Home Blog Page 77

జగపతి బాబును.. రమ్యకృష్ణ ఏమని పిలిచేదో తెలుసా?

0

హీరో జగపతి బాబు అంటే.. ఒకప్పుడు అందరు మెచ్చుకునే ఒక అందమైన కథనాయకుడు. ఇప్పటికీ కూడా అదే అందం, అభినయంతో సినిమాలలో ప్రత్యేక పాత్రల్లో తెలుగు ప్రేక్షకులనే కాకుండా.. దేశం అంతటా ఎంతోమందిని అలరిస్తున్నాడు. ఆయన ఆనాటి సినిమాలు మంచి సెంటిమెంట్ అండ్ ఎమోషనల్‌గా ఉండటంతో.. కుటుంబ సమేతంగా మూవీ వీక్షించేవారు.. అంతగా ఇష్టపడేవారు.

ఇద్దరి మధ్య స్నేహం..

జగపతిబాబు ఎంతోమంది ప్రతిభ కలిగిన హీరోయిన్లతో కూడా కలిసి నటించాడు. ఈ ప్రయాణంలో వారి మధ్య స్నేహపూర్వకమైన సంబంధాలు ఏర్పడటం అనేది సహజం. ఆ చనువుతో ఒకరిని ఒకరు ఎన్ని పేర్లతో అయినా ఆట పట్టిస్తుంటారు. సరదా సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. వారిలో రమ్యకృష్ణ కూడా ఒకరు. వీరిద్దరూ కూడా వ్యక్తిగతంగా చాలా సన్నిహితులు & మంచి స్నేహితులు. ఇటీవల జరిగిన జయమ్ము నిర్ఛయమ్ము రా అనే టీవీ షోలో వీరిద్దరి సాన్నిహిత్యానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకి వచ్చాయి.

అలా.. శుభలగ్నం

జగపతిబాబు కెరియర్ ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలో ఒక కొత్త సినిమాలో.. ప్రొడ్యూసర్ అశ్వని దత్, డైరెక్టర్ కృష్ణారెడ్డి.. జగపతిబాబుకు ఆఫర్ ఇస్తే, తనకి డేట్స్ ఖాళీ లేవు అని వదులుకునేద్దాం అనుకున్నారట. కానీ అదే సమయంలో రమ్యకృష్ణ వచ్చి.. ఏంటి నీకు పిచ్చి పట్టిందా.. నీకు డేట్స్ నేను అడ్జెస్ట్ చేస్తాను. నువ్వు ఈ సినిమా ఒప్పుకో అని బలవంతం చేసారట. అప్పుడు ఇంక తప్పక ఒప్పుకోవాల్సి వచ్చి ఒప్పేసుకున్నారట జగపతిబాబు. ఆ సినిమా పేరే శుభలగ్నం. అది తన జీవితాన్నే టర్నింగ్ చేసిన మూవీ అయింది. ఈ విషయాన్ని జగపతి బాబు స్వయంగా చెప్పుకున్నారు.

కోపం వస్తే..

అంతే కాకుండా.. జగపతి ఏదైనా అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టినా, తింగరి పనులు చేసినా.. రమ్యకృష్ణ తిట్టేస్తుందట. నాకు ఒక క్రేజీ ఫ్రెండ్ అంటే అది జగపతినే అని రమ్యకృష్ణ తెలిపింది. మాములుగా అయితే ఎవరైనా ఒకరినొకరు పేర్లతో పిలుచుకుంటారు. అసలు పేరుతో కాకపోయినా కనీసం ముద్దు పేరుతో అయినా పిలుచుకుంటారు. కానీ ఇక్కడ ఆశ్చర్యంగా రమ్యకృష్ణ జగపతిబాబును ఏ పేరుతో కూడా పిలవదట. నిజంగా క్రేజీ కదా. ఎప్పుడైనా కోపం వస్తే ఒరేయ్, అరేయ్ అని పిలుస్తారట.. లేదా ప్రేమగా బంగారం అని పిలుస్తుంది అని తెలిసింది. అది మంచి లేదా చాలా దగ్గర స్నేహం కలిగిన మనిషిని మాత్రమే అలా పిలువగలుగుతాము అని అభిప్రాయపడ్డారు.

పెళ్ళికి ముందు..

ఈ సందర్బంగా రమ్యకృష్ణ తన ప్రేమ గురించి చెప్పుకొచ్చింది. కృష్ణ వంశీతో తన జీవితం చాలా బాగుందని, వాళ్ల ఒక్కగానొక్క కొడుకుతో కుటుంబంలో సంతోషంగా ఉన్నామని చెప్పుకొచ్చింది. పెళ్ళికి ముందు చిన్న చిన్న గొడవలు వచ్చాయి గానీ పెళ్లి అయిన తరువాత ఎటువంటి గొడవలు లేవని అంతా హ్యాపీగా సాగిపోతున్నదని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి చూస్తే జగపతిబాబుకి, రమ్యకృష్ణకి ఎంత మంచి స్నేహపూర్వకమైన అనుబంధం ఉందో అర్థమవుతుంది. ఇలాంటి స్నేహం అందరికి ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా.

నవంబర్ 7న తిరువీర్ ‘ప్రీ -వెడ్డింగ్ షో’: హీరో జీవితంలో గుర్తుండిపోతుందా?

0

ప్రీ-వెడ్డింగ్ అంటే ఇదేదో నిజంగా తిరువీర్‌కు మ్యారేజ్ అనుకునేరు. తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన కొత్త సినిమా పేరు ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో. ఈ చిత్రం 2025 నవంబర్ 07వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకి రానున్నది. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో.. నరేంద్ర, రోహన్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పప్పేట్ షో ప్రొడక్షన్ & బై 7పీఎంల పతాకంపై సందీప్ అగరం, అష్మిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కో-ప్రొడ్యూసర్‌గా కల్పనా వ్యవహరిస్తున్నారు.

