31.2 C
Hyderabad
Monday, March 17, 2025
Home Blog Page 16

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ ఇదే: ఫిదా చేస్తున్న లుక్ & వేరే లెవెల్ ఫీచర్స్

0

Royal Enfield Flying Flea C6 Electric Bike: బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్స్ వంటి అనేక కంపెనీల దేశీయ మార్కెట్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ లాంచ్ చేశాయి. అయితే దశాబ్దాల చరిత్ర కలిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మాత్రం ఇన్ని రోజులూ నిమ్మకు నీరెత్తినట్లు.. ఉలుకు పలుకు లేకుండా నిశ్చలంగా ఉండిపోయింది. ఇప్పుడు తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ ద్వి చక్ర వాహన విభాగంలో అడుగు పెట్టింది. ఓ అద్భుతమైన బైక్ లాంచ్ చేసింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లయింగ్ ప్లీ సీ6 (Royal Enfield Flying Flea C6)

ఎంతోమంది వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) యొక్క మొట్ట మొదటి ఎలక్ట్రిక్ బైక్ అధికారికంగా ప్రదర్శించబడింది. ఈ బైక్ 2026 నాటికి మార్కెట్లో లాంచ్ అవుతుందని సమాచారం. ఈ కొత్త బైక్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అభివృద్ధి చేసిన లైట్ వెయిట్ బైక్ నుంచి ప్రేరణ పొందింది. కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ పేరు ‘ప్లయింగ్ ఫ్లీ సీ6’ (Flying Flea C6).

డిజైన్

మార్కెట్లో అడుగుపెట్టనున్న మొట్ట మొదటి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ ప్లయింగ్ ఫ్లీ సీ6 సింపుల్ డిజైన్ కలిగి.. ఆకర్షణీయంగా ఉంది. ఇది గిర్డర్ స్టైల్ ఫోర్క్ (ఇది 1930 మరియు 1940లలో ప్రసిద్ధి చెందిన సస్పెన్షన్ ఫార్మాట్) కలిగి ఉంది. సన్నగా కనిపించే సీ6 అల్యూమినియం ఫ్రేమ్, రిబ్బెడ్ మెగ్నీషియం బ్యాటరీ ప్యాక్, సింగిల్ పీస్ సీట్ వంటివి పొందుతుంది.

సింగిల్ పీస్ సీటు కనిపిస్తున్నప్పటికీ.. పిలియన్ కోసం మరో సీటును కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ బైక్ టర్న్ ఇండికేటర్స్, టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్ డ్యాష్‌బోర్డ్ మరియు రౌండ్ హెడ్‌లైట్, టెయిల్ లైట్ వంటి వాటిని పొందుతుంది. 10 స్పోక్ అల్లాయ్ వీల్స్ కలిగిన ఈ బైక్ బెల్ట్ ఫైనల్ డ్రైవ్‌తో మిడ్ మౌంటెడ్ పర్మనెంట్ మాగ్నెట్ మోటారును పొందుతుంది.

ఫీచర్స్

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్.. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి వాటితో పాటు రివర్, సిటీ మరియు పర్ఫామెన్స్ వంటి ఐదు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. కంపెనీ ఈ బైక్ రేంజ్ మరియు ధరలను గురించి అధికారికంగా వెల్లడించలేదు. ఇవన్నీ లాంచ్ సమయంలో వెల్లడవుతాయని భావిస్తున్నాము.

అంచనా ధర & రేంజ్

కంపెనీ లాంచ్ చేయనున్న ప్లయింగ్ ఫ్లీ సీ6 ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షల మధ్య ఉంటుందని సమాచారం. రేంజ్ విషయానికి వస్తే.. సింగిల్ చార్జితో 150 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ధర మరియు రేంజ్ వంటి వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. ఇవన్నీ కేవలం అంచనా మాత్రమే.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ మంచి ఆదరణ పొందుతుందా!

నిజానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ బైకులకు ప్రపంచ మార్కెట్లో ఓ ప్రత్యేక డిమాండ్ ఉంది. ఇప్పటి వరకు కంపెనీ లాంచ్ చేసిన అన్ని బైకులు అత్యుత్తమ అమ్మకాలను పొందుతూ అధిక ప్రజాదరణ పొందాయి. అయితే అవన్నీ పెట్రోల్ బైకులు. కానీ కంపెనీ ఇప్పుడు మొదటిసారి ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసింది. ఎలక్ట్రిక్ బైక్ అంటే సౌండ్ చేయకుండా వెళ్తుంది. కాబట్టి ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుందనేది స్పష్టంగా చెప్పలేము.

Don’t Miss: అగ్రరాజ్యంలో ఎలక్షన్స్.. గెలిచినోళ్లకే ‘ది బీస్ట్’: దీని ప్రత్యేకతలేంటో తెలుసా?

డుగ్.. డుగ్ అనే సౌండ్ కోసమే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు కొనేవారు ఇప్పటికీ చాలామంది ఉన్నారంటే.. ఏ మాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అలాంటిది సౌండ్ లేని రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే.. ఒహ్హ్యించుకోవడానికే కొంత వింతగా ఉంది. సౌండ్ వద్దనుకునే వాళ్ళు లేదా రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క కొత్త బైక్ కావాలనుకునే వాళ్ళు ఈ బైకును కొనుగోలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నాము.

అగ్రరాజ్యంలో ఎలక్షన్స్.. గెలిచినోళ్లకే ‘ది బీస్ట్’: దీని ప్రత్యేకతలేంటో తెలుసా?

0

Do You Know About US President The Beast Car: అగ్రరాజ్యంలో ఎన్నికల ప్రచారం జోరుగా ఉంది. ఇప్పుడు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు అమెరికాను చూస్తున్నాయి. యూఎస్ఏలో నవంబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో ఓ వైపు రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి మరియు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. మరోవైపు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ బరిలో ఉన్నారు. మరి కొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠం ఎవరిదనేది తెలిసిపోతుంది.

అమెరికా ఎన్నికలు పక్కన పెడితే.. అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే కారు ‘ది బీస్ట్’ (The Beast) గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. చాలామంది ఈ కారు గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపుతారు. ఆలాంటి వారికోసం ఈ కథనం ఓ మంచి సమాధానం అవుతుంది.

ఒక దేశ అధ్యక్షుడు అంటే.. అతనికి చాలా కట్టుదిట్టమైన భద్రత అవసరం. జో బిడెన్ అధికారంలో ఉన్నప్పుడు.. కాడిలాక్ లిమోసిన్ ఉపయోగించేవారు. ఈ కారును ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో గెలుపొందిన అమెరికా అధ్యక్షులు ఉపయోగిస్తారు. నిజానికి అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే కారు.. ఇతర దేశాల ప్రధానమంత్రులు ఉపయోగించే కార్ల కంటే కూడా భిన్నమైనది మరియు పటిష్టమైనది.

ఒకప్పుడు అమెరికా అధ్యక్షులు ఓపెన్ కారులో ప్రయాణించేవారు. ఆ తరువాత కాలంతో పాటు కార్లు కూడా మారాయి. ప్రస్తుతం ది బీస్ట్ కారును ఉపయోగిస్తున్నారు.

