Home Blog Page 118

మొన్న హర్మన్‌ప్రీత్.. నేడు స్మృతి మందాన: నెటిజన్లు ఫిదా!

మహిళల ప్రపంచ కప్ 2025 సొంతం చేసుకున్న టీమిండియా ప్రస్తుతం సంబరాల్లో మునిగిపోయింది. విశ్వ విజేతగా నిలిచిన తరువాత.. ఉమెన్స్ టీమ్.. ట్రోఫీతో భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. టీమిండియా మహిళా వైస్ కెప్టెన్ స్మ్రితి మంధాన చేతిపై ఒక టాటూ కనిపించింది. ఇది నెటిజన్లను, క్రికెట్ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ముంజేయిపై టాటూ..

టీమిండియా వైస్ కెప్టెన్.. స్మృతి మందాన ట్రోఫీ గెలుచుకున్న తరువాత, వరల్డ్ కప్ ట్రోఫీని, దానికింద 2025 అనే అక్షరాలను తన ముంజేయిపై టాటూగా వేయించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన క్రికెట్ ప్రేమికులు.. చాలా సంబరపడిపోతున్నారు.

ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా.. సౌత్ ఆఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి, తమ తొలి ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. టీమిండియా ఉమెన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ కూడా వరల్డ్ కప్ టాటూను వేయించుకున్నారు. ఈమె తన టాటూలో.. వరల్డ్ కప్ ట్రోఫీ, దాని పక్కన 52, కింద 2025 అని వేయించుకుంది. కౌర్ ఈ ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ.. నా చర్మంపై, నా హృదయంలో ఇది ఎప్పటికీ ఉంటుందని పేర్కొంది. మొదటి రోజు నుంచి నీకోసం (వరల్డ్ కప్ కోసం) ఎదురు చూశాను. ఇప్పుడు ప్రతిరోజూ.. నిన్ను చూసి కృతజ్ఞతతో ఉంటాను అని వెల్లడించింది.

ప్రధాన మంత్రితో టీమిండియా

ఐసీసీ ట్రోఫీ గెలుచుకున్న టీమిండియా ఉమెన్స్ బృందం.. బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అంతకంటే ముందు.. ముంబై నుంచి న్యూఢిల్లీ వరకు జట్టు ప్రయాణానికి సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) సోషల్ మీడియాలో షేర్ చేసింది. మోదీని కలిసిన టీమ్.. ఆయనకు బ్లూ కలర్ జెర్సీ బహూకరించారు.

నరేంద్ర మోదీ కూడా.. వరల్డ్ కప్ గెలిచిన మహిళా బృందంతో చాలాసేపు సరదాగా ముచ్చటించారు. ఆ తరువాత లడ్డులు పంచారు. ఏందో ఆప్యాయత చూపించిన మోదీ ప్రేమకు అందరూ ఫిదా అయ్యారు. మోదీ అందరిని ఎంతగానో అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో నరేంద్ర మోదీ ఎక్స్ ఖాతాలో వైరల్ అవుతోంది.

వరల్డ్ కప్ ట్రోఫీ..

కేవలం క్రికెట్ ఆడే ప్లేయర్స్ మాత్రమే కాదు.. యావత్ భారతదేశం టీమిండియా ట్రోఫీ గెలవాలని కలలు కంటుంది. ఈసారి టీమిండియా మహిళల బృందం ఆ కలను నిజం చేసింది. సౌత్ ఆఫ్రికా జట్టును 52 పరుగుల తేడాతో ఓడించి.. ట్రోఫీని గెలుచుకుంది. ఈ సంతోష క్షణాలను ఇండియమ్స్ అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తరువాత ట్రోఫీ గెలుచుకోవడం అందరికీ చాలా ఆనందాన్ని ఇస్తోంది.

మహిళా జట్టు.. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, చివరి వరకు పోరాడి ట్రోఫీని ముద్దాడింది. క్రికెట్ అంటే.. కేవలం పురుషులకు సంబంధించినదే అనే భావనను టీమిండియా మహిళా జట్టు చెరిపివేసింది. ఎంతోమంది యువతులకు ఆదర్శంగా నిలిచింది. క్రికెట్ ఆడాలనుకునే చాలామంది మహిళలకు వీరిప్పుడు మార్గదర్శకం అయ్యారు. ఇది చాలా గొప్ప విషయం టీమిండియాను అభినందించాల్సిన విషయం.

విజయ్ సేతుపతి కుమారుడి కొత్త సినిమా.. ఫీనిక్స్ గురించి తెలుసా?

0

విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి.. ఫీనిక్స్ అనే చిత్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా తమిళంలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకునింది. ఇప్పుడు దీనిని విజయ్ సేతుపతికి ఉన్న ఫాలోయింగ్ వల్ల.. తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమాయ్యారు. 2025 నవంబర్ 07న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

యాక్షన్ సినిమాలో సూర్య సేతుపతి

ఫీనిక్స్  సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్, పాటలకి సోషల్ మీడియాలో ఇప్పటికే మంచి స్పందన లభిస్తోంది. అంతేకాక మూవీ టీమ్ హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఇందుకు ముఖ్య అతిధిగా విజయ్ సేతుపతి పాల్గొన్నాడు.  తెలుగు ప్రేక్షకులంతా తన కుమారున్ని ఆదరించాలని ఆయన కోరాడు. సూర్య సేతుపతికి యాక్షన్ మరియు మాస్ చిత్రాలంటే బాగా ఇష్టమట. అందుకే ఇలాంటి సబ్జెక్టు ఎంచుకున్నాడని చెప్పుకొచ్చాడు.

అలాగే ఈ సినిమాలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ ఈవెంట్‌లో భాగమయ్యారు. ఆమె మాట్లాడుతూ  తెలుగు వాళ్లు ఒక్కసారి అభిమానిస్తే ఎప్పటికి వదులుకోరు అని, ఆ విషయం తనకి తెలుసునని అన్నారు. సూర్య సేతుపతికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆశీర్వదించారు. ఇందులో చాలా మంది పాపులర్ తెలుగు.. తమిళ నటులు నటించడం జరిగింది. అందుకని తెలుగులో కూడా ఎక్కువ మందికి చేరువ అవుతుంది అనడంలో సందేహం లేదు.

దుమ్మురేపుతున్న ట్రైలర్

తెలుగులో ఒక వీడియో సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఒక బస్తీలో పేద జనం మధ్య ఆ పాట మొత్తం జరుగుతుంది. కష్టం చేసుకుని బతికే వీధుల్లో అక్కడ నివసిస్తున్న వారి జీవనాన్ని దర్శకుడు బాగా చూపించాడు. పాటలో చాలా లోతైన అర్థం దాగి ఉంది. మాస్ ప్రేక్షకులకు ఈ పాట ఒక ఊపు తెప్పిస్తుంది. వారే టార్గెట్‌గా సినిమా తీసినట్టుగా అనిపిస్తుంది.

ట్రైలర్ రచ్చలేపుతోంది, ఫైట్ సీన్లు, చేజింగ్స్, యాక్షన్ సీన్లు అన్నీ కూడా.. ఒక్క సినిమాకే అదరగోట్టేసాడు. తనకు నచ్చిన జోనర్ మాస్ యాక్షన్ సినిమాలు.. కాబట్టి అందుకు తగినట్టే కథ ఎంచుకున్నాడు. ఇది తనకి మొదటి చిత్రం అయినా.. ఎక్కడ కూడా అలాంటి భావన అయితే కలగడం లేదు. బాగా అనుభవం కలిగిన నటుడు చేసిన విధంగానే సూర్య సేతుపతి చేశాడు. విజయ్ సేతుపతి అంత అయితే మనం ఊహించలేము.

కథ ఇలా..

ఒక రాజకీయ నాయకున్ని చంపిన కేసులో పదహారు, పదిహేడేళ్ల కుర్రాడు బాల నేరస్తుల శిబిరంలో ఉంటాడు. ఇందులో ఒక స్పోర్ట్స్ డ్రామా కూడా కలగలిసి ఉంది. హీరో జీవితం ఆ గేమ్ ఆధారంగానే నిర్ణయించబడుతుంది. అందులో గెలిస్తేనే వారికి జీవితం ఉంటుంది. ఒకటి ఆట, రెండోది చదువు.. వీటిలో మాత్రమే ఎదగగలరు, లేకపోతే లేదు. అయితే ఆ తరువాత ఏమైంది అనే దానికి మనం సినిమా చూడాల్సిందే.

సూర్య సేతుపతిని చూసి కాకుండా కేవలం విజయ్ సేతుపతి కొడుకుగా చూడటానికే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుంది. తెలుగులో అతని అరంగేట్రం ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. ఈ సినిమా రిలీజ్ రోజే.. తెలుగు స్ట్రెయిట్ మూవీలు సుధీర్ బాబు జటాధార, తిరువీర్.. ది గ్రేట్ ప్రీ- వెడ్డింగ్ షో, రష్మిక మందన.. ది గర్ల్ ఫ్రెండ్, ప్రియదర్శి.. ప్రేమంటే ఇలాంటి సినిమాలు పోటాపోటీగా దిగుతున్నాయి. మరి వాటి ముందు ఫీనిక్స్ తట్టుకుని నిలబడుతుందా.

ఆటో డ్రైవర్ సీటులో ప్రారంభమైన జీవితం: నేడు లగ్జరీ కారు వెనుక సీటులో..

‘కష్టపడి పనిచేస్తే.. ఎదో ఒకరోజు తప్పకుండా పైకొస్తావు’ అని చాలామంది పెద్దవాళ్లు చెప్పడం మన నిత్యజీవితంలో వినేఉంటాము. ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనమే రాహుల్ తనేజా. ఒకప్పుడు బతుకుతెరువు కోసం చేతికి దొరికిన పనిచేస్తూ.. ఆటో రిక్షా సైతం నడిపిన ఈయన.. ఇప్పుడు తన కొడుకు ఆడి కారు నెంబర్ ప్లేట్ కోసం రూ. 31 లక్షలు ఖర్చు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

11ఏళ్ల వయసులో డాబాలో వెయిటర్!

జైపూర్‌కు చెందిన.. వ్యాపారవేత్త రాహుల్ తనేజా గురించి ఈ రోజు అందరికీ తెలుసు. కానీ ఆటో ముందు సీటులో ప్రారంభమైన తన ప్రయాణం నేడు లగ్జరీ కారు వెనుక సీటులో కొనసాగుతోంది. దీనికి కారణం ఆయన కృషి, పట్టుదల అనే చెప్పాలి. మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాలోని కాట్రా అనే చిన్న గ్రామంలో తనేజా జన్మించారు. ఈయన తండ్రి సైకిల్ పంక్చర్ షాప్ నిర్వహించేవారు. 11ఏళ్ల వయసులో.. తనేజా రోడ్డుపక్కన ఉన్న డాబాలో వెయిటర్‌గా పనిచేయడం ప్రారంభించారు. రెండేళ్లపాటు.. కుటుంబాన్ని పోషించడానికి టీ, స్నాక్స్ వంటివి విక్రయించాడు.

రైల్వే స్టేషన్‌లో ఆటో రిక్షా నడిపాడు

దీపావళి పండుగల సమయంలో.. తన తోటివాళ్లు ఆనందంగా గడుపుతుంటే, తనేజా రోడ్డుపై వ్యాపారం చేఉకునేవాడు. హొలీ సందర్భంగా రంగులు, సంక్రాంతి సందర్భంగా గాలిపటాలను విక్రయించేవాడు. తరువాత వేసవి కాలంలో కామిక్స్ అమ్మడం, కొరియర్ డెలివరీ చేయడం, న్యూస్ పేపర్ పంపిణీ చేయడం వంటి అన్నీ పనులు చేసాడు. 16 సంవత్సరాల వయసులో జాపూర్ దుర్గాపుర రైల్వే స్టేషన్‌లో ఆటో రిక్షా నడిపేవాడు. 19 ఏళ్ల వయసులో జైపూర్‌లోని ఒక కాలనీలో కార్ ప్యాలెస్ అనే చిన్న కార్ డీలర్‌షిప్‌ ప్రారంభించారు. అదే సమయంలో మోడలింగ్ చేయడం కూడా స్టార్ట్ చేసాడు.

రాహుల్ తనేజా మోడలింగ్

మోడలింగ్ చేయడం ప్రారభించిన తరువాత.. మిస్టర్ జైపూర్, మిస్టర్ రాజస్థాన్ వంటి టైటిల్స్ మాత్రమే కాకుండా.. 1999లో మేల్ ఆఫ్ ది ఇయర్ అనే టైటిల్ కూడా గెలుచుకున్నాడు. ఇదే అతన్ని వెలుగులోకి తెచ్చింది. ఇలా కొనసాగుతూనే 2000వ సంవత్సరంలో లైవ్ క్రియేషన్ అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఏజన్సీ ప్రారంభించారు. ఆ తరువాత పదేళ్లకు ప్రీమియం వెడ్డింగ్ బ్యానర్ కింద.. లగ్జరీ వెడ్డింగ్ ప్లానింగ్‌లోకి అడుగుపెట్టారు.

వీఐపీ నెంబర్ ప్లేట్స్

రాహుల్ తనేజా చేసిన వ్యాపారాలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందాయి. అతి తక్కువ కాలంలోనే జైపూర్‌లోని ప్రముఖ వ్యాపారవేత్తల స్థానంలోకి చేరుకున్నాడు. ఇలా చిన్నస్థాయి నుంచి.. ఎందో మందికి ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగాడు. బాగా డబ్బు సంపాదించడం మొదలుపెట్టాక.. ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్స్ కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఇలా 2011లో ఈయన తన బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారు కోసం.. రూ. 10 లక్షలు ఖర్చు చేసి, RJ 14 CP 0001 అనే రిజిస్ట్రేషన్ నెంబర్ కొనుగోలు చేశారు. 2018లో జాగ్వార్ ఎక్స్‌జేఎల్ కోసం రూ. 16 లక్షలు ఖర్చు చేసి RJ 45 CG 0001 సొంతం చేసుకున్నాడు.

కొడుకు కారు కోసం రూ.31 లక్షల నెంబర్ ప్లేట్

భారీ డబ్బును వెచ్చించి.. ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్స్ కొనుగోలు చేసే రాహుల్ తనేజా తన కొడుకు ఉపయోగించే ఆడి ఆర్ఎస్‌క్యూ8 కోసం వీఐపీ నెంబర్ కొనాలని నిర్ణయించుకున్నాడు. నవంబర్ 16 నాటికి తన కొడుకు వయసు 18 ఏళ్లు నిండుతాయి. పుట్టిన రోజు సందర్భంగా ఆ వీఐపీ నెంబర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం రూ. 31 లక్షలు వెచ్చించి.. RJ 60 CM 0001 నెంబరును జైపూర్ రైల్వే రవాణా కార్యాలయం నుంచి కొనుగోలు చేసాడు. ఇప్పటి వరకు రాజస్థాన్ రాష్ట్రంలో అత్యంత ఖరీదైన నెంబర్ ప్లేట్ ఇదే అని అధికారులు ధృవీకరించారు.

కొడుకు ఆనందం కోసం!

కారు నెంబర్ కోసం రూ. 31 లక్షల దుబారా ఖర్చు అవసరమా?, అనే ప్రశ్నకు ”నేను వర్తమానంలోనే జీవిస్తాను. ఈ రోజు నాకు ఏది సంతోషాన్ని ఇస్తుందో.. అది చేయడానికి నేను ప్రయత్నిస్తాను. నా ఆనందం నా కొడుకు ఆనందంలోనే ఉంది. నా కొడుకు ఆనందం కార్లు, కార్ నెంబర్లలో ఉంది. నా కొడుకు ఆనందం కోసం ఏదైనా చేయాలంటే.. ఎక్కువగా ఆలోచించను” అని తనేజా నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

కుంభమేళా మోనాలిసా తెలుగు సినిమా: పూజా కార్యక్రమంలో సందడి

0

కుంభమేళా మోనాలిసా అలియాస్ మోనాలిసా భోస్లే సినీరంగంలో అడుగుపెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మొదట బాలీవుడ్ సినిమాతో తెరమీద కనిపించనున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. కానీ అంతకంటే ముందు.. ఈమె తెలుగు చిత్ర పరిశ్రమ ద్వారా తెరమీద కనిపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ప్రస్తుత పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి. దీనికి కారణం ఈ రోజు (నవంబర్ 5) హైదరాబాద్‌లో జరిగిన మూవీ లాంచ్ కార్యక్రమంలో మోనాలిసా సందడి చేయడమే. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పూజా కార్యక్రమంలో సందడి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. పూజా కార్యక్రమంలో దేవునికి పువ్వులు సమర్పించడం, కొబ్బరి కాయ కొట్టడం, చిత్ర బృందంతో కలిసి ఉండటం వంటివి కనిపిస్తాయి. వెంగమాంబ మూవీ ప్రొడక్షన్ వారు ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి సినిమా పేరును అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇందులో మోనాలిసా మాత్రమే కాకుండా.. సాయిచరణ్ హీరోగా నటిస్తున్నారు. శ్రీను కొటుపాటి ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. అంటే ఈ సినిమా వివిధ భాషల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందని అర్థమవుతోంది.

ఎవరీ మోనాలిసా?

నిజానికి మోనాలిసా గురించి ప్రత్యేకంగా పరిచయమే అవకాశం లేదు. ఒక్క రోజులోనే సెలబ్రిటీలైన అతి తక్కువ మందిలో మోనాలిసా ఒకరు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో పూసలు అమ్మడుకోవడానికి వచ్చిన ఒక సాధారణ యువతిని.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ బాగా పాపులర్ చేసేసారు. దీనికి కారణం ఆమె కళ్ళు. గోధుమరంగులో ఉన్న ఈమె కళ్ళు చాలామందిని ఆకట్టుకున్నాయి. దీంతో మోనాలిసా.. కుంభమేళా మోనాలిసా అయింది. సాధారణ యువతి కాస్త.. సెలబ్రిటీ అయిపోయింది.

మహాకుంభమేళా సమయంలో ఈమెతో ఫొటోలు దిగడానికి, వీడియోలు తీసుకోవడానికి చాలామంది ఎగబడ్డారు. దీంతో ఆమె కుంభమేళాను వదిలి స్వగ్రామానికి చేరింది. దీన్ని బట్టి చూస్తే.. ఈమె ఎంత పాపులర్ అయిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈమె పాపులారిటీ చూసి.. మోనాలిసాతో సినిమా తీయడానికి బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా సిద్ధమయ్యారు.

బాలీవుడ్ సినిమాలో..

మోనాలిసాతో బాలీవుడ్ సినిమా తీయడానికి సనోజ్ మిశ్రా కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే ఆయన ది మణిపూర్ డైరీస్ అనే సినిమా ప్రారంభించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల.. సనోజ్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ది మణిపూర్ డైరీస్ రిలీజ్ వాయిదా పడింది. అయితే ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయాన్ని.. ప్రస్తుతానికి ఎవరూ అధికారికంఘా వెల్లడించలేదు.

ది మణిపూర్ డైరీస్ సినిమా వాయిదా పడటంతో.. మోనాలిసా తెలుగు సినిమాల్లో నటించడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే.. ఈ రోజు (బుధవారం) హైదరాబాద్‌లో నిర్వహించిన మూవీ లాంచ్ కార్యక్రమంలో కనిపించింది. ప్రస్తుతం సినిమాల్లో నటించడానికి కావలసిన అన్ని విషయాలను నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే మోనాలిసా నటించనున్న తెలుగు సినిమా ఎప్పుడు లాంచ్ అవుతుంది, షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

భారత్‌లోని 5 బెస్ట్ క్రూయిజర్ బైక్స్ ఇవే!.. ధర & ఇతర వివరాలు

ప్రపంచంలో ఎక్కువ మోటార్ సైకిల్స్ ఉత్పత్తి చేసే దేశాల జాబితాలో భారత్ ఒకటి. ఇండియన్ మార్కెట్లో ప్రతి నెలా.. ఏదో ఒక కొత్త ఉత్పత్తి లాంచ్ అవుతూనే ఉంటుంది. ఎన్ని బైకులు దేశీయ విఫణిలో ఉన్నప్పటికీ.. క్రూయిజర్ మోటార్ సైకిళ్లకు ఓ ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. ఈ కథనంలో సరసమైన & తక్కువ ధర వద్ద లభించే ఐదు బెస్ట్ క్రూయిజర్ బైక్స్ గురించి తెలుసుకుందాం.

బజాజ్ అవెంజర్ 160 స్ట్రీట్

అవెంజర్ 160 స్ట్రీట్ బైక్.. క్రూయిజర్ బైకుల జాబితాలో ఒకటి. దీని ధర రూ. 1.11 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దేశంలోని అత్యంత సరసమైన క్రూయిజ్ మోటార్‌సైకిల్‌. ఇందులోని 160 సీసీ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల.. దీనిని ఎక్కువమంది ఇష్టపడతారు. లాంగ్ రైడ్ చేయడానికి కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. అయితే ఈ పొడవు కొంత ఎక్కువగా ఉండటం వల్ల.. ఇరుకైన ప్రదేశాల్లో రైడ్ చేయడం కొంత ఇబ్బందిగా ఉంటుంది.

కవాసకి డబ్ల్యు175

క్రూయిజ్ మోటార్ సైకిల్స్ జాబితాలోని మరో బెస్ట్ మోడల్.. కవాసకి కంపెనీకి చెందిన డబ్ల్యు175. మార్కెట్లో దీనికున్న డిమాండ్ కొంత తక్కువే అయినప్పటికీ.. ఈ బైకును ఇష్టపడేవాళ్లు కూడా ఉన్నారు. దీని ధర రూ. 1.21 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులోని 177 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి.. అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. తద్వారా రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. తక్కువ ధరలో బెస్ట్ రైడింగ్ బైక్ కావాలనుకునే వారికి.. కవాసకి డబ్ల్యు 175 ఉత్తమ ఎంపిక అనే చెప్పాలి.

టీవీఎస్ రోనిన్

ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన టీవీఎస్ కంపెనీ.. లెక్కలేనన్ని మోడల్స్ దేశీయ విఫణిలో విక్రయిస్తోంది. అయితే కంపెనీ విక్రయించే అన్ని బైకుల కంటే రోనిన్ కొంత భిన్నంగా ఉంటుంది. ఈ బైక్ ధర రూ. 1.25 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులో 225.9 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది కూడా 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. రెట్రో డిజైన్ కలిగిన ఈ బైక్.. ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇంజిన్ పనితీరు కూడా ఉత్తమంగా ఉంటుంది. క్రూయిజ్ మోటార్ సైకిల్ విభాగంలో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ మోడల్ ఈ రోనిన్.

జావా 42

ఇండియన్ మార్కెట్లో జావా బైకులకు ఒకప్పుడు మంచి డిమాండ్ ఉండేది. అయితే ఇప్పుడు ఈ బ్రాండ్ బైకులకు ఉన్న డిమాండ్ తగ్గిపోయిందనే చెప్పాలి. అయితే క్రూయిజ్ బైక్స్ విభాగంలో కంపెనీ జావా 42 మోటార్ సైకిల్ అందిస్తోంది. రూ. 1.59 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభిస్తున్న ఈ బైక్.. 294.7 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. అయితే ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. డిజైన్ బాగుంటుంది. రైడర్లకు కావలసిన అన్ని ఫీచర్స్ ఈ బైకులో ఉంటాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో.. క్రూయిజర్ మోటార్ సైకిల్స్ విభాగంలో ఎక్కువ అమ్ముడవుతున్న బైక్స్ జాబితాలో ఇది అగ్రస్థానంలో ఉంది. ఈ బైక్ ధర రూ. 2.16 లక్షలు (ఎక్స్ షోరూమ్). రెట్రో డిజైన్ కలిగి.. చూడగానే ఆకట్టుకునే డిజైన్ కలిగిన ఈ బైక్.. అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 349 సీసీ ఇంజిన్ 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి.. బెస్ట్ పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇది రోజువారీ వినియోగానికి మాత్రమే కాకుండా.. లాంగ్ రైడ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి చాలామంది ఈ బైకును ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.

ప్రభాస్‌తో సినిమా?: రష్మిక మందన్న ఏమందంటే..

గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో రష్మిక మందన్న పేరు గట్టిగా వినిపిస్తోంది. విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం!, థామా రిలీజ్ అండ్ సక్సెస్.. ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా ప్రమోషన్స్.. మరోవైపు మైసా సినిమా షూటింగ్ ఇలా వరుసగా నేషనల్ క్రష్ పేరు ఏదోలా వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా ప్రభాస్ సినిమాల్లో నటించడానికి తాను సిద్ధమంటూ పేర్కొంది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూసే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ప్రభాస్‌తో సినిమా..

రష్మిక మందన్న.. తన ఎక్స్ ఖాతా ద్వారా మీరు ప్రశ్నలు అడగండి, నేను సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అంటూ ట్వీట్ చేసింది. దీనిపై స్పందిస్తూ.. భారతదేశంలోని పెద్ద నటులలో ఒకరైన ప్రభాస్తో కలిసి పనిచేస్తారా? అనే ప్రశ్న అడిగారు. దీనికి రష్మిక రిప్లై ఇస్తూ.. అది నాకు కూడా ఇష్టమే (ప్రభాస్‌తో కలిసి పనిచేయడం నాకు కూడా ఇష్టమే).. ప్రభాస్ ఈ చూస్తారని ఆశిస్తున్నాను. త్వరలోనే మనం దీనిపై కలిసి పనిచేస్తామని కూడా భావిస్తున్నా అంటూ పేర్కొంది.

సంతోషంలో అభిమానులు

నటి రష్మిక మందన్న చేసిన ట్వీట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటు రష్మిక అభిమానులు, ఇటు ప్రభాస్ అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు. అయితే రష్మిక ప్రభాస్‌తో కలిసి పనిచేస్తుందా? లేదా అనేది?, కేవలం ఒక ప్రశ్న మాత్రమే. ఇప్పటి వరకు దాదాపు చాలామంది హీరోలతో పనిచేసిన రష్మిక.. ప్రభాస్‌తో కలిసి నటించలేదు. బహుశా రాబోయే రోజుల్లో ఇది జరిగే అవకాశం కూడా ఉంది.

స్పిరిట్ సినిమాలో..

నిజానికి.. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాలో, ప్రభాస్ సరసన నటించడానికి చర్చలు జరిపినట్లు సమాచారం. ఆ తరువాత ఆ సినిమాలో దీపికా పదుకొనేను ఎంచుకున్నారు. అయితే అనుకోని కొన్ని పరిణామాల కారణంగా.. దీపికా స్థానంలో త్రిప్తి డిమ్రీని ఎంపిక చేసుకున్నారు. కాగా రష్మిక మందన్న.. సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాలో.. రణబీర్ సరసన నటించిన విషయం తెలిసిందే. కాబట్టి.. స్పిరిట్ సినిమాలో కూడా ఈమెకు అవకాశం లభిస్తుందేమో అని ఊహించారు. కానీ అలా జరలేదు.

త్వరలో మైసా..

నటి రష్మిక మందన్న.. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ సినిమాల్లో నటిస్తూ.. తనదైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రారంభంలో లవ్, రొమాంటిక్ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు హారర్ సినిమా (థామా)లో కూడా కనిపించింది. ఇప్పుడు యాక్షన్ సినిమా మైసాలో కనిపించనుంది. ఈ సినిమా (మైసా) షూటింగ్ ఇప్పటికే కేరళ అడవుల్లో ప్రారంభమైనట్లు.. ఆ చిత్ర దర్శకుడు అధికారికంగా పేర్కొన్నాడు.

విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం!

ఇకపోతే.. రష్మిక మందన్న & విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం జరిగిందని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి. కానీ దీనిపై అటు విజయ్.. ఇటు రష్మిక క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ కొన్ని సమావేశాల్లో బహుశా ఇది నిజమే అయి ఉండొచ్చని వారి ప్రవర్తనే చెబుతుంది. ఇదే నిజమైతే.. విజయ్ & రష్మికల పెళ్లి 2026లో జరిగే అవకాశం ఉందని సమాచారం.

లాంచ్‌కు ముందే దుమ్మురేపుతున్న హైలక్స్: ఈ కారు గురించి తెలుసా?

పరిమాణంలో కొంత పెద్దదిగా ఉన్న వాహనాల జాబితాలో.. టయోటా కంపెనీకి చెందిన హైలక్స్ ఒకటి. సాధారణ వినియోగానికి మాత్రమే కాకుండా కమర్షియల్ ఉపయోగానికి పనికొచ్చే ఈ వెహికల్.. ఆఫ్ రోడింగ్ చేయడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికీ మోడల్ ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ.. అప్డేటెడ్ వెర్షన్ లాంచ్ కావడానికి సిద్ధమైంది. దీనిని కంపెనీ నవంబర్ 10న ఆవిష్కరించనున్నట్లు వెల్లడించింది.

2018 తరువాత పెద్ద అప్డేట్!

టయోటా కొత్త హైలెక్స్ కారుకు సంబంధించిన టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జపాన్ బ్రాండ్ అయిన ఈ కారు డిజైన్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇది ఇప్పుడున్న కారుకంటే కూడా కొంత ఎక్కువ అప్డేట్స్ పొందనుంది. 2018 తరువాత ఈ మోడల్ మొదటిసారి పెద్ద నవీనీకరణ పొందుతున్నట్లు సమాచారం.

2018లో ఎనిమిదవ తరం టయోటా హైలక్స్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. ఆ తరువాత కాలక్రమంలో చిన్న చిన్న అప్డేట్స్ పొందింది. ఫేస్‌లిఫ్ట్ రూపంలో కూడా లాంచ్ అయింది. ఇప్పుడు లాంచ్ కావడానికి సిద్దమవుతున్న హైలెక్స్.. పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్ మీద ఆధారపడుతుందని సమాచారం.

లేటెస్ట్ డిజైన్ & కొత్త ఫీచర్!

ఇప్పుడు విడుదలైన టీజర్ వీడియోలో.. హైలెక్స్ కొత్త డిజైన్ కలిగిన గ్రిల్ పొందుతుందని తెలుస్తోంది. అల్లాయ్ వీల్స్, దానిపై బ్రాండ్ లోగో, లైటింగ్ సెటప్ అన్నీ కూడా టీజర్ వీడియోలో కనిపిస్తున్నాయి. బంపర్ అవుట్‌గోయింజి మోడల్ కంటే కూడా కొంత పెద్దదిగా ఉన్నట్లు తెలుస్తోంది. బూమరాంగ్ షేప్ హెడ్‌ల్యాంప్ ప్రత్యేకమైన ఆకర్షణ అని తెలుస్తోంది. అయితే కంపెనీ ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ గురించి అధికారికంగా వెల్లడించలేదు. ఈ విషయాలను సంస్థ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.

కొత్త టయోటా హైలక్స్ కారు.. అప్డేటెడ్ డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్, పెద్ద ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం వంటివి పొందుతుందని అంచనా. బహుశా ఈ కారులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం అనేది 12 ఇంచెస్ ఉండే అవకాశం ఉంది. డిటైటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా అప్డేట్ అయి ఉండొచ్చని భావిస్తున్నాము.

కొత్త ఇంజిన్?

టయోటా కంపెనీ తన సరికొత్త హైలక్స్ కారులో.. కొత్త ఇంజిన్ పరిచయం చేయనున్నట్లు సమాచారం. కాబట్టి ఇందులో 2.8 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఉండే అవకాశం ఉంది. ఇది 48 వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టం కూడా పొందే అవకాశం ఉంది. ఇది 201 బీహెచ్పీ పవర్, 500 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుందని తెలుస్తోంది. అయితే.. టాప్ వేరియంట్ పవర్, టార్క్ అనేవి కొంత ఎక్కువగా ఉంటాయి. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

హైలక్స్ డిమాండ్ ఎలా ఉందంటే?

ఇండియన్ మార్కెట్లో.. టయోటా హైలక్స్ కార్లకు చెప్పుకోదగ్గ డిమాండ్ లేదనే తెలుస్తోంది. ఎందుకంటే ఈ వాహనాల అమ్మకాల డేట్ చూస్తే.. సేల్స్ అంతంత మాత్రంగానే ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే ఈ కార్లను కొనుగోలు చేసే రాష్ట్రాల జాబితాలో కేరళ ముందు వరుసలో ఉంది. కాగా కంపెనీ త్వరలో లాంచ్ చేసే అప్డేటెడ్ హైలక్స్ మోడల్ ఎలాంటి అమ్మకాలు పొందుతుందో తెలుసుకోవడానికి కొంతకాలం వేచి చూడాల్సిందే.

ఒకే వేదికపై రెండు కార్లు.. సరికొత్త హ్యుందాయ్ వెన్యూ: పూర్తి వివరాలు

భారతదేశంలో అత్యధిక అమ్మకాలు పొందుతూ దూసుకెళ్తున్న హ్యుందాయ్ వెన్యూ ఇప్పుడు రెండు కొత్త రూపాల్లో.. దేశీయ విఫణిలో లాంచ్ అయింది. ఇందులో ఒకటి 2025 వెన్యూ కాగా.. మరొకటి వెన్యూ ఎన్ లైన్. కంపెనీ కొత్త వెన్యూ ధరలను అధికారికంగా ప్రకటించింది. వెన్యూ ఎన్ లైన్ ధరలను వెల్లడించాల్సి ఉంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే..

2025 హ్యుందాయ్ వెన్యూ

కొత్త హ్యుందాయ్ వెన్యూ ప్రారంభ ధర రూ. 7.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). కాగా కంపెనీ ఈ కారును లాంచ్ చేయడానికి ముందే.. బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కియా సోనెట్, మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, స్కోడా కైలాక్ వంటి కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న 2025 వెన్యూ.. మల్టిపుల్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

ఎనిమిది రంగులలో లభించే 2025 హ్యుందాయ్ వెన్యూ.. కొంత అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందినట్లు తెలుస్తోంది. పరిమాణం పరంగా కూడా ఇది.. సాధారణ మోడల్ కంటే కొంత పెద్దదిగానే ఉంది. అప్డేటెడ్ బంపర్లు, అల్లాయ్ వీల్స్ వంటి వాటితో బ్యాడ్జెస్ కూడా ఈ కారులో కనిపిస్తాయి.

విశాలమైన క్యాబిన్ కలిగిన.. హ్యుందాయ్ 2025 వెన్యూ కారు ప్రీమియం ఫీచర్స్ పొందుతుంది. ఇందులో డ్యూయెల్ 12.3 ఇంచెస్ స్క్రీన్లు, 3 స్పోక్ స్టీరింగ్ వీల్, కొత్త సెంటర్ కన్సోల్ మొదలైనవి ఉన్నాయి. ఇవి కాకుండా.. లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్, రియర్ విండో సన్‌షేడ్‌లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, 2 స్టెప్ రిక్లైనింగ్ రియర్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, ఆటో హోల్డింగ్ విత్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టం కూడా ఈ కారులో ఉన్నాయి.

కొత్త హ్యుందాయ్ వెన్యూ కారు.. 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ & 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. టర్బో పెట్రోల్ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్‌తో లభిస్తుంది. డీజిల్ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది.

హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్

కంపెనీ వెన్యూ ఎన్ లైన్ కారును కూడా ఆవిష్కరించింది. అయితే దీని ధరలను ఇంకా వెల్లడించలేదు. ఇది చూడటానికి సాధారణ వెన్యూ కారు మాదిరిగా ఉన్నప్పటికీ.. రెడ్ కలర్ యాక్సెంట్స్ వంటి అప్డేట్స్ పొందుతుంది. ఈ కారు కోసం కూడా కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం మొదలుపెట్టింది. ఈ కొత్త వేరియంట్ ధరలను కంపెనీ అధికారికంగా వెల్లడించనప్పటికీ.. దీని ప్రారంభ ధర రూ. 11 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ఉండే అవకాశం ఉంది.

హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ కారు.. కేవలం 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మాత్రమే పొందే అవకాశం ఉంది. ఇది 172 ఎన్ఎమ్ టార్క్, 120 హార్స్ పవర్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో వస్తుందని సమాచారం. కాబట్టి పనితీరు అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నాము.

500 మందికే ఈ స్టైలిష్ బైక్: దీని ధర ఎంతో తెలుసా?

లగ్జరీ మోటార్‌సైకిల్స్ తయారీ సంస్థ డుకాటీ.. గ్లోబల్ మార్కెట్లో సరికొత్త స్క్రాంబ్లర్ 10వ యానివర్సరీ ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ కొత్త బైక్ ధర రూ. 17.10 లక్షలు (ఎక్స్ షోరూమ్). స్క్రాంబ్లర్ బైక్ విఫణిలో అడుగుపెట్టి.. పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. కంపెనీ ఈ యానివర్సరీ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది సాధారణ స్క్రాంబ్లర్ కంటే కూడా కొంత ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందినట్లు తెలుస్తోంది. ఈ లేటెస్ట్ బైక్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఈ కథనంలో చూసేద్దాం..

500 యూనిట్లు మాత్రమే!

డుకాటీ కంపెనీ.. తన 10వ యానివర్సరీ ఎడిషన్ స్క్రాంబ్లర్ బైకును తన దీర్ఘకాలిక భాగస్వామి రిజోమాతో కలిసి నిర్మించింది. చాన్నాళ్ల తరువాత రిజోమా కంపెనీ బైక్ రూపొందించడంలో ప్రత్యక్షంగా సహకరించింది. కాబట్టి దీనిని స్క్రాంబ్లర్ డుకాటీ 10వ యానివర్సరీ రిజోమా ఎడిషన్ అని పిలుస్తారు. దీనిని ప్రపంచ వ్యాప్తంగా కేవలం 500 మందికి మాత్రమే విక్రయించనున్నారు. అంటే ఇది భారతదేశంలో లిమిటెడ్ ఎడిషన్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టమవుతోంది. కానీ మనదేశానికి ఎన్ని యూనిట్లు కేటాయించారనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు.

స్టైలిష్ డిజైన్ కలిగిన డుకాటీ స్క్రాంబ్లర్ యానివర్సరీ ఎడిషన్.. చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇందులో మెషిన్డ్ బిల్లేట్ అల్యూమినియం అడ్జస్టబుల్ లివర్స్, బ్రేక్ అండ్ క్లచ్ రిజర్వాయర్ క్యాప్స్, ఫ్యూయల్ ఫిల్లర్, ప్యాసింజర్ ఫుట్ పెగ్‌లు ఉన్నాయి. డిజైన్ పరంగా అప్డేట్ పొందిన ఈ లేటెస్ట్ బైక్.. యాంత్రికంగా ఎటువంటి అప్డేట్స్ పొందలేదని తెలుస్తోంది.

చూడచక్కని కలర్స్

స్క్రాంబ్లర్ రిజోమా ఎడిషన్.. స్టోన్ వైట్ / మెటల్ రోజ్ అనే డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్ పొందుతుంది. విండ్‌స్క్రీన్, టైమింగ్ బెల్ట్ కవర్స్, ఫ్రేమ్ కవర్స్, ఇంజిన్ కేస్ కవర్స్, రైడర్ ఫుట్ పెగ్స్ అన్నీ కూడా మెటల్ రోజ్ రంగులో ఉంటడం చూడవచ్చు. కాగా ఫ్యూయెల్ ట్యాంక్, ఇంజిన్, ఛాసిస్ బార్ ఎండ్ మిర్రర్స్, ఎగ్జాస్ట్ సిస్టం వంటివి నలుపు రంగులో ఉండటం చూడవచ్చు.

ఇంజిన్ వివరాలు

డుకాటీ స్క్రాంబ్లర్ 10వ యానివర్సరీ ఎడిషన్ 803 సీసీ ఫోర్ స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ఎల్ ట్విన్ ఇంజిన్ పొందుతుంది. ఇది 73 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ 63.2గా ఉంటుంది. దీన్నిబట్టి చూస్తే పర్ఫామెన్స్ ఉత్తమంగానే ఉంటుందని తెలుస్తోంది. బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ ఇందులో ఉంటుంది.రైడర్ ఎయిడ్ సూట్ కూడా లభిస్తుంది.స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ కలిగిన ఈ బైక్ బైక్ రైడర్లను ఆకట్టుకునే విధంగా తయారైందని స్పష్టంగా తెలుస్తోంది.

ఇండియన్ మార్కెట్లో డుకాటీకున్న డిమాండ్?

డుకాటీ కంపెనీ బైకులకు ఇండియన్ మార్కెట్లో పెద్దగా డిమాండ్ లేదనే తెలుస్తోంది. దీనికి కారణం అధికంగా ఉన్న ధరలే. సాధారణంగా ఖరీదైన బైకులను.. సెలబ్రిటీలు లేదా డబ్బున్నవారు మాత్రమే కొనుగోలు చేస్తారు. కాగా డుకాటీ బైకుల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల.. సామాన్య ప్రజలు ఈ బ్రాండ్ బైకులను కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేస్తారు. అయితే కంపెనీ బైక్ ప్రేమికులను దృష్టిలో ఉంచుకుని.. ఎప్పటికప్పుడు ఆధునిక ఉత్పత్తులను లాంచ్ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే డుకాటీ స్క్రాంబ్లర్ 10వ యానివర్సరీ ఎడిషన్ లాంచ్ చేసింది. దీనికి ఎలాంటి ఆదరణ లభిస్తుందో తెలుసుకోవడానికి ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది.

‘ఇది ప్రారంభం మాత్రమే’: రష్మిక మందన్న మైసా..

0

పుష్ప 2 సినిమా తరువాత.. నటి రష్మిక మందన్న చాలా బిజీ అయిపోయారు. థామా, ది గర్ల్‌ఫ్రెండ్ అంటూ వరుస సినిమాల్లో నటిస్తున్న ఈమె.. ఇప్పుడు ‘మైసా‘ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళ అడవుల్లో ప్రారంభమైనట్లు.. డైరెక్టర్ రవీంద్ర పుల్లె అధికారికంగా వెల్లడించారు.

ఇది ప్రారంభం మాత్రమే!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఓవైపు థామా.. విజయంతో ఆనందంగా ఉంది. మరోవైపు సినిమా ఆఫర్స్ వరుసగా వస్తున్నాయి. నేను ఎప్పుడూ మీకు కొత్తదనాన్ని, భిన్నమైనదాన్ని, ఉత్తేజకరమైనదాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను. మైసా అనేది అలాంటి కోవకు చెందిందే. ఇంతకు ముందు ఎప్పుడూ నేను ఇలాంటి సినిమా చేయలేదు. ఇలాంటి పాత్ర చేయలేదు. నేను ఎప్పుడూ అడుగుపెట్టని ప్రపంచంలోకి అడుగుపెట్టాను. ఇది భయంకరంగా ఉంది. ఇందులో నేను భయానకంగా.. చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఇది ప్రారంభం మాత్రమే అని తన ఎక్స్ ఖాతాలో రష్మిక మందన్న పోస్ట్ చేశారు.

కేరళ అడవుల్లో షూటింగ్!

డైరెక్టర్ రవీంద్ర పుల్లె.. పోస్ట్ చేసిన వీడియోలో ప్రశాంతమైన కేరళ అడవి, సుందమైన జలపాతాలు కనిపిస్తాయి. మొత్తం మీద రష్మిక ఒక డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపిస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు విడుదలైన ఒక పోస్టర్ చూస్తే.. రష్మిక ఒక ఆయుధాన్ని చేతపట్టుకుని.. కోపంతో కనిపిస్తున్నట్లు చూడవచ్చు. ఈ సినిమా అనుష్క శెట్టి అరుంధతి, భాగమతి వంటి సినిమాల మాదిరిగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.

యాక్షన్ సినిమాలంటే ఇష్టం!

మైస సినిమా కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా.. హిందీ, కన్నడ, తమిళం, మలయాళంలలో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. కాగా యాక్షన్ సినిమాలంటే తనకు ఇష్టమని రష్మిక మందన్న ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. బహుశా ఈ కారణంగానే మైసా సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

గిరిజన భూముల నేపథ్యం?

నటి రష్మిక మందన్న మైస విషయానికి వస్తే.. ఇది గిరిజన భూముల నేపథ్యంలో నడిచే ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇది యాక్షన్ సినిమా అయినప్పటికీ.. ఎక్కువ భావోద్వేగాలు కూడా ఉండనున్నట్లు డైరెక్టర్ రవీంద్ర పేర్కొన్నారు. మొత్తానికి రష్మిక మందన్న.. ఇప్పటివరకు కనిపించిన కొత్త పాత్రలో కనిపిస్తుందని మాత్రం స్పష్టం చేశారు. పోస్టర్ కూడా అదే చెబుతోంది. లవ్, రొమాన్స్ వంటి కథనాలతో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈమె.. హారర్ సినిమాల్లో (థామా) కూడా నటించింది. ఇప్పుడు యాక్షన్ సినిమాకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది.

రష్మిక మందన్న – ది గర్ల్‌ఫ్రెండ్

చలో సినిమాతో తెలుగు చలనచిత్ర సీమలో అడుగుపెట్టిన రష్మిక మందన్న.. ప్రస్తుతం అత్యధిక పారితోషికం (రెమ్యునరేషన్) తీసుకునే హీరోయిన్స్ జాబితాలో ఒకరుగా ఉన్నారు. థామా మంచి సక్సెస్ సాధించగా.. ఇప్పుడు ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాతో తెరమీదకు రానుంది. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇది కూడా మంచి సక్సెస్ సాదిస్తుందని పలువురు భావిస్తున్నారు.