కామెడీ & ఎమోషనల్

“ది గ్రేట్ ప్రీ – వెడ్డింగ్ షో ” మూవీ ట్రైలర్‌ను మూవీ టీమ్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇది ఎక్స్‌ట్రార్డినరీ కామెడీ మరియు కొంచం ఎమోషనల్‌గా నడిచే విధంగా కనిపిస్తుంది. తిరువీర్ ఇప్పటి వరకు పూర్తి కామెడీ మూవీలలో కనిపించలేదు.. కానీ ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఫుల్ ఫన్ ఇచ్చాడని అనిపిస్తోంది. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ వంటివన్నీ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతోంది.

కథ ఎలా ఉంటుందంటే?

హీరో ఒక ఫోటోగ్రాఫర్, అతనికి ఒక ఫోటో స్టూడియో ఉంటుంది. అన్ని కార్యక్రమాలకి ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉంటాడు. అలాగే పెళ్లి చేసుకోబోయే ఒక కొత్త జంట.. ప్రీ-వెడ్డింగ్ ఫోటోలు, వీడియోలు తీయ్యడం కోసమని (తిరువీర్)హీరోని సంప్రదిస్తారు. షూటింగ్ అంత అయిపోయిన తరువాత డిజిటల్ కెమెరాలో ఉండే చిప్ పోగొట్టేస్తారు. అప్పుడు ఆ ఫోటోస్ కోసం పెళ్ళికొడుకు ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉంటాడు. అతనికి ఇస్తాను, ఇస్తాను అని అబద్దం చెప్పి మేనేజ్ చేస్తుంటాడు. ఆ సీన్స్ చాలా ఆసక్తికరంగా, ఫుల్ ఫన్నీగా అనిపిస్తాయి.

వీటన్నిటి మధ్యలో హీరో ఒక అమ్మాయితో ప్రేమలో పడుతాడు. ఆ అమ్మాయిని మెప్పించడం కోసమని తన వెంటపడటం, లేనిపోని పాట్లు పడటం అనేది చూడటానికి చాలా కామెడీగా, గమ్మత్తుగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే పోయిన చిప్ కోసం, తను ప్రేమించిన అమ్మాయి కోసం హీరో పడే పడరాని పాట్లు ఇవన్నీ కలిపి సినిమా స్థాయిని మరింత పెంచేసాయి. ఇది ఖచ్చితంగా మంచి హిట్ ఫిలిమ్ అవుతుందని మాత్రం అర్థమవుతున్నది.

నటుడు తిరువీర్ గురించి

పలాస, జార్జి రెడ్డి, మసుధ, పరేషాన్ లాంటి ఎన్నో సినిమాల్లో తిరువీర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తను చేసిన ప్రతి సినిమా, ప్రతి పాత్రకు ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంది. అన్ని మంచి క్యారెక్టర్స్ చేసినప్పటికి.. ప్రధాన కథానాయకుడిగా చేసినవి ఒకటి రెండే ఉన్నాయి. ఇప్పుడు ది గ్రేట్ ప్రీ – వెడ్డింగ్ షోలో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఇది బిగ్ సక్సెస్ అవుతుంది అని కొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా మననం కూడా తిరువీర్ కెరియర్‌లో మంచి విజయం సాధించాలని కోరుకుందాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో 2025 నవంబర్ 7వ (శుక్రవారం) తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ తరువాత ఈ సినిమా ఏ స్థాయిలో ఆడింది. దీనికి వచ్చిన కలెక్షన్స్ ఎంత అనేవి అధికారికంగా వెల్లడవుతాయి.

రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలు

మోంథా తుఫాను.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తీరప్రాంతాలను అల్లకల్లోలం చేసింది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకున్నప్పటికీ.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అతి ఈ రోజు తుఫాన్ బలహీనపడే అవకాశం ఉంది. దీంతో తెలంగాణాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా బుధవారం రోజు మొత్తం మీద తెలంగాణాలో ఎడతెరిపి లేని వర్షాలు కురిశాయి. బహుశా ఈ రోజు కూడా పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏపీలో పరిస్థితులను ఆరా తీసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. కొన్ని కీలక సూచనలు చేశారు.

తుఫాన్ ప్రభావం.. పవన్ కళ్యాణ్ సూచనలు

రాష్ట్రంలోని సుమారు 1583 గ్రామాలపై తుఫాన్ ప్రభావం పడినట్లు అధికారులు.. పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. 125 చోట్ల రహదారులు పాడైనట్లు పేర్కొన్నారు. తుఫాన్ సమయంలో అధికార యంత్రంగా, సంబంధిత అధికారులు బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంది. ముఖ్యంగా తాగునీటి వసతి కల్పించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. దెబ్బతిన్న రోడ్లను తొందరగా బాగు చేయాలని ఆదేశించారు. సూపర్ క్లోరినేషన్, శానిటైజేషన్ వంటి కార్యక్రమాలను కూడా చేపట్టాలని వివరించారు.

ప్రత్యేక బృందాల ఏర్పాటు

తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో.. తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతాయి. వరదనీరు తగ్గేవరకు ప్రజలను కావలసిన నిత్యావసరాలను ఏర్పాటు చేయాలి. తాగునీటిని అందించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. గ్రామాల్లో ప్రత్యేకంగా శానిటైజేషన్ బృందాలను ఏర్పాటు చేయాలి. తాగునీరు కలుషితమైతే.. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి దీనిపై అధికారులు తప్పకుండా శ్రద్ద వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవరకు.. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు.

పునరావాస కేంద్రాల్లో ఉండేలా..

రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ శానిటైజేషన్ బృందాలను ఏర్పాటు చేయాలి. పారిశుధ్య పనులను వేగవంతం చేయాలి. దెబ్బతిన్న రోడ్లు, వంతెనలను తక్షణమే బాగుచేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అంతే కాకుండా తుఫాన్ బలహీన పడిన తరువాత కూడా.. పరిస్థితులు చక్కబడే వరకు ప్రజలను పునరావాస కేంద్రాల్లో ఉండేలా చూసుకోవాలని అన్నారు. మోంథా తుఫాన్ తీరందాటే సమయంలో వర్షాలు భీభత్సంగా కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దీనికి అధికార యంత్రంగా తోడుగా ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

మోంథా తుఫాన్

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారి.. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో భారీ నష్టాన్ని కలిగింది. వేలఎకరాల పంట నష్టం జరిగింది. రోడ్లు దెబ్బతిన్నాయి. ప్రజారవాణా చాలా చోట్ల ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఎక్కడ చూసినా నీటిమయమే. అయితే ఇప్పటివరకు ఎంత నష్టం జరిగిందనే విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. కానీ పరిస్థితులు చూస్తుంటే.. ఊహకందని నష్టం జరిగిందని స్పష్టంగా అర్థమవుతోంది.

తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను బాగుచేయడానికి ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకుంటోంది. ఎవరు ఎలాంటి చర్యలు తీసుకున్న ప్రకృతి వైపరీత్యాలను ఆపడం మానవాతీతం అనే చెప్పాలి. అయితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికి కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం సహకరించింది. ఇదే సమయంలో పరిస్థితులను చక్కదిద్దడానికి.. తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీచేసారు.

సినిమాల్లోకి మహేష్ బాబు మేనకోడలు: వెండితెర వెయిటింగ్!

0

దివంగత నటుడు.. తెలుగు సినిమా సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో వ్యక్తి వెండితెరపై కనిపించడానికి సిద్ధమవుతోంది. మహేష్ బాబుకు స్వయానా మేనకోడలు అయిన జాన్వీ స్వరూప్ త్వరలోనే.. సినిమాల్లో నటించే అవకాశం ఉందని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

మహేష్ బాబు మేనకోడలు

నటుడు మహేష్ బాబు అక్క మంజుల ఘట్టమనేని & సంజయ్ స్వరూప్ దంపతుల కుమార్తె జాన్వీ స్వరూప్. జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా మంజుల కుమార్తె సినీరంగ ప్రవేశానికి సంబంధించిన విషయాన్ని వెల్లడించింది. ”నా చిన్న కుమార్తె జాన్వీ స్వరూప్.. తన సొంత వెలుగులోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె వెలుగు వారసత్వంలోనే ఉంది.. ఇప్పుడు అది ప్రకాశించే సమయం వచ్చేసింది. ప్రపంచం కూడా ఆమె ప్రతిభను త్వరలోనే గుర్తిస్తుంది. ఐ లవ్ యూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు జాను” అంటూ మంజుల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.

తల్లుదండ్రులు నటులే!

నిజానికి జాన్వీ తల్లిదండ్రులైన మంజుల, సంజయ్ స్వరూప్ ఇద్దరూ కూడా నటులే కావడం గమనించదగ్గ విషయం. మంజుల.. సేవకుడు, మళ్లీ మొదలైంది, ఆరెంజ్, కావ్యాస్ డైరీస్, మంత్ ఆఫ్ మధు, హంట్ వంటి సినిమాల్లో నటించింది. మనసుకు నచ్చింది అనే సినిమాకు ఈమె దర్శకురాలిగా కూడా పనిచేశారు. ఇక సంజయ్ స్వరూప్ విషయానికి వస్తే.. ఆయన చల్ మోహనరంగ, అర్జున్ రెడ్డి వంటి సినిమాల్లో కనిపించారు. ఇప్పుడు వీరి ముద్దుల కుమార్తె.. వేడితెర మీద కనిపించడానికి సిద్ధంగా ఉందని చెబుతున్నారు.

జాన్వీ స్వరూప్.. సినిమాల్లో రానున్నట్లు క్లారిటీ వచేసినప్పటికీ.. ఎలాంటి సినిమాల్లో నటించనున్నారు, ఏ హీరో సరసన నటించనున్నారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. అయితే ఈమె ఇప్పటికే మనసుకు నచ్చింది అనే సినిమాలో ఓ సన్నివేశంలో కనిపించారు. ఇకపై కథానాయకి (హీరోయిన్)గా కనిపించబోతున్నారు. బహుశా.. ఈమెను సినిమా ప్రపంచానికి పరిచయం చేయడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు భావిస్తున్నారు.

సినిమా రంగంలో వారసత్వం

చిత్ర పరిశ్రమలో వారసత్వం కొత్తేమీ కాదు. కష్టపడి పైకొచ్చిన హీరోల కంటే.. ఆ హీరోల పేరుతో తెరమీదకు వచ్చినవారు చాలామందే ఉన్నారు. ఈ జాబితాలో మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, దగ్గుపాటి ఫ్యామిలీ మొదలైనవన్నీ ఉన్నాయి. ఇందులో హీరోలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. హీరోయిన్స్ మాత్రం తక్కువనే చెప్పాలి. అయితే ఇప్పుడు.. జాన్వీ స్వరూప్ త్వరలోనే వెండితెర మీద కనిపించనుంది.

జాన్వీ స్వరూప్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు.. శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ శుభసందర్భంలో.. ఈమె సినిమాల్లోకి రానున్నట్లు వెల్లడించిన వార్త.. మహేష్ బాబు అభిమానుల్లో ఒకింత ఆనందాన్ని కలిగిస్తోంది. నెటిజన్లు కూడా ఈమెకు సినిమాల్లో మంచి భవిష్యత్తు ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. మొత్తం మీద మహేష్ బాబు మేనకోడలు తెరమీద ప్రేక్షకులను అలరించబోతుందన్నమాట. కాబట్టి ఇక ఈమె ఏ సినిమాలో కనిపించబోతుందో తెలుసుకోవాలంటే.. ఇంకా కొంత కాలం వేచి చూడాల్సిందే.

ఖరీదైన కారు కొన్న శంకర్ మహదేవన్: దీని గురించి తెలుసా?