ది బీస్ట్ ప్రత్యేకతలు

అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే కారు ఎంత కట్టుదిట్టమైన భద్రతను కలిగి ఉంటుందంటే.. ఈ కారు డోరును ఎవరైనా బలవంతంగా ఓపెన్ చేయాలని చూస్తే కరెంట్ షాక్ కొడుతుంది. ఈ కారు యొక్క ప్రతి డోర్ బోయింగ్ 757 డోర్ అంత బరువుంటుంది. సుమారు 18 అడుగుల పొడవున్న ఈ కారు బరువు 6,800 కేజీల నుంచి 9,100 కేజీల మధ్యలో ఉంటుందని సమాచారం. ఇది పూర్తిగా అల్యూమినియం, సిరామిక్ మరియు స్టీల్ వంటి వాటితో తయారైంది. వెలుపలి భాగం ఎనిమిది అంగుళాల మందం ఉంటుంది.

ది బీస్ట్ కారు బాంబుల దాడి నుంచి, తుపాకుల నుంచి కూడా కాపాడుతుంది. స్టీల్ రిమ్, పంక్షర్ ఫ్రూఫ్, శాటిలైట్ ఫోన్ మరియు ఆక్సిజన్ సరఫరా అన్నీ కూడా ఈ కారులో ఉంటాయి. రసాయనిక దాడుల నుంచి, భారీ కాల్పుల నుంచి కూడా ఈ కారు తట్టుకోగలరు అంటే.. ఇది ఎంత సురక్షితమైన కారో ఎవ్వరైనా అర్థం చేసుకోవచ్చు.

అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే కారులోని డ్రైవర్ కోసం ఓ ప్రత్యేక కంపార్ట్‌మెంట్ ఉంటుంది. లోపల అధ్యక్షుని బ్లడ్ గ్రూప్ రక్తం కూడా అందుబాటులో ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో అధ్యక్షునికి రక్తం కూడా ఎక్కించవచ్చు. మొత్తం మీద పటిష్టమైన భద్రత అందించే ఈ బుల్లెట్ ప్రూఫ్ కారు కోసం ఏకంగా రూ. 132 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.

భారత ప్రధాని కారు

మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఉపయోగించే కారు మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ ఎస్650 గార్డ్. ఇది కూడా ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా ఉంది. ఈ కారు కూడా భారీ పేలుళ్ల నుంచి, తుపాకీ దాడుల నుంచి కూడా లోపలున్న వ్యక్తులను రక్షిస్తుంది. ఈ కారు తయారీ కోసం రూ. 12 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టినట్లు సమాచారం.

ఓర్స్ సెనేట్

రష్యా అధ్యక్షుడు ఉపయోగించే కారు ఓర్స్ సెనేట్. దీనిని రష్యా లగ్జరీ కార్ల తయారీ సంస్థ నామి తయారు చేసినట్లు తెలుస్తోంది. సుమారు 21.7 అడుగుల పొడవున్న ఈ కారు.. 6500 కేజీల కంటే ఎక్కువ బరువుంటుందని సమాచారం. ఇది బుల్లెట్స్, బాంబుల నుంచి మాత్రమే కాకుండా.. పూర్తిగా నీటిలో మునిగిపోతే కూడా లోపలున్న వారిని రక్షించే విధంగా తయారైంది. దీని ధర సుమారు రూ. 5 కోట్లు కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం.

Don’t Miss: లాంచ్‌కు సిద్దమవుతున్న పాపులర్ కార్లు ఇవే: ఈవీఎక్స్ నుంచి ఏఎంజీ వరకు

హాంగ్కీ ఎన్501

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఉపయోగించే కారు హాంగ్కీ ఎన్501. ఇది జిన్‌పింగ్ యొక్క అధికారిక కారు అని తెలుస్తోంది. ఇది కూడా తుపాకీ కాల్పుల నుంచి, బాంబు దాడుల నుంచి కూడా రక్షించగలదు. చైనాలోని ప్రభుత్వ వైఖరీ మరియు ఇతర భద్రతా కారణాల వల్ల ఈ కారుకు సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు.

లాంచ్‌కు సిద్దమవుతున్న పాపులర్ కార్లు ఇవే: ఈవీఎక్స్ నుంచి ఏఎంజీ వరకు

0

New Car Launches And Unveils in India: కియా కంపెనీ కార్నివాల్, ఈవీ9 వంటి కార్లను, నిస్సాన్ కంపెనీ మాగ్నైట్ కారును పేస్‌లిఫ్ట్ రూపంలోనూ.. బీవైడీ కంపెనీ ఈమ్యాక్స్ ఎలక్ట్రిక్ కారును గత నెలలో (2024 అక్టోబర్) లాంచ్ చేశాయి. కాగా ఈ నెలలో (2024 నవంబర్) కూడా కొన్ని కంపెనీ కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో మారుతి సుజుకి యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు ఈవీఎక్స్, స్కోడా కైలాక్, మారుతి డిజైర్ మరియు మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ సీ63 ఎస్ఈ పర్ఫామెన్స్ వంటివి ఉన్నాయి.

మారుతి సుజుకి ఈవీఎక్స్ (Maruti Suzuki eVX)

భారతదేశంలో ఇప్పటికే చాలా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేసి.. ఈ విభాగంలో ఉత్తమ అమ్మకాలను పొందుతున్నాయి. అయితే ఇప్పటివరకు మారుతి సుజుకి ఎలక్ట్రిక్ విభాగంలో ఒక్క కారును కూడా లాంచ్ చేయలేదు. కాబట్టి నవంబర్ 4న ఇటలీలోని మిలన్‌లో ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ కారు యొక్క కాన్సెప్ట్ మోడల్ ఆవిష్కరించనుంది.

ప్రపంచ మార్కెట్లో లాంచ్ చేయనున్న మారుతి సుజుకి ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ కారు భారతదేశంలో ఉత్పత్తి అవుతుందని సమాచారం. భారతదేశంలో ఉత్పత్తి అయిన తరువాత.. దీనిని దేశీయ మార్కెట్లో విక్రయించడం మాత్రమే కాకుండా యూరప్ మరియు జపాన్ దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు సమాచారం. అయితే కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారును భారతీయులు చూడాలంటె.. 2025 ఆటో ఎక్స్‌పో వరకు వేచి ఉండాలి.

మారుతి సుజుకి ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ కారును కంపెనీ టయోటా సహకారంతో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఇది మంచి డిజైన్ కలిగి, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుందని సమాచారం. ఈ ఎలక్ట్రిక్ కారులోని 60 కిలోవాట్ బ్యాటరీ.. 500 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ కారు ఏడబ్ల్యుడీ (ఆల్ వీల్ డ్రైవ్) సిస్టం పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ధరలు 2025లో అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.

