కొత్త జీఎస్టీ: రూ. లక్ష కంటే తక్కువ ధరలో లభించే 5 బైకులు ఇవే..

ఇండియన్ మార్కెట్లో ఎన్నెన్ని కొత్త బైకులోచ్చినా.. కొన్ని బైకులకు మాత్రమే మంచి క్రేజ్ ఉందనే మాట అక్షర సత్యం. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. అయితే జీఎస్టీ 2.0 అమలులోకి వచ్చిన తరువాత 350 సీసీ కంటే తక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న బైకుల ధరలు కొంత తగ్గాయి. ఈ కథనంలో మనం రూ.1 లక్ష కంటే తక్కువ ధరలో లభించే ఐదు బెస్ట్ బైకుల గురించి చూసేద్దాం.

టీవీఎస్ స్పోర్ట్

భారతదేశంలో టీవీఎస్ మోటార్ కంపెనీ బైకులకు ఓ ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. కాగా టీవీఎస్ స్పోర్ట్ బండి రూ. 1 లక్ష కంటే తక్కువ ధరలో లభించే ఓ బెస్ట్ మోడల్. దీని ధర రూ. 61294 (ఎక్స్ షోరూమ్). 110 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 8.29 పీఎస్ పవర్, 8.7 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 75 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. సింపుల్ డిజైన్ కలిగిన ఈ బైక్.. ఆధునిక ఫీచర్స్ కలిగి రోజువారీ వినియోగానికి.. నగర ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దేశంలో ఈ బైకును వినియోగిస్తున్న వారు కోకొల్లలుగా ఉన్నారు.

హీరో స్ప్లెండర్ ప్లస్

అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు అయిన హీరోమోటోకార్ప్ కంపెనీకి చెందిన స్ప్లెండర్ ప్లస్ కూడా మన జాబితాలో రూ. 1 లక్ష కంటే తక్కువ ధరలో లభించే మరో బైక్. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 73527. సుమారు 80 కిమీ/లీ మైలేజ్ అందించే ఈ బైక్.. 97.2 సీసీ ఇంజిన్ ద్వారా 8 పీఎస్ పవర్ అందిస్తుంది. క్లాసిక్ డిజైన్ కలిగిన ఈ బైక్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. ఈ కారణంగానే దీనిని ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.

బజాజ్ ప్లాటినా 100

రూ. 66053 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే బజాజ్ ప్లాటినా 100 కూడా.. మనం చెప్పుకుంటున్న రూ. 1 కంటే తక్కువ ధరలో లభించే ఓ ఉత్తమ బైక్. ఇందులో 102 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ 7.9 పీఎస్ పవర్, 8.34 న్యూటన్ మీటర్ టార్క్ విడుదల చేస్తుంది. దీని మైలేజ్ లీటరుకు 70 కిమీ నుంచి 75 కిమీ మధ్యలో ఉంటుంది. ఈ బైక్ మంచి పనితీరును అందిస్తుంది. సీటింగ్ పొజిషన్ కూడా ఉత్తమంగా ఉండటం వల్ల.. ఉత్తమ రైడింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది.

హీరో హెచ్ఎఫ్ డీలక్స్

రూ. 1 లక్ష కంటే తక్కువ ధరలో లభించే మరో బైక్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 57988. ఇందులో 97.2 సీసీ ఇంజిన్ ఉంటుంది. మైలేజ్ 83 కిమీ/లీ. తక్కువ బరువును కలిగి ఉండటం వల్ల, ఇది మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. మధ్యతరగతి ప్రజలకు ఇష్టమైన బైకులలో ఇది ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్. రోజువారీ వినియోగానికి బెస్ట్ బైక్ కూడా. మంచి డిజైన్, మల్టిపుల్ కలర్ ఎంపికలలో ఈ బైక్ లభిస్తుంది.

టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్

స్టార్ సిటీ ప్లస్ అనేది.. టీవీఎస్ కంపెనీకి చెందిన పాపులర్ బైక్. దీని ధర రూ. 69126 (ఎక్స్ షోరూమ్). ఇందులోని 109.7 సీసీ ఇంజిన్ 8.08 పీఎస్ పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ మైలేజ్ లీటరుకు 70 కిమీ అని తెలుస్తోంది. ఈ బైకులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, డిజిటల్ అనలాగ్ క్లస్టర్ వంటి వాటితో ఒక ప్రీమియం లుక్ ఇస్తుంది. తక్కువ ధరలో.. కొంత స్టైలిష్ డిజైన్ కలిగి.. మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది.

గమనించండి: పైన కథనంలో వెల్లడించిన అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఆధారంగా నిర్ణయించినవే. ఆన్-రోడ్ ధరలు వేరుగా ఉన్నాయి. అంతే కాకుండా ధరలు అనేవి మీరు ఎంచుకునే వేరియంట్.. కలర్ వంటి వాటిమీద కూడా ఆధారపడి ఉంటుంది. మొత్తం మీద తక్కువ ధరలో.. కొంత ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారికి పైన చెప్పిన ఐదు బైకులు మంచి ఎంపిక అని స్పష్టంగా తెలుస్తోంది.