0

బాలీవుడ్ నటి, బీజేపీ నాయకురాలు హేమ మాలిని ఎంజీ ఎం9 కొనుగోలు చేసిన తరువాత.. ప్రముఖ సంగీత విద్వాంసుడు శంకర్ మహదేవన్ అదే మోడల్ కారును కొనుగోలు చేశారు. ఇంతకీ ఆ కారు ధర ఎంత?, దాని వివరాలు ఏమిటి?, వీరిరువురూ కాకుండా.. ఇంకెవరైనా కొనుగోలు చేశారా అనే విషయాలను ఈ కథనంలో క్షుణ్ణంగా తెలుసుకుందాం.

ఎంజీ ఎం9 ఎలక్టిక్ కారు

శంకర్ మహదేవన్ కొనుగోలు చేసిన ఎంజీ ఎం9 ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 69.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 7 సీటర్ కారు. కియా మోటార్స్ ఈ కారును ఈ మధ్యలో భారతదేశంలో విక్రయించడం మొదలుపెట్టింది. శంకర్ మహదేవన్ కారు కొనుగోలు చేయడానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆయన కుటుంబాన్ని కూడా చూడవచ్చు.

బ్లాక్ కలర్ ఎంజీ ఎం9

కొత్త కారును కొనుగోలు చేసిన తరువాత.. హిందూ సంప్రదాయం ప్రకారం, పూజాది కార్యక్రమాలు చేసిన తరువాత.. శంకర్ మహదేవన్ & ఆయన భార్య రెండవ వరుసలో కూర్చున్నారు. ముందువైపు ఆయన కుమారు కూర్చున్నారు. విలాసవంతమైన క్యాబిన్, కారు డిజైన్ అన్నీ కూడా వారిని ఎంతగానో ఆకట్టుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. వీరు మెటల్ బ్లాక్ కలర్ కారును కొనుగోలు చేశారు. కాగా కంపెనీ ఈ కారును బ్లాక్ రూఫ్.. పెర్ల్ వైట్ & బ్లాక్ రూఫ్ కాంక్రీట్ గ్రే అనే రంగులలో కూడా విక్రయిస్తోంది.

డిజైన్ & ఇంటీరియర్ ఫీచర్స్

కియా ఎంజీ ఎం9 ఎలక్ట్రిక్ కారు.. బోల్డ్ ఫ్రంట్ ఎండ్‌తో, బోల్డ్ డిజైన్ పొందుతుంది. ట్రాపెజోయిడల్ మెష్ గ్రిల్ కూడా ఇందులో చూడవచ్చు. స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, కనెక్టెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్స్ కూడా ఇందులో కనిపిస్తాయి. మొత్తం మీద డిజైన్ చాలా అద్భుతంగా ఉందని తెలుస్తోంది. ఈ కారు డిజైన్ చూపరులను ఒక్క చూపుతోనే ఆకట్టుకుంటోంది.

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే.. విశాలమైన & విలాసవంతమైన ఇంటీరియర్ ప్రయాణికులకు లేదా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అడ్జస్టబుల్ సీటింగ్, మసాజ్ ఫంక్షన్స్, వెంటిలేషన్ అన్నీ కూడా గొప్పగా ఉన్నాయి. యాచ్ స్టైల్ డ్యూయెల్ సన్‌రూఫ్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, 13 స్పీకర్ ఆడియో సిస్టం, సబ్ వూఫర్స్, యాంప్లిఫైయర్ కూడా ఈ కారులో ఉన్నాయి.

వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేసే 12.3 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం. 7 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఈ సిమ్ బేస్డ్ టెక్నాలజీ వంటి.. కార్ కనెక్టెడ్ టెక్నాలజీ, ముందు.. వెనుక వరుసలో ఆర్మ్‌రెస్ట్‌లు, 360 డిగ్రీ కెమెరా, పవర్ స్లైడింగ్ డోర్స్ మొదలైనవన్నీ ఈ కారులో ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే.. ఈ కారులో 7 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటివి ఉన్నాయి.

బ్యాటరీ & రేంజ్

శంకర్ మహదేవన్ కొనుగోలు చేసిన కొత్త ఎంజీ ఎం9 ఎలక్ట్రిక్ కారు 90 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 245 హార్స్ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు ఒక ఫుల్ ఛార్జితో 548 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా కంపెనీ ఈ కారు కోసం 11 కేడబ్ల్యు వాల్ బాక్స్ ఛార్జర్‌తో పాటు.. 3.3 కేడబ్ల్యు ఫోర్టబుల్ ఛార్జర్‌ను అందిస్తుంది. కాబట్టి ఛార్జింగ్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.

మమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు: పా. రంజిత్‌ కీలక వ్యాఖ్యలు!

0

మారి సెల్వరాజ్ దర్శకత్వంలో పా. రంజిత్ నిర్మించిన బైసన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తమిళనాడులో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమంలో పా. రంజిత్ మాట్లాడుతూ.. చాలా ఎమోషనల్ అయ్యాడు. తమిళ ప్రేక్షకులు, దర్శకులు, రిపోర్టర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్, ట్రోలర్స్, నెటిజన్స్ ఇలా అందిరిపైనా ఆయన తీవ్రంగా ఆవేదనతో స్పందించారు. అసలు ఎందుకు ఇలా మాట్లాడాల్సివచ్చిందంటే..

మేము కారణం అనడం సరికాదు!

తమిళ సినిమా ఇండస్ట్రీని నాశనం చేశామని, కోట్ల రూపాయలు సంపాందించే స్థాయి చిత్రాలు తమిళంలో రావడం లేదని తెలుగు, కన్నడ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా వేలకోట్ల రూపాయలు సాధించేటటువంటి రూటెడ్ సినిమాలు తీస్తున్నారని అవి బిగ్ సక్సెస్ అవుతున్నాయని (డబ్బులు పరంగా) తమిళంలో మాత్రం అటువంటి సినిమాలు రావడం లేదని అందుకు కారణం మేమే అంటూ కొంతమంది అదేపనిగా మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు.

ఈ సందర్బంగా కాంతారా సినిమాను ఉదహరిస్తూ.. కాంతారా లాంటి సినిమాలు సక్సెస్ అయినప్పుడు కేవలం నన్ను, వెట్రిమారన్, మారి సెల్వరాజ్ మా ముగ్గురినే టార్గెట్ చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. మేము తీసే కులం ఆధారిత, అణచివేతకి సంబందించిన సినిమాల వల్లే తమిళ ఇండస్ట్రీ చెడిపోయింది అనడం సరికాదన్నారు.