స్కోడా కైలాక్ (Skoda Kylaq)

చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా నవంబర్ 6న ‘కైలాక్’ పేరుతో మరో కారును ఇండియన్ మార్కెట్లో పరిచయం చేయనుంది. ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్ దశలో కనిపించిన ఈ కారు దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఆధునిక అప్డేట్స్ పొందుతుంది. ఇది కూడా ఎంక్యూబీ-ఏఓ-ఇన్ ప్లాట్‌ఫామ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కైలాక్ కుషాక్ ఫీచర్స్ కూడా పొందనున్నట్లు తెలుస్తోంది.

స్కోడా కైలాక్.. కుషాక్ కంటే తక్కువ వీల్ బేస్ పొందుతుంది. ఇది ఫ్యామిలీ కారుగా.. రోజువారీ వినియోగానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కారు 1.0 లీటర్ టీఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుందని సమాచారం. కైలాక్ ధరలను కంపెనీ 2025 ప్రారంభంలో వెల్లడించే అవకాశం ఉంది.

మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire)

ఇప్పటికే మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతూ.. దూసుకెళ్తున్న మారుతి డిజైర్, ఆధునిక హంగులతో సరికొత్త రూపంలో లాంచ్ కావడానికి సిద్ధమైంది. ఇది నవంబర్ 11న దేశీయ విఫణిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కరు అనేకసార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. కంపెనీ ఈ కారును దాని మునుపటి మోడల్ కంటే కొంత భిన్నంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

కొత్త మారుతి డిజైర్ కారు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి అత్యాధునిక ఫీచర్స్ కూడా పొందనున్నట్లు తెలుస్తోంది. ఈ కారు స్విఫ్ట్ మాదిరిగానే.. అదే 1.2 లీటర్ త్రీ సిలిండర్ జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్ పొందనున్నట్లు సమాచారం. ఇది 82 హార్స్ పవర్ మరియు 112 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది CNG రూపంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే కంపెనీ ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.

మెర్సిడెస్ ఏఎంజీ సీ63 ఎస్ఈ పర్ఫామెన్స్

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్.. నవంబర్ 12న ఏఎంజీ సీ63 ఎస్ఈ పర్ఫామెన్స్ కారును లాంచ్ చేయనుంది. ఇది ప్లగ్ ఇన్ హైబ్రిడ్ సిస్టంతో 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఈ కారు వెనుక మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారు కూడా ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్ 475 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తే.. ఎలక్ట్రిక్ మోటారు 203 హార్స్ పవర్ అందిస్తుంది. మొత్తం పవర్ 680 హార్స్ పవర్ వరకు ప్రొడ్యూస్ అవుతుంది.

Don’t Miss: అక్టోబర్‌లో ఎక్కువమంది కొన్న ఎలక్ట్రిక్ కారు ఇదే!.. ధర తెలిస్తే మీరు కొనేస్తారు

మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ సీ63 ఎస్ఈ పర్ఫామెన్స్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగి 9 స్పీడ్ మల్టీ క్లచ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఇందులోని 6.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 13 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా బెంజ్ కొత్త కారు చాలా అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. కంపెనీ ఈ కారు ధరలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.

అక్టోబర్‌లో ఎక్కువమంది కొన్న ఎలక్ట్రిక్ కారు ఇదే!.. ధర తెలిస్తే మీరు కొనేస్తారు

0

Best Selling Electric Car in India 2024 October: ఓ వైపు పండుగ సీజన్.. మరోవైపు కొత్త వాహనాల సందడితో అక్టోబర్ నెల సుఖాంతంగా ముగిసింది. గత నెలలో భారతదేశంలో సుమారు 4 లక్షల కంటే ఎక్కువ కార్లను అమ్ముడైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు ఒక లక్ష కంటే ఎక్కువని తెలుస్తోంది. అయితే ఇందులో కూడా ఎంజీ మోటార్ బ్రాండ్ కార్లు మంచి సంఖ్యలో అమ్ముడైనట్లు సమాచారం.

విండ్సర్ ఈవీ

జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ గత కొన్ని రోజులకు ముందే ‘విండ్సర్ ఈవీ’ (Windsor EV) లాంచ్ చేసింది. లాంచ్ అయిన తరువాత అక్టోబర్ నెలలో 3,116 విండ్సర్ ఈవీలు విక్రయించబడినట్లు తెలుస్తోంది. అమ్మకాల పరంగా గత నెలలో విక్రయించబడిన అన్ని ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కార్లలో విండ్సర్ ఈవీ అత్యధికం అని తెలుస్తోంది.

ఎంజీ విండ్సర్ ఈవీ ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్ మరియు ఎసెన్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 13.50 లక్షలు, రూ. 14.50 లక్షలు మరియు రూ. 15.50 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా). ఈ ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర ఎంజీ మోటార్ కార్ల కంటే కొంత భిన్నంగా ఉంటుంది.

బ్యాటరీ & రేంజ్

విండ్సర్ ఈవీ అనేది క్రాస్ ఓవర్ యుటిలిటీ వెహికల్స్. ఇది 38 కిలోవాట్ లిథియం ఐరన్ ఫాస్పెట్ (LFP) బ్యాటరీ ఉంది. ఇందులోని పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ 136 పీఎస్ పవర్ మరియు 200 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు ఒక ఫుల్ చార్జితో 332 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ చేత ధృవీకరించబడింది.

ఎకో ప్లస్, ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్స్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్స్ కలిగిన ఎంజీ విండ్సర్ ఈవీ.. ప్రకాశవంతమైన ఫ్రంట్ లోగో, ఎల్ఈడీ లైట్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఏరో లాంజ్ సీట్లు, ఫ్రంట్ వెంటిలేషన్ సీట్లు, వైర్‌లెస్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 15.6 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం మరియు ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటివన్నీ పొందుతుంది.

Don’t Miss: పండుగ సీజన్‌లో 4.25 లక్షల కార్లు కొనేశారు: ఎక్కువగా ఏ కార్లు కొన్నారంటే..

పైన చెప్పిన ఫీచర్స్ మాత్రమే కాకుండా.. పీఎం 2.5 ఫిల్టర్, పవర్ టెయిల్‌గేట్, పనోరమిక్ పనోరమిక్, వెనుక సీటు 135 డిగ్రీ రిక్లైన్ యాంగిల్‌తో 60:40 స్ప్లిట్ వంటివి ఉన్నాయి. కంపెనీ ఈ కారులో 80 కంటే ఎక్కువ కనెక్టెడ్ కార్ ఫీచర్స్ అందించింది. ఇందులో ఐస్మార్ట్ కనెక్టివిటీ టెక్నాలజీ కూడా ఉంది. డిజిటల్ బ్లూటూత్ కీ మరియు 36 కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

పండుగ సీజన్‌లో 4.25 లక్షల కార్లు కొనేశారు: ఎక్కువగా ఏ కార్లు కొన్నారంటే..

