీల్ బ్రేక్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, ఐసోఫిక్స్ పాయింట్స్, రియర్ పార్కింగ్ సెన్సార్ మొదలైనవి పొందుతుంది. ఇప్పటికే కారెన్స్ గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (జీఎన్సీఏపీ) క్రాష్ టెస్టులో 3-స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది.

డీలర్స్ స్థాయిలో సీఎన్‌జీ అమర్చిన ఇతర కార్లు

మన దేశంలో డీలర్ స్థాయిలో సీఎన్‌జీ కిట్ అమర్చిన కార్ల జాబితాలో.. ఇప్పటికే హోండా సిటీ, హోండా అమేజ్, హోండా ఎలివేట్, రెనాల్ట్ క్విడ్, రెనాల్ట్ ట్రైబర్, రెనాల్ట్ కైగర్, సిట్రోయెన్ సీ3, సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్, నిస్సాన్ మాగ్నైట్ వంటివి ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కియా కారెన్స్ చేసింది. కాగా ఇండియన్ మార్కెట్లో సీఎన్‌జీ కార్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే పలు కంపెనీలు కార్లను సీఎన్‌జీ విభాగంలో లాంచ్ చేస్తున్నాయి.

ఒక్క సంతకం.. రూ.కోటి పెరిగిన బైక్ రేటు: ఎందుకంటే?

భారతదేశంలో అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో.. బీఎండబ్ల్యూ మోటోరాడ్ కంపెనీకి చెందిన బైకులు ఉన్నాయి. అయితే ఒక ప్రముఖ వ్యక్తి చేసిన ఒకే ఒక్క సంతకం.. ఈ బ్రాండుకు సంబంధించిన ఒక బైకు రేటును అమాంతం పెంచేసింది. ఇంతకీ ఆ ప్రముఖ వ్యక్తి ఎవరు?, ఆ బైక్ సాధారణ ధర ఎంత అనే వివరాలు క్షుణ్ణంగా.. ఈ కథనంలో చూసేద్దాం.

పోప్ లియో XIV సంతకం

క్రైస్తవ మత గురువు.. రోమన్ క్యాథలిక్ చర్చ్ అధినేత పోప్ లియో XIV.. 2025 సెప్టెంబర్‌లో బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఆర్18 ట్రాన్స్‌ కాంటినెంటల్ మోటార్‌సైకిల్‌పై సంతకం చేశారు. ఈ సంతకం చేసిన బైకును జర్మనీలోని మ్యూనిచ్‌లో ఆర్ఎమ్ సోథెబీస్ నిర్వహించిన వేలంలో ఏకంగా 130000 యూరోలకు విక్రయించారు. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 1.32 కోట్లు అన్నమాట. బైకు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బును.. మడగాస్కర్‌లోని పిల్లల సహాయ ప్రాజెక్టులకు విరాళంగా ఇవ్వనున్నారు.

వేలంలో భారీ ధరకు విక్రయించిన.. బీఎండబ్ల్యూ ఆర్18 ట్రాన్స్‌ కాంటినెంటల్ బైకును ప్రత్యేకంగా కస్టమైజ్ చేశారు. దీనిని పోప్ లియో XIV సంతకం చేయించడం కోసం కంపెనీ అధినేత మైఖేల్ సోమర్ అందించారు. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ మీద ఆయన సంతకం చేశారు. ఈ కార్యక్రమానికి సెప్టెంబర్‌లో భారీ ఎత్తున ప్రజలు, అభిమానులు హాజరయ్యారు.

బీఎండబ్ల్యూ ఆర్18 ట్రాన్స్‌ కాంటినెంటల్

ఇండియన్ మార్కెట్లో బీఎండబ్ల్యూ ఆర్18 ట్రాన్స్ కాంటినెంటల్ బైక్ ప్రారంభ ధర రూ. 34.72 లక్షలు (ఎక్స్ షోరూమ్). కాగా పోప్ లియో XIV సంతకం చేసిన ఈ మోడల్ బైక్ ఏకంగా రూ. 1.32 కోట్లకు అమ్ముడైంది. అంటే.. సాధారణ ధరకంటే సుమారు కోటి రూపాయలు ఎక్కువన్నమాట.

ఇంజిన్ డీటెయిల్స్

బీఎండబ్ల్యూ ఆర్18 ట్రాన్స్ కాంటినెంటల్ 1802 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ బాక్సర్ ట్విన్ ఇంజిన్ ద్వారా.. 91 హార్స్ పవర్, 158 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ పొందుతుంది. ఈ బైకులో.. బ్లూటూత్ కనెక్టివిటీ మరియు న్యావిగేషన్ వంటి వాటితో కూడిన 10.25 ఇంచెస్ టీఎఫ్‌టీ కలర్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది బైక్ స్పీడ్, ఫ్యూయెల్ స్టేటస్ వంటి వాటిని ప్రదర్శిస్తుంది.

ఆర్18 ట్రాన్స్ కాంటినెంటల్ బైకులో.. బీఎండబ్ల్యూ మోటోరాడ్ డైనమిక్ క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్ హెడ్‌లైట్స్, కీలెస్ ఇగ్నిషన్, స్టెబిలిటీ కంట్రోల్ వంటి వాటితో పాటు రాక్, రోల్ అనే రైడింగ్ మోడ్స్ కూడా అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 180 కిమీ/గం అని తెలుస్తోంది. కాగా పనితీరు విషయంలో అత్యద్భుతంగా ఉంటుంది. సాధారణంగానే ఈ బైక్ ధర కొంత ఎక్కువ కాబట్టి.. ఈ బైక్ సేల్స్ కొంత తక్కువగానే ఉంటాయి.

ఇండియన్ మార్కెట్లోని బీఎండబ్ల్యూ బైకులు

భారతదేశంలో బీఎండబ్ల్యూ మోటోరాడ్ సుమారు 14 మోడల్ బైకులను విక్రయిస్తోంది. అవి బీఎండబ్ల్యూ జీ 310 ఆర్, జీ 310 జీఎస్, జీ 310 ఆర్ఆర్, ఎఫ్ 900 ఆర్, ఎఫ్ 900 ఎక్స్ఆర్, ఎఫ్ 900 జీఎస్, ఎఫ్ 900 జీఎస్ అడ్వెంచర్, ఎస్ 1000 ఆర్, ఎస్ 1000 ఆర్ఆర్, ఏం 1000 ఎక్స్ఆర్, ఆర్ 12, ఆర్ 1300 జీఎస్, ఆర్ 1300 జీఎస్ అడ్వెంచర్, సీఈ 04. వీటి ఎక్స్ షోరూమ్ ధరలు చాలా ఎక్కువ.

శ్రీలీలతో.. రవితేజ మాస్ జాతర: హిట్ పడాల్సిందేనా?

0

మాస్ మహారాజ.. హీరో రవితేజ & హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన సినిమా మాస్ జాతర.. మనదే ఇదంతా అనే ట్యాగ్‌లైన్‌తో ఈ నెల చివర థియేటర్లలో బ్రహ్మాండంగా విడుదల కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్ & ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై.. నిర్మాతలు ఎస్ నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. భీమ్స్ సేసిరోలియో మూవీకి సంగీతం అందిస్తుండగా.. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

హిట్ పడాల్సిందే!

రవితేజను వరుసగా ప్లాప్స్ వెంటాడుతున్న వేళ.. ఇప్పుడు ఈయనకు ఒక హిట్ మూవీ పడాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం రవితేజ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2020 నుంచి క్రాక్, ధమాకా.. ఆ తరువాత చిరంజీవితో కలిసి నటించిన వాళ్తేరు వీరయ్య లాంటి ఏదో ఒకటి రెండు విజయాలు తప్పా చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. టైగర్ నాగేశ్వరావు, ఈగల్, ఖిలాడి, డిస్కో రాజా, రామారావు ఆన్ డ్యూటీ ఇటువంటి సినిమాలు అన్నీ కూడా రవితేజను నిరాశపరిచాయి.

గత ఐదారు సంవత్సరాల నుంచి రవితేజ ఎంచుకుంటున్న సినిమాల.. కథలన్నీ కూడా ఒకే విధమైన నటనా శైలి మరియు యాక్షన్ సీన్స్, డైలాగ్ మాడ్యూలేషన్ అన్నీ కూడా ఒకేలా ఉండటం, అన్నీ కమర్షియల్ రొటీన్ ఎంటర్‌టైన్‌మెంట్ మాదిరిగా అనిపిస్తుండటం, కథలో పెద్దగా బలం లేకపోవడంతో పాటు కేవలం ఏదో కావాలనే కామెడీ, యాక్షన్, సాంగ్స్ అన్నీ కూడా బలవంతంగా చొప్పించినట్టు అనిపించేలాగా ఉండటం వల్ల పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు.

రిలీజ్ ఎప్పుడంటే?

చాన్నాళ్లుగా పెద్ద హిట్ రవితేజ ఖాతాలో పడలేదు. ఇప్పుడు రవితేజకి ఇండస్ట్రీలో ఒక బిగ్ హిట్ తప్పకుండా కావాల్సి ఉంది. ఇందులో భాగంగా మళ్ళీ ఒక్కసారి ధమాకా హిట్ కాంబినేషన్ శ్రీలీలతో కలిసి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. పలుమార్లు రిలీజ్ తేదీలు వాయిదాలు పడుతూ వచ్చాయి. అయితే మొత్తంగా సినిమాను అక్టోబర్ 31న విడుదల చేయడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు జరిగాయి. కాగా ఈ రోజు (అక్టోబర్ 27) రిలీజ్ అయినా ట్రైలర్ కూడా రిలీజ్ డేట్ అక్టోబర్ 31 అని ఫిక్స్ చేసింది. దీంతో రవితేజ అభిమానులు రాబోయే సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్, పోస్టర్స్ అన్నీ కూడా సినిమాకి మంచి స్పందన తీసుకొచ్చాయి. మాస్, యాక్షన్, కామెడీ, లవ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వనున్నట్టు అర్థమవుతోంది. ఈ చిత్రంలో రవితేజ పోలీస్ గెటప్‌లో కనిపిస్తున్నాడు. ఇది వరకే చాలా సినిమాల్లో రవితేజ పోలీస్ డ్రెస్ వేసుకుని కనిపించాడు. అందులో కొన్ని బిగ్ సక్సెస్ అయ్యాయి. కొన్ని ప్లాప్ అయ్యాయి. మరి ఇది ఎలా ఉండనుందో చూడాలి.

ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం సూర్య

“మాస్ జాతర మూవీ టీమ్.. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం తమిళ యాక్టర్ సూర్యను ఆహ్వానించారు. అక్టోబర్ 28న హైదరాబాద్, జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. సాయంత్రం 5:30 గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుంది. సూర్య మరియు రవితేజ ఇద్దరిని ఒకే వేదిక మీద చూడటం అనేది.. నిజంగా ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆనందించే అంశంగా చెప్పుకోవాలి. మిగిలిన తారగనం అంతా కూడా వేడుకలో పాల్గొని సందడి చేయనున్నారు. రవితేజ కెరియర్‌లో మాస్ జాతర బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలవాలని కోరుకుందాం. రవితేజ మాస్ జాతరతో విజయం సాధిస్తాడా.. లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.

2025లో 90ల నాటి అనుభూతి: జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశాలు!

కాలం మారిపోయింది.. ప్రకృతి కూడా కలుషితం అయిపోతోంది. జీవితమనే పరుగుపందెంలో పడి మనిషి చాలా బిజీ అయిపోయాడు. కుటుంబానికి కూడా సమయం కేటాయించని స్థితిలో ఉన్నవారి సంఖ్య చాలానే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఎప్పుడో ఒకసారి.. ఎదో ఒక సందర్భంలో కాస్త సమయం చేసుకుని.. అలా విహారయాత్రకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది.

పొగమంచుతో కూడిన ఉదయాలు, సరస్సు ఒడ్డును తిరగడం, వంకర రోడ్లమీద మధురానుభూతి ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎవరికైనా ఇప్పుడే విహారయాత్రకు బయలుదేరాలి తప్పకుండా అనిపిస్తుంది. ప్రస్తుతం మనం 21వ శతాబ్దంలో ఉన్నప్పటికీ.. 90లలోకి తీసుకెల్లో కొన్ని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు నేటికీ మనదేశంలో ఉన్నాయి. వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ మీకోసం..

సిమ్లా (హిమాచల్ ప్రదేశ్)

భారతదేశంలో విహారయాత్రకు వెళ్లాలంటే.. సరైన ప్రదేశం లేదని ఎవరిని అడిగా.. ముక్తకంఠంతో చెప్పేమాట సిమ్లా. ఈ ప్రాంతం మిమ్మల్ని 90లలోకి తీసుకెళ్తుంది. మే నెలలో కూడా మంకీ క్యాప్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఈ ప్రాంతంలో ఉంటుంది. కల్కా-సిమ్లా బొమ్మ రైలు కేవలం రవాణాకు మాత్రమే కాదు.. అది మిమ్మల్ని ఎంతో ఆనందింపచేస్తుంది. ఇక్కడ బేకరీలలో ఇప్పటికి కూడా క్రీమ్ రోల్స్ అమ్ముతారు. పాత కుటీరాలలో మీరు ప్రశాంతంగా సేద తీర్చుకోవచ్చు. ఈ ప్రాంతం మిమ్మంల్ని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తుంది.

ఊటీ (తమిళనాడు)

ఉత్తర భారతదేశానికి సిమ్లా అయితే.. దక్షిణ భారతదేశానికి ఊటీ. దీన్నిబట్టి చూస్తే ఊటీ ప్రాముఖ్యత ఇట్టే అర్థమైపోతుంది. దట్టమైన పొగమంచు, ప్రకృతి వినిపించే సంగీతం.. ఊటీ సరస్సులో పడవ ప్రయాణం.. అందమైన పువ్వులు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. టీ, తేయాకు వంటివి కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. నిశ్శబ్ద, చల్లని వాతావరణం కావాలంటే జీవితంలో ఒక్కసారైనా ఊటీకి వెళ్లాల్సిందే. సాయంత్రం పూట స్వెటర్లు ధరించి.. అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.

డార్జిలింగ్ (పశ్చిమ బెంగాల్)

భారతదేశం నుంచి మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాల సందర్శకులు డార్జిలింగ్ సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. సూర్యోదయం కోసం ఉదయమే టైగర్ హిల్స్ సందర్శించడం, అక్కడ గులాబీ రంగులో కనిపించే కాంచన గంగ చాలా ఆకట్టుకుంటాయి. టీ ఆకుల వాసన.. అక్కడ వీధుల్లో గుబాళిస్తూ ఉంటుంది. ఇక్కడి రైలు ప్రయాణం మీకు తప్పకుండా జీవితాంతం గుర్తుండిపోతుంది. అంతే కాకుండా కెవెంటర్స్‌లో అల్పాహారం, గ్లెనరీస్‌లో పేస్ట్రీలు, టీ తోటలలో జీవితం.. ఇవన్నీ మిమ్మల్ని ఎంతో ఆకట్టుకుంటాయి.

నైనిటాల్ (ఉత్తరాఖండ్)

దేవభూమి అయిన ఉత్తరాఖండ్, పర్యాటక ప్రదేశం కూడా. పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ సినిమాటిక్ జీవితాన్ని చూపిస్తే.. ఉత్తరాఖండ్ నైనిటాల్ వ్యక్తిగత జీవితాన్నే పరిచయం చేస్తుంది. అందమైన ప్రకృతి.. నైని సరస్సుపై ప్రయాణం చాలా ఆకట్టుకుంటాయి. సరస్సు దగ్గర సుదీర్ఘమైన నడక, ప్రకృతి చేసే మధురమైన శబ్దం మిమ్మల్ని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తాయి. టిబెట్ మార్కెట్ కూడా ఎంతో ఆకట్టుకుంటుంది.

మాథెరన్ (మహారాష్ట్ర)

ఇప్పటికి కూడా మాథెరన్ ప్రాంతం లోపలికి కార్లను అనుమతించరు. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ పర్యావరణం, ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక కొండ ప్రాంతం. కుటుంబాలు టాయ్ ట్రైన్‌లో ప్రయాణం చేసి.. చెక్క నేలలతో ఉన్న బంగ్లాలలో బసచేసేవారు. మేఘాలు కమ్ముకుంటుండగా.. వరండాలలో టీ తాగేవారు. ఇదే విధానం ఇప్పటికీ అవలంబిస్తున్నారు. భారతదేశంలో అత్యంత ప్రశాంతమైన కొండప్రాంతం ఏదైనా ఉందంటే.. అది ఖచ్చితంగా మాథెరన్ అని చెప్పాల్సిందే. ఇక్కడా నిశ్శబ్దం చాలా గొప్ప అనుభూతిని అందిస్తుంది.

మౌంట్ అబూ (రాజస్థాన్)

రాజస్థాన్ అంటే ఎడారి ప్రాంతమే కాదు.. హిల్ స్టేషన్ మౌంట్ అబూ కూడా. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఇప్పటికీ చాలామంది పర్యాటకులు ఈ ప్రాంతాలను సందర్శిస్తుంటారు. నక్కీ సరస్సులో పడవ ప్రయాణం, దిల్వారా దేవాలయ సౌందర్యం, అద్భుతమైన సూర్యాస్తమయ అనుభూతి.. మార్కెట్ వీధుల్లో సందర్శనం, ఇవన్నీ మీకు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఇక్కడ మీరు ఒక ప్రత్యేకమైన వాతావరణ అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.

శిరీషతో.. నారా రోహిత్ పెళ్లి: ఈమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

0

నారావారి ఇంట పెళ్లి సందడి మొదలైపోయింది. నటుడు నారా రోహిత్.. తన ప్రేయసి శిరీష లెల్లను వచ్చే గురువారం (2025 అక్టోబర్ 30) రోజు పెళ్లిచేసుకోబోతున్నారు. ఇందులో భాగంగానే పసుపు దంచడం, హల్దీ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబం, నారా చంద్రబాబు కుటుంబం కూడా హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా కొందరు మాత్రమే ఎవరీ శిరీష?, ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటనే విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఎవరీ శిరీష లెల్ల?

ప్రతినిధి 2 సినిమాలో హీరోయిన్‌గా నటించిన శిరీష లెల్ల.. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని ఫురజాల మండలం.. దైడపాలెం అనే గ్రామానికి చెందినవారు. అయితే కొంతకాలం తరువాత ఈమె కుటుంబం రెంటచింతల ప్రాంతానికి వెళ్ళింది. మోడలింగ్ మీద ఆసక్తి ఉన్నపటికీ.. హైదరాబాద్‌లో చదువుకుని, ఆ తరువాత ఆస్ట్రేలియాలో పీజీ పూర్తిచేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత అక్కడే కొంతకాలం ఉద్యోగం చేసినట్లు కూడా సమాచారం. సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉండటంతో.. డైరెక్టర్ దేవగుప్త మూర్తి ఆడిషన్స్‌కు వెళ్ళింది.. ఇలా ప్రతినిధి 2 సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

ప్రతినిధి 2 సినిమాలో నారా రోహిత్, శిరీష లెల్ల కలిసి నటించారు. ఆ సమయంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారింది. ఆ ప్రేమ పెళ్ళికి దారి తీసింది. వీరిరువురు పెద్దలను ఒప్పించి 2024 అక్టోబర్ 14న హైదరాబాద్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. కాగా ఆ సమయంలో పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు. చెప్పినట్లుగానే త్వరలోనే మూడుముళ్ల బంధంతో ఒక్కటికానున్నారు.

రోహిత్ & శిరీష పెళ్లివేడుక

ఇప్పటికే పసుపు దంచడం, హల్దీ ఫంక్షన్ పూర్తయ్యాయి. కాగా అక్టోబర్ 28న మెహందీ, 29న సంగీత్ ఫంక్షన్ జరగనున్నాయి. అక్టోబర్ 30న మూడుముళ్లతో.. వేదమంత్రాలతో ఒక్కటి కానున్నారు. వీరి పెళ్ళికి రాజకీయ ప్రముఖులు, సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు, ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.

నటుడు నారా రోహిత్ పెళ్లి వేడుకల్లో.. నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు. ఇంకా నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ.. ఆయన భార్య వసుంధర మొదలైనవారు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పెళ్ళికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

నారా రోహిత్ గురించి

చంద్రగిరి నియోజకవరం మాజీ శాసనసభ సభ్యులు నారా రామ్మూర్తి నాయుడు కుమారుడే.. నారా రోహిత్. చంద్రబాబు నాయుడు ఇతనికి (నారా రోహిత్) పెదనాన్న. 2009లో బాణం సినిమాతో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నారా రోహిత్.. ఆ తరువాత సోలో సినిమాతో బాగా పాపులర్ అయ్యారు.

ఆ తరువాత ప్రతినిధి, రౌడీఫెలో, అసుర, బాలకృష్ణుడు మొదలైన సినిమాల్లో నటించారు. కాగా 2025 ఆగష్టు 27న సుందరకాండ సినిమా రిలీజ్ అయింది. నారా రోహిత్ కేవలం నటుడు మాత్రమే కాదు. ఈయన 2014లో విడుదలైన నల దమయంతి అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. స్వామిరారా సినిమాకు వ్యాఖ్యాతగా కూడా పనిచేశారు. నారా రోహిత్ న్యూయార్క్ ఫిలిం అకాడమీ పూర్వ విద్యార్ధి. అంతే కాకుండా ఆరన్ మీడియా వర్క్స్ సంస్థకు అధినేత కూడా.

పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు: గుంతలు మాయం చేసే టెక్నాలజీ!

ప్రపంచంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల జాబితాలో భారత్ కూడా ఒకటి. ప్రతి ఏటా లెక్కలేనంత మంది ప్రమాదాల్లో కన్నుమూస్తున్నారు. దీనికి కారణాలు చాలానే ఉన్నప్పటికీ.. సరైన రోడ్లు లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణం. అంటే గుంతలు లేదా గతుకుల రోడ్లు ప్రమాదాలకు హేతువులు అవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) కొత్త టెక్నాలజీతో.. ఈ సమస్యను పరిష్కరించడానికి సన్నద్ధమైంది.

సరికొత్త టెక్నాలజీ..

జాతీయ రహదారులపైనా గుంతలు, పగుళ్ళను గుర్తించడానికి ఎన్‌హెచ్‌ఏఐ.. లేటెస్ట్ 3డీ సెన్సార్ టెక్నాలజీని అవలంభించనుంది. 2025 చివరి నాటికి.. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా రోడ్లను మరమ్మత్తు చేయడం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇది వరకు గుంతలు పడిన రోడ్లను గుర్తించడానికి మాన్యువల్ చెకప్ ఉండేది. అంటే మనుషులు గుంతలను గుర్తించి మరమ్మత్తులు జరిపేవారు. ఇది అన్ని చోట్లా సాధ్యం కాదు, ఆలస్యం కూడా అవుతుంది. ఈ విధానానికి చరమగీతం పాడటానికి.. ఎన్‌హెచ్‌ఏఐ సంకల్పించింది. కాగా రోడ్డు మరమ్మత్తులకు ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించడం భారతదేశంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

లేసర్ బేస్డ్ సిస్టం..

3డీ సెన్సార్ టెక్నాలజీ విధానంలో.. ప్రత్యేకంగా వాహనాలపై అమర్చిన లేజర్ బేస్డ్ సిస్టం రోడ్డు ఉపరితలాన్ని స్కాన్ చేస్తుంది. అలా స్కాన్ చేసినప్పుడు.. రోడ్డుపై ఉండే బంప్, క్రాక్ వంటివాటిని రికార్డ్ చేస్తుంది. జీపీఎస్ డేటా ప్రతి సమస్యను ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఇలా గుర్తించినప్పుడు ఇంజినీర్లు సులభంగా వాటికి మరమ్మత్తులు జరిపి రోడ్డును బాగు చేస్తారు. మొదటి దశలో సుమారు 10,000 కిమీ హైవేలను స్కాన్ చేసి.. ఈ విధానం అమలు చేస్తారు.

ఏఐ టెక్నాలజీ సాయం..

సెన్సార్ రోడ్డును స్కాన్ చేసినప్పుడు.. రోడ్డుపై ఉన్న సమస్యను గుర్తించి నేరుగా ఎన్‌హెచ్‌ఏఐ సెంట్రల్ కమాండ్ సెంటర్‌కు సమాచారం అందిస్తుంది. దీనికోసం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీని కూడా ఉపయోగిస్తారు. ఈ విధానం సమయాన్ని ఆదా చేయడం మాత్రమే కాకుండా.. సమస్యను కూడా సులభంగా పరిష్కరిస్తుంది. భారతదేశంలో సురక్షితమైన రోడ్డు వ్యవస్థను నిర్మించాలని, ప్రమాదాల స్థాయిని తగ్గించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ విధానం అమలు చేయడానికి సంకల్పించింది.

40 శాతం వేగంగా పని పూర్తి

రోడ్డును మరమ్మత్తు చేయడానికి ఉపయోగించే.. 3డీ సెన్సార్ లేజర్ ట్రయాంగ్యులేషన్‌పై ఆధారపడతాయి. కాబట్టి చిన్న గుంతలను కూడా ఇది ఖచ్చితంగా గుర్తిస్తుంది. శాటిలైట్ డేటాతో కలిసినప్పుడు.. రీడింగ్‌లు హైవే యొక్క డిజిటల్ ట్విన్‌ను సృష్టిస్తాయి. ఇది రియల్ టైమ్ రోడ్డు పరిస్థితిని ప్రతిబింబిస్తాయి. ఈ డేటాబేస్ ట్రాఫిక్ పరిమాణం, వర్షపాతం, మరమ్మత్తు హిస్టరీ వంటివాటిని కూడా చూపిస్తుంది. ఇదంతా ఒక పిక్చర్ రూపంలో చూపించేస్తుంది. దీంతో సులభంగా రోడ్డును మరమ్మత్తులు చేసుకోవచ్చు. సంప్రదాయ తనిఖీలతో పోలిస్తే.. ఈ సెన్సార్ ద్వారా 40 శాతం వేగంగా పని పూర్తి చేయవచ్చు.

లక్ష్యం ఏమిటంటే?

3డీ సెన్సార్ విధానం ద్వారా.. ఒక ఏడాదిలోపు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని జాతీయ రహదారులను మరమ్మత్తు చేయడమే లక్ష్యంగా ఎన్‌హెచ్‌ఏఐ ముందుకు సాగుతోంది. ముందుగా అధిక ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో రోడ్డును మరమ్మత్తు చేస్తుంది. రవాణా మౌలిక సదుపాయాలు బాగున్నప్పుడే.. ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది. ఇది తప్పకుండా వాహనదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని స్పష్టంగా అర్థమవుతోంది.

రోల్స్ రాయిస్ ధరలు ఎందుకు ఎక్కువ?: ఆశ్చర్యపరిచే విషయాలు!

గ్లోబల్ మార్కెట్లో ఎన్నెన్ని కార్ల తయారీ సంస్థలు ఉన్నా.. రోల్స్ రాయికి కంపెనీకి ఉన్న ప్రత్యేకత వేరు. దీనికి ప్రధాన కారణం కేవలం ఘనమైన చరిత్ర మాత్రమే కాదు. బ్రాండ్ ఖ్యాతి, అద్భుతమైన లగ్జరీ, పర్ఫామెన్స్, డిజైన్, ఫీచర్స్ వంటివన్నీ పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఏ మాత్రం కాంప్రమైజ్ ఉండదు. ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ బ్రాండ్స్.. అమ్మకాల కోసం తమ ప్రత్యేకతను కోల్పోతున్నప్పటికీ.. రోల్స్ రాయిస్ మాత్రం తన ప్రత్యేకతను కొనసాగిస్తూనే ఉంది.

మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యు, ఆడి, పోర్స్చే, వోల్వో వంటి కంపెనీలు.. ఎప్పటికప్పుడు మార్కెట్లకు అనుగుణంగా, కస్టమర్లను ఆకట్టుకోవడానికి మారుతూనే ఉన్నాయి. కానీ 1906లో ప్రారంభమైన రోల్స్ రాయిస్ మాత్రం తన ఉనికిని.. ప్రత్యేకతను అలాగే నిలుపుకుంది. ఈ కంపెనీ కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉండటానికి కొన్ని ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి.

నిర్మాణం లేదా డిజైన్

రోల్స్ రాయిస్ అంటేనే.. ఎవరికైనా గుర్తొచ్చేది, దాని ప్రత్యేకమైన డిజైన్. ఇది ప్రత్యేకించి కస్టమర్లను ఆకట్టుకునేలా ఉంటుంది. కాగా ధరలు ఎక్కువగా ఉండడానికి మరో కారణం.. ఉత్పత్తి కూడా పరిమిత సంఖ్యలో ఉండటమే. ఒక రోల్స్ రాయిస్ కారు.. పూర్తిగా తయారవ్వడానికి కనీసం ఆరు నెలల సమయం.. వందలాది పనిగంటలు అవసరం అవుతుంది. వీటిని కొనుగోలు చేసేవారు కూడా తప్పకుండా సంపన్నులై ఉంటారు. ఎందుకంటే.. రోల్స్ రాయిస్ కారు కొనాలంటే కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది.

ఇతర లగ్జరీ కార్ల తయారీ సంస్థలు.. ఒక కారును తయారు చేయడానికి మిషన్స్ ఉపయోగిస్తుంటారు. కానీ రోల్స్ రాయిస్ విషయంలో ఇది పూర్తిగా వేరుగా ఉంటుంది. ఇందులో లెదర్ అపోల్స్ట్రేపై కనిపించే కుట్టు దగ్గర నుంచి.. పాలిష్ చేసిన వుడ్ ట్రిమ్ వరకు కూడా అత్యంత నైపుణ్యం కలిగిన కళాకారులే చేతితో డిజైన్ చేస్తారు. ఇది రోల్స్ కంపెనీ మాత్రమే దక్కించుకున్న ప్రత్యేకత. ఈ కార్లలో కనిపించే 1600 ఫైబర్ ఆప్టిక్ లైట్లను కూడా చేతితోనే నేయడం జరుగుతుంది.

పెయింట్ స్కీమ్స్

ఇక రోల్స్ రాయిస్ అంటేనే గుర్తొచ్చేది.. దాని పెయింట్ స్కీమ్. కంపెనీ సుమారు 44000 కంటే ఎక్కువ పెయింట్ ఎంపికలతో తమ కస్టమర్లను కార్లను డిజైన్ చేస్తుంది. అంటే అన్ని రంగులలో రోల్స్ రాయిస్ కార్లు అందుబాటులో ఉంటాయన్నమాట. అయితే ఎంచుకునే రంగును బట్టి కూడా ధర ఉంటుందనే విషయాన్ని కూడా కస్టమర్లు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఒక కారుకు పెయింట్ వేయడానికి 10 వారాల సమయం అవసరం అవుతుంది. సుమారు 22 దశల్లో పెయింటింగ్ ప్రక్రియ జరుగుతుందని సమాచారం. దీని కోసం ప్రత్యేకమైన పరికరాలను ఉపయోగిస్తారు.

వేగం కాదు.. లగ్జరీపై దృష్టి

రోల్స్ రాయిస్ కంపెనీ తన కార్లను అద్భుతమైన సౌందర్యంతో మాత్రమే కాకుండా.. టెక్నాలజీతో కూడా అందిస్తుంది. అయితే సంస్థ ఇతర లగ్జరీ కార్ల మాదిరిగా వేగంపై దృష్టి సారించదు. విలాసవంతంగా ఉండేలా కారును తీర్చిదిద్దుతారు. అంటే దీనిని ఉపయోగించే వ్యక్తి విలాసవంతమైన రైడింగ్ అనుభూతిని పొందుతాడు. ఈ బ్రాండ్ కార్లలో.. సౌండ్ ఫ్రూఫింగ్, డబుల్ గ్లేజ్డ్ విండోలు ఉంటాయి. కాబట్టి క్యాబిన్ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది.

ప్రతిష్ఠత ముఖ్యం!

రోల్స్ రాయిస్ ఒక స్టేటస్. అంటే వినియోగించే వ్యక్తి హోదా, ప్రతిష్టతను తెలియజేస్తుంది. ఈ బ్రాండ్ కార్లను ఉపయోగించే వ్యక్తి మెయినెంట్స్ గురించి ఆలోచించే ప్రసక్తి ఉండదు. ఇక్కడ ధర కూడా బ్రాండ్ గుర్తింపును చూచిస్తుంది. మొత్తం మీద కంపెనీ.. తన కస్టమర్లకు లగ్జరీ అందించడమే ప్రధాన ఉద్దేశ్యంగా నడుచుకుంటుంది. దీనికి తగిన విధంగానే కార్లను ఉత్పత్తి చేస్తుంది.

ఇండియా vs దుబాయ్: దుబాయ్‌లో కార్ల ధరలు ఎందుకు తక్కువ

భారతదేశంలో కార్ల ధరలు.. ఇతర దేశాల కంటే ఎక్కువగా ఉంటాయి. దీనికి సంబంధించిన చర్చలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఇదే విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇంతకీ ఇండియాలో కార్ల ధరలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి?, కారణాలు ఏమిటనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ధరలు ఎక్కువగా ఉండటానికి కారణం

భారతదేశంలో కార్ల ధరలు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం.. అధిక పన్నులు అని అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే జీఎస్టీ స్లాబ్స్ సవరించినప్పటికీ.. లగ్జరీ కార్ల ధరలలో మాత్రం ఎటువంటి మార్పు జరగలేదు. అయితే మనదేశంలో ఖరీదైన.. ఎక్కువమంది ఇష్టపడే కార్లైనా.. ల్యాండ్ రోవర్ డిఫెండర్, మెర్సిడెస్ బెంజ్ జీ-వ్యాగన్, టయోటా ఫార్చ్యూనర్ కార్లు దుబాయ్‌లో చాలా తక్కువ.

సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వైరల్ అవుతున్న ఒక వీడియాలో.. ఇద్దరు వ్యక్తులు దుబాయ్ – ఇండియాలలో కార్ల గురించి పేర్కొన్నారు. వీరి ప్రకారం ఇండియాలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ధర రూ. 98 లక్షల నుంచి రూ. 2.60 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. అయితే దుబాయ్‌లో దీని ప్రారంభ ధర రూ. 54 లక్షలు (ఎక్స్ షోరూమ్) మాత్రమే అని తెలుస్తోంది.

టయోటా ఫార్చ్యూనర్ విషయానికి వస్తే.. ఇది భారతదేశంలో మాత్రమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రజాదరణ పొందింది. దీని ధర ఇండియన్ మార్కెట్లో రూ. 33.65 లక్షల నుంచి రూ. 48.85 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. అయితే దుబాయ్‌లో దీని ధర రూ. 26 లక్షలు (ఎక్స్ షోరూమ్) మాత్రమే కావడం గమనార్హం.

ల్యాండ్ క్రూయిజర్ రూ. 64 లక్షలే!

ఇక మెర్సిడెస్ బెంజ్ జీ వ్యాగన్ గురించి చర్చిస్తే.. భారతదేశంలో దీని ధర రూ. 3.30 కోట్లు (ఎక్స్ షోరూమ్). దుబాయ్‌లో దీని రేటు రూ. 2.60 కోట్లు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా.. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రికెటర్లు మొదలైన సెలబ్రిటీలు ఈ కారును కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారు. అదే సమయంలో టయోటా ల్యాండ్ క్రూయిజర్ విషయానికి వస్తే.. దీని ధర దేశీయ విఫణిలో సుమారు రూ. 2.16 కోట్ల నుంచి 2.25 కోట్ల (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉంటుంది. ఇదే కారును దుబాయ్‌లో కొనుగోలు చేయాలంటే రూ. 64 లక్షలు వెచ్చిస్తే సరిపోతుందని సమాచారం.

చివరగా లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ ఎంపీవీ ధరల విషయానికి వస్తే.. దీని ధర భారతదేశంలో రూ. 3.42 కోట్లు. ఇదే కారు రేటు దుబాయ్‌లో రూ. కోటి మాత్రమే ఉంటుందని సమాచారం. మొత్తం మీద భారతదేశం కంటే.. దుబాయ్‌లో కార్ల ధరలు తక్కువగానే ఉంటాయని స్పష్టమైంది.

గమనించండి

నిజానికి లగ్జరీ కార్ల ధరలు భారతదేశం కంటే.. దుబాయ్‌లో కొంత తక్కువే అని దాదాపు అందరికీ తెలుసు. అయితే పైన పేర్కొన్న ధరలు కేవలం సూచన ప్రాయం మాత్రమే. ఎందుకంటే కొనుగోలుదారు ఎంచుకునే కారు వేరియంట్, ఇంజిన్ ఆప్షన్ మొదలైన వాటి మీద ధరలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని పాఠకులు తప్పకుండా గమనించాలి. అయితే కేంద్ర ప్రభుత్వం కొత్త జీఎస్టీ సవరణ చిన్న కార్ల ధరలను తగ్గించింది. కానీ హైఎండ్ కార్లు లేదా లగ్జరీ కార్ల ధరలు ఏ మాత్రం తగ్గలేదు.

కొత్త జీఎస్టీ: రూ. లక్ష కంటే తక్కువ ధరలో లభించే 5 బైకులు ఇవే..

ఇండియన్ మార్కెట్లో ఎన్నెన్ని కొత్త బైకులోచ్చినా.. కొన్ని బైకులకు మాత్రమే మంచి క్రేజ్ ఉందనే మాట అక్షర సత్యం. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. అయితే జీఎస్టీ 2.0 అమలులోకి వచ్చిన తరువాత 350 సీసీ కంటే తక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న బైకుల ధరలు కొంత తగ్గాయి. ఈ కథనంలో మనం రూ.1 లక్ష కంటే తక్కువ ధరలో లభించే ఐదు బెస్ట్ బైకుల గురించి చూసేద్దాం.

టీవీఎస్ స్పోర్ట్

భారతదేశంలో టీవీఎస్ మోటార్ కంపెనీ బైకులకు ఓ ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. కాగా టీవీఎస్ స్పోర్ట్ బండి రూ. 1 లక్ష కంటే తక్కువ ధరలో లభించే ఓ బెస్ట్ మోడల్. దీని ధర రూ. 61294 (ఎక్స్ షోరూమ్). 110 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 8.29 పీఎస్ పవర్, 8.7 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 75 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. సింపుల్ డిజైన్ కలిగిన ఈ బైక్.. ఆధునిక ఫీచర్స్ కలిగి రోజువారీ వినియోగానికి.. నగర ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దేశంలో ఈ బైకును వినియోగిస్తున్న వారు కోకొల్లలుగా ఉన్నారు.

హీరో స్ప్లెండర్ ప్లస్

అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు అయిన హీరోమోటోకార్ప్ కంపెనీకి చెందిన స్ప్లెండర్ ప్లస్ కూడా మన జాబితాలో రూ. 1 లక్ష కంటే తక్కువ ధరలో లభించే మరో బైక్. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 73527. సుమారు 80 కిమీ/లీ మైలేజ్ అందించే ఈ బైక్.. 97.2 సీసీ ఇంజిన్ ద్వారా 8 పీఎస్ పవర్ అందిస్తుంది. క్లాసిక్ డిజైన్ కలిగిన ఈ బైక్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. ఈ కారణంగానే దీనిని ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.

బజాజ్ ప్లాటినా 100

రూ. 66053 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే బజాజ్ ప్లాటినా 100 కూడా.. మనం చెప్పుకుంటున్న రూ. 1 కంటే తక్కువ ధరలో లభించే ఓ ఉత్తమ బైక్. ఇందులో 102 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ 7.9 పీఎస్ పవర్, 8.34 న్యూటన్ మీటర్ టార్క్ విడుదల చేస్తుంది. దీని మైలేజ్ లీటరుకు 70 కిమీ నుంచి 75 కిమీ మధ్యలో ఉంటుంది. ఈ బైక్ మంచి పనితీరును అందిస్తుంది. సీటింగ్ పొజిషన్ కూడా ఉత్తమంగా ఉండటం వల్ల.. ఉత్తమ రైడింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది.

హీరో హెచ్ఎఫ్ డీలక్స్

రూ. 1 లక్ష కంటే తక్కువ ధరలో లభించే మరో బైక్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 57988. ఇందులో 97.2 సీసీ ఇంజిన్ ఉంటుంది. మైలేజ్ 83 కిమీ/లీ. తక్కువ బరువును కలిగి ఉండటం వల్ల, ఇది మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. మధ్యతరగతి ప్రజలకు ఇష్టమైన బైకులలో ఇది ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్. రోజువారీ వినియోగానికి బెస్ట్ బైక్ కూడా. మంచి డిజైన్, మల్టిపుల్ కలర్ ఎంపికలలో ఈ బైక్ లభిస్తుంది.

టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్

స్టార్ సిటీ ప్లస్ అనేది.. టీవీఎస్ కంపెనీకి చెందిన పాపులర్ బైక్. దీని ధర రూ. 69126 (ఎక్స్ షోరూమ్). ఇందులోని 109.7 సీసీ ఇంజిన్ 8.08 పీఎస్ పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ మైలేజ్ లీటరుకు 70 కిమీ అని తెలుస్తోంది. ఈ బైకులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, డిజిటల్ అనలాగ్ క్లస్టర్ వంటి వాటితో ఒక ప్రీమియం లుక్ ఇస్తుంది. తక్కువ ధరలో.. కొంత స్టైలిష్ డిజైన్ కలిగి.. మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది.

గమనించండి: పైన కథనంలో వెల్లడించిన అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఆధారంగా నిర్ణయించినవే. ఆన్-రోడ్ ధరలు వేరుగా ఉన్నాయి. అంతే కాకుండా ధరలు అనేవి మీరు ఎంచుకునే వేరియంట్.. కలర్ వంటి వాటిమీద కూడా ఆధారపడి ఉంటుంది. మొత్తం మీద తక్కువ ధరలో.. కొంత ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారికి పైన చెప్పిన ఐదు బైకులు మంచి ఎంపిక అని స్పష్టంగా తెలుస్తోంది.