రెండేళ్లలో వందల సినిమాలు

ఇప్పటి వరకు నేను కేవలం ఏడు సినిమాలు మాత్రమే చేశాను, మారి సెల్వరాజ్ ఐదు సినిమాలు తీశాడు, వెట్రి మారన్ కూడా మా మాదిరిగానే తీశారు. ఇంకా చెప్పాలంటే నేను రెండు సంవత్సరాలకు ఒక సినిమా తీస్తా, వెట్రిమారన్ మూడు ఏళ్లకు ఒక సినిమా తీస్తారు. మరి తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఒక సంవత్సరానికి దాదాపు 200 నుంచి 300 సినిమాలు విడుదల అవుతాయి, రెండు ఏళ్ళల్లో 600 సినిమాలు ఇండస్ట్రీ నుంచి వచ్చాయి. అయితే తమిళ ప్రేక్షకులు ఎందుకు మిగిలిన ఆ సినిమాలన్నింటిని సక్సెస్ చేయలేకపోయారని, ఎవరు కూడా తమిళ సినిమా స్థాయిని పెంచలేకపోయారు ఎందుకని ఆయన ఈ సంధర్బంగా ప్రశ్నించారు.

కాలా మూవీ విడుదలకు ముందే వందకోట్ల రూపాయలు కలెక్షన్స్ రాబట్టిందని.. కొంతమంది అదే పనికట్టుకొని ప్రేక్షకులు సినిమా చూడకముందే వాళ్లలో మా సినిమాలపట్ల ఒక చెడు అభిప్రాయాన్ని కలిగిస్తున్నారని ఆవేదన చెందారు. ప్రేకక్షకులు ఎప్పుడూ ప్రేమతో సినిమా చూస్తారని దాన్ని చెడగొట్టొద్దని పా. రంజిత్ అన్నారు.

నెటిజన్ల మద్దతు

పా. రంజిత్ మాట్లాడిన వ్యాఖ్యలకు అభిమానులు, ప్రేక్షకుల నుంచి భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని, సంవత్సరానికి కొన్ని వందల సినిమాలు కేవలం వినోదం కోసం మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. పా. రంజిత్, మారి సెల్వరాజ్, వెట్రి మారన్ వీళ్ళు తీసే సామాజిక వ్యవస్థను ఆలోచింపజేసే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఒకటి రెండు సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయని.. వాటి వల్లే తమిళ సినిమా చెడిపోతుంది అనడం హాస్యాస్పదం అని అభిమానులు అంటున్నారు.

సినిమాలో ఉన్న సామాజిక అంశాన్ని అర్థం చేసుకోవాలని దాన్ని కుల ఆధారితంగా చూడకూడదని పా. రంజిత్ హితవు పలికాడు. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. పా. రంజిత్ సినిమాల ఇండస్ట్రీకి వచ్చి కేవలం ఒక పది.. పదిహేనేళ్ళు అవుతుంది అంతే. మరి అంతకు ముందు ఆ తరువాత మిగిలిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, ప్రేక్షకులు ఏమి చేసినట్టు అనే ప్రశ్న ఇక్కడ కొంతమంది లేవనేత్తుతున్నారు.

సినిమా చూసి షాకవ్వకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతా!: రాజేంద్ర ప్రసాద్

0

మాస్ మహారాజ రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా మాస్ జాతర.. ఈ నెల 31న థియేటర్లలో ప్రేక్షకుల ముందకు వస్తోంది. ఈ సందర్బంగా సితార ఎంటర్టైన్మెంట్ & ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంస్థల ప్రొడ్యూసర్స్ హైదరాబాద్​లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ చిత్రంలో నటించిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్.. ఈ ఫంక్షన్‌లో సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు.. హీరో రవితేజకు సంబంధించిన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు.

సినిమా చూసి షాకవ్వకపోతే..

రాజేంద్ర ప్రసాద్ మైక్ పట్టుకోగానే ప్రేక్షకులు, అభిమానులు ఈలలు, కేరింతలతో కాసేపు ఆయనను మాట్లాడనివ్వలేదు. ఇదే జోష్ మనకు కావాలని ఆయన కూడా విజిల్ వేసి ఫుల్ ఖుషి అయ్యారు. లేడీస్ టైలర్ సినిమా నుంచి ఈ సాండ్ నేర్పింది నేనే అంటూ చెప్పాడు. ఈ మధ్య కాలంలో అన్ని మసాలాలు కలిపిన సినిమా రాలేదని తన అభిప్రాయం తెలిపారు.

నా జీవితంలో.. నేను ఎప్పుడు ఇలాంటి పాత్ర చేయలేదని, ఇది కచ్చితంగా మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని అన్నారు. ఈ సినిమాలో కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ అన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి. నా గుండెల మీద చెయ్యేసి చెబుతున్నా ఈ సినిమా చూస్తే మనల్ని తప్పకుండా అభినందిస్తారు అని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా చూసి మీరు షాక్ అవ్వకపోతే నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను అని ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.

ఫస్ట్ టైమ్ నాకు కిక్ ఇచ్చారు!

జులాయి సినిమా దగ్గర నుంచి నాన్నకి ప్రేమతో వరకు వరుసగా హిట్ సినిమాలు తీస్తూ వస్తున్నాను. కానీ రవి ఏమైపోయాడు అంటూ ఒక ఆశ్చర్యం కలిగించే మాట అన్నాడు. అయితే వెయిట్ చేసి చేసి ఈ సినిమాతో మంచి ‘మాస్ జాతర’ చూపించబోతున్నాడు. రవి నాకోసం కొన్ని సీన్లు రచయిత, దర్శకులతో ప్రత్యేకంగా రాయించి మరి షూట్ చేయించాడని పొగిడారు.మాస్ మహారాజ్ కిక్ మామూలే.. కాకపొతే ఫస్ట్ టైమ్ నాకు మాస్ కిక్ ఇచ్చారు అంటూ ప్రేక్షకులతో పంచుకున్నారు.

సూర్య గురించి.. రాజేంద్ర ప్రసాద్

ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా తమిళ యాక్టర్ హీరో సూర్య హాజరయ్యారు. ఆయన గురించి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. సూర్య పేరు చెప్పగానే ఫ్యాన్స్ ఈలలు వేసి గోల చేశారు.. దాంతో ఇదే మన సంస్కారం అని అంటూ సూర్య అడాప్టెడ్ తెలుగు నటుడు అయ్యారని పొగుడుతూ.. నువ్వు అంటే నాకు ఎంతో ప్రేమని అన్నారు. సూర్య ఎంతో మంచి యాక్టర్ అని దాంతో పాటు మంచి మానవత్వం ఉన్న మనిషి, ఆయన చాలా మంది పిల్లల్ని చదివిస్తున్నారని కొనియాడారు. అందుకుగాను సూర్య లేచి నిలబడి మరి రాజేంద్ర ప్రసాద్‌కు నమస్కారం చేశారు. నేను కూడా ఒక యాక్టర్.. నా సినిమాలు ఏదైనా చూసారా అని సరదాగా రాజేంద్ర ప్రసాద్ అడిగారు.

నేను ఇంకా మీ ముందు ఇలా బతుకుతున్నాను అంటే కారణం భాను లాంటి దర్శకులు, రచయితలు అన్నారు. వాళ్ళు నాకు రాసే క్యారెక్టర్స్ వల్ల నేను ఇప్పటికి ఉన్నానని చెప్పుకొచ్చారు. యాక్టర్స్ నవీన్, శ్రీలీలకు.. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఈ సినిమాని అందరూ థియేటర్లలోనే చూడాలని ప్రేక్షకులకి చెబుతూ సక్సెస్ మీట్‌లో మళ్ళీ కలుసుకుందామని రాజేంద్ర ప్రసాద్ ఫుల్ మాస్ జాతర స్పీచ్ ఇచ్చారు.

పుట్టిన ఊరికే గర్వకారణం.. కబడ్డీ ఆటలో బంగారం: ఎవరీ కార్తీక?

0

కార్తీక ఎక్స్‌ప్రెస్.. ఇది ఏ ట్రైన్ పేరు అనుకుంటే మీరు పొరబడినట్టే!. ఆటలో కార్తీక వేగానికి, బలానికి, ఆట తీరుకి పెట్టిన పేరే ఈ కార్తీక ఎక్స్‌ప్రెస్. యావత్ భారతదేశం అంతటా ఇప్పుడు ఈ నేషనల్ కబడ్డీ ప్లేయర్ ఆర్. కార్తీక పేరే వినబడుతున్నది. ముఖ్యంగా తమిళనాడులో మారుమోగుతోంది. రాజకీయంగా (అధికార, ప్రతిపక్ష వర్గాలు) సామాజికంగా, క్రీడా పరంగా, చలన చిత్ర ఇలా అన్నీ రంగాల నుంచి కార్తీక ఎనలేని ప్రశంసలు అందుకుంటోంది. కబడ్డీ అందరూ ఆడుతారు కానీ కొంతమంది మాత్రమే అందులో తమ ప్రత్యేకతను చాటుకుంటారు. ఇది అతి కొద్దిమందికి మాత్రమే సాధ్యమయ్యే విషయం. ఇంతకీ ఈమె ఎవరు.? ఎక్కడ నుండి వచ్చింది..? ఎందుకు కోసం కబడ్డీ ఆడుతోంది..? ఇవన్నీ తెలుసుకుంటే కార్తీక ఎందుకు అంత స్పెషల్ అనేది తెలుస్తుంది.

కబడ్డీలో గోల్డ్ మెడల్

ఆర్. కార్తీక ప్రస్తుతం భారత జాతీయ కబడ్డీ జట్టులో ఆడుతున్నారు. అంతే కాకుండా అండర్-18 కబడ్డీ మహిళల జట్టుకు ఆమె వైస్ కెప్టెన్ కూడా. ఇండియా వర్సెస్ ఇరాన్ అంతర్జాతీయ కబడ్డీ ఫైనల్లో బహ్రెయిన్‌లో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించారు. 75-21తో ఓడించడం విశేషం. ఇందుకుగాను ఆమె బంగారు పతకం సాధించింది. ఈ విజయం ఒక్క తమిళనాడుకే కాదు.. ఇది ఇండియన్ హిస్టరీలోనే ఒక అద్భుతమైన గట్టం. ఆసియా యూత్ గేమ్స్ 2025 పేరుతో ఈ కబడ్డీ ఈవెంట్స్ జరిగాయి.

కార్తీక తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఉన్న కన్నగి నగర్ అనే ప్రాంతానికి చెందినవారు. తల్లి శరణ్య ఆటో రిక్షా వర్క్ చేస్తుంది. ఆమెకు వచ్చే డబ్బులతోనే కబడ్డీకి సంబంధించిన ఖర్చులన్ని బరిస్తూ వచ్చింది. ఈమెకి ఒక చెల్లి కూడా ఉంది. ఆమె కూడా కబడ్డీ ఆడుతుంది. నాన్న కన్‌స్ట్రక్షన్ కూలీ పనులకు వెళ్తారు. కార్తీక చెన్నై కార్పొరేషన్ స్కూల్లో పన్నెండో తరగతి చదువుతోంది.

ఘన స్వాగతం పలికిన తమిళనాడు

అంతర్జాతీయ కబడ్డీ ఫైనల్ గెలిచిన తరువాత తమిళనాడులో ఆమెకి ఘనస్వాగతం లభించింది. పూల మాలలతో స్వాగతం పలుకుతూ.. టపాసాలు పెల్చుతూ, దారిపొడుగునా పూలు చల్లుతూ ఇండియన్ కబడ్డీ క్వీన్‌కు స్వాగతం పలికారు. తరువాత తమిళనాడు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయానిధి స్టాలిన్, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళని స్వామి, సినిమా డైరెక్టర్ పా. రంజిత్ తదితరులు ఆమెను ప్రశంసించారు.

కార్తీక పదకొండు సార్లు జాతీయ స్థాయిలో తమిళనాడు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. అనేక చోట్ల మెడల్స్, ఖేలో ఇండియా మెడల్స్, జూనియర్ నేషనల్ 2024లో సిల్వర్ కూడా గెలిచింది. 2025లో జాతీయ కబడ్డీకి సెలెక్ట్ అయింది. జూనియర్స్ స్థాయిలో మంచి పేరు తెచ్చుకునింది.

గర్వాంగా చెప్పుకుంటున్నా.. నాది కన్నగి నగర్

కన్నగి నగర్ అనే ప్రాంతం ఒక స్లమ్ ఏరియా.. అందులోనూ ఆ ప్రాంతాన్ని అందరూ పేదరికం, గ్యాంగ్ వార్స్ ఎక్కువ ఉండే ప్రాంతంగా చూసేవారని చెబుతారు. ఇక్కడ అతి పెద్ద స్లమ్ ప్రాజెక్టును కూడా చెప్పట్టినట్టు సమాచారం. చాలామంది ఈ ప్రాంతంలో నివసించేవారు కూడా.. కన్నగి నగర్ పేరు చెప్పుకునేవారు కాదు. కానీ కార్తిక సాధించిన విజయం.. ఈ ప్రాంతవాసులకు గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అంతే కాకుండా.. ఇప్పుడు నేను కన్నగి నగర్ అమ్మాయి అని గర్వంగా చెప్పుకుంటాను అంటూ కార్తీక సంతోషం వెలబుచ్చింది. ఆ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆమె ఎంతో తపనపడుతోంది. ఇప్పుడిప్పుడే కార్తీక వల్ల మార్పు వస్తోంది.

ఒక్క సంతకం.. రూ.కోటి పెరిగిన బైక్ రేటు: ఎందుకంటే?

0

భారతదేశంలో అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో.. బీఎండబ్ల్యూ మోటోరాడ్ కంపెనీకి చెందిన బైకులు ఉన్నాయి. అయితే ఒక ప్రముఖ వ్యక్తి చేసిన ఒకే ఒక్క సంతకం.. ఈ బ్రాండుకు సంబంధించిన ఒక బైకు రేటును అమాంతం పెంచేసింది. ఇంతకీ ఆ ప్రముఖ వ్యక్తి ఎవరు?, ఆ బైక్ సాధారణ ధర ఎంత అనే వివరాలు క్షుణ్ణంగా.. ఈ కథనంలో చూసేద్దాం.

పోప్ లియో XIV సంతకం

క్రైస్తవ మత గురువు.. రోమన్ క్యాథలిక్ చర్చ్ అధినేత పోప్ లియో XIV.. 2025 సెప్టెంబర్‌లో బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఆర్18 ట్రాన్స్‌ కాంటినెంటల్ మోటార్‌సైకిల్‌పై సంతకం చేశారు. ఈ సంతకం చేసిన బైకును జర్మనీలోని మ్యూనిచ్‌లో ఆర్ఎమ్ సోథెబీస్ నిర్వహించిన వేలంలో ఏకంగా 130000 యూరోలకు విక్రయించారు. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 1.32 కోట్లు అన్నమాట. బైకు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బును.. మడగాస్కర్‌లోని పిల్లల సహాయ ప్రాజెక్టులకు విరాళంగా ఇవ్వనున్నారు.

వేలంలో భారీ ధరకు విక్రయించిన.. బీఎండబ్ల్యూ ఆర్18 ట్రాన్స్‌ కాంటినెంటల్ బైకును ప్రత్యేకంగా కస్టమైజ్ చేశారు. దీనిని పోప్ లియో XIV సంతకం చేయించడం కోసం కంపెనీ అధినేత మైఖేల్ సోమర్ అందించారు. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ మీద ఆయన సంతకం చేశారు. ఈ కార్యక్రమానికి సెప్టెంబర్‌లో భారీ ఎత్తున ప్రజలు, అభిమానులు హాజరయ్యారు.

బీఎండబ్ల్యూ ఆర్18 ట్రాన్స్‌ కాంటినెంటల్

ఇండియన్ మార్కెట్లో బీఎండబ్ల్యూ ఆర్18 ట్రాన్స్ కాంటినెంటల్ బైక్ ప్రారంభ ధర రూ. 34.72 లక్షలు (ఎక్స్ షోరూమ్). కాగా పోప్ లియో XIV సంతకం చేసిన ఈ మోడల్ బైక్ ఏకంగా రూ. 1.32 కోట్లకు అమ్ముడైంది. అంటే.. సాధారణ ధరకంటే సుమారు కోటి రూపాయలు ఎక్కువన్నమాట.

ఇంజిన్ డీటెయిల్స్

బీఎండబ్ల్యూ ఆర్18 ట్రాన్స్ కాంటినెంటల్ 1802 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ బాక్సర్ ట్విన్ ఇంజిన్ ద్వారా.. 91 హార్స్ పవర్, 158 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ పొందుతుంది. ఈ బైకులో.. బ్లూటూత్ కనెక్టివిటీ మరియు న్యావిగేషన్ వంటి వాటితో కూడిన 10.25 ఇంచెస్ టీఎఫ్‌టీ కలర్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది బైక్ స్పీడ్, ఫ్యూయెల్ స్టేటస్ వంటి వాటిని ప్రదర్శిస్తుంది.

ఆర్18 ట్రాన్స్ కాంటినెంటల్ బైకులో.. బీఎండబ్ల్యూ మోటోరాడ్ డైనమిక్ క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్ హెడ్‌లైట్స్, కీలెస్ ఇగ్నిషన్, స్టెబిలిటీ కంట్రోల్ వంటి వాటితో పాటు రాక్, రోల్ అనే రైడింగ్ మోడ్స్ కూడా అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 180 కిమీ/గం అని తెలుస్తోంది. కాగా పనితీరు విషయంలో అత్యద్భుతంగా ఉంటుంది. సాధారణంగానే ఈ బైక్ ధర కొంత ఎక్కువ కాబట్టి.. ఈ బైక్ సేల్స్ కొంత తక్కువగానే ఉంటాయి.

ఇండియన్ మార్కెట్లోని బీఎండబ్ల్యూ బైకులు

భారతదేశంలో బీఎండబ్ల్యూ మోటోరాడ్ సుమారు 14 మోడల్ బైకులను విక్రయిస్తోంది. అవి బీఎండబ్ల్యూ జీ 310 ఆర్, జీ 310 జీఎస్, జీ 310 ఆర్ఆర్, ఎఫ్ 900 ఆర్, ఎఫ్ 900 ఎక్స్ఆర్, ఎఫ్ 900 జీఎస్, ఎఫ్ 900 జీఎస్ అడ్వెంచర్, ఎస్ 1000 ఆర్, ఎస్ 1000 ఆర్ఆర్, ఏం 1000 ఎక్స్ఆర్, ఆర్ 12, ఆర్ 1300 జీఎస్, ఆర్ 1300 జీఎస్ అడ్వెంచర్, సీఈ 04. వీటి ఎక్స్ షోరూమ్ ధరలు చాలా ఎక్కువ.

శ్రీలీలతో.. రవితేజ మాస్ జాతర: హిట్ పడాల్సిందేనా?

0

మాస్ మహారాజ.. హీరో రవితేజ & హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన సినిమా మాస్ జాతర.. మనదే ఇదంతా అనే ట్యాగ్‌లైన్‌తో ఈ నెల చివర థియేటర్లలో బ్రహ్మాండంగా విడుదల కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్ & ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై.. నిర్మాతలు ఎస్ నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. భీమ్స్ సేసిరోలియో మూవీకి సంగీతం అందిస్తుండగా.. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

హిట్ పడాల్సిందే!

రవితేజను వరుసగా ప్లాప్స్ వెంటాడుతున్న వేళ.. ఇప్పుడు ఈయనకు ఒక హిట్ మూవీ పడాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం రవితేజ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2020 నుంచి క్రాక్, ధమాకా.. ఆ తరువాత చిరంజీవితో కలిసి నటించిన వాళ్తేరు వీరయ్య లాంటి ఏదో ఒకటి రెండు విజయాలు తప్పా చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. టైగర్ నాగేశ్వరావు, ఈగల్, ఖిలాడి, డిస్కో రాజా, రామారావు ఆన్ డ్యూటీ ఇటువంటి సినిమాలు అన్నీ కూడా రవితేజను నిరాశపరిచాయి.

గత ఐదారు సంవత్సరాల నుంచి రవితేజ ఎంచుకుంటున్న సినిమాల.. కథలన్నీ కూడా ఒకే విధమైన నటనా శైలి మరియు యాక్షన్ సీన్స్, డైలాగ్ మాడ్యూలేషన్ అన్నీ కూడా ఒకేలా ఉండటం, అన్నీ కమర్షియల్ రొటీన్ ఎంటర్‌టైన్‌మెంట్ మాదిరిగా అనిపిస్తుండటం, కథలో పెద్దగా బలం లేకపోవడంతో పాటు కేవలం ఏదో కావాలనే కామెడీ, యాక్షన్, సాంగ్స్ అన్నీ కూడా బలవంతంగా చొప్పించినట్టు అనిపించేలాగా ఉండటం వల్ల పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు.

రిలీజ్ ఎప్పుడంటే?

చాన్నాళ్లుగా పెద్ద హిట్ రవితేజ ఖాతాలో పడలేదు. ఇప్పుడు రవితేజకి ఇండస్ట్రీలో ఒక బిగ్ హిట్ తప్పకుండా కావాల్సి ఉంది. ఇందులో భాగంగా మళ్ళీ ఒక్కసారి ధమాకా హిట్ కాంబినేషన్ శ్రీలీలతో కలిసి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. పలుమార్లు రిలీజ్ తేదీలు వాయిదాలు పడుతూ వచ్చాయి. అయితే మొత్తంగా సినిమాను అక్టోబర్ 31న విడుదల చేయడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు జరిగాయి. కాగా ఈ రోజు (అక్టోబర్ 27) రిలీజ్ అయినా ట్రైలర్ కూడా రిలీజ్ డేట్ అక్టోబర్ 31 అని ఫిక్స్ చేసింది. దీంతో రవితేజ అభిమానులు రాబోయే సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్, పోస్టర్స్ అన్నీ కూడా సినిమాకి మంచి స్పందన తీసుకొచ్చాయి. మాస్, యాక్షన్, కామెడీ, లవ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వనున్నట్టు అర్థమవుతోంది. ఈ చిత్రంలో రవితేజ పోలీస్ గెటప్‌లో కనిపిస్తున్నాడు. ఇది వరకే చాలా సినిమాల్లో రవితేజ పోలీస్ డ్రెస్ వేసుకుని కనిపించాడు. అందులో కొన్ని బిగ్ సక్సెస్ అయ్యాయి. కొన్ని ప్లాప్ అయ్యాయి. మరి ఇది ఎలా ఉండనుందో చూడాలి.

ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం సూర్య

“మాస్ జాతర మూవీ టీమ్.. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం తమిళ యాక్టర్ సూర్యను ఆహ్వానించారు. అక్టోబర్ 28న హైదరాబాద్, జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. సాయంత్రం 5:30 గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుంది. సూర్య మరియు రవితేజ ఇద్దరిని ఒకే వేదిక మీద చూడటం అనేది.. నిజంగా ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆనందించే అంశంగా చెప్పుకోవాలి. మిగిలిన తారగనం అంతా కూడా వేడుకలో పాల్గొని సందడి చేయనున్నారు. రవితేజ కెరియర్‌లో మాస్ జాతర బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలవాలని కోరుకుందాం. రవితేజ మాస్ జాతరతో విజయం సాధిస్తాడా.. లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.