0

Cars Sales in Festive Season 2024: భారతదేశంలో వాహన అమ్మకాలు నెమ్మదిగా సాగుతున్న సమయంలో.. పండుగ సీజన్ కొత్త ఉత్సాహాన్ని అందించింది. వాహన్ డేటా ప్రకారం, పండుగ సీజన్‌లో చాలామంది కొత్త కార్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. 2024 అక్టోబర్ 29 నాటికి ప్యాసింజర్ వెహికల్స్ రిజిస్రేషన్ల సంఖ్య 4,25,000 యూనిట్లకు చేరినట్లు సమాచారం. కాగా జనవరి 2024లో ప్యాసింజర్ కార్ల రిజిస్రేషన్స్ 3,99,112 యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే.. పండుగ సీజన్ వాహనాల అమ్మకాలను అమాంతం పెంచిందని స్పష్టమవుతోంది.

వాహన అమ్మకాలు పెరగడానికి కారణం

దేశంలో వాహనాల అమ్మకాలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం నవరాత్రి (దసరా), ధన త్రయోదశి మరియు దీపావళి అని తెలుస్తోంది. అయితే ఇటురా నెలలతో పోలిస్తే అక్టోబర్‌లో వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగింది. అక్టోబర్ నెలలో వాహన్ పోర్టల్‌లో జాబితా చేయబడిన ప్రైవేట్ కార్లు, క్యాబ్‌ల సంఖ్య మొత్తం 4.25 లక్షలు. 2024లో నెలవారీ రిజిస్ట్రేషన్స్ సుమారు 3,33,000 యూనిట్లు. ఇది గత ఏడాది నెలవారీ అమ్మకాలతో పోలిస్తే.. 5 శాతం పెరుగుదలను నమోదు చేసినట్లు తెలుస్తోంది.

అమ్మకాల్లో అగ్రగామి మారుతి సుజుకి

మారుతి సుజుకి అక్టోబర్ 2024లో ఏకంగా 2,06,434 యూనిట్ల కార్లను విజయవంతంగా విక్రయించగలిగింది. ఈ అమ్మకాలు 2024 అక్టోబర్ కంటే 4 శాతం ఎక్కువని తెలుస్తోంది. అంటే 2024 అక్టోబర్ నెలలో మారుతి సుజుకి సేల్స్ 1,99,217 యూనిట్లు అని తెలుస్తోంది. గత నెలలో మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 1,68,047 యూనిట్లు. ఈ అమ్మకాలు అంతకు ముందు ఏడాదికంటే 1,59,591 యూనిట్లు. అమ్మకాలు అక్టోబర్ 2023 కంటే కూడా అక్టోబర్ 2024లో 5 శాతం తగ్గినట్లు తెలుస్తోంది.

ఆల్టో, ఎస్ ప్రెస్సో వంటి మినీ సెగ్మెంట్ కార్ల అమ్మకాలు అక్టోబర్ 2023లో 14568 యూనిట్లు, కాగా అక్టోబర్ 2024లో ఈ అమ్మకాలు 10,687 యూనిట్లుగా నమోదయ్యాయి. అదే సమయంలో బాలెనొ, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్ మరియు వ్యాగన్ ఆర్ వంటి కాంపాక్ట్ కార్ల అమ్మకాలు 48 యూనిట్లు తగ్గాయి. అక్టోబర్ 2023లో ఈ సేల్స్ 80,662 యూనిట్లు అని తెలుస్తోంది.

టాటా మోటార్స్ సేల్స్

2024 అక్టోబర్ నెలలో టాటా మోటార్ సేల్స్ 30 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ధన త్రయోదశి కారణంగా సంస్థ అధిక మొత్తంలో వాహనాలను విక్రయించింది. కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లో 82,682 వాహనాలను విక్రయించింది. 2023 అక్టోబర్ నెలలో ఈ సేల్స్ 82954 యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే మొత్తంగా అమ్మకాల్లో కొంత తగ్గుదల నమోదైంది.

Don’t Miss: ఇల్లు కొంటే.. రూ.4.22 కోట్ల లంబోర్ఘిని కారు ఫ్రీ: ఎక్కడో తెలుసా?

కమర్షియల్ వాహనాల అమ్మకాలు 34259 యూనిట్లు కాగా.. ప్యాసింజర్ వాహనాల సేల్స్ 48,423 యూనిట్లు. ట్రక్కులు, బస్సులు వంటివి గత నెలలో మొత్తం 15,574 యూనిట్ల సేల్స్ నమోదయ్యాయి. ఈ విభాగంలో అక్టోబర్ 2023లో 15574 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. 2023లోనూ మరియు 2024లోనూ కంపెనీ ఒకే విధంగా అమ్మకాలు సాగించింది.

ఇల్లు కొంటే.. రూ.4.22 కోట్ల లంబోర్ఘిని కారు ఫ్రీ: ఎక్కడో తెలుసా?

0

Buy Villa and Get The Lamborghini Urus Free: ఎక్కడైనా టీవీ కొంటే.. మిక్సీ ఫ్రీ, బైక్ కొంటే ఓ ఫ్రిజ్ ఫ్రీ అనే ప్రకటనలు చాలానే చూసుంటాం. ఇప్పుడు ఓ ఇల్లు కొంటే కోట్ల విలువ చేసే లంబోర్ఘిని ఫ్రీ అనే ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రకటన ఎవరు ఇచ్చారు? ఎక్కడ ఇల్లు కొనాలి? కొన్న ప్రతి ఒక్కరికీ లంబోర్ఘిని కారు ఇస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.

ఉత్తరప్రదేశ్ నోయిడాలోని జేపీ గ్రీన్ ఈ అద్భుతమైన ప్రకటన వెల్లడించింది. రియల్టర్ గౌరవ్ గుప్తా తన ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. అయితే ఇక్కడ ఒక్కో విల్లా కొనుగోలు చేయడానికి రూ. 26 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా పార్కింగ్ స్థలం కావాలనుకుంటే మరింత అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే విల్లా కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా లంబోర్ఘిని కంపెనీకి చెందిన ఉరుస్ కారును ఉచితంగా అందిస్తారు.

విల్లా కోసం రూ. 26 కోట్లు ఖర్చు చెల్లిస్తే సరిపోతుంది. కానీ కారు పార్కింగ్ కోసం రూ. 30 లక్షలు, గోల్ఫ్ వంటివి ఆడటానికి రూ. 50 లక్షలు, క్లబ్ మెంబర్‌షిప్ కోసం రూ. 7.5 లక్షలు, ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ. 7.5 లక్షలు, పవర్ బ్యాకప్ కోసం రూ. 7.5 లక్షలు.. ఇలా మొత్తం మరో కోటి రూపాయలకంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అంటే విల్లా కొనుగోలు చేసి.. ఇతరత్రా సౌకర్యాల కోసం రూ. 27 కోట్ల కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంది.

లంబోర్ఘిని ఉరుస్

భారతదేశంలో ప్రస్తుతం లంబోర్ఘిని ఉరుస్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. అవి ఎస్ వేరియంట్, పర్ఫామెంటే వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 4.18 కోట్లు, రూ. 4.22 కోట్లు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. విల్లాలు అందించే కంపెనీ ఈ కారు ధరను కూడా విల్లా కొనుగోలు ధరలో చేర్చినట్లు సమాచారం.

నిజానికి ఇండియన్ మార్కెట్లో ఎక్కువమంది సెలబ్రిటీలు, ప్రముఖులు కొనుగోలు చేసే లంబోర్ఘిని కారు ఉరుస్ కావడం విశేషం. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ఉరుస్ కార్లకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉందని స్పష్టమవుతోంది. ఈ కారు వివిధ రంగులలో చాలా అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఫీచర్స్ కూడా వాహన వినియోగదారులకు అవసరమైనవన్నీ ఉంటాయి. కాబట్టి వాహన వినియోగదారులు మంచి డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు.

లంబోర్ఘిని ఉరుస్ 3996 సీసీ పెట్రోల్ ఇంజిన్ కలిగి 657 బ్రేక్ హార్స్ పవర్, 850 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు 3.5 సెకన్లలో 305 కిమీ నుంచి 306 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కాబట్టి ఇది పనితీరు పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని స్పష్టమవుతోంది.

కార్లు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు

ఆస్తులు కొంటే కార్లు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఇందులో జేపీ గ్రీన్ ఒక కంపెనీ మాత్రమే. ఎందుకంటే గతంలో కూడా చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఇలాంటి విధానం ప్రారంభించాయి. గతంలో దుబాయ్ బేస్డ్ కంపెనీ డమాక్ ప్రాపర్టీస్.. ఆస్తులను కొనుగోలు చేసినవారికి లంబోర్ఘిని హురాకాన్, ఫెరారీ కాలిఫోర్నియా టీ, బెంట్లీ కాంటినెంటల్ జీటీ వంటివి అందించింది.

Don’t Miss: నటుడు ‘దర్శన్’ గ్యారేజిలో ఇన్ని లగ్జరీ కార్లు ఉన్నాయా?.. ధరలు తెలిస్తే షాకవుతారు!

బ్యాంకాక్‌లో రోల్స్ రాయిస్ ఘోస్ట్ అందించారు

దుబాయ్‌కి చెందిన మరో రియల్ ఎస్టేట్ కంపెనీ ఎమ్మార్ ప్రాపర్టీస్ కూడా దుబాయ్ హిల్స్ ఎస్టేట్ మరియు బుర్జ్ ఖలీఫా రెసిడెన్సీలో ప్రాపర్టీలు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికీ ఖరీదైన ఆస్టన్ మార్టిన్ డీబీ11 కారును అందించింది. అంతే కాకుండా బ్యాంకాక్‌లోని మహానాఖోన్‌లో ఉన్న పెంట్‌హౌస్ రిట్జ్ కార్ల్‌టన్ రెసిడెన్సెస్.. ఏకంగా రోల్స్ రాయిస్ ఘోస్ట్ (Rolls Royce Ghost) కార్లను అందించింది. దీన్నిబట్టి చూస్తే.. రియల్ ఎస్టేట్ రంగంలో కార్లను అందించడం కొత్తేమీ కాదని స్పష్టమవుతోంది.

టాటా నెక్సాన్ ఇప్పుడు సన్‌రూఫ్‌తో.. దీని రేటెంతో తెలుసా?

0

Tata Nexon Available With Panoramic Sunroof: టాటా మోటార్స్ భారతదేశంలో నెక్సాన్ లాంచ్ చేసినప్పటి నుంచి గొప్ప అమ్మకాలను పొందుతూనే ఉంది. ఇప్పటికే ఈ కారు డీజిల్, పెట్రోల్, సీఎన్‌జీ మరియు ఎలక్ట్రిక్ రూపంలో అందుబాటులో ఉంది. ఎంతోమందిని ఆకట్టుకున్న ఈ నెక్సాన్ కారులో పనోరమిక్ సన్‌రూఫ్ లేకపోవడం వాహన ప్రియులను కొంత నిరాశకు గురి చేసింది. అయితే కంపెనీ ఇప్పుడు ఎట్టకేలకు ఆ ఫీచర్ కూడా అందుబాటుకి తీసుకువచ్చేసింది.

నెక్సాన్ ఇప్పుడు పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ పొందటం అనేది గొప్ప శుభవార్త అనే చెప్పాలి. ఈ ఫీచర్స్ అన్ని విభాగాల్లోని నెక్సాన్ కార్లలో అందుబాటులో ఉంది. పనోరమిక్ సన్‌రూఫ్ కలిగిన నెక్సాన్ ధరలు 1రూ. 3.60 లక్షల నుంచి రూ. 15.60 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్ కలిగిన నెక్సాన్ సీఎన్‌జీ ధరలు రూ. 12.80 లక్షల నుంచి రూ. 14.60 లక్షల మధ్య ఉన్నాయి. ధరల పరంగా సాధారణ నెక్సాన్ కంటే రూ. 1.3 లక్షలు ఎక్కువని తెలుస్తోంది.

టాటా నెక్సాన్ సీఎన్‌జీ అనేది దేశీయ మార్కెట్లో నెల రోజుల క్రితమే లాంచ్ అయింది. అయితే ఈ మోడల్ యొక్క టాప్ స్పెక్ వేరియంట్ మాత్రమే పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ పొందుతుంది. పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ కలిగిన ఏకైన టాటా సీఎన్‌జీ కారు నెక్సాన్ కావడం గమనార్హం. ఇప్పటి వరకు పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ కోసం ఎదురు చూసేవారు నిశ్చింతగా నెక్సాన్ కొనుగోలు చేయవచ్చు.

నెక్సాన్ సేల్స్

2017 లాంచ్ అయినప్పటి నుంచి నెక్సాన్ గొప్ప అమ్మకాలను పొందుతూనే ఉంది. ఇప్పటికే మార్కెట్లో 7 లక్షల కంటే ఎక్కువ నెక్సాన్ ఫ్యూయల్ కార్లు అమ్ముడైనట్లు సమాచారం. నెక్సాన్ ఈవీ మోడల్ 50వేల యూనిట్ల అమ్మకాలను పొందినట్లు తెలుస్తోంది. ఇక సీఎన్‌జీ అమ్మకాలు కూడా ఆశాజనకంగా ఉంటాయని తెలుస్తోంది.

నెక్సాన్ యొక్క అన్ని కార్లు చూడటానికి ఒకేలా అనిపించినప్పటికీ.. మోడల్‌ను బట్టి ఫీచర్స్ మారుతూ ఉంటాయి. ఎలక్ట్రిక్ కారు ప్రత్యేకంగా ఛార్జింగ్ పోర్ట్ పొందుతుంది. నెక్సాన్ ఈవీ ఒక సింగిల్ ఛార్జీతో 312 కిమీ నుంచి 453 కిమీ రేంజ్ అందిస్తుంది. రేంజ్ ఎక్కువ ఇవ్వడమే కాకుండా.. అత్యాధునిక ఫీచర్స్ అందుబాటులో ఉన్న కారణంగా ఎక్కువమంది ఈ నెక్సాన్ ఎలక్ట్రిక్ కారును ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఎలక్ట్రిక్ విభాగంలో టాటా నెక్సాన్ ఈవీ అమ్మకాల్లో అగ్రగామిగా ఉంది.

ఎక్కువమంది సన్‌రూఫ్ ఫీచర్ ఇష్టపడటానికి కారణం

దశాబ్దాల క్రితం భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన ఏ కారులోనూ సన్‌రూఫ్ ఫీచర్ ఉండేదే కాదు. ఆ తరువాత కేవలం లగ్జరీ కార్లలో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉండేది. ఇప్పుడు దాదాపు ప్రతి కారులోనూ సన్‌రూఫ్ ఫీచర్ అందుబాటులో ఉంది. దీనికి ప్రధాన కారణం.. కార్ల కొనుగోలుదారులు అందరూ కూడా సన్‌రూఫ్ ఉండే కార్లను మాత్రమే కొనుగోలు చేయడానికి సిద్దపడుతున్నారు.

సన్‌రూఫ్ ఫీచర్ అనేది కారు లోపలికి గాలి, వెలుతురు వచ్చేలా చేస్తాయి. దీని ద్వారా కారు లోపల ఉన్నవారు బయటి ఉన్న వాటిని కూడా చూడవచ్చు. లోపలి నుంచే పర్యావరణాన్ని ఆస్వాదించవచ్చు. ఈ కారణంగానే చాలామంది సన్‌రూఫ్ ఉన్న కార్లనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని టాటా నెక్సాన్ కూడా సన్‌రూఫ్ ఫీచర్ అందించడం మొదలుపెట్టింది.

Don’t Miss: మోదీ కల గురించి చెప్పిన నితిన్ గడ్కరీ: దేశం ఎదగాలంటే.. మరో పదేళ్లలో..

సాధారణ కార్లకంటే కూడా సన్‌రూఫ్ ఫీచర్ ఉన్న కార్ల ధరలు కొంత ఎక్కువగానే ఉంటాయి. ధర కొంత ఎక్కువైనా.. సన్‌రూఫ్ ఫీచర్ ఉన్న కార్లనే ప్రజలు కూడా కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ కారణంగానే వాహన తయారీ సంస్థలు కూడా ఈ సన్‌రూఫ్ ఫీచర్ అందిస్తున్నాయి. ఇకపై భవిష్యత్తులో దాదాపు అన్ని కార్లు కూడా సన్‌రూఫ్ ఫీచర్ కలిగి ఉంటాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు దాదాపు అన్ని కార్లూ కూడా తప్పకుండా సన్‌రూఫ్ ఫీచర్ పొందుతాయని భావిస్తున్నాము.

మోదీ కల గురించి చెప్పిన నితిన్ గడ్కరీ: దేశం ఎదగాలంటే.. మరో పదేళ్లలో..

0

Nitin Gadkari Want To Make India Top Auto Hub in The World: ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో వేగంగా దూసుకెళ్తోంది. ఈ రంగంలో రెండో స్థానంలో భారత్‌ను.. రాబోయే రోజుల్లో అగ్రస్థానంలో నిలిపేలా చేయడమే నా విజన్ అని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మంగళవారం ముంబైలో జరిగిన స్పెయిన్ – ఇండియా బిజినెస్ సమావేశంలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరో పదేళ్లలో భారతదేశాన్ని ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా చేయాలని నితిన్ గడ్కరీ అన్నారు. ఇప్పటికే వాహన తయారీలో వేగంగా సాగుతున్న ఇండియాకు ఇది తప్పకుండా సాధ్యమవుతుందని ఆయన అన్నారు. దేశ ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం 22 లక్షల కోట్లు. చైనా ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం 44 లక్షల కోట్లు. దీని ప్రకారం భారత్ ఇంకా చాలా పురోగతిని సాధించాల్సి ఉంది. దీనికోసం 10 సంవత్సరాలు లక్ష్యం అని గడ్కరీ అన్నారు.

తగ్గనున్న లాజిస్టిక్ ధర

భారతదేశ ఉత్పత్తి వ్యయం.. ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. అయితే ఇక్కడ అధిక లాజిస్టిక్ ధర దేశానికి ఒక సమస్య అని గడ్కరీ అన్నారు. ఈ ఖర్చులను తగ్గించడానికి ప్రధాన మార్గం.. మౌలిక సదుపాయాలను పెంపొందించడం, మెరుగైన రోడ్లను నిర్మించడం, ఓడరేవుల పెరుగుదల అని ఆయన అన్నారు.

యూఎస్ఏ మరియు యూరోపియన్ దేశాల్లో ఈ లాజిస్టిక్ ఖర్చులు వరుసగా 14 శాతం, 16 శాతంగా ఉన్నాయి. మనదేశంలో ఇది 12 శాతంగా ఉంది. కాబట్టి దీనిని మరింత తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. అప్పుడే వేగవంతమైన ఉత్పత్తి, వృద్ధి సాధ్యమవుతుందని నితిన్ గడ్కరీ అన్నారు.

మన దేశంలో చాలా ఎక్స్‌ప్రెస్ హైవేలు ఉన్నాయి. 36 గ్రీన్ యాక్సెస్ కంట్రోల్ హైవేలు ఉన్నాయి. రోడ్ల విస్తరణ పనులు ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ భారతదేశాన్ని అభివృద్ధి బాటలో సాగేలా చేస్తాయి. నీరు మరియు వ్యర్థ పదార్తల నిర్వహణకు టెక్నాలజీ వంటివి ఉపయోగించుకోవాల్సిన అవసరం చాలా ఉందని గడ్కరీ సూచించారు.

ఏటా రూ.22 లక్షల కోట్లు

భారతదేశం శిలాజ ఇంధనాలను భారీగా దిగుమతి చేసుకుంటోంది. దీనికోసం ప్రతి సంవత్సరం రకంగా రూ. 22 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఇది మన దేశానికీ పెద్ద ఆర్ధిక సవాలు. కాబట్టి దీనికోసం పెట్టే ఖర్చును వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నించాలి. ఇందులో భాగంగానే.. దేశంలో ఫ్యూయెల్ ప్రత్యామ్నాయ వాహనాలను ప్రోత్సహించడం జరుగుతోంది. దీనికి వాహన తయారీ సంస్థలు కూడా తమ సహకారం అందిస్తున్నాయని వెల్లడించారు.

బయో ఫ్యూయెల్

ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ ఆటోలు, ఎలక్ట్రిక్ బైకులు, ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు ఎలక్ట్రిక్ ట్రక్కులు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఫ్యూయెల్ వాహనాలతో పోలిస్తే ఈ ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య చాలా తక్కువ. వ్యవసాయ సంబంధిత వాహనాలను కూడా ఎలక్ట్రిక్ విభాగంలో చేర్చడానికి ప్రయత్నాలు జారుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే కాకుండా.. జీవ ఇంధనంతో (బయో ఫ్యూయెల్) నడిచే వాహనాలను కూడా రూపొందిస్తున్నారు. అనుకున్నవన్నీ కూడా సక్రమంగా జరిగితే.. రాబోయే రోజుల్లో భారత్ ఫ్యూయెల్ దిగుమతి కోసం వెచ్చించే ఖర్చు భారీగా తగ్గే అవకాశం ఉంది.

ఆత్మనిర్భర్ భారత్‌ ప్రధానమంత్రి కల

మన దేశంలోనే జీవ ఇంధనం తయారు చేయడం వల్ల ఫ్యూయెల్ దిగుమతికి పెట్టాల్సిన ఖర్చు తగ్గడం మాత్రమే కాకుండా వ్యవసాయదారులకు కూడా కొంత ఉపయోగకరంగా ఉంటుంది, ఇది వారిని ఆర్థికంగా కూడా ఎదిగేలా చేస్తుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉంది. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ కూడా చాలా వేగంగా ఉంది. భారతదేశాన్ని ఆత్మనిర్భర్ భారత్‌గా మార్చడమే ప్రధాన మంత్రి కల అని కూడా గడ్కరీ వెల్లడించారు.

Don’t Miss: ఒకేసారి 100 కార్ల డెలివరీ: ఈ కారుకు భారీగా పెరిగిపోతున్న క్రేజు

వికసిత భారత్ కోసం ప్రభుత్వం పనిచేస్తోంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం నరేంద్రమోదీ కల. దీనికోసం తయారీ రంగం చాలా కీలకం. కాబట్టి వాహన తయారీ సంస్థలు దీనికి తప్పకుండా సహకరించాలని గడ్కరీ అన్నారు. తయారీ రంగం వేగవంతం అయితే ఆటోమొబైల్ రంగం తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. అగ్రగామిగా నిలుస్తుంది. మొత్తం మీద భారత్.. వికసిత భారత్‌గా అవతరించడానికి ప్రతి భారతీయుడు కృషి చేయాలి. అది మన బాధ్యత కూడా.

ఒకేసారి 100 కార్ల డెలివరీ: ఈ కారుకు భారీగా పెరిగిపోతున్న క్రేజు

0

JSW MG Motor Delivers Over 100 Windsor EVs On A Single Day: దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది అన్న విషయాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేడు ఓ చిన్న కంపెనీ నుంచి దిగ్గజ కంపెనీ వరకు అన్ని సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేసి.. ఈ విభాగంలో తమ హవా చూపించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పుట్టుకొచ్చిన కారే ఎంజీ మోటార్ మరియు జేఎస్డబ్ల్యు యొక్క ‘విండ్సర్ ఈవీ’. ప్రారంభం నుంచి ఆశాజనక అమ్మకాలను పొందుతున్న ఈ కారు మార్కెట్లో మంచి ఆదరణ పొందుతోంది. తాజాగా ధనత్రయోదశి సందర్భంగా ఒకేసారి 100 కార్లను డెలివెరీ చేశారు.

ఒకేసారి 100 డెలివరీలు

దసరా, దీపావళి వంటి పండుగల సమయంలో లేదా ధన త్రయోదశి వంటి ప్రత్యేక సందర్భాల్లో చాలామంది కొత్త వస్తువులను కొనుగోలు చేయాలనుకుంటారు. ఈ కారణంగానే ఇటీవల ఢిల్లీ వాసులు సుమారు 100మంది విండ్సర్ ఈవీ కార్లను కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన మెగా ఈవెంట్ డెలివరీ కూడా డీలర్షిప్ అధికారులు నిర్వహించారు. ఒకేసారి వంద కార్ల డెలివరీ అంటే.. ప్రజలకు విండ్సర్ మీద ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎంజీ మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లు

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు విషయంలో ఢిల్లీ కొంత ముందంజలో ఉంది. డిసెంబర్ 2023లోనే ఈవీల సేల్స్ ఏకంగా 19.5 శాతం పెరిగాయి. దేశరాజధానిలో ఈవీల సేల్స్ పెరగడానికి ఢిల్లీ ఈవీ పాలసీ చాలా దోహదపడిందని తెలుస్తోంది.ప్రస్తుతం ఎంజీ మోటార్స్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మంచి ఉనికిని చాటుకుంటోంది. ఈవీ విభాగంలో ఎంజీ మోటార్స్ జెడ్ఎస్ ఈవీ, కామెట్ ఇవే మరియు విండ్సర్ ఈవీ అనే మూడు ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది.

ఎంజీ కామెట్ ఈవీ

దేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా ప్రసిద్ధిచెందిన ఎంజీ మోటార్స్ యొక్క కామెట్ ఈవీ చిన్నగా కనిపించే 2 డోర్స్ హ్యాచ్‌బ్యాక్. ఇద్దరు మాత్రమే ప్రయాణించడానికి అనుకూలంగా ఉన్న ఈ కారులో నాలుగు కూడా ప్రయాణించవచ్చు. వివిధ రంగులలో లభించే ఈ కారు 17.3 కిలోవాట్ బ్యాటరీ కలిగి 230 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 41.4 హార్స్ పవర్ మరియు 110 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 3.3 కేడబ్ల్యు ఛార్జర్ సాయంతో 7 గంటల్లో 100 శాతం ఛార్జ్ చేసుకోగలదు.

ఎంజీ జెడ్ఎస్ ఈవీ

నిజానికి ఎంజీ మోటార్ ఎలక్ట్రిక్ కారు అంటే ముందుగా అందరికి గుర్తొచ్చే కారు జెడ్ఎస్ ఈవీ. ప్రస్తుతం మార్కెట్లో అమ్మకానికి ఉన్న మోడల్ 2024 మార్చిలో లాంచ్ అయింది. దీని ధర రూ. 22 లక్షల నుంచి రూ. 25.88 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, రీఫ్రెష్డ్ ఫ్రంట్ బంపర్, టెయిల్ లైట్స్ కలిగిన ఈ కారు.. 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో 7 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్, డిజిటల్ బ్లూటూత్ కీ, ఏడీఏఎస్ వంటి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి.

జెడ్ఎస్ ఈవీ 50.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 461 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ద్వారా ధృవీకరించబడింది. ఈ కారు 176 Bhp పవర్ మరియు 353 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిక్ మోటారు కలిగి ఉంటుంది. ఇది 8.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఇది చాలా హుందాగా ఉంటుంది.

ఎంజీ విండ్సర్ ఈవీ

ఇటీవల ఎంజీ మోటార్ మరియు జేఎస్డబ్ల్యు కలియికతో.. ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన విండ్సర్ ఈవీ ఎక్కువ అమ్మకాలను పొందగలుగుతోంది. ఈ కారు కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించిన 24 గంటల్లోనే 15,176 బుకింగ్స్ పొందగలిగింది. విండ్సర్ ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).

ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్ మరియు ఎసెన్స్ అనే మూడు వేరియంట్లలో లభించే ఎంజీ విండ్సర్ కారు ప్యూర్ ఈవీ ప్లాట్‌ఫామ్ మీద ఆధారపడి ఉంటుంది. పరిమాణం పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. స్ప్లిట్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ లైట్ బార్, ఎల్ఈడీ డీఆర్ఎల్, 18 ఇంచెస్ 5 స్పోక్ అల్లాయ్ వీల్స్, ప్లస్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ అవుట్ సి మరియు డి పిల్లర్స్, ఇంటిగ్రేటెడ్ స్కిడ్ ప్లేట్ వంటి మరెన్నో.. ఈ కారులో ఉన్నాయి.

15.6 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్, 8.8 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, 9 స్పీకర్ సౌండ్ సిస్టం, పనోరమిక్ గ్లాస్ రూఫ్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఏరో లాంజ్ బై ఎంజీ అని పిలువబడే సీట్లు 135 డిగ్రీల వరకు వంగి ఉంటాయి. వీటితో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఏడీఏఎస్ ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి.

Don’t Miss: ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన MG Windsor EV: సింగిల్ ఛార్జ్ 331 కిమీ రేంజ్

ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ కారు 38 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఐపీ67 రేటెడ్. ఈ కారులో 136 పీఎస్ పవర్ మరియు 200 న్యూటన్ మీటర్ టార్క్ అందించే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ కారు ఒక సింగిల్ చార్జితో 332 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ చేత ధృవీకరించబడింది.

గతంలో 101 విండ్సర్ కార్ల డెలివరీ

ఢిల్లీలో వంద కార్లను ఒకేసారి డెలివరీ చేయడం గొప్ప విషయమే. అయితే ఒక్కసారి 100 కార్లను డెలివరీ చేయడం అనేది ఇదే మొదటిసారి కాదు. దసరా సందర్భంగా కూడా ఎంజీ జూబిలెంట్ డీలర్‌షిప్ ఆధ్వర్యంలో బెంగళూరులో ఒకేసారి 101 విండ్సర్ కార్ల డెలివరీ జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ డెలివరీ 2024 అక్టోబర్ 26న జరిగింది.

ఆ ఒక్క రాష్ట్రంలో 50 లక్షల హోండా టూవీలర్స్ కొనేశారు: ఎక్కడనుకుంటున్నారా?

0

Honda Two Wheelers Sales 50 Lakh in Karnataka: భారతదేశంలో ప్రస్తుతం సరసమైన స్కూటర్లు, ఖరీదైన స్కూటర్లు లాంచ్ చేస్తున్న వాహన తయారీ సంస్థలు లెక్కకు మించి ఉన్నాయి. ఎన్ని కంపెనీలున్నా.. ప్రజలు మాత్రమే కొన్ని బ్రాండ్స్ మాత్రమే కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ కోవకు చెందిన బ్రాండ్లలో చెప్పుకోదగ్గది ‘హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా’ (HMSI). ఈ కంపెనీ ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే 50 లక్షల ద్విచక్రవాహనాలను విక్రయించి.. అమ్మకాల్లోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

కర్ణాటక రాష్ట్రంలో ప్రజలు కూడా ఎక్కువగా హోండా టూ వీలర్స్ కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ కారణంగానే కంపెనీ భారీ సంఖ్యలో ద్విచక్ర వాహనాలను విక్రయించగలిగింది. భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. దక్షిణాది రాష్ట్రాల్లో హోండా బైకులకు మంచి డిమాండ్ ఉన్నట్లు స్పష్టమవుతోంది.

2001 నుంచి..

జూన్ 2001లో ప్రారంభమైనప్పటి నుంచి హోండా మోటార్‌సైకిల్ కంపెనీ వాహనాలను లాంచ్ చేస్తూ, ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ.. కస్టమర్లకు చేరువవుతూనే ఉంది. కన్నడ నాట హోండా యాక్టివా మరియు షైన్ వంటి టూ వీలర్ గొప్ప అమ్మకాలతో ముందుకు దూసుకెళ్లాయి. ఒకే బ్రాండ్ వాహనాలను 50 లక్షల మంది కొనుగోలు చేసారు అంటే.. అది అనన్య సామాన్యమనే చెప్పాలి.

కంపెనీ కర్ణాటకలో గొప్ప అమ్మకాలను పొందిన సందర్భంగా హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ మాట్లాడుతూ.. కంపెనీ మీద ప్రజలు ఉంచిన విశ్వాసమే 50 లక్షల వాహనాల అమ్మకాలు సాధించేలా చేసింది. ఇంత పెద్ద రికార్డ్ సొంతం చేసుకోవడానికి సహకరించిన కర్ణాటక కస్టమర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

బ్రాండ్ బైకులు

హోండా మోటార్‌సైకిల్ కంపెనీ మార్కెట్లో 125 సీసీ, 110 సీసీ విభాగాల్లో స్కూటర్లను లాంచ్ చేసి విక్రయిస్తోంది. ఇందులో హోండా డియో, యాక్టివా, షైన్, ఎస్పీ, యూనికార్న్, హార్నెట్, లివో, సీబీ350ఆర్ఎస్, హైనెస్, సీబీ300ఎఫ్, సీబీ200ఎక్స్, ఎన్ఎక్స్500 మరియు ఆఫ్రికా ట్విన్ మొదలైనవి ఉన్నాయి.

అత్యధిక అమ్మకాలు పొందిన స్కూటర్

ఒక్క కర్ణాటకలో మాత్రమే కాకుండా హోండా మోటార్‌సైకిల్ యొక్క యాక్టివా భారతదేశం మొత్తం మీద ఏకంగా మూడు కోట్ల కంటే ఎక్కువ అమ్మకాలను పొందగలిగింది. అంటే దేశంలో యాక్టివా స్కూటర్ వినియోగిస్తున్న ప్రజలు 3 కోట్లకంటే ఎక్కువే అన్న మాట. రూ. 64వేల ప్రారంభ (ఎక్స్-షోరూమ్) ధర వద్ద లభిస్తున్న యాక్టివా మంచి డిజైన్ కలిగి, రోజువారీ వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ 45 కిమీ/లీ నుంచి 50 కిమీ/లీ మధ్య మైలేజ్ అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది ఈ స్కూటర్‌ను ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.

అత్యధిక ఖరీదైన హోండా బైకులు

భారతీయ మార్కెట్లోహోండా మోటార్‌సైకిల్ సరసమైన బైకులు, స్కూటర్లను మాత్రమే కాకుండా.. రూ. 39.16 లక్షల విలువైన గోల్డ్ వింగ్ వంటి బైకులను కూడా లాంచ్ చేసింది. హోండా గోల్డ్ వింగ్ అనేది బ్రాండ్ యొక్క అత్యంత ఖరీదైన మోడల్. ధర ఎక్కువైనా ఈ బైకుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే ఈ బైక్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే అన్నీ అమ్ముడైపోతున్నాయి. ఈ బైక్ అత్యుత్తమ పర్ఫామెన్స్ అందిస్తుంది.

Don’t Miss: రూ.2.30 లక్షల డిస్కౌంట్: తక్కువ ధరలో థార్ ప్రత్యర్థిని పట్టుకెళ్లండి

త్వరలో ఎలక్ట్రిక్ టూ-వీలర్స్

ఇప్పటి వరకు ద్విచక్ర వాహన విభాగంలో గొప్ప అమ్మకాలను పొందుతున్న హోండా మోటార్‌సైకిల్ ఇండియా రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ తన యాక్టివా స్కూటర్‌ను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. హోండా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 2025లో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. దీని ధర రూ. 1 లక్ష కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. హోండా తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేస్తే.. మార్కెట్లో మరింత గొప్ప అమ్మకాలను పొందే అవకాశం ఉంది. ఇది మార్కెట్లో తన ప్రత్యర్థులకు గట్టి పోటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది.