Home Blog Page 120

జగపతి బాబును.. రమ్యకృష్ణ ఏమని పిలిచేదో తెలుసా?

0

హీరో జగపతి బాబు అంటే.. ఒకప్పుడు అందరు మెచ్చుకునే ఒక అందమైన కథనాయకుడు. ఇప్పటికీ కూడా అదే అందం, అభినయంతో సినిమాలలో ప్రత్యేక పాత్రల్లో తెలుగు ప్రేక్షకులనే కాకుండా.. దేశం అంతటా ఎంతోమందిని అలరిస్తున్నాడు. ఆయన ఆనాటి సినిమాలు మంచి సెంటిమెంట్ అండ్ ఎమోషనల్‌గా ఉండటంతో.. కుటుంబ సమేతంగా మూవీ వీక్షించేవారు.. అంతగా ఇష్టపడేవారు.

ఇద్దరి మధ్య స్నేహం..

జగపతిబాబు ఎంతోమంది ప్రతిభ కలిగిన హీరోయిన్లతో కూడా కలిసి నటించాడు. ఈ ప్రయాణంలో వారి మధ్య స్నేహపూర్వకమైన సంబంధాలు ఏర్పడటం అనేది సహజం. ఆ చనువుతో ఒకరిని ఒకరు ఎన్ని పేర్లతో అయినా ఆట పట్టిస్తుంటారు. సరదా సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. వారిలో రమ్యకృష్ణ కూడా ఒకరు. వీరిద్దరూ కూడా వ్యక్తిగతంగా చాలా సన్నిహితులు & మంచి స్నేహితులు. ఇటీవల జరిగిన జయమ్ము నిర్ఛయమ్ము రా అనే టీవీ షోలో వీరిద్దరి సాన్నిహిత్యానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకి వచ్చాయి.

అలా.. శుభలగ్నం

జగపతిబాబు కెరియర్ ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలో ఒక కొత్త సినిమాలో.. ప్రొడ్యూసర్ అశ్వని దత్, డైరెక్టర్ కృష్ణారెడ్డి.. జగపతిబాబుకు ఆఫర్ ఇస్తే, తనకి డేట్స్ ఖాళీ లేవు అని వదులుకునేద్దాం అనుకున్నారట. కానీ అదే సమయంలో రమ్యకృష్ణ వచ్చి.. ఏంటి నీకు పిచ్చి పట్టిందా.. నీకు డేట్స్ నేను అడ్జెస్ట్ చేస్తాను. నువ్వు ఈ సినిమా ఒప్పుకో అని బలవంతం చేసారట. అప్పుడు ఇంక తప్పక ఒప్పుకోవాల్సి వచ్చి ఒప్పేసుకున్నారట జగపతిబాబు. ఆ సినిమా పేరే శుభలగ్నం. అది తన జీవితాన్నే టర్నింగ్ చేసిన మూవీ అయింది. ఈ విషయాన్ని జగపతి బాబు స్వయంగా చెప్పుకున్నారు.

కోపం వస్తే..

అంతే కాకుండా.. జగపతి ఏదైనా అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టినా, తింగరి పనులు చేసినా.. రమ్యకృష్ణ తిట్టేస్తుందట. నాకు ఒక క్రేజీ ఫ్రెండ్ అంటే అది జగపతినే అని రమ్యకృష్ణ తెలిపింది. మాములుగా అయితే ఎవరైనా ఒకరినొకరు పేర్లతో పిలుచుకుంటారు. అసలు పేరుతో కాకపోయినా కనీసం ముద్దు పేరుతో అయినా పిలుచుకుంటారు. కానీ ఇక్కడ ఆశ్చర్యంగా రమ్యకృష్ణ జగపతిబాబును ఏ పేరుతో కూడా పిలవదట. నిజంగా క్రేజీ కదా. ఎప్పుడైనా కోపం వస్తే ఒరేయ్, అరేయ్ అని పిలుస్తారట.. లేదా ప్రేమగా బంగారం అని పిలుస్తుంది అని తెలిసింది. అది మంచి లేదా చాలా దగ్గర స్నేహం కలిగిన మనిషిని మాత్రమే అలా పిలువగలుగుతాము అని అభిప్రాయపడ్డారు.

పెళ్ళికి ముందు..

ఈ సందర్బంగా రమ్యకృష్ణ తన ప్రేమ గురించి చెప్పుకొచ్చింది. కృష్ణ వంశీతో తన జీవితం చాలా బాగుందని, వాళ్ల ఒక్కగానొక్క కొడుకుతో కుటుంబంలో సంతోషంగా ఉన్నామని చెప్పుకొచ్చింది. పెళ్ళికి ముందు చిన్న చిన్న గొడవలు వచ్చాయి గానీ పెళ్లి అయిన తరువాత ఎటువంటి గొడవలు లేవని అంతా హ్యాపీగా సాగిపోతున్నదని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి చూస్తే జగపతిబాబుకి, రమ్యకృష్ణకి ఎంత మంచి స్నేహపూర్వకమైన అనుబంధం ఉందో అర్థమవుతుంది. ఇలాంటి స్నేహం అందరికి ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా.

నవంబర్ 7న తిరువీర్ ‘ప్రీ -వెడ్డింగ్ షో’: హీరో జీవితంలో గుర్తుండిపోతుందా?

0

ప్రీ-వెడ్డింగ్ అంటే ఇదేదో నిజంగా తిరువీర్‌కు మ్యారేజ్ అనుకునేరు. తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన కొత్త సినిమా పేరు ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో. ఈ చిత్రం 2025 నవంబర్ 07వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకి రానున్నది. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో.. నరేంద్ర, రోహన్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పప్పేట్ షో ప్రొడక్షన్ & బై 7పీఎంల పతాకంపై సందీప్ అగరం, అష్మిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కో-ప్రొడ్యూసర్‌గా కల్పనా వ్యవహరిస్తున్నారు.

కామెడీ & ఎమోషనల్

“ది గ్రేట్ ప్రీ – వెడ్డింగ్ షో ” మూవీ ట్రైలర్‌ను మూవీ టీమ్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇది ఎక్స్‌ట్రార్డినరీ కామెడీ మరియు కొంచం ఎమోషనల్‌గా నడిచే విధంగా కనిపిస్తుంది. తిరువీర్ ఇప్పటి వరకు పూర్తి కామెడీ మూవీలలో కనిపించలేదు.. కానీ ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఫుల్ ఫన్ ఇచ్చాడని అనిపిస్తోంది. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ వంటివన్నీ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతోంది.

కథ ఎలా ఉంటుందంటే?

హీరో ఒక ఫోటోగ్రాఫర్, అతనికి ఒక ఫోటో స్టూడియో ఉంటుంది. అన్ని కార్యక్రమాలకి ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉంటాడు. అలాగే పెళ్లి చేసుకోబోయే ఒక కొత్త జంట.. ప్రీ-వెడ్డింగ్ ఫోటోలు, వీడియోలు తీయ్యడం కోసమని (తిరువీర్)హీరోని సంప్రదిస్తారు. షూటింగ్ అంత అయిపోయిన తరువాత డిజిటల్ కెమెరాలో ఉండే చిప్ పోగొట్టేస్తారు. అప్పుడు ఆ ఫోటోస్ కోసం పెళ్ళికొడుకు ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉంటాడు. అతనికి ఇస్తాను, ఇస్తాను అని అబద్దం చెప్పి మేనేజ్ చేస్తుంటాడు. ఆ సీన్స్ చాలా ఆసక్తికరంగా, ఫుల్ ఫన్నీగా అనిపిస్తాయి.

వీటన్నిటి మధ్యలో హీరో ఒక అమ్మాయితో ప్రేమలో పడుతాడు. ఆ అమ్మాయిని మెప్పించడం కోసమని తన వెంటపడటం, లేనిపోని పాట్లు పడటం అనేది చూడటానికి చాలా కామెడీగా, గమ్మత్తుగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే పోయిన చిప్ కోసం, తను ప్రేమించిన అమ్మాయి కోసం హీరో పడే పడరాని పాట్లు ఇవన్నీ కలిపి సినిమా స్థాయిని మరింత పెంచేసాయి. ఇది ఖచ్చితంగా మంచి హిట్ ఫిలిమ్ అవుతుందని మాత్రం అర్థమవుతున్నది.

నటుడు తిరువీర్ గురించి

పలాస, జార్జి రెడ్డి, మసుధ, పరేషాన్ లాంటి ఎన్నో సినిమాల్లో తిరువీర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తను చేసిన ప్రతి సినిమా, ప్రతి పాత్రకు ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంది. అన్ని మంచి క్యారెక్టర్స్ చేసినప్పటికి.. ప్రధాన కథానాయకుడిగా చేసినవి ఒకటి రెండే ఉన్నాయి. ఇప్పుడు ది గ్రేట్ ప్రీ – వెడ్డింగ్ షోలో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఇది బిగ్ సక్సెస్ అవుతుంది అని కొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా మననం కూడా తిరువీర్ కెరియర్‌లో మంచి విజయం సాధించాలని కోరుకుందాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో 2025 నవంబర్ 7వ (శుక్రవారం) తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ తరువాత ఈ సినిమా ఏ స్థాయిలో ఆడింది. దీనికి వచ్చిన కలెక్షన్స్ ఎంత అనేవి అధికారికంగా వెల్లడవుతాయి.

జపాన్ మొబిలిటీ షో 2025: సరికొత్త హోండా బైక్ ఇదే.. చూశారా?

ఆటోమొబైల్ రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ప్రపంచంలోని చాలా దేశాలు ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను లాంచ్ చేస్తూ.. ఈ రంగంలో ప్రగతిపథంలో నడిపిస్తూ ఉన్నాయి. కంపెనీలు తయారు చేసిన లేదా రూపొందించిన వాహనాలను ప్రదర్శించడానికి అప్పుడప్పుడు కొన్ని ఆటోషోలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ప్రారంభంలో మనదేశంలో ఆటో ఎక్స్‌పో, భారత్ మొబిలిటీ ఆటో షో వంటివి నిర్వహించడం జరిగాయి. ఇప్పుడు జపాన్ మొబిలిటీ షో 2025 అట్టహాసంగా ప్రారంభమైంది.

జపాన్ మొబిలిటీ షో 2025

2025 అక్టోబర్ 30 నుంచి నవంబర్ 09వరకు టోక్యోలో జరిగి జపాన్ మొబిలిటీ షో 2025 కార్యక్రమంలో.. ప్రపంచ నలుమూలల నుంచి అనేక దిగ్గజ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. ఈ కార్యక్రమంలో సుమారు 500 కంపెనీలు పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. సంస్థల జాబితాలో.. టయోటా, హోండా, మిత్సుబిషి, నిస్సాన్, లెక్సస్, హ్యుందాయ్, మినీ, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ మొదలైనవి ఉన్నాయి.

హోండా అవుట్‌లియర్ కాన్సెప్ట్

జపాన్ మొబిలిటీ 2025 కార్యక్రమంలో హోండా మోటార్‌సైకిల్స్ కంపెనీ.. సరికొత్త బైక్ హోండా అవుట్‌లియర్ కాన్సెప్ట్ ఆవిష్కరించింది. ఇది ఇప్పుడున్న హోండా బైకుల కంటే కూడా చాలా భిన్నంగా ఉండటం చూడవచ్చు. జపాన్ కంపెనీ అయిన హోండా మోటార్‌సైకిల్స్.. ఇప్పుడు లాంచ్ చేసిన బైకును.. భవిష్యత్తులో మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేయనుంది. అయితే రాబోయే కంపెనీ బైకులు ఎలా ఉండబోతున్నాయని చెప్పడానికి దీనిని ఈ వేదికగా (జపాన్ మొబిలిటీ షో 2025) ప్రదర్శించింది. ఇది ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అని తెలుస్తోంది.

హోండా అవుట్‌లియర్ కాన్సెప్ట్.. 2024 ఈఐసీఎమ్ఏ కార్యక్రమంలో.. ఆవిషకరించబడిన ఈవీ ఫన్ కాన్సెప్ట్ మరియు ఈవీ అర్బన్ కాన్సెప్ట్ వంటి మోడల్స్ ఆధారంగా నిర్మించబడింది. ఈ బైక్ యొక్క డిజైన్.. తప్పకుండా వాహన ప్రేమికులను ఆకట్టుకుంటుంది. ముందుకు సాగిన ఫ్రంట్ వీల్.. కంఫర్టబుల్ సీటు వంటివి మాత్రమే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇందులో ఎలాంటి ఫీచర్స్ ఉండనున్నాయి, బ్యాటరీ కెపాసిటీ, రేంజ్ వంటి చాలా వివరాలు ప్రస్తుతానికి వెల్లడికాలేదు. కంపెనీ ఈ వివరాలను భవిష్యత్తులో తప్పకుండా వెల్లడిస్తుంది.

2030 నాటికి లాంచ్!

ఫ్యూచరిస్టిక్ అవుట్‌లియర్ కాన్సెప్ట్ బైక్.. ముందు, వెనుక రెండు ఎలక్ట్రిక్ బ్యాటరీలను కలిగి ఉంటుంది. కాబట్టి కారులో మాదిరిగానే.. ఈ బైక్ ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ పొందుతుంది. ఇలాంటి ఫీచర్ బైకులో.. అందుబాటులోకి రావడం బహుశా ఇదే మొదటిసారి కావడం గమనార్హం.హోండా గోల్డ్‌వింగ్ బైకులోని.. డబుల్ విష్బోన్ స్వింగ్ ఆర్మ్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. డిస్క్ బ్రేకులు ముందు, వెనుక ఉంటాయి. సస్పెన్షన్ విషయానికి వస్తే.. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక మోనోషాక్ ఉంటాయి. ఈ బైక్ 2030 నాటికి మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అంతకంటే ముందే లాంచ్ చేయడానికి ప్రయత్నిస్తామని కంపెనీ వెల్లడించింది.

ఇతర కంపెనీల ప్రదర్శన

హోండా మోటార్‌సైకిల్ కంపెనీ.. మాత్రమే కాకుండా జపాన్ మొబిలిటీ షో 2025 కార్యక్రమంలో హోండా కార్లు, టయోటా ఉత్పత్తులు, లెక్సస్, మారుతి సుజుకి కార్లు కూడా ప్రదర్శించబడ్డాయి. దీన్నిబట్టి చూస్తే రానున్న కాలంలో చాలా కొత్త వాహనాలు మార్కెట్లో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయని అర్థమవుతోంది.

రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలు

మోంథా తుఫాను.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తీరప్రాంతాలను అల్లకల్లోలం చేసింది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకున్నప్పటికీ.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అతి ఈ రోజు తుఫాన్ బలహీనపడే అవకాశం ఉంది. దీంతో తెలంగాణాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా బుధవారం రోజు మొత్తం మీద తెలంగాణాలో ఎడతెరిపి లేని వర్షాలు కురిశాయి. బహుశా ఈ రోజు కూడా పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏపీలో పరిస్థితులను ఆరా తీసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. కొన్ని కీలక సూచనలు చేశారు.

తుఫాన్ ప్రభావం.. పవన్ కళ్యాణ్ సూచనలు

రాష్ట్రంలోని సుమారు 1583 గ్రామాలపై తుఫాన్ ప్రభావం పడినట్లు అధికారులు.. పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. 125 చోట్ల రహదారులు పాడైనట్లు పేర్కొన్నారు. తుఫాన్ సమయంలో అధికార యంత్రంగా, సంబంధిత అధికారులు బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంది. ముఖ్యంగా తాగునీటి వసతి కల్పించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. దెబ్బతిన్న రోడ్లను తొందరగా బాగు చేయాలని ఆదేశించారు. సూపర్ క్లోరినేషన్, శానిటైజేషన్ వంటి కార్యక్రమాలను కూడా చేపట్టాలని వివరించారు.

ప్రత్యేక బృందాల ఏర్పాటు

తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో.. తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతాయి. వరదనీరు తగ్గేవరకు ప్రజలను కావలసిన నిత్యావసరాలను ఏర్పాటు చేయాలి. తాగునీటిని అందించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. గ్రామాల్లో ప్రత్యేకంగా శానిటైజేషన్ బృందాలను ఏర్పాటు చేయాలి. తాగునీరు కలుషితమైతే.. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి దీనిపై అధికారులు తప్పకుండా శ్రద్ద వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవరకు.. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు.

పునరావాస కేంద్రాల్లో ఉండేలా..

రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ శానిటైజేషన్ బృందాలను ఏర్పాటు చేయాలి. పారిశుధ్య పనులను వేగవంతం చేయాలి. దెబ్బతిన్న రోడ్లు, వంతెనలను తక్షణమే బాగుచేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అంతే కాకుండా తుఫాన్ బలహీన పడిన తరువాత కూడా.. పరిస్థితులు చక్కబడే వరకు ప్రజలను పునరావాస కేంద్రాల్లో ఉండేలా చూసుకోవాలని అన్నారు. మోంథా తుఫాన్ తీరందాటే సమయంలో వర్షాలు భీభత్సంగా కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దీనికి అధికార యంత్రంగా తోడుగా ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

మోంథా తుఫాన్

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారి.. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో భారీ నష్టాన్ని కలిగింది. వేలఎకరాల పంట నష్టం జరిగింది. రోడ్లు దెబ్బతిన్నాయి. ప్రజారవాణా చాలా చోట్ల ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఎక్కడ చూసినా నీటిమయమే. అయితే ఇప్పటివరకు ఎంత నష్టం జరిగిందనే విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. కానీ పరిస్థితులు చూస్తుంటే.. ఊహకందని నష్టం జరిగిందని స్పష్టంగా అర్థమవుతోంది.

తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను బాగుచేయడానికి ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకుంటోంది. ఎవరు ఎలాంటి చర్యలు తీసుకున్న ప్రకృతి వైపరీత్యాలను ఆపడం మానవాతీతం అనే చెప్పాలి. అయితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికి కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం సహకరించింది. ఇదే సమయంలో పరిస్థితులను చక్కదిద్దడానికి.. తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీచేసారు.

పాస్‌పోర్ట్ సేవా 2.0: చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌.. ఎలా పొందాలంటే?

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నివసిస్తున్న.. ప్రవాస భారతీయుల కోసం, దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా జీపీఎస్‌పీ 2.0 కింద గ్లోబల్ పాస్‌పోర్ట్ సేవా పాస్‌పోర్ట్ ప్రారంభించింది. దీనిద్వారా మరింత వేగవంతమైన, సురక్షితమైన పాస్‌పోర్ట్ ధరఖాస్తు అనుభవం పొందవచ్చు. ఈ సరికొత్త పాస్‌పోర్ట్ సేవా 2.0 గురించి, ఎలా అప్లై చేసుకోవాలని అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఎలక్ట్రానిక్ చిప్ పాస్‌పోర్ట్

పాస్‌పోర్ట్ సేవా 2.0 కింద చిప్ ఎనేబుల్డ్ ఈ-పాస్‌పోర్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇది చూడటానికి సాధారణ పాస్‌పోర్ట్ మాదిరిగా అనిపించినప్పటికీ.. ఇందులో ఎలక్ట్రానిక్ చిప్ ఉంటుంది. ఈ చిప్‌లో పాస్‌పోర్ట్ హోల్డర్ బయోమెట్రిక్ డేటా, వ్యక్తిగత వివరాలు, డిజిటల్ సిగ్నేచర్ వంటివి సురక్షితంగా ఉంటాయి. దీంతో కౌంటర్‌ఫీటింగ్ మరియు మోసాల నుంచి బయటపడొచ్చు.

అదనపు ఖర్చు లేకుండా

యూఏఈలో నివసిస్తున్న.. భారతీయులకు పాస్‌పోర్ట్ సేవలను మరింత పారదర్శకంగా, యూజర్ ఫ్రెండ్లీగా మరియు సమర్థవంతంగా మార్చడమే లక్ష్యంగా ఈ అప్‌గ్రేడ్ తెచ్చినట్లు కాన్సులేట్ వెల్లడించింది. ఇప్పుడు వినియోగదారు ఈ జీపీఎస్‌పీ 2.0 ద్వారా ఆన్‌లైన అప్లికేషన్ డాక్యుమెంట్స్, ఐసీఏఓ కంప్లైంట్ ఫొటోస్, సంతకాలు వంటివి సిస్టమ్‌లోకి నేరుగా అప్‌లోడ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా పాస్‌పోర్ట్ కేంద్రం దగ్గర ప్రజలు వేచి ఉండాల్సిన సమయం తగ్గుతుంది. అంతే కాకుండా అప్లికేషన్ ఫారాలను తిరిగీ టైప్ చేయాల్సిన అవసరం లేకుండా.. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండానే.. చిన్న చిన్న సవరణలు సులభంగా చేసుకోవచ్చు.

దుబాయ్, అబుదాబిలలోనే భారత రాయబర కార్యాలయాల్లో ఈ-పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసుకోవచ్చు. కొత్త విధానం ద్వారా అప్లై చేసుకోవడంతో.. ప్రాసెసింగ్ వేగవంతం అవుతుంది. ఇలాంటి ఈ-పాస్‌పోర్డ్ ద్వారా ఇమ్మిగ్రేషన్ చెక్‌పాయింట్ల వద్ద ఆటోమేటెడ్ వెరిఫికేషన్ కూడా సాధ్యమవుతుంది. నిజానికి 2022లోనే భారత ప్రభుత్వం.. దేశంలో ఈ-పాస్‌పోర్ట్స్ ప్రారంభించింది. ఇప్పుడు విదేశాలకు విస్తరిస్తోంది.

యూఏఈలో ఈ-పాస్‌పోర్ట్ కోసం ఎలా అప్లై చేయాలంటే?

  • అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి.. మీరు ఉన్న ప్రదేశం సెలక్ట్ చేసుకోవాలి.
  • కొత్త యూజర్ అయితే.. రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేసి, ఈఈమెయిల్, పాస్‌వర్డ్ వంటి వాటితో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
  • ఇలా చేసిన తరువాత అకౌంట్ యాక్టివేషన్ లింక్ మీ ఈమెయిల్‌కు వస్తుంది. దాన్ని క్లిక్ చేయడంతో అకౌంట్ యాక్టివేట్ అవుతుంది.
  • అప్లికేషన్ హోల్డర్.. హోమ్ పేజీలోని కొత్త అప్లికేషన్ కోసం సంబంధిత ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్ ఫిల్ చేసిన తరువాత.. ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసిన ఫామ్ ప్రింటవుట్ తీసుకోండి.
  • ప్రింటవుట్ తీసుకున్న తరువాత.. అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుని, మీకు దగ్గరలో ఉన్న బీఎల్ఎస్ కేంద్రాన్ని సెలక్ట్ చేసుకోండి.

అపాయింట్‌మెంట్ రోజున తీసుకెళ్లాసిన డాక్యుమెంట్స్

  • అప్లికేషన్ ఫామ్ ప్రింటవుట్
  • మీ పాత పాస్‌పోర్ట్
  • యూఏఈ రెసిడెన్సీ వీసా పేజీ కాపీ
  • ఎమిరేట్స్ ఐడీ కాపీ, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు (వైట్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి). చెల్లించాల్సిన ఫీజు మీరు ఎంచుకునే సెంటర్ మీద ఆధారపడి ఉంటుంది.
  • బయోమెట్రిక్ పూర్తయిన తరువాత.. మీ అప్లికేషన్ భారత రాయభార కార్యాలయానికి పంపిస్తారు.
  • పాస్‌పోర్ట్ ప్రాసెసింగ్ మొత్తం పూర్తయిన తరువాత.. చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్ ప్రింట్ చేస్తారు. 2-3 వారాల్లో దీనిని మీరు పొందవచ్చు.

నవంబర్ 1 నుంచి కొత్త రూల్: అలాంటి వాహనాలకు నో ఎంట్రీ!

దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రత గణనీయంగా పెరిగిపోతోంది. శీతాకాలం సమీపిస్తున్న సమయంలో.. ఎయిర్ పొల్యూషన్ ఎక్కువై.. వాతావరణం కలుషితమైపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని సీఏక్యూఎం (కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండ్ అడ్జోయినింగ్ ఏరియాస్) ఒక కీలక ప్రకటన చేసింది.

నవంబర్ 1నుంచి కొత్త రూల్

ఢిల్లీలో రిజిస్టర్ చేయని (ఢిల్లీ బయట లేదా ఇతర ప్రాంతాల్లో రిజిస్టర్ అయిన) మరియు బీఎస్-VI ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా లేని కమర్షియల్ గూడ్స్ వెహికల్స్ (వాణిజ్య వస్తువుల వాహనాలు) 2025 నవంబర్ 01 నుంచి ఢిల్లీలోకి ప్రవేశించకూడదని సీఏక్యూఎం ప్రకటనలో అధికారికంగా వెల్లడించింది. డీజిల్‌తో నడిచే.. సరుకును రవాణా చేసే వాహనాల నుంచి ఉద్గారాలు అధికంగా రిలీజ్ అవుతాయి. కాబట్టి వాటిని నిషేధించడం వల్ల నగరంలో వాయు కాలుష్య తీవ్రత బాగా తగ్గుతుందని స్పష్టం చేసింది.

అలాంటి వాహనాలకు పరిమితులు లేదు!

కమర్షియల్ గూడ్స్ వెహికల్స్ ఢిల్లీలో రిజిస్టర్ అయి ఉంటే.. అలాంటి వాహనాలకు ఎలాంటి పరిమితులు ఉండవు. అక్టోబర్ 31 తరువాత కూడా నగరంలో తిరగవచ్చు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) యొక్క వివిధ దశల కింద.. వాణిజ్య వస్తువుల వాహనాలు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలని సీఏక్యూఎం వెల్లడించింది. 2025 అక్టోబర్ 17న జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

కాలుష్యం తగ్గించడానికే!

వాయు కాలుష్య కారకాలను తగ్గించాలనే ఉద్దేశ్యంతో.. 2021లోని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ సెక్షన్ 12(1) కింద ఢిల్లీలో.. ఇతర ప్రాంతాల్లో రిజిస్టర్ అయిన వాహనాలు తిరగకూడదు. అయితే ఢిల్లీలో రిజిస్టర్ అయిన.. కమర్షియల్ గూడ్స్ వాహనాలకు ఎలాంటి నిషేధం లేదు. గాలి నాణ్యతను బట్టి.. భవిష్యత్తులో ఈ నిర్ణయాలలో మార్పులు జరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ నియమాన్ని తప్పకుండా అమలు చేయాలి. కమర్షియల్ గూడ్స్ వాహనదారులు కూడా ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి.

బీఎస్-IV వాహనాల నిషేధం

ఇప్పటికే బీఎస్-IV వాహనాల నిషేధంపై ఢిల్లీ ప్రభుత్వం విధించిన ఆంక్షలపై సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. బీఎస్-IV వాహనాలపై ఆంక్షలు తగదని వెల్లడించింది. ఇప్పుడు మళ్లీ కమర్షియల్ గూడ్స్ వాహనాలపై నిషేధం విధించడం సమంజసం కాదని.. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్‌కు చెందిన భీమ్ వాధవా పేర్కొన్నారు. ఈ విషయంపై చర్చించనున్నట్లు.. ఆల్ ఇండియా మోటార్ అండ్ గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్‌కు చెందిన రాజేంద్ర కపూర్ తెలిపారు. అవసరమైతే మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు కూడా తాము సిద్ధమని అన్నారు.

ఢిల్లీలో గాలి కాలుష్యం

శీతాకాలం ఇంకా పూర్తిగా మొదలవ్వనేలేదు. కానీ ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ బాగా తగ్గిపోయింది. కాలుష్య కారకాలు.. నగరంలో మేఘాలమాదిరిగా వ్యాపించాయి. రాజధానిలో గాలి నాణ్యత 304 వద్ద ఉందని సీపీసీబీ వెల్లడించింది. గత సోమవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 301 గా ఉందని తెలిసింది. దీన్నిబట్టి చూస్తే.. అక్కడ పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. సీపీసీబీ ప్రకారం.. 0 నుంచి 50 వరకు ఉంటే ఎయిర్ క్వాలిటీ మంచిది, 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరం, 101 నుంచి 200 వరకు ఉంటే మధ్యస్థం, 201 నుంచి 300 వరకు ఉంటే పేలవమైనది.. ఇంతకంటే ఎక్కువ ఉంటే ప్రమాదం.

సినిమాల్లోకి మహేష్ బాబు మేనకోడలు: వెండితెర వెయిటింగ్!

0

దివంగత నటుడు.. తెలుగు సినిమా సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో వ్యక్తి వెండితెరపై కనిపించడానికి సిద్ధమవుతోంది. మహేష్ బాబుకు స్వయానా మేనకోడలు అయిన జాన్వీ స్వరూప్ త్వరలోనే.. సినిమాల్లో నటించే అవకాశం ఉందని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

మహేష్ బాబు మేనకోడలు

నటుడు మహేష్ బాబు అక్క మంజుల ఘట్టమనేని & సంజయ్ స్వరూప్ దంపతుల కుమార్తె జాన్వీ స్వరూప్. జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా మంజుల కుమార్తె సినీరంగ ప్రవేశానికి సంబంధించిన విషయాన్ని వెల్లడించింది. ”నా చిన్న కుమార్తె జాన్వీ స్వరూప్.. తన సొంత వెలుగులోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె వెలుగు వారసత్వంలోనే ఉంది.. ఇప్పుడు అది ప్రకాశించే సమయం వచ్చేసింది. ప్రపంచం కూడా ఆమె ప్రతిభను త్వరలోనే గుర్తిస్తుంది. ఐ లవ్ యూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు జాను” అంటూ మంజుల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.

తల్లుదండ్రులు నటులే!

నిజానికి జాన్వీ తల్లిదండ్రులైన మంజుల, సంజయ్ స్వరూప్ ఇద్దరూ కూడా నటులే కావడం గమనించదగ్గ విషయం. మంజుల.. సేవకుడు, మళ్లీ మొదలైంది, ఆరెంజ్, కావ్యాస్ డైరీస్, మంత్ ఆఫ్ మధు, హంట్ వంటి సినిమాల్లో నటించింది. మనసుకు నచ్చింది అనే సినిమాకు ఈమె దర్శకురాలిగా కూడా పనిచేశారు. ఇక సంజయ్ స్వరూప్ విషయానికి వస్తే.. ఆయన చల్ మోహనరంగ, అర్జున్ రెడ్డి వంటి సినిమాల్లో కనిపించారు. ఇప్పుడు వీరి ముద్దుల కుమార్తె.. వేడితెర మీద కనిపించడానికి సిద్ధంగా ఉందని చెబుతున్నారు.

జాన్వీ స్వరూప్.. సినిమాల్లో రానున్నట్లు క్లారిటీ వచేసినప్పటికీ.. ఎలాంటి సినిమాల్లో నటించనున్నారు, ఏ హీరో సరసన నటించనున్నారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. అయితే ఈమె ఇప్పటికే మనసుకు నచ్చింది అనే సినిమాలో ఓ సన్నివేశంలో కనిపించారు. ఇకపై కథానాయకి (హీరోయిన్)గా కనిపించబోతున్నారు. బహుశా.. ఈమెను సినిమా ప్రపంచానికి పరిచయం చేయడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు భావిస్తున్నారు.

సినిమా రంగంలో వారసత్వం

చిత్ర పరిశ్రమలో వారసత్వం కొత్తేమీ కాదు. కష్టపడి పైకొచ్చిన హీరోల కంటే.. ఆ హీరోల పేరుతో తెరమీదకు వచ్చినవారు చాలామందే ఉన్నారు. ఈ జాబితాలో మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, దగ్గుపాటి ఫ్యామిలీ మొదలైనవన్నీ ఉన్నాయి. ఇందులో హీరోలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. హీరోయిన్స్ మాత్రం తక్కువనే చెప్పాలి. అయితే ఇప్పుడు.. జాన్వీ స్వరూప్ త్వరలోనే వెండితెర మీద కనిపించనుంది.

జాన్వీ స్వరూప్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు.. శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ శుభసందర్భంలో.. ఈమె సినిమాల్లోకి రానున్నట్లు వెల్లడించిన వార్త.. మహేష్ బాబు అభిమానుల్లో ఒకింత ఆనందాన్ని కలిగిస్తోంది. నెటిజన్లు కూడా ఈమెకు సినిమాల్లో మంచి భవిష్యత్తు ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. మొత్తం మీద మహేష్ బాబు మేనకోడలు తెరమీద ప్రేక్షకులను అలరించబోతుందన్నమాట. కాబట్టి ఇక ఈమె ఏ సినిమాలో కనిపించబోతుందో తెలుసుకోవాలంటే.. ఇంకా కొంత కాలం వేచి చూడాల్సిందే.

ఖరీదైన కారు కొన్న శంకర్ మహదేవన్: దీని గురించి తెలుసా?

బాలీవుడ్ నటి, బీజేపీ నాయకురాలు హేమ మాలిని ఎంజీ ఎం9 కొనుగోలు చేసిన తరువాత.. ప్రముఖ సంగీత విద్వాంసుడు శంకర్ మహదేవన్ అదే మోడల్ కారును కొనుగోలు చేశారు. ఇంతకీ ఆ కారు ధర ఎంత?, దాని వివరాలు ఏమిటి?, వీరిరువురూ కాకుండా.. ఇంకెవరైనా కొనుగోలు చేశారా అనే విషయాలను ఈ కథనంలో క్షుణ్ణంగా తెలుసుకుందాం.

ఎంజీ ఎం9 ఎలక్టిక్ కారు

శంకర్ మహదేవన్ కొనుగోలు చేసిన ఎంజీ ఎం9 ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 69.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 7 సీటర్ కారు. కియా మోటార్స్ ఈ కారును ఈ మధ్యలో భారతదేశంలో విక్రయించడం మొదలుపెట్టింది. శంకర్ మహదేవన్ కారు కొనుగోలు చేయడానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆయన కుటుంబాన్ని కూడా చూడవచ్చు.

బ్లాక్ కలర్ ఎంజీ ఎం9

కొత్త కారును కొనుగోలు చేసిన తరువాత.. హిందూ సంప్రదాయం ప్రకారం, పూజాది కార్యక్రమాలు చేసిన తరువాత.. శంకర్ మహదేవన్ & ఆయన భార్య రెండవ వరుసలో కూర్చున్నారు. ముందువైపు ఆయన కుమారు కూర్చున్నారు. విలాసవంతమైన క్యాబిన్, కారు డిజైన్ అన్నీ కూడా వారిని ఎంతగానో ఆకట్టుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. వీరు మెటల్ బ్లాక్ కలర్ కారును కొనుగోలు చేశారు. కాగా కంపెనీ ఈ కారును బ్లాక్ రూఫ్.. పెర్ల్ వైట్ & బ్లాక్ రూఫ్ కాంక్రీట్ గ్రే అనే రంగులలో కూడా విక్రయిస్తోంది.

డిజైన్ & ఇంటీరియర్ ఫీచర్స్

కియా ఎంజీ ఎం9 ఎలక్ట్రిక్ కారు.. బోల్డ్ ఫ్రంట్ ఎండ్‌తో, బోల్డ్ డిజైన్ పొందుతుంది. ట్రాపెజోయిడల్ మెష్ గ్రిల్ కూడా ఇందులో చూడవచ్చు. స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, కనెక్టెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్స్ కూడా ఇందులో కనిపిస్తాయి. మొత్తం మీద డిజైన్ చాలా అద్భుతంగా ఉందని తెలుస్తోంది. ఈ కారు డిజైన్ చూపరులను ఒక్క చూపుతోనే ఆకట్టుకుంటోంది.

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే.. విశాలమైన & విలాసవంతమైన ఇంటీరియర్ ప్రయాణికులకు లేదా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అడ్జస్టబుల్ సీటింగ్, మసాజ్ ఫంక్షన్స్, వెంటిలేషన్ అన్నీ కూడా గొప్పగా ఉన్నాయి. యాచ్ స్టైల్ డ్యూయెల్ సన్‌రూఫ్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, 13 స్పీకర్ ఆడియో సిస్టం, సబ్ వూఫర్స్, యాంప్లిఫైయర్ కూడా ఈ కారులో ఉన్నాయి.

వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేసే 12.3 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం. 7 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఈ సిమ్ బేస్డ్ టెక్నాలజీ వంటి.. కార్ కనెక్టెడ్ టెక్నాలజీ, ముందు.. వెనుక వరుసలో ఆర్మ్‌రెస్ట్‌లు, 360 డిగ్రీ కెమెరా, పవర్ స్లైడింగ్ డోర్స్ మొదలైనవన్నీ ఈ కారులో ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే.. ఈ కారులో 7 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటివి ఉన్నాయి.

బ్యాటరీ & రేంజ్

శంకర్ మహదేవన్ కొనుగోలు చేసిన కొత్త ఎంజీ ఎం9 ఎలక్ట్రిక్ కారు 90 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 245 హార్స్ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు ఒక ఫుల్ ఛార్జితో 548 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా కంపెనీ ఈ కారు కోసం 11 కేడబ్ల్యు వాల్ బాక్స్ ఛార్జర్‌తో పాటు.. 3.3 కేడబ్ల్యు ఫోర్టబుల్ ఛార్జర్‌ను అందిస్తుంది. కాబట్టి ఛార్జింగ్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.

మమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు: పా. రంజిత్‌ కీలక వ్యాఖ్యలు!

0

మారి సెల్వరాజ్ దర్శకత్వంలో పా. రంజిత్ నిర్మించిన బైసన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తమిళనాడులో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమంలో పా. రంజిత్ మాట్లాడుతూ.. చాలా ఎమోషనల్ అయ్యాడు. తమిళ ప్రేక్షకులు, దర్శకులు, రిపోర్టర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్, ట్రోలర్స్, నెటిజన్స్ ఇలా అందిరిపైనా ఆయన తీవ్రంగా ఆవేదనతో స్పందించారు. అసలు ఎందుకు ఇలా మాట్లాడాల్సివచ్చిందంటే..

మేము కారణం అనడం సరికాదు!

తమిళ సినిమా ఇండస్ట్రీని నాశనం చేశామని, కోట్ల రూపాయలు సంపాందించే స్థాయి చిత్రాలు తమిళంలో రావడం లేదని తెలుగు, కన్నడ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా వేలకోట్ల రూపాయలు సాధించేటటువంటి రూటెడ్ సినిమాలు తీస్తున్నారని అవి బిగ్ సక్సెస్ అవుతున్నాయని (డబ్బులు పరంగా) తమిళంలో మాత్రం అటువంటి సినిమాలు రావడం లేదని అందుకు కారణం మేమే అంటూ కొంతమంది అదేపనిగా మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు.

ఈ సందర్బంగా కాంతారా సినిమాను ఉదహరిస్తూ.. కాంతారా లాంటి సినిమాలు సక్సెస్ అయినప్పుడు కేవలం నన్ను, వెట్రిమారన్, మారి సెల్వరాజ్ మా ముగ్గురినే టార్గెట్ చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. మేము తీసే కులం ఆధారిత, అణచివేతకి సంబందించిన సినిమాల వల్లే తమిళ ఇండస్ట్రీ చెడిపోయింది అనడం సరికాదన్నారు.

రెండేళ్లలో వందల సినిమాలు

ఇప్పటి వరకు నేను కేవలం ఏడు సినిమాలు మాత్రమే చేశాను, మారి సెల్వరాజ్ ఐదు సినిమాలు తీశాడు, వెట్రి మారన్ కూడా మా మాదిరిగానే తీశారు. ఇంకా చెప్పాలంటే నేను రెండు సంవత్సరాలకు ఒక సినిమా తీస్తా, వెట్రిమారన్ మూడు ఏళ్లకు ఒక సినిమా తీస్తారు. మరి తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఒక సంవత్సరానికి దాదాపు 200 నుంచి 300 సినిమాలు విడుదల అవుతాయి, రెండు ఏళ్ళల్లో 600 సినిమాలు ఇండస్ట్రీ నుంచి వచ్చాయి. అయితే తమిళ ప్రేక్షకులు ఎందుకు మిగిలిన ఆ సినిమాలన్నింటిని సక్సెస్ చేయలేకపోయారని, ఎవరు కూడా తమిళ సినిమా స్థాయిని పెంచలేకపోయారు ఎందుకని ఆయన ఈ సంధర్బంగా ప్రశ్నించారు.

కాలా మూవీ విడుదలకు ముందే వందకోట్ల రూపాయలు కలెక్షన్స్ రాబట్టిందని.. కొంతమంది అదే పనికట్టుకొని ప్రేక్షకులు సినిమా చూడకముందే వాళ్లలో మా సినిమాలపట్ల ఒక చెడు అభిప్రాయాన్ని కలిగిస్తున్నారని ఆవేదన చెందారు. ప్రేకక్షకులు ఎప్పుడూ ప్రేమతో సినిమా చూస్తారని దాన్ని చెడగొట్టొద్దని పా. రంజిత్ అన్నారు.

నెటిజన్ల మద్దతు

పా. రంజిత్ మాట్లాడిన వ్యాఖ్యలకు అభిమానులు, ప్రేక్షకుల నుంచి భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని, సంవత్సరానికి కొన్ని వందల సినిమాలు కేవలం వినోదం కోసం మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. పా. రంజిత్, మారి సెల్వరాజ్, వెట్రి మారన్ వీళ్ళు తీసే సామాజిక వ్యవస్థను ఆలోచింపజేసే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఒకటి రెండు సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయని.. వాటి వల్లే తమిళ సినిమా చెడిపోతుంది అనడం హాస్యాస్పదం అని అభిమానులు అంటున్నారు.

సినిమాలో ఉన్న సామాజిక అంశాన్ని అర్థం చేసుకోవాలని దాన్ని కుల ఆధారితంగా చూడకూడదని పా. రంజిత్ హితవు పలికాడు. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. పా. రంజిత్ సినిమాల ఇండస్ట్రీకి వచ్చి కేవలం ఒక పది.. పదిహేనేళ్ళు అవుతుంది అంతే. మరి అంతకు ముందు ఆ తరువాత మిగిలిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, ప్రేక్షకులు ఏమి చేసినట్టు అనే ప్రశ్న ఇక్కడ కొంతమంది లేవనేత్తుతున్నారు.

సినిమా చూసి షాకవ్వకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతా!: రాజేంద్ర ప్రసాద్

0

మాస్ మహారాజ రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా మాస్ జాతర.. ఈ నెల 31న థియేటర్లలో ప్రేక్షకుల ముందకు వస్తోంది. ఈ సందర్బంగా సితార ఎంటర్టైన్మెంట్ & ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంస్థల ప్రొడ్యూసర్స్ హైదరాబాద్​లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ చిత్రంలో నటించిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్.. ఈ ఫంక్షన్‌లో సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు.. హీరో రవితేజకు సంబంధించిన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు.

సినిమా చూసి షాకవ్వకపోతే..

రాజేంద్ర ప్రసాద్ మైక్ పట్టుకోగానే ప్రేక్షకులు, అభిమానులు ఈలలు, కేరింతలతో కాసేపు ఆయనను మాట్లాడనివ్వలేదు. ఇదే జోష్ మనకు కావాలని ఆయన కూడా విజిల్ వేసి ఫుల్ ఖుషి అయ్యారు. లేడీస్ టైలర్ సినిమా నుంచి ఈ సాండ్ నేర్పింది నేనే అంటూ చెప్పాడు. ఈ మధ్య కాలంలో అన్ని మసాలాలు కలిపిన సినిమా రాలేదని తన అభిప్రాయం తెలిపారు.

నా జీవితంలో.. నేను ఎప్పుడు ఇలాంటి పాత్ర చేయలేదని, ఇది కచ్చితంగా మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని అన్నారు. ఈ సినిమాలో కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ అన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి. నా గుండెల మీద చెయ్యేసి చెబుతున్నా ఈ సినిమా చూస్తే మనల్ని తప్పకుండా అభినందిస్తారు అని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా చూసి మీరు షాక్ అవ్వకపోతే నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను అని ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.

ఫస్ట్ టైమ్ నాకు కిక్ ఇచ్చారు!

జులాయి సినిమా దగ్గర నుంచి నాన్నకి ప్రేమతో వరకు వరుసగా హిట్ సినిమాలు తీస్తూ వస్తున్నాను. కానీ రవి ఏమైపోయాడు అంటూ ఒక ఆశ్చర్యం కలిగించే మాట అన్నాడు. అయితే వెయిట్ చేసి చేసి ఈ సినిమాతో మంచి ‘మాస్ జాతర’ చూపించబోతున్నాడు. రవి నాకోసం కొన్ని సీన్లు రచయిత, దర్శకులతో ప్రత్యేకంగా రాయించి మరి షూట్ చేయించాడని పొగిడారు.మాస్ మహారాజ్ కిక్ మామూలే.. కాకపొతే ఫస్ట్ టైమ్ నాకు మాస్ కిక్ ఇచ్చారు అంటూ ప్రేక్షకులతో పంచుకున్నారు.

సూర్య గురించి.. రాజేంద్ర ప్రసాద్

ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా తమిళ యాక్టర్ హీరో సూర్య హాజరయ్యారు. ఆయన గురించి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. సూర్య పేరు చెప్పగానే ఫ్యాన్స్ ఈలలు వేసి గోల చేశారు.. దాంతో ఇదే మన సంస్కారం అని అంటూ సూర్య అడాప్టెడ్ తెలుగు నటుడు అయ్యారని పొగుడుతూ.. నువ్వు అంటే నాకు ఎంతో ప్రేమని అన్నారు. సూర్య ఎంతో మంచి యాక్టర్ అని దాంతో పాటు మంచి మానవత్వం ఉన్న మనిషి, ఆయన చాలా మంది పిల్లల్ని చదివిస్తున్నారని కొనియాడారు. అందుకుగాను సూర్య లేచి నిలబడి మరి రాజేంద్ర ప్రసాద్‌కు నమస్కారం చేశారు. నేను కూడా ఒక యాక్టర్.. నా సినిమాలు ఏదైనా చూసారా అని సరదాగా రాజేంద్ర ప్రసాద్ అడిగారు.

నేను ఇంకా మీ ముందు ఇలా బతుకుతున్నాను అంటే కారణం భాను లాంటి దర్శకులు, రచయితలు అన్నారు. వాళ్ళు నాకు రాసే క్యారెక్టర్స్ వల్ల నేను ఇప్పటికి ఉన్నానని చెప్పుకొచ్చారు. యాక్టర్స్ నవీన్, శ్రీలీలకు.. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఈ సినిమాని అందరూ థియేటర్లలోనే చూడాలని ప్రేక్షకులకి చెబుతూ సక్సెస్ మీట్‌లో మళ్ళీ కలుసుకుందామని రాజేంద్ర ప్రసాద్ ఫుల్ మాస్ జాతర స్పీచ్ ఇచ్